వైయక్తిక సమయం|చేతన|వస్తుగత సమయం

చేతన అనేది, ఓ చీకటి గది లో పడిన టార్చ్ యొక్క వృత్తాకార పుంజం లాంటిది. అది రూం లో ఏ వస్తువుల పైన పడితే వాటిని  ప్రకాశవంతం చేసి కనిపించేటట్లు చేస్తుంది. ఆ పుంజం  బయట దాని చుట్టూ ఉండే వస్తువులు కూడా కొంచెం మసక వెలుతురు లో కనపడతాయి. ఉపచేతన టార్చ్ పుంజం చుట్టూ ఉందే ప్రదేశం (subconscious) లాంటిది.
ఓ మనిషి యొక్క మూర్తిమత్వాన్ని బట్టీ, బయటి ప్రపంచం నుంచీ ఆ మనిషిని ఆకర్షించే విషయాలని బట్టీ చేతన అనే టార్చ్ తన వెలుతురుని ఆయా విషయాల పై ప్రసరింపచేస్తుంది.ఒక మనిషి యొక్క భౌతిక, మానసిక అవసరాల ద్వారా అతని మూర్తిమత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మూర్తిమత్వం అనేది భూత కాలానికి సంబంధించిన అచ్చుగుద్దబదిన చిత్రాల(images), ఆలోచనల సమూహమే! ఓ మనిషి యొక్క మూర్తిమత్వం, చేతన (consciousness) ద్వారా ప్రపంచాన్నీ, మరియూ తననీ చూడగలుగుతుంది.
చేతన అనేది వర్తమానం తో బాటు పయనిస్తూ ఉంటుంది. చేతన బయటి ప్రపంచాన్ని స్పృశించే వ్యవధి ని వర్తమానం/ప్రస్తుతం అంటాం.ఆ వ్యవధి ముందు జరిగే సంఘటనలని గతం/భూతకాలం లో జరిగినవంటాం. ఆ వ్యవధి తరువాత జరిగే ఘటనలని భవిష్యత్తు లో జరిగినవంటాం.
(సెల్ఫ్ లేక మూర్తిమత్వం లేక) అహం లేకపోతే భూత భవిష్యత్ వర్తమానాలు లేవు. అహం జ్ఞాపకం లో దాచిన( రికార్డ్ చేయబడిన) ఆలోచనల ఆధారం గానే మనం గతాన్నీ, భవిష్యత్తునీ  అనుభవిస్తాం. అంతే మానసిక సమయం అనేది “అహం” లేక సెల్ఫ్ అనేదాని వలననే సృజించబడినది.

———————————————————————
మనిషి ఉనికి కి బయట భౌతిక సమయం కూడా ఉంది. మానవజాతీ , జీవజాలమూ లేకున్నా ఈ సమయం ఉంటుంది. దీనిని మనిషి యొక్క “సెల్ఫ్” తయారు చేయలేదు. ఇది విశ్వం మొదలైన దగ్గరినుంచీ జరిగిన అనేకానేక సంఘటనల గొలుసుకట్టు. లోకం లో ఉన్నవస్తువులన్నీ, మనిషి తో పాటు, ఈ భౌతిక సమయం అనే ప్రవాహం లో కొట్టుకొని పోయే ఓ పడవ లాంటి వారు. మనిషి తో పాటు మనిషి బుర్రలో ఉండే చేతన కూడా ఈ భౌతిక సమయం లో పడి కొట్టుకొనిపోతూఉంటుంది. భౌతిక సమయాన్ని మనం అధిగమిచలేము. భూమి లాంటి గ్రహం మీద భౌతిక సమయం సపేక్షం కాదు. భౌతిక సమయం ఎల్లప్పుడూ ఒకేదిశలో పయనిస్తుంది.ఓ మనిషి సమయం లో పయనించి రాముడి కాలానికి వెళ్ళ లేదు. ఎందుకంటే ఆ మనిషి ఈ రోజూ, రాముడి కాలం లోనూకూడ ఉండటం అసంభవం.

భౌతిక సమయం లో ముందూ, తరువాతా, వ్యవధీ, సీక్వెన్స్..ఇవన్నీ ఉంటాయి. మన బుధ్ధి లేక మన్సు యొక్క్స్ నిర్మానం భౌతిక సమయం లో ఉండే ఈ “ముందూ, తరువాతా, వ్యవధీ” అనబడే లక్షణాలని సెన్స్ చేసేందుకు వీలుగా ఉంటుంది. అంతే ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పినట్లు, మనసు కిసమయాన్ని సెన్స్ చేసే అంతర్గతమైన sensibility ఉంటుంది. అయితే, ఈ మానసిక సమయం బయట ఉండే భౌతిక సమయానికి ప్రాతినిధ్యం మాత్రమే వహిస్తుంది. అంటే, కాంట్ చెప్పినట్లు కాక,  భౌతిక సమయం లేకుండా మానసిక సమయం ఉండదు.

భౌతిక సమయం లో ముందూ, తరువాతా, వ్యవధీ, సీక్వెన్స్..ఇవన్నీ ఉంటాయి. మన బుధ్ధి లేక మన్సు యొక్క్స్ నిర్మానం భౌతిక సమయం లో ఉండే ఈ “ముందూ, తరువాతా, వ్యవధీ” అనబడే లక్షణాలని సెన్స్ చేసేందుకు వీలుగా ఉంటుంది. అంతే ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పినట్లు, మనసు కిసమయాన్ని సెన్స్ చేసే అంతర్గతమైన sensibility ఉంటుంది. అయితే, ఈ మానసిక సమయం బయట ఉండే భౌతిక సమయానికి ప్రాతినిధ్యం మాత్రమే వహిస్తుంది. అంటే, కాంట్ చెప్పినట్లు కాక,  భౌతిక సమయం లేకుండా మానసిక సమయం ఉండదు.

———————————————————————————–
మనిషి లేకపోతే ఈ సమయాం భూత భవిష్యత్ వర్తమానాలు గా ఉండదు. ఎందుకంటే మనిషి మనసే  సమయాన్ని భూత భవిష్యత్ వర్తమానాలు గా విడతీసింది. మనిషి మనసు యొక్క నిర్మానం వలననే ఈ త్రికాలాలు ఉనికి లో ఉన్నాయి. కాబట్టీ మనిషి లేకుండా కూడా ఉనికి లో ఉందే భౌతిక సమయానికి ఈ త్రి-కాలాలు వర్తించవు. అయితే,  మనిషిలేకున్నా కూడా, ఏ సంఘతన లైనా భౌతిక కాలం లో ముందూ, వెనుకా, వ్యవధీ ఉంటాయి. మనిషి చేతన ప్రపంచాన్ని స్పృశించే సంఘటనకు ఉన్న ముందూ, వెనుకలనే భూత భవిష్యత్తు లంటున్నాం. ఆ స్పృశించే వ్యవధినే వర్తమానం అంటున్నాం. మన మెదడు లో రికార్డ్ చేయబడిన భూతకాలం లోని జ్ఞాపకాల వలన మనకు త్రికాల భ్రమ కలుగుతున్నది. “మనిషి చేతన బయటి ప్రపంచాన్ని స్పృశించటం”, అనే సంఘటన జరుగక పోతే, ఆ సంఘటన కు ముందూ వెనుకలు కూడా ఉందవు. అంటే భూత, భవిష్యత్ వర్తమానాలు కూడా ఉందవు. అనగా.. ఆ త్రికాలాలు మనిషి సెల్ఫ్ యొక్క నిర్మాణం వలన ఏర్పడిన ఓ భ్రమ…కానీ భౌతిక కాలం మాత్రం మనిషి కి అతీతం గా ఉంది. ఈ భౌతిక కాలం లో భూత భవిష్యత్ వర్తమానాలు లేవు.