చెప్పేవి శ్రీరంగ నీతులూ..దూరేవి ..?

శ్రీకాంత్: ఏంటి రా శశీ ఏం చేస్తున్నావ్?నోట్లో ఆ సిగిరెట్టేంటి? అవతల పారెయ్…నాకు ఆ పొగ పడదని తెలుసు కదా?ఇలా అయితే నీ హెల్తూ ఫట్ మంటుంది.. ఇంతకీ ఏమిటి చదువుతున్నావ్?
శశికాంత్: కనపడటం లా..? వికి లో న్యూటన్ గురుత్వాకర్షణ సిధ్ధాంతం గురించి చూస్తున్నా. మ్మ్..ఇక స్టదీస్ మొదలెట్టాలి..ఎక్జాంస్ పదిరోజుల్లో పడ్డాయి కదా.
శ్రీ: ఆ(.. ఆ న్యూటన్ గాడి సిధ్ధాంతం గురించి చూసేదేమిటి? వాడొ నల్లమందు బానిస..మూడ నమ్మకాలను తలకెత్తుకొన్నాడు.
శశి: న్యూటన్ ఎలాంటి వాడైనా, గురుత్వాకర్షణ సిధ్ధాంతం తప్పుతుందా? అతని తరువాత అతని సిధ్ధాంతాల ఆధారం గా వచ్చిన అనేకానేక టెక్నాలజీలకు వచ్చిన నష్టమేమిటి? పైగా అతని సిధ్ధాంతం చదివితే నాకు రేపు ఎక్జాం లొ పదో పరకో మార్క్స్ రావచ్చు…..ఏదేమైనా..హమ్మయ్య ఫిజిక్స్ అయిపోయింది ఇక ఎకనామిక్స్ మొదలెట్టాలి…
శ్రీ: ఎకనామిక్స్ చదువు. కానీ, ఆ మార్క్స్ గాడు చెప్పింది మాత్రం చదవొద్దు. వాడో స్త్రీ లొలుడు..నల్లమందు వ్యసనపరుడు..ఒక్క ఫాక్టరీని కూడా చూడకుండా పుస్తకం రాసిపడేశాడు.
శశి: మార్క్స్ స్త్రీ లోలుడైతే, ఆయన ఆర్ధిక వ్యవస్థ గురించి విశ్లేషించినదంతా తప్పైపోతుందా? ఆయన తిన్న నల్ల మందు వలన, రాజకీయ వ్యవస్థ ఎలా రూపాంతరం చెంది భవిష్యత్తు లో ఎలాంటి వ్యవస్థ ఏర్పడుతుందో అని, ఆయన చేసిన భావన కు ఎమైనా తకరారు వచ్చిందా? ఆయన చేసిన పని ముఖ్యం గా మేధో శ్రమ. ఆయన విశ్లేషణ లో ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపించు. ఆయన ఏమి తాగితే నాకేమిటి? నాకు కావలసినది నాలుగు మార్కులు…ఇక వారాంతం లో తెలుగు చదవటం మొదలెట్టాలి..ఎవరూ తీసుకోని సబ్జెక్టు…
శ్రీ: నన్నయ నుంచీ కారా గారి దాకా ఎవరిగురించైనా చదువు కానీ..ఆ శ్రీ శ్రీ ని మాత్రం వదిలెయ్..వాడో ముండల ముఠాకోరు, తాగొబోతు..తను కాపిటలిస్టుల దగ్గ పని చేసి, జనాలకి సోషలిజం ఫాలో అవ్వమని చెప్పాడు..
శశి: నీకు చెప్పె చెప్పీ బోరు కొట్టింది రా! ఆయన ఎలాంటివాడైనా ఆయన ఓ కవి. ఆయన అలవాట్ల వలన ఆయన కవిత్వం లోని పస తగ్గిందా..? పైగా మన స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ లో ఆవేశం గా ఆయన కవితలు ఓ రెండు చెప్పామా..చప్పట్లే చప్పట్లు..
శ్రీ: ఇంకా ఆ దమ్ము లాగుతూనే ఉన్నావ్..ముందా సిగిరెట్ పారెయ్!
శశి: ముందు నువ్వు గుట్కా అలవాటు మానేయ్..అసలు నాకా స్మెల్లే పడదు!
శ్రీ: అదేంటి రా, ఇప్పుడు టాపిక్ నీ సిగరెట్ గురించి, నేనేమీ ఇప్పుడు గుట్కా నమలటం లేదుకదా.అయినా గుట్కా గురించి మాట్లాడుతున్నావంటె, నువ్వు సిగరెట్ తాగటం తప్పని నీ లోపల్లోపల అంగీకరించి, నాపై ఎదురుదాడికి దిగి, నా తప్పుని వేలెత్తి చూపించి, నన్ను నీతో సమాన స్థాయి లో నిలబెట్టి,తృప్తిపడదామని ప్రయత్నిస్తున్నావన్నమాట.అన్నమాటేముందీ..ఉన్నమాటే! సాయంత్రం  నే గుట్కా వేసుకొన్నపుడు చెప్పుదువుగాని..ప్రస్తుతం టాపిక్ నీ సిగరెట్.. సిగరెట్ తాగటం హానికరమా కాదా? ముందు ఇది తేల్చు.అది బయటికి విసిరేయ్!
శశి: కానీ నీ గుట్కా అలవాటు కీ నా సిగిరెట్ కీ విడతీయలేని సంబంధం ఉంది. రెండింటినీ విడివిడి గా చూడలేం. మనమిద్దరమూ ఈ రూం లోనే బతుకుతున్నాం. ఒకరి అలవాట్ల ప్రభావం ఇంకొకరి పై పడుతుంది. ఎదుటి వాడి దురలవాటుపై అసహనం చూపే ముందు నీ అలవాటు మానుకోవాలి.
శ్రీ: మరి ఇందాక శ్రీ శ్రీ తను క్యాపిటలిస్తుల దగ్గ పని చేసి, ఇతరులకి సోషలిజం ఫాలో అవ్వమని చెప్పాడంటే, నువ్వు “అది వాకే”, అన్నావ్?
శశి: నేనేమీ వాకే అనలేదు. అది చిన్నవిషయం. అతని కవిత్వం తో పోలిస్తే, అది చిన్న విషయం అన్నాను..
శ్రీ: నాకు కవిత్వం అనేది సెకండరీ..ముందు ఓ మనిషి నైతికత నాకు ముఖ్యం..ఓ మనిషి చెప్పిన మాట చేశాదా లేదా అనేది చాలా ముఖ్యం..అతను కాళిదాసైనా, కృష్ణుడైనా!
శశి: సర్లేవోయ్..పేద్ద చర్చ..లంచ్ టైమవుతోంది..హాస్టల్ మెస్సులకి సెలవు..సాపాటు ఎక్కడా..ఓ హండ్రెడ్ అప్పుకొట్టు.

ప్రకటనలు

7 thoughts on “చెప్పేవి శ్రీరంగ నీతులూ..దూరేవి ..?

 1. శ్రీ: మరి ఇందాక శ్రీ శ్రీ తను క్యాపిటలిస్తుల దగ్గ పని చేసి, ఇతరులకి సోషలిజం ఫాలో అవ్వమని చెప్పాడంటే, నువ్వు “అది వాకే”, అన్నావ్?

  శశి: శ్రీశ్రీ కేవలం చెప్పాడు కాబాట్టీ వాకే. నువ్వు అలా కాదు, చేసితీరాలని బలవంతం చేస్తున్నావు.

  శ్రీ: దానికి దీనికి తేడా ఏమిటో?

  శశి: చాలా వుంది. శ్రీశ్రీ మొత్తంగా శోషలిజమే ఫాలో అయినా కూడా నేను అతను చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తానే కాని అతను ఫాలో చేస్తున్నాడు కాబట్టి గుడ్డిగా చేయను. కాని నువ్వలా కాదు, సిగరెట్ తాగడం పై నా వ్యక్తిగత నిర్ణయాధికారాన్ని సవాలు చేస్తున్నావు.

  శశి: సిగరెట్ తాగడం తప్పైనపుడు నేను చేస్తున్న దానిలో తప్పేముంది?

  శ్రీ: నువ్వు “సిగరెట్ మానెయ్” అంటే నువు చెప్పేది వింటాను. దానిపై పుస్తకం రాస్తే చదువుతాను. మానడం మానక పోవడం నాఇష్టం. కాని రూం మేట్ గా నువ్వు నన్ను శాసించాలని చూస్తే మాత్రం అందుకు నీవైపునుండి సమానమైన ప్రతిస్పందనను ఆశిస్తాను.

  శశి: పోనీవోయ్! ఈ చర్చలు ఎప్పుడూ వుండేవే! అసలే డిన్నర్‌కి లేటవుతోంది. తర్వాత వెంకటసామి కిల్లీకొట్టు మూసేస్తే రాత్రికి గుట్కా దొరకదు!!

  మెచ్చుకోండి

  1. అసలు పోస్టు కంటే మీ కామెంటే ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళింది. 🙂

   ఈ మధ్య నెట్ లో ఈ విధమైన చర్చలు కూడా చూస్తున్నాను:
   ఒకడు: కాపిటల్ లొ ఏముండొయ్..దాన్లో ఉందంతా తప్పే..మార్క్స్-కేం తెలుసు?
   రెండోవాడు: నువ్వు కాపిటల్ చదివావా?
   ఒకడు: చదవలే! ఏమైనా కాపిటల్ లో ఉన్నది కృష్ణ భగవానుడు గీత లో చెప్పిన దాని కంటే గొప్పేమీ కాదు.
   రెండోవాడు: ఆ గీత లో ఎముంది. అంతా అసమానతలూ, మూఢనమ్మకాలూ. అయినా నువ్వు కాపిటల్ చదవకుండా దానిని ఎలా విమర్శిస్తావ్?
   ఒకడు: నువ్వు గీత చదవ లేదని నాకు తెలుసు. గీత చదవకుండా దానిని నువ్వు విమర్శించగా లేనిది, నేను కాపిటల్ ను విమర్శిస్తే తప్పేమిటి?
   రెండోవాడు: విమర్శించాలంటే చదవాలా ఏమిటి? ఆ మాతకొస్తే పొగడాలన్నా చదవనవసరం లేదు.
   ఒకడు: నాకు తెలుసులే నువ్వు కాపిటల్ కూడా చదవలేదని.
   రెండోవాడు: నాకూ తెలుసు, నువ్వు గీత ని కూడా చదవలేదని.
   మూడోవాడు: మీ ఇద్దరూ రెండిటినీ చదవకుండా వాదిస్తున్నారు. రెండిటినీ ఆమూలం చదివితేనే కానీ చర్చ మొదలుపెట్టకూడదు.
   ఒకడు,రెండోవాడు: మీరు రెండూ చదివారు కదా.. చర్చ మీరు మొదలెట్టండి.మీతో వాదించటానికి ఎవరైనా వస్తారేమో చూద్దాం. మేము ఈలోగా చదువుకొని తరువాత చేరతాం.
   మూడోవాడు: అవన్నీ చదివినాక చర్చ చేయాలనే ఆసక్తే పోయింది!

   ఈ ఇద్దరూ కూడా ఏదీ చదవకుండా తమ తమ pre-conceived notions, inclinations and biases ను సపోర్ట్ చేసుకోవటానికి గంటల కొద్దీ తమ తెలివినంతా వెచ్చించి వాదిస్తారు. ఇద్దరికీ గీతలో కొంచెం, కాపిటల్ కొంచెం తెలుస్తాయి..చాలావరకూ నెట్ ద్వారా మీడియా ద్వారా, ఇతరం గా. వీళ్ళ వాదనల వలన గీత గురించీ, కాపిటల్ గురించీ వారికి తెలిసిన కొన్ని నిజాలు నిగ్గుతెలుతాయి. కానీ తెలియనివి చాలా ఉంటాయి.
   అన్నీ తెలిసిన వాళ్ళు చర్చ కు రారు. చర్చ నిరుపయోగం అనుకొంటారు.
   మొత్తానికి ఈ చర్చలు భలే టైం పాస్.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s