నరేంద్ర మోడీ ని సపోర్ట్ చేయాలని…

నరేంద్ర మోడీ ని సపోర్ట్ చేయాలని నా బ్లాగు లో ఓ సంవత్సరం కిందట ఓ టపా రాసుకొన్నాను. “నే సపోర్ట్ చేయమన్నందుకే దేశం మొత్తం స్పందించి..ఆయనను ఎన్నుకొని ప్రధాన మంత్రిని చేసింది”,………….అని నేననటం లేదు.సపోర్ట్ చేయటానికి నే చెప్పిన కారణాలన్నిటి వలనా సపోర్ట్ చేసింది అని మాత్రం చెప్పగలను. అదే టపా లో మోడీ ని ఏ కారణాల వలన సపోర్ట్ చేయనవసరం లేదో కూడా చెప్పాను..ఆ యన “PM” అయినాక ఆ కారణాలన్నీ ఒక్కొక్కటీ నిజమవుతూ వస్తున్నాయి.
ఏమిటీ?.. “అన్నీ నా బ్లాగులోనే ఉన్నాయిష అంటున్నావు?” అనంటున్నారా?
అక్కడికే వస్తున్నా..మోడీ ప్రధాని అయిన తరువాత జరుగుతాయని నే భయపడిన వాటి లో చివరిది “విద్య కాషాయీకరణ”. అది ముందు గా జరుగుతోంది..సాంప్రదాయ శక్తులు..ముఖ్యం గా నార్త్ లో “అన్నీ మన వేదాల లోనే ఉన్నాయిష” నుంచీ, “అన్నీ వేదాల్లో మాత్రమే ఉన్నాయెహే!”, అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ళ కి, “లేవన్న వాడి నాలుక్కోస్తా!” అనే పరిస్థితి వస్తుందేమో తెలియదు.
మోడీ గారు, హిట్లర్ వంటి మూర్ఖుడు కాదు. ఆయన ప్రసంగం విన్నవారికెవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఆయనకు జనాలు ఇచ్చిన mandate ముఖ్యం గా ఆర్ధికపరమైనది.కాంగ్రెస్ తో జనాలు విసిగిపోవటం ఇంకో కారణం. కాబట్టీ “యుధ్ధాలూ, అల్లర్లూ”, వంటి నా మిగిలిన భయాలు నిజమవ్వకుండా ఉండాలని కోరుకొంటున్నాను. మోడీ గారికి ఆ విజ్ఞత ఉందని నా ప్రస్తుత అభిప్రాయం.ఆ అభిప్రాయం తప్పు కాకూడదని కోరుకొంటున్నా

ప్రకటనలు

5 thoughts on “నరేంద్ర మోడీ ని సపోర్ట్ చేయాలని…”

 1. మీరు రాసిన పోస్టులో నరేంద్ర మోడీకి వోటేయాలని చెప్పిన వారిలో నేనూ ఒకడిని 🙂
  అప్పుడు నేను మోడీకి వోటేయాలి అన్నది అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే. ఇప్పటివరకైతే మోడీ పని తీరుకూడా బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం వస్తున్న సమస్య కాషాయీకరణ. అన్నీ మన వేదాలలో ఉన్నాయిష అని అనుకోవడం కూడా నా దృష్టిలో తప్పు కదు. పర్సనలుగా వాల్లు అనుకుని, నిజంగానే అవి ఉన్నాయని సాక్షాధారాలతో నిరూపించమనండి. దానికి కావాలంటే నిధులిచ్చి, ప్రత్యేక వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశి, వేదాలలో ఉన్న వాటిమీద అధ్యయనం చేయమనండి. నాకే అభ్యంతరం లేదు. నిజానికి దాన్ని నేను స్వాగతిస్తాను. అలానే జరగాలని కోరుకుంటున్నాను కూడా. కానీ, సరైన ఆధారాలు లేకుండా మన పూర్వీకులు విమానాలు కూడా కనిపెట్టేశారు. ఫలానా సిద్దాంతం మనదే .. అని ఏవో నాలుగు రాతలను భట్టి కంక్లూజనుకు వచ్చేసి .. అవే పుస్తకాలలో రాస్తే మాత్రం అంగీకరించలేను. ఇంకో విషయం మన హిస్టరీ అంతా మార్క్సిస్టు చరిత్రకారుల చేతిలో బందీ అయిపోయింది. దాని విషయములో కూడా పూర్తి అధ్యయనం జరిపి (అంతర్జాతీయ చరిత్రకారులను కూడా పరిగణలోకి తీసుకుని) చరిత్రను చరిత్రలా నిర్మొహమాటంగా అందివ్వాలన్నది నా ఫీలింగ్. అది చారిత్రక అధారాలతో కూడినది అయ్యుండాలే కానీ, రాజకీయ ప్రేరేపితం అయ్యుండకూడదు అన్నది నా ఉద్దేశ్యం.

  మెచ్చుకోండి

 2. అతి కొద్ది మంది అన్నీ ఫలానా చోట ఉన్నాయిషా అనంగానే కొంతమంది (వీళ్ళూ కొద్దిమందే) ఊరికే ఉలికిపడుతున్నారు దేనికి! ఇక కాషాయీకరణ అనగానేమి నిర్వచించవలెను. అలాగే ప్రసుతం ఉన్న సిలబస్సుల్లోని విశేషాలు అన్నీ కూడా నిష్పాక్షపాతంగా రివ్యూ చేసి, వాటిని సిలబస్సుల్లో ఉంచటానికి కారణాలు ఏమిటి అని ఆలోచించాలి.

  1977 లో జనతా పార్టీలో జన సంఘ పార్టీ ఉన్నప్పుడు, అందరికంటే పెద్ద కాడరు, సభ్యత్వం ఉన్న ఆ పార్టీని దెబ్బ తీయటానికి ద్వంద్వ సభ్యత్వం అనే ఒక “బోగీ” లేవతీసారు. ఏమి ఉంటే ఏమిటిట. బయట ఒక పార్టీ పెట్టుకుని, పైగా అనేక ముక్కలు, మార్గదర్శనానికి వేరే దేశం వంక చూస్తూ ఉండే వాళ్ళను చూసి ఎందుకు చర్చలు జరగటం లేదు?. మన దేశీయ పార్టీల మీద “NOTA” మాత్రపు ఓట్లు కూడారాని పార్టీలు చేసే రాజకీయ దుష్ప్రచారానికి ప్రజలు లోనుకాకూడదు అని నా అభిప్రాయం. బి జి పే బిజెపి చేసే పని మనం సమర్ధించాల్సిన పనిలేదు, అలాగే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా గట్టిగా ఒక సంవత్సరం కాలేదు, ప్రతి అవక తవకకూ వాళ్ళే కారణం అని గోల గోలగా అరిచి గోల చేసినంత మాత్రాన వాళ్ళవాల్లె జరుగుతున్నాయని అనుకోవాలిసిన పనీ లేదు.

  ప్రజలు నిష్పక్షపాతంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

  మెచ్చుకోండి

 3. శ్రీకాత్ గారు, ప్రసాద్ గారు,
  నిజమే, “అన్నీ కాపిటల్ లో ఉన్నాయష”, అనేవాళ్ళు పులిమే ఎర్ర రంగు ని కూడా జాగ్రత్త గా గమనించాలి. ఈ టపా లో కొంత ఆ రంగు ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు.

  మెచ్చుకోండి

 4. “…చరిత్రను చరిత్రలా నిర్మొహమాటంగా అందివ్వాలన్నది నా ఫీలింగ్. అది చారిత్రక అధారాలతో కూడినది అయ్యుండాలే కానీ, రాజకీయ ప్రేరేపితం అయ్యుండకూడదు అన్నది నా ఉద్దేశ్యం….”

  లెస్స పలికితిరి శ్రీకాంత్ గారూ. మీరన్నట్టుగా ఇప్పటికే వ్రాసేసిన చరిత్ర సమీక్షించి అందులో ఉన్న తప్పులను సరిచెయ్యాలి. కాని ఆ సరిచేసే క్రమంలో మరొకపక్కకు వాలిపోయ్యే పరిస్తితి రాకూడదు. ఉంటే ఇటు లేకపోతే అటు అనుకునే కంటే నిస్పక్షపాతత కు మొగ్గుచూపాలిసిన అవసరం ఉన్నది.

  విచిత్రం ఏమంటే, మనకు స్వతంత్ర్యం వచ్చిన వెను వెంటనే అన్ని చోట్లకూ-యూనివర్సిటీలు, కాలేజీలు,పత్రికలూ, రచయితలుగానూ, హిస్టరీ కాంగ్రెస్సులూ, ఇంతెందుకు ప్రజలమీద ప్రభావం చూపగలిగే ఏ విధమైన ప్రక్రియలోనైనా సరే-కమ్యూనిస్టులు చేరిపోయి ప్రతిదీ ఎర్రద్దాల్లోంచి భారతీయులకు చూపే ప్రయత్నం చేశారు.అప్పుడు ఈ “అరుణీకరణ” అంటూ అల్లరి చెయ్యటానికి దేశంలో ఎవరూ లేకపోయ్యారు మరి. అసలు విషయం ఏమంటే, అటువంటి తీవ్ర “అరుణీకరణ” ప్రయత్నాలే విఫలమయ్యాయి, భారత దేశం భారతదేశంగానే మిగిలింది కానీ, ఫలానా దేశంతో కలిసి(నాశనమై) పోలేదు. కారణం ఏమిటి? ప్రజలకు ఉన్న విజ్ఞత. ఇక్కడ అక్షరాశ్యులు అనే మాటకు అర్ధం జస్ట్ వ్రాయటం చదవటం వచ్చినవాళ్ళు అని మాత్రమే కాదు. అక్షరాశ్యులు అంటే ఆలోచించగల అందరూనూ. ప్రజలు వాళ్ళకు ఎంత కావాలో, ఏది కావాలో అది హసలా తీసుకుని అక్కర్లేనిది వదిలెయ్యగల సమర్ధులు. కాకపోతే మనందరి కలెక్టివ్ రియాక్షన్ కు చాలా వ్యవధి తీసుకుంటుంది. కాని ఆ ప్రతిస్పందన చాలా నిశితంగానూ ఇక ఆవతలివాళ్ళు తేరుకోలెనంతగానూ ప్రజలు చూపిస్తూనే ఉంటారని నాకు నమ్మకం.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s