ఎర్ర పులుముడూ..కాషాయ పులుముడూ..

 మార్క్సిస్ట్ మేధావులు తమ సిధ్ధాంతాలకు లొంగని విషయాలను కూడా తమ దృష్టి తోనే చూస్తారు.అంటే విషయాలకు ఎర్ర రంగు పులుముతారు. దీనినే నేను “ఎర్ర పులుముడు” అంటాను. ఉదాహరణకి, మహమ్మద్ ఘజనీ దండయాత్రల గురించి వీరు, “అవి కేవలం రాజకీయమైన దంద యాత్రలే అంటారు”. దేవాలయాలు అప్పటి రాజుల అధికారానికి చిహ్నాలవటం వలన ఘజనీ వాటిని కూల్చాడట. అలా కూల్చటం లో మత కోణం లేదట. అలా అయితే ఘజనీ అప్పటి పర్షియా లోని అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. మరి అక్కడి మసీదులను ఎందుకు కూల్చలేదు? గుజరాత్-సింఢ్ ప్రాంతం లో కొన్ని లక్షలమందిని ఎందుకు బలవంతపు మార్పిడులు చేశాడు? పర్షియన్ చరిత్రకారులే “అతను హిందుస్తాన్ మీద జీహాద్ చేశాడని” ఎందుకు చెప్పారు? వీటికి సమాధానాలు ఎర్రపులుముడు వద్ద ఉన్నట్లు తోచదు.

ఇక మహమ్మద్ ఘౌరి అయితే ప్రుధ్వీరాజ్ తో జరిగిన రెండవ యుధ్ధం ముందు, “ప్రుధ్వీరాజ్ ఇస్లాం కి మారితే యుధ్ధం చేయకుండా వెనుతిరుగుతానని”, రాయబారం పంపిస్తాడు. మరి అలాంటి వాడు చేసిన యుధ్ధాన్ని మత యుధ్ధమనాలా? రాజకీయ యుధ్ధమనాలా? అలాంటి యుధ్ధం చేసినవాడిని, సెక్యులర్ పాలకుడనాలా?

————————————————————
ఇక కాషాయ పులుముడు సంగతి వద్దకు వద్దాం? మధ్య యుగాలనుంచీ హిందులువులు అనేక కారణాల వలన బయటి వారి చేతిలో పరాజయం పాలవుతూ వస్తున్నారు. ఇది కాదనలేని చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని నిరాకరించి బావుకొనేదేమీ ఉండదు. సత్యాన్ని అంగీకరించి అందులోని పాఠాలని ఇప్పటి ఇండియామొత్తానికి వర్తింపచేస్తే ఉపయోగపడతాయి..
పురుషోత్తముడు(పోరస్) అలెక్జాండర్ చేతిలో పరాజయం పొందిన తరువాత, అలెక్జాందర్, అతనిని తన సామంతుడి గా నియమించాడు. ఇద్ది సత్యం. కానీ కాషాయ పులుముడు దాసరి నారాయణ రావు సినిమాని మరపించే విధం గా ఉంటుంది…”అలెక్జాందర్ సేన యుధ్ధం లో ఓడిపోయే పరిస్థితి లో ఉంది. ఆ రాత్రి అలెక్జాండర్ భార్య పోరస్ దగ్గరకు వెళ్ళి, అతని మణి కట్టు కి రాఖీ కట్టింది. మరుసటి రోజు యుధ్ధం లో అలెక్జాండర్ పోరస్ కి పట్టుబడ్డాడు. పోరస్ కత్తి దూసి అలెక్జాందర్ ని చంపబోయాడు. అప్పుడు పోరస్ మణి కట్టుమీది  రాఖీ అతని కళ్ళబడింది. దానితో అతను అలెక్జాందర్ ని వదిలేశాడు. కానీ వెంటనే అలెక్జాందర్ సైనికులు వచ్చి పోరస్ ని బంధించారు. ఆ విధం గా పోరస్ గెలిచి కూడా ఓదిపోయాడు”…మంచి ఇగో మసాజ్ కధ.

ఇక  ప్రుధ్వీరాజ్ ని ఘౌరీ ఓడించటమనేది చరిత్ర.ఘౌరీ అక్కడే ప్రుధ్వీరాజ్ ని చంపించేశాడు. తరువాత ఘౌరీ ఆఫ్ఘన్ లో ఉన్న తన రాజధాని కీ పయనమయ్యాడు. దారిలో నే అతనిని ఓ ఇస్లామిక్ తెగ కు చెందిన శతృవులు సమ్హరించారు. ఇది చరిత్ర.
మరి కాషాయ పులుముడు? “ఘౌరీ ప్రుధ్వీరాజ్ ని తన జైలు లో బంధించాడు. ప్రుధ్వీ రాజ్ కి శబ్ధబేధి (కళ్ళు మూసుకొని బాణాలు వెయ్య గలిగే) అనే విద్య తెలుసు. ఘౌరీ కి ఈ విషయం తెలిసి ప్రుధ్వీ రాజ్ ని తన సభ లో ఆ విద్య ప్రదర్శించమన్నాడు. ప్రుధ్వీరాజ్, కొన్నిఫీట్లు చేయగానే, ఘౌరీ మెచ్చి, “శహభాష్ అని చప్పట్లు”, కొట్టాడు. వెంటనే ప్రుధ్వీరాజ్ తన బాణాన్ని ఘౌరీ పైకి వేసి, అతనిని చంపేశాడు”. ఇదండీ ఇంకో పులుముడు..రాఘవేంద్ర రావు సినిమా కధ.

ఎర్ర్రపులుముడైనా , కాషాయ పులుముడైనా దేశం వంటికి మంచిది కాదు. చరిత్రని, చరిత్ర కారులకీ, పురావస్తు శాస్త్రజ్ఞులకీ వదిలిపెడితే, వారు నిజాలని వెలికితీస్తారు. పులుముడు మాస్టర్లకి వదిలిపెడితే చివరికి మిగిలేది గుడ్డితనమే! మొన్నటిదాకా ఎర్ర పులుముడు ఉంది కదా, ఇప్పుడు కాషాయ పులుముడు పులుముతామంటే, మళ్ళీ కొన్నాళ్ళకి, వాళ్ళు “మొన్నటి దాకా కాషాయ పులుముడున్నది కదా! ఇప్పుడు ఎర్ర పులుముడు కి టైం!”, అంటారు. ఈ పులుముళ్ళ కి అంతుండదు. చివరికి జనాలు బలవుతారు.
కొంతమంది ఎర్రపులుముడు ఉన్నపుడు ఇలాంటి టపా ఎందుకు రాయలేదనే అనుమానం ఉందవచ్చు. ఎర్రపులుముడు నే పుట్టక ముందు మొదలయింది. గత పదేళ్ళ లోనూ మన అటెన్షన్ ని ఆకర్షించే సంఘటన ఏమీ  జరగలేదు. కొత్తగా జరుగుతున్నదని పులుముడు గురించి పత్రికలలో వస్తున్న సంఘటనల కి స్పందించటం వలన, ఈ టపా, టప టపా వేయాల్సి వచ్చింది.

ప్రకటనలు

2 thoughts on “ఎర్ర పులుముడూ..కాషాయ పులుముడూ..

 1. భారత దేశ చరిత్ర, ఇతర దేశస్తులు ఆయా భాషల్లో రాసిన దానికి అనువాదం తప్ప , మన వాళ్ళెవరు ఆలోచించి శ్రద్ధ పెట్టి రాయలేదు.

  రేడియో కనిపెట్టింది మార్కొని అని ప్రపంచాన్ని నమ్మించిన తర్వాత ఇప్పుడు పొరబాటు జరింగింది, జగదీష్ చంద్ర బోస్ మొదట కనిపెట్టాడు అని రాయల్ సొసైటీ ప్రకటిస్తే ఎంత మందికి తెలిసింది. ప్రస్తుతం మనం చదివిన, చదువుతున్న చరిత్ర అంతా తప్పుల తడక.

  దళితుడి చరిత్ర దళితుడే రాయాలి అంటే జై అంటున్నాం
  తెలంగాణా గురించి తెలంగాణా వాడే ఆలోచించాలి అంటే జై అంటున్నాం
  ఆదివాసుల గురించి ఆదివాసుల హక్కుల గురించి సో కాల్డ్ మేధావులు మాట్లాడుతున్నారు

  ఝాన్సీ లక్ష్మి, యుద్ధం చేయలేదు, నేపాల్ పారిపోయింది, దళిత స్త్రీ ఆమె బదులు యుద్ధం చేసింది అని మాయావతి చెప్పి ప్రచారం చేస్తే నిజమో కాదో జర్నలిస్ట్స్ సోధించలేదు.

  నెహ్రు తాత, గంగాధర్ నెహ్రు కాదు ఒక ముస్లిం అని ఇంటర్నెట్ లో సమాచారం ఆధారాలతో దొరుకుతుంటే నిజమో కాదో జర్నలిస్ట్స్ సోధించలేదు.

  కుతుబ్ మినార్, హిందూ దేవత విగ్రహాలు పాడుచేసి కట్టించారు అని ఇంటర్నెట్ లో సమాచారం ఆధారాలతో దొరుకుతుంటే నిజమో కాదో జర్నలిస్ట్స్ సోధించలేదు. అయోధ్య విషయ సేకరణ మధ్యలోనే కోర్ట్ జోక్యంతో ఆగిపోయింది.

  మన దేశ చరిత్ర గురించి, సత్యాసత్యాల గురించి మాట్లాడకూడదు, చర్చించ కూడదు.
  పాత విషయాలు తవ్వితే లా అండ్ ఆర్డర్ గొడవలు వస్తాయని, ఊహించి నోరు మూసుకుంటారు.

  మన, మనది అనే చరిత్రను రాయడానికి, రాయించడానికి , మేధావులు ప్రయత్నిస్తే బాగుంటుంది

  యమ్కె శర్మ

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s