నా తమిళ పరిజ్ఞానం..

కొన్నేళ్ళ క్రితం నేనూ, నా తమిళ ఫ్రెండూ, మదరాసు మానగరం దగ్గర్లో ఉన్న ఓ ధాబా కి వెళ్ళాం..
ధాబా లో ఉండే కుర్రాడిని, “తినటానికేమున్నాయని అడిగాడు”, నా ఫ్రెండ్. దానికి వాడు, “సప్పాదీ”  మాత్రమే ఉన్నదని చెప్పాడు.
నా కు మొదట ఈ సప్పాదీ ఏమిటో అర్ధం కాలేదు, “కొళంబు”, “కూట్టు” ల ఇది కూడా ఏదో తమిళ వంటకం అనుకొన్నా.
ఆ తరువాత కొన్నేళ్ళు తమిళ నాడు లో ఉండవలసి రావటం వలన, కొంజెం, కొంజెం  తమిళం నేర్చుకోవలసి వచ్చినది.
నా పరిజ్ఞానం1:తమిళం లో 18 అక్షరాలు మాత్రమే ఉంటాయి. సరళాలకీ, పరుషాలకీ ఒకటే అక్షరం. అలానే పొల్లులు ఉండవు. అంటె క, ఖ, గ, ఘ వీటన్నిటినీ ఒకే అక్షరం తో రాస్తారు. కాబట్టీ కంప అనేమాటనీ గంప అనే మాటనీ ఒకే విధం గా పలుకుతారు. చాలా సార్లు పరుషాలకీ సరళాలకీ మధ్యస్తం గా పలుకుతారు. సందోషం (what is that some dOsham?) అని పలుకుతుంది.

ప 2. తమిళ నాడు లో యుగాల నుంచీ స్థిరపడిన తెలుగు వాళ్ళు ఏ సంకోచమూ లేకుండా తమిళాన్ని “అరవం”, అనే అంటారు. ఇది అ-“రవం” అనె అర్ధం (not so nice-sounding)? తెలియదు. నల్ల గా నిగ నిగ లాడుతున్న అమ్మాయి కి మా ఫ్రెండ్ ఒకడు పెట్టిన ముద్దు పేరు “అరివి కొరివి”. తమిళ దేవతల లో(లేక రాక్షసులా..ఎందుకంటే వీళ్ళకి కోరలుంటాయి..విగ్రహాలలో..) ఒకతను అరవన్..దీని వలన కూడా అరవం అనే మాట వచ్చిందా..?

ప 3: తమిళం నిండా  వత్తులే! విలన్ అని తమిళం లో రాయాలనుకొంటే, “విల్లన్” అని రాస్తారు. సిటిజన్ అని రాయటానికి చిట్టిసన్ అని రాస్తారు.

ప 4: ర అనే అక్షరం తో పేరు మొదలు కాదు.ముందు “ఇ” పెట్టాలి. రామన్ అనే పదాన్ని ఇరామన్ అనీ, రావణన్ అనే పదాన్ని, ఇరావణన్ అనీ రాస్తారు.

ప 5: షార్ప్ వత్తులు ఉందవు. ఉదా: చంద్రన్ అనే పదాన్ని చందిరన్, అనీ సూర్యన్ అనే పదాన్ని సూరియన్ అనీ రాస్తారు.Excersice: 1 mark జయసంతిరన్, రవీంతిరన్ అంటే ఏమిటో  చెప్పండి?

ప 6: “స” కి “చ” కి తేడా ఉందదు. కొందరు “సరి” అంటే ఇంకొందరు “చరి” అంటారు. ఒకడు సొల్లు, అంతే ఇంకొకడు చొల్లు అంటాడు. “చ” కి జ కి కూడా తేడా తక్కువ.

ప 7: అనునాసికాలు ఎక్కువ. గంగ అనే పదాని క-జ్ఞ్-క  అని రాస్తారు. కోడంబాకం = కో-ట-మ్మ్-పా-క్-క-మ్మ్.    

 ప 8:  తమిళం లో మనం వదిలెసిన అనేక నాలుక తిరగని అక్షరాలు-ఉన్నాయి.

ప 9: ‘సగం ఆ ఉంటుంది. మనం ‘ఊ, లేక ‘ఆ వాదే చోట వీళ్ళు ఈ సగం అ ని వాడతారు.

ప 10: ఒకప్పుడు తెలుగు లో కూడా 24 అక్షరాలే ఉండేవి. పొల్లులు ఉండేవి కావు(అందుకేనేమో,  సినీ యాక్టర్ నాగార్జున నుంచీ, గ్రామీణుల వరకూ మనలో చాలా మందికి వత్తు భ, వత్తు ఖ, వత్తు ఛ పలకటం రాదు). . మనం చాలా వరకూ సంస్కృతం నుంచీ అరువు తెచ్చుకొని 58 అక్షరాలకు చేరుకొన్నాం. 

ప 11: అక్షరాలెన్ని ఉన్నాయన్నది కాదు అన్నాయ్, భాషని ఎంత గా ప్రేమిస్తున్నామన్నది ముఖ్యం.అనేక రంగాలలో భాషని ఎలావినియోగిస్తున్నామన్నది ముఖ్యం. ఓ జాతి గా మనం సాధించిన అభివృధ్ధి, అధికారం భాష విస్తరణ లో కూడా తోడ్పడతాయి. అందుకే 27 అక్షరాలున్న అంగిలితో మాత్రమే మాట్లాడగలిగిన ఆంగ్లభాష రాజ్యం చేస్తోంది. 18 అక్షరాల తమిళం మనకంటే మైళ్ళ ముందుంది. 
ఇక ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది, “సప్పాదీ” అంటే “చపాతీ” అని.  

మా మలయాళీ సార్ ఒకరు పెట్రోల్ బంకు కి “ఓయిళ్ళు” కోసం వెళ్ళారండీ..ఆ ముచ్చట తరువాత.. 

 

 

 

ప్రకటనలు

One thought on “నా తమిళ పరిజ్ఞానం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s