ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?

కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే దాని మూలాల లోకి పోవాలి. కాబట్టీ కొంచెం ఓపిక పట్టండి..
మనిషి ప్రాచీన కాలం లో జంతువులాగానే జీవించే వాడు. మందలు మందలు గా ఉండే జంతువుల లా నే మనుషులు కూడా గుంపులు గుంపులు గా జీవించే వారు.మనిషి కోతి జాతినుంచీ పరిణామం చెందాడనేది జీవ పరిణామ సిధ్ధాంతం ప్రకారం తెలిసిన విషయం. జంతువు ల లో స్త్రీ పురుష సంబంధాలు many to many గా ఉండేవి. ఒక ఆడ జంతువు అనేక మగ జంతువు ల తో మైధునం జరిపేది. అలానే ఒక మగ జంతువు అనేక ఆడ జంతువుల తో! వాటికి వావి వరుసలు ఉండేవి కాదు. క్షీరదాలన్నీ తమకు పుట్టిన జంతువులతో మైధునం జరుపుతాయి. అలానే ఒకే జంతువు కి పుట్టిన ఆడ మగా జంతువుల మధ్య కూడా మైధునం జరిగేది. మైధునం విషయం లో ఆడ మగా మధ్య ఒక తేడా ఉండేది. ఆడ జంతువు కొన్ని కాలాల లో మాత్రమే పరిమితమైన మగ జంతువుల తో మైధునం జరిపేది. దానికి అండం విడుదల ఆ కాలం లో మాత్రమే జరిగేది. కాబట్టీ, అది తన అండాన్ని, మగ జంతువులలో తనకోసం పోటీ పడి గెలిచిన జంతువు కి సమర్పించుకోవలసి వచ్చేది. అంటే మగ జంతువులలో powerful జంతువు మాత్రమే మైధునానికి అర్హత పొందేది. ఈ ప్రవర్తన క్రమం గా జన్యువులలో నిక్షిప్తమై rule of attraction గా తయారయింది. మనుషులలో కూడా ఆడవారు హోదా డబ్బూ ఉన్న వారిని ఇష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం!
మనిషి homosepian గా మారే దశ లో రెండు ముఖ్యమైన జన్యు మార్పులు జరిగాయి. ఒకటి మనిషిలో selfish gene ఏర్పడటం. దీని వలన మనిషికి “ఆలోచనలూ, జ్ఞాపకమూ, అంతరాత్మ ” ల తో కూడిన ఒక centre ఏర్పడింది. ఈ centre నే నేను లేక అహం అన్నారు. రెండవ జన్యు మార్పు “మనిషి లో ఇతర మనుషుల తో భావోద్వేగ సంబంధాలను పటిష్టపరిచే భావోద్వేగ సున్నితత్వం” ఏర్పడటం.

ఈ రెండు మార్పుల వలనా మానవ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక జంతువు తనకు పుట్టిన పిల్ల జంతువు ని maternal instinct తో సాకుతుంది. కానీ ఆ పిల్ల జంతువు పెద్దదైన తరువాత, దాని తల్లికీ , దానికీ ఏ విధమైన మాతృత్వ సంబంధమూ ఉండదు. ఆ రెండూ మైధునం కూడా చేస్తాయి.  జంతువు ల లో మాతృత్వం అనేది ఎక్కువ గా instinct గానూ, తక్కువ గా భావోద్వేగపరం గానూ ఉంటుంది. పై పెచ్చు వాటి లో జ్ఞాపకమూ, ఆలోచన, చేతనా, అంతరత్మా లేక నేను అనేవి ఉండవు. కాబట్టీ పిల్ల జంతువు పెద్దది అయినపుడు దానిలో దాని తల్లి జంతువు కి వేరొక, “వయసు లో ఉన్న జంతువే” కనపడుతుంది కానీ, తన మాతృత్వపు భావోద్వేగపరమైన బిడ్డ కనిపించదు.(అయితే కొన్ని ఆడ జంతువులు సమూహం లో పుట్టిన మగ జనంతువులను దూరం గా తరిమేస్తాయట. ఈ విధం గా ఇన్సెస్ట్ అనేది జరగదు. ఆయా జంతు జాతులలో ఇన్సెస్ట్ జరగకపోవటం వలన జన్యుపరం గా దృఢమైన వారసత్వం సంక్రమిస్తుంది (ఇన్సెస్ట్ వలన ఎందుకు వీక్ అవుతాయనే ప్రశ్నకు జెనెటిక్స్ క్లియర్ గా సమాధానం చెబుతుంది..suppressed allelle..dominant allelle etc) . వాటి సర్వైవల్ బాగుంటుంది. ఆవిధం గా వావి వరుసల అంకురార్పన evolutionary behavior ద్వారా జరిగింది. )
కానీ మనిషి లో బిడ్డను పెంచిన చిన్నప్పటి తీవ్రమైన మాతృత్వపు భావోద్వేగాలు జ్ఞాపకం లో భాగమౌతాయి. తద్వారా మనిషి యొక్క “నేను” లోనూ, మనిషి వ్యక్తిత్వం లోనూ భాగమౌతాయి. మనిషి ఈ భావోద్వేగాలనుండీ బయటపడి తన బిడ్డను, వేరొక వయసొచ్చిన మనిషి గా చూడలేదు. దీని వలన మనిషి తన వారసులనూ, బిడ్డలనూ పెద్దయిన తరువాత కూడా బిడ్డలు గా పెంచటం నేర్చుకొన్నాడు.
గుంపులు గా కలిసి ఉన్న మనుషులలో ఈ విధం గా వారసులను పెంచటం మొదలవ్వటమే కాక వారిని తమ ఉనికికీ, తమ జాతికీ extensions గా గుర్తించటం మొదలయింది. ఇదే సమయం లో స్త్రీల రుతు చక్రం దాని seasonality ని కోల్పోయి periodic గా మారింది. దీని వలన స్త్రీలకి జంతువు ల లో కంటే మగవారి తో సంబంధాల విషయం లో degree of freedom పెరిగింది.

బిడ్డల విషయం లో జంతువుల నుంచీ మనిషి వరకూ జరిగిన పరిణామమే, ఒకేతల్లి బిడ్డల విషయం లోనూ జరిగింది. ఈ విధం గా పెద్ద వారికీ బిడ్డలకీ, ఒకే తల్లి బిడ్డలకీ మధ్య దాంపత్య సంబంధాలు నిషిధ్ధమయ్యాయి. “జన్యుపరం గా ఒకే రక్తం లో సంబంధాలు నాసి రకమైన పిల్లలను కలిగించటం వలనకూడా ఈ దాంపత్య సంబంధాలను వివిధ సంస్కృతులు నిషేధించాయి”, అనే వాదన ఒకటి ఉంది.  కానీ సంస్కృతులు “జన్యు పరం గా నష్ట దాయక మైన మేనరికం”, మొదలైన సంబంధాలను ఆమోదించాయి. కాబట్టీ ప్రాచీన సంస్కృతికి, “ఈ నష్టాలను దృష్టి లోఉంచుకొని, ఆయా సంబంధాలను నిషేధించే విజ్ఞానం ఉంది” అనిపించదు.
మొదట ఒక్కో ఆడదీ అనేక మగవారికి బిడ్డలను కనేది. మగవారు తమ బిడ్డలు ఎవరో కూడా పట్టించుకొనే స్థితి ఉండేది కాదు. అమ్మ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ బిడ్డలను సాకేవాడు. ఎందుకంటే ఒక ఆడ దానికి అనేక మగవాళ్ళు బిడ్డలను కనే వారు. అదే మగవాళ్ళు మిగిలిన ఆడవారికి కూడా బిడ్డలను కనే వారు. అందుకే anthropology ప్రకారం “మేన మామ” అనేది నాన్న అనే దానికన్నా పురాతన మైన సంబంధం.
మనుషుల అంతశ్చేతన ఏర్పడి “తన” అన్న భావన కలగటం మొదలుపెట్టిన తరువాత, మనిషి “తన” పిల్లలను కూడా గుర్తించటం మొదలు పెట్టాడు. అయితే ఒక్కోసారి తన పిల్లలను కూడా  గుర్తు పట్టటం కష్టం కావచ్చు. పిల్లల పోలికలన్నీ తల్లివే అయి ఉండవచ్చు. దీని వలన వేరే మగ వాడి పిల్లలను కూడా తన పిల్లలే అనే భ్రమ లో ఉండవచ్చు. పైగా తన పిల్లలను మిగిలిన పిల్లలతో కలిపి ఆదది పెంచటం వలన వారి మనుగడ కి నష్టం ఉండవచ్చు. వీటన్నిటి దృష్ట్యా మగవాడు ఆడ దానితో కలిసి కుటుంబం అనే ఒక వ్యవస్థ ని ప్రారంభించాడు.

ఆడ వారు ప్రకృతి స్వభావ రీత్యా తమ అండాన్ని ఒక short listed mate తోనే పంచుకోవాలి. కాబట్టీ ఆడవారు ఒకే సమయం లో అనేక సంబంధాలు కలిగి ఉండే వారు కాదు. కానీ మగవాడికి ఉన్న అపరిమితమైన వీర్య కణాల దృష్ట్యా అతను కుటుంబం లోనే ఉంటూ అనేక ఆడ వారి తో సంబంధాలు కలిగి ఉండేవాడు.
సమాజం లోని అధికార సంబంధాలకు (power equations) అతీతం గా ఇది జరిగేది. కాలమాన పరిస్థితులని బట్టి మానవ సమాజాల్లో ‘మాతృస్వామ్యం’ లేదా ‘పితృ స్వామ్యం’ ఉంటూ ఉండేది. సాధారణం గా యుధ్ధాలు లేని స్థిరమైన సమాజాలలో మగవాడి అవసరం అంతగా ఉండేది కాదు. అలాంటి సమాజాలలో,  పిల్లలను కనటానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా మాతృస్వామ్యం అమలు లో ఉండేది. యుధ్ధాలు ఉండే అస్థిర సమాజం లో మగ వారి దేహ దార్ఢ్యానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా, ఆడు వారికి ఉండే రుతు చక్రం, గర్భదారణలనే పరిమితుల దృష్ట్యా పితృస్వామ్యం అమలులో ఉండేది.
వ్యవస్థ మాతృస్వామ్యమైనా, పితృస్వామ్యమైనా మగవారు ఒకే సమయం లో అనేక ఆడ వాళ్ళ తో సంబంధాలు కలిగిఉండే వారు.ఆడవారు ఒకే సమయం లో ఒకే సంబంధం కలిగి ఉండే వారు. ఇది ఆడ మగా ప్రకృతులలోని వైరుధ్యం వలన జరిగేది. ఒకప్పటి కేరళ వంటి మాతృస్వామ్య సమాజం లో కూడా మగ వారు బహు భార్యత్వం కలిగి ఉండేవారు.

పాతకాలం లో ఆడవారిలో మైధున ప్రక్రియ కీ గర్భధారణకీ విడదీయ రాని సంబంధం ఉండేది. ఇక ఆధునిక కాలానికి వస్తే contraceptives వలన మైధునానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెగిపోయింది. దీని వలన ఆడ వారు sensual pleasure ని కొత్త కోణం నుంచీ కొత్త attitude తో చూసే అవకాశం మొదలయింది. పాత కాలం నుంచీ ఆడవారి లో సెక్స్ కీ భావోద్వేగ అవసరాలకూ ఉన్న లంకె క్రమం గా తెగిపోతోంది. ఆధునిక ఉద్యోగాలలో ఆడవారు కూడా మగవారికి ధీటుగా మనగలగటం వలన, ఆడ వారికి ఉండే  dependency లాంటి లక్షణాలు తగ్గి, తద్వారా కూడా సెక్స్ కీ భావోద్వేగానికీ ఉన్న లింక్ నెమ్మదిగా బలహీన పడుతోంది. మనం పాశ్చాత్య దేశాలలో ఈ trend ని బాగా చూడ వచ్చు. మన దేశం లో కూడా ఈ trend అనతి కాలం లోనే వస్తుంది.అయితే  మగా ఆడా నైజాలలో ఉన్న జన్యుపరమైన తేడాలు మాత్రం మార లేదు. ఉదాహరణ కి మగవారి సెక్సువాలిటీ ఎక్కువ గా దృశ్య సంబంధమైనది. ఆడ వారి సెక్సువాలిటీ దృశ్యసంబంధమైనది గా ఇంకా మారలేదు. అలా మారాలంటే, ఆడవారి లో యాదృచ్చిక జన్యు మార్పులు జరగాలి.

సెక్స్ డ్రైవ్ లో ఆడ వారికీ మగ వారికీ తేడాలు ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం టెస్టోస్తిరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ లూ, తద్వారా బ్రెయిన్ కెమికల్స్ లో వచ్చే మార్పులూ. ఈ రెండు కారణాలే ఆడ వారిలో ఎక్కువ భావోద్వేగానికి కారణమౌతాయి.

ఇక మన చట్టాల విషయానికి వస్తే, భారత దేశం లో, సమతూకం ఉన్న, అన్ని  nuances  నీ పరిగణన లోకి తీసుకొని చేసే, చట్టాలు చాలా తక్కువ. దుర్వినియోగ పరచటానికి అవకాశం ఉన్న చట్టాలు ఎక్కువ.  మన బండ చట్టాల వలన స్త్రీలకి రిజర్వేషన్ లతో పాటు, నిరంకుశమైన చట్టాల అండ దొరుకుతోంది. గృహ హింస లాంటి చట్టాల వలన భార్య తో సఖ్యత లేని మగాడు బిక్కు బిక్కు మంటూ బతక వలసిన పరిస్థితి
రాబోయే రోజులలో స్త్రీ లు కేంద్రం గా ఒక ఆధిపత్య వర్గం ఏర్పడబోతోంది. ఇక ఆఫీసులలో sexual harrasment rules గురించి చెప్పనవసరం లేదు.
మన న్యాయ వ్యవస్థ ఆడది వివాహేతర సంబంధం కలిగి ఉంటే, దాని బాధ్యత ను మగవాడి సమర్ధత మీదకి తోస్తుంది. అదే మగ వాడు వివాహేతర సంబంధం కలిగి ఉంటే విడాకులివ్వ వచ్చునంటుంది!
ఒకప్పుడూ ధైర్యమూ, సాహసమూ ఆభరణాలు గా కల మగవాడు, ఇప్పుడు ఇంటికీ, నౌకరీకీ పరిమితమవ్వాల్సి వస్తోంది. అనేక సంబంధాలు కలిగి ఉండటం అనేది మగాడి ప్రకృతి సిధ్ధమైన లక్షణం. కుటుంబ వ్యవస్థ ఆ లక్షణాన్ని అణగదొక్కి మగ వాడిని కుడేలయ్యేటట్లు చేసింది. నేటి కుటుంబ వ్యవస్థ లోని ఏక పత్నీత్వం లాంటి రూల్స్ పూర్తిగా ఆడవారి స్వభావానికి అనుకూలమైనవే! అదేమంటే “ఆడ వారూ వేరే మగ వాళ్ళ తొ తిరిగితే?” అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ ప్రశ్న రావటానికి మూల కారణం ఆడా మగా సమానత్వం అన్న ఊహ. ఆడ వారి నైజమూ మగవారి నైజమూ ఒకటి కావు. కాబట్టీ ప్రవర్తన లో ఇద్దరి మధ్య సమానత్వాన్ని ఆశించకూడదు. ప్లేటొ చెప్పినట్లు,” సహజం గా సమానత్వం లేని చోట దానిని రుద్దటమే అన్నిటికన్న పెద్దదైన అసమానత్వం”. అయితే, దీని అర్ధం “సమాజం ఆడా మగా ఇద్దరికీ సమానమైన గౌరవం ఇవ్వకూడదని కాదు”.సెక్స్ పట్ల మారుతున్న స్త్రీల attitude కి అనుగునం గా వారు కూడా భావోద్వేగ ఝంజాటం లేని అనేక సంబంధాలను (no strings attached relations) కోరుకోవచ్చు. అడ్డు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదు.

ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి fail అవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు (ఈ వావి వరుసలు ప్రకృతి పరం గా ఎలా ఏర్పడ్డాయో ఈ వ్యాసం లో ముందు చర్చించాం) కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని తీసుకొంటే master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

ఒక పెళ్ళాం, ఒకరో ఇద్దరో పిల్లలూ. సంసారం లోని ఆనందం తగ్గినతరువాత కూడా మగవారు అందులోనే కునారిల్ల వలసి రావటం వలన కుటుంబాలు నిరాసక్తం గా నిస్సారం గా తయారయ్యాయి. ఈ కుటుంబ వ్యవస్థ మగ వారి సహజ స్వభావాని కి విరుధ్ధమైన అనేక డిమాంద్స్ ని చేస్తోందీనాడు. ఇంటిపనీ, బయటి పనీ అన్నీ మగవాడే చూసుకోవలసిన పరిస్థితి! అన్ని పనులూ చేసినా ఇంట్లో గౌరవం లేని దుస్థితి. “నేనూ ఉద్యోగాలు చేసి సాధించగలను”, అనే ఆడవాళ్ళ ego కి మగవాళ్ళు బలికావలసి వస్తోంది. ఆడవాళ్ళ మధ్య ఉద్యోగాల విషయం లో ఉండే peer pressure కి మగ వాళ్ళు మూల్యం చెల్లించాలి! పిల్లలను తాత, బామ్మల దగ్గర వదిలేయటం, creche ల లో పారేయటం వంటి మాతృత్వ స్వభావ విరుధ్ధమైన అనేక పనులను ఈ రోజు ఆడవారు చేస్తున్నారు! పైగా కుటుంబ జీవితానికీ, ఉద్యోగానికీ తెగ న్యాయం చేస్తూ రెండింటినీ తెగ balance చేస్తున్నామంటూ ఫోజులు!
కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మగవాడే సర్దుకుపోవలసి వస్తోంది.
పాశ్చాత్య దేశాలలో లా అనేక విడాకులూ అనేక పెళ్ళిల్లూ (ఏక కాలం లో కాదు) చేసుకొనటం వలన సమస్య పెద్దవాళ్ళ స్థాయి లో తగ్గవచ్చేమో కానీ, పిల్లలు అన్యాయమైపోతారు. ఒకే కుటుంబం లో ఉంటూనే భార్యా భర్తా ఎవరి సంబంధాలు వారు వెతుక్కోవటం ఉంది. కానీ దీనిలోనూ అనేక భావోద్వేగ పరమైన సమస్యలూ, అసూయా ద్వేషాలూ ఉన్నాయని పడమటి దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. కుటుంబమే లేక పోతే పిల్లల మనుగడా, తద్వారా మానవ జాతి మనుగడా ప్రశ్నార్ధకం.అలా అని,( మనిషికి పెరిగిన నాగరికతా, ఆలోచనల దృష్ట్యా,) కుటుంబాలు లేని ఆది మానవుల స్థితికి వెనక్కి వెళ్ళటమూ అసంభవమే!
పెళ్ళి చేసుకోని వ్యక్తుల జీవితాలలోని ఒంటరి తనం తెలిసిందే!

ఏదేమైనా రాబోయే తరాలలో ని మగ వారికి నేనిచ్చే సలహా పెళ్ళి చేసుకోవద్దనే. దానికంటే చాలా స్వేచ్చకలిగి ఉండి, అడపా దడపా ఉండే ఒంటరి తనాన్ని మేనేజ్ చేయటం చాల ఈజీ! వారసులు లేరనే బెంగ మాటంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి పోతోంది! పెట్టుబడి దారీ వ్యవస్థ మరణ శయ్య మీద ఉన్నా, ఆ వ్యవస్థ కి ప్రత్యామ్నాయం కనుచూపు మేర లో కనపడటం లేదు.అంటే ఈ వ్యవస్థ ఖర్చులను ఇలానే పెంచుతూ పోతుంది. ప్రపంచం లో పర్యావరణం దెబ్బ తింటోంది. అంటే, కొన్నేళ్ళ తరువాత గ్రీన్ టాక్సుల వడ్డన మొదలౌతుంది. మన ఇండియాలాంటి దేశాలలో ఉన్న బండ చట్టాల వలన ఆడ మహారాజులూ, ఆడ ఆధిపత్య వర్గాలూ ఏర్పడతాయి.  రా బోయే తరాల మధ్యతరగతి వారు పిల్లలని కని, తద్వారా వారిని సరిగా పోషించలేని దిగువ తరగతులలోకి దిగజారే అవకాశాలు స్పష్టం గా కనపడుతున్నాయి.  అలాంటి దుస్థితి కి పిల్లలని గురి చేసే కంటే,  పెళ్ళి చేసుకొనక పోవటమే మంచిది.ఇలాంటి పరిస్థితి పడమటి దేశాలలోఆల్రెడీ ఉంది. నాకు తెలిసిన ఒక తెల్లామె ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఉన్న కమిట్మెంట్ ఫోబియా గురించి తెగ వాపోతుంది! కమిట్ కాక పోతే మగాడు అనేక అందాలను ఆస్వాదించే తన సహజ గుణాన్ని వదులుకోవలసిన అవసరం ఉండదు.ఇక ముసలి వాళ్ళమైనాక ఎలా అంటారా? come on! మన తరమే పెద్ద వాళ్ళను నానా ఇబ్బందులూ పెడుతోంది. ఇక మన పిల్లల తరం మనని చూస్తుందా?(అందుట్లోనూ మనతో creche ల లో పెట్టించుకొని మన నిరాదరణ కు గురైన తరం). సోలో గా ఉంటే కాసిన్ని డబ్బులు మిగుల్చుకొని, వయసైనాక ఆ డబ్బులతో హాయిగా ఏ వృధ్ధాశ్రమం లోనో చేర వచ్చు. అందుకే,”సోలో బతుకే సో బెటరూ!”

ప్రకటనలు

98 thoughts on “ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?

 1. *మీరు ఎక్కడికో………… వెళ్ళిపోయారు.*

  ఇతనికి ప్రపంచం లో జరిగే మార్పుల మీద అవగాహన లేనట్లున్నాది. ఇంట్లో కూచొని తెలుగు వార్తా చానల్స్ చూస్తుంటే, వాస్తవ పరిస్థితులు తెలియవు. మీరు రాసినవి జరగటానికి పెద్ద సమయం అక్కరలేదు. ఒక అయిదు సం|| లలో అందరికి పైన చెప్పిన కారణాలు అనుభవంలోనికి వస్తాయి. కాకపోతే ఐదు ఆరు సం|| వయసు కలిగిఉన్న పిల్లల తల్లిదండృలు వారిపిల్ల భవిషత్ను రంగు రంగులు గా ఊహించుకొంట్టు ఒక మత్తులో ఉంటారు. ఇటువంటి వారు వారి పిల్లలకి, వీరిలాగే పెళ్లై పిల్లలు పుడతారని ఊహించుకొంట్టరు. మనలో చాలా మందికి పెళ్ళి చేసుకొనేటప్పుడు మాత్రమే కులము, పక్క ఫామిలి గురించి, వారి కల్చర్ గురించి ఆలోచిస్తారు. 15సం|| ముందు వరకు మనుషుల ప్రవర్తన వారి కులాల సహజ స్వభానికి అనుగుణంగా ఉండేది. ఇప్పుడు ఒక్క కులంలోని సమానమైన ఆర్ధిక పరిస్థితి కల రెండు కుటుంబాలను తీసుకొంటే వారి కల్చర్లో ఎన్నో మార్పులు ఉన్నాయి. సామ్యము, పొంతన అనేవే లేవు. ఇది అనుభవమైతే అర్థమౌతుంది.

  మెచ్చుకోండి

  1. FYI, ఇప్పటివరకు నేనున్న ప్రాంతాల్లో కేబుల్ టి వి వాళ్ళు, తెలుగు వార్తా చానళ్ళు ఇవ్వలేదు. కాబట్టి నేను చూడలేదు. మామూలు చానళ్ళలో రాత్రి ETV న్యూస్, పొద్దున్న జెమిని న్యూస్ మాత్రమే చూస్తాను.
   సరదాగా కామెంట్ చేస్తే దానిని మీరు చాలా సీరియసుగా తీసుకున్నారు.

   మెచ్చుకోండి

 2. ఇండియా లో స్త్రీలు పాత విలువల వ్యవస్థ నుంచీ కొత్త విలువల వ్యవస్థ కి అయ్యే transition సమయం లో ఉన్నారు. మగ వారి కోణం నుంచీ విషాదమేమిటంటే, స్త్రీలకు కొత్త వ్యవస్థ లోని హక్కులూ సమానత్వమూ కావాలి, పాత వ్యవస్థలోని care రక్షణా కావాలి. కాబట్టీ మగవారు తమ హక్కులను వదులుకోవాలి. కానీ పాత వ్యవస్థ ప్రకారం వచ్చే బాధ్యతలను (కుటుంబ రక్షణ, ఆడ వారి care) మోయాలి. మన స్త్రీలు మగవారే తమ ట్రాన్స్ఫర్ లంటి వ్యవహారాలను, రికమండేషన్లను తేవటం వంటి వ్యవహారాలను చూడాలనుకొంటారు. అదే సమయం లో మగవాడితో సమానత్వం విషయం లో ఏ మాత్రమూ వెనుకకు తగ్గరు. తమ జీతం తమదే! మగవాడి జీతం కుటుంబం అంతటిదీ! ఒక పాత సామెత గుర్తుకొస్తుంది..”దున్నేటప్పుడు దూడలలోనూ, మేసేటప్పుడు దున్నలలోనూ కట్టెయటం”. చాలా మంది మగవారు ఈ బేధాలను కనిపెట్టకుండా గానుగెద్దులలా అన్నిటినీ కోల్పోతూ పని చేస్తున్నారు!
  వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది. ఏడెనిమిది నెలల గర్భం తో ఉన్న వారు కూడా తమ కారు తమే నడుపుతూ ఆఫీసు కు వస్తారు. మన ఆడ వారిని అలా చేయమంటే మగవారి పై ఎన్ని అభాండాలు వేస్తారో ఊహించండి.

  మెచ్చుకోండి

 3. ఇండియాలో స్రీ లు పాత,కొత్త విలువలు గురించి చర్చించి, పట్టించుకొనే వారు ఎవరు పెద్దగా లేదు. వారికి నచ్చినవి కొనిచ్చి,డబ్బులు ఖర్చు పేట్టె తలమాసిన వాడు మంచిగా దొరికితే పెళ్లి పేరుతో వాడిని నమిలి మిగవచ్చు. రాజకీయ నాయకుల నుంచి కింద తరగతి వరకు ప్రతి ఒక్క సెక్షన్ సిగ్గు అనేది వదిలి వేశారు. సమస్య ఎక్కడ వస్తుంనాది అంటే మగవారిని అందరు బెండు తీసేవారే. వారికి కుటుంబం వ్యవస్థలో ఉండాలా బయట పడాలా అని ఊగిసలాట ధోరణిలో ఉన్నారు.

  మెచ్చుకోండి

 4. *సరదాగా కామెంట్ చేస్తే దానిని మీరు చాలా సీరియసుగా తీసుకున్నారు*

  బోనగిరి గారు,

  నేనైతే సీరియస్ గానే కామెంట్ రాస్తున్నాను. నా మిత్రుడు జీవితం లో జరిగిన సంఘటన వలన, మరికొన్ని సంఘటనలవలన నేను ఇక్కడ రాస్తున్నాను. అతనికి పేళ్లి అయి 6సం|| ఒక కూతురు. భార్య కి డబ్బులు కట్టి, మంచి కోర్స్ చేయిపించాడు. ఆమేకు జాబ్ వచ్చింది. జీతం ఇతనికన్నా ఎక్కువ. ఆమేతల్లిదండృల సహకారంతో, ఇతనిని నెత్తిన విడాకులు పడేసింది. ఇతను కూతురిని చూడాలని, చేసే ఉద్యోగం మానుకొని భర్య ఉండే వూరికి వేళ్లాడు. ఆమే ఇంకొకరిని పెళ్ళి చేసుకొనిందని, పిల్లలను వీరికి ససేమిరా చూపించమని వీధిలోకి గెంటారు. ఇతని తల్లిదండృలు చాలా ముసలివారు.పైగా వ్యవసాయం మీద ఆధారపడిన పల్లేటూరి వారు. పట్టణంలో పెద్దగా పలుకుబడి లేకపోవటంతో ఇతనికి అండగా నిలబడలేక పోయారు. అవతలి పక్షంవారి ఇతనిని పేపర్కేకించి,పోలిస్ కేసు పేట్టించి, ఇంట్లో లేని సమయంలో డిగ్రి సర్టిఫికేట్లు ఎత్తుకు పోయి ఎంత గబ్బు పట్టించాలో అంత గబ్బు పట్టించారు.ఆఖరు సారి మాట్లాడినపుడు విరక్తితో మాట్లాడాడు. ఇప్పుడు బతికి ఉన్నాడో లేడో తేలియదు. ఇది మీకు సినేమా కథలాగా అనిపిస్తే నేను ఎమీ చేయలేను.

  మెచ్చుకోండి

 5. మీరు రాసిన దాంట్లొ , సెంటెన్స్ బై సెంటెన్స్ చూస్తే అన్నిటితొ ఏకీభవించినా.. ఒవరాల్ గా కనెక్షన్ మాత్రం మిస్ అయినట్టు అనిపిస్తుంది 🙂

  Anyway I liked it :-))) (except last paragraph)

  మెచ్చుకోండి

  1. ఆ ఓవరాల్ కనెక్షన్ ఏమిటో నేను కనిపెట్టేశా? అది నా వ్యక్తిత్వమే!. మీకు నా వ్యక్తిత్వం రాదు గా..అందుకే కనెక్షన్ మిస్ అయ్యారు. 🙂

   మెచ్చుకోండి

 6. ప్రసాద్ గారూ,
  చాలా అన్యాయం చేశేశారండీ ఒక జీవితాన్ని. మేమేమో ఇక్కడ పెళ్లికాని కుర్రాళ్లను పెళ్లి చేసుకోండిరా బాబూ. మీకూ బాధలంటే అర్థమవుతాయి.. అని పోరు పెట్టి మరీ టెంప్ట్ చేయిస్తుంటే మీరేమో మీ టపా ద్వారా ఒక కుర్రాడి జీవితంలో ‘పాలు’ తీసేశారు. తను కూడా పైకి అలా అని ఉంటారు కాని సందు దొరికితే, అవకాశం కుదిరితే పెళ్లిని,. పెళ్లి సంబంధాన్ని కౌగలించుకోని వారెవరో నాకు చూపించండి మరి. ఇంతవరకు సరదా వ్యాఖ్య.

  కాని మీ కథనం, వ్యాఖ్యరూప చర్చ చూస్తుంటే యువతరం స్త్రీల లోని ఆర్థిక స్వాతంత్ర్ర్యాన్ని, దానిద్వారా వచ్చిన కాసింత స్వేచ్ఛను, దాని ద్వారా ఇంట్లో అనివార్యంగా వచ్చే కొత్త ఘర్షణలను తట్టుకోలేకపోతున్నారనిపిస్తోంది.

  నాకు తెలిసిన ఒక యువ స్నేహితుడు ఇటీవలే చదువు సంధ్యలు లేకుండా సాంప్రదాయిక పల్లె యువతిని పెళ్లాడాలని పెళ్లి చూపులకు వెళితే, కాస్త ఆస్తి, ఇంట్లో అధికారం చవిచూస్తున్నఆ అమ్మాయి.. నువ్వు చేసే ఉద్యోగం ఏమిటి, అది మంచి ఉద్యోగమేనా, నీకువస్తోందని చెబుతున్న జీతం లెక్క కరెక్టేనా అంటూ తర్వాత ఫోన్‌లో వాయించేసిందట. అంతే మనవాడు అక్కడి నుంచి పారిపోయివచ్చాడు. ఒక సంవత్సరం పాటు పెళ్లి సంబంధాల మాటెత్తద్దు అని తల్లిదండ్రులకు ఆదేశాలు జారా చేశేసాడు.

  ఇప్పటికే 26 ఏళ్లనాటికే జుత్తు ఊడిపోయి, బట్టతల మొదలైపోయి రేపు అమ్మాయిలు నాకేసి చూస్తారా అనే బాధలో ఉన్న అతనికి… పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ మహిళల సాధారణ చైతన్యంలో, ఆలోచనల్లో మార్పును అంత నేరుగా చూసేసి గుండె పగిలి వచ్చేశాడు. పల్లె యువతులలోనే ఇంత ఆలోచనల్లో మార్పు ఉంటే, పట్నం యువతుల్లో ఉద్యోగాలు అవెంత చిన్నవైనా సరే చేసుకుంటున్న యువతుల్లో భర్త పెత్తనాన్ని, సాంప్రదాయిక పురుషాదిపత్యాన్ని ఏమాత్రం కూడా ఆమోదించి భరించలేకపోతున్నారు. మా స్నేహితుడికి ఎలాగోలా పెల్లయిపోతే మాలో కలిపేసుకుని తమాషా చూద్దాం అనుకున్న మాకు ఇలా మళ్లీ నిరాశే మిగిలింది. పీత బాధలు పీతవి మరి.

  మెచ్చుకోండి

 7. “తలమాసిన వాడు మంచిగా దొరికితే పెళ్లి పేరుతో వాడిని నమిలి మిగవచ్చు”
  “మగవారిని అందరు బెండు తీసేవారే”
  నాకయితే ఈ వ్యాఖ్యలకు పడి పడి నవ్వు వస్తోంది. యువకులు మన వ్యవస్థ సంక్లిష్టతలు, సంధి దశల బారిన పడి ఎంతగా నలిగి పోకపోతే గాని ఇంత బెండు మాటలు వస్తాయా చెప్పండి. పాపం మగవాళ్లు… శతాబ్దాలుగా తమకే హక్కుభుక్తంగా ఉన్న సౌకర్యాలను ఒకటొకటిగా పోగొట్టుకుంటూ వస్తున్నవారు. కానీ దాష్టీకం విషయంలో, పెత్తనం విషయంలో, గృహ హింస విషయంలో పర్సెంటేజ్ ని లెక్కగడితే పురుష బాధితులకంటే స్త్రీ బాధితురాళ్లే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పత్రికల్లో నిత్యం ఘటనలు నమోదవుతున్నాయి కదా.. ఒకటి మాత్రం నిజం. సమాజంలో మార్పులను, స్త్రీల ఆలోచనలలో వేగంగా వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడం.. భరించడం, సర్దుబాటు కావడం మగ యువతకు సాధ్యం కావడం లేదేమో.. అని నా సందేహం. పాపం మగవాళ్లు, పాపం .యువకులు.
  పెళ్ళికోసమే వలలో పడెనే పాపం పసివాడు.. అని పాడుకోవాలనిపిస్తోంది.
  కాని యువకులు తెలుగు బ్లాగుల్లో అలవోకగా కామెంటేస్తున్నారు కాని ఇళ్లలో వారితో సంబంధబాంధవ్యాలలో ఉంటున్న యువతులు, మహిళలు కూడా వీరి బాధను, వాదనలను ససేమిరా అంగీకరించరేమోనని నా భయం.. 🙂

  మెచ్చుకోండి

 8. “ఏదేమైనా రాబోయే తరాలలో ని మగ వారికి నేనిచ్చే సలహా పెళ్ళి చేసుకోవద్దనే.”
  మీరే భయాలూ పెట్టుకోవద్దండీ.. భవిష్యత్తులో అబ్బాయిలకు అమ్మాయిలు దొరికే పరిస్తితి ఉంటే కదా పెళ్లి చేసుకునేదీ, లేనిదీ తేల్చుకోవడానికి. ప్రపంచంలో స్త్రీపురుష దామాషా చాలా తేడాతో సాగుతోందని వార్తలు. మళ్లీ కన్యాశుల్కం కొత్త రూపంలో వచ్చినా రావచ్చు. ఎదురుకట్నం కూడా ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి అబ్బాయిలకు వస్తే.. అంతకు మించిన బెండు తీయడం మరొకటి ఉండదేమో. పాపం.

  “వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది.”
  చాలా కరెక్ట్. సమానత్వం అనేది దాని నిజమైన అర్థంలో మంచికీ చెడ్డకీకూడా వర్తింపు అయ్యే సమాజ విధానం ఉనికిలోకి వచ్చినప్పుడు జీవిత బాధ్యతలూ, సమానత్వమూ అలాగే ఉంటాయి. ఈ అర్థంలో మన దేశంలో స్త్రీలకు సమానత్వమూ, జీవిత బాధ్యతా నిజంగా తమ చేతుల్లోకి ఇంకా రాలేదనే చెప్పాలి. ఆ పేరుతో వస్తున్న కాస్తంత స్త్రీ స్వేచ్ఛను కూడా మనం భరించలేకపోతున్నామేమో.. మరి. నిజంగా ఈ విషయానికి సంబంధించి మీ కథనాలు ప్రధానంగా పేర్కొంటున్నాట్లు స్త్రీ స్వేచ్చ అనేది స్త్రీలకు అందిస్తున్న కొన్ని సౌకర్యాల రూపంలో మాత్రమే మనదేశంల ఉనికిలో ఉందనుకుంటాను.

  ఆస్తి, బ్యాంకు బ్యాలెన్స్, సంతానం, పురుషుడి అభివృద్ధి పునాది మీద ఏర్పడిన కుటుంబ వ్యవస్థ ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో కూడా అటు పురుషుడికీ, ఇటు స్త్రీకి కూడా వరం కాదు. అది ఇద్దరికీ శాపమే. కుటుంబ వ్యవస్థలో పాతుకుపోయిన ఈ శృంఖలాలు తెగిపోకుండా మనుషులు మౌలికంగా సమానులు అనే భావం సమాజంలో అందరి ఆమోదం పొందకుండా ఇలాంటి శాపాలు, శృంఖలాలు మనుషుల్ని ఎన్నటికీ వదిలిపెట్టవనుకుంటాను.

  నాకు కాస్త తీరిక దొరికింది కాబట్టే వరుస కామెంట్లు పెడుతున్నాను. ఏమీ అనుకోవద్దండి.

  మొత్తం మీద యువకులందరినీ తమ బాధలు, మొత్తుకోళ్లు పంచుకునేలా చేశారు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 9. రాజు గారు,
  మగవాళ్ళ బాధ్యతలు ఏ మాత్రం తగ్గకుండా, అధికారాలు తగ్గిపోతున్నాయి. మేధావులూ పత్రికలూ ఎంత చెప్పినా ఈ పరిస్థితి ని తట్టుకోవటం కష్టం. ఒక పత్రికాఫీసులోనే అధికారం కోసం కుమ్ములాటలుంటాయి కదా, కానీ వారు మగ్వాళ్ళు ఇలా ఉదారం గా ఉండాలి, అలా ఉండాలి అని బోధలు చేస్తారు తమ ఎడిటోరియల్స్ గట్రా వంటి వాటిలో..
  ఇక సమానత్వాం విషయానికి వస్తే..అనేక రకాలైన సమానత్వాలున్నాయి.
  1.అమ్రికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం sartorical మాత్రమే! సీ ఈ ఓ జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
  2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో ఫాచ్టరీలలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభి truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన్ amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
  3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు. ఎకరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటత్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టేఏ ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు.
  సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే!

  స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు functional equality ని ఆశిస్తారు. సమానత్వమంటే functional equality అనుకొంటారు. కానీ functional equality తో వ్యవస్థ పని చేయదు. కొన్నాళ్ళకి అది కుప్ప కూలుతుంది.

  మెచ్చుకోండి

 10. *కానీ దాష్టీకం విషయంలో, పెత్తనం విషయంలో, గృహ హింస విషయంలో పర్సెంటేజ్ ని లెక్కగడితే పురుష బాధితులకంటే స్త్రీ బాధితురాళ్లే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు పత్రికల్లో నిత్యం ఘటనలు నమోదవుతున్నాయి.*

  చూడండి రాజు గారు, మీ వ్యాఖ్య మనిషి జీవితాన్ని ఆర్ధిక స్థితి గతులను ల కోణంలో నుంచి మాత్రమే చూసే పాశ్చాత్య దేశాల మేధావులు, ఇంకా కారల్ మార్క్స్, లేనిన్ వంటి బోగస్ మేధావులను గుర్తుకు తెస్తున్నారు. ఎవరైనా ఇంత శాతం మంది ఉన్నారు అని మాట్లాడేవారంటే , జీవితం మీద అవగాహన లేని వారు. తమ బాధ్యతలను ప్రభుత్వం పైన నెట్టి వామపక్ష వాదనలు చేస్తూ జీవించేవారని అర్థం ధనిస్తుంది. అలా అని, ఎర్ర మేధావులంటె పడదనుకొనేరు. వారి పుస్తకాలను చాలా చదివాను, ఆ భావజాలం కలిగిన మిత్రులు చాలామంది ఉండేవారు. నేను రాసిన వ్యాఖ్యలు కూలీ నాలి చేసుకొని, మందు తాగి ఇంటికి వచ్చి పేళ్లాన్ని కొట్టె వారి గురించి కాదు. అదే విధంగా పల్లేటూరిలో పుట్టిన వారి గురించి కూడా కాదు. పెపర్ వారు ఎప్పుడు ఎర్ర కళ్ళద్దాల, మేధావులతో నిండి ఉండటం మూలానా అటువంటి సంఘటనల గురించి రాస్తూ వారిని ఉద్దరిస్తున్నామనట్టు డబ్బా కొట్టుకొంటారు. ఈ పేద మహిళ జీవితాలను చూసి మనదేశంలో చట్టాలు చేస్తారు. కాని వీరిలో ఎంత మందికి కోర్ట్టు గుమ్మం తొక్కి న్యాయం పొందుతారో చేప్పండి. డబ్బులు లేని ఆ తరగతి వారు కోర్ట్టుకి పోతే మొహం కూడా చూడరు. ఇక పైతరగతి వారికి పెళ్లి అనేది ఒక సమస్యే కాదు. డబ్బులున్న వారిలో పెళ్లి ఒక సమస్యే కాదు. ఉదా|| మన సినినటులను చూడండి. రెండు మూడు పెళ్లిళూ సునాయాసంగా చేసుకొంట్టూటారు. అంటే ఈ చట్టాలా భారిన పడి నలిగి పోయేది మధ్యతరగతి వారే. ఇప్పటివరకు “అగ్రవర్ణ మధ్యతరగతి మగవారు” అనేక నష్ట్టాలను భరిస్తూ వచ్చారు. రిజర్వేషల పేరు తో విపరీతమైన పోటిని ఎదుర్కొని, ఉద్యోగం తెచ్చుకొని, ఊపిరి పీల్చుకొనే లోపు ఎవరు ఊహించని విధంగా భార్య నుంచే వెన్నుపోటుకి గురవ్వడమనేది వారిని నిరాశకు గురిఎవరి వాల్లో ఇటువంటి అవమానాలు పడుతుంటే పెద్దగా గింజుకునేది ఎమి ఉండదు. పెళ్లి అనేది ముక్కు మొహం తెలియని వారితో ఎవరు చేసుకోరు కదా! ఎన్నో చూసుకొని చేసుకొన్న తరువాత, తెలిసిన వారు, సం|| కాపురం చేసి, చట్టంలోని లొసుగులను విడాకుల పేరు తో భర్తను ఇబ్బందులకు గురిచేయటమే లక్ష్యంగా వాడుకొంట్టున్నారు. ఒకప్పటిలాగా వీరు లొరుకునే విడాకులు భర్త శాడిస్ట్ అయి కాదు. ఇక మనదేశ న్యాయవ్యస్థ పని తీరు వలన నిరంతరం కోర్ట్టు చుట్టూ తిరుగుతూ, సంపాదించిన డబ్బులను లాయర్లకు,పోలిసులకు ఇచ్చుకొని సొమ్ము పోయి, దుమ్ము పడుతున్నారు.

  మెచ్చుకోండి

  1. *ఒకప్పటిలాగా వీరు లొరుకునే విడాకులు భర్త శాడిస్ట్ అయి కాదు.

   పైన రాసిన వాఖ్యం ఇలా ఉండాలి. ఒకప్పటిలాగా వీరు కోరుకునే విడాకులు భర్త శాడిస్ట్ అయి కాదు. రోగాలు, రొప్పులు ఉండికావు. చాలా సిల్లి రీసన్స్.

   Please read మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు

   http://www.koumudi.net/gollapudi/101011_mexico_mark_pellillu.html

   మెచ్చుకోండి

 11. శ్రీరామ్ గారూ,
  మీ వ్యాఖ్య సాయంత్రమే చూశాను కాని అప్పటికే ఆఫీసునుంచి బయటపడుతుండటంతో ఇంటికి వచ్చాక ఇప్పటికి గాని స్పందించటం కుదరలేదు. ముందుగా నా వ్యాఖ్యకు స్పందించినందుకు సంతోషం. కాని “పాశ్చాత్య దేశాల మేధావులు, ఇంకా కారల్ మార్క్స్, లేనిన్ వంటి బోగస్ మేధావులను గుర్తుకు తెస్తున్నారు.” అంటూ మీరు కాస్త ఆవేశపడ్డారనిపిస్తోంది.

  అలాగే, “ఎవరైనా ఇంత శాతం మంది ఉన్నారు అని మాట్లాడేవారంటే , జీవితం మీద అవగాహన లేని వారు. తమ బాధ్యతలను ప్రభుత్వం పైన నెట్టి వామపక్ష వాదనలు చేస్తూ జీవించేవారని అర్థం ధ్వనిస్తుంది.” అని మీరు చేసిన వ్యాఖ్యను కూడా నేను అంగీకరించలేను. కాని మీ వ్యాఖ్య ప్రధానంగా ఈ విషయం మీద కాదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని పక్కన బెడదాం.

  నిజమే.. మనం పేదవారిని, ఉన్నత వర్గాల వారిని పక్కనబెట్టి అగ్రవర్ణ మధ్యతరగతి వర్గం గురించే పరిశీలిద్దాం. మీరన్నట్లు వారి సమస్యలు స్థూల పరిశీలనలో చాలా భయంకరంగానే ఉన్నాయి. చదువు, తీవ్రమైన పోటీ, ఉద్యోగ సాధన, పెళ్లి, వైవాహిక సంబంధాలు తదనంతర సమస్యలు అన్నీ ఈ కాలంలో చెప్పలేనంత బాధాకరంగానే ఉన్నాయి. ఈ తరగతిలో పెళ్లే ఒక సమస్యగా మారుతోంది. జీవితంలో చచ్చీ చెడీ ఎదిగి వచ్చి కాస్త సెటిల్ అయ్యే అవకాశం వచ్చిందనుకుంటే వివాహానంతరం వస్తున్న సమస్యలు కాస్త ఊపిరిని కూడా చిదిమేస్తున్నాయి. ఇంట్లో అక్కచెల్లెళ్ల వివాహాలు పూర్తయేంతవరకు తాము పెళ్లిళ్లు చేసుకోకుండా 30, 35 ఏళ్ల వయస్సు వచ్చేవరకు పెళ్లి మాట తలపెట్టకుండా ఈ తరగతికి చెందినవారు పల్లెల్లో కూడా ఉంటున్నారని నాకు తెలుసు.

  కాని నేను ఏకీభవించలేకపోతున్న విషయం ఇక్కడే ఉంది. లెక్కలు వద్దనుకున్నా, శాతం గురించి మాట్లాడేవారు జీవితం మీద అవగాహన లేని వారు అని మీరన్నప్పటికీ నేను మళ్లీ ఆ లెక్కలను ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను. రెండు రోజుల క్రితమే పత్రికలలో చదివాను. దేశవ్యాప్తంగా మన న్యాయస్థానాలు అన్నింటిలోనూ కలిపి విడాకులకు సంబంధించి 60 వేల కేసులు పెండింగులో ఉన్నాయని వీటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నా ఉద్దేశంలో వారు స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి.. ఇలా విడాకులకు అప్లయ్ చేసుకున్నవారిలో నూటికి 95 శాతం మంది పట్టణాలలో ఉద్యోగ జీవితం గడిపేవారే ఉంటారు. అందులోనూ సాంప్రదాయిక ప్రభుత్వోద్యోగాలు కాకుండా తమ శారీరక మానసిక శక్తులను పీల్చి పిప్పి చేస్తున్న సాఫ్ట్‌వే్ర్, ఐటీ వంటి ఆధునిక రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువగా ఉండి ఉండవచ్చు.

  నేను ఆధారరహితంగా ఇలా లెక్కలు చెప్పలేదు. ప్రతిరోజూ నేను ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లను తెప్పించుకుంటున్నాను. ఇంకా హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్, పిటీఐ వంటి వెబ్ పత్రికలను కూడా చూస్తుంటాను. ముఖ్యంగా పట్టణాలలో ఉంటూ భార్యాభర్తలు ఇద్దరూ డే డ్యూటీ, నైట్ డ్యూటీ చేయవలసిన అసహజమైన పని పరిస్థితుల్లో జీవిస్తున్నవారు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న దంపతులే ఈ మధ్యకాలంలో విడాకులకు ఎక్కువగా సిద్దపడుతున్నారని. వీరే కౌన్సిలింగ్ ఎక్కువగా తీసుకుంటున్నారని దాదాపుగా పత్రికలు, వెబ్ సైట్లలో తరచుగా చూస్తూనే ఉన్నాను.

  మీరు ప్రస్తావించిన మీ మిత్రుడు ఏ ఉద్యోగం చేసేవారో నాకు తెలీదు. కాని 60 వేల విడాకుల కేసులు పెండింగులో ఉంటున్నాయనుకుంటే విడాకులకు అప్లయ్ చేసుకున్న వారంతా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని విడాకుల పేరుతో భర్తను ఇబ్బందులకు గురిచేయటమే లక్ష్యంగా చేసుకున్న భార్యలే అని చెప్పే సాహసం చేయగలమా? 120 కోట్ల జనాభాలో, 60 వేల విడాకుల కేసులు అంటే భారతీయ సమాజం మునుపెన్నడూ ఎరుగనంత పెద్ద సంఖ్యే ఇది.

  దురదృష్టవశాత్తూ వైవాహిక బంధాన్ని, సంతానంతో అనుబంధాన్ని కోల్పోయిన మీ మిత్రుడికి నా సానుభూతి. వివాహబంధం పొసగక పోయిన కారణంగా దాంట్లో ఎవరిది ఎంత చిన్నతప్పు, పెద్ద తప్పు అయినప్పటికీ విడాకుల వరకు పోతున్న సందర్భాలలో, స్త్రీలది మాత్రమే తప్పయితే, భర్తను ఇబ్బందులకు గురిచేయటమే లక్ష్యంగా స్త్రీల వ్యవహారం ఉందని సాధారణీకరించి స్థిరమైన అభిప్రాయానికి వచ్చినట్లయితే ఇక భార్యాభర్తల మధ్య సయోద్య ఎన్నటికీ కుదరదు కనుక పురుషులిక పెళ్లి మాటెత్తకపోవడమే మంచిది. కాని సత్యం ఇలాగే ఉందా? స్త్రీపురుషుల మధ్య తీవ్రమైన వైరుధ్యం ఇలాగే పరిష్కరించబడాలంటే మన దేశం లోని కొన్ని కోట్ల కుటుంబాలు వాటిలోని స్త్రీలు విడాకులకు అప్లయ్ చేయవలసి ఉంటుంది.

  మన న్యాయవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుండవచ్చు. న్యాయం సకాలంలో అందించకపోవడం ద్వారా అన్యాయం జరగడానికి న్యాయవ్యవస్త మార్గం చూపుతుండవచ్చు. కాని భర్తలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా కేసులు పెడుతున్న భార్యల ‘అసంబద్ధవైఖరి’ని, విడాకుల కేసులో భార్య వాదనను మాత్రమే సమర్థిస్తున్న ధోరణిలో మన న్యాయవ్యవస్థ ఉందని నేననుకోవడం లేదు. కోర్టులపై, న్యాయప్రక్రియపై నాకు ఎంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ మన దేశంలో న్యాయ స్థానాలు పురుషుల పట్ల ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని నేను భావించడం లేదు.

  న్యాయం కోసం చేసే ప్రయత్నాలలో సామాన్య ప్రజానీకం కోర్టు గుమ్మం ఎన్నడూ తొక్కరాదని నా బలమైన విశ్వాసం. కోర్టుకు పోతే బంట్రోతు, న్యాయవాదులే కాదు కోర్టు గోడ సైతం ‘నా నీడలో నిలబడ్డావు డబ్బు కట్టు’ అంటూ నిలదీస్తుందనేది పేదవర్గాలు దశాబ్దాలుగా గ్రహిస్తున్న జీవితపాఠం.

  అన్నిటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే స్త్రీలు తమ భర్తలను నరక బాధలు పెడుతున్న వైనం గురించి ఒక మగవాడు రాస్తే, మరి కొందరు మగాళ్లు వ్యాఖ్యానం చేస్తూ చర్చను ముగిస్తున్నారు తప్పితే ఈ అంశంపై స్త్రీల ఆలోచనలు ఏవి అనేది బయటపడటంలేదు. తెలుగు బ్లాగులు ప్రస్తుతం కొనసాగిస్తున్న దూకుడు నేపథ్యంలో స్త్రీలు తమపై బ్లాగ్ చర్చల్లో పాలుపంచుకుంటారని ఏ మాత్రం ఆశ లేదు కూడా. మన బ్లాగుల అపసవ్య ధోరణులతో వారు ఈ వైపుకే రాకుండా పారిపోతున్నట్లు ఉంది.

  ప్రసాద్ గారు,
  “ఇది మగవాళ్ళ కోణం నుంచీ రాశాను కాబట్టీ మీకు అలా అనిపించి ఉండవచ్చు. ఆడవాళ్ళను వేధిచే మగ వారే ఇప్పటివరకూ మన వ్యవస్థ లో ఎక్కువ. కాకపొతే మనకున్న బండ చట్టాల వలన భవిష్యత్తులో ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంది.”

  సమస్యకు పురుషుల కోణం, స్త్రీల కోణం అంటూ ఉంటాయని మీరే అంటున్నారు కనుక వాళ్ల కోణం పక్కకుపోయి మగవాళ్ల కోణం మాత్రమే చర్చకు రావడం న్యాయమేనంటారా చెప్పండి.

  మెచ్చుకోండి

  1. రాజుగారు,
   మీకు నాగురించి తెలియక పోయినా,నేను మీ చందమామ బ్లాగు చదవటం జరిగింది. ఇక నా మిత్రుడు ఇంజనిరింగ్ చదివి మేఖానికల్ ఇండస్ట్రిలో పని చేసేవాడు. వారిది వ్యవసాయం ఆధారపడిన కుటుంబంలో, ఇతనే మొదట చదివింది. అతను ఆంధ్రోడు. ఇతనోక్కడే కాదు చాలా మంది తెలిసిన వారి సంగతి విని విని రాస్తున్నాను.
   ———————————————–
   *120 కోట్ల జనాబాలో 60 వేలమంది దంపతుల సమస్య సముద్రంలో రేణువు వంటిదే కావచ్చు.*
   మిమ్మల్ని ఇంతక్రితం లెక్కలు రాయద్దు అనటానికి ప్రధాన కారణం ఇప్పుడు చెపుతాను. 120 కోట్ల జనాబాలో 60 వేలమంది దంపతుల సమస్య సముద్రంలో రేణువు వంటిదే కావచ్చు అని చెప్పేసారు. వాస్తవానికి మేధావులు చేసే వాదనలు ఇలాగే ఉంటాయి. 60వేల మంది దంపతుల కష్ట్టాలను తీసుకు వచ్చి 120కోట్ల తో పోలిస్తే వినే వార్రికి, చదివేవారికి పెద్ద విషయం లాగా ఉండదు, వారి సమస్యను నీరు గార్చేసినట్లవుతుంది. ఒక చిన్న ప్రశ్న మీకు మీరే వేసుకోండి. భారత దేశంలో ఎంతో మందికి కష్ట్టాలు
   ఉన్నాయి కదా! 120 కోట్ల మంది జనాభాలో ఒక్క edit గారి గురించి, మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? మీ కన్ సర్న్ సంద్రంలో ఇసుకరేణువంటే ఎలా ఉంట్టుంది? నా వ్యాఖ్యలు మీకు బాధ కలిగిస్తే . ముందుగా సారి.

   మెచ్చుకోండి

   1. ముందుగా, edit గారి ప్రస్తావనకు సంబంధించి: దానిని రాజు గారు ఒక జాతి సమస్య చెయ్యలేదు. ఇక్కడ మగజాతి సమస్యగా భావించబడిన దాని గురించి చర్చిస్తున్నారు, కొన్ని ఉదాహరణలు చూపి. ఏ చట్టమైనా బలమున్న వాడికే చాలా మటుకు ఉపయోగపడుతోందనడానికి సందేహించనవసరం లేదనుకుంటాను. ఈ చర్చలు ఉక్రోషం తెప్పిస్తున్నా, ముఖ్యంగా వ్యాఖ్యలు చూసినప్పుడల్లా ఎక్కువ భాగం ఇవే కనిపిస్తుండడం వల్ల. కానీ పాల్గొనాలనిపించలేదు. నిజ జీవితంలో ఇటువంటి ఏకపక్ష వాదనలలో ఇంకొకరి మాటకి విలువ లేకపోవడాన్ని చేతులు కాల్చుకున్ని తెలుసుకోవడం వల్ల. ఇంకా ఒక కారణం, చాలా స్పష్టంగా కొందరు వ్యాఖ్యాతలు మగ వారికి (వారి ఉద్దేశంలో) పెళ్ళీ, పిల్లలూ అనేవి ముఖ్యం కాదని చెప్తుండడం వల్ల వారి అభిప్రాయాలు ఆ విధంగా అర్థవంతమే కనుక అందులో కాదనడానికేమీ లేదు. అలా ఆలోచించే వారికి ఆడ వారికైనా, మగ వారికైనా పెళ్ళి అనేది పెద్ద ప్రతిబంధకమే. ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసి రాబోయే పరిస్థితిని ఊహించి జాగ్రత్త పడుతున్నామంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని అనుభవిస్తున్న ఎన్నో రెట్ల ఎక్కువ సమస్య ఉన్న బాధితుల గురించి ఏం చెయ్యాలంటారు మరి? మీరు పూనుకుని చట్టాల అవసరం లేకుండా చెయ్యండి. ఈ చట్టాలను అక్రమంగా వాడుకునే వారు చట్టం లేకపోయినా సాధిస్తారు. ఎటోచ్చీ సమస్యలతో వేగుతున్న వారికే ఏ సమాధానమూ దొరకట్లేదు. విడిపోతే తిడతారు కొందరు. కలిసి ఉంటే కష్టపడడం ఇష్టం లేక నెట్టుకొస్తున్నారంటారు ఇంకొందరు. మొత్తానికి ఎవరో ఒకరు చెప్పిన మాట వినడమే కానీ ఎవరి మనసుతో వారు ఆలోచించుకుని తీసుకునే నిర్ణయాలని ఇంకొకరు గౌరవించలేరు అని మాత్రం తెలుస్తోంది. కుటుంబం అనే విషయం పై సరైన అవగాహనతో ఉన్న వారెవరూ తేలికపాటి మాటలు మాట్లాడరు. అలా మాట్లాడే వారితో వాదనకు దిగడం నిష్ప్రయోజనం. మగ వాళ్ళ point of view ఉండాల్సిందే. ఆడ వాళ్ళ point of view ఉండాల్సిందే. ఐతే రెండూ సమాంతరంగా ఒక దానిని ఒకటి ఎక్కడా కలుసుకోకుండా ఉండడం అన్నదే కదూ ప్రధాన సమస్య ఇక్కడ. మన చుట్టు ప్రక్కల ఉన్న వారు, సమస్యలో ఉన్న వారు, ఆడైనా, మగైనా, వారి కోణం వారు చెప్తారు. అదే నిజం అవ్వక్కర్లేదు. ఏదో సమస్య చెప్పారు, అమ్మాయి ఎక్కువ ప్రయాణం చెయ్య వలసి వస్తోందీ, అల్లుడు ఇంట్లోనే పని చేసుకుంటున్నాడు అని కంప్లెయింటు అని. అది దాని గురించా, లేక ఇంట్లోనుంచి పని చేసుకుంటున్నాడు కాబట్టి అతను ఇంటి పనులు కొన్ని చూసుకోవచ్చు అన్న విషయం పెడర్థం తీయడమా అన్న అనుమానం కలిగితే తప్పంటారా? నాకు తెలిసి ఇంట్లోనించి పని చేస్తూ పిల్లల విషయాలు చూసుకంటూ భర్త ఉంటే బయట పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చూసుకునే భార్య ఉన్న కుటుంబాలు, వాళ్ళు చక్కగా సఖ్యంగా ఉండడము తెలుసు. ఇక్కడ ఎవరో కరిని లేకుంటే సమాజాని తమ బాధలకి బాధ్యుల్ని చెయ్యడం, సమస్య ownership లేక పోవడమూ చిన్న చిన్న కొట్లాటలకి కారణాలు. అవి పెద్ద సమస్యలు ఎప్పుడవుతాయంటే ఎవరో ఒకరి ఉద్దేశాలు చాలా imabalanced గా ఉన్నప్పుడు. మాటలలో గెలిచినంత మాత్రాన నిజం మరుగున పడిపోదు. నిజం ఐనంత మాత్రాన అది నిక్కచ్చిగా గెలవాలనీ లేదు. ఓడిపోయినంత మాత్రాన లేదా అలా అగుపించిన మాత్రాన నిజం అబద్ధమూ కాదు. నాకెందుకో edit గారి ప్రస్తావన ఇక్కడ అసందర్భమనిపించి ఈ వ్యాఖ్య వ్రాయాలనిపించింది. ఇంతకు మించి ఇక్కడ చర్చలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. కష్టం కూడాను.

    మెచ్చుకోండి

    1. థాంక్స్ లలిత గారు.
     చర్చలు గెలవాలని కాక అన్వేషించాలనే స్పూర్తి తో జరగటమే నాకు ఇష్టం. శ్రీరాం గారు edit గారి పేరు ప్రస్తావించకపోతేనే బాగుండేది, కానీ ఆయన వాదన అసందర్భమూ తర్క రహితమూ కాదు (he’s not without a point). బేసిక్ గా ఆయన ఎవరికష్టాలు వారికి పెద్దవే అని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు.
     మీ వ్యాఖ్య వలన ఆడవారి కోణం కొంత తెలిసింది. మీ సమాధానం ఆలోచన రేకెత్తించే విధం గా ఉంది.

     మెచ్చుకోండి

    2. మీవాదానతో పెద్దగా విభేదించాల్సిన అవసరం లేదు. నేను ఆమే పేరు ప్రస్థావించటానికి కారణం రాజుగారు ఆరోజులలో ఎంతో ఆందోళన చేందారు, అది అర్థమయ్యెందుకు చెప్పాను అంతే. పెళ్లిళు అనేవి మనకు బాగా దగ్గరైన వారిలో విఫలమైనపుడు పడే బాధ వేరు. ముక్కు మొహం తెలియని వారివి, అరవైవేల కేసులు కోర్ట్టులో ఉండటం వేరు. ఎప్పుడైతే 120కోట్ల జనభా గల దేశంలో అని 60వేల కేసులే అంటే తార్కికం గా ఆలోచించి, చాలాచిన్న సంఖ్యే కదా అని, మనుషులు పడే కష్ట్టాలను తక్కువ చేసి చూస్తాం. ఎందుకూ అంటే , వారు మనకు తెలియదు గనుక. ఆదిలక్ష్మిగారి తో పెద్దగా పరిచయం లేకపోయినా, ఆమే సంగతి తెలిసి కొన్ని రోజులు ఎంతో బాధపడ్డాను. అలాగే ఇతర బ్లాగర్లు కూడా. అంతే కాని 500 వందల బ్లాగుల్లో ఎవరో ఒకమే బ్లాగు రాసుకొనేది అని అనుకోలేదు. ఆమే పేరు ప్రస్థావించటం ఎవైరికైనా బాధ కలుగుతుందేమో అని ముందుగానే క్షమాపణ కూడా చెప్పను.
     ————————————
     *ఇంతకు మించి ఇక్కడ చర్చలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. కష్టం కూడాను.*

     మీరే కాదు లలిత గారు,ఒక్కసారి నిన్న గొల్లపూడి రాసిన వ్యాసం చదివితే, ఆయన చివరి మాటలను వింటె ఆయన గొంతులో అసంతృప్తి అర్థమౌతుంది. ఎవరికైనా, ఎన్నో శతాబ్బ్దాల తరబడి వర్ధిల్లిన వివాహ వ్యవస్థ పతనమౌతుంటే ఎంతో బాధగానే ఉంట్టుంది. మీకు తెలిసే ఉంట్టుంది, భారత దేశ చరిత్రలో, విదేశియుల సాంస్కృతిక దాడులనుండి రక్షించుకొంట్టు వచ్చారు ఈ వ్యవస్థని. ఒకప్పుడు అమ్మాయిలకు 8సం||కే పెళ్లిలు జరిగేవి . దానికి కారణం ,ఆనాడు విదేశీయుల దండయాత్రలో ఎవరైనా అమ్మాయిలను ఎత్తుకుపోతే కనీసం మొగుడనేవాడు, ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడుతాడని 8సం||ల కే పెళ్ళిలు చేసేవారు. తండ్రిగారికి అధికసంతానం అవడంచేసి, అళ్లుడు కాపాడుతాడని పెళ్లిచేశేవారు. ఎన్ని రకాల దండయాత్రలు జరిగిన స్రీల మాన,ప్రాణాఅలను రక్షించటానికి కొరకు, మగవారిదే బాధ్యత కనుక, దానిని పేళ్లి పేరుతో చట్ట బద్దం చేసి సంప్రదాయ రూపంలో ఇన్ని నాళ్లు రక్షించు కొంట్టు వచ్చారు. ఎన్నోరకాల కష్ట్టలు పడి మనదంట్టు ప్రత్యేకంగా, ప్రపంచంలో మిగిలిన ఒక గొప్ప వ్యవస్థ పరిస్థితి డోలాయమానం లో పడటం అనేది, బాధగానే ఉంది.
     ———————————————–
     “మహాత్ములంతా సహాయపడిన మంచి నిలవలేదు. జాతి వైద్యులే కోత కోసినా నీతి బతకలేదు” అని ఆత్ర్యేయ గారు అన్నారు. ఆకులు రాలిపోయే కాలం మొదలైనపుడు, చెట్ట్లకు ఎన్ని నీళ్లు పోసినా లాభం లేదు. రాలే ఆకులు చెట్టును అంటిపేట్టుకొని ఉండవుకదా! సాధ్యమైనంతవరకు మగవాళ్ళని జాగ్రత్త గా ఉండమని చెప్పటంతప్ప.అసలికీ ఇప్పటివరకు నేను చెప్పాలనుకొన్న పాయింట్స్ ఒకటి రెండుకూ మించి చెప్పలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. వీలూన్నపుడు, నా బ్లాగు పెట్టి రాస్తాను.
     —————————————–
     బొందలపాటిగారు, మీకు వీలైతే edit గారి పేరు తొలగించండి.

     మెచ్చుకోండి

     1. “మహాత్ములంతా సహాయపడిన మంచి నిలవలేదు. జాతి వైద్యులే కోత కోసినా నీతి బతకలేదు” అని ఆత్ర్యేయ గారు అన్నారు.
      నేను కూడా అప్పుడప్పుడూ,( ఏంటి ఈ సమాజం ఇలా అయిపోతోంది అనుకొనేటప్పుదు) గుర్తు తెచ్చుకొనే వాక్యం ఇది. (గుస్సా రంగయ్య పాట..)
      “ఆకులు రాలిపోయే కాలం మొదలైనపుడు, చెట్ట్లకు ఎన్ని నీళ్లు పోసినా లాభం లేదు. రాలే ఆకులు చెట్టును అంటిపేట్టుకొని ఉండవుకదా! సాధ్యమైనంతవరకు మగవాళ్ళని జాగ్రత్త గా ఉండమని చెప్పటంతప్ప.”
      మీ ఆవేదనను అర్ధం చేసుకోగలను.
      “అసలికీ ఇప్పటివరకు నేను చెప్పాలనుకొన్న పాయింట్స్ ఒకటి రెండుకూ మించి చెప్పలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. వీలూన్నపుడు, నా బ్లాగు పెట్టి రాస్తాను.”
      తప్పకుండా. మీ దగ్గర ఇంకా చాలా..చాలా పాయింట్లున్నాయని నాకూ తెలుసు. ఎదురు చూస్తాను.

      మెచ్చుకోండి

    3. “అలా ఆలోచించే వారికి ఆడ వారికైనా, మగ వారికైనా పెళ్ళి అనేది పెద్ద ప్రతిబంధకమే.”
     వారు అలా ఆలోచించటానికి వారి వ్యక్తిత్వాలతో పాటు, వారు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా కారణం కావచ్చు.
     “ఎవరో ఒకరి ఉద్దేశాలు చాలా imabalanced గా ఉన్నప్పుడు. ”
     Who decides what is balanced?

     మెచ్చుకోండి

   2. edit గారిని గురించి మీరు మాట్లాడేది లాజికల్ గా మీ వాదన ని సపోర్ట్ చేసొకోవటానికైనా, ప్రస్తుతానికి ఆమె ను గురించి వదిలేద్దాం.

    మీ బాధ నాకర్ధమయింది. అన్యాయం చేయబడ్డ మైనారిటీ లో మనమే ఉంటే మనకు ఆ బాధ తెలుస్తుంది అంటున్నారనుకొంటాను. పేపర్లలో దళితులపై అన్యాయాల్గురించి చాలా రాస్తారు. సమాజం లోనూ పల్లెటూళ్ళలోనూ దళితుల పై వివక్ష ఒక విస్తృతమైన నిజమే అవ్వవచ్చు. కానీ నేను ఇంజనీరింగ్ లో చేరిన కాలేజీ లో అగ్రకులాల పై వివక్ష ఉండేది. అగ్రకులాల వారు వెనుక బెంచీలలో కూర్చోవాలనటం, వారు షూ వేసుకొని రాకూడదనటం ఉండేది అక్కడ.అగ్రకులాలు మా పెద్దల చెవులలో సీసాలు పోశారు. ఈ కాలేజీ లో బీ సీ ల డామినేషన్. కాబట్టీ it’s payback time అనేవారు. ఒక పేద గ్రామీణ అగ్రకుల రైతు కొడుకు గా ఈ వాస్తవం అప్పటివరకూ నేను చదివిన అభ్యుదయసాహిత్యం, పత్రికలూ, మీడియా చెప్పిన వాటికి పొంతన లేకుండా ఉంది. అలనే మా కాలేజీ పరిస్థితి చాలా అరుదు కావచ్చు. కానీ నా వేదనకు శాతాలలో భాష్యం చెప్పటం కష్టం.

    మెచ్చుకోండి

    1. ప్రసాద్ గారూ,
     “కానీ నేను ఇంజనీరింగ్ లో చేరిన కాలేజీ లో అగ్రకులాల పై వివక్ష ఉండేది. అగ్రకులాల వారు వెనుక బెంచీలలో కూర్చోవాలనటం, వారు షూ వేసుకొని రాకూడదనటం ఉండేది అక్కడ.అగ్రకులాలు మా పెద్దల చెవులలో సీసాలు పోశారు. ఈ కాలేజీ లో బీ సీ ల డామినేషన్. కాబట్టీ it’s payback time అనేవారు. ఒక పేద గ్రామీణ అగ్రకుల రైతు కొడుకు గా ఈ వాస్తవం అప్పటివరకూ నేను చదివిన అభ్యుదయసాహిత్యం, పత్రికలూ, మీడియా చెప్పిన వాటికి పొంతన లేకుండా ఉంది. అలనే మా కాలేజీ పరిస్థితి చాలా అరుదు కావచ్చు. కానీ నా వేదనకు శాతాలలో భాష్యం చెప్పటం కష్టం.”

     వ్యక్తిగా మీకు ఏర్పడిన ఈ విషాదానుభవం మీ జీవితాంతం వరకు వెంటాడుతూనే ఉంటుందనుకుంటాను. మీకు సానుభూతి చెప్పడం తప్ప ఏమీ చేయలేను కదా. కాని శతాబ్దాలుగా వివక్షత ఎదుర్కొంటూ వచ్చిన వారు it’s payback time అంటూ ప్రదర్శించిన పరిష్కారం బీసీ కులాల్లో, దళిత కులాల్లోని పెద్దలు కూడా ఎవరూ సమర్థించలేరనే నా అభిప్రాయం. శతాబ్దాల వివక్షత పాలబడిన వారు ఆ వివక్షతా వ్యతిరేక పోరాటాన్ని మీరు పైన చెప్పిన విధంగా చేపట్టడమే ఒక పెద్ద అపరిపక్వపు ఆలోచనలకు ప్రతిబింబం. కాని అది మొత్తం వెనుకబడిన కులాల సామూహిక ఆచరణ లేదా అభిప్రాయం అనలేమనుకుంటాను. కుర్రతనపు ఆవేశకావేషాల పొంగు మాత్రమే దీంట్లో కనిపిస్తోంది. అయితే ఇలాంటి డామినేషన్, కుల, మత, వర్గ ఆధిక్యతా స్వభావం ఈరోజుకీ మన విద్యాలయాల్లో కొనసాగుతూనే ఉంది కదా.. ప్రజల మధ్య కులాల మధ్య, మతాల మధ్య ఐక్యతను సామరస్యాన్ని నిలువునా పాతిపెడుతున్న ఆధిక్యతా స్వభావం ఇది. దీనికి ఎవరి స్థాయిలో వారు బలికావలసిందే. మీ ఆవేదనతో పాలుపంచుకుంటున్నాను.

     మెచ్చుకోండి

   3. “అన్నిటికంటే విషాదకరమైన విషయం ఏమిటంటే స్త్రీలు తమ భర్తలను నరక బాధలు పెడుతున్న వైనం గురించి ఒక మగవాడు రాస్తే, మరి కొందరు మగాళ్లు వ్యాఖ్యానం చేస్తూ చర్చను ముగిస్తున్నారు తప్పితే ఈ అంశంపై స్త్రీల ఆలోచనలు ఏవి అనేది బయటపడటంలేదు”

    రాజశేఖరరాజు గారూ,
    మన అతివాద స్త్రీవాద బ్లాగుల్లో కేవలం స్త్రీ కోణమే ఉండగా లేనిది మగవారి కోణంలో మగవాళ్ళు రాయటం తప్పంటారా?

    మెచ్చుకోండి

 12. రాజు గారు,
  Thanks for putting things in perspective.
  1. మీరు చెప్పినట్లు కొన్ని వేల విడాకులలో పరిమితమైన కేసులు మాత్రమే స్త్రీలు చట్టాన్ని దుర్వినియోగం చేసే కేసులని నేనూ నమ్ముతున్నాను.

  2. ఒక మగ వాడిగా నాకు మగవాళ్ళ దృష్టి కోనం బాగా తెలుసు కాబట్టీ ఆ కోణం నుంచీ రాశాను. స్త్రీలు కూడా వారి కోణం నుంచీ రాయవచ్చు. అలాంటి అనేక బ్లాగులు ఉన్నాయి. కొన్ని మిలిటంట్ స్త్రీవాద బ్లాగులు కూడా ఉన్నాయి, మీరు చూశారో లేదో! ఇక ఆడ వారి దృక్కోణం నాకు తెలిసినదైనా రాయకపోవటానికి కారణం, నేను ఒక న్యూట్రల్ కోణం నుంచీ, ఒక జర్నలిస్ట్ లా ఇరుపక్షాల అభిప్రాయాలూ తెసుకొని ఒక ఆర్టికల్ రాదాం అని అనుకొనకపోవటమే! స్త్రీల బ్లాగుల్లో మగవారి అప్రూవల్ కోసం చూడరు. అలానే మగవాళ్ళూ స్త్రీల అప్రూవల్ కోసం చూడనక్కరలేదనుకొంటాను.
  3. నా పోస్ట్ లో ఆడవారిని ఎక్కడా కించపరచటం గానీ, తక్కువ చేయటం గానీ చేయలేదు. ఇతరులు వెలిబ్రుచ్చిన అభిప్రాయాలకి వారికి సరైన కారణాలే ఉండాలి. స్త్రీలకి ఏదైనా ఒక వాలిడ్ పాయింట్ ఉండి, తార్కికం గా మాట్లాడేవారెవరైనా ఇక్కడ కామెంట్ పెట్టవచ్చు. కామెంట్ వెరిఫికేషన్ కూడా తీసేశాను.
  4.స్త్రీల గురించి మనమీడియా, చానల్సూ, పేపర్లూ ఇప్పటికే ఎక్కువగానే పట్టించుకొంటున్నాయి. అన్ని పత్రికలలోనూ స్త్రీల గురించి ప్రత్యేక కాలంసూ, శీర్షికలూ ఉంటాయి. అయితే ఇవి వారిమేలు కంటే, వినియోగదారులు గా వారిని దృష్టిలో పెట్టుకొని, వారి మేలు గురించి మాట్లాడే శీర్షికలు.
  ప్రభుత్వాలు వారి వోట్లకు గాలం వేస్తూ నాన్ బెయిలబుల్ చట్టాలను తీసుకొని వస్తున్నాయి. ఎవరో బ్లాగరు చెప్పినట్లు, “భార్య ఒక చిత్తు కాగితం మీద పోలీసులకి చెత్త రాసిస్తే చాలు భర్తని జెయిల్ లో పెట్టటానికి”.

  మెచ్చుకోండి

  1. బొందలపాటి గారు,
   మీరు మగ వారు పెళ్ళి చేసుకోకుడదు అని రాశారు గాని, బదులుగా చట్టబద్దం gaa, ఎవైనా ప్రత్యమన్యా మార్గాలు ఊన్నాయ అనేదని మీద దృష్ట్టి సారించ వలసిన అవసరం ఉంది. నిన్న గొళ్లపూడిగారు మేక్సి కోలో 2సం|| పెళ్లి గురించి రాశారు, కాని ఇప్పుడు సిటిలలో, మూడు నెలలలో పెళ్లిళ్ల భవిషత్ తేలిపోతున్నాది. మన వారికి మేక్సికో మోడల్ సూట్ కాదు. అదేకాక పెళ్ళి చేసుకొన్న, మగవారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా ఎవరైనా చర్చిస్తే బాగుంట్టుంది

   మెచ్చుకోండి

   1. పెళ్ళి చేసుకోబోయే మగవారు పెళ్ళీ గురించిన వారి సాంప్రదాయక అంచనాలను తగ్గించుకొంటే మంచిది. అలానే ఇంటి పనీ వంటపనీ నేర్చుకొనటం బెటర్. రొమాన్స్. సెక్స్ వంటి విషయాలలో ఆడా మగా మధ్య ఉండే బేభాల గురించి కొంచెం సెన్సిటైజ్ అవ్వటం ముఖ్యం. డబ్బు వంటి వాటి ప్రాక్టికల్ ఇంపాటెన్స్ గురించి తెలుసుకోవాలి.. చట్ట బధ్ధమైన ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడటానికి నేను సరైన వాడిని కాను. బ్లాగ్లోకం లోని ఎవరైనా న్యాయవాదులు మాట్లాడితే బగుంటుంది.

    మెచ్చుకోండి

 13. ప్రసాద్ గారూ,
  పాజిటివ్‌గా తీసుకున్నందుకు కృతజ్ఞతలు. బ్లాగుల్లో బూతు సత్కారాలతో కాకుండా కనీసం చర్చ ఈ రకంగా అయినా సాగితే మన అభిప్రాయాలను, దృక్పథాలను మరింత స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా మీ బ్లాగు ఫాలో అవుతున్నాను. కామెంట్ పెట్టినా పెట్టకపోయినా.. మగవాడి కోణం నుంచి మీరు రాసినంత మాత్రన అది తప్పు అయిపోదు కదా. కాని చర్చ మొదట్లోనే దృక్పథాలవైపో, మరి కాస్త ముదిరితే బూతుల వైపో పోకుండా ఉంటే బాగుంటుంది. ప్రతి సందర్భంలోనూ దీన్నే నేను మొత్తుకుంటున్నాను. మీరు బ్లాగ్ నిర్వహిస్తున్న వైఖరి అలాంటి ధోరణిలో లేనందుకు ధన్యవాదాలు.

  స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో తీవ్రమైన పెడధోరణులు చోటు చేసుకున్న కాలమిది. ఆ మాటకొస్తే పెడధోరణులు అనే పదం కూడా వాడటం నేటి పరిస్థితుల్లో మంచిది కాదేమో. పురుషుడి అవకాశాన్ని పురుషుడు, స్త్రీ అవకాశాన్ని స్త్రీ ఉపయోగించుకోవడానికి అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రస్తుత కాలంలో కుటుంబ సంబంధాలు నిజంగానే తలకిందులయిపోతున్నాయి స్వల్పస్తాయిలో అయినా. అదే ఈ రకమైన చర్చలకు కారణం అవుతోందనుకుంటాను.

  బయటి సమాజంతో అన్ని రకాలుగా ఘర్షిస్తున్న పురుషుడు తనదైన, తన స్వంతమైన ఇంట్లో కాస్తంత శాంతి కోసం వెంపర్లాడుతున్నాడనేది చాలా పాత మాటే. కొత్తదేం కాదు. ఆ శాంతి కూడా ఇవ్వాళ కొన్ని తరగతుల జీవితంలో లోపిస్తోంది. పురుషుల కంచుకోటలు అని చెప్బబడుతున్న అన్ని రంగాల్లోనూ స్త్రీలు ప్రవేశించే కొద్దీ, ఆ మేరకు వారిలో స్వేచ్ఛా జీవనం, స్వేచ్ఛా కాంక్ష పెరిగే కొద్దీ స్త్రీపురుష సంబంధాలు, ప్రత్యేకించి భార్యాభర్తల సంబంధాలు తీవ్రంగా ఒడిదుడులకు గురవుతున్నాయి. మగవాడి అవకాశాన్ని స్త్రీ అందిపుచ్చుకోవడం -పురుషుల సహకారంతోనే కావచ్చు- జరిగే క్రమంలోనే కుటుంబ సంబంధాలు పోకూడని మార్గంలో వెళుతూ వ్యక్తి విధ్వంసాలకు దారి తీస్తున్నాయేమో మరి.

  ఇక్కడ నా గతం గురించి చెప్పాలి. దాదాపు ఆరేళ్లపాటు గ్రామసీమల్లో సామాజిక ఉద్యమాల్లో -1991-96 భాగమయ్యాను. గ్రామ జీవితానికి సంబంధించిన మౌలిక సమస్యల పరిష్కారం కోసం, ప్రజలను కదిలించాలని అప్పట్లో మేమెంత ప్రయత్నించినా, మేం పల్లె కెళితే చాలు ఏదో ఒక కుటుంబ గొడవ మాముందుకు వచ్చేది. మనస్పర్థలతో దూరమైన దంపతులు, ఒకే ఇంట్లో ఉండి కూడా మాట్లాడుకోకుండా పరాయితనంలో కూరుకుపోయిన దంపతుల సమస్యలనే ఎక్కువగా గ్రామస్తులు మాముందు పెట్టేవారు. నాకు తెలిసి ఆ అయిదారేళ్ల కాలంలో మేము సంఘం తరపున చేసిన పదుల సంఖ్యలోని దంపతులు సమస్యల కేసుల్లో ఒక్కటంచే ఒక్క సందర్భంలో కూడా మేం సమస్యను విడాకుల వరకూ తీసుకుపోలేదు.

  ఇరువైపులా ఎన్ని మనస్పర్థలు, బాధలూ చెప్పుకున్నప్పటికీ మీకోసం కాకున్నా పిల్లలకోసం మీరు కలిసి ఉండండి అనే చెప్పాము కాని వారిలో ఎవరి వాదంవైపుకూ మేం కొట్టుకుపోలేదు. భారతీయ సమాజానికి, ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి విడాకులు పరిష్కార మార్గం కాదని, పాశ్చాత్య భూమిక మనకు లేదని ఎన్నడూ కూడా భార్యాభర్తలను ఏ కారణంతో అయినా సరే విడదీయవద్దని ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ కలిసే ఉండాలన్ని గ్రామీణ సంప్రదాయాన్ని దాటిపోరాదని మాకు మేముగా గిరి గీసుకున్నాము.

  జీవితంలో ఏ ఒక్క అంశంలోనూ భార్యాభర్తల మధ్య సయోద్య కుదరని పక్షంలో బలవంతంగా కాపురాలు చేయించడం, ఒక ఇంట్లో కట్టి పెట్టి ఉంచడం పరిష్కారం కాదని అనుభవంలో తేలుతున్నప్పటికీ మావంతుగా మేం ఎన్నడూ భార్యా భర్తలను విడదీసే ప్రయత్నం చేయలేదు.

  కానీ ఇప్పుడు పరిస్థితులు బాగా మారుతున్నట్లుంది. ఉమ్మడి కుటుంబ సంస్కృతి పూర్తిగా అంతరిస్తున్న కాలం ఇది. సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కారం చూపించడానికి ఇద్దరినీ కూర్చొబెట్టి తల్లిదండ్రులు, పెద్దలు ప్రయత్నించే కాలం దాదాపుగా అంతరించిపోతోంది.

  రెండుమూడు తరాల వారు ఒక ఇంటిలో కలిసి ఉండే పరిస్థితి పోయి భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే ఉంటున్న స్థితి వచ్చాక భార్య, భర్త అనే రెండు భిన్న వ్యక్తిత్వాలు, ఆహాలు, ఆలోచనారీతుల మధ్య సమన్వయం ఏర్పడటానికి, రాజీ పడడానికి తగిన పరిస్థితులు కుటుంబంలో దూరమవుతున్నాయి. తను చేసే ఏ చర్యనైనా సరే ఇంట్లో ధిక్కరించడం అనే భావననే ఆధునిక పురుషుడు సహించలేక పోతున్నాడు. మహిళలు ఉద్యోగం చేయని కుటుంబాలలో ఇలాంటి ఘర్షణలు తారాస్థాయికి చేరకపోవచ్చు. అలాంటి కుటుంబాల్లో పురుషుడి అహాన్ని సంతృప్తి పరిచే మార్గాలు ఇంకా ఉండవచ్చు. కాని ఉద్యోగం చేస్తున్న, చేయవలసివస్తున్న పరిస్థితుల్లో మహిళ తనను ప్రశ్నించడం, తన చర్యలను వేలెత్తి చూపడం భరించలేని సందర్భంలోనే పురుషుడి అహం ఘోరంగా దెబ్బతింటోందనిపిస్తోంది.

  మీ బ్లాగ్ స్పేస్‌ని నేను ఎక్కువగా తింటున్నానేమో. ముగిస్తాను.

  “భార్య ఒక చిత్తు కాగితం మీద పోలీసులకి చెత్త రాసిస్తే చాలు భర్తని జెయిల్ లో పెట్టటానికి”.

  కొన్ని తరాలుగా సామాజిక ఆర్థిక రంగాల్లో ముందున్న కులాలు వెనుకబడిన కులాల ప్రజలపై ఇలాగే తమ అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించాయి. ఎదురుతిరిగిన వారిని అణిచిఉంచాయి. అలాంటి అన్యాయ అధికారం చలామణీలో ఉన్నంతకాలం, అమలయినంతకాలం ఎవరూ దాన్ని ఖండించలేదు. పేదలపక్షం వహించలేదు. రాజ్యాంగం మేరకు సంక్రమించిన కనీసపాటి హక్కులు పేదలకు రక్షణగా నిలబడుతూ వస్తున్నప్పుడు నిరుపేదలు తమ రక్షణకోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలు దుర్వినియోగమవుతున్నాయి. అంటూ వాదనలు బయలుదేరాయి. ఉద్దేశ పూర్వకంగానే ఈ చట్టం కొన్ని సందర్బాల్లో దుర్వినియోగం అయిన ఘటనలు లేవని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు కదా..

  భర్తపై బార్య కంప్లయింట్ కూడా ఇంతే. ఏ ఆధారమూ లోని భార్య కంప్లయింట్ ఇచ్చినా ఏ పోలీసు స్టేషనూ పట్టించుకునే పరిస్తితులు లేవని మా అనుభవం. ఆమెకు కుటుంబబలం, రాజకీయ బలం, ఆర్థిక బలం వంటివి ఎంతో కొంత తోడయినప్పుడే ఇలాంటి కంప్లయింట్లు కేసులవరకూ పోతున్నాయి. నిజం చెప్పాలంటే భార్యా భర్తలు కేసు పెట్టుకుని స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం సగటు మధ్యతరగతికే కాదు ఏరకంగానూ మంచిది కాదనే నా ప్రగాఢాభిప్రాయం. ఈ సమస్య వారిమధ్యే అంటే స్టేషన్కి బయటే, కోర్టు పరిధికి అవతలే పరిష్కారం కావాలి. కారణాలేవయినా కావచ్చు అలా జరగలేదు.

  120 కోట్ల జనాబాలో 60 వేలమంది దంపతుల సమస్య సముద్రంలో రేణువు వంటిదే కావచ్చు. కాని ఇన్ని వేలమంది నేడు కోర్టు కెక్కారు. స్టేషన్లవరకూ పోయారు. వీటికి అవతల పరిష్కారం దొరక్కే, లేకే, వారు అలా వెళ్లారు. కుటుంబం అనే యూనిట్‌లో ఇద్దరూ ఏ కాస్త తగ్గినా, పట్టువిడువులతో వ్యవహరించినా సమస్య ఈ స్థాయికి వెళ్లదు.

  ఆడది నాకంటే పొడుగ్గా ఉండరాదు. నా కంటే ఎక్కువ వయసు కలిగి ఉండరాదు. నాకంటే ఎక్కువ చదువు చదివి ఉండరాదు. నాకంటే పెద్ద ఉద్యోగం చేయకూడదు. నాకంటే ఎక్కువ తెలివిని ప్రదర్సించకూడదు. ముఖ్యంగా తన స్వేచ్చను నా ముందు బహిర్గతపర్చరాదు. తాగి తందానాలాడినా, కుటుంబ ఆర్థికాన్ని గుల్ల చేసినా సరే.. నా గౌరవానికి లోపం తేకూడదు.

  పురుషుడికి సమాజమూ, సంప్రదాయాలూ ఇలాంటి ఎన్ని పెద్దరికాలు అంటగట్టాయో చూడండి. ఇవ్వాళ ఈ పెద్దరికాల పునాదులే కదిలిపోతున్నాయి. కారణాలేవయినా కావచ్చు. అందుకే యువత పెళ్లి అంటే భయపడుతోందా..

  కుటుంబంలో లేదా బయట ధరించడానికి పది, లేదా ఇరవై, లేదా ముప్పై చీరలూ, ఇతర దుస్తులూ అవసరం అనుకుంటే -ఈ దేశంలో చాలా కుటుంబాలకు సంవత్సరానికి ఒకసారి కూడా కొత్త బట్టలు కొనడానికి కొనుగోలు శక్తి లేదు- ఫరవాలేదు. కాని వందచీరలు, వంద రకాల డ్రెస్‌లూ ఉండి కూడా ఇంకా కొత్త దుస్తుల కోసం షాపుకు పరుగెత్తే స్త్రీల పట్ల ఎలాంటి సానుభూతీ చూపనక్కరలేదు. ఇలాంటి వారు నా దృష్టిలో పక్కా భూస్వాములు, బూర్జువాల కిందే లెక్క. వీళ్లతో వర్గ దృష్టితోనే పోరాడాలి.

  కానీ పైన మనం చర్చించుకుంటున్న స్త్రీపురుషుల సమస్య ఇలాంటిది కాదనే నా అభిప్రాయం. అందుకే కొడవటిగంటి కుటుంబరావు గారు 50 ఏళ్ క్రితమే చెప్పిన ఈ మెరుపు వాక్యం తన ప్రాసంగితకను ఈనాటికీ కోల్పోలేదు.

  “ఈ దేశంలో కొందరు పేదవాళ్లుగా పుడుతున్నారు. మరికొందరు ఆడవాళ్లుగా పుడుతున్నారు.”

  నా అభిప్రాయాలు శాశ్వతం అని అనుకోవడం లేదు. నా అనుభవాలకు భిన్నమైన అనుభవాలు కూడా ప్రపంచంలో ఎక్కువగానే ఉండి ఉండవచ్చు. చర్చకు ఎప్పుడూ నా స్వాగతం.

  మీ బ్లాగును నేను దారుణంగా వాడేస్తున్నాను. ప్రసాద్ గారూ, క్షమించాలి.

  మెచ్చుకోండి

  1. రాజు గారూ,
   భలే వారండీ. you are welcome to use my blog to any extent. మీ వ్యాఖ్యల వలనా, దానిలోని మెరుగైన తెలుగు వలనా, నా టపాలకి శోభ చేకూరుతుంది .
   ఇక పోతే మన ఐ టీ వంటి రంగాలలో పని చేసే స్త్రీలు మీరు బూర్జువా అనే స్త్రీల కంటే పెద్ద భిన్నం గా లేరు. వారు వందల సంఖ్య లో చీరలు కొంటే వీరు పదుల సంఖ్య లో కొంటారు. కాకపోతే వీరికి చీర కట్టుకొనటం సరిగా రాదు. ఏ సంవత్సరానికి ఒక సారో బీరువా నుంచీ పట్టు చీర తీసి, కడతారు. 🙂 just kidding

   మెచ్చుకోండి

  2. “ఆడది నాకంటే పొడుగ్గా ఉండరాదు. నా కంటే ఎక్కువ వయసు కలిగి ఉండరాదు. నాకంటే ఎక్కువ చదువు చదివి ఉండరాదు. నాకంటే పెద్ద ఉద్యోగం చేయకూడదు. నాకంటే ఎక్కువ తెలివిని ప్రదర్సించకూడదు. ముఖ్యంగా తన స్వేచ్చను నా ముందు బహిర్గతపర్చరాదు. తాగి తందానాలాడినా, కుటుంబ ఆర్థికాన్ని గుల్ల చేసినా సరే.. నా గౌరవానికి లోపం తేకూడదు”

   చాలా బాగా చెప్పారండీ. చప్పట్లు. మరి దీనిసంగతేమిటంటారు?

   “మగవాడు నాకన్నా పొడుగ్గా ఉండాలి. నా కన్నా ఎక్కువ, ముఖ్యంగా పక్కింటాయన కన్నా ఎక్కువ సంపాదించాలి. నాకంటే ఎక్కువ స్థాయిలోనే ఉండాలి. నాకన్నా తక్కువ స్థాయివాడిని పెళ్ళిచేసుకోవటం నాకవమానం. నేనెవడితో పబ్బుల్లో తిరిగి తైతక్కలాడినా నోరు మెదపకూడదు”

   మెచ్చుకోండి

 14. శ్రీరామ్ గారూ,
  నా వ్యాఖ్యల్లో ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేయలేదు గదా.. అలా అయితే మీరే నన్ను క్షమించాలి. కాని మీరు ఎత్తి చూపిన నా వ్యాఖ్యలోని “సముద్రంలో రేణువు వంటిదే కావచ్చు” అనేది ఇంత తక్కువ మంది సమస్య కాబట్టి మనం పట్టించుకోనవసరం లేదు అని నేను చెప్పలేదనుకుంటాను. మళ్లీ ఓసారి ఆ వాక్యం సరి చూసుకున్నాను.

  “120 కోట్ల జనాబాలో 60 వేలమంది దంపతుల సమస్య సముద్రంలో రేణువు వంటిదే కావచ్చు. కాని ఇన్ని వేలమంది నేడు కోర్టు కెక్కారు. స్టేషన్లవరకూ పోయారు. వీటికి అవతల పరిష్కారం దొరక్కే, లేకే, వారు అలా వెళ్లారు. కుటుంబం అనే యూనిట్‌లో ఇద్దరూ ఏ కాస్త తగ్గినా, పట్టువిడువులతో వ్యవహరించినా సమస్య ఈ స్థాయికి వెళ్లదు.”

  60 వేలమంది దంపతుల సమస్య కూడా మన 120 కోట్ల జనాభాతో పోలిస్తే పెద్ద సమస్యే అని నా అభిప్రాయం. స్త్రీపురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య అత్యంత సున్నితమైన ఈ సమస్య.. పిల్లల జీవితాలతో, పెద్దల భవిష్యత్తుతో కూడా ముడిపడిన ఈ సమస్య కోర్టువరకు వెళ్లకూడదనేదే నా వ్యాఖ్య సారాంశం. కోర్టుకెళ్లడం అంటే ఒక నిండు నూరేళ్ల బంధం అర్థాంతరంగా చిదిమివేయబడినట్లే. కోర్టులో పరిష్కారం ఎలా లభించినా ఇకపై ఆ దంపతులు కలిసి జీవించడం కల్ల అనే అర్థం.

  మీరు పేర్కొన్న మీ స్నేహితుడి జీవిత విషాద పరిణామంపై మనిషిగా నేను స్పందించాను. సహానుభూతి ప్రకటించాను. వ్యవసాయ జీవితంలోంచి వచ్చిన తనకు ఇలాంటిది జరగకూడదనే నా భావన. కాని ఆ ఇద్దరి సంబంధంలో ఏం జరిగిందనేది రెండువైపుల నుంచి తెలియవలసిన సమాచారం తెలియలేదు. మీరు మీ మిత్రుడి విషాదం పట్ల చలించి వ్యాఖ్య పెట్టారు. మీరు చెప్పిన కోణంలో జరిగిందే పూర్తిగా నిజమై.. అవతలివారు ఆస్తికోసం లేదా ఇతర ప్రయోజనాలకోసం అలా జీవితబంధాన్ని తెంచుకుని పోయారు అనేదే నిజమైతే అది అన్యాయమని, దారుణమని చెప్పడానికి నాకే మొహమాటమూ లేదు. అలాంటి నష్టమే మీ మిత్రుడికి జరిగిఉంటే తనకు సానుభూతేకాక నా పూర్తి మద్దతు కూడా ప్రకటిస్తాను.

  పాశ్చాత్య దేశాలలో ఇలాంటివే జరిగితే ఏ సెంటిమెంట్లకూ తావులేకుండా స్త్రీపురుషులు దులుపుకుని పోతున్నారు. వారిమధ్య ఎలాంటి భావోద్వేగాలూ చోటు చేసుకోవేమో.. నాన్న ఉన్నా అమ్మ ఉన్నా లేక ఒకరు ఉండి ఒకరు లేకున్నా లేదా ఇద్దరూ లేకున్నా ఒంటికి కాస్త కండరాగానే విదేశీ పిల్లలు తమ బతుకు తామూ, తమ దారి తామూ చూసుకుంటున్నారు కాబట్టి బతకగలుగుతున్నారు కాబట్టి ఇది వారిలో ఎవరికీ సమస్య కాకపోవచ్చు.

  కాని మన దేశంలో ఇద్దరు వ్యక్తుల కలయిక ద్వారా పుడుతున్న పిల్లలు కనీసం 20 ఏళ్లు కుటుంబం నీడలోనే బతకాల్సిన పరిస్థితి మెజారిటీ కుటుంబాల్లో ఈనాటికీ ఉనికిలో ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ భార్య కేమవుతుంది లేదా ఆ భర్తకేమవుతుంది అనే కోణాన్ని మాత్రమే కాకుండా వారి పిల్లలకేమవుతుంది అనే కోణానికే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.

  అందుకే మేం అన్నేళ్లు గ్రామాల్లో పనిచేస్తూ డజన్లకొద్దీ కుటుంబ సమస్యలను చేపట్టినా విడిపోవడం అనే మాటకు తావు లేకుండా నూటికి 99 శాతం వరకూ ఇద్దరికీ సర్దిచెబుతూ వచ్చాము. ఒకరి గౌరవాన్ని ఒకరు కించపర్చుకున్నా ఇద్దరినీ మందలించాము తప్పితే ఒకరిని పైకెత్తి, ఒకరిని కింద పెట్టన పాపాన పోలేదు. మాకు తెలిసి అలా మేం కలిపిన దంపతులు ఎవరూ కూడా తర్వాత విడిపోలేదు. ఘర్షణలున్నా సర్దుబాటు చేసుకుంటూ బతికారు. స్త్రీపురుషుల సంబంధాలు సమస్యలకు సంబందించి ఆనాటి ఉద్యమ జీవితం మాలాంటివారికి ఒక పెద్ద ప్రయోగ శాల.

  ఆలాగని ఎట్టిపరిస్తితుల్లోనూ విడాకులు వద్దు అని చెప్పడానికీలేదు. వైరుధ్యాన్ని అంత తీవ్రస్తాయికి తీసుకుపోకుండా భార్యాభర్తల ఐక్యతే ప్రధానంగా భావించినప్పుడు ప్రజాకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా సరే దంపతులను కలపడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మన దేశ సామాజిక, సాంస్కృతికి పరిస్థిత్తుల్లో ఈనాటికీ ఇదే అర్థవంతమైన పరిష్కారమనే నా అభిప్రాయం.

  ఆదిలక్ష్మిగారి కుటుంబ సమస్యకు సంబందించి నా స్పందనకు కూడా నేపధ్యం ఇదే. ఏ కుటుంబానికి కలగకూడనంత దారుణం ఆమె విషయంలో జరిగిపోయింది. ఆమె మనిషి. తర్వాతే ఆమె ఇజాలూ, వాదాలు, దృక్పధాలూ ఏవైనా పరిశీలనకొస్తాయి. ఆమెను వ్యక్తిగా అభిమానిస్తున్నవారు ఇంతమందిమి ఉండి కూడా సకాలంలో ఏమీ చేయలేకపోయాం. వరుసగా దారుణాలు జరుగకుండా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయాం. ఇక జీవిత కాలం నన్ను బాధించేది ఇదే.

  శ్రీరామ్ గారూ, మీ గురించి నాకు తెలియకపోయినా మీరు నా బ్లాగు చదివారు. కృతజ్ఞతలు. ప్రసాద్ గారి బ్లాగ్ పుణ్యమా అని మనం ఒక చర్చలో భాగమయ్యాం. ఎవరినీ ఎవరూ నొప్పించుకోకుండా, ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్‌పై చర్చలలో భవిష్యత్తులో కూడా పాలుపంచుకుందాము. ఒకరినుంచి ఒకరం నేర్చుకుందాం. తెలుసుకుందాం. అందుకే నా అభిప్రాయమే శాశ్వతమని, సరైందని నేనెన్నటికీ అనుకోను. మరోసారి మీకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

  1. రాజు గారు,
   హర్ట్ చేయలేదు, చేయదు. నేట్ లో చర్చలను ఒక పరిదికి మించి సీరియస్ గా తీసుకోకుడదు.ఒక్కొక్కరిది ఒక్కోక్క బాక్ గ్రౌండ్ ఉంట్టుంది. మీరు రాసినవి గ్రామీణ,పట్టణాలలో ఉండే మధ్యతరగతి వారి గురించి. స్వతహాగా నాకు చదవటం ఇష్ట్టం. రాయటం కష్ట్టం. మన బ్లాగులలో వాతావరణం వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఎప్పుడైన మాలికను తెరిస్తే 1970-1980 సం|| వాతావరణం కనిపిస్తుంది.ఆరోజుల్లో ఉండే ఆలోచనావిధానమే ఇప్పటికి ఉంది. కొందరు తెలుగు పద్యాలు,తెలుసు సాహిత్యం,దేవుడి గురించి, సినేమాలు వాటిపైన రివ్యులు, తెలంగాణా, స్రీవాదం, రాజకీయాల మీదా ఇలా అంతాఇలాంటి విషయాల మీద రాస్తూంటారు. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను గురించి ఒక్కరు నోరు మెదపరు. భారతీయ జనతా పార్టి ఇండియా షైనింగ్ నినాదం లాగా. వీరికి ప్రపంచం అంతా బాగుంది. వాస్తవానికి గత 15సం|| వచ్చిన అనూహ్యమైన మార్పుల వలన దాని ద్వారా లాభ పడ్డ vaaru పాత ఇండియాని బ్లాగులోకి తిసుకొచ్చి పండగలు చేస్తున్నారనిపిస్తుంది. కాని వాస్తవిక ప్రపంచం ఎంతో మార్పు చెందింది. దానిని వయసులో ఎంతో పెద్దలైన గొల్లపూడి లాంటివారు గ్రహించినంతగా ప్రస్తుత తరం వారు గ్రహించటంలేదని పిస్తున్నాది. అసలికి మనుషులను ప్రభావితం చేసేది వాదాలు, ఇజాలు కాదు కుటుంబం మాత్రమే. కుటుంబమనే చిన్న యునిట్ కి కీలక వ్యక్తి మొగుడు, మగవాడు. అతని పరిస్థితి రోజు రోజుకు దిగజారు తున్నాది గనుక చర్చలో పాల్గొనటం జరిగింది. ఇక నాగురించి మీకు చెప్పలి అంటె నా ఏకైక ఇంట్రేస్ట్ రామకృష్ణ పరమహంస కథామృతం పుస్తకం చదవటం , ఉప్పలురి గోపాలకృష్ణముర్తి (యు.జి.)పుస్తకాలు చదవటం. యు జి గారు రచయిత గుడిపాటి వెంకటాచలానికి బందువు.

   మెచ్చుకోండి

   1. “మన బ్లాగులలో వాతావరణం వాస్తవానికి దగ్గరగా ఉండదు.
    కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను గురించి ఒక్కరు నోరు మెదపరు.
    గత 15సం|| వచ్చిన అనూహ్యమైన మార్పుల వలన దాని ద్వారా లాభ పడ్డ vaaru పాత ఇండియాని బ్లాగులోకి తిసుకొచ్చి పండగలు చేస్తున్నారనిపిస్తుంది.
    వాస్తవిక ప్రపంచం ఎంతో మార్పు చెందింది. దానిని వయసులో ఎంతో పెద్దలైన గొల్లపూడి లాంటివారు గ్రహించినంతగా ప్రస్తుత తరం వారు గ్రహించటంలేదని పిస్తున్నాది.”
    మనుషులను ప్రభావితం చేసేది వాదాలు, ఇజాలు కాదు కుటుంబం మాత్రమే. కుటుంబమనే చిన్న యునిట్ కి కీలక వ్యక్తి మొగుడు, మగవాడు. అతని పరిస్థితి రోజు రోజుకు దిగజారు తున్నాది గనుక చర్చలో పాల్గొనటం జరిగింది.

    సరిగ్గా ఈ విషయాలపైనే మీ అభిప్రాయాలను రాసి ప్రచురించండి. మీరు బలంగా నమ్ముతున్నారు కాబట్టి వీటిని అక్షరాల్లో మరింత వివరంగా రాయండి. కుటుంబం ఎలా ఉండేదో ఎందుకిలా మారుతోందో, ఎలా ఉంటే బాగుంటుందో కూడా వివరిస్తూ మీ కోణంలో తప్పక రాయండి. మారుతున్న కుటుంబ విలువలుపై రాయడం కంటే మంచి టాపిక్ ఏముంటుంది కనుక. మంచి కుటుంబం కోసం అభిప్రాయాలను తప్పక పంచుకుందాము. మీరు రాసి ప్రచురించిన తర్వాత నాకూ ఆ కథనం లింకు పంపండి. నా చందమామలు బ్లాగు జల్లెడ. ఆర్గ్ వారి సైట్ అప్‌డేషన్‌లో బాగంగా కనిపించడం లేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. వచ్చాక మీ బ్లాగు లింకును కూడా దాంట్లో ఉంచుతాను. ఇప్పటికయితే నా జీమెయిల్ ఐడీ, నా మరో బ్లాగును భద్రపర్చుకోండి.

    krajasekhara@gmail.com

    kanthisena.blogspot.com

    మెచ్చుకోండి

 15. లలితగారూ,
  కుటుంబ వ్యవస్థకు సంబంధించి మగకోణంపై జరుగుతున్న ఈ చర్చలో మీరు పాల్గొనడం మా అందరికీ గౌరవంగా భావిస్తున్నాను.

  “ఈ చర్చలు ఉక్రోషం తెప్పిస్తున్నా, ముఖ్యంగా వ్యాఖ్యలు చూసినప్పుడల్లా ఎక్కువ భాగం ఇవే కనిపిస్తుండడం వల్ల. కానీ పాల్గొనాలనిపించలేదు.”
  “ప్రస్తుత పరిస్థితిని అనుభవిస్తున్న ఎన్నో రెట్ల ఎక్కువ సమస్య ఉన్న బాధితుల గురించి ఏం చెయ్యాలంటారు మరి?”
  “ఎవరి మనసుతో వారు ఆలోచించుకుని తీసుకునే నిర్ణయాలని ఇంకొకరు గౌరవించలేరు అని మాత్రం తెలుస్తోంది.”
  “మగ వాళ్ళ point of view ఉండాల్సిందే. ఆడ వాళ్ళ point of view ఉండాల్సిందే. ఐతే రెండూ సమాంతరంగా ఒక దానిని ఒకటి ఎక్కడా కలుసుకోకుండా ఉండడం అన్నదే కదూ ప్రధాన సమస్య ఇక్కడ.”

  చిన్న వాక్యాలలో అయినా సరే చాలా మంచి విషయాలను మీరు లేవనెత్తారు. మగకోణంగా భావించబడుతున్న ఈ కథనంపైని వివిధ అభిప్రాయాలను పరిశీలిస్తుంటే మధ్యతరగతి కుటుంబాలలో యువకుల జీవితాలు, వారి ఆకాంక్షలు, సమస్యలు, పెళ్లి అనే భావన పట్లే వారి వ్యతిరేకత వంటివి ఒక కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుందనిపిస్తోంది. పెళ్లి సరైన బాంధవ్యరూపం కాదనుకుంటూ వీరు ప్రస్తావిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు సమగ్రరూపంలో లేవు. పెళ్లి లేకుండా జీవించడం అనే సమస్యను భవిష్యత్ సమాజాల ఆచరణకే వదిలేయవలసి ఉంటుంది.

  పెళ్లి యువకులకు ప్రతిబంధకంలా ఉంటోందన్నప్పుడు యువతులకు కూడా అది కొద్దో గొప్పో ప్రతిబంధకంలాగే ఉంటుంది. అది స్త్రీకోణం ఆవిష్కరించబడితే తప్ప ఇక్కడ బయటపడదు. ప్రస్తుత రూపంలో పెళ్లి, వివాహ బంధం అనేది సరైన రూపంలో లేదు అనుకుంటే అది స్త్రీపురుషులిరువురికీ కూడా మంచి కలిగించే రూపంలోకి మారడమే ఈ సమస్యకు పరిష్కారం. మానవ సమాజం వివాహ రహిత సంబంధాలను మౌలికంగా ఆమోదించే దశకు పరిణమించినప్పుడు ఆ మార్పును కాదనడానికి మనమెవ్వరం చెప్పండి. కాకపోతే ఇప్పటికంటే మెరుగైన రూపంలో మాత్రమే ఆ మార్పు ఉండాలని కోరుకుందాం.

  అనూహ్యంగా మీరు ఈ చర్చలోకి వచ్చారు. మహిళగా మీ అభిప్రాయం చెప్పారు. దాన్ని తప్పక గౌరవిస్తాము. గౌరవించాలి కూడా..

  మరోసారి మీకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

  1. “పెళ్లి సరైన బాంధవ్యరూపం కాదనుకుంటూ వీరు ప్రస్తావిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు సమగ్రరూపంలో లేవు.”
   అంగీకరిస్తాను. ముఖ్యం గా పిల్లల విషయం లో.
   “కాకపోతే ఇప్పటికంటే మెరుగైన రూపంలో మాత్రమే ఆ మార్పు ఉండాలని కోరుకుందాం.”
   మెరుగు గా ఉండవు. ప్రస్తుత నాగరికత తీసుకువచ్చే మార్పులు చాలా వరకూ నాసిరకం వే. నమ్మకం పునాది గా నిర్మించుకొన్న వ్యవస్థలు (ఒకప్పటి గ్రామీణ జీవిత వ్యవస్థలు) ఎప్పుడైతే కూలిపోయాయో అప్పుడే మన పతనం మొదలైంది.

   మెచ్చుకోండి

 16. “…నేనెవడితో పబ్బుల్లో తిరిగి తైతక్క లాడినా నోరు మెదపకూడదు..”
  Just out of curiosity…..

  పబ్బుల్లో తిరిగి తైతక్కలాడే స్త్రీలంటే దాదాపు ఇరవై ముప్పై యేళ్ళ మధ్య వయసుండి, కొంచెం మంచి చదువూ, డబ్బులొచ్చే ఉద్యోగమూ వుండి పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళై వుండాలి. మీకు తెలిసిన స్త్రీలలో ఎంత శాతం స్త్రీలు ఈ కోవకు చెందుతారు? Just a guesstimate is sufficient.

  అలాగే బ్లాగుల్లో కూడా, “అతివాద మిలిటెంటు ధోరణి వున్న స్త్రీ వాద బ్లాగులు” ఎన్ని వుండి వుంటాయి?

  “… నాకంటే పొడుగ్గా వుండాలి, నాకంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి..”
  ఇలాటి కోరికలకి మూలమేంటో ఎవరికైనా అయిడియా వుందా?

  శారద

  మెచ్చుకోండి

 17. సరిగ్గా అనుకున్నట్టే అడిగారు. తప్పకుండా సమాధానం చెప్తా. కానీ ముందు మీకు ఒక ప్రశ్న.

  భర్త భార్యని రాచి రంపాన పెడుతూ, హింసిస్తూ ఉండగా మీరెన్నిసార్లు చూశారు? Just a guesstimate is sufficient.

  నా సమాధానం.

  1. నేను పెరిగిన ఏరియాలో 25% పైనే ఉన్నారు
  2. అలాంటి కోరికలకు మూలం పురుషుడు మాత్రం కాదు.

  మెచ్చుకోండి

  1. మీకు రెంటాల కల్పన గారి తూర్పు పడమర బ్లాగు గురించి తెలియదా! ఆబ్లాగులో ఈ క్రింది వ్యాసం, ఇంకా రెండు వ్యాసాలు చదివిన తరువాత చికాకు వేసింది. ఎప్పటి ఆలోచనా విధానం ఆవిడది. ఇటువంటి రచయితలు ఎన్ని రోజులు ఈ విధంగా రాస్తారో చూద్దం!
   http://kalpanarentala.blogspot.com/2011/07/blog-post_21.html

   మెచ్చుకోండి

   1. పురాణ పురుషులనీ, స్త్రీలనీ, అప్పటి లోకాన్నీ ఇప్పటి విలువల త్రాసులో తూచటం నాకు సరైనది అనిపించదు. ఇప్పటికీ అప్పటికీ ఏవైనా ఉమ్మడి మరియూ సార్వజనీన మైన విలువలు ఉంటే, ఆ విలువలతో వారిని అంచనా వేయాలి.

    మెచ్చుకోండి

    1. పురాణ ఘట్టాల్ని ఇప్పటి విలువలతో చూచడం సరైనదికాదన్న అభిప్రాయమేనాదీను. మరి సాములార్లందరూ అదే పురాణాల్లోని విలువలు తు.చ. తప్పకుండా ఆచరించాలనీ, అలా ఆచరించకపోతే నరకానికి పోతామనీ అన్నప్పుడు ఇలా అది సరికాదంటూ ఎందుకు చెప్పరు?

     మెచ్చుకోండి

  2. ఏమిటీ!!! జాజి గారి బ్లాగు పురుష ద్వేషి బ్లాగా??? మరి అక్కడ ఎక్కువగా పురుషులే ఎ౦దుకు మెచ్చుకు౦టు చర్చిస్తారు. టై౦పాస్ కోసం చదివే పురుషులకు పెద్దగ అక్కడ విష్యం కనిపి౦చకపోవచ్చు. ఆ విధం గా అయితే నిజమే అనుకో౦డి 🙂

   బొ౦దలపాటి గారు, మీ పురుషులు చేసే ఆరోపణలు ఇలా ఉ౦టాయ౦డీ 🙂

   మెచ్చుకోండి

   1. @ మౌళి ,

    మీకొక ప్రశ్న మగవారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? దాని వలన కలిగే లాభాలు ఎమీటీ? అని ఒకటపా/వ్యాఖ్య బాగా ఆలోచించి సమాధానం రాయండి.

    మెచ్చుకోండి

    1. 1) మగాళ్లకి తమ వంశాన్ని (వంశం మగాళ్లదే ఆడవాళ్లది కాదుమరి) కొనసాగించాలని ఉంటుంది.
     2) Sex (marriage guarantees sex for men)

     Basically, these I think are the prime reasons why men want to get married. But out of hypocracy they say love/dharmam atc…

     There are a different reasons why girls want to get married
     1) protection (financial, secure life etc…)

     మెచ్చుకోండి

     1. @viseshajna,

      ఈరోజుల్లో వంశాల గురించి ఫీలవుతున్న మగాళ్ళు ఎందరండీ. శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్టు శతకోటి వంశాల్లో బోడి వంశాలు. వంశాలు నిలబడకపోతే పితృదేవతలకి గతులు లేవని, అవనీ, ఇవనీ ఈ పెళ్ళి మగాళ్ళ నెత్తికి రుద్దారు. వంశం నిలపటానికే పెళ్ళిళ్ళైతే ఈరోజు సమాజంలో పెద్దసంఖ్యలో మగాళ్ళు నిక్షేపంగా మానేస్తారు.

      సెక్స్ గ్యారంటీకి పెళ్ళి అంటున్నారు. నా బొంద గ్యారంటీ, ఈ రోజుల్లో ఇళ్ళలో ఆడాళ్ళ కోరికలు తీర్చే రేసులో అలిసిపోతున్న మగాళ్ళకి ముప్పైఏళ్ళకే నీరసాలు, విరక్తి. త్వరలో దాన్ని హక్కుగా కోరుకోటమూ రేప్ కిందకి మార్చేపనిలో మన వీరస్త్రీవాదులు బిజీగా ఉన్నారు. ఐనా ఇది మగాళ్ళకి కలిగించిన పెద్ద భ్రమ. ఈ బ్లాగర్ రాసింది అదే. ఆడవాళ్ళని మూసిపెట్టి, పెళ్ళికి బైట ఏదీ దొరకకుండా చేసి, సెక్స్‌కి/తోడుకి డిమాండ్ కల్పించి, మగాళ్ళకి వేరే దారి లేకుండా చేసి పెళ్ళిలోకి దించారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, పెళ్ళి చేస్కుని పార్ట్‌నర్కి కమిటై ప్రమాణాలు చేసేసిన వాళ్ళు ఇక ఏం చేయలేక మూస్కుని కూర్చున్నారు కానీ, ఏ కమిట్‍మెంట్ పెట్టుకోకుండా తిరుగుదామంటే కావలసినంత దొరుకుతుంది బైట.

      మీలెక్క ప్రకారం మగాళ్ళకి కావల్సింది సెక్స్ మాత్రమే ఐతే దానికి తాత్కాలికమైన ఏ ఏర్పాటులోనైనా దొరుకుతుంది. కానీ ఆడవాళ్ళు కోరుకునే రక్షణ, ఫైనాషియల్, లైఫ్ సెక్యూరిటీ లాంటివి లాంగ్‍టర్మ్ రిలేషన్లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి పెళ్ళి ఆడవాళ్ళకి కావల్సిన, వాళ్ళకోసం డిజైన్ చేయబడిందే కానీ దాంట్లో మగాడికి ఏమీ లేదు(ఇప్పటి పరిస్థితుల్లో), ఉత్త భ్రమలు తప్ప.

      మెచ్చుకోండి

      1. మీరస్సలు తెలుగు సినిమాలు చూడరనుకుంటాను 🙂

       వంశాలమీదుగానే సినిమాలు నడుస్తున్న కాలంలో వంశాల్ని తృణీకరించడం సబబుకాదు. బాబూ ‘నా వంశం నాతో అంతమైతుందే’ అన్న ఆవేదన నా తెలుగు మిత్రుల్లో చూశాకే ఈ మాటంటున్నాను. Bye the way… r u living Arctic my friend??

       మీరు చెప్పిన వీర స్త్రీవాదుల వీరవిహారాలు మహా ఉంటే ఒక పాతికశాతం మగాళ్ళకి వర్తిస్తాయ్. మీరు మీ ప్రపంచాన్నే ప్రపంచమనుకోకండి. పల్లెలకు రండి. పట్టణాల్లోకూడా gated communities, villas వదలండి.

       తాత్కాలికమైన యేర్పాటు. అలాంటి ఎన్ని ఏర్పాట్లను ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో నిస్సంకోచంగా పంచుకోగలడు? Dude!! Indian society had taken an about turn after the advent of Catholicism. Sex, which was prevalent in Indian scriptures (viz. Ramayana and Mahabharatha etc…) had become a taboo. భావజాలపు ఇసుకలో తలదూర్చకండి సారూ.. నిజాలు వెదకండి.

       మనుధర్మ ప్రభావిత సంస్కృతి in entirety has been against women. And that is a part of Indian/majorly-Hindu culture (no matter how much we extol the valor of the female goddesses, we had failed to refrain from sexual description/depiction of them in our scriptures (for example Sankara Charya in his hymn describes the pubic hair of Goddess Lalitha).

       మెచ్చుకోండి

       1. మీ స్థాయికి మీరు తెలుగు సినిమా లని కోట్ చెయ్యటం నవ్వు తెప్పిస్తోంది. తెలుగు సినిమాలను ఎవరూ పట్టించుకోరు.ఎదో అలాంటి డయలాగులు పెడితే కాసిని కాసులు రాలతాయనే భ్రమ లో ఉన్నారు.. ఇప్పుడిప్పుడే ఆ భ్రమ నుంచీ బయట పడుతున్నారు డైరెక్టర్లూ గట్రా.
        శంకరాచార్యులు చేశారో లేదొ నాకు తెలియదు..ఒక వేళ చేసినా ఆ కాలం లో తప్పయి ఉండదు..అప్పటికి విక్టోరియన్ మొరాలిటీ…ముస్లిం దాపరికం ఇంకా వేల్లూనుకోలేదనుకొంటా..ఆయన వర్నించినా భక్తి తోనే కొలిచి ఉంటారు…లింగాన్ని భక్తి తో కొలిచినట్లు..దానిని ఈ రోజులకి వర్తింపచేయటం ఎందుకు?సాముల మాటలు విని నవ్వుకోవటమే..వాటి లో ఖనిడించాల్సినంత లేదు.. పాపం సాములు.. వారి మాటలు ఎవరు వింటున్నారు..ఇవాళా రేపు..డబ్బు తిప్పుతుంటే లోకాన్ని.

        మెచ్చుకోండి

        1. రియాలిటీ వీడి ఆదర్శవాదంలోకెలా వచ్చిపడ్డారు మీరు?

         వంశాల (ఓ రకంగా కులాల) ప్రస్తావన లేకుండానే రాజకీయాలు సాగుతున్నాయా? వదిలెయ్యండా విషయం. నెహ్రూ వ్గంశం గురించి మాట్లాడండి…

         మీరు నన్ను నా ‘స్థాయి’ గురించి మంచిగానే ప్రశ్నించారు. ఈ ‘స్థాయి’ మాయలో పడి మిమ్మల్ని మీరు reality అనబడే నిజాన్నుంచి దూరంచేసుకోవడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంచి.

         శంకరాచార్యుడు చేశాడు. నేను భక్తితో నా పక్కింటోడి పెళ్ళాం తొడలని వర్ణిస్తే నా తల తెగుతుందా తెగదా? అసలందుక్కాదూ హిందువులు హుస్సేన్ను ద్వేషించింది?

         డబ్బొక్కటే ప్రపంచాన్ని శాశించడంలేదు friend, It’s complicated. ఏంత డబ్బిచ్చినా ఒకడు తన పెళ్ళాన్ని ఇంకొకడితో పండబెట్టి, దాన్ని పబ్లిగ్గా ఒప్పుకోడు.

         మెచ్చుకోండి

         1. నేను అర్కటిక్‍లో, అంటార్కటికాలోనూ లేనండి, తెలుగు సమాజం మధ్యలోనే ఉన్నాను. ఇంకా తెలుగు సినిమాలు లక్షణంగా చూస్తాను. కాకపోతే దాన్లో విషయాలు తెలుగు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని భ్రమపడను. ఏదో నవ్వుకోటానికి చూస్తాను అప్పుడప్పుడు అంతే.

          మీరంటున్న నా వంశం అంతరించిపోతుంది టైపు మగాళ్ళశాతం తగ్గిపోయి చాలా కాలమైంది సార్. మీ సర్కిల్‍నే తెలుగు సమాజం అనుకోకండి :-). అలా బాధపడేవాళ్ళలో కూడా చాలాశాతం ఇంట్లో పెద్దవాళ్ళ, బంధువుల గోల తప్ప, సొంతంగా ఏమీ ఉండదు. ఇద్దరూ ఆడపిల్లల్ని కని కూల్‍గా ఉన్న కుటుంభాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. సినిమాల్లో వంశాల గోల అంతా వారసుల్ని ప్రమోట్ చేస్కోటానికి, మిగతా జనాభాకి వాళ్ళలా వంశం లింక్‍తో వారసులకి ఇచ్చేది ఏముండదు. వంశాలైనా కులాలైనా అన్నిటికీ కుటుంబ వ్యవస్థే మూలం, అది బీటలువారాక ఇవన్నీ మెల్లగా పోకతప్పదు.

          తాత్కాలిక ఏర్పాట్లని తల్లిదండ్రలతో పంచుకోవల్సన అవసరం ఏముంది. ఇప్పుడు ఎంతమంది మగాళ్ళు పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నారు. పేరెంట్స్ పల్లెల్లో, పిల్లల కాపురాలు పట్నాల్లో. లేదా పేరెంట్స్ పట్నాల్లో, పిల్లలు సిటీల్లో. పెళ్ళైనా పేరెంట్స్‌కి దూరంగానే, కాకపోయినా వేరుగానే. వెస్ట్‌లో జరిగినట్టే ఇక్కడా జరుగబోతుంది. ఆడవాళ్ళ హక్కుల విషయంలో మాత్రం వెస్ట్‌ని మక్కికిమక్కీ కాపీ కొట్టి, అక్కడలా లివిన్ ఆప్షన్ మాత్రం మగాళ్ళకి వదలకుండా పెళ్ళిలోనే బిగించాలని ఇక్కడి స్త్రీవాదుల ప్లాన్. They want best of both worlds.

          Catholic సమాజాలే మారిపోగాలేనిది, ఒకప్పుడు కామాన్ని సెలెబ్రేట్ చేస్కుని, ఇప్పుడు catholic మొరాలిటీస్ అలవాటు చేస్కుని జీర్ణించుకోలేక సతమతమవుతున్న మన సమాజం మారలేదా. ఖచ్చితంగా మారగలదు, ఆ అవసరాన్ని ఎక్కువమంది ఫీల్ ఐనప్పుడు. మనుషుల్ని ఒక చట్రంలో పెట్టి ఊపిరాడకుండా చేసే మొరాలిటీస్ ఏవైనా వాటిని తన్నిపారేయక తప్పదు, అది వివాహ వ్యవస్థ ఐనా, మనుస్మృతి ఐనా సరే.

          మెచ్చుకోండి

          1. “నా వంశం అంతరించిపోతుంది టైపు మగాళ్ళశాతం తగ్గిపోయి చాలా కాలమైంది సార్.”

           నిజ్జంగా… మీరన్న ‘ఇది’ చదువులు చదివాం అనుకుంటున్న software కుర్రాళ్ళలో కనిపిస్తుంది. అలాగని వాళ్ళేమీ మీరనుకున్నట్లుగా తమ తల్లిదండ్రుల influenceకి బయట లేరు సుమండీ! నా మిత్రుడొకరు తన ‘బీటలు వారిన కుటుంబ వ్యవస్థ’ రాజ్యమేలుతున్న ఈ కాలంలోనే తన కొడుకు ఫుటువాలను తీయడానికి అడ్డుచెప్పిన తనకు ‘దూరంగా ఉంటున్న పేరెంట్స్’ని కాదని చెప్పే సాహసం చెయ్యలేకపోయాడు – అతను softwareజీవే సుమండీ. ఇదే వ్యక్తికి అప్పుడే పుట్టిన కూతిరి ఫుటువాలు పంపడం పెద్ద విషయం కాలేదు మరి. మన సౌతీల్లో ఒక్క పుత్రరత్నాన్నైనా కలిపడెయ్యాలన్న ఆవేశాం చాలామందిలో చూశాను – Thanks to our renowned holy-men. ‘అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గ్లో నైవచా నైవచా’ అన్నదాన్ని DNAలో లిఖించుకున్న జాతి మనది. మీరనుకున్నంతగా westernize అవ్వలేదు మనం. ఇప్పతికీ కుతుంబ వ్యవహారాల్లో పచ్చి మనువాదమే రాజ్యమేలుతోంది.

           అయ్యా/అమ్మా ఇది తరతరాల జాడ్యం. ఇది అంత తొందరగా వదిలేది కాదు. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా? వారినుండి ఎంతదూరంలో ఉంటున్నారు? అన్నవి ఇక్కడ విషయాలే కాదు. కొన్న Audi కారును గుడికి తీసుకెళ్ళి పూజలుచేయించే రోజుల్లో ఉన్నాం మనం.

           మెచ్చుకోండి

     2. 1. Marriage does not guaranty sex to men In india. 30% of indian females are frigid. In the rest 70%, many deny sex out of lack of harmony etc.

      Don’t women need sex? Are they non physical? You know men mainly look for sex in marriage, and women don’t look for sex in marriage. Then why do you go for marriage and bluff men, while your priorities are not in sync.
      In india Men are loosing everything as time prgresses. Are women loosing anything? Why don’t women understand the pain of loosing?

      మెచ్చుకోండి

       1. Talk about indian reality…if its known priorly that a girl(or a boy) indulges in premarital sex with random folks, still in these liberated times, its unlikely that the other party ignores that proceeds to marry her (him).
        Premarital sex is still socially risky for both girls and boys in majority of middle class families. Thats why its a hush hush affair.

        Ok..the numer of boyz and girls is nearly equal. Your argument implies one cute boy lays multiple girls. Many non-cute boys do not get girls.
        So, many girls have to share a cute boy…laughable…and do girls don’t mind this sharing..or time slicing?

        I know some girls who sleep with not-so cute boys. There are some boys who deny going with ugly girls.
        Boys who insist on emotional intimacy before going ahead are not rare

        మెచ్చుకోండి

        1. “Ok..the numer of boyz and girls is nearly equal. Your argument implies one cute boy lays multiple girls. Many non-cute boys do not get girls.
         So, many girls have to share a cute boy…laughable…and do girls don’t mind this sharing..or time slicing?”

         Welcome to reality!! I myself couldn’t have expressed it in a nicer fashion like you. Yop. You are allowed to consider The Truth laughable. 🙂

         “I know some girls who sleep with not-so cute boys.”

         Well beauty is skin deep isn’t it? I myself wouldn’t if the girl is a quadriplegic provided the girl is an intellectual.

         “There are some boys who deny going with ugly girls.
         Boys who insist on emotional intimacy before going ahead are not rare”

         True. But unlike in your argument, they are rare -or simply gay.

         మెచ్చుకోండి

 18. “భార్యలని హింసించే భర్తలు..”
  కిందటి తరంలో చాలానే చూసాను. ఈ తరంలో తక్కువయ్యాయి, ముందు ముందు ఇంకా తక్కువవుతాయి. ఎందుకంటే ఎవల్యూషన్లో మనం “వ్యవస్థ కంటే వ్యక్తి బలవంతుడవటం” అనే పాయింటు దగ్గరకొచ్చి నిలబడ్డాం కాబట్టి.
  నేను చెప్పదల్చుకున్నది వీలైనంత క్లుప్తంగా, క్లియర్ గా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
  “ఆడవాళ్ళూ మగవాళ్ళు శతృవులు కారు, శతృభావనతో బ్రతకలేరు. They are designed to live together. సమస్యలు ఎక్కడొస్తున్నాయంటే “ఆ కలిసి బ్రతకటంలో ఒకరికేం కావాలో ఇంకొకరికి అర్ధం కావటం లేదు.”
  స్థూలంగా చెప్పాలంటే men and women are hard wired to look for different things in relation ships. They are neither good nor bad, they are just made that way, to contribute to the juvenile care. Man looks for a potential mate who can produce healthy offspring. Woman looks for a potential mate who can “support” her in juvenile care. అందుకే స్త్రీలు ఉద్యోగ భద్రతా, హోదా మొదలైనవి చూస్తారు, పురుషులు అంద చందాలకు ప్రాధాన్యత ఇస్తారు. It is just the way nature made us to ensure healthy species. Women are driven by “security”- physical, financial and social, men are driven by “physical aspects”, “nurturing” and “for someone who can look after”. I repeat, it is nothing to do with good or bad.
  అంతే తప్ప, ఆడవాళ్ళూ చెడ్డవాళ్ళు కాదూ, మగవాళ్ళూ చెడ్డవాళ్ళు కాదు. కుటుంబ సంబంధాల్లో మనకేం కావాలో, అవతలి వ్యక్తికేం కావాలో కొంచెం సమ్యమనమూ సమయస్ఫూర్తి తోటి అర్ధం చేసుకుని వ్యవహరిస్తే చాలు. ఎవరూ వ్యక్తిత్వాలు చంపుకోనక్కర్లేదు, అవతలి వ్యక్తిని కీలు బొమ్మనీ చేయాల్సిన అవసరమూ లేదు.
  ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పటి మన పరిస్థితిలో ఏ వర్గమూ బలవంతమైనది కాదు, వ్యక్తులే బలవంతులూ/బలహీనులూ.

  వ్యవస్థలోని లొసుగుల్ని ఆధారం చేసుకుని తమ బ్రతుకులనీ ఇతరుల బ్రతుకులనీ నాశనం చేసేవారు అన్ని దేశ కాల పరిస్థితులలోనూ వుంటారు. Again, human brain is hardwired to live and let live peacefully. కాబట్టి అలాటి వారి శాతం కొంచెం తక్కువగానే వుంటుందని నా ఆశా భావన.
  శారద

  మెచ్చుకోండి

  1. Yes I agree, both men and women are not meant to do equal and same work. Their functions are different and meant to do different things.
   “Again, human brain is hardwired to live and let live peacefully.”
   Debatable point. The civilization has not eliminated anarchy and violence. It has just made the islands of anarchy spread more evenly all over mankind. Today the violence is more sublime. The anarchy is more exalted.
   మనిషి ఏర్పరచుకొన్న కుటుంబ వ్యవస్థ లాంటివి కొంతవరకూ ఈ అరాచకత్వాన్ని తగ్గించి, మనిషి ప్రశాంతంగా బ్రతకటానికి ఉద్దేశించబడినప్పటికీ, మనిషి (ఆడా మగా ఇద్దరూ) లో అంతర్గతం గా ఉన్న హింసా ప్రవృత్తి కుటుంబ చట్రం లోనే బయటపడుతూ ఉంటుంది. ఆఫీసుల్లో assertive behavior పేరుతో బయటపడుతుంది.
   చట్టం చేసే ప్రతి హింస లో బయటపడుతుంది. But, as you’ve said this sublimation of baser instincts is a welcome development. But, one can’t complain, “man has lost his dynamism”, at the same time. People whose cultural brought up does not support the sublimation of their instincts in to the existing frame work tend to loose. Either they become too dull and loose out, Or they remain raw, rustic and violent individuals. Education should play some role here.

   మెచ్చుకోండి

  2. “వ్యవస్థ కంటే వ్యక్తి బలవంతుడవటం” అనే పాయింటు దగ్గరకొచ్చి నిలబడ్డాం.
   అవుతున్నదేమిటంటే, వ్యవస్థ కలిపించిన సదుపాయాలను అందిపుచ్చుకొని, మనిషి వ్యవస్థ కంటే తాను బలవంతుడిననుకొంటున్నాడు. ఇది ఒక భ్రమ. multi tasking operating system లో అప్లికేషన్స్ అన్నీ ఇండిపెండెంట్ గా నడుస్తున్న illusion ఉంటుంది. కానీ అవన్నీ OS మీద డిపెండ్ అవుతాయి. OS లెకపొతే అవి నడవలేవు. అలానే వ్యవస్థ లేక పోతే వ్యక్తి ఉండదు. ఉదాహరణ కి తెలంగాణ ఉద్యమం లో మనకున్న వ్యవస్థలు చాలా వరకూ పని చేయటం లేదు. వాటిని తిరిగి పని చేయించటానికి మనం వ్యక్తి గత పరిధి లో చేయగలిగింది సున్నా! ఈ illusion అమెరికా వంటి చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యవస్థ పని చేయకుండా ఆగిపోవటం చాలా తక్కువ. అందుకే అమెరికా లో వ్యక్తి వాదం ఎక్కువ. ఏ కట్రినా తుఫానో, 9/11 లాంటి సంఘటనలో జరిగినపుడు వాళ్ళకి ఈ వ్యవస్థ గుర్తుకు వస్తుంది.

   మెచ్చుకోండి

 19. “ఆ కలిసి బ్రతకటంలో ఒకరికేం కావాలో ఇంకొకరికి అర్ధం కావటం లేదు.”

  అర్థం కాక కొంత. అర్థమయ్యేలోగా ద్వేషాన్ని నూరిపోసే వాదం కొంత.

  మెచ్చుకోండి

 20. చక్కటి చర్చ.. కానీ ఈ సాయంత్రం వరకు నేను చర్చలో బాగం కాలేకపోతున్నాను. ఇల్లు చేరాకే వివరణ ఇస్తాను. ఆపీసులో అదనపు పని భారం… అంతే.. శారద గారు మీతో ప్రాథమికంగా ఏకీభవిస్తున్నానండీ.. ఇప్పటికింతే…

  మెచ్చుకోండి

 21. బొందలపాటి గారూ,
  I beg to disagree on a couple of points. మీరన్నట్టు హింసా ప్రవృత్తినీ,సంఘర్షించే తత్త్వాన్నీ మనిషి ఎప్పటికీ మొత్తానికి వదిలేయలేడు. అయితే దాని మోతాదులు అటూ ఇటూ అవుతుంటాయి. డబ్బులు ఎక్కువ అడిగాడని ఆటో డ్రైవర్ ని వేసెయ్యం కదా?
  నేననేది ఏంటంటే వీలైనంతవరకూ మనిషి పరిస్థితులతో సరుకు పోవటానికే ప్రయత్నిస్తాడు. సంవత్సరాల తరబడీ, తరాల తరబడీ అణిచి వేయపడుతున్న భావన ఎక్కువైనప్పుడు ఒక వర్గం తిరగబడటం జరుగుతుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలకి దెబ్బలాటలు చాలా వరకు ఎవరికీ ఇష్టం వుండదు. Anyways this is just my opinion. I could be wrong.

  మీ ఇంకొక పాయింటు మీద కూడ నాకు అనుమానాలున్నాయి. “వ్యవస్థ కంటే వ్యక్తి బలవుంతుడవటం” అబ్సొల్యూట్ సెన్స్ లో నిజం కాకపోవచ్చు. కానీ రెలెటివ్ గా చూస్తే కిందటి తరం వాళ్ళకంటే మనకి వ్యక్తులుగా ఎక్కువ బలం లేదంటారా? చదువుల్లో, ఉద్యోగాల్లో, పెళ్ళిల్లల్లో ఒకటి రెండు తరాల కిందటి వారికంటే మనం ఇంకొంచెం స్వతంత్రంగా, (తప్పో, ఒప్పో) సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం.
  కిందటి తరం లో, డబ్బూ, అందమూ,పెద్ద చదువులూ లేక పెళ్ళిల్లు కాక, అయిన పెళ్ళిల్లల్లో చెప్పరాని హింస భరించిన స్త్రీలెందరినో చూసాము. ఇప్పుడు అంత హీనంగా లేదు. హింసించే బంధం లోంచి బయట పడ్డ స్త్రీలని ఎవరమూ చిన్న చూపు చూడటం లేదు. మగవారిక్కూడా ఇష్టం లేని ఉద్యోగాన్ని వదిలేయటానికీ, ఇష్టం వొచ్చిన వృత్తిని ఎన్నుకోవటానికీ కిందటి తరం కంటే వెసులు బాటు ఎక్కువనే అనిపిస్తుంది.

  I repeat, “మగవాళ్ళంతా వ్యవస్థ ఇచ్చిన బలంతో చెడ్డవాళ్ళవుతున్నారు” అనే మాటలో ఎంత నిజమూ(లేక అబ్సర్డిటీ) వుందో, “ఆడవాళ్ళంతా చట్టం ఇచ్చిన బలంతో చెడ్డవాళ్ళవుతున్నారు” అనే మాటలోనూ అంతే నిజమూ (లేక అబ్సర్డిటీ) వుంది. I cannot agree with either statements.

  In any case I enjoyed sharing ideas with you guys and thanks for the lively discussion. Whatever I say after this will be just repetition of what I said before.

  మెచ్చుకోండి

  1. శారద గారు,
   పూర్తిగా అణిచివేయబడిన వర్గానికి మొదట్లో తాము అణిచివేయబడ్డామనే స్పృహ కూడా ఉండదు. వారి లో కొందరు అణచివేతపరిస్థితులలోంచీ దూరం గా వేళ్ళటం వలనో, లేదా వారి ఆలోచనలు మిగిలిన వారికంటే ముందుకు వెళ్ళటం వలననో అనచివేతని ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ముందు గా అనిచివేసే వర్గం లోని కొందరు మానవత్వం కలవారు అణిచివేయబడిన వర్గాన్ని సమభావం(మానవ ప్రేమ) తో జాగృతం చేయటం వలన కూడా అణిచివేయబడిన వర్గం లోని చైతన్యానికి కారణమౌతుంది.
   వ్యక్తి అధికారం పెరగటం గురించి మీరు రెలటివ్ టరంస్ లో చెప్పింది నిజమే.ఇది ముఖ్యం గా ఒకరి మీద ఒకరు ఆధారపడటం తగ్గటం వలన జరిగింది(టెక్నాలజీ వలనా, డబ్బు వలనా).అలానే సాంఘిక జీవనం తగ్గటం వలన కూడా ఇది జరిగింది(పల్లెల నుంచీ పట్నాలకు వలసల వలన). ఇందులో నష్టం ఏమిటంటే మనకు అవసరమైనపుడు పక్కవాడు పలకక పోవటం. “నిన్ను పక్కవాడు పెద్ద గా ప్రభావితం చేయలేనపుడు, పక్కవాడు నీ గురించిపట్టించుకోడు”. loss of identity కూడా ఈ వ్యక్తి సాధికారతకు ఉన్న ఒక సైడ్ ఎఫెక్ట్.
   స్త్రీలు అందరూ ఇలా వ్యవస్థ ని దుర్వినియోగం చేస్తారు, పురుషులు అందరూ ఇలా దుర్వినియోగం చేస్తారు అని చెప్పలేం, కానీ దుర్వినియోగం చేసే అవకాశమే లేకుండా వ్యవస్థ ఉంటే, violation of the system అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఒకే మనిషి లో మంచీ చెడూ రెండూ ఉంటాయి. అవకాశం వచ్చినపుడు మనిషి లో ఉండే చెడ్డబ్బాయి జూలు విదులుస్తాడు. వ్యవస్థ లోని రూల్స్ మనిషి లోని చెడుకి ఆ అవకాశం ఇవ్వకూడదు.

   మెచ్చుకోండి

  2. శారద గారు,
   మీరు రాసిన వ్యఖ్యలు చదివినతరువాత, మీరేమి అనుకోకపోతే మీ అభిప్రాయాలు క్రిమిలేయర్ బ్రహ్మణుల అభిప్రాయం లాగా ఉన్నాదండి. ఈ క్రీమీలేయర్ అంటే మంచి చదువు, టైముకు ఉద్యోగం, నచ్చిన వారితో / అనుకున్న విధంగా పెళ్లి జరగటం, పాట్నర్ మంచి వాడు, సంగీత సాహిత్యాల గురించి అంతో ఇంతో అవగాహన ఉన్నవారు, జీవితం సాఫీగా సాగ టానికి సరిపడే డబ్బులు సమాపాదించగల వారు,వీకేండ్ లో విష్ణు నామ పారయణం చేసే వారు, ఎదైనా అవసరమైతే సహాయంగా అదుకొనే అత్తా మామ, కాని ఎవో చిన్న చిన్న సమస్యలు, కొంచెం క్లీన్లినెస్ తక్కువ, బట్టలను తలుపుకు వేలడతీయటం, వస్తువులు ఎక్కడంటె అక్కడపడేయటం, డబ్బులు ఎక్కడో పెట్టుకొని మరచిపోవటం లాంటివి చేస్తూంటారు తప్ప, అంతకు మించి ఎటువంటి దురలవాట్లు ఉండని వారు. ఇటువంటి క్రీమీలేయర్ vargaaniki ఇక్కడ జరిగిన చర్చ, వ్యవస్థ అంతా బాగానే ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా చట్టాల లొసుగులతో కొంతమంది ఆట ఆడుకోవటం సహజమే కదా! అని మీ ముగింపు వ్యాఖ్యల ద్వారా, ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది. 🙂

   మెచ్చుకోండి

 22. *కుటుంబాన్ని నిలుపుకోవడానికి ఒక్క స్త్రీ యే ఎందుకు పాటుపడాలి? కుటుంబం భార్యాభర్తలిద్దరి సొత్తు. ఇద్దరూ పాటుపడాలి. ఒకరికోసం ఒకరు జీవించాలి. చంటిపాపలను కంటిపాపలై కాచాలి.*

  http://naaspandhana.blogspot.com/2011/10/blog-post.html

  మెచ్చుకోండి

    1. శ్రీరాం గారు,
     నేను కూడా ఆ చర్చను చూశాను కానీ సౌమ్యగారి వ్యాఖ్య కు నా దగ్గర సమాధానం లేదు. ఆమె ఉద్దేశం క్లియర్ గా తెలియకపోవటం వలన. కానీ ఆవిడ స్త్రీవాది అని తెలుసు.

     మెచ్చుకోండి

     1. బొందలపాటిగారు, ఒక నలుగురైదుగురికి మించి ఇక్కడ ఎవ్వరు చర్చలో పాల్గొనలేదు. పాల్గొనకుండా ఎవరైనా ఈ టపాని చదివారా? మీరు ఎంతో ఆలోచించి రాస్తే అనుకున్నవిధంగా రెస్పాన్స్ వచ్చిందా?

      మెచ్చుకోండి

      1. నా ఆలోచనల వలన నాకు ఆనందం వస్తుంది. కాబట్టీ ఈ టపా రాయటం (నా ఆలోచనలను ఒక గాటి లో పెట్టటం) లో నా స్వార్ధం ఉంది. టపా పబ్లిష్ చేయటం వలన నలుగురూ చదువుతారనే ఒక చాలా చిన్న ఆనందం ఉంది. ఎవరైనా సరిగా చర్చలో పాల్గొంటే ఆ ఆనందం ఇంకా ఎక్కువౌతుంది.కాస్త పేరు వస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కాసులు వస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ రాకపోయినా ఆలోచనలలో ఉండే ఆనందం ఎలానూ ఉంది. “టిపికల్ ఆం చెయిర్ థింకర్ లక్షణం” కదా? ఆలోచనలలో ఉండే ఆనందం పోయిన నాడు బ్లాగులు రాయను.

       మెచ్చుకోండి

 23. ఇప్పటికే ఆడపిల్లల్ని పిండ దశలో చంపేస్తుండడం వల్ల ఆడపిల్ల మగపిల్లాడి మధ్య రేషియో తగ్గిపోయి జాతీయ స్థాయిలో 1000 కి 914 మంది మాత్రమే ఉన్నారు.
  ముందు ముందు మీకు ఎలాగూ పెళ్ళిళ్ళు కావులెండి.

  మెచ్చుకోండి

  1. మీరు ఇంకా గడచిపోయిన కాలం లోనే ఉన్నట్లున్నారు మేడం. 2011 సెన్సస్ సమ్మరీ హిందూ లో ఉంది. ఆడ పిల్లల జనాభా సౌత్ లో ఇంప్రూవ్ అవుతోంది. మళ్ళీ కొన్నాళ్ళకి మామూలౌతుంది. నా అనుభవం లో మధ్యతరగతీ, మరియూ పై వర్గాల వారు ఆడపిల్లలని భ్రూణ హత్యలు చేయటం చూడలేదు. అలా అని ఈ సమస్య సమాజం లో లేదని కాదు, నా అనుభవాన్ని మాత్రమే చెప్పాను. మీరు చెప్పిన లెక్క ప్రకారమే,ఆడవారు తక్కువ అవ్వటం వలన పెళ్ళి కాని మగవారి సంఖ్య maximum 8.6% ఉంటుంది. పెళ్ళి ఒక 20% మగ వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు అని నిశ్చయించుకొన్నారు అనుకొందాం. దాని అర్ధం 11.4% ఆడవాళ్ళకు కూడా పెళ్ళీళ్ళుకాలేదని. పెళ్ళి మగ ఆడా ఇద్దరి అవసరం కదా?పెళ్ళీ అనేది మగ వారి అవసరం మాత్రమే కాదు.
   కొన్ని సామాజిక వర్గాలలో, ఆడ పిల్లల సంఖ్య తక్కువ ఉండటం వలన కావచ్చు వారికి డిమాండ్ పెరిగి, కట్నం వంటి దురాచారాలు తగ్గు ముఖం పడుతున్నాయి. ఒక వేళ భ్రూణ హత్యలు నివారించటానికి ప్రభుత్వాలు ఏమి చర్యలూ తీసుకొనక పోయినా, కొన్నేళ్ళ తరువాత ఆడపిల్లలకు ఉన్న డిమాండ్ కారణం గా, ఆ డిమాండే ఒక self correcting mechanism గా పని చేసి మళ్ళీ ఆడపిల్లలు కావాలనే రోజు త్వరలోనే వస్తుంది. ఇప్పటికే వచ్చిందేమో కూడా..! ఎందుకంటే సరి కొత్త గణాంకల ప్రకారం స్త్రీల శాతం దక్షిణ భారతం లో పెరుగుతోంది.

   మెచ్చుకోండి

  2. *ముందు ముందు మీకు ఎలాగూ పెళ్ళిళ్ళు కావులెండి.*

   మేడం, ఇంత మంచి మాట అన్నందుకు చాలా, చాలా ధన్యవాదాలు. వివాహ వ్యవస్థ మగ వారిని చాలా బలహీనులుగా చేసింది. రాను రాను మగవారు స్వంత తెలివి తేటలతో ఆలోచించటం మానేసారు. తల్లి గారు చిన్నపటినుంచి బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలనే ఒక లక్ష్యాన్ని ముందుంచి పెంచటంవలన ఈ చట్రం లో ఇరుక్కుపోయాడు. అమ్మగారు చెప్పినమాటలు వినటం,దానికనుగుణంగా తన జీవితాంతం నడచుకోవటం లో నే వాడి జన్మ గడచి పోతున్నాది. ఎప్పుడైతే పెళ్ళి కాదో, అప్పుడు మగవారికి తల్లి గారి ఆలోచనలను ప్రశ్నించటం మొదలు పెట్టి, వివావహం వలన మగ వారు ఎలా నష్ట్టపోతున్నారో తెలుసు కొంటాడు. పెళ్ళి అనేది /వివాహ వ్యవస్థ మగ వారిని ఎద్దు ,గాడిదలాగా మార్చేశాయి. చిన్నపటినుంచి ఎద్దులాగా కష్ట్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకోవటం, పెళ్ళి అయిన తరువాత గాడిదలాగా కుటుంబ బరువును మోయటం. ముగ్గురి వ్యక్తులకు కొరకు (ఒక భార్య+ఇద్దరు పిల్లలకొరకు) వాడు పడేకష్ట్టం వర్ణనాతీతం. అతను జీవితంలో అంతా కోల్పోతున్నాడు. కనుక ఇప్పుడు కనీసం కొంతమందికన్నా పెళ్ళిళు కాకపోతే వారు ఒక కోత్త జీవితాన్ని/విభిన్నమైన జీవితాన్ని జీవిస్తారు. వారి జీవితాల లోని కొత్తదనం , మిగతా మగ వారిని కూడా చెప్పుకోదగ్గ పెద్ద సంఖ్యలో ఆకర్షించవచ్చు. పోను పోను మగ వారు పెళ్ళిచేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఈ కన్స్యుమరిజం రోజులలో డబ్బులు పడేస్తే ప్రతి వస్తువు డొర్ డెలివెరి చేస్తుంటే, ఇతరులపైన (తల్లి,తోబుట్టువులు, కుటుంబ సభ్యులపైన)ఆధారపడవలసిన అవసరం తాము ఊహించుకొన్నత గాలేదని అర్థమై, పెళ్ళి చేసుకోకపోవటం వలన కలిగే లాభాలను మగ వారు ప్రచారం చేయటం మొదలు పెడతారు. ఈ రోజులలో మధ్యతరగతి ప్రజలు, ఎదీ లాభమో అది చేస్తారు కనుక, రానున్న కొన్ని సంవత్సరాలలో భారతీయ వివాహ వ్యవస్థకు మధ్యతరగతి మగ వారు టాటా చెప్పైయొచ్చు. ఈ ట్రేండ్ ఇప్పటికే మేట్రోలలో మొదలైయింది.

   మెచ్చుకోండి

 24. మగవాడు తిరుగుతున్నాడు, కాబట్టీ సమానత్వం కోసం మేమూ తిరుగుతాం అంటున్నారు. ఇది ఒక power struggle మాత్రమే! మగవాడు స్వభావరీత్యా ఒకే సమయం లో బహుళ సంబంధాలను ఆచరించేవాడు. ఆడవారి స్వభావం అలా కాదు. కానీ తామూ తీసిపోలేదని నిరూపించటం కోసం, సమానత్వం కోసం “మేమూ చెడి పోతాం” అంటున్నారు. సమానత్వం లేని చోట దానిని బలవంతం గా రుద్దటం అసలైన అసమానత్వం. ..ఆడది తిరిగితే, మగవాడికి, ఆమె కు పుట్టే బిడ్డ తనదో కాదో కూడా పూర్తిగా తెలియదు. అదే ఆడది ఎంత తిరిగినా ఆమె కు పుట్టె బిడ్డ ఆమెదే కద! అందుకే కుటుంబ వ్యవస్థ లో మగవాడు ఉండటానికి ఒకే ఒక్క పెద్ద కారణం తన వారసులైన పిల్లలని పెంచగలగటం. దానికి కూడా గారంటీ లేకుండా ఈ ఫెమినిస్టు భావజాలాలు చేస్తున్నపుడు, మగ వాడికి వివాహ వ్యవస్థ నుంచీ diminishing returns వస్తున్నయనే దానికి సంకేతం. ముందు ముందు మగవారు పెళ్ళి చేసుకొనే ముందు ఒకటి కి పది సార్లు అసలు పెళ్ళీ అవసరమా అని ఆలోచించాలి. నేను నా పిల్లల కూ ఇదే విషయం చెబుతాను.

  మెచ్చుకోండి

 25. అసలు ఈ టపాలు, ఈ చర్చను నేను ఎలా మిస్సయ్యానో అర్థం కావడం లేదండి. 2011 నుంచి బ్లాగులు రెగ్యులరుగా రాయడం కాస్త తగ్గించిన మాట వాస్తవమే కానీ, ఇంత మంచి చర్చను మిస్సవ్వడం బాధగానే ఉంది !!

  మెచ్చుకోండి

  1. నేను ఉండే అపార్ట్మెంట్ల బస్తీలో ఈ ఉగాదికి ఓ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అదీలా మొదలవుతుంది..”మగాళ్ళ కన్నా మృగాలు మిన్న..”
   బస్తీ లో ని మగాళ్ళంతా మొహమ్మీద ఏ భావం లేకుండా చూసేశారు. తరువాత నిర్వాహకుడి(మగాడు) దగ్గరికి వెళ్ళి నేను అడిగాను (అడిగేముందు..మగాళ్ళంతా బాగానే ఎంజాయ్ చేశారు కదా..నాకెందుకులే అన్న ఆలోచన..) మగాళ్ళంతా మృగాలా అని.. అతను ” హె..హీ కొందరు మగాళ్ళు అని పెట్టవలసింద్..హె..హె”.
   సరే..నేను “కొందరు ఆడాళ్ళ కన్నా @$@ మిన్న .. అని ఓ నాటిక ప్రదర్శిస్తాను..రేపు..ఓకే నా”.
   అతను..”హె..హె”.
   నేను..”ఎవరు ఆ రూపకం రాసింది..”
   “మేడం..సో..అండ్ సో..”
   నేను..”ఇక ముందు ఇలా జరిగితే..లీగల్ యాక్షన్ తీసుకోవలసి ఉంటుంది..మేల్ రైట్స్ వాళకి ఇంఫార్మ్ చేయాల్సి ఉంటుంచ్ది”
   అతను.. ” “.

   తరువాత బస్తీ మెయిలింగ్ లిస్ట్ కి మెయిల్ పెట్టా. దీని అంతటినీ విమర్శిస్తూ..ఒక్క మగాడు స్పందించలా..
   *********
   బస్తీ కమిటీ లో ఓ పెద్దాయన(బస్తీ కి ఎంతో కొంత సేవ చేసినాయన) ఓ ఆడ ఉద్యోగిని వేధించాడని ఆరోపణ..చేశాడా లేదా ..ఎవరికీ తెలియదు..బస్తీ రాజకీయాల లో మామూలుగా జరిగే కులాలా కుమ్ములాటల లో కొందరు పెద్దాయనని దించటానికి ఈ నాటకం ఆడించారని పుకారు..బస్తీ బయటి నుంచీ ఓ 50 మంది దుండగులు వచ్చి ఘెరావు..పెద్దాయనని కొట్టటం..
   కానీ బస్తీ మహిళా సంఘం రంగం లోకి దిగింది ప్రాధమిక ఆధారాలు లేకుండానె పెద్దాయన చేత రాజీనామా చేయించారు. ఆ ఉద్యోగిని కేసు కూడా పెట్టలేదు..నిర్భయ పెట్టించాలని చూశారు..షీ టీం కి ఇంఫార్మ్ చేశారు.. బస్తీ మెయిలింగ్ లిస్టులో ఆ ఉద్యోగిని పట్ల బోలెడు సానుభూతి..మరి ఆ ఆరోపణ నిజం కాకపోతే..ఆ పెద్దాయ పరిస్థితి ఏమిటి.. పరుపోయి..శని పట్టి.. అయ్యన భార్యా బిడ్డల సంగతి ఏమిటి.. వారి గురించి ఎవరికీ సాను భూతి లేదు. ఒక వేల బుగ్గ గిల్లాడనే (బుగ్గ గిల్లాడని ఆరోపణ) అనుకొందాం, అంత మాత్రం చేత ఆయన చేసిన సేవలన్నీ దిగదుడుపేనా..?

   మెచ్చుకోండి

   1. సింపులుగా చెప్పాలంటే.. మాబ్ మెంటాలిటీకి ఉదాహరణ. మగవాళ్ళంతా ఇలా దుర్మార్గులు, మృగాలే మగవారి కన్నా మిన్న అన్నట్లుండే నాటకాలు, సాహిత్యం (కొన్ని దశాబ్దాలుగా జరిగిన బ్రెయిన్ వాష్) మగవారిలోనే ఒక రకమైన అపరాధ భావనను తీసుకొచ్చాయి. ప్రతీ మగవాడు, తాను కాకుండా మిగిలిన మగవారంతా నీచులని, తాను మాత్రం ఏదో ఆదర్శంగా నెట్టుకొస్తున్నాననీ అనుకుంటాడు. బేసిగ్గా దీన్నే మేము ఇంటెర్నల్ మిసాండ్రీ (Internal Misandry) అంటు ఉంటాం. ప్రతీ మగవాడిలో ఇంటెర్నలుగా “పురుష వ్యతిరేకత” ఉంటుంది, తాను కాక తక్కిన మగవాల్లందరూ ఆడవారిని వేధించే వాళ్ళే అని ఫిక్సై పోతారు. అదే అసలు సమస్య. అందుకే వారికి ఆడవారు ‘సత్య హరిశ్చంద్రుని వారసుల్లా” మగవారు “కీచకుని వారసుల్లా” కనపడతారు. వారికి ఇలాంటి సంఘఠనలు తమని తాము జెంటిల్‌మెన్‌లలా ప్రూవ్ చేసుకునేందుకు దొరికే ఆవకాశాలుగానె కనపడతాయి తప్ప, తప్పు ఎవరిది … అలా అన్యాయంగా కొట్టడం ఎందుకు ? ఎలానూ కేసు పెడుతున్నారు కదా, విచారణలో అతను దోషి అయితే శిక్ష పడుతుంది కదా అని ఆలోచించే ఓపిక ఉండదు.

    మళ్ళీ అడిగితే, సమాజములో జరుగుతున్న వాటిని చూసి, వాటికి న్యాయం దొరకదని నిస్పృహ చెంది మేము ఇలా తయారవుతున్నాం అనేది ఒక సమాధానాం. దానికి ప్రూఫుగా, నిర్భయ కేసులో చట్టములోని ఒక లొసుగు కారణంగా బయటకి వచ్చిన జువెనైల్ కుర్రాడు కనపడతాడు వీరికి. చూశారా… చట్టాలు ఏమీ చేయలేవ్, మనమే ఏదో ఒకటి చేయాలి అంటి విజిలెంటె లా మారిపోయి.. చెప్పకూడని ఘోరాలు వీరే చేసేస్తారు.

    వారు చెప్పింది నిజమే, కొన్ని సార్లు నిరూపణ లేట్ అవుతుంది, మరికొన్ని సార్లు దోషులు సరైన సాక్షాధారాలు లేకుండా బయటకి వచ్చే అవకాశ ముంది. ఇక్కడో విషయం చెప్పాలి. ప్రస్తుతం ఉన్న నిర్భయ కేసులో ఇది దాదాపుగా అసంభవం. అసలు నిర్భయ కేసు ఎలాంటిది అంటే దోషులు తప్పించుకోవడం కాదు, నిర్ధోశులకు కూడా శిక్ష పడే అవకాశం కూడా కాదనలేం. అయినా కొంత మంది బగా పలుకుబడి ఉన్న బడా బాబులు తప్పించుకుంటు ఉంటారు. వ్ఆటిని చూపించి, ఈ మూకలు ప్రవర్తనను సమర్ధించుకుంటు ఉంటాయి.

    కానీ, వీరు నిజంగానే చట్టాలు ఏమీ చేయలేవు కాబట్టి ఇలా చేస్తున్నారా ? అదే నిజం అయితే 498Aచట్టం దుర్వినియోగం అయ్యి కొన్ని వేల మంది ఆడవారు, మగవారు అన్యాయంగా జైలు పాలయ్యారు. ప్రస్తుతం చాలా రేప్ కేసులు కూడా తప్పుడువి ఉంటున్నాయి. ఇలా తప్పుడు కేసులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవు కోర్టులు, సహజంగా ! అంటే ఇక్కడ చట్టం తప్పుడు కేసు అని తెలిసినా కూడా ఏమీ చేయడం లేదు అన్నమాట. మరి ఈ “లించ్ మాబ్” సంఘ సంస్కర్తలంతా ఏం ఊడబొడుస్తున్నట్లు ? చట్టాలు ఆ తప్పుడు కేసులు పెట్టేవారిని శిక్షించలేవు కాబట్టి, వీరు శిక్షించగలరా ? లేదు. అలాంటి ఆలోచన వచ్చినా ప్యాంట్ తడిసిపోతుంది ఒక్కోక్కరికి. ఎందుకంటే.. అలాంటి పని చేస్తే.. అలా చేసినోల్లందరినీ బొక్కలో తోస్తారు కాబట్టి. కాబట్టి, తమ ఆదర్శాలన్నీ కేవలం ప్రస్తుతం బలహీణంగా ఉన్న మగవారి మీదనే ప్రదర్శిస్తారు. తామూ ఆడర్శవాదులమే అని ప్రువ్ చేసుకుంటారు.

    ఇక పెద్దాయన చేత రాజీనామా చేయించడం అనేది చట్టరిత్యా కూడా కరక్టే. సెక్సువల్ హరాస్‌మెంటు కేసులు ఎదుర్కొంటున్నవారి ఉద్యోగం ఊడుతుంది తాత్కాలికంగా.. ఆయన నిర్ధోషి అని తేలేవరకూ ! తప్పుడు కేసు అయితే అతని పరిస్థితి ఏమిటి అంటే… అది అంతే ! అందుకే రేణుకా చౌదరి ఒక సారి అన్నారు.. Men suffering is not a bad idea అని. అంటే.. షిఫ్టింగ్ ఎటువైపు ఉందో అర్థమవుతూనే ఉంది కదా !!

    ఒకానొక వ్యక్తి… సుప్రీము కోర్టులో అర్జీ పెట్టుకున్నాడు.. .Return my dignity back అని. రేప్ కేసులో అతను నిందితుడు. అతన్ని పోలీసులు దారుణంగా కొట్టారు, స్పృహతప్పేలా ! రాత్రంగా వర్షములో బట్టలు లేకుండా నిలబెట్టారు. అతని పిల్లలను రేపిస్ట్ పిల్లలు, రేపిస్ట్ పిల్లలు అని అవహేళన చేశారు. అతని కుటుభం మొత్తం తీవ్రమైన మనోవేధనను అనుభవించింది. చివరకు అతను నిర్దోషి అని తేలింది. అతను పడ్డ కష్టం, బాధ ఎవ్వరూ తీర్చలేరు, ఆర్చలేరు. అలా అని తప్పుడు కేసు పెట్టిన వారి మీద చర్యలూ తీసుకోలేరు. కనీసం, పేపర్లలో అయినా అతను రేప్ చేయలేదు అని ప్రచురించి.. ఇక మీదటైనా అతను సమాజములో గౌరవంగా బ్రతికేలా చేయమని లేకపోతే … తాను చచ్చిపోవడానికి అనుమతివ్వమని సుప్రీం కోర్టును వేడుకున్నాడు అతను. అదీ ప్రస్తుతం దేశములో మగవారి పరిస్థితి.

    ఇది ఇంతే ! ఇప్పట్లో బాగుపడదు. దీన్ని ఉపయోగించుకుని మగవారి జీవితాలతో ఆడుకునే కృరులైన ఆడవారు ఎప్పుడు ఉండనే ఉంటారు. కాబట్టి.. మగవారే జాగ్రత్తగా ఉండాలి.

    Return my dignity, man absolved of rape asks SC
    http://timesofindia.indiatimes.com/india/Return-my-dignity-man-absolved-of-rape-asks-SC/articleshow/18898781.cms

    మెచ్చుకోండి

    1. పెద్దాయన మీద కేసు పెట్టలేదండీ. Prima facie evidence లేదు. ఆరోపనలన్నీ ఆయన పదవి దిగినాక ఆగిపోయాయి. దీనిని బట్టే అర్ధమౌతోంది హోలీ కౌ ల ను ఉపయోగించుకొని రాజకీయాలు చేజారని

     మెచ్చుకోండి

     1. ఇటువంటి కేసుల్లో ఆడవారు చెప్పే మాటల్నే ఎవిడెన్సుగా పరిగణించి కేసు నమోదు చేస్తారండి. తరువాత కాదని నిరూపించుకునే బధ్యత మగవారి మీదనే ఉంటుంది.

      మెచ్చుకోండి

 26. ప్రస్తుతం అయితే పెళ్ళి అనేది మగవారికి ఒక ట్రాప్ లా మారిపోయింది. అయినా ఆ ట్రాప్‌లో అబ్బాయిలు పడుతూనే ఉంటారు. ఈ మాట రాస్తున్న నాతో సహా అంటా ఆ ట్రాపులో … సరైన అవకాశం దొరికితే పడేవారే / పడిన వారే 🙂

  దానికి కారణం, నా ఉద్దేశ్యం ప్రకారం …
  ప్రతీ మనిషికీ ప్రేమించాలనీ, ప్రేమించబడాలనీ కోరిక ఉంటుంది. ప్రతీ వయసులో కొన్ని అవసరాలుంటాయి. ఆ అవసరాలనూ, ఆ ప్రేమను పొందాలన్న కోరికనూ ప్రస్తుత సమాజములో తీర్చుకోగల ఏకైక మార్గం పెళ్ళి మాత్రమే ! వివాహ వ్యవస్థ ఎంత ధరిద్రమైన స్థితికి వచ్చినా ప్రజలు ఇప్పటికీ పెళ్ళి చేసుకుంటూనే ఉన్నారు, చేసుకుంటునే ఉంటారు కూడా ! ఈ లైవ్-ఇన్ రిలేషన్ షిప్పులూ, అమ్మాయిలూ అబ్బాయిలూ స్వేచ్ఛగా తిరగడాలు వంటివి మన దేశములో ఇంకా సమాజం పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు.

  అదీ కాక ప్రస్తుత స్త్రీ వాదులు అటువంటి ఆప్షన్స్ ఏవీ మగవారికి వదలడం లేదు కూడా ! మగవాడు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా … ఒకమ్మాయితో రిలేషన్ కలిగి ఉన్నాడంటే దాన్ని “పెళ్ళి” లాంటి బధంగా న్యాయస్థానాలు గుర్థిస్తున్నాయి. దానితో గృహహింస చట్టం ప్రకారం అతని నుండి ఆమె అన్ని రకాల హక్కులనూ పొందగలిగే ఛాన్సు ఉంది (మగవాడి హక్కులు ? అలాంటివి అసలు ఉండవు !!), అతని సొంత ఇంటిలో స్థానముతో సహా !! (వెల్, ఛాన్స్ ఉంది అనే కొన్ని తీర్పులు చెబుతున్నాయి). ప్రస్తుతం మగవారు అదృష్టం బాగుంటే భర్త అవుతారు లేదంటే రేపిస్ట్ అవుతారు ! నిర్భయ చట్టం ఒక సారి పరిశీలిస్తే ఈ విషయం ఈజీగానే అర్థమవుతుంది.

  ఒకప్పుడు స్త్రీవాదులు సహజీవనాన్ని తెగ ప్రచారం చేసేవారు. పెళ్ళి వలన స్త్రీలకు అన్నీ కష్టాలే అని, స్త్రీ మగవాడికి బానిస అవుతుంది అని, అతనికి పెత్తనం చేసే హక్కు ఇచ్చినట్టు అవుతుందనీ చాలా కారణాలు చెప్పి, సహజీవనాన్ని ప్రోత్సహించేలా చాలా రచనలు చేశారు. కానీ, ప్రస్తుతం ఫెమినిస్టులు సహజీవనాన్ని సమర్ధించడం లేదు. పెళ్ళినే సమర్ధిస్తున్నారు. ఎందుకంటే.. వివాహం అనేది ప్రస్తుతం పూర్తిగా స్త్రీలకు అనుకూలంగా మార్చివేయబడింది. ఇప్పుడు కూడా మగవారు కట్నం అడుగుతున్నారు అనే ఒక్క అంశం తప్ప, ఇంకే విషయం తీసుకున్నా వైవాహిక చట్టాలు అన్నీ స్త్రీలవైపే ఉన్నాయి. విడాకులు కూడా ఆడవారికే అనుకూలం.

  మీరన్నట్లు మగవారు పెళ్ళి చేసుకోకుంటేనే మంచిదేమో ! కానీ, మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది..! పెళ్ళికి ఆల్టర్నేటివ్ ప్రస్తుతం మనకు లేదు. మన సమాజములో ఇంకా అంగీకరింపబడలేదు !!

  మెచ్చుకోండి

 27. “మగవాడు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా … ఒకమ్మాయితో రిలేషన్ కలిగి ఉన్నాడంటే దాన్ని “పెళ్ళి” లాంటి బధంగా న్యాయస్థానాలు గుర్థిస్తున్నాయి.” – దీని మీద MRA లు కోర్టులని కదిలించటం కుదరదా? ఏది సీరియస్ కమిట్మెంట్, ఏది తాత్కాలిక బంధం అని నిర్ణయించుకోటం ఒక వ్యక్తి హక్కు కాదా. దాన్ని అతని ఉద్దేశానికి వ్యతిరేకంగా కోర్ట్ ఎలా నిర్ణయిస్తుంది.

  కొద్ది రోజులు కలిసి ఒకే ఇంట్లో కలిసి బతికితే కదా దాన్ని పెళ్ళితో సమానమని కోర్ట్ ఉవాచ. ఆ కొద్ది రోజులు కూడా లేకుండా వెస్ట్‌లోలా ఒన్ నైట్ స్టాండ్స్ తీస్కునే రోజులు దగ్గరలోనే ఉన్నాయిలెండి. ఒక్కసారి కళ్ళు తెరిచిన మగవాళ్ళ సంఖ్య పెరిగితే వాళ్ళని ఈ కోర్టులు లాయర్లు భయపెట్టడం కష్టం. ఇప్పట్లా స్త్రీవాదులు ఓపెన్‍గా రివెంజ్ మోడ్లో వెళ్తుంటే, మెజారిటీ మగవాళ్ళకి కళ్ళు త్వరలోనే తెరుచుకుంటాయి. కాబట్టి స్త్రీవాదుల్ని ఆ విధంగా ముందుకుపోనీండి. కుదిర్తే ఎంకరేజ్ చేయండి. ఇంకా వాళ్ళకి తట్టని పౌరాణిక పాత్రలేమైనా ఉంటే గుర్తుచేయండి.

  ఇక చట్టాల మిస్‍యూజ్ గురించి. ప్రతి చట్టాన్ని మిస్‍యూజ్ చేసేవారు ఉంటారు. కాబట్టి దాన్ని ఉండొద్దని ఎవరూ అనలేరు. కానీ చట్టాన్ని మిస్‍యూజ్ చేయటం వేరు, మిస్‍యూజ్ చేయటానికి అన్ని రకాలుగ వీలుగా చట్టాన్ని తయారు చేసి రుద్దటం వేరు.

  మెచ్చుకోండి

 28. //ఏది సీరియస్ కమిట్మెంట్, ఏది తాత్కాలిక బంధం అని నిర్ణయించుకోటం ఒక వ్యక్తి హక్కు కాదా. //
  అది వ్యక్తి హక్కే నండీ, కాకపోతే ఆ వ్యక్తి అమ్మాయైతేనే ఆ హక్కు వస్తుంది. అబ్బాయిలకు ఆ హక్కులు లేవు ప్రస్తుతం !!

  మెచ్చుకోండి

 29. “అబ్బాయిలకు ఆ హక్కులు లేవు ప్రస్తుతం !!” – లేకపోవటం రాజ్యాంగబద్దమైన హక్కులకి భంగకరం కాదా. రాజ్యాంగ ధర్మాసనానికి ఈ విషయం తీస్కెళ్ళటానికి అడ్డేమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అది టెక్నికల్‍గా సాధ్యం కాదా, లేక ఎవ్వరూ అంత దూరం తీస్కెళ్ళలేదా.

  మెచ్చుకోండి

 30. రాజ్యాంగం ప్రకారమే, స్త్రీల సాధికారత కోసం, వారి శ్రేయస్సు గట్రా వంటి వాటికోసం, స్పెషలుగా చట్టాలు చేయవచ్చు, చర్యలు చేపట్టవచ్చు. రాజ్యాంగములోనే ఉంది ఆ వెసులుబాటు. ఆ వెసులుబాటు కారణంగానే 498A అయినా, మరో చట్టం అయినా చేయగలుగుతున్నారు.

  రాజ్యాంగములో చెప్పలేదు కానీ, ఆచరణలోకి వచ్చేసరికి …
  స్త్రీ పురుషులు సమానం, కానీ స్త్రీలు కొంచెం ఎక్కువ సమానం.

  మెచ్చుకోండి

  1. రాజ్యాంగంలో ఒక సెక్షన్ జనాలకి అవసరమనుకుంటే ప్రత్యేక హక్కులు, రక్షణలు కల్పించే వెసులుబాటు ఉంది. కానీ ఆ క్రమంలో మరొకరి ప్రాధమిక హక్కులకి భంగం కలిగిస్తుంటే దాన్ని అడ్డుకునే ఆప్షన్ కూడా ఉండాలి కదా.

   మగాళ్ళకి కూడా ప్రత్యేక హక్కులు అడిగితే, ఆ అవసరాన్ని నిరూపించాలి, ఆడవాళ్ళకి ఇచ్చిన 498A లాంటివి మగాళ్ళ హక్కులకి భంగం అని వాదించినా అది పెద్ద ఎడతెగని చర్చ, ఉపయోగం ఎంత, దుర్వినియోగం ఎంత అని.

   కానీ ఒక రిలేషన్ ఏ కమిట్‍మెంట్/హక్కులు లేని స్నేహితుల్లాంటి సహజీవనవమా, లేక కమిట్‍మెంట్‍తో హక్కులతో ముడిపడిన పెళ్ళిలాంటి బంధమా అని నిర్ణయించుకునే హక్కు ఎదిగిన మనుషులకి ఉండటం అనేది ప్రాధమికమైన విషయం కాదా. ఆ దిశగా ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేసారా.

   మెచ్చుకోండి

 31. @viseshajna

  మీ పై కామెంట్‍కి అక్కడే రెస్పాండ్ అయ్యే అవకాశం కనపడ్లేదు, అందుకే కామెంట్లలో కిందకి వచ్చాను.

  “మీరనుకున్నంతగా westernize అవ్వలేదు మనం. ” – అవును. అయ్యామని నేనూ అనుకోవట్లేదు. కానీ భవిష్యత్తులో ఆ బాట పట్టక తప్పదంటున్నా. మన స్త్రీవాదులు పక్కా ఒన్‍సైడెడ్ ప్రచారాలు, ఆడవాళ్ళకి అపరిమితమైన హక్కులు, మగవాళ్ళకి నోరువిప్పలేని పరిస్థితులు కల్పిస్తూపోయే కొద్దీ, ఈ దేశంలో మగాళ్ళ కళ్ళు తెరుచుకోక తప్పదు. అప్పుడు వెస్ట్ బాట పట్టకా తప్పదు.

  నేను క్రితం కామెంట్లో చెప్పినట్టు కులాలకి, మతాలకి, ఆచారాలకి అన్నిటికీ కుటుంబమే మూలం. దాంట్లో చీలిక వచ్చిన రోజు ఎంత తరతరాల కులాల, ఆచారాల జాడ్యమైన వదులుతుంది. ఈ దేశంలో చాలామంది మగవాళ్ళు ఇంకా కుటుంబాన్ని తామే ఏలుతున్నామనే భ్రమలో ఉన్నారు. అందుకే దాని మీద నిర్మించుకున్న భావనలన్నిట్ని సమర్థిస్తున్నారు. పెళ్ళి మగవాళ్ళకి రానురాను మోయలేని లయబిలిటీ అవుతోందని ఎక్కువమంది అర్థం చేస్కున్న రోజు
  ఇవన్నీ కదుల్తాయి. ఎవ్వడూ కులాల కోసం, మతాల కోసం తనకి నచ్చని స్థితుల్లో ఉండడు కదా. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది మగపిల్లల పేరెంట్స్ వాళ్ళకి పెళ్ళి చేయటంలో వచ్చిన సమస్యలు చూసారు. అమ్మాయిల రిక్వైర్‍మెంట్స్, వారి కోరికలు చూసి షాక్‍లో ఉన్నారు. నెక్స్ట్ జెనరేషన్ పేరెంట్స్‌కి తమ పిల్లల్తో, మీరేం వెధవ్వేషాలు వేయకండి, మేము మంచి సంబంధాలు చూసి చేస్తాం అని చెప్పే ధైర్యం ఉండదు. ఆ పిల్లలు తమ దారి తాము చూస్కుంటారు మెల్లగా, పేరెంట్స్ ఊరుకుంటారు అంతకన్నా ఏమీ చేయలేక. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తిరుగుళ్ళన్నీ బయటకి వచ్చి మెల్లగా మెయిన్ స్ట్రీమ్‍లో భాగం అవుతాయి.

  ప్రస్తుతం ప్రభుత్వాలు, మహిళాసంఘాలు బాధితమహిళల హక్కుల్ని కాపాడటం అనే పేరిట నడిపిస్తున్న ఈ మగవాళ్ళ బాదుడు ఇదే దిశగా వెళ్ళినకొద్దీ మగవాళ్ళకి వెస్ట్ మోడల్స్ వైపు వెళ్ళటం తప్ప వేరేదారి ఉండదని నా ఊహ. పస్తుతానికే కొద్దిమంది మగవాళ్ళు వెస్ట్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారనే దాన్ని అడ్డుకోటానికి లివ్-ఇన్ కూడా పెళ్ళిలాంటిదే, దాంట్లో కూడా ఆడవాళ్ళకి ఆస్తిహక్కులు అంటూ గొడవ చేస్తున్నారు, కోర్టుల చేత చెప్పిస్తున్నారు. ఆడవాళ్ళు ఏ రిలేషన్లోకైనా వెళ్ళవచ్చు, నచ్చకపోతే దర్జాగా ఏ బాదరబందీ లేకుండా బైటికెళ్ళొచ్చు, కానీ మగవాళ్ళు అన్‍కమిటెడ్‍గా ఏ స్త్రీతోనూ ఉండటానికి వీల్లేదని వీళ్ళ గొడవ. ఇది ప్రస్తుతం కొద్ది మంది మగవాళ్ళ పద్దతే కావచ్చు కానీ మెల్లగా పెరుగుతోందని పసిగట్టారు కాబట్టే ఇంత గొడవ.

  మెచ్చుకోండి

 32. //కానీ మగవాళ్ళు అన్‍కమిటెడ్‍గా ఏ స్త్రీతోనూ ఉండటానికి వీల్లేదని వీళ్ళ గొడవ. //
  Exactly ! నిజానికి స్త్రీవాదులు దీన్ని చాలా ఓపనుగా చెబుతున్నారు. మగవారికి ఆ ఛాయిసే ఉండకూడదని. ఇది వరకటిలా సమానత్వం గట్రా మాటలు వారు మాట్లాడడమే మానేశారు. ఇప్పుడంతా .. ప్రివిలేజెస్ మీదనే చర్చ అంతా ! దానికి అంగీకరించకపోతే, నీకు జెండర్ సెన్సిటిజేషన్ క్లాసు ఇవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం వారి వాదన !

  ఒకప్పుడు పాత కాలం సినిమాలలో, నవల్లలో హీరోయిన్ గారు.. ఆడదానికి ఒక న్యాయం మగవానికి ఒక న్యాయమూనా అంటూ ఆవేశంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు మగవారు మట్లాడాల్సి వస్తోంది. కానీ, రాజకీయంగా స్త్రీలు ఏకమవ్వడం … మగవారు ఇంకా భారతీయ సంస్కృతి, ఆడవారి వస్త్రధారణ, కులం, మతం, నరేంద్ర మోడీ అంటు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలీని వారిలా తిరుగుతూ ఉండడం వలన, మగవారు సమానత్వం అని అరిచే అరుపులకి విలువ లేకుండా పోతోంది !!

  మెచ్చుకోండి

 33. బొండాలపతి గారూ ఎప్పటిలాగే చిన్నపిల్లలు ఉహించి రాసినట్టు ఊహించి రాశారు. అన్ని విషయాలూ మీ ఊహలకే వదిలేస్తె అవి తకిందులుగానే వుంటాయి.ఒకవిషయం రాసేటప్పుడు దానిగురించి కనీసంగానైనా తెలుసుకొండి. మీరు తెలుసుకొదలిస్తె మొర్గాన్ రాసిన పురాతన సమాజం. ఎంగెల్స్ రాసిన కుటుంభవమూ, సొంత ఆస్తి, రాజ్యముల ఆవిర్బావము.చూడండి.

  మెచ్చుకోండి

 34. రాంమోహన్ గారూ, ఎప్పటిలానే మీ ఛాందస భావజాలాన్ని ప్రాతిపధికగానే చేసుకుని రాశారు. ఏగెల్స్ వంటి వారు రాసిన కథలకు చెదలు పట్టి పనికి రాకుండా పోయాయండి. మీరు ఏంగెల్స్ జమానా నుండి ప్రస్తుతం ఉన్న సమాజానికి వచ్చి .. సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి ప్రయత్నించండి. ఏదో ఒక మూసలోనుండి కాకుండా. మీకె అర్థమవుతుంది.

  మెచ్చుకోండి

 35. @rammohan,
  The gist what those two people told is here:
  https://en.wikipedia.org/wiki/The_Origin_of_the_Family,_Private_Property_and_the_State
  Clearly they wrote about their convictions and beliefs, in those olden days, in those books. They are not proven facts.
  In which way do those books contradict the main point that I discussed in this post?(The relevance of family system to men in the society today) Sometimes the evolutionary timeline discussed in those two books is different from the timeline I mentioned in my post. While I mentioned about the middle ages and wars, those books focused less on middleages. About the prehistoric times, I mentioned there were many-to-many relationships. In the matrilineal clan mentioned in those books, it was practiced.

  According to the argument in those books, the brother-sister incest should have been institutionalized, since it prevents property from getting divided. But, it has not been the case as you and I know.

  Since Engels time, modern Evolutionary biology, genetics has thrown more light on the subject of family, with facts and theories proven in labs experimentally. My post is based on those facts.
  Had I quoted Marx and Engels in the post, probably you would not have commented in the same fashion… 🙂

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s