ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-32

మనీషా ప్రాజెక్ట్ లోకి వచ్చేసింది. మనీషా వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆమె ఇచ్చిన పనిని చాలా బాగా ఎక్జిక్యూట్ చేయించ గలదు.కానీ ఆమె మాత్రం పని చేయదు.
మనీషా గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. అమె మొదటి జాబ్ డిల్లీ లో చేసింది. తరవాత బెంగుళూరు వచ్చింది. ఆమె డిల్లీ లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది. ఆమె బెంగుళూరు కి వచ్చిన ఒక సంవత్సరం తరవాత, పునీత్ అగర్వాల్ అని ఒక ముంబాయి అతనిని పెళ్ళి చేసుకొంది. పునీత్ ముంబాయి లోనే ఒక ఫిల్మ్ కంపనీ లో పని చేసేవాడు. వాళ్ళ పెళ్ళి బెంగుళూరు లోనేజరిగింది. కొలీగ్స్ చాలా మంది అటెండ్ అయ్యారు.
ఓ రోజు శ్రీధర్ మనీషా ని అడిగాడు,” ఏంటి? నువ్వు ఈ రోజు చాల డల్ గా కనిపిస్తున్నావు?”
మనీషా శ్రీధర్ వంక చుర చురా చూసి, కను బొమలు ఎగరేసి అంది, “థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. కానీ నీకెందుకీ విషయం?”
ఆమె పునీత్ అగర్వాల్ కి విడాకులిచ్చినట్లు రెండు రోజుల తరవాత తెలిసింది శ్రీధర్ కి. ఆ పైన ఓ నెల రోజులకి,  రోహిత్ శ్రీ వాస్తవ అని పక్కనున్న ఐటీ కంపెనీ లో లొకేషన్ హెడ్, ఆమె ని తన కారు లో డ్రాప్ చెయ్యటం చూశాడు శ్రీధర్. శ్రీధర్ లో ని పల్లెటూరి బావ నిద్ర లేచాడు.మనీషా ని అడిగాడు,” మనీషా,నువ్వు క్యాబ్ లో రావటం లేదేమిటి? ఎవరో నిన్ను రోజూ కార్ లో డ్రాప్ చేస్తున్నట్లున్నారు? ”
దానికి మనీషా, “చూడు శ్రీధర్,అది నా సొంత విషయం. నీ కెందుకు? నీ మంచి కోసమే చెప్తున్నా..తరవాత హెచ్ ఆర్ వాళ్ళ తో నీకు ప్రాబ్లం రావటం నాకు ఇష్టం లేదు” అంది. దానితో శ్రీధర్ నోరు మూత పడిపోయింది.
శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ మంచి జోరు గా నడుస్తోంది. టీం మొత్తం టెన్షన్ గానూ,బిజీ గానూ ఉన్నారు. మనీషా కి పాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కి కస్టమర్ మంచి రేటింగ్సే ఇచ్చాడు.
శ్రీధర్ కి  పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలంటే బద్ధకం గా ఉంటోంది. రాత్రి ఏ రెండింటికో రూం కి వస్తున్నాడు. డాక్టర్ కి చూపించుకొందామంటే టైం లేదు. టెన్షన్ వలన కూడా అతని ఆరోగ్యం దెబ్బ తింటోంది.
ఆ రోజు ఒక డెలివరీ ఉంది. ఆఫీస్ కి వెళ్దామంటే, ఉతికిన బట్టలు ఏమీ లేవు రూం లో. మాసిన బట్టలతో ఆఫీస్ కి ఏమి వెళ్తాం లే అనుకొని అతను బట్టలు గుంజటం మొదలు పెట్టాడు. పదకొండున్నర కి ఆఫీస్ నుంచీ ఒక కాల్ వచ్చింది. రిసెప్షనిస్ట్ అంది, ” సర్,మనీషా లైన్ లో ఉంది. కనెక్ట్ చేయనా?”.
మనీషా మాట్లాడుతోంది,” ఆనంద్ ప్రాజెక్ట్ రివ్యూ చేశాడు. అతను ప్రాజెక్ట్ ని నన్ను టేక్ ఓవర్ చెయ్యమన్నాడు. నువ్వు ఆఫీస్ కి ఎప్పుడు వస్తావు? నాకు కేటీ చేయి. ఇప్పటి దాకా జరిగింది అంతా చెప్పు”.
” ఎంత అవమానం. ఆనంద్ గాడు నన్ను ప్రాజెక్ట్ నుంచీ ఫైర్ చేశాడు. ఈ లెక్కన జాబ్ నుంచీ కూడా ఫైర్ చేసేస్తాడేమో? “, శ్రీధర్ గుండెదడ పెరిగింది. చాతీ లో ఎడమ వైపు సన్న గా నొప్పి మొదలైంది. అతనికి స్పృహ తప్పుతోంది.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-32

    1. స్టోరీ లైన్ కల్పితమే.అయితే కొన్ని కొన్ని సంఘటనలకు కావలసిన ముడి పదార్ధాన్ని నా అనుభవాలనుండీ తీసుకున్నాను.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s