ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ- 37

బస్సు వెంకటాపురం వెళ్తోంది. శ్రీధర్ బస్సులో తను మామూలు గా కూర్చొనే కిటికీ సీట్లో కూర్చొన్నాడు. అతని మనసు ఎక్కడో ఉంది. శూన్యం లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. దారి లో వచ్చే చెరుకు తోటలూ, తమలపాకు తోటలూ  ఆహ్లాద పరచలేక పోతున్నాయి. పైగా వాటిని చూస్తూంటే  అతనికేదో దిగులు కలుగుతోంది.
వాళ్ళ ఇంటి ముందు కొట్టేసిన రావి చెట్టు మొదలు చుట్టూ పిలకలు వస్తున్నాయి. ఇంట్లో, వాళ్ళ నాన్న కొద్దిగా కోలుకొన్నట్లు కనపడుతున్నాడు. వాళ్ళమ్మ కొంచెం నీరసం గా ఉంది, వాళ్ళ నాన్న కి చేసిన సేవల వలన కావచ్చు. వాళ్ళూ అతనిని వచ్చిన కారణం అడగ లేదు. ఏదో గట్టి కారణం ఉంటేనే వస్తాడని వాళ్ళకి తెలుసు. అతనికి బెంగుళూరు లో సంఘటన ల గురించి చెప్పి వాళ్ళని మరింత కష్టపెట్టడం ఇష్టం లేదు. ఒంటరి గా ఉన్న సమయం చూసి, ఊళ్ళోని  తన లాయర్ ఫ్రెండ్ ని పిలిచి అతని తో విడాకుల గురించీ, కొడుకు గురించీ మాట్లాడాడు.
శ్రీధర్ వేణ్ణీళ్ళతో స్నానం చేసి సూట్ కేస్ తెరిస్తే దాంట్లో పైజామా లేదు. వాళ్ళ నాన్న తన లుంగీ ఒకటి శ్రీధర్ కి ఇచ్చాడు. అది కట్టుకొని అరుగుల దగ్గరికి బయలుదేరాడు. అక్కడ జన సంచారం లేదు. మబ్బులు కమ్ముకొంటున్నాయి.పొలాల మీది నుంచీ గాలి వీయటం లేదు. ఉక్క గా ఉంది. ఆకాశమనే యుధ్ధ భూమి లో మేఘాల సైన్యం ఉరుముల దుందుభీలు మోగిస్తోంది. ప్రపంచం మాత్రం ఇదేమీ పట్టనట్లు నిశ్చలం గా ఉంది. గాంధీ గారి విగ్రహం పాదాలకు ఓ కార్పొరేట్ విద్యాసంస్థ పోస్టర్లు అంటించబడి ఉన్నాయి.  పక్కనే స్థూపమ్మీద కత్తీ సుత్తీ ఇంకా గర్వం గానే నిల్చొని ఉన్నాయి. శ్రీధర్ వెళ్ళి గాంధీ గారి కాళ్ళ వద్ద కూర్చొన్నాడు.
ఎనభైలలో ఉన్న మూడు కాళ్ళ ముసలాయనొకాయన,కర్ర ఊతం తో అక్కడి కొచ్చాడు. శ్రీధర్ కి ఆయన బాగా తెలిసిన మనిషే అనిపిచింది.కానీ ఎవరో గుర్తుకు రావటం లేదు.
“ఎవరి కోసం చూస్తున్నావు నాయనా?” అన్నాడు. శ్రీధర్ ఒక్కసారిగా ఆయనను గుర్తు పట్టాడు. గాంధీ మాస్టారు. చిన్నప్పుడు కట్ట మీద తిట్టిన మాస్టారు.
“మాస్టారూ,నేను మీ దగ్గర చదువు కొన్నాను. మీరు నన్ను మర్చిపోయారనుకొంటా..నా పేరు శ్రీధర్.”
ఆయన ముందు తన కుడి చేతిని అరిగుమీద పెట్టి,తరవాత దాని ఊతం తో నెమ్మది గా కింద కూర్చొన్నాడు. శ్రీధర్ వంక ఒక సారి తేరి పారా చూసి, “నువ్వు కృష్ణా రావు కొడుకువి కాదూ..?” అన్నాడు.
“అవునండీ”
“ఈ నిర్మానుష్య ప్రదేశం లో ఏమి చేస్తున్నావ్? ఊరంతా ఎప్పుడో చచ్చిపోయింది”
“నేను నామనసు లోని ప్రశ్న లకి సమాధాలని వెతుకుతున్నాను. లోకమెటు పోతోంది.  మనిషి సుఖ సంతోషాలు పెరిగే వైపుకు పోతోందా? మనిషి సహజమైన అవసరాలు మెరుగైన విధంగా తీర్చే వైపుకు పోతోందా? ఒక వంద ఏళ్ళ కిందటితో పోలిస్తే  ఇప్పుడు ప్రపంచం సాంకేతికం గా, శాస్త్రీయం గా చాలా పురోగతి సాధించింది. ఇక ముందు ఈ అభి వృధ్ధి మరింత వేగవంతమౌతుంది కూడా. దాని లో సందేహం లేదు. కానీ మనిషి సుఖ సంతోషాలు మాత్రం పెరిగినట్లు కనపడటం లేదు. కారణం తెలియదు…”
“చూడు బాబూ.ఈ గాంధీ గారి విగ్రహాని కి ఒక వైపు ఆ పూదోట ఉంది. దానికి ఎదురు గా ఆ వైపు పశువుల సంత ఉంది. నువ్వు మార్కెట్ వైపుకి వెళ్తే, పూల తోట కి దూరం గా వెళ్తున్నట్లే కదా. మనిషి పరిజ్ఞానం పెరిగింది. కానీ ఈ పరిజ్ఞానాన్ని  ఉపయోగించేది మనిషి స్వార్థం. ఓ పల్లెటూరి వాడికీ ఒక ఆధునిక మానవుడికీ జీవసహజమైన స్వార్థం లో పెద్ద గా తేడా ఉండదు. కానీ ఆధునిక మానవుడి కి విజ్ఞానం అందుబాటులో ఉంది.  విజ్ఞానాన్ని స్వార్థం కోసం వాడినప్పుడు దాని వలన చెడు పెరుగుతుంది కదా. స్వార్థమనేది జీవ పరిణామ క్రమం లో మనిషి కి ఉపయోగపడి ఉండవచ్చు. కానీ దాని వలన ఇకమీదట పెద్ద ఉపయోగం ఉండక పోవచ్చు.
ఆయన శ్రీధర్ కళ్ళలోకి చూసి అన్నాడు, మహాత్ముడు చెప్పినట్లు, “ఈ భూమ్మీద అందరి అవసరాలూ తీరే సంపద ఉంది, కానీ ఏ ఒక్కరి దురాశా తీరే సంపద లేదు”.
“గాంధీ గారిని మహాత్ముడని ఎందుకన్నారు? ఆయన అంత గొప్పవాడని ఎందుకంటారు? ఆయన వ్యక్తిత్వం కూడా పరిస్థితుల ప్రభావం వలనో, వారసత్వం వలనో వచ్చి ఉంటుంది కదా. అంటే గొప్పతనం ఆయనకి ఆపాదించబడిందా? ఒక లక్ష సంవత్సరాల తరువాతైనా గాంధీ గారిని మర్చిపోవలసిందే కదా?”
“ఏ వ్యక్తి ఐనా పరిస్థితుల వలనో, జన్మవలనో తయారు చేయబడతాడు. మహాత్ముడు కూడా ఒక వ్యక్తే. ఆయన జీవితం కొత్త పాత విలువల మేలు కలయిక. మనిషి జీవితం తో పోలిస్తే లక్ష సంవత్సరాలు అనతం కింద లెక్క. అప్పటికి ఏ ఖగోళ ప్రమాదం వలన నో మానవ జాతే అంతరించ వచ్చు.
మనిషి సమాజాన్ని ప్రభావితం చేస్తే, తిరిగి సమాజం మనిషి ని ప్రభావితం చేస్తుంది. ఇదొక పరస్పరాధారిత ప్రక్రియ. దీని వలన ఒక మనిషి కానీ ఒక సమాజం కానీ మొదలుపెట్టిన చెడు, కాలం గడిచేకొద్దీ పాతుకు పోతుంది.  నాయకుడనే వాడు ఈ ప్రక్రియని ఆపి దానిలోకి మెరుగైన కొత్త ఆలోచనలను నింపి ఆచరణ లో పెట్టగలగాలి.  ఈ ఆలోచనలు ఆచరణీయం కావాలి. అప్పటికే ఉన్న విధానాలను మెరుగుపరచాలి. అప్పటికే ఉన్న విధానాలకంటె నాసి రకం విధానాలు అవ్వకూడదు.”
శ్రీధర్ ఓపికగా గాంధీ మాస్టర్ చెప్పిన మాటలను విని,”ఏది మెరుగైనది మాస్టారూ?” అన్నాడు.
“మెరుగైన ఆలొచన, మనిషి ఉమ్మడీ, వ్యక్తిగతా ఆరోగ్యాన్ని పెంచాలి. మహా కవి శ్రీ శ్రీ చెప్పినట్లు గా,అందరి కోసం ఒక్కరు,ఒక్కరి కోసం అందరు గా బతకాలి.”
శ్రీధర్ అన్నాడు,”ఒకప్పుడు నన్ను ఊళ్ళో అందరూ జీవితంలో ఎదిగిన వాడిగా చూశారు. మంచి ఉద్యోగం ఉండేది.చదువు ఉంది . కానీ నేను ఇప్పుడు చాలా విషాదం గా ఉన్నాను. కాబట్టీ ఇప్పుడు నన్ను నేను ఒక ‘పరాజితుడి’ గా పరిగణిస్తున్నాను. నా జీవితమే ఒక సంక్షోభం లో పడింది.”
గాంధీ మేస్టర్ అన్నాడు,” విజయానికి నిర్వచనం వ్యక్తిగతమైనది. జీవితం మనిషి ఆత్మ తో సఖ్యం గా లేనప్పుడు మన మనసు లో సంక్షోభం ప్రవేశిస్తుంది.  నాకు నీ బాల్యం ఎట్లాంటిదో తెలుసు. నీది భారతీయ ఆత్మ. మనపల్లెటూళ్ళు భారతీయాత్మకి ప్రతిబింబాలు. పల్లెలు తరతరాల భారతీయ విలువలకు ప్రతినిధులు.  గాంధీజీ ఈ విషయాన్ని ఎప్పుడో అర్ధం చేసుకొన్నారు. ఒక్కసారి నువ్వు ఆధునికత్వాన్ని అవలంబించావంటే నీ అత్మ నీకు దూరం గా పోతుంది.  క్రీస్తుచెప్పినట్లు గా,”మనిషి విశ్వాన్ని జయించుతున్నాడు. కానీ ఆ జయించే క్రమంలో తన ఆత్మ ని పోగొట్టుకుంటున్నాడు.”
శ్రీధర్ అన్నాడు, “ఆదర్శాలు వల్లె వేయటానికి బాగానే ఉంటాయి. ఈ వ్యవస్థ ఇలా ఉండటానికి చాలా బలమైన కారణాలే ఉండి ఉంటాయి. ఆశయాలను ఆచరణ లో ఎలా పెడతామనేదే ముఖ్యం కదా?”
“సాంస్కృతిక విలువలు ఆచరణ నుంచే పుడతాయి. కానీ ప్రాముఖ్యత ఒక రోజులో తేలేది కాదు. తండ్రి పిల్లలని ఆచరణ లో పెట్టలేని కాల్పనిక విషయాలని అనుసరించమని చెప్పడు కదా? అలానే జాతిపిత కూడా చాలా ఆచరణశీలుడే అయ్యిఉండాలి”
గాంధీ మాస్టర్ చేతి కర్ర ఊతం తో లేచి నుంచున్నాడు. నెమ్మది గా తుంపర పడుతోంది..  శ్రీధర్ అన్నాడు,”మీరు నన్నేం చేయమంటారు?”
గాంధీ మాస్టర్ ఆ మాటలు విన్నాడో లేదో తెలవలా. ఆ వర్షం లో నడుచుకొంటూ పోతున్నాడాయన కర్రపోటేసుకొంటూ. “రఘుపతి రాఘవ రాజా రాం, పతీత పావన సీతా రాం”.
ఆ వర్షం లో గాంధీ బొమ్మ కాళ్ళ దగ్గర తడుస్తూ కూర్చున్నాడు శ్రీధర్. గాంధీ బొమ్మ కాళ్ళకి ఉన్న పోస్టర్లు వర్షానికి తడిచి మెత్తబడ్డాయి. ఊడిపోయి వాన నీళ్ళలో కలిసి,పక్కనే ఉన్న మురికి కాలువ లో కలిసి కొట్టుకొని పోతున్నాయి”

అయిపోయింది

ప్రకటనలు

19 thoughts on “ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ- 37

 1. తీరిక చేసుకొని ఈరోజే చదివా ఈ కథని బాగుంది. విశ్లేషణలు బాగున్నాయి. జె.కె, శ్రీశ్రీ అంటే అభిమానమా మీకు. బాగా వ్రాసారు. ఇంతకీ ముగిపు ఏమిటి అతడు ఆ పల్లెటూర్లోనే ఉండిపోయాడా. ఏవైనా పత్రికలకు కథలు వ్రాస్తుంటారా?

  మెచ్చుకోండి

  1. తీరిక చేసుకొని చదివినందుకు నెనర్లండీ. హీరో ఏదో పల్లెటూర్లో వ్యాపారత్మకం కాని ఏదో ఒక పని మొదలుపెడ్టాడు అన్నట్లుగా రాశాను. నేను కూడా అదే చెయ్య దలచుకొన్నాను. “విద్య” లేక “పరిశుభ్ర శక్తి” మీద మన గ్రామాల్లో ఏదో ఒకటి చెయ్యాలని నా అభిలాష. ప్రస్తుతం దానికి అవసరమైన డబ్బు సమకూర్చుకోవటంలో నిమగ్నమైఉన్నాను.
   నేను కథలు రాయటం ఇదే మొదలు. ఇంకా లోపల్నుంచీ తంతే ఏమైనా రాస్తాను. ప్రస్తుతానికి ఏమీ తన్నటం లేదు.
   శ్రీ శ్రీ కవిత్వం అంటే ఇష్టమే. కానీ ఆయన వ్యక్తిత్వం అంటే చెప్పలేను. వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని వేరు చేసి చూడటం సరైనదా కాదా అనే సందేహం ఇంకా నన్ను వీడ లేదు. “జె కే” వ్యక్తి గురించి అభిమానం ఏర్పరుచుకోవటాన్ని ప్రోత్సహించలేదు. నా ఇంగ్లీషు టపాలలో జే కే గురించిన నా పొజిషన్ రాశాను. వీలైతే చదవండి.

   మెచ్చుకోండి

 2. నేను అదే పని చేయాలనుకొంటున్నానని వ్రాసారు అంటే మీ కంప్యూటర్ ఉద్యోగం వదిలేసి, చెన్నై నుంచి వచ్చేసి చేద్దామని అనుకొంటున్నారా. మంచి పనే. మరి ఎంతకాలం పడుతుంది. ధైర్యం చేయాలి కదా. అందుకు ప్రణాళికలు ఏమైనా వేసారా. ఇంతకూ మీరుండేది ఎక్కడ (స్వగ్రామం).

  మెచ్చుకోండి

  1. నేను ఉండేది బెంగళూరు. మా ఊరు కృష్ణా జిల్లా బందర్ దగ్గర. మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇంకో నాలుగైదేళ్ళు పట్టవచ్చు…ప్రణాళికలకి ఇంకా ఒక ఇతమిథ్థమైన రూపం ఏమీ లేదు. మొదట డబ్బు తరవాత సౌర శక్తి క్లి సంబంధించిన జ్ఞానం ఈ రెండూ సంపాదించాలని చూస్తున్నాను.మీకు ఈ విషయం లో ఏమైనా ఆసక్తి ఉంటే నా మెయిల్ ఐడీ కి మెయిల్ చెయ్యవచ్చు.

   మెచ్చుకోండి

  1. if you can’t encourage please don’t speak like discouraging at least. What the author has expressed is his wish that is in noway disadvantageous.

   బొందలపాటి గారు చాలా బాగుంది మీ కథ. ఈరోజే మొత్తం చదివేసాను. శ్రీధర్ చిన్నప్పటి, పెరిగిన తరువాత వచ్చిన conflicting లైఫ్‌స్టయిల్‌ను బాగా narrate చేసారు.

   మెచ్చుకోండి

 3. బొందలపాటి గారు, మీ నవల చాలా బావుంది. అసాంతం ఒకే పట్టులో చదివించేలా ఉంది. రెండు సమాంతర కథలుగా చెప్పుకొచ్చినా, అవి ఎక్కడ కలిసాయో మిస్సయ్యాను. అలాగే సీరియస్ గా సాగుతున్న కథలో ఉన్నట్టుండి పాటకులని సంభోధించటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ప్రతి ఒక్క ఐటి ఉద్యోగి మనోగతంలా ఉంది. ఇలాంటి మంచి రచన చేసినందుకు అభినందనలు, అది మాకు అ0దుబాటులో ఉంచినందుకు ధన్యవాదాలు. శరత్.

  మెచ్చుకోండి

  1. శరత్ చంద్ర గారు,
   మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది నా మొదటి రచన మాత్రమే. తప్పులను ఇక పై (అసలు ఏమైనా కథ రాస్తే) సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s