ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక రోజు “తమిళం రేకు డబ్బా లో గులక రాళ్ళు పోసి మోగించినట్లుంటుంది”, అన్నాను సరళ తో. దానికి ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసి నాతో మాట్లాడటం మానేసింది. రెండు  రోజుల తరువాత సరళ లిఫ్ట్ లో ఒంటరి గా తగిలింది. ఆమె లిఫ్ట్ లో నాకు ఎదురు గా నిల్చొంది.  నా కళ్ళు  ఆ అమ్మాయి వైపుకు లాగుతున్నాయి. నేను తల తిప్పి అద్దం లోకి చూస్తున్నప్పటికీ, నా మనసు మాత్రం గుడ్లు మిటకరించి సరళ వైపే చూస్తోంది.  నా చూపుల్ని ఆ అమ్మాయి గమనిస్తే బాగోదు.   కనీ నాకు లోపల ఎక్కడో సందేహం, ఆమె కూడా నన్నే గమనిస్తోందని. నా మనోనేత్రం ముందు ఆ అమ్మాయి నన్ను గమనిస్తోన్న దృశ్యం కదలాడి, నేను “షై” గా అవుతున్నాను. కానీ ఆ అమ్మాయి నన్ను చూస్తోందో  లేదో నిర్ధారించుకుందామంటే ఆ అమ్మాయి వంక చూడాలి..కానీ చూస్తే బాగోదు…ఒక వేళ నేను చూసిన టైం లో ఆ అమ్మాయి వేరే పక్కకు చూసి, నేను చూడనప్పుడు మాత్రమే నన్ను చూస్తే,నాకు ఎప్పటికీ తెలియదు ఆమె నన్ను చూస్తోందో లేదో. నా అటెన్షన్ మొత్తం ఆమె మీదే ఉంది కానీ నా చూపులు మాత్రం అద్దం వైపుకి ఉన్నాయి.  ఆమె కూడా ఉండటం నాకు లోలోపల పరమానందం గా ఉంది.  కానీ ఆ ఆనందం బయటపడకుండా దాచుకోవటం అసాధ్యమైపోతోంది నాకు.

ఆమె ఒక్కసారి గా నవ్వ సాగింది. నేను విస్తుపోయి ఆమె వైపుకి చూసే లోగా,ఆమె నా వైపుకు ఒక అడుగు వేసి,చేయి ముందుకి చాచి,”హాయ్,అయాం సరళా, అండ్ మీట్ మై ఫ్రెండ్
శ్రీధర్ అంది అద్దం లో నా బొమ్మ చూపిస్తూ. నేను అప్రయత్నం గా ఆమె చెయ్యి అందుకున్నాను. మాటలు ఆపేయటమూ ఆమె ఇష్టమే..మాటలు మొదలు పెట్టడమూ ఆమె ఇష్టమే..ఏంటో  ఈ సిటీ అమ్మాయిలు ఎప్పటికీ నాకు అర్ధం కారు.
****************************
సరళ గురించి నాది ‘విష్ ఫుల్ థింకింగ్’ అవునో కాదో తేల్చుకోవాలనిపించింది. సరళ కి తమిళ యాక్టర్ సూర్య అంటే ఇష్టం అని నాకు తెలుసు. ఈ రోజు సూర్య నటించిన గజిని కి రెండు టిక్కెట్ లు తీసుకొన్నాను. అ సాయంత్రం సరళ తో చెప్పాను,”మా ఫ్రెండ్ ఒకతను వస్తాడనుకొంటే అతను రావటం కుదర లేదు. గజిని సినిమా కి వస్తావా?”.
సరళ చిన్న పిల్ల లా అరిచి గోల చేసి తన సంతోషం ప్రకటించింది. ఇక్కడే గనుక మా అమ్మ ఉంటే సరళ ను కసురు కొనేది.ఆడ పిల్లలు ఒద్దికగా ఉండాలమ్మా అని చెప్పేది సరళకి..
మళ్ళీ నాకు అనుమానం,”సినిమా కి సూర్య వలన వస్తోందా, నా వలన వస్తోందా?”

మేము ఒక థియేటర్ కి వెళ్ళే బస్సు పట్టుకున్నాం. బస్సు లో ఆడవాళ్ళ సీట్ ల లో ఒకే సీట్ ఖాళీ గా ఉంది. పల్లెటూరి తమిళ రైతు పెళ్ళాం లా ఉన్నామె కిటికీ పక్క సీట్ లో కూర్చొని ఉంది. ఆమె పక్క సీట్ ఖాళీ గా ఉంది. సరళ కి ఆ సీట్ చూపించి “కూర్చోవచ్చు కదా”, అన్నాను. ఆమె కూర్చో లేదు. బస్సు దిగిన తరవాత సరళ ని అడిగాను, “సీట్లో ఎందుకు కూర్చో లేదు?” అని.
” ఆ ఆడ మనిషి చాలా రిపల్సివ్ గా కనిపించింది. అందుకే కూర్చో లేదు”.

ఆ సినిమా లో కొన్ని టెన్స్ మూమెంట్స్ ఉన్నాయి. అప్పుడు సరళ నా మోకాలి మీద చెయ్యి వేస్తోంది. అలానే కాసేపు ఉంచి చెయ్యి తీసివేస్తోంది. కావాలని చెయ్యి వేస్తోందా, యధాలాపం గా వేస్తోందా? ఇప్పుడే తేలి పోవాలి.
సరళ చెయ్యి తీసి,మళ్ళీ ఇద్దరిమధ్యా ఉన్న సీట్ కోడు మీద వేసి సినిమా లో లీనమైపోయింది. నా గుండె చప్పుడు నాకు వినపడుతోంది.లబ్ డబ్…లబ్…డబ్..
నేను నెమ్మది గా నా చెయ్యి తీసి ఆమె చెయ్యిమీద వేశాను.సరళ చెయ్యి వెనక్కి తీసుకో లేదు….సినిమా లో లీనమై పట్టించుకోవడం లేదా?!
సరళ ముఖం లో కి చూశాను. ఆమె అటెన్షన్ సినిమా మీద లేదని అర్ధమైంది  నాకు.నెమ్మది గా నా చెయ్యి ఆమె చేతి లోకి తీసుకొని మృదువు గా నొక్కింది. నా వైపు నవ్వు కళ్ళ తో చూస్తోంది.నేను ఆమె చేతిని పైకి తీసి నా గుండెల తో పాటు అదురుతున్న నా అధరాలకు ఆనించాను.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s