ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

శ్రీధర్ వాళ్ళ క్లాస్ లో రెండు గ్యాంగ్  లు ఉన్నాయి. ఒకటి శ్రీహరి గ్యాంగ్, ఇంకోటి వేణు గ్యాంగ్.  శ్రీధర్ వేణు గ్యాంగ్ లో మెంబర్. ఈరెండు గ్యాంగ్ లూ హై స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నాయి. బ్యాటూ వికెట్లూ కార్క్ బాలూ రెడీ అయ్యాయి. శ్రీహరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయటానికి సిద్ధమైంది. అది లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్. ఇరు జట్లూ ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తాయి. శ్రీహరి వాళ్ళ అన్నయ్య అంపైర్. ధడేల్ గాడు స్కోరర్. వాడు ఈ మధ్య గోడ మీది నుంచీ దూకి మోకాలి చిప్ప ఊడగొట్టుకున్నాడు. కాబట్టీ ఆడటం లేదు.
వేణు టీం బ్యాటింగ్ కి వచ్చింది. వేణూ శ్రీధరూ ఓపెనర్లు గా వచ్చారు. శ్రీధర్ మంచి హిట్టర్. వేణు డిఫెన్సివ్ గా ఆడతాడు. శ్రీధర్ వరుస గా నాలుగు బౌండరీ లు కొట్టి ఆ ఓవర్ లాస్ట్  బాల్ కి సింగిల్ తీసి మళ్ళీ స్ట్రైక్ కి వచ్చాడు. బౌలర్ కొత్త వాడు.   వాడు వేరే ఊరి నుంచీ ట్రాన్స్ఫర్ అయి వచ్చి స్కూల్లో ఆ ఏడే చేరాడు. బౌలర్ బాల్ ని ఆఫ్ స్టంప్ బయట వేశాడు.  నేల మీద చిన్న చిన్న గుంటలు ఉన్నాయి.బాలు ఏదో గుంత లో పడి, టర్న్ అయ్యి శ్రీధర్ మోకాలు కి కొట్టుకుంది. శ్రీధర్ మొకాలుని చూస్తూ రుద్దుకుంటున్నాడు. ఒక్క సారిగా జనాల అరుపులు వినపడ్డయి వాడికి. తలెత్తి పైకి చూస్తే   అంపైర్ వేలు పైకెత్తి ఉన్నాడు. శ్రీహరి టీం వాళ్ళు ఒకచోటకి చేరి సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ధడేల్ గాడు స్కోర్ కార్డ్ కింద పడేసి టైం ఔట్ కి అడిగాడు. వాడు అంపైర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు ఔట్ ఇచ్చావని అడిగాడు.అంపైర్ “ఎల్ బి డబ్ల్యూ” అన్నాడు.  ధడేల్ గాడు,”నువ్వేమి అంపైర్ వి రా? నీకు క్రికెట్ అసలు తెలుసా?” అన్నాడు వీడేదో ఎక్స్ పర్ట్  అయ్యినట్లు.
అంపైర్ వాడిని చంపేసేట్లు చూస్తూ,”నువ్వు టీం లోనే లేవు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రా. పోయి స్కోర్ వేసుకోరా”, అన్నాడు ఎగతాళి గా.
ధడేల్ గాడు, “కరెక్ట్ రా, నేను టీంలో లేను,నువ్వు మాత్రం అంపైర్ అయ్యివుండి కూడా, శ్రీహరి టీం లో ఉన్నట్లు మాట్లాడుతున్నావ్. వాళ్ళతో కలిసి తొండి చేస్తన్నావు రా”, అని అరిచాడు.
అంపైర్ ధడెల్ గాడి కాలర్ పట్టుకొని ఊపాడు. వాడి చొక్కా గుండీ కిందపడింది.  వేణు టీం లో జనాలు పిచ్ మీదకి వచ్చేశారు. ఈ లోపు శ్రీహరి వేణు  తో ఏదో మాట్లాడి సర్ది చెప్పాడు. ఆట మళ్ళీ మొదలైంది. వేణు  జట్టు 68 పరుగులు చేసింది, ఇరవై ఓవర్లలో. శ్రీహరి టీం బ్యాటింగ్ ప్రారంభించింది. ఒక పక్క ధడేల్ గాడు స్కోర్ నోట్ చేస్తుంటే, శ్రీహరి టీం లోంచీ వేరొకడు స్కోర్ నోట్ చేస్తున్నాడు.
వేణు మంచి ఫీల్డర్. వాడి త్రో లు కరెక్ట్ గా ఉంటాయి. అప్పటికే శ్రీహరి టీం లోఇద్దరు రన్ ఔటయ్యారు వాడి త్రో ల కి.
ధడేల్ గాడు లేచి అరిచాడు, “లాస్ట్ ఓవర్, ట్వంటీ ఫైవ్ రన్స్ టు విన్!!”. శ్రీహరి వాళ్ళ టీం ఇది తప్పుడు స్కోరని అరిచారు. వాళ్ళ స్కోరర్ ప్రకారం గెలవటానికి ఇంకా పన్నెండు రన్సే కావాలి. రెండు టీం లూ వాదించుకోవటం మొదలెట్టాయి. వేణు టీం వాళ్ళు,”అంపైర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం కదా. వాడు ఎల్ బీ దబ్ల్యూ ఔట్ ఇస్తే మేము ఎదురు చెప్పలేదు కదా! మీరు కూడా స్కోరర్ ధడేల్  గాడి మాట వినాలి” అన్నారు.
చివరికి శ్రీహరి జట్టు 25 రన్ల లక్ష్యానికి  కి బాటింగ్ చేయటానికి ఒప్పుకుంది. ఆ చివరి ఓవర్ మొదట్లో ఒక ఫోరూ,ఒక సిక్సూపడ్డాయి. తరువాతి మూడు బాల్సూ డాట్ బాల్స్. లాస్ట్ బాల్ పడింది. బ్యాట్స్ మేన్ గట్టిగా కొట్టాడు. బాలు బౌండరీ లైన్ వైపు పరుగెట్టసాగింది. అక్కడ వేణు ఉన్నాడు. వాడు బాల్ ని వికెట్ కీపర్ చేతుల్లోకి చక్కగా త్రో చెసాడు. చివరి గా శ్రీహరి టీం, మాచ్ ని 15 రన్స్ తో ఓడిపోయింది. కానీ దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ధడేల్ స్కోర్ సరిగా వేయలేదన్నారు వాళ్ళు. వేణు టీం వాళ్ళూ అంపైర్ తొండి చేసినా మేమే గెలిచామన్నారు. రెండు జట్లూఒకరిని ఒకరొ,”మోసం చేశారు”, అనుకుంటూ విడి పోయాయి.
గ్రౌండ్ లో పక్కనే వాలీ బాల్ గేం జరుగుతూ ఉండటం తో, శ్రీధర్ చూడటానికి వెళ్ళాడు. వాడి టీం లో మిగతా వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయారు.  వాలీ బాల్ గేం అయిన తరువాత శ్రీధర్ ఇంటి ముఖం పట్టాడు. దారి లో వాడికి శ్రీహరి గ్యాంగ్ తగిలింది. వాళ్ళు వీడిని ఏడిపించటం మొదలు పెట్టారు. వాళ్ళలొ ఒకడన్నాడు, “వికెట్ కి కాళ్ళు అడ్డు పెడితే, ఎవరైనా సచిన్ లా బ్యాటింగ్ చెయ్యవచ్చు రా!”. “స్కోర్ లో మోసం చేస్తే ఎవరైనా గెలుస్తారు రా”,ఇంకొకడు అంటున్నాడు.గ్యాంగ్ అంతా నవ్వుతోంది. వాళ్ళు వాడి వైపుకి నెమ్మది గా నడుచుకు వస్తున్నారు. శ్రీధర్ కి వళ్ళు మండుతోంది వాళ్ళందరి పైనా. వాడు ఒక్క సారి గా వంగి, కింద నుంచీ ఒక రాయి తీసి విసిరేశాడు శ్రీహరి వైపుకి బలం గా. వెంటనే వెనక్కి తిరిగి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు వాడు. ఆ రాయి శ్రీహరి రొమ్ము మీడ బలం గా తగిలింది. గ్యాంగ్ లో వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళు తేరుకొనే లొఫు శ్రీధర్ పారిపోయాడు.
మరుసటి రోజు హెడ్ మాస్టరు వేణు టీం ని పిలిచి అడిగాడు, “ఏంటి రా బళ్ళోగొడవలు మొదలెట్టారంట”, అని. తరవాత ఆయన శ్రీహరి గ్యాంగ్ ని కూడా పిలిచాడు. బళ్ళోని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. వాళ్ళ చేతికి బెత్తాలిచ్చి,వాళ్ళ చేత రెండు గ్యాంగ్ ల లో వాళ్ళనీ, వాళ్ళ చేత కొట్టించాడు. ఆ పైన రెండు గ్యాంగ్ లనీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొమ్మన్నాడు.  చివరి గా,” మళ్ళీ మీరు ఫైటింగ్స్ చేశారో, అందరినీ స్కూల్ నుంచీ డిబార్ చేస్తా”,అని హెచ్చరించి వదిలాడు.
********************
శ్రీధర్ ఆ మధ్య పేపర్ సిగరెట్లు కాల్చటం నేర్చుకొన్నాడు,ధడేల్ నుంచీ. వాడూ ధడేలూ  ఎండిపోయిన తాటి పువ్వుని పేపర్ లో చుట్టి, శ్రీధర్ వాళ్ళ దొడ్లో తాగ  సాగారు. శ్రీధర్ వాళ్ళ నాన్న దాన్ని చూశాడు. ఇద్దర్నీ పిలిచి అన్నాడు,”ఇది మంచి అలవాటు కాదు”.
హఠాత్తు గా శ్రీధర్ అన్నాడు, “మరి నువ్వు చుట్ట ఎందుకు కాలుస్తావ్?”
కృష్ణా రావుఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం కృష్ణా రావు శ్రీధర్ ని ఆయన గది లోకి పిలిచాడు.
“నేను చిన్నప్పుడు ఏదో సావాస దోషం వలన చుట్టకి అలవటు  పడ్డాను.మానెయ్యటానికి చాలా సార్లు ప్రయత్నం చేశాను. కానీ కుదలేదు. పొగ తాగటం లో ఉండే నష్టాలేంటో నాకు తెలుసు. ఒక సారి మొదలైన తర్వాత మానటం కష్టం. నేను తాగినా,నువ్వు తాగటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నువ్వు పొగతాగవద్దని చెప్తున్నా. అ తరవాత నీ ఇష్టం”, అన్నాడాయన.
ఆ తరువాత శ్రీధర్ ఎప్పుదూ పొగ తాగలేదు. అయితే ఈ సంఘటన తో వాడికో విషయం అర్ధమయ్యింది. ఒక నియమాన్ని పాటించని వ్యక్తులకి కూడా,ఆ నియమాన్ని పాటించమని చెప్పే అధికారముంటుంది. అయితే ఆ నియమం ఎదుటి వారి మేలు కోరి చెప్పినదై ఉండాలి.

శ్రీధర్ పై ఈ సంఘటన బలమైఅన్ ప్రభావాన్నే చూపింది.శ్రీధర్ తరువాత కాలేజీ రోజుల్లో ఈ సంఘటన ను గుర్తు చేసుకొన్నపుడు, వాడి ధోరణి ఇలా మారింది….”వ్యక్తిగతం గా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని పాటించ లేని వారికి,  సమజానికి పాటించమని చెప్పే అధికారం ఉంటుంది, వాళ్ళు నిజాయితీగా సమాజం మేలు కోరెవారైతే, ఆ పాటించకపోవటంలో వాళ్ళ స్వార్థం లేనట్లయితే. అయితే వాళ్ళ విమర్శకులు వాళ్ళని తప్పుపట్టవచ్చు. కానీ విమర్శకులు నీతులు చెప్పనంత మాత్రాన వారికి ఏ వెధవ పనైనా చేసే అధికారం ఉండదు. వారికి విర్శించే హక్కు కూడా ఉండదు. ‘ఆం చైర్ కమ్యూనిస్ట్’  ల లో చాలా మంది కృష్ణా రావు వంటి వారనిపిస్తుంది”.

ఇంకా ఉంది…

ప్రకటనలు

6 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

 1. ఒక నియమాన్ని పాటించని వ్యక్తులకి కూడా,ఆ నియమాన్ని పాటించమని చెప్పే అధికారముంటుంది. అయితే ఆ నియమం ఎదుటి వారి మేలు కోరి చెప్పినదై ఉండాలి. వ్యక్తిగతం గా ఒక రాజకీయ సిద్ధాంతాని పాటించ లేని వారికి, సమజానికి పాటించమని చెప్పే అధికారం ఉంతుంది, వాళ్ళు సమాజం మేలు కోరెవారైతే, ఆ పాటించకపోవటంలో వాళ్ళ స్వార్థం లేనట్లయితే.

  మెచ్చుకోండి

  1. జవహర్ గారు,
   ఈ నవలను కినిగె లో అమ్మకానికి పెట్టటమైనది (Rs 45/-).
   http://kinige.com/kbook.php?id=456
   కాబట్టీ దానిని ఇక్కడి నుంచీ తీసివేశాను

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s