ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-15

నాకు ఫ్లైట్ ఎక్కటం  అదే మొదటి సారి..అదీ డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్..నేను అంతకు ముందెపుడూ డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్క లేదు. ఫ్లైట్ ఎక్కటం తోనే ఏదో సాధించినట్లనిపించింది నాకు. మా ఫ్లైట్ సింగపూర్ నుంచీ  లాసేంజెలిస్  వెళ్తుంది. మనీషూ అతని భార్యా కూడా అదే ఫ్లైట్ లో వచ్చారు. మనీష్ వైఫ్ చెన్నై లో ని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ  లో పనిచేస్తుంది. వాళ్ళ ట్రిప్ లాంగ్ టర్మ్ అవ్వటం వలన ఆమె జాబ్ కి రిసైన్ చేసింది. ఫ్లైట్ లో వాళ్ళిద్దరూ చాలా సంతోషం గా కనిపించారు. వాళ్ళు చెన్నై లో వాళ్ళ ఇల్లు ఖాళీ చేశారు. వాళ్ళు అప్పుడే యూఎస్ లో ఏ ఏ ప్లేసులు చూడాలో ప్లాన్ చేసేసుకొంటున్నారు. ఒక మ్యాప్ చూస్తూ  వెళ్ళవలసిన  ప్లేస్ లన్నీ లెక్కపెట్టుకొంటున్నారు. యూనివర్సల్ స్టూడియో,  న్యూ యార్క్, ఫ్లోరిడా..ఇలా చెప్పుకుంటున్నారు.
లాసేంజెలిస్ ఎయిర్ పోర్ట్ నాకు బాగా నచ్చింది. దాన్ని రెండు ఫ్లోర్స్ గా కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అరైవల్స్ కి,ఫస్ట్ ఫ్లోర్ అంతా డిపార్చర్స్ కి. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కే సపరేట్ గా రెండు లెవల్స్ లో సిటీ నుంచీ రోడ్లు ఉన్నాయి.
మా కంపనీ వాళ్ళు పాసడీనా లో ఒక అపార్ట్ మెంట్ తీసుకొని ఉంచారు. మనీష్ చెయ్యి ఊపి ఒక టాక్సీ ని ఆపాడు.  అపార్ట్మెంట్ కి వెళ్ళే దారి లో అక్కడి రోడ్లూ, పార్కులూ బిల్డింగులూ చూస్తూ ఉంటే ఇది కలా నిజమా అనిపించింది. నన్ను గిల్లి చూసు కోవాలనే ప్రయత్నాన్ని ఆపుకొవాల్సి వచ్చింది. ఇంతకు ముందు సినిమాల లో తప్పిస్తే నేను ఎప్పుడూ ఫారిన్ లొకేషన్స్ చూడ లేదు.
బాలా అని మా కొలీగ్ ఒకతను నేను వెళ్ళేటప్పటికే ఉన్నాడు రూం లో. అతని తో నాకు ఈ మూడు నెలలూ రూం షేరింగ్. బాలా కి టీనేజ్ లో లవ్ ఫెయిల్ అయ్యినట్లు గ్రహించాను అతని మాటల వలన. బాలా కి ఓ కారుంది. రోజూ నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసే వాడు. గ్యాస్ డబ్బులు షేరింగ్.
బాలా ఆఫీస్ పని లో ఉండనప్పుడల్లా ఒకే పని లో ఉండేవాడు. అది ” జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదవటం.” ఆయన టీచింగ్స్ ని ప్రాక్టీస్ చేయటం లేదా జీవించటం.  బాలా తో పాటు నేను కూడా కొన్ని రోజులు జిడ్డు కృష్ణమూర్తి ని చదివే వాడిని. ఆయన చెప్పిన,” సత్యమనేది ఒక దారి లేని ప్రదేశం”, అనే సత్యం నాకు చాలా నచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి నన్ను కూడా జిడ్డు లా పట్టుకున్నాడు.అయితే కొన్నాళ్ళు మాత్రమే.
********************
ఓ రోజు ఆఫీస్ లో నాకు మనీష్ కనిపించాడు. అతని ముఖం చాలా డల్ గా ఉంది. అతని ప్రాజెక్ట్ స్క్రాప్ అయ్యిందట. కస్టమర్ గాడి కస్టమర్ ఫండింగ్ తగ్గించాడు.అందువలన అతని ప్రాజెక్ట్ కి కోత పడింది. అతను ఫ్యామిలీ తో సహా ఆ వీకెండే  ఇండియా వెళ్ళి పోవాలి. ఈ విషయమంతా మనీష్ నవ్వుతూ చెప్పటానికి ట్రై చేశాడు కనీ, అతని గొంతు మాత్రం నవ్వటం లేదు.
అతను అన్నాడు, “ఓహ్ మళ్ళీ  మొదటికే ఒచ్చింది కథ. మళ్ళీ ఆ పొల్యూషన్..మళ్ళీ ఆ జనాలూ ..ఆ దుమ్మూ.. చెన్నై లో మళ్ళీ అపార్ట్ మెంట్ కోసం తిప్పలూ మళ్ళీ…
అక్కడి జనాలు ఎందుకు తిరిగి వచ్చావ్ అని అడుగుతారు…వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఎక్స్ ప్లైన్ చెయ్యాలి ఆహ్..మళ్ళీ మా ఆవిడ ఉద్యోగం కోసం..ప్రయత్నాలు మొదలెట్టాలి”
అతను వేరే కన్సల్టంట్ దగ్గరికి జంప్ అవుదామని చూశాడట. కానీ షార్ట్ నోటీస్… అవటం వలన సాధ్యం కాలేదట. అమెరికా లో మార్కెట్ కూడా స్లో అవ్వుతోందట.  అపార్ట్ మెంట్ రెంట్ కి ఇచ్చిన అడ్వాన్స్  ని అతను ఇప్పుడు వదులు కోవాలిట. కారు అప్పు ఎలా తీర్చాలో ఇంకా ఆలోచించలేదట. బహుశా  కారు ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో వదిలిపోవాలేమో అంటున్నాడు.
********************
నాకు జిడ్డు కృష్ణమూర్తి బోర్ కొట్టడం మొదలెట్టాడు. అది నా మైండ్ కి ఉన్న లిమిటేషన్ వలన కావచ్చు. బాలా కి మట్టుకు అది ఒక పాషన్. బాలా లవ్ లో ఫెయిల్ అవ్వటం వలన ఆ పాషన్ ని జిడ్డు కృష్ణమూర్తి టీచింగ్స్ మీదికి అన్-కాన్షస్  గా మళ్ళించాడని నాలో నేను ఒక థియరీ కనిపెట్టాను. ఈ థియరీ మీద నా స్వభావం యొక్క ప్రభావం ఎంతో, ప్రభావం లేని సత్యమెంతో ఆ జిడ్డు కృష్ణ మూర్తి కే ఎరుక.
*********************
క్రిస్మస్ సెలవలు కావటం తో లాస్ వేగాస్ వెళ్దామన్నాను బాలా తో.
“లాస్ వేగాస్ లో నాకు టైం పాస్ కాదు”, అన్నాడతను. ఇంకా,”దట్స్ ఎ చైల్డిష్ సిటీ”, అని కూడా అన్నాడు. అయితే గ్రాండ్ కాన్యాన్ కైతే వస్తానన్నాడు బాలా. సరే రెండింటికీ వెళ్దామని బాలాని బయలదేర దీశాను.
బాలా కార్ లో మొదట గ్రాండ్ కాన్యాన్ కి వెళ్ళాం. మెకన్నాస్ గోల్డు లోనూ టక్కరి దొంగ లోనూ కనిపించే సైట్ ఇదే. ఎండకి ఇక్కడి కొండలు పొద్దునా సాయంత్రమూ బంగారు రంగు లో కనిపిస్తాయి..
గ్రాండ్ కేన్యాన్ చేరేటప్పటికి ఉదయం ఆరయ్యింది. అక్కడ పద్ద మంచు గడ్డలు అప్పుడే కరుగుతున్నాయి. నాకు మొదటి సారి గా జీవితం లో మంచు ఎలా ఉంటుందో తెలిసింది. జీవితంలో మొదటి సారి గా చలిని తట్టుకోలేక పోవటం ఎలా ఉంటుందో కూడ ఆక్కడే తెలిసింది. మొట్టమొదటి సారి మాటలకందని భావనలు ప్రకృతి ని చూస్తే కలుగుతాయనీ తెలిసింది.
గ్రాండ్ కేన్యన్ భూ ఉపరి తలానికి పడిన ఒక పాట్-హోల్  లా ఉంది. దాని అడుగున కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ భూ గోళం చరిత్ర అంతా ఒక్క సెకండ్ లో తెలిసింట్లుంటుంది.
బాలా ఆ కొండ రాళ్ళ మీద గ్రాండ్ కేన్యాన్ చేసే మ్యాజిక్ చూస్తూ చాలా సేపు కూర్చున్నాడు. అప్పుడు గ్రాండ్ కేన్యన్ గురించి జిడ్డు కృష్ణ మూర్తి ఏమన్నాడో చెప్పాడు బాలా. నాకు గుర్తు లేక పోవటం వలన ఇక్కడ కోట్ చేయలేకపోతున్నాను.
కొంచెం సేపటి తరువాత బాలా హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళాడు. నాకు ఆ రైడ్ కాస్ట్-లీ అనిపించింది.  డాలర్లని రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తే అనిపించదా, మరి? నేను మాత్రం హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళకుండా కార్లోనే కూర్చున్నాను.
బాలా హెలికాప్టర్  రైడ్ అయ్యాక హోటల్ రూం కి వెళ్ళి తిని పడుకున్నాం. మరుసటి రోజు కూడా గ్రాండ్ కెన్యాన్ మీదు గా కార్ లో వెళ్ళి, అక్కడి నుండీ లాస్ వేగాస్ వైపుకి బయలు దేరాం. కారు లో  స్టీరియో పాడుతోంది,”ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై! ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై!”
తను లాస్ వేగాస్ కి ఇష్టం లేక పోయినా వస్తున్నాడు కాబట్టి,నేను తరువాత అతనికి ఒహాయ్ లోని జిడ్డు కృష్ణమూర్తి రిట్రీట్ కి వెళ్ళటానికి కంపెనీ ఇవ్వాలని కండిషన్ పెట్టాడు బాలా.

ఇంకా ఉంది…

ప్రకటనలు

5 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-15”

 1. మీ నవల సీరియల్ చాలా ఆసక్తికరం గా వుంది. అభినందనలు.
  కొన్ని భాగాల మీద క్లిక్ చేసినప్పుడు ఈ కింది ఎర్రర్ వస్తోంది దయచేసి సరిచేయండి
  ఉదాహరణకి 6 (7 ), 12 , 13 , 14 భాగాలు.
  “404 దోషము – కనిపించలేదు”

  మెచ్చుకోండి

 2. ధన్యవాదాలండీ..ప్రభాకర్ గారూ,
  నేను ఈ ప్రాబ్లం సరి చేయటానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు మీరు వెబ్ పేజీ పై మూలల్లో ఉన్న లింకుల ద్వారా ప్రయత్నించవచ్చు.

  మెచ్చుకోండి

 3. కలియుగములో గురు పరంపర: చరిత్రకు అందినంతలో
  1. శ్రీ అల్లమ ప్రభు(క్రీ. శ. 1150)
  2. శ్రీ బసవేశ్వరుడు(క్రీ. శ. 1134 – 1196)
  3. శ్రీ బ్రహ్మానంద స్వామి,
  4. శ్రీ రామానంద స్వామి (క్రీ. శ. 1366 – ?)
  5. శ్రీ జ్ఞానేశ్వరులు (1275?-1296?)
  6. శ్రీ కబీర్ ( క్రీ. శ. 1398 – 1448?)
  7. శ్రీ సహజానందులు,
  8. శ్రీ రామావధూత,
  9. శ్రీ అంబికా శివయోగి,
  10. శ్రీ వేమనా యోగి (క్రీ.శ. 1352 – 1420?)
  11. శ్రీ నిరంజన వెంకయార్య,
  12. శ్రీ తిరువెంగళార్య,
  13. శ్రీ శ్రీధరస్వామి,
  14. శ్రీ శివరామదీక్షితులు (క్రీ.శ. 1690 -1791).
  15. శ్రీ కంబాలూరి అప్పబ్రహ్మం,
  16. శ్రీ పరశురామ సీతారామ స్వామి ( ? – క్రీ.శ. 1832),
  17. శ్రీ భాగవతుల కృష్ణదేశికులు (? – క్రీ. శ 1879),
  18. శ్రీ ఫీల్ఖాన లక్ష్మణ రావు
  19. శ్రీ ఫీల్ఖాన శంకర రావు (? – క్రీ.శ. 1891),
  20. శ్రీ సచ్చిదానంద పగడాల వేంకటేశ్వరావధూత (క్రీ. శ 1865 – 1940),
  21. శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రావు రాజయోగి (? – క్రీ. శ 1934),
  22. శ్రీ దయానంద పొన్నాల రాజయాఖ్య రాజయోగి (క్రీ.శ. 1899 – 1985),
  23. శ్రీ దయానంద డా పొన్నాల సాందీపని రాజయోగి (క్రీ.శ. 1945 – ).
  “మనమే మన కర్మలు చేస్తున్నాము అనే భావన ఉంటె దాని ఫలితము కూడా మనము అనుభవించాలి. కాని మనం “నేను ఎవరిని” అనే “ఆత్మ-విచారణ” చేసుకొని నిజముగా మనమే అన్ని పనులు చేస్తున్నామా అని ప్రస్నిన్చుకున్నపుడు
  మన అన్ని కర్మలు వెళ్ళిపోతాయి.అల అన్ని బంధాలు నుంచి విముక్తి పొందడమే ‘ఆత్మ-జ్ఞానము’

  మెచ్చుకోండి

 4. మానవునకు దేహ భావం ఉన్నంతవరకు అన్ని రకాల దుఃఖాలు తప్పవు. దేహ భావానికి కారణం మనస్సు. మనస్సును చంపితే వెంటనే దైవ భావం కలుగుతుంది. దుఃఖం నుంచి విముక్తులవుతారు. ఆనందంగా వుంటారు. మార్గమే . మనస్సు నిశ్చలమైనపుడు ముక్తి లభిస్తుందని. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి. వేటి నుండి అంటే అనారోగ్యం, అశాంతి, దుఃఖం, బాధలు, కష్టాల నుండి జీవించి ఉండగానే ముక్తి పొందవచ్చు. అందుచేత ‘: మనస్సు నిశ్చలమైనపుడు ఉంచడం ద్వారా చిత్తం అంటే మనస్సు నిశ్చలం చేసుకోవాలి. య అంటే చిత్తం యోగం ‘ ద్వారా మనస్సు శూన్యం చేసుకొని అంతర్ నిశ్శబ్దాన్ని అంటే ఆలోచనలు లేని స్థితి, మనస్సును స్థితి పొందితే దుఃఖం నుంచి ముక్తి. అంటే యోగ స్థితి పొందాలంటే చిత్తం లోని వృత్తులు అంటే ఆలోచనలు నిరోధించాలి. అంటే మనస్సు శూన్యం చేయాలి. దాని మార్గమే ” అలా యోగ స్థితి పొందితే వారు దుఃఖం నుండి బయటపడతారుమానవునకు దేహ భావం ఉన్నంతవరకు అన్ని రకాల దుఃఖాలు తప్పవు. దేహ భావానికి కారణం మనస్సు. మనస్సునునిల్సినంత యోగ స్థితి పొందితే
  వెంటనే దైవ భావం కలుగుతుంది. దుఃఖం నుంచి విముక్తులవుతారు. ఆనందంగా వుంటారు. దాని మార్గమే ” ” ధ్యానం. ఇంద్రియాలను జయించినవాడే ” “మనస్సు శుద్ధత ” ను సూచిస్తుంది. అందుకే, అంటే “మనస్సు శుద్ధ తత్వం ఇంద్రియాలను జయించినవాడే శుద్ధ సత్వాన్ని సంతరించుకుంటాడు శుద్ధ సత్వాన్ని సంతరించుకున్నవాడే ఇంద్రియాలను జయిస్తాడు. మహా మహులైన యోగులందరూ అటువంటి వారి మాటలకూ, చేష్టలకూ తిరుగు వుండదు … ఆ స్థితినే ” ఒక మాట, ఒక బాణం ” అన్నారు. అందుకే, ఆత్మఆయుధం ” ఆత్మవజ్రాయుధం “. తపస్సు అంటే మనస్సు నిల్సినంత ధ్యానం ; ద్వారానే ‘ స్థితి ‘ వచ్చేది. ‘ ఆత్మసత్యం ‘ అనే సూర్యుణ్ణి చూడలేం. అంత తీక్షణమైందిఆత్మ సత్యం. ! అయితే, ఆత్మసత్యాచరణ ద్వారా సూర్యుని వెలుగు మాత్రం చూడవచ్చు. ! ఆత్మ’ లేకుండా అలాంటి దర్శనం లభించడం సాధ్యం కాదు
  మనస్సును ఆత్మలో లయం చేయాలి. అంటే మనస్సు నిర్గుణ స్థితికి చేరితే ఆత్మలో లయమైనట్టే. అదే ముక్త స్థితి ద్వారా తేలికగా సాధించవచ్చు. దుఃఖం నుండి బయటపడవచ్చు మానవుల బంధం అంటే దుఃఖానికి, మోక్షం అంటే ఆనందానికి మనసే కారణమని శ్రుతి వాక్యాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మనసు లేని స్థితి నిద్రా స్థితి లో మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. మెలకువ లో మనస్సు వుంటుంది కాబట్టి మెలకువ రాగానే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అందుచేత మనస్సు వుంటే దుఃఖం. మనస్సు లేకపోతే ఆనందం. మరి దుఃఖం నుండి బయట పడాలంటే, మనస్సును నిలపాలి. అంటే మనస్సు యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా తొలగించాలి. ఆ మార్గమే ధ్యానం “.శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిస్నానమందు లేదు, పానమందు లేదుమంత్రతంత్రములందు మహిమ లేదు మనసు నిలుపకున్న యోగి కాళికాంబ హంస కాళికాంబ ! మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా
  చూపు నిలుపకున్న సుఖము లేదు మనసు నిలుపకున్న నదీ స్నానాలు, సముద్ర స్నానాలలో ఏమీ లేదు. ఆలయాలలో తీసుకునే తీర్థం, గంగా తీర్థం పానం చేసినా ఫలితం ఉండదు. మనసు కాశిఁజేరు మఱి ముక్తి లేదు మనసు మంత్రము మనసు నిలుపకున్న ఏమీ లేదు. మనసును నిలుపకున్న నిర్గుణ స్థితికి చేర్చగలిగితేనే యోగి కాగలడు. దుఃఖం నుండి బయటపడగలడు. అదే ముక్తి. యోగితనలో సర్పంబుండగ తనలోపల వెదుక లేక ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల దెల్పంగ వశమే మహిలో సమస్తం అంటే తనకు కావలసిన ఆరోగ్యం, శాంతి, ఆనందం, జ్ఞానం అంతా అన్నీ తనలోనే వుంటే మానవులు, తనలో వెతకకుండా బయట వెతుకుతున్నారు. బరువు మోస్తున్న ఎద్దుల వలె ఈ జీవితాన్ని భారంగా తయారు చేసుకుంటున్న

  మెచ్చుకోండి

 5. మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు సూక్ష్మాతి సూక్ష్మ మైన చైతన్య సమాధి

  ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నిన్ను నీవు తెలుసుకోకుండా. జ్ఞాన0 నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. నేత్రమైనను చూడలేని సూక్ష్మ చైతన్య.. కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మ చైతన్య బట్టబయలు అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మ చైతన్య సమాధి సాధన ద్వారా తెలుస్తుంది
  మనస్సు,నిలిపి తపస్సు చేసిన ఈ దశలో. తమ గురువుల ద్వారా వేద సారం ఆత్మానుభవము అని తెలుసుకున్నారు సూక్ష్మా బుద్ది మార్గము సాధన మనస్సు ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు యోగి ఋషులూ తెలుసుకున్నారు సూక్ష్మాతి సూక్ష్మా చైతన్య అతీతుడై యుండును. తపస్సుల కన్నను, జ్ఞానుల కన్నను, కామ్యకర్ముల కన్నను యోగి అధికుడైనందున నీవు తప్పక యోగివి కమ్ము. గురువుగా బోధి ధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేల మంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు. ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది
  ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, … మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు ఎక్కడికైతే చేతులు వెళతాయో..అక్కడ దృష్టి ఉండాలి, ఎక్కడ దృష్తి ఉంటుందో అక్కడ మనస్సు నిలపాలి, …కనురెప్పపాట్లు సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్య తెలుసుకున్నారు మహతత్వము కనురెప్పపాటులో దృష్టి: మనస్సు,నిలిపి అతి సూక్ష్మమైన, చైతన్య అణుస్వరూపమైన. సూక్ష్మమైన పరమాణువుకు పరమాణువుకూ వరకూ ఉండే.ఇదే సర్వత్ర వ్యాపించి వున్న … నేత్రమైనను చూడలేని
  సూక్ష్మ ప్రయాణమున నీవు తిలకించు

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s