ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-16

ఓ రాజకీయ నాయకుడి హత్య వలన చిన్నూ వాళ్ళ ఊళ్ళో గొడవలు చెల రేగాయి. ప్రభుత్వం గొడవలు అదుపుచేయటానికి పారామిలటరీ ని ఊళ్ళోకి దించింది.పారా మిలిటరీ వాళ్ళు మెయిన్ రోడ్డు లో ఫర్లాంగు కి ఒకరు చొప్పున కాపలా కాశారు. నాలుగైదు రోజులలో ఊరు సద్దుమణిగింది.   పారా మిలిటరీ వాళ్ళు అంతా నార్త్ ఇండియన్స్. వాళ్ళలో ఎవరికీ ఒక్క ముక్క కూడా తెలుగు తెలియదు.ఊళ్ళో వాళ్ళకి హిందీ తెలియదు. వాళ్ళకి ఊరి పెద్దల ఇళ్ళ లో భోజనాలు ఏర్పాటయ్యాయి. హై స్కూళ్ళో అప్పుడే హిందీ నేర్చుకొంటూన్న పిల్లలు , వాళ్ళ హిందీ పాటవాన్ని, ఈ జవాన్ల ముందు ప్రదర్శించటానికి ఉబలాట పడేవాళ్ళు. అది తప్పితే జవాన్లకి కాలక్షేపం లేదు. అయితే ఆదివారం మాత్రం దీనికి మినహాయింపు.. ఆదివారం పొద్దున్నే టీవీ లో మహాభారత్ వస్తుంది, హిందీ లో.  ఆ సమయానికి ఊళ్ళో వాళ్ళంతా పాల కేంద్రానికి చేరే వాళ్ళు.  ఎందుకంటే ఊళ్ళో ఉండే నాలుగైదు టీవీ సెట్లలో ఒకటి అక్కడే ఉంది. జవానులు కూడా గస్తీ కట్టిపెట్టి టీవీ  దగ్గరికి చేరుకొనేవారు. భారతం చూస్తూ ఆ సన్నివేశాల గురించి  జవాన్లు ఊరి జనాలతో హిందీ లో ఏదో మాట్లడే వారు. ఊరి జనం వారికి తిరిగి తెలుగు లో సమాధానం ఇచ్చే వాళ్ళు.మహా భారతం వలన వాళ్ళు తమ మధ్యన ఉండే భాషావరోధాలను అధిగమించారు. అది తరతరాల వారసత్వం కదా.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-16”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s