ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-18

శ్రీధరూ వాడి ఫ్రెండ్సూ ‘కలియుగ పాండవులు ‘ సినిమా కి వెళ్ళారు. ఆ సినిమా లో వెంకటేష్ అగ్గిపుల్ల గీసే పద్దతి వాడికి నచ్చింది. ఇంటికొచ్చిన తరువాత అలా గియ్యటం బాగా ప్రాక్టీస్ చేశాడు వాడు. వాడి ఫ్రెండ్స్ ని పిలిచి చూపించాడు గొప్పగా. తరవాత అందరూ కలిసి హై స్కూల్ గ్రౌండ్  కి వెళ్ళారు క్రికెట్ ఆడటానికి. ఆట మధ్య లో కృష్ణా రావు వచ్చి శ్రీధర్ ని ఇంటికి పిలుచుకొని పోయడు. మామూలు గా ఎంతో ప్రశాంతం గా ఉండే కృష్ణా రావు,  అప్పుడు మాత్రం కోపం తో ఊగి పోతున్నాడు. చింత బరికె ఒకటి తీసుకొని చిన్నూ గాడి చెమడాలు ఊడగొట్టడం మొదలెట్టాడు. సీతమ్మ గారు వచ్చి ఆపే దాక వాడి వళ్ళు వాతలు దేలుతూ నే ఉంది.
“చిన్నపిల్లాడు, ఆణ్ణి ఆ రకం గా కొడితే ఎలా రా అబ్బాయ్?” అని అడిగిందామె కృష్ణా రావు ని.
“వడ్ల బస్తాలు మొత్తం కాలి పోయాయి. అగ్గిపుల్లలు గీసి అడాదు..చింతపండు గాడు చెప్పబట్టీ సరిపోయింది. లేక పోతే మొత్తం మసి అయ్యిపోయేది”
“అయితే మాత్రం చిన్నపిల్లాణ్ణి అట్టా బాదితే ఎలా?” అని కృష్ణా రావు ని గదిమిందామె.
కృష్ణా రావు,” ఆ… పిల్లాడు, బడితె లా పెరగగానే సరి కాదు.జ్ఞానం ఉండాలి” అన్నాడు.
దానికి సీతమ్మ గారు,” నువ్వు ఆడి వయసు లో ఇంకా ఉలిపి పనులు చాలానే చేశావు. కాస్తంత కోపంతగ్గించుకొని ఆలోచించుకో”, అంది.
శ్రీధర్ సీతమ్మ గారి మాటలను విని ఏడుపు మరింత పెంచాడు.
సీతమ్మ గారు,”నిప్పుతో ఆటలాడితే ఎట్టా రా నాయనా?” అంది.
దానికి వాడు,”ఇంకెప్పుడూ చెయ్యనే నాయనమ్మా” అంటూ రాగం తీశాడు.
“సరే సరే.., అన్నీ తాత పోలికలే, వెంటనే ఒప్పుకున్నావు..చాలు”,అని ముద్దు పెట్టుకొంది వాడిని.
*******************
శ్రీధర్ కి టెంత్ క్లాస్ మార్కులు బాగానే వచ్చాయి. విజయవాడ లో ని ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు తక్కువ ఫీజు కే శ్రీధర్ ని చేర్చుకొన్నారు. అప్పటి దాకా ఇల్లు వదలని శ్రీధర్  అక్కడ కొన్నాళ్ళు బెంగ పడ్డాడు. అక్కడి కాలేజీ లో పిల్లలు చేసే చేష్టలు వాళ్ళ వయసుకి మించినవి గా అనిపించాయి శ్రీధర్ కి. ఇదే వెంకటాపురం లో అయితే వాళ్ళను ముదుళ్ళు అనే వాళ్ళు. “బాబాయ్ జ్యోతీ టాకీస్ లో మంచి సీనులున్న సినిమా అడుతోంది. వస్తావా?” అని వాడిని ఎవడన్నా అడిగే వాడు. కానీ వాడికి అవన్నీ తన వయసుకి మించిన పనులు గా అనిపించాయి.
శ్రీధర్ అక్క కవిత కి డిగ్రీ  పూర్తి చెయ్య  గానే పెళ్ళి అయిపోయింది. పెళ్ళికొడుకు మహీధర్ ఉయ్యూరు లో లెక్చరర్ గా పని చేస్తాడు. కృష్ణా రావు పెళ్ళయ్యే ముందే కాబోయే అల్లుడి తో చెప్పాడు, “నాకు అమ్మాయయినా అబ్బాయయినా ఒకటే. నాకున్న దాంట్లో అమ్మాయికి సగం ఇస్తాను. మిగతాది నా తదనంతరం అబ్బాయికి వెళ్తుంది”
పెళ్ళి లో శ్రీధర్ కి బాగా బోర్ కొట్టింది. లేనినవ్వు ని మొఖానికి పులుముకుని, “బాగున్నారా? ఎలా ఉన్నారు?” అని మాట్లాడే వాళ్ళని చూస్తే వాడికి కాలింది.
శ్రీధర్ వాళ్ళ బావ వాళ్ళ అక్కని బాగానే చూసుకొనే వాడు. కొన్ని రోజుల తరువాత కవిత కి కూడా టీచర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఇంట్లో ఆమె పని మాత్రం తగ్గలేదు. మహీధర్ కాలేజీ నుంచీ ఇంటికి వచ్చిన వెంటనే వాలు కుర్చీ వేసుకొని పొద్దున చదివిన పేపరే మళ్ళీ తిరగేస్తూ, “కవితా కాఫీ పెట్టవోయ్!” అనేవాడు. మన ఫెమినిస్టులు కొంచెం కిందకి దిగి కవిత లాంటి వాళ్ళ మీద దృష్టి పెడితే బాగుంటుంది.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-18”

 1. మీ పొస్థ్ లు చాలా బాగున్నాయి , ముఖ్యం గా మీ లవ్ స్థొరీ ఇంకా బాగుంది , సరళ తొ మీ లవ్ గురించి ఇంకా వివరం గా రాయండి , నాకూ ఇలాంటి సమస్యె వుంది , నా పిల్ల కొంచం బక్క గా , నల్ల గా మీ సరళ లా వుంటుంది , ఐతె నాకు తనంటె చచ్చెం త ఇస్టం కానీ , కొంచం తెల్ల్లగా వున్న వాల్లను చూస్తె కొంచం , చాలా కొంచం కొంచం భాదగా వుంటుంది , మరి మీకూ అలా వుందా , వుంతె ఎలా మేనేజ్ చెస్తున్నారు , కొంచం చెప్పండి , ప్లీస్

  మెచ్చుకోండి

 2. అయ్యో సుధీరూ,
  మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు సారీ. సరళ కేవలం కల్పితం మాత్రమే. అన్ని సినిమాలలోనూ,నవలల్లోనూ హీరోయిన్ అందం గా ఉంటుంది గదా, అందం గా లేని వాళ్ళకి కూడా హీరోయిన్ అయ్యే యోగ్యత ఉంటుంది కదా అని ఆమె ను అలా పెట్టాను.
  మనిషి మానసిక జీవి కాబట్టీ, నిజమైన అందం అమ్మాయి వ్యక్తిత్వం లో ఉంటుంది అని చెప్పటానికి ప్రయత్నించాను. అది సత్యం కూడా. కాబట్టీ మీరు పెద్ద గా ఆలోచించకుండా మీ అమ్మాయి తో ప్రొసీడ్ అయ్యిపోండి. మీ ఇద్దరి మనస్తత్వాలు కలిస్తే,ఆమె కంటే అందమైన వాళ్ళు మీకు కనపడరని నా విశ్వాసం. చివరి గ జార్జ్ బెర్నార్డ్ షా అనుకొంటా అన్నాడు, “రంగు చూసి గుర్రాన్ని ఎంచుకొవటం ఎంత తెలివైన పనో, అందాన్ని చూసి అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం అంతే తెలివైన పని”.
  అన్నట్లు మీ బ్లాగ్ చూశా, బాగుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s