ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-20

శ్రీధర్ ఇంటర్మీడియేట్ పరీక్షల లో క్లాస్ ఫస్ట్ లేదా సెకండ్ గా వస్తున్నాడు. శ్రీధర్ కి పోటీగా క్లాస్ లో చంద్రహాస్ అనే కుర్రాడు ఒకతను ఉంటున్నాడు. అయితే వాళ్ళిద్దరికీ పోటీ చదువు విషయంలోనే. మిగిలిన అన్ని విషయాలలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. చంద్రహాస్ ది విజయవాడే కావటం తో రోజూ ఇంటినుండే కాలేజీ కి వచ్చేవాడు. అప్పుడప్పుడూ శ్రీధర్ ని చంద్రహాస్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. చంద్రహాస్ వాళ్ళ అమ్మా నాన్నా గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్లు. చంద్రహాస్ అన్న ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు.
ఓ రోజు చంద్రహాస్ క్లాస్ లో ఉండగా కరస్పాండెంట్ అతనిని పిలిచాడు. చంద్రహాస్ తిరిగి క్లాస్ లోకి వచ్చిన తరవాత,”ఏంటి విషయం?” అని అడిగాడు శ్రీధర్. తనకి ‘ఎస్ సీ’ స్కాలర్ షిప్ వచ్చిందని చెప్పాడు చంద్రహాస్.
శ్రీధర్ వాళ్ళ క్లాస్ లో నే రామ్మూర్తి అనే అతను ఉండేవాడు. వాడు కూడా మెరిట్ స్తూడెంటే. వాడో రోజు శ్రీధర్ ని పిలిచి వాడి చేతి మీది పచ్చబొట్టు చూపించాడు. “సుస్మిత” అని ఇంగ్లీషు లో రాసి ఉంది, వాడి మణికట్టు కింద. సుస్మిత అంటే క్లాస్ లో కల్లా అందం గా ఉండే అమ్మాయి.
“ఎందుకు రా, ఆ అమ్మాయి పేరు రాయించుకున్నావ్?” అన్నాడు శ్రీధర్.
“సుస్మిత ని ప్రేమిస్తున్నా రా!”, అన్నాడు రామ్మూర్తి.
నిజ జీవితం లో “ఎవరైనా ప్రెమిస్తున్నాను” అని చెబితే వినటం అదే మొదటి సారి శ్రీధర్ కి.
ఆ రాత్రి స్టడీ అవర్ లో కాన్సంట్రేషన్ అస్సలు కుదర లేదు,శ్రీధర్ కి. వాడి మనోఫలకం మీద ‘సుస్మిత ను ప్రేమిస్తున్నాను ‘ అని రామ్మూర్తి  చెప్పిన మాటలూ ఆ  తర్వాత సుస్మిత మొహమూ రిపీట్ అవ్వసాగాయి. వాడికి ఆ క్షణం లో చదువుకోవాలని ఉంది. కానీ లోపల్నించీ ఏ శక్తో వాడిని డిస్టర్బ్ చేస్తోంది. శ్రీధర్ కి భయం వేసింది. రెండు రోజుల తరవాత పరీక్షలు. “ఈ డిస్టర్బన్స్ ఇలాగే కొనసాగితే..ఎక్జాంస్ లో కూడా కాన్సంట్రేషన్ కుదరక పోతే?” ఈ ఆలోచన వచ్చింది వాడి మైండ్ లో కి. ఈ ఆలోచన  తో సుస్మిత గురించిన సంచలనం మరింత ఎక్కువైంది వాడి మైండ్ లో.
“ఏంటి?…సుస్మిత ని గానీ నేను కూడా ప్రేమిస్తున్నానా? “ఒరేయ్! పొరపాటున కూడా అలాంటి పని చెయ్యొద్దు. నువ్వు ప్రేమా దోమా అంటే చదువు చంకనాకి పోతుంది. ఇక ఎంసెట్ గురించి మర్చి పోవటమే. నాన్న నిన్ను కష్టపడి చదివిస్తున్నాడు. నాన్న నమ్మకాన్ని వమ్ముచేయొద్దు.”, తన కి తానే చెప్పుకొన్నాడు శ్రీధర్. “అయినా ప్రేమించి ఏమి చేస్తావు? పదిహేడేళ్ళ కే పెల్లిచేసుకోలేవు కదా? ఒక వేళ నాలుగైదేళ్ళు ఆగుదామను కొన్నా, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?”,ఇలా మధన పడ్డాడు వాడు.
మరుసటి రోజు క్లాస్ కి వెళ్తే సుస్మితా రామ్మూర్తీ బాగానే ఉన్నారు,లెక్చరర్ చెప్పే లెసన్ వింటూ. వాడిని మాత్రం ఆలోచనలు  చికాకు పరచ సగాయి, ప్రశాంతమైన చెరువు లో దుంగని ఎత్తి వేసినట్లు గా. దీంతో వాడికి తన మీద తనకే కోపం వచ్చింది. సుస్మితా రామ్మూర్తి ల మీద, వాళ్ళు ఏమీపట్టనట్లు గా లెసన్ వింటున్నందుకు, ఇంకా ఎక్కువ కోపం వచ్చింది.
ఈ ఆలోచనలతో కుస్తీ పడుతూనే వాడు పరీక్షలు రాశాడు. పరీక్షల్లో ఏకాగ్రత కుదర్లేదు వాడికి. కానీ తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది . క్లాస్ ఫస్ట్ మాత్రం ఈ సారికి చంద్రహాసే! సుస్మితను ప్రేమిస్తున్నాను అనే ఆలోచన వాడి బుర్రలోకి వచ్చినప్పుడు మాత్రం వాడి మనసూ శరీరమూ ఏకమై దూది పింజలా గాలి లో తేలియాడిన అనుభూతి కలిగేది.

పరీక్షలైన తరువాత, వాళ్ళ ఊరెళ్ళాడు శ్రీధర్. ఒక రోజు కాలవ లో ఈత కొట్టి వస్తుంటే,హఠాత్తు గా సుస్మిత గుర్తొచ్చింది. వెంటనే వాడికి ఇన్ని రోజులూ సుస్మిత గురించి మరిచిపోయిన విషయం కూడా అర్ధమైంది. దాంతో వాడు  చాలా సంతోష పడ్డాడు, సుస్మిత తన మైండ్ లో నుంచీ వెళ్ళిపోయినందుకు. వాడికే గనుక ఒక ముప్పై యేళ్ళు వుండి వుంటే తెలిసేది, “తను ఇన్-ఫాట్యుయేషన్ నుంచీ బయట పడ్డానని”. వాడికి మనసు కి పట్టిన ముసురు తొలకరి కురియ కుండానే తొలగి పోయింది. దానికి కారణం వాడి అమ్మ ప్రేమ అనే చిరు గాలి కావచ్చు, వాడి నాన్న లో ప్రకాసించే ప్రశాంతత కావచ్చు.
సెలవలయ్యి కాలేజీ కి మళ్ళీ శ్రీధర్ వెళ్ళే సరికి, మండల్ కమీషన్ గొడవలు మొదలయ్యాయి. దేశం లో కుల రాజకీయాలు ఊపందుకున్నాయి.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s