ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-3

3

నేను కూడా మెయిల్స్ చెక్ చెయ్యటం మొదలెట్టాను. ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమీ లేవు. నా ఫ్రెండ్ ఒకడు ఓ మెయిల్ ఫార్వర్డ్ చేశాడు. “హౌ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఎట్ వర్క్ ప్లేస్?” అని వుంది . క్లిక్ చేశాను.
“ఆర్ యూ ఇన్ ఆఫీస్ ?” అని అదిగిందది.
” యస్ ” సెలెక్ట్ చేశాను.
“డోంట్ వేస్ట్ యువర్ టైం బై రీడింగ్ మెయిల్స్ లైక్ దిస్”,అని తిట్టింది.

” హా… హా…హా..”
ఇంటర్నెట్ నుంచీ ఈనాడు, హిందూ పేపర్లు ఒపెన్ చేశాను. పేపర్లో వార్తలు అన్నీ ఎక్కడో విన్నట్లే వున్నాయి. ఎక్కడ విన్నానబ్బా? ఓ..రాత్రి టీవీ లో ఇవే వార్తలు చూశాను కదూ….అయినా మళ్ళీ చదువుదాం పోయేదేముంది?
“బ్రేక్ ఫాస్ట్ కి పోదాం వస్తావా?”, నా పక్క సీటు గణేష్ అడుగుతున్నాడు.
“ఒక్క నిమిషం “, ఒక అర సెకన్ లో సిస్టం  లాక్ చేసి బయలుదేరాను.

క్యాంటీన్ లో తెలుగు వాళ్ళో గుంపు గా కన్నడిగులో గుంపు గా..ఇలా నానా భాష ల వాళ్ళూ నానా గుంపులుగా చేరి మాట్లాడుకొంటున్నారు. ప్లేట్లు తీసుకొని తెలుగు గుంపులో  కలిశాం మేము. అందరూ వాళ్ళ ప్రాజెక్టు ల్లోని చిత్రాల గురించి విచిత్రమైన కబుర్లు చెబుతున్నారు. కాసేపు బాస్ ల ను
తిట్టుకొన్న తరవాత పోలిటిక్స్ పైకి మళ్ళింది గాలి. పొలిటిషియన్స్ ని కూడా ఒక రౌండ్ తిట్టుకున్న తరవాత గ్రూప్ లో ఎవరో వాచ్ చూసుకొన్నారు.
“ఓ మై గాడ్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది…పదండి…పదండి…”
సీట్   కి వస్తూంటె మనీషా ఎదురుపడి నవ్వింది.
“హాయ్ మనీషా..”
“హాయ్ శ్రీధర్”, అని రెచ్చగొట్టేటట్లు నవ్వుతోంది….తప్పు….తప్పూ అమె మామూలు గానే నవ్వి వుండవచ్చు. నాకే అలా కనిపించి వుండవచ్చు…
సీట్ లో కూర్చోగానే ఆనంద్ వచ్చి “హౌ ఆర్ థింగ్స్ మేన్?” అన్నాడు. అతను మా ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్త్  స్టేటస్ ఎలా వుంది అని అతని వుద్దేశం.
నేను ఆనంద్ ని చూడగానే   “”ఆల్ట్ +టాబ్” కొట్టీ హిందూ పేపర్ మాయం చేశాను.
ఈ ఆనంద్ గాడొక తలకాయనొప్పి ఘటంగాడు…
“హాల్ఫ్ ది హాంగ్ ఓవర్ ఈజ్ డౌన్ నౌ…లాస్ట్ నైట్  ఐ బూజ్డ్ హెవిలీ యు నో..” అని నా నాలిక  చివరి దాకా వచ్చింది గానీ చివరి క్షణం లో “థింగ్స్ ఆర్ గుడ్” అని మానేజ్ చేశాను.

“ప్లీజ్ కంప్లీట్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు మీ బై ఈఓడీ”, వాడు మాట్లాడిన మాటలకీ వాడి ఫేసు లో ఎక్స్-ప్రెషన్ కీ ఏ మాత్రం సంబంధం లేదు. వాడి ఎక్స్-ప్రెషన్ “చెప్పిన పని చెయ్యక పొతే బయటికి గెంటుతాను” అన్నట్లు వుంది. అదే వాడి ప్రత్యేకత.
ఆనంద్ వెళ్ళిన తరవాత ఆల్ట్+టాబ్ కొట్టి  మళ్ళీ పేపర్ చదవటం మొదలు పెట్టాను. పేపర్ చదివే సరికి మధ్యాహ్నం పన్నెండయ్యింది. ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ చూడటం మొదలు పెట్టాను. మధ్యలో పక్క ప్రాజెక్ట్ శరత్ వచ్చాడు. వాడేదో జావా డౌట్ ని వెంటపెట్టుకుని వచ్చాడు.  వాడి డౌట్ తీర్చేసరికి ఒంటిగంటయ్యింది.
“ఛా.. టైం అంతా వేస్ట్ ఇవాళ…లంచ్ తరవాతన్నా చదవాలి…”
నా రోజూ వుండే గాంగ్ తో కలిసి కాంటీన్ కి బయలుదేరాను.
ఫుడ్డు రోజూ లానే చెత్త గా వుంది. ఈ లంచ్ వారం రోజులు  తినగానే బోర్ కొడుతుంది…మళ్ళీ కొత్త కాటరర్ వస్తే  కొన్ని రోజులు బాగుంటుంది…తరవాత కొన్ని రోజుల కి మళ్ళీ మామూలే. అదే అమ్మ చేతి వంటయితే బోర్ కొట్టదు..ఎందుకో?

ఆఫీస్ గాసిప్ తో టైం తెలవ లేదు. ఎవరు రిజైన్ చేసిందీఎవరు కొత్తగా జాయిన్ అయిందీ…బాస్ లు ఎంత అన్-రీజనబుల్ గా ప్రెజర్ పెడుతున్నదీ వెలిగ్రక్కాక అందరం మళ్ళీ ఆఫీస్ కి బయలు దేరాం.
ఆనంద్ టీం మెంబర్స్ అందరికీ మీటింగ్ రిక్వెస్ట్ పంపాడు . “రెండున్నరకి మీటింగ్ …సారీ ఫర్ ది షార్ట్ నోటీస్” అని దాని సారంశం.  నాకైతే ఆ చివరి ముక్క “ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ ” అన్నట్లు కనపడింది. టీం మీటింగ్ షార్ట్ గా వుంటుందని చెప్పి రెండు గంటలు చేశాడు ఆనంద్.
నాలుగున్నరకి మళ్ళీ సీట్ లో కొచ్చేసరికి స్నాక్స్ టైం అయ్యింది. స్నాక్స్ తిని కోడ్ చూడటం స్టార్ట్ చేశాను.
కొడ్ కాంప్లెక్సిటీ, సైజ్ గురించి ఓ డాక్యుమెంట్ తయారు చేసి ఆనంద్ కి మెయిల్ పంపించేసరికి సాయంత్రం ఐదూయాభైఅయిదు అయింది.
ఇంటికెళ్ళే బస్ ఆరు గంటలకే. వడి వడి గా నడిచి వెళ్ళి బస్ లో కూర్చుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చే జనాలను అబ్సర్వ్ చేయసాగాను. అమ్మాయిలూ అబ్బాయిలూ కూడా తమకు అటెన్షన్  సరిపోవటం లేదు అన్నట్లు డ్రస్ చేసుకొని వున్నారు. ఆరు గంటలకి మా తొమ్మిదో నంబరు కాబ్ బయలు దేరింది ఇంటికి.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-3

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s