ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-23

బెంగుళూరు కి మారే ముందు మా వూరెళ్ళి రావాలనిపించి బయలు దేరాను. పల్లెటూరు రావటం సరళ కి నచ్చదని తెలుసు. నేను ఒక్కడినే బయలు దేరాను.
విజయవాడ లో ట్రైన్ దిగి మా ఊరెళ్ళే బస్సెక్కాను. బస్సు కండక్టర్ తో అలవాటు ప్రకారం తమిళం లో మాట్లాడబోయి,చివరి నిమిషం లో తమాయించుకొని తెలుగు లో మాట్లాడాను, “వెంకటాపురంకి ఒక టికెట్”.
బస్సు రోడ్డు మీద కదులుతోంది..పచ్చటి పొలాలూ తమలపాకు తోటలూ చెరుకు తోట లమధ్య నుంచీ. చిన్నప్పటి నుంచీ ఆ ప్రదేశాలన్నీ చూసిన నాకు మొదటి సారి ఆ పొలాల్లోనూ తోటలలోనూ ఏదో తెలియని అందం కనపడుతోంది..పట్టణం లో కనపడని  పచ్చదనం ఇక్కడ కనిపించినందు వలన కావచ్చు….వయసు నా లో తెచ్చిన మర్పుల వలన కావచ్చు. బస్సు లో ఊళ్ళకు పోయే పల్లెటూరి మనుషులు నాకు చాలా పరిచయం ఉన్న వాళ్ళ లా అనిపించారు..మా ఆఫీస్ లో తెచ్చిపెట్టుకున్న వెస్టర్న్ ఫార్మాలిటీ వెనకాల ఉండే అసలు మనుషులు ఎప్పటికీ పరిచయం కారు.
బస్సు దిగి గూడు రిక్షా లో మా ఇంటికి బయలు దేరాను. అక్కడక్కడా కొత్తగా ఆటో లు కూడా తిరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి మా నాన్న బయట దొడ్లో తుండు చుట్టుకొని స్నానం చేస్తున్నాడు.రిక్షా చప్పుడు కి మా అమ్మ బయటికి వచ్చింది. మా నాయనమ్మ చనిపోయి రెండేళ్ళయింది. అప్పటి నుంచీ ఇల్లు బావురు మంటొంది. మా ఇంటి ఎదురు గా పక్షుల కిలకిలల తో సందడి గా ఉండే రావి చెట్టునొకదాన్ని కూడా ఈ మధ్యే కొట్టేశారు. దానితో వాకిలంతా ఏదో వెలితి గా ఉంది.
మా నాయనమ్మ పోయేటప్పుడు పెద్ద బాధపడకుండానే పోయింది. చివరి రోజుల్లో, “ఆ రాముడు నన్నెప్పుడు తీసుకెళ్తాడో” అనుకొనేది.
ఊరి అరుగుల మీద ఎవరూ కూర్చోవటం లేదంట, మా నాన్న చెబ్తే తెలిసింది. “ఎవరికి వాళ్ళు కేబుల్ టీవీ లో సినిమా లు చూడటం అలవాటైంది జనాలకి. “ఆ ఐనా ఊళ్ళో ఇంకా ఎవరున్నారు. మా బోటి ముసలీ ముతకా తప్పితే”, అన్నాడు నాన్న.
అమ్మ స్నానికి వేణ్ణీళ్ళు తోడింది. స్నానం చేశాక భోజనం వడ్డించింది నాన్నకూ నాకూ. అమ్మ చేతి వంట రుచే వేరు. భోజనం చేసి అలా ఊళ్ళో తిరిగొద్దామని బయలు దేరాను. హై స్కూల్ గ్రౌండు లో పిల్లలే కనపడ లా. పక్కనే ఇంగ్లీషు మీడీం కాన్వెంట్ లో మాత్రం పిల్లలు కోడి పిల్లల లా రైంస్  చెప్తున్నారు. ఊళ్ళో మనుషులే కాదు మనుషుల తో పాటు పసువులూ  కోళ్ళూ  పిచ్చికలూ కూడా మాయమయ్యాయి. ఎక్కడన్నా ఓ మనిషి సెల్ ఫోన్ లో మాట్లాడటం కనపడుతోంది. గోరటి వెంకన్న పాట,”పల్లె కన్నీరు పెట్టిందో”,నా మనసు చెవుల్లో మారు మోగుతోంది.
ఇంటికి వెళ్ళగానే ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తితే సరళ,”నీ సెల్ తీసికెళ్ళటం మరిచి పోయావు అంది.
నేను చెప్పాను,”మరిచి పోలేదు.కావాలనే తీసుకొని రాలేదు” అని. “ఊరు చేరిన వెంటనే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా చేరానని” అంది సరళ..
మా ఇంటి పక్కనే ఉండే రాఘవయ్య మాస్టారు వచ్చారు,”ఏమోయ్,అమెరికా వెళ్ళావు కదా, మళ్ళీ తిరిగి వచ్చేశావేంటి?” అంటూ.
“నేను అక్కడ ఉండటానికి  వెళ్ళలేదు మాస్టారూ.  నేను వెళ్ళిన ప్రాజెక్ట్ పని అయ్యిపోయింది. తిరిగి వచ్చాను”
“ఆ..నేను అమెరికా వెళ్ళేవాళ్ళను చూశా గానీ, తిరిగి వచ్చిన వాళ్ళను చూడలేదు”, అన్నడాయన.
పూర్వ కాలం సముద్రాలు దాటి విదేశాలు వెళ్తే వెలి వేసేవారట. రోజులు మారాయి. విదేశాల నుంచీ ఇండియా వస్తే వెలి వేసే రోజులు వచ్చాయి కాబోలు.
మా మాటలసందడి విని,పక్కింటి ప్రసూనాంబ అత్తయ్య వచ్చింది.
“నెకు జీతం బాగానే వస్తుందా నాయనా?” అడిగిందామె.
“బాగానే వస్తుందత్తయ్యా”
“ఏ మాత్రమొస్తుందేమిటి?”
“ఓ ముప్పై వేల దాకా వస్తుంది”
“ముప్పై వేలేనా. మా మనవడు  అమెరికా వెళ్ళాడు. వాడికి రెండు లక్షలంట జీతం!”, అని మీ మొగుడూ పెళ్ళాలిద్దరూ ఉద్యోగమేగా. మీది మీకు సరిపోతుందేమోలే!”అందామె.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

6 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-23

 1. మీ కధనం బాగుంది కాని, ఎక్కడో సింక్ మిస్ అవుతోంది అనిపిస్తోంది. మీ కధలో శ్రీధర్ ఇంటర్ ఎన్నో సంవత్సరంలో పాస్ అయ్యాడు? ఎందుకో, కలియుగ పాండవులు, మండల్ కమీషన్ అప్పుడు EAMCET గురించి అంత క్రేజ్ లేదు.
  BTW, Have you worked in Chennai? I stayed at Saligramam and currently staying at Vadapalni 🙂

  మెచ్చుకోండి

  1. “మీ కధనం బాగుంది కాని, ఎక్కడో సింక్ మిస్ అవుతోంది అనిపిస్తోంది.”
   ఒప్పుకుంటాను..ఇక ముందు జాగ్ర్త్త తీసుకొంటాను.
   నేనూ “సాలిగిరామం” లో ఉన్నాను ఒక సంవత్సరం…

   మెచ్చుకోండి

 2. “పూర్వ కాలం సముద్రాలు దాటి విదేశాలు వెళ్తే వెలి వేసేవారట. రోజులు మారాయి. విదేశాల నుంచీ ఇండియా వస్తే వెలి వేసే రోజులు వచ్చాయి కాబోలు”

  nijamenandi chala baga rasaru

  మెచ్చుకోండి

  1. లక్ష్మీ నరేష్,
   మీ వేదన నాకర్ధమౌతూంది. మన అందరికీ ఉన్న వేరొక పార్శ్వం, “స్వార్ధమూ, మనుగడా కోసం ఆరాటం, సుఖలాలసత్వం, ఎదుటి వాడికన్నా వెనుక బడకుండా ఉండాలనుకోవతం”, ..వీటి వలననే పల్లెలు బోసిపోతున్నాయి.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s