ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-24

దసరా సెలవల తరువాత కాలేజీ కి వెళ్ళిన శ్రీధర్ వాడి క్లాస్ మేట్ రమేష్ తో కలిసి ఒక రూం తీసుకొని దాంట్లోకి మారాడు.
శ్రీధర్ ఇంటర్మీడియేట్ వరకూ తనకున్న జ్ఞాపక శక్తి సహాయం తో క్లాసు లో మొదటి ర్యాంకు లో ఉండేవాడు. కానీ ఇంజినీరింగ్ లో వాడి జ్ఞాపక శక్తి వలన ఉపయోగం లేక పోయింది. ఇంజనీరింగ్ సరిగా చదవాలంటే అవగాహనా శక్తి ముఖ్యం. ఆలోచనా శక్తి కావాలి. కానీ శ్రీధర్ కి అకాడమిక్స్ లో వాటి అవసరం అప్పటి వరకూ పెద్ద గా రాలేదు. పైగా ఇంజనీరింగ్ అంతా ర్యాంక్ వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ ఉండటం తో వాడికి క్లాస్ టాప్ ర్యాంకుల్లో స్థానం లేకుండా పోయిని. దీంతో వాడి ఆత్మ విశ్వాసం కొంత దెబ్బ తిన్నది.
బయటి ప్రపంచానికి ఒక్కసారిగా ఎక్స్ పోజ్ అవ్వడం తో వాడికి చెడు తిరిగుళ్ళూ సినిమాలూ అలవాటయ్యాయి. వాడి ఫ్రెండ్స్ సర్కిల్ లో విలువల ప్రకారం, రిలీజైన సినిమా మొదటి వారం లోపల చూడక పోతే అది ఒక నామోషీ. వాడు అమ్మాయిల వెంట తిరగక పోయినా, గంటల తరబడి అమ్మాయిల గురించి హస్కు కొట్టడం అలవాటైంది. ఎం సెట్ లో ర్యాంకు వచ్చిన దగ్గరి నుండీ ఏదో సాధించేసిన భ్రమ వాడిని ఆవరించింది.వాడు తాత్కాలికం గా ఇంటి దగ్గరి ఆర్ధిక పరిస్థితి గురించి కూడా మరిచిపోయాడు. వాడి రూం మేట్ రమేష్ మాత్రం బుద్ధి గా చ్దువుకొనేవాడు.
శ్రీధర్ కి ఈమధ్య ఓ పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఇంటర్మీడియేట్ లో సుస్మిత గురించిన వాడి ఇన్-ఫాట్యుయేషన్ కి కొనసాగింపు లా అనిపిస్తుంది. ఓ రోజు వాడూ వాడి రూమ్మేట్ రమేషూ కలిసి కాలేజీ లైబ్రరీ కి వెళ్ళారు. రమేష్ ఎలెక్ట్రానిక్స్ సర్క్యూట్స్ పుస్తకం తీసి బుద్ధి గా చదువుకొంటుంటే, శ్రీధర్ మాత్రం లిటరేచర్ సెక్షన్ లోకి చొరబడి చెకోవ్ కథలూ,టాల్-స్టాయ్ కథలూ చదవటం మొదలు పెట్టాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కమ్యూనిస్ట్ మానిఫెస్టో తీసుకువెళ్ళాడు.
రూం లోకి వచ్చిన తరువాత వాడు రమేష్ ని అడిగాడు,”నువ్వు కమ్యూనిస్ట్ మానిఫెస్టో చదివావా?” అని.
“చదవ లేదు. చదవాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకడిగావ్?” అన్నాడు రమేష్.
శ్రీధర్ రమేష్ మాట వినిపించుకోకుండా, “ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళను దోచుకొంటున్నారు ఈ లోకం లో. దీనికి కులమతాల తో ప్రసక్తి లేదు. ఈ సమాజం లో ఫండమెంటల్ గా  మార్పు రావాలి”, అన్నాడు.
రమేష్ చాలా తక్కువ గా మాట్లాడుతాడు. అయితే శ్రీధర్ ఈ మాటలు కొంత కాలం గా అదే పని గా చెప్తున్నాడు. వాడి ఉపన్యాసాలకు ఒక ఫుల్ స్టాప్ పెడదామనిపించింది రమేష్ కి.
” నువ్వు చెప్పింది కరక్టే. నేను విన్నదానిని బట్టి చెప్తున్నాను.  కాపిటలిజం గురించి మార్క్సిజం చేసిన అనాలసిస్ చాలా వరకూ కరక్టే. అయితే గమ్యం చేరటానికి మర్క్సిజం చెప్పిన మార్గం ఆచరణ యోగ్యం కాదు.  ఒకప్పుడు డబ్బు లేని వాడు, డబ్బు సంపాదించి ఉన్న వాడు అవుతాడు. ఉన్నవాడు అయ్యిన తరువాత, వాడు ఉన్నవాడి లాగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి సమస్య అంతా మనిషి స్వభావం తో నే ఉంది.” అన్నాడు రమేష్.
శ్రీధర్, “కానీ ఇది సిస్టం కి సంబంధించిన సమస్య. విప్లవం ద్వారా సోషలిస్ట్ సిస్టం వస్తుంది. ఒక సారి సోషలిస్ట్ సిస్టం వచ్చిన తరవాత అంతా సమానమే. ఇంకా లేని వాడు ఉన్నవాడయ్యే సమస్యే లేదు”, అన్నాడు.
” కానీ మనం సమానం గా లేని సమజం లో ఉన్నాం. ఈ సమాజాన్ని బలవతం గా చదును చేసినా, మనుషుల్లో సహజం గానూ,  పెంపకం వలనా వచ్చిన నైపుణ్యాల లో తేడాల వలన మళ్ళీ ఈ సమాజం అసమానం ఐపోతుంది. సమానత్వం లేని చోట, సమానత్వాన్ని బలవంతం గా రుద్దాలనుకోనటమే ఒక పెద్ద అసమానత్వం అని ఎక్కడో చదివాను. మనుషుల వ్యక్తిత్వాలూ మనస్తత్వాలూ మార్క్సిజం చదివినంత మాత్రాన దానికి అనుగుణం గా మారిపోవు. అవి అప్పటి నిజజీవితంలోని పరిస్థితుల పై అధార పడి ఉంటాయి. ఎంత మంది మార్క్సిస్టు ఆదర్శ వాదులు తద్విరుద్ధమైన జీవితం గడపటంలేదు?” ఇంకా ఇలా అన్నాడు రమేష్,” నీ బుర్ర లో ఒక ఆదర్శ లోకం ఉంది. కానీ ఆ లోకం చేరే దారి మాత్రం నీ దగ్గర లేదని నేను నమ్ముతున్నాను. జనాల స్వభావాలను ఒక్క రోజు లో ఎలా మారుస్తావు?. మనుషుల స్వభావాలని ఏ మార్క్సో ప్లాన్ చెయ్యలేదు. మనుషులను ప్రభావితం చేసే పరిస్థితులను మార్చటం ద్వారా మనుషుల వ్యక్తిత్వాన్ని మారుద్దామంటే, ఆ పరిస్థితులే మనుషుల అవక తవక వ్యక్తిత్వాల వలన సృష్టించబడ్డాయాయే. మనుషులు మారకుండా వచ్చే విప్లవం ఓ విప్లవం కాదు. కమ్మ్యూనిజం ప్రపంచమంతా ఫెయిల్ అవ్వటానికి ఇదే మొదటి కారణం. మనుషులు మారక పోవటాకికి చాల గట్టి కారణాలే ఉండి ఉండాలి.. ప్రపంచం మొత్తాన్ని మార్చే ముందు, కమ్మ్యూనిస్టులు,ఒక జిల్లానో, మండలాన్నో తీసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని నిరూపించాలి.  దాని వలన ఒక ప్రొటోటైప్ ప్రూవ్ అవుతుంది. ప్రపంచం లో చాలా హింస తప్పుతుంది. అప్పుడు మీ సిద్ధాంతాన్ని ప్రపంచం కూడా అంగీకరిస్తుంది. ఆ పై దాన్ని ప్రపంచం మొత్తానికీ విస్తరింపచేయ వచ్చు.”
శ్రీధర్ కి రమేష్ వాదన నచ్చలా. ” నువ్వొక బూర్జువా వి. నీకు మార్క్సిజం అర్ధంకాదు” అన్నాడు. వాడు ప్రస్తుతానికి విప్లవం తో ప్రేమ లో పడ్డాడు. అదే వాడి పాషన్. అది వాడి ఎమోషనల్ నీడ్స్ ని తీరుస్తోంది.
వాళ్ళ రూం దగ్గర్లో ఒక అడుక్కొనే వాడు కూర్చొని ఉంటే వాడిని చూపించి,” వాడిని చూస్తూంటే నీకు ఏమీ జాలి వేయటంలేదా? వాణ్ణి చూస్తూంటే నీకు ఏమీ దిగులు గా లేదా? ..నువ్వు వాడిని గురించి జాలి పడక పోవటం….హౌ డిప్రెసింగ్!!”,అన్నాడు.
“అది వాడి కి  పట్టాల్సిన గతేనేమో! పరీక్షల్లో తప్పిన వాడి గురించి జాలి పడతామా? ఆ తప్పిన వాడు చదవకుండా అమ్మాయిల కి సైట్ కొడుతూ టైం వేస్ట్ చేశాడేమో.. అయినా నాకు జాలి వేస్తే వాడికో  రూపాయి వేసి దానితో వాణ్ణి వదిలిపెట్టేస్తా. వాడి గురించి తెగ ఫీలయ్యి పోయి, వాణ్ణో ముడి పదర్ధం గా తీసుకొని కవిత్వాలు రాసే వాళ్ళ కంటే, నేను వేసిన రూపాయే వాడికి ఎక్కువ మేలు చేస్తుందేమో!”
“ఎక్జాం లో ఫెయిల్ అయ్యిన వాడు వాడి అశ్రధ్ధ వలన ఫెయిల్ అయితే వాడి మీద నేను జాలి చూపించను. కానీ వాడికున్న ఒక లోపం వలన ఫెయిల్ అయితే నేను జాలి చూపిస్తాను. వాడు తెలివైన వాడు కాకపోతే, వాడి గురించి కన్సిడరేట్ గా ఉంటాను”, అన్నాడు శ్రీధర్.
“నీ లాజిక్ ప్రకారం వాడి అశ్రధ్ధ కూడా పస్థితుల ప్రభావం వలన వచ్చింది. కాబట్టి వాడిని నువ్వు తప్పుపట్ట కూడదు కదా? నేను కోయిల పాట నిమెచ్చుకొని, కాకి గొంతుని నిరసిస్తే అది కాకి పట్ల వివక్ష చూపించింట్లవుతుందా?” రమేష్ అన్నాడు.
శ్రీధర్ అన్నాడు,”నేను కోయిల గొంతు విని సంతోషిస్తాను. కానీ కాకి కి మంచి గొంతు లేనందుకు దాని మీద జాలి చూపిస్తాను. దాన్ని చూస్తే నాకు దిగులు గా ఉంటుంది”
“ఆకాశం నీలి రంగు లో ఉంది,ఎర్ర గా లేదు అని నువ్వు బాధ పడతావా? ఐతే సమస్య నీ బ్రెయిన్ లో ఉండి ఉండాలి. నువ్వు వేరే ఏ కారణం చేతనో డిప్రెషన్ లో ఉన్నావని అనిపిస్తోంది.ఎవరైనా ఒక డాక్టర్ కి చూపించుకో”,అని రమేష్ ఇలా అన్నాడు,” మనం అసలు విషయం నుంచీ పక్కకు వెళ్తున్నాం. మనం మాట్లాడే విషయం కమ్యూనిజం. కమ్యూనిజం అనేది ఒక సామాజిక ఆర్ధిక సిధ్ధాంతం. అదేమీ సర్వ రోగ నివారిణి కాదు. దాన్ని కాకి కీ అకాశానికీ అన్వయించ కూడదని నేననుకొంటున్నాను. మ్యాథమెటిక్స్ లో ప్రతి థీరీ కీ ముందు కొన్ని ఇనీషియల్ కండిషన్స్ ఉంటాయి. ఆ థీరీ అప్ప్లై అవ్వాలంటె ఆ ఇనీషియల్ కండిషన్స్ నిజమవ్వాలి. ఆ థీరీ చెప్పిన వాడే ఇనీషియల్ కండిషన్స్ కూడా పెడతాడు. ఆ లిమిట్స్ మధ్య మాత్రమే ఆ సిధ్ధాంతం నిజమౌతుంది. ఆ లిమిట్స్ బయట సిధ్ధాంతాన్ని అప్ప్లై చేస్తే అది వీగి పోతుంది. కాబట్టీ కమ్యూనిజాన్ని కాకికి అప్ప్లై చెయ్యవద్దు. ఉదాహరణ కు,” గ్లోబల్ వార్మింగ్ గురించి కమ్యూనిజం వైఖరి ఏమిటి? చెప్పటంకష్టం. కమ్యూనిజం పుట్టినప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఒక సమస్య కాదు. కాబట్టి కమ్యూనిజం గ్లోబల్ వామింగ్ కి అప్ప్లై కాదు. అయినా వీటి గురించి చర్చించు కోవటం వలన సమయం వృధా. మనం మార్చేది ఏమీ లేదు ఇందులో. నువ్వు వేరేగా అనుకొంటే నీ జీవితాన్ని పేదవాళ్ళ కోసమంకితం చెయ్యి. పేద వాళ్ళ గురించిన నీ ఫీలింగ్స్ మాత్రమే సరిపోవు వాళ్ళని ఉధ్ధరించటానికి. నువ్వుఏమీ చెయ్యలేక పోతే గమ్ముగా ఉండు. ఎవరికీ క్లాసులు పీక మాక. నువ్వు ఏమీ చెయ్యనప్పుడు, వేరే వాళ్ళకి చెప్పే అర్హత నీకెక్కడుంది? వీటన్నింటి కంటే బాగా చదివి కెరీర్ లో సక్సెస్ అవ్వటం ముఖ్యం. ఈ విషయాల గురించి మనం చర్చించుకోవటమిదే చివరి సారి కావాలి”, అని వాడో క్లాసు పీకాడు రమేష్.
” కనీసం నేను ఫీల్ అవుతున్నాను రా. ఫీల్ అవ్వటం ఏదొ ఒకటి చెయ్యటానికి నాంది. నువ్వేమో ఫీల్ అవ్వటానికి నిరాకరిస్తున్నావ్. పైగా నన్ను ఏమీ చెయ్యవు అని నిందిస్తున్నావ్”, అని రమేష్ వైపు చూశాడు శ్రీధర్. కానీ వాడు అప్పటికే నెట్వర్క్ థీరీ బుక్ లో తలముంచి దాన్లో లీనమైపోయాడు.
“నువ్వు చాలా స్వార్థ పరుడివి రా రమేషూ”,అని శ్రీధర్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పుస్తకం తీసి చదవటమ్మొదలెట్టాడు. వాడికి ఆ పుస్తకం వాడి హృదయ రాగం లా తోచింది.
రాత్రి పదింటికి పుస్తకం మూసి ఏదో ఒక సెకండ్ షో సినిమా చూద్దామని బయలు దేరాడు. కానీ వెళ్ళాలనిపించలేదు. ఒక గమ్యం లేకుండా రోడ్ల మీద తిరగసాగాడు.భాను గుడి సెంటర్ కి వెళ్ళాడు. మంగీలాల్ స్వీట్స్.మర్వాడీ వాడు..వాడి మనసు లోంచీ అసహ్యం తన్నుకొస్తూంది..”ఈ వ్యాపారస్తులంతా స్వార్థపరులే…గ్రీడీ బాస్టర్డ్స్.. కాల్చి పారేయాలి……ఆ అమ్మాయిల్ని చూడు.ఆ షాప్ లో చుడీ దార్ల వైపు ఎలా చూస్తున్నారో..ఆపక్కనే వంటి మీద పుండ్ల తో చుట్టూ ఈగలు మూగుతూ…ఆ పిచ్చోడు..రోడ్డు మీద పడి ఉంటే..వాడి వంక చూడరేం? వాళ్ళ ఆలోచనలలో వాడికి స్థానం లేదా? సో డిప్రెసింగ్..” సడన్ గా వాడి ద్వేషం వాడి మీదికే మళ్ళీంది. ” వాళ్ళు ఎవరో సరే..ఇర్రెస్పాన్సిబుల్ బాస్టర్డ్స్..మరి నేనేమి చేశాను వాడికి? ఆ పిచ్చోడ్నినా రూంకి తీసుకొని పోయి వాడికి దుప్పటి కప్పి..రూం లో ఉన్న బ్రెడ్ ఎందుకు పెట్టవు రా నువ్వు శ్రీధర్ గా….యూ..బాస్టర్డ్..?..నేను ఒక్కడినే..ఈ ఈగలముష్టోడికి బ్రెడ్డు పెట్టానని లోకం బాగై పోతుందా?..కానీ నీ పరిధి లో నువ్వెందుకు చెయ్యవు….అలా ఐతే..అడవుల్లోకిపోయి..గన్ పట్టుకొని..పోరాడుతూ ఆ ప్రయత్నం లోనే నీ ప్రాణాలెందుకు అర్పించవు…? కానీ నా కెరీర్ ఏమై పోతుంది?..నా అమ్మా నాన్నలేమౌతారు? ఛా.. నా మీద నాకే అసహ్యంవేస్తోంది…నేను ఈ రోడ్డు మీద వాళ్ళందరికంటే నికృష్టుడిని..నేను సెల్ఫిష్..ఇది నా గురించిన నిజం..సమసమాజం నా ఆశయం..కానీ.. కానీ..స్వార్థం అనేది నా వ్యక్తిత్వాన్ని గురించిన నిజం..’ ఈ ఆలోచనల తో వాడు బాగా డీలా పడి పోయాడు. కళ్ళు తిరుగుతున్నాయి. తూలుకొంటూ వాడి రూంకి వెళ్ళి పరుపు మీద పడి పోయాడు.
మరుసటి రోజు పొద్దున్నే రమేష్ వాడిని లేపి ఓ డాక్టర్ దగ్గిరకి తీసుకొని పోయాడు. ఆ డాక్టర్ వాడికి “ఈ ఈఎ జీ” తీసి, వాడిని ఒక సైకియాట్రిస్టు దగ్గరికి పంపించాడు. ఆ సైకియాట్రిస్టు  ఒక చీకటి రూంలో ఒక చిన్న సుత్తి పెట్టి వాడి మోకాళ్ళ మీదా..మోచేతులమీదా కొట్టి, ‘అంతా మైండ్ లోనే ఉంది”,అన్నాడు. కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ రాసిచ్చాడు వాడికి. పిల్లి కీ బిచ్చానికీ ఒకే మంత్రం.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

31 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-24

 1. బొండాలపతి గారికి
  మార్కిజాన్ని విమర్శించెది పెట్టుబడిదారి వర్గమే కాకుండా కొన్ని మెదా శ్రమల సెక్షన్ల కుడా వ్యెతిరెకిస్తారు పెట్టుబడిదారి వర్గం విమర్సిచకుండా వుంటె ఆశెర్యయం విమర్సిస్తె ఆశెర్యపొవలసింది ఏమీలెదు
  ఇకపొతె కార్మిక వర్గం లొ శారీరకా, మేదా శ్రమ వాళ్ళు కుడా విమర్సిస్తారు వీళ్ళు దాన్ని గురించి తెలుసుకొకుండానె తెలుసుకొవాలనె ఉద్దెసెం కూడా వుండదు అక్కడొ మాట ఇక్కడొ మాటా విని లెదా పొడి పొడి మాటలు చదివి లెదా ఇప్పుడు వున్న కమ్మునిస్టు పార్టెలను చూసి దానిపైన యెదొ ఒక నిర్నయానికి వస్తారు.ఇక అసలు విసెయానికి వద్దాం మార్కిజం ఆచరణ యొగ్యం కాదంటున్నారు మీరు ఈనిర్నయానికి యెవిదంగా రాగలరు ? చైనా, రశ్యా దెసాలను ద్రుస్టిలొ పెట్టుకొని మీరు మాట్లడుతున్నారనిపిస్తుంది ఒక దెశెం లొ విప్లవం విజయవంతమై రాజ్యాదికారాన్ని వశెపరుసుకొని కమ్మునిజం వైపు కొన్నీడుగులు వెసి తిరొగమనం పడితె అందులొ యవరిదితప్పు .ఒక డాక్టర్ తప్పులవల్ల లెదా అతని స్వార్దం వల్ల రొగి చనిపొయాడనుకుందాం అప్పుడు మనం తప్పుపట్టవలసింది యవరిని ఆ డాక్టర్నా లెదా వైద్యశ్రాస్రాన్న అలాగె ఇక్కడ నాయకుల తప్పెగాని సిద్దాంతాంది కాదు ప్రజల తప్పుకూడా కాదు ప్రజలు ఏ స్తాయిలొ వుంటె ఆ స్తాయినుంచె ప్రజలను చైతన్యవంతం చెయ్యలి ఆనాయకులు భుములను ప్యాక్టరిలను సమాజపరం చెస్తె అంతవరకె కమ్మునిజం అనేవగాహనతొ ఉన్నారు వెయ్యి మైళ్ళదురం లొ అది రొండడుగులు మాత్రామె .,
  “ఒకప్పుడు డబ్బులెని వాడు డబ్బు సంపాదించి డబ్బు ఉన్నవాడు అవుతాడు తరువాత ఉన్నవాడు లాగె ప్రవర్స్తిస్తాడు ” అన్నరు యవరైనా లెనినాడు ఆ వర్గానికి తగిన ఆ లొచనలు దానికి తగిన ప్రవర్తనా ఉంటాయి {వర్గం అంటె ఇక్కడ నా అర్తం పెట్టుబడిదారులు. కార్మికులు అని.} పెట్టుబడికి దయాదాక్షన్యాలు ఉండవు దాని ఏ కైక లక్షనం పెట్టుబడి కుడిక అంతకంతకు దాని దురాశ పెరుగుతూవుంటుంది అది లెని నాడు దివాళా తిస్తుంది “మనుషుల్లొ పెంపకంవలన నైపున్యాల తెడా వలన మళ్ళి సమాజం అసమానతలు అవుతుందన్నారు ,ఆర్దిక అసమానతలు పొఇనప్పుడు అందరికి సమాన అవకాసాలు వున్నప్పుడు శెక్తి సామర్ద్యాలు చిన్న చిన్న తెడాలు తప్ప సమానంగా ఉంటాయి
  “ఏంతమంది మార్కిస్టులు తద్ విరుద్దంగా గడపటం లెదు ”
  సి.పి.యం; సి.పి.ఐ పార్టీలను చుసి మీరు ఏ అభిప్రాయానికి వచ్చి వుంటారు మార్కిస్టులని చెప్పుకొనెవారంతా మార్కిస్టులు కాదు ఆ పెరు చెప్పుకుని వాళ్ళు యెంచెసినా అది మార్కిజం తప్పు అవుతుందా వ్యెక్తులు లెదా పార్టిలు చెసిన తప్పులకు మార్కిజం భద్యత వహించదు ,మీరు ఏదొ ఒక జిల్లానొ ఒక ప్రంతాన్ నొ తిసుకుని మీ సిద్దాంతాన్ని నిరూపించండి అంటున్నారు ,
  ఒక జిల్లానొ ఒక ప్రంతాన్నొ సిదాంతాన్ని నిరూపించాలంటె రాజ్యాధికారాన్ని స్వాదినం చెసుకొవాలి ఒక సిద్దాంతాన్ని ఒక ప్రాంతానికొ ఒక జిల్లకొ నిరూపించటం సాద్యం కాదు
  భిచ్చగాడిని చుస్తె అది వాడి గతెమొ అంటున్నారు
  కర్మసిద్దాంతంలొకి వెల్లిపొఇనారు కలిమి లెముల గురించి సాదారణ ప్రజలు ఏమనుకుంటారొ మీరు అదె అనుకుంటున్నారు సాదారణ ప్రజలు అనుకొనెటివి మచ్చుకు కొన్ని
  పెట్టుబడి పెట్టకపొతె మీకు యవరు ఉద్వ్దూగాలు ఇస్తారు .మరి పెట్టుబడి పెట్టిన తర్వాత వాల్లకు లాభాలూ వడ్డిలు రావద్దా ఆ లక్షెల కొట్లు వాల్లు కస్టపడి సంపాదించుకున్నారు . వాళ్ళు అలా వున్నారంటె పుర్వజ్ఞ్మలొ పాపాలు చెసి వుంటారు ఇలావుంటాయి మీ ప్రవచనాలు

  మెచ్చుకోండి

  1. రామమోహన్ గారు,
   మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు,
   “ఇక్కడ సంభాషణ ని రెండు భిన్న ధృవాలైన పాత్రల మధ్య సంభాషణ గానే చూడమని”, మనవి. ఇవి నా అభిప్రాయాలు కావు. నేను ఇద్దరిలో ఏ పాత్రదీ పై చేయి అని చెప్పలేదు. ఇందులో రమేష్ సరిగ్గా మీరు చెప్పిన కాటగిరీ కి చెందిన వాడు. మర్క్సిజం ను విమర్శించే మిడి మిడి జ్ఞానం కల విమర్శకుడు. శ్రీధర్ కొత్త తీర్ధం పుచ్చుకొన్నవాడు. ఇతని నాలెడ్జ్ కూడా తక్కువే. ఆ వయసు లో సగం జ్ఞానం ఉంటే, ఒక మధ్యతరగతి కుర్రాడికి ఏమవుతుందో నేను శ్రీధర్ పాత్ర ద్వారా చూపించాలనుకొన్నాను.
   నా అభిప్రాయాలు ఈ రెండు భిన్న ధృవాలకీ మధ్య గా ఉన్నాయి.
   ఈ కిందివి నా అభిప్రాయాలు:
   1. ఆచరణ లో పెట్టలేని సొఇధ్ధాంతం వలన ఉపయోగం ఏమిటి? అది కేవలం మన కపోల కల్పితమైన ఊహ కాదా? ఒక సిధ్ధాంతం విఫలమైనది అంటే, దానిలో వ్యక్తుల పాత్ర ఎంతో, సిధ్ధాంతం పాత్ర ఎంతో తేల్చేది ఎవరు? ఒక సిధ్ధాంతం చెప్పేవారి లో 99% దానిని ఆచరిచి చూపలేకపోతే, ఆ సిధ్ధాంతాన్ని నమ్మాలా? అపుడు ఆ సిధ్ధాంతాన్ని practical గా మార్చుకోవలసిన అవసర లేదా?
   2.మార్క్సిజం పెట్టుబడి దారి గురించి చేసిన అనాలిసిస్ సరైనది.కానీ పరిష్కారం లోనే తేడా ఉంది
   2. నేను కర్మ సిధ్ధాంతాన్ని నమ్మను.
   3.”ఒకప్పుడు డబ్బులెని వాడు డబ్బు సంపాదించి డబ్బు ఉన్నవాడు అవుతాడు తరువాత ఉన్నవాడు లాగె ప్రవర్స్తిస్తాడు.” ఇక్కడ నేను చెప్పదలచుకొన్నది, “మనుషుల స్వభావాలను సిధ్ధాంతాలు అంతగా ప్రభావితం చేయలేక పోతున్నాయి”, అని.
   4.”ఒక జిల్లానొ ఒక ప్రంతాన్నొ సిదాంతాన్ని నిరూపించాలంటె రాజ్యాధికారాన్ని స్వాదినం చెసుకొవాలి ఒక సిద్దాంతాన్ని ఒక ప్రాంతానికొ ఒక జిల్లకొ నిరూపించటం సాద్యం కాదు”.

   మీతో నేను అంగీకరిస్తాను. కానీ రమేష్ కు ఆ జ్ఞానం లేదు.

   “భిచ్చగాడిని చుస్తె అది వాడి గతెమొ అంటున్నారు
   కర్మసిద్దాంతంలొకి వెల్లిపొఇనారు కలిమి లెముల గురించి సాదారణ ప్రజలు ఏమనుకుంటారొ మీరు అదె అనుకుంటున్నారు సాదారణ ప్రజలు అనుకొనెటివి మచ్చుకు కొన్ని
   పెట్టుబడి పెట్టకపొతె మీకు యవరు ఉద్వ్దూగాలు ఇస్తారు .మరి పెట్టుబడి పెట్టిన తర్వాత వాల్లకు లాభాలూ వడ్డిలు రావద్దా ఆ లక్షెల కొట్లు వాల్లు కస్టపడి సంపాదించుకున్నారు . వాళ్ళు అలా వున్నారంటె పుర్వజ్ఞ్మలొ పాపాలు చెసి వుంటారు ఇలావుంటాయి మీ ప్రవచనాలు”
   నేను మీరు పైన చెప్పినట్లు అనుకోవటం లేదు. అలా అయితే “మార్క్సిజం చేసిన అనాలిసిస్ సరైనది “, అని అనను. అలానే ఒక సిధ్ధాంతాన్ని ప్రశ్నించటానికి ఆ సిధ్ధాంతానికి సంబంధించిన అన్ని పుస్తకాలూ చదవ వలసిన అవసరం ఉంది అనుకోను. సిధ్ధాతాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు తార్కికం గా సరైన సమాధానం చెప్పగలిగినపుడు, ఎదుటి వాడు ఎన్ని పుస్తకాలు చదివాడు అన్న ప్రశ్న ఎందుకు వస్తుంది?
   కథ లోవి నా అభిప్రాయాలు కాదు. పాత్ర అభిప్రాయం మాత్రమే! నేను పాత్రల మాటున దాక్కొంటున్నాననుకోకండి. నాకు ఏ ఇరవై యేళ్ళో ఉన్నప్పుడు నా అభిప్రాయాలు కొంత immature గా ఉండేవి. పాత్రల వయసు కి తగ్గట్టు గానే వారి అభిప్రాయాలను పెట్టాను.

   మెచ్చుకోండి

 2. బొండాలపతి గారికి
  మీకు మార్కిజం తెలియకనె మీరు ఇలా అడుగుతున్నారు తెలిసి ఉంటె వ్యెక్తుల్నొ లెదా సిద్దాంతాన్నొ ఎదొ ఒక దాన్ని లొపం ఉందనొ లెదా లొపం లెదనొ ఎదొ ఒక నిర్నయానికి ఖచ్చితంగా వచ్చివుండె వారు మార్కిజం అంటె దొపిడిని సమస్త లక్షణాల్ని తిసివెసి మానివున్లి సమానుల్ని చెసె సిద్దాంతం .ఇదంతా మార్క్స్ తన ఇ స్టా ఇ స్టాలతొటి స్వంత కల్పనల తొటి చెప్పింది కాదు తనకన్న వెనకటి ఆర్దిక వెత్తల అందించిన విలువ సూత్రం మీద ఆదారపడుతూ వివరించిందె .దొపిడిని వ్యెతిరెకించె సిద్దాంతంలొనె లొపం వుందనుకుంటె ఇక అప్పుడు దొపిడిలొనె రైటు వుంది .ఒక వర్గం శ్రమ చెయ్యకుండా జీవిచటం లొనె రైటు వుంది అసమాంత్వం లొనె రైటు వుంది అనె అర్తానికి రావలసి వుంది ఇక్కడ ఒక ప్రశ్నె వెసుకుందాం ఈప్రశ్నెకు ఇచ్చుకునె జవాబును పట్టె మార్కిజ లొపం వుందా లెదా అనెది వుంతుంది దొపిడిరైటు కాదు అనుకునెవాళ్ళకి ఆమాటచెప్పె మార్కిజం లొ లొపం లెనట్టె సిద్దాంతంలొ లొపం లెదంటె ఇకదాన్ని అర్దంచెసుకొవడంలొనే ,ఆచరించటంలొనే లొపం వుందన్న్నమాట సమాజం ఇంకా వర్గాలుగా ఉన్నప్పుడు వాటి ప్రథినిదులందురూ కమ్మునిస్టు పార్టిలొ వుంటారు వాళ్ళలొ కొందరికి మార్కిజ అవసరం వుండదు దాన్నియక్కడ వీలైతె అక్కడ ఆపడానికి ప్రయత్నిస్తారు ఒకదసెలొకాకపొతె ఇంకొదసెలొ ఆచరిత్రంతా ఇక్కడచెప్పడం సాద్యం కాదు
  మార్కిజం పెట్టుబడిదారి గురించి చెసిన అనాలసిస్ సరైనది కాని పరిస్కారంలొనె తెడా వుంది అన్నారు
  సిద్దాంతం సరైనది ఐనప్పుడు దానికి సుపిన మార్గం కూడా సరైనదె అవుతుంది రెండింటికి వైరుద్యం ఎలావుంతుంది ?

  మెచ్చుకోండి

  1. రామమోహన్ గారు,
   నేను ప్రశ్నలు అడిగింది మార్క్సిజం practical గా నిలబడలేకపోయింది అనే ఉద్దేశం తోనే…. “ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు” అనే ఉద్దేశం తో కాదు.
   నాకు మార్క్సిజం తెలియదే అనుకొందాం, అంత మాత్రాన ప్రశ్నలు వేయకూడదనిలేదు కదా? దానిని గురించి నాకన్నా మెరుగైన పరిజ్ఞానం ఉన్న వారు నన్ను సరి చేస్తే ఒప్పుకోవటానికి నేను ఎప్పుడూ సిధ్ధం.
   మీరు ఒక మంచి ప్రశ్నే వేశారు.
   “సిద్దాంతం సరైనది ఐనప్పుడు దానికి సుపిన మార్గం కూడా సరైనదె అవుతుంది రెండింటికి వైరుద్యం ఎలావుంతుంది ?”
   పెట్టుబడిదారి వ్యవస్థ ఎలా పని చేస్తుంది అనేదాని గురించిన మార్క్సిజం యొక్క విశ్లేషణ సరైనదే అనుకొంటాను. అంత మాత్రం చేత అది ప్రతిపాదించే alternative, practical గా ఉండాలని ఏమున్నది? సామాన్య జనాలు అర్ధం చేసుకొని ఆచరణ లో పెట్టలేని పరిష్కారం విఫలమైనట్లేకదా? ఎందుకంటే అది సామాన్య జనాల కోసం ఉద్దేశించబడింది కనుక.
   ఒక శాస్త్రవేత్త “కాలం లో వెనక్కు పోయే ఒక అంతరిక్ష నౌక” డిజైన్ ఒకటి చేశాడనుకొందాం. ఫాక్టరీ లో నౌక ను నిర్మించే వారు డిజైన్ ను తు.చ తప్పకుండా అమలు చేశారనుకొందాం. (లెనిన్ లాంటివారు ఉన్నపుడు రష్యాలో మార్క్సిజం అమలు లో ఏమీ తేడాలు లేవు కదా?) కానీ, తీరా చూస్తే ఆ డిజైన్ తో చేసిన నౌక కాలం లో వెనుకకి వెళ్ళలేక పోతే ఆ డిజైన్ కేవలం ఊహ మాత్రమే అవుతుంది కదా! ఈ డిజైన్ ఒక ఫాక్టరీ లోనే కాదు అన్ని ఫాచ్టరీలలోనూ ఫెయిల్ అవుతుంటే (రష్యా ఫాక్టరీ లోనూ, చైనా ఫాక్టరీలోనూ, వియత్నాం ఫాక్టరీలోనూ, చివరికి క్యూబా ఫాక్టరీలోనూ కూడా) డిజయిన్ ను అనుమానించటం లో తప్పులేదు కదా!
   మన డిజైన్ ను ఫాక్టరీ లోని ఇంజినీర్లెవరూ సరిగా అమలుచేయలేరంటారా..? ఇంకా ఆడిజైన్ వలన ఉపయోగమేముంది? అది ఎప్పటికైనా భౌతిక రూపం దాల్చుతుందన్న నమ్మకమేమిటి?. ఇక ముందు సక్సెస్ అవుతుందేమోననే ఆశతోనే ముదుకు వెళ్ళటం మాత్రమే మనం చేయగలం.

   రంగనాయకమ్మ లాంటి వారు మార్క్సిజం ఒక సైన్స్ అంటారు. “సైన్స్ యొక్క నిర్వచనం తెలిసే ఈ మాట అంటున్నారా?”, అనిపిస్తుంది. ఎలానో నాకైతే అర్ధం కాలేదు. మీకు అర్ధమైతే చెప్పండి.

   మెచ్చుకోండి

 3. బొందలపాటి గారు,
  సైన్స్ ను అభివృద్దిచేసి టేక్నలాజి రూపం లో దానిని మన రోజువారి జీవితంలో ఉపయోగించుకొంట్టున్నాము. మరి మార్క్స్ జం సైన్స్ ఐతే దానిని అభివృద్ది ఫలాలే రూపంలో ఉన్నాయి ఎంత ఉపయోగించుకొంట్టున్నాము?

  మెచ్చుకోండి

  1. అభివృధ్ధి ఫలాలే కాదు శ్రీరాం గారు (ఎనిమిది గంటల పని రోజు మార్క్సిజం ఇచ్చిన ఫలమే అనుకొన్నా), The following are essential for scientific theories:observation of the physical phenomenon, analysis and deduction are the pillars. proof is the ultimate taste of the pudding. Results are physically quanitifiable.

   మార్క్సిజం పై నిర్వచనానికి లోబడదు.

   మెచ్చుకోండి

 4. బొండాలపతి గారు
  మార్స్కిజం సరైనదె అయితె practcal గా సాద్యం కాదు అంటున్నారు మీరనెది వర్గపొరాటం గురించా లెకా మరెదానిగురించా ? చరిత్ర క్రమాన్ని ఒకసారిగమనిస్తె మొట్టమొదటి వర్గసమాజమైన భానిస సమాజాన్ని తిసుకుంటె అక్కడ అనెకపొరాటాలు జరిగన తర్వాతె భానిససమాజం నుంచివిముక్తి చెందారు అంతెగాని పొరాటం మనకెందుకులె ఈ బానిసత్వాన్నినే అనుభవిదాం అని అంతటితొ ఆగిపొలెదు తర్వాత ప్యుడల్ సమాజం లొ కూడా దానివైరుద్యాలు దానికున్నాయి అక్కద కూడా అనెక పొరాటాలు తర్వాత పెట్టుబడిదారి సమాజం .ఇదెశాస్వితంగా వుండిపొదు సమాజంలొ అసమానతలు వున్నంతకాలం పొరాటం ఆగవు మార్కిజం తెలిసినా తెలియకపొయినా పొరాటాలు ఆగవు మార్కిజం భొవ్ తిక రూపం ధరించిందా లెదా అనెదానికి చైనా ,రశ్యాలే ఉదాహరన ఉన్నన్నరొజులు అర్బుతమైన మార్పులు జరిగాయి తర్వాత పరాజయం పొందాయి ప్రక్రుతి లాగె సమాజం కూడా నిరంతరం చలనశీలమైంది ఈసమాజం ఇలాగె గడ్డకట్టుకొనిపొదు దానికి చరిత్రె ఉదాహరణ
  సైన్స్ అనెమాటకు నిర్వచనం రంగమాయకమ్మకు తెలుసా లెదా అనెవిషయం ఆమెరచనలు చదివినవారికి ,మార్కిజం తెలిసినవారికి తెలుసు సైన్స్ అనెమాటకు నిర్వచనం మీకుతెలిస్తె చెప్పండి తర్వాత మార్కిజం సైన్స్ కాదా అవునా అనెవిసెయం చర్చచేద్దాం
  కింద నెను శెకర్ గారి బ్లాగులొంచి ఇస్తున్నాను ఆయన మార్కిజ పుట్టుక గురించి వివరంగా చెప్పెరు

  మెచ్చుకోండి

  1. రామమోహన్ గారు,
   విశేఖర్ గారు రాసిన విషయాలు ఇంతకుముందే చదివాను. ఆయన ఆ విషయాలు నేను అంతకు ముందు రాసిన ఒక వ్యాఖ్యకు ప్రతిస్పందన గా రాశారు.పేజీ లోడ్ కావట్లేదు, కాబట్టీ ఆయన కామెంట్ ను తీసివేస్తున్నాను. మార్క్సిజం పరిధిలోకి రాని విషయాల గురించి కూడా ఆ వ్యాఖ్యలలో చెప్పాను (వ్యక్తిగత పరమార్ధం, అధికారం కోసం తపన వంటి అనేక బయాలజీ నుంచీ పుట్టిన పరిమితులూ అసమానతలూ). దానికి ఆయన చెప్పిన విషయాలు సమాధానం ఇవ్వలేదు.ఆ వాదనలను పొడిగించే ఓపిక లేక వదిలేశాను.
   పరిపూర్ణ సమానత్వం గురించి నా ఈ టపా లో కొంత చర్చించాను. http://wp.me/pGX4s-yH .
   “ప్రక్రుతి లాగె సమాజం కూడా నిరంతరం చలనశీలమైంది ఈసమాజం ఇలాగె గడ్డకట్టుకొనిపొదు”.
   అంగీకరిస్తాను, సమాజం పరిణామం చెందుతుంది. పోరాటాలకు తగ్గ పరిస్థితులు వచ్చినపుడు పోరాటాలు వస్తాయి. మార్పుకు ఏకైక కారణం పోరాటాలే కాదు. దానికి ఇంకా అనేక కారణాలు ఉంటాయి. సమాజ పరిణామం అన్నిసార్లూ వాంఛనీయమైన, మానవ మనుగడ కి ఉపయోగపడే దిశ లోనే ఉంటుందని చెప్పలేం!విశేఖర్ గారు, “సామ్యవాద వ్యవస్థ ఒక utopia కాదు. అది గతి తార్కిక పరం గా evolve అవుతుంది”, అని చెప్పారు. అంటే పెట్టుబడి దారి వ్యవస్థ భూ స్వామ్య వ్యవస్థ నుంచీ evolve అయినట్లే, పెట్టుబడి దారి కంటే మెరుగైన సామ్యవాద వ్యవస్థ కూడా evolve అవుతుంది. పోరాటాలు ఈ evolution లో ఒక భాగం కావచ్చు. దీనికోసం ఆశయాలెందుకు? సిధ్ధాంతాలెందుకు. దాని సమయం వచ్చిఉనపుడు అదే వస్తుంది కదా? దీంట్లో మార్క్స్ ఆవిష్కరించింది ఏమున్నది. ఉన్న mechanism నే ఆయన explain చేశాడు.Ofcourse to explain is also not an easything!
   సైన్స్ కి ఉండవలసిన లక్షణాల గురించి ఇదే టపా వేరే కామెంట్ లో రాశాను చూడండి.

   మెచ్చుకోండి

  2. రామమోహన్ గారు,
   ఈ కింది విషయాలకు point to point సమాధానం ఇవ్వగలరేమో చూడండి.
   మన వ్యవస్థ లో అనాది గా అసమానత్వానికి కొన్ని కారణాలు…..
   1.బలవంతుడెప్పుడూ బలహీన వర్గాన్ని ఆక్రమించి వాళ్ళకు బండ పనులూ, అశుభ్రమైన పనులూ, ప్రమాదకరమైన పనులూ ఇస్తాడు. ఆ పనులు చేసే వారు లేకపోతే సమాజానికి చాలా నష్టం. కానీ అణిచిపెట్టబడ్డ వారికి, అణచివేత వల్లా, పొట్టకూటి కోసం ఆ పనులు చేయక తప్పదు, ఈ రోజుల్లో మధ్య తరగతి తమ కంపెనీలను తిట్టుకొంటూ కూడా పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నట్లు.
   2. సమాజం మరియూ వ్యక్తుల అవసరాలను బట్టి కొన్ని పనులకి ఎక్కువ విలువ ఉంటుంది. మూఢనమ్మకాలున్న సమాజం లో కుహనా మత పెద్దలకి విలువ ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులున్న పాత సమాజం లో వైద్యుడికి ఉన్న విలువ మంగలికి ఉండదు.

   సమానత్వాన్ని ఒక ఆదర్శం గా తీసుకొంటే, అనేక రకాల సమానతలున్నాయి.

   అమెరికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం formality మాత్రమే! “సీ ఈ ఓ” జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
   2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో factory లలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభై truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
   3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality (చేసే పని లో సమానత్వం)అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు.కానీ నిర్ణయాలు తీసుకొనటం అనేది అమలు పరచటం కంటే మేధోపరం గా ఎక్కువ స్థాయి పని. మొదట్లో ఈ రెండు పనులనూ కృత్రిమం గా ఒకే స్తాయిలో పెట్టినా, కొన్నాళ్ళకి నిర్ణయాలు తీసుకొనేవారి ఆధిపత్యాన్ని ఆపటం కష్టం అవుతుంది.
   సోషలిస్ట్ వ్యవస్థ ఏవరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటట్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా “ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టీ,ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు”.
   సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే! అలానే ఎక్కువ కష్టపడే వారినీ తక్కువ కష్టపడె వారినీ సామ్యవాద వ్యవస్థ అయినా సమానం గా చూడలేదుకదా! సోమరిపోతుతనానికి కారణాలు అన్ని వ్యవస్థలలోనూ ఉంటాయి

   మెచ్చుకోండి

 5. రామమోహన్ గారూ మహా బాగా సెలవివ్హ్వ్హారు. అయితే ఈ చిన్ని ప్రశ్నకి సమాధానం చెప్పండి తరవాత తమరి నిరవచనాల జోలికి వద్దాం. మార్క్సిస్టులు చేసిన పొరపాట్లకు మార్క్సిజం బాధ్యత వహించదమ్నారు. మరి పెట్టుబడిదారీవర్గ్రం చేసిన పొరపాట్లకు ఆ విధానం బాధ్యత ఎందుకు వహించాలి. తమకో నీతి పక్కవాడికోనీతా?

  మెచ్చుకోండి

 6. రామోహన, ఇంత పెద్ద వ్యాఖ్యను రాశారు అంటే మీరు సామాన్యులు కారని తెలుస్తున్నాది. మార్క్స్ ఇజం మీద మీమమకారం మెచ్చ తగినది. మీరు యుక్త వయసులో ఉంటె ఈ మార్క్స్ ఇజం నుండి బయట పడండి. నడివయస్కులైతే ఎమీ పరవాలేదు. ఎలాగూ అందరికి అర్థమైపోతుమంది అదేంత వాస్తవ విరుద్ద సిద్దాంతమో అని. కాని తెర గారి లాంటివారు, తమ రచనా వ్యాసంగం దానిని ఆధారంగా చేసుకొని రాస్తూ ఉంటారు. అది ఆపితే అస్తిత్వానికి దెబ్బ. ఇక ఈ రంగణాయకమ్మ ఎమీ చదివింది? ఆమే ఆర్ధిక శాస్త్రం ఎక్కడ చదివిందో ఎవరైనా తెలిస్తే చెప్పగలరా? మా అమ్మ కాలం నుంచి ఈమే పేరు వింట్టూనే ఉంటాను. తెలుగు నాట ఆర్ధిక శాస్రం చదివిన వారు ఎవరు లేరా? ఎప్పుడు చూసిన ఈమే పేరు వినిపిస్తూ ఉంట్టుంది.

  మెచ్చుకోండి

 7. బొందలపాటిగారు,
  యు జి గారి మీద పుస్తకాలు రాసిన ముకుందరావుగారు పశ్చిమ దేశాల ఫిలాసఫి లో ని తప్పొప్పులను వివరిస్తూ ఒక పుస్తకం (అధర్ సైడ్)చాలా బాగా రాశాడు. వీలైతే చదవండి. చాలా బాగా ఉంట్టుది. ఆయన ఒక మంచి మేధావి.
  ___________________
  మార్క్స్ గారు చేసిన మహోపకారాలు చాలా ఉన్నాయి. ఆయన గారు చేసిన అనాలిసిస్ కనుగుణంగా కౌంటర్ అనాలిసిస్ అమేరికా వారు చేసారు. ఆయన యజమాన్యం గురించి రాస్తే, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపేనిలో ఉద్యోగస్తులందరిని మానేజ్మేంట్ కేడర్ కింద తీసుకొనటం మొదలు పేట్టారు. కార్మిక పదం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

  మెచ్చుకోండి

  1. Sreeram garu,
   sure. I’ll read.I’ve downloaded a”A life sketch of UG”
   “ఉద్యోగస్తులందరిని మానేజ్మేంట్ కేడర్ కింద తీసుకొనటం మొదలు పేట్టారు. కార్మిక పదం లేకుండా జాగ్రత్త పడుతున్నారు.” 🙂

   మెచ్చుకోండి

 8. Experts are worse at forecasting the future than non-experts.
  ________________________________________
  Philip Tetlock did the definitive experiment. He gathered a sample of 284 experts – political scientists, economists and journalists – and harvested 27,450 different specific judgments from them about the future then waited to see if they came true. The results were terrible. The experts were no better than “a dart-throwing chimpanzee”.

  “Science is the belief in the ignorance of the experts”, said Richard Feynman.

  మెచ్చుకోండి

 9. బొండాలపతి గారికి

  మానవ వ్యెవస్తకు అసమానత్వానికి కారణం ఎమిటి ఈప్రశ్నె మార్కిజానికి తలవంటిది సమాజలొ కలిమిలెములు ఎందుకువున్నాయి ?ఒకడు సమస్త బొగభాగ్యాలతొ తలతూగుతుంటె ఒకడు గొసిపాతలతొ ఉండడానికి గుడిసైనాలెక బుక్కాపకీరై ఎందుకువున్నాడు ? ఈప్రశ్నెకు ఒక్క మాటలొ చెప్పాలంటె “శ్రమదొపిడి ” ఈఅర్బుతాన్ని ఎలాసాదిస్తాడూ కాపిటల్ చదవలసిందె ఎందుకంటె దానికన్నాముందు డబ్బూంటె ఎమిటి సరుకంటె ఎమిటూ ఒకసరుక్కు విలువ ఎలాఎర్పడుతుందూ శ్రెమంటె ఎమిటి ఇలాటివి తెలిస్తెగాని శ్రమదొపిదీ అంటె ఎమిటి అనెది అర్దం కాదు

  మనజొబులొంచి 10రూ యవరైనాతిసుకుంటె వాణ్ణిమమము చావకొడతాము కాని ప్రతిరూజూ ప్రత్రికల్లొ వెలకొట్లు లాభం వచ్చినట్లు ప్రకటిస్తున్నారు అదంతా చాలా సహజమైనవిశెమైంది ప్రజలకు అదివాళ్ళశ్రెమే అని ఈనాటికి తెలియదు {1867 లొ కాపిటల్ వచ్చింది}
  ఒకపనిచేయాలనుకునెమనిసికి ఆపనియలాచెయ్యాలొ పనిప్రరంబించకముందే తలిసివుండాలి చొక్కాకుట్టదలుసుకున్నవ్యెక్తికి చొక్కాయలాకుట్టలొబట్టను చెతిలొకి తీసుకొకముందే తెలిసివుండాలి కాని సూదిలొకిదారం యెక్కీయడం కూడా తెలియని మనిసికి చొక్కాకుట్టె ప్రశ్నె వుండదు
  దొపిడై నుంచి విముక్తి చెందవలసిన ప్రజలె దొపిడి సంబందాలగురించి పట్టనకరంగానూ గ్రహించలెని స్తితిలొవుంటె ఆసంబాలను మార్చుకొవలసింది యవరు సిద్దాంతంతెలియకపొతెయెంటి అంటున్నారు అదితెలియకనే కదా రశ్యా, చైనాలు రివిజినిజం దారి పట్టింది సమస్యలు అనేకతెడాలతొ అనేక రకాలుగాకనపడతాయి బిదరికం ,కులాలు మతాలూ, జాతులూ, ప్రంతాలూ ,నిరుద్వూగాలు ,ఇలాటివన్ని సమాజంలొ అన్యాలకు వెరు వెరు రూపాలు ఏరొండు సమస్యలకు సంభందం లెనట్టు ప్రతిసమస్యకు స్వతంత్ర కారణం వున్నట్టు పైకి కనపడుతుంది కాని అన్నిసమస్యలకు పునాది ఒకటె

  సిద్దాంతం లెనిపొరాటం సీకట్లొ తడుములాట
  మీరు లక్ష ప్రశ్నెలు అడగవచ్చు నెను సమాదానం చెప్పగలను {నెనే కాదు మార్కిజం తెలిసిన యవరైనా చెప్పగలరు} కాని మీరు ఎన్నీడిగినా నెను ఎన్నిచెప్పినా అది కాపిటల్ చదివిన దానితొ సమానం కాదు ఒక వెయ్యి పెజీల పుస్తకం వుందనుకొండి 150వ పెజీలొ ఒక ముక్కా 670వ పెజీలొ ఒక ముక్కా 890వ పెజీలొ ఒక ముక్కా చెపితె అదేమైనా అర్దం అవుతుందా ? మీరు రైతుకుటుంభం నుంచి వచ్చినారని చెప్పుకున్నారు {అంటె కార్మికవర్గం} కాని మార్కిజానికి వీపు తిప్పారు అది ఎమిచెపుతుందొ పట్టించుకొకుండా శ్రిరాం గారూ వ్యెక్తులకు పార్టిలకు మార్కిజం భాద్యత వహించదు అని నేనంటె పెట్టుబడిదారివర్గం కూడా భాద్యత వహించదు అన్నారు అది భాద్యత వహిచదు కాబట్టె పొరాటం అవసరం కాని కార్మిక వర్గమే మార్కిజాన్ని వ్యెతిరెకిస్తుంటె పెట్టుబడిదారీ వర్గానికి అంతకన్నాకవలసింది ఏముంది వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటుంటె .

  మెచ్చుకోండి

  1. సర్,
   ప్రస్థుతం ఉన్న కాపిటలిజం లో అసమానతలు వేగం గా వస్తాయి. అదే సోషలిజం లో కంపెనీలు పెట్టి దోపిడీ చేయనీయరు. కాబట్టీ, అక్కడ మనుషుల సామర్ధ్యాలలోని తేడా ని బట్టి కొంచెం నెమ్మది గా అసమానతలు వస్తాయి. అంతే తేడా!
   నేనన్నది, “సిధ్ధాంతం తెలియనవసరం లేదని” కాదు.”సామ్యవాద సమాజం, గతి తార్కిక భౌతిక వాదాన్ననుసరించి మన సమాజ పరిణామం ప్రకారం కొంత కాలం తరువాత ఏర్పడబోతున్నపుడు (చాలా కాలం తరువాత కావచ్చు) దానిని ఒక ఆదర్శం గా , ఆశయం గా చూడవలసిన అవసరం ఏముంది?”, అని. Lack of knowledge about a theory need not prevent one from posing logical questions. The knowledgeable need not be deterred from answering such questions posed to them.

   శేఖర్ గారు, “సామ్యవాద సమాజం ఒక utopia కాదు,” అన్నారు. . utopia కానపుడు ఆదర్శాల, ఆశయాల అవసరం ఏముంటుంది? పరిణామ పరం గా అది ఎలానూ వస్తుంది.
   అలానే పెట్టుబడిదారి గురించి మార్క్సిస్ట్ విస్లేషణను అంగీకరించినపుడే, దోపిడీ యొక్క వాస్తవాన్ని అంగీకరించాను. దోపిడీ లేక పోతే, జనాభా తగ్గుతూ, సాంకేతికం గా అభివృధ్ధి చెందిన దేశాలలో కూడా ప్రజలు బికారులు గా మారుతూ ఉండటం ఏమిటి…!సహజ వనరులకు లోటులేని దేశాలలో కూడా ఇది జరుగుతోంది అంటే, దోపిడీ ఉన్నట్లే!

   నేను మానిఫెస్టో చదివాను, కానీ కాపిటల్ చదవలేదు. ఇక ముందు చదువుతాను. అప్పుడు మళ్ళీ మరింత వివరం గా చర్చిద్దాం.

   మెచ్చుకోండి

 10. మార్క్స్ గారు చేసిన మరో మహోపకారం గురించి తెలుసు కోండి. పేదరికం ఈ వంతున పెరగటానికి మార్క్స్ గారే కారణం. ఆయన వన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ప్రపంచాన్ని మార్చాలని కన్న పెద్ద కల, ఆకల కల్ల అయితే అంత కన్నా పెద్ద నష్ట్టం. అది ఇప్పుడు జరుగుతున్నాది.
  Central banks have ONE MAIN GOAL: to loot the poor and hand that money to the rich
  Money should not play a REAL role in the economy. It is merely a medium of exchange and no more. The optimal supply of money is, in my view, that level which is just enough to ensure that the price level remains unchanged. That way, the value of currency remains UNCHANGED. Money therefore does not distort incentives.
  This is a very important point.
  On the other hand, the first thing we notice is that while price levels remained largely unchanged for hundreds of years (being chained to gold) prior to the growth of central banking, since then the value of money has been TOTALLY DESTROYED.
  “The U.S. dollar, for instance, is now worth only 1/22 of what is was worth when the Fed was formed in 1913”. The Indian rupee is now perhaps worth 0.000001 of its original value (someone help me on this with the facts).
  What happens when money deflates like a shrinking balloon (as money supply inflates)? Those who save money are RUINED.
  In 1947, the average ANNUAL salary of a head clerk was around Rs.500. To save Rs.500 took 10 years of HARD LABOUR.
  Had someone put this Rs. 500 in savings below his mattress in 1947 with the hope of living off that saving in old age, he would have been bitterly disappointed.
  Today, that Rs.500 won’t buy you a SINGLE MEAL (in any ordinary restaurant).
  Why?
  ************
  Who is responsible for looting the VALUE that was supposed to be present in that Rs.500?
  Who is responsible for LOOTING the hard working poor people of this world?
  None other than Karl Marx (and his Keynesian/ Fabian socialist cronies).
  Central banking was one of the ten pillars of the communist economy. Read the Communist Manifesto if you don’t believe me on this.***********
  Of course, central banking has a longer history. A lot of so-called capitalist countries adopted it because it was a very convenient way of printing money for war. The only good thing was that at one time people would NOT TOUCH A PAPER NOTE that was not backed by gold.
  So the initial central banks had no choice but to link their fiat money (in an imperfect way) to gold.
  But as we know that was abandoned as being too constraining. The desire to PRINT MONEY become irresistible.
  Today money operates PURELY as fiat money, its value being degraded EACH DAY, EACH SECOND OF THE DAY.
  Central banks have been taking money from the poor and handing it over to the rich (who invest in stocks and property, and take all kinds of tax breaks that the poor man can’t even imagine). And people complain that inequalities are increasing! What else would you expect when you LOOT THE POOR?
  If the OWS movement wants to get to the bottom of this problem it should demand the abolition of central banking, privatisation of money, and linking ALL currency to gold. That is the ONLY way to stop this loot of the poor (of ordinary people like you and me).

  మెచ్చుకోండి

  1. “మహాత్ములెందరో సహాయపదినా..జాతి వైద్యులే కోత కోసినా..బతకలేదు”.. some coincidence..
   డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా.. పేదవాడు నాడే పుట్టాడమ్మా! అందమైన లోక మనీ రంగు రంగు లుంటాయనీ!
   పై మాటలు రాసిన ఆత్రేయ గారు కూడా, తనకు డబ్బు విషయం లో టొకరా ఇచ్చాడని ముళ్ళపూడి వెంకట రమణ వాపోయాడు. 🙂

   మెచ్చుకోండి

 11. ఊరికినే పని పాటలేని అమ్మలక్కల మాటలు/పుస్తకాలు చదివి జీవితాలను చేడగొట్టుకోకండి. బాలగోపాల్ సిద్దాంతం నాకు నచ్చక పోయినా, అతను కనీసం తన తెలివితో, చట్ట పరంగా ఎంత వరకు ఇతరులకు సహాయం చేయగలడో, (అది అతని మీద దాడులు జరిగినా) చేశాడు. మిగతా వారు పుస్తకాలు రాసుకొంట్టు. ఒకరి పుస్తకానికి ఇంకొకరు ముందు మాట రాసుకొంట్టూ, క్లరిఫికేషన్ ఇచ్చుకొంట్టు, ఖండిచుకొంట్టూ, కాలం వెళ్లబుచ్చారు. బహుశా ఈ పుస్తకాలు రాయటం వెనకాల ఉద్దేశం అర్థమై ఆయన వివరణలివ్వటం రాయకుండా మానుకొని ఉంటాడు. ఈ విషయం పైన ఇంతకు మించి స్పందిచను.

  మెచ్చుకోండి

 12. బొండలపతి గారికి
  శెకర్ గారు రాసింది ఒక్కసారి మళ్ళి గమనిచించండి ఉటొపియా గాని సామ్యవాదం గాని మార్క్స్ ముందరి ఊ హాస్వర్గ కమ్మునిజం గురించి అన్నాడు
  బ్రితీషు రచయత సర్ తామస్ మూర్ 1516 లొ ఉటొపియా అనె పుస్తం రాసినప్పటి నుంచి ఊహాజనిత సమాజాని పర్యాయపదం అయ్యింది అందుకె మార్క్స్ ముందరి వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ శ్యాస్రియ కమ్మునిజాన్ని కుడా అదెగాటి కట్టివెస్తూ విమర్శె చెస్తూ వుంటారు మీరు కాపిటల్ చదవటం జరిగితె { రొజుకు రెండు గంటలు చదివినా 8 లెదా 9 నెలలు పడుతుంది} చదవక ముందు సమాజం గురించి మీ అబిప్రాయాలు ఆలొచనలు యలావొండేవొ చదివినతర్వాత యలావుండెవొ నెను గుర్తుంటె నాకు మైల్ చెయ్యండి ramamohan135@gmail.com

  మెచ్చుకోండి

   1. ఆకాశ రామన్న గారు,
    అతను అంతకు మించి ఎమి అనగలడు. ప్రతి మనిషి తనని తాను మంచి వారమని అనుకొంటారు. పాశ్చ్యత దేశాల మేధావుల ఆలోచనల వెనుక వారి వ్యక్తిత్వ ప్రభావం గురించి ముకుంద రావుగారు మంచి పుస్తకం రాశారు. మీకు వీలైతే చదవండి. యు జి గారి మీద రాసిన పుస్తకాల లో ఈ రెండు చాలా మంచి పుస్తకాలు.
    The Other Side of Belief By Mukunda Rao
    http://sulochanosho.wordpress.com/2010/12/14/the-biology-of-enlightenment/

    మెచ్చుకోండి

  1. ఊరందరికి సలహాలు ఇవ్వటమనేడి, మార్క్స్ గారు మీకు నేర్పించిన బ్రతుకు తెరవు. మీ సలహను తీసి రీసైకిల్ బిన్ బుట్టలో పడేశాను.

   _____________________________________
   బొందలపాటిగారు ,
   నా సమస్యకి కారణం తెలిసింది. ఈ మధ్య నేను తీసుకొన్న అప్పులన్నింటిని చెల్లించేశాను. అందువలన దేశం గురించి ఆలోచించటం ఎక్కువైంది. భారత దేశం గురించి, దేశం ఎటు పోటున్నాది అని కొంచేం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే పిచ్చి పడుతుంది. లాభం లేదు, తక్షణం నా హోండా సిటి కారుని అమ్మి ఇంకొక మంచి కారును ఈ నెలలో బుక్ చేస్తాను.కారు కొనటానికి ‘లోన్’ తీసుకోవాలి. లోన్ ఉన్నన్ని రోజులు జీవితం లో, జీతం కోసం, భయభక్తులతో, జాగ్రత్తగా, మరింత బాధ్యతగా, మన గురించే ఆలోచించుకొంట్టూ పని చేస్తాము. చెల్లించగల సామర్థ్యం ,మమ మీద మనకు విశ్వాసం ఉన్నపుడు ‘లోన్ ‘ తీసుకోవటమంటే కేప్ టలిజాన్ని బ్రతికించటమే! మీరే మంటారు.?

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s