ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-26

“యా బాబూ, బాగుండావా?” కోటేసు అడిగింది. కోటేసు వయసు అరవై ఏళ్ళ పైనే.

“ఇప్పుడెక్కడా ఉండేదీ?” మళ్ళీ కోటేసే.
ఎక్కడ వుంటున్నానో చెప్పి,”నీ ఆరోగ్యం ఎలా ఉంటోంది కోటేసూ?” అడిగాను.
“ఏమీ బాగోటల్లేదు బాబూ, ‘రగత పోటూ పెరిగిపోయింది”, చెప్పింది.
కోటేసు మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వచ్చి, మా అమ్మ కి చేదోడు వాదోడు గా ఉండేది. మా నాయనమ్మ కి చివర్లో ఆరోగ్యం సరిగా లేక పోతే కోటేసే సాయపడింది. ఇప్పుడు కోటేసు కే బాగోలేదు.
“మీ అబ్బాయి ఆస్పత్రి కి తీసుకెళ్ళటం లేదా నిన్ను?”
“అ ఏం అబ్బాయో!  ఆడు పెళ్ళాం కొంగట్టుకు తిరుగుతాడు. నా నుంచీ వేరు పడ్డాడు. ఆ పెళ్ళాం కేంటో నేనంటే గిట్టదు. మా ఆయన అన్నా వుండి ఉంటే ఏ మందో మాకో ఇప్పించే వాడు నాకు…నాన్న గారు ఇయ్యాల బందరు తీస్కెల్లి పెద్ద డాట్టరు కి సూపిత్తానన్నాడు. అందుకే ఇట్టా వచ్చా”.
“కబుర్లు చెప్పింది చాలు గానీ, ఇక పదవే, బస్సు టైం అవుతాందీ”,అని మా నాన్న కోటేసు ని తొందర చేసి బయలుదేరదీశాడు. కోటేసును చూస్తే నాకు జాలి వేసింది. జాలి తో పాటు కొద్దిగా అసూయ గా కూడా అనిపించింది.  పెట్టుబడి దారీ సంబంధాలలో కంటే ఫ్యూడల్ సంబంధాలలోనే కొంత మానవీయత ఉందేమో!
ఇంతలో నాగులు వచ్చాడు “ఎప్పుడొచ్చా బాబూ?” అంటూ. “సెంటర్లో నువ్వొచ్చావని చెప్తే చూద్దారని వచ్చాను”.
“అంతా కులాసా నా? నీ పిల్లలు ఏం చేస్తున్నారు?” అడిగాను.
” పెద్దాడు ఊళ్ళోనే రుచ్చా తొక్కుతున్నాడు. చిన్నాడు హైదరాబాదు లో అపాటుమెంటు వాచీమాను గా సేత్తన్నాడు”
వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నా వీళ్ళు పైకి రాలేదేమిటబ్బా అనుకొని, “ఏం నాగులూ పిల్లలకి సరిగా చదువు చెప్పించ లేదా” అన్నా.
“ఊళ్ళో గవుర్నమెంటు ఇస్కూల్లో సరిగా చదువు చెప్పరు బాబూ. మేస్టర్లు ఇస్కూలుకి వచ్చేదే తక్కువ.  ప్రెవేటు స్కూల్లో ఫీజులెక్కువ. మా బోటోళ్ళు ఆ ఫీజులు కట్టలేరు. సదూ కోటం సదుంకొన్నారు ఇద్దరూ పదో తరగతి దాకా. తరవాత సదివించటం నా వల్ల కాలా. ఈ రోజుల్లో పదోతరగతి కి ఉద్యోగాలు ఎక్కడ్నుంచీ వస్తయ్యి?”
“మన హైస్కూల్లో నేను చదివినప్పుడు బాగానే చదువు చెప్పేవారే?”
“ఆ మాస్టార్లు వేరు, ఆ రోజులు వేరు బాబూ. ఆ మాస్టార్లందరూ ఎల్లిపోయారంట. ఇప్పుదంతా కొత్త మాస్టర్లు. ఇంట్లో ప్రెవేట్లు చెప్తారు. అక్కడికి పంపించాలంటే నా దగ్గిర డబ్బులేయి? ఇంటో చెబుదామంటే మాకా చదువు రాదు”
“ఎల్లొత్తా బాబూ”,అని నాగులు కింద వేసిన టవలు తీసి ఒక దులుపు దులిపి తలకు చుట్టుకొని బయలు దేరాడు.
*******************
మరుసటి రోజు మా అక్క కవిత ని చూడటానికి ఉయ్యూరు వెళ్ళా. కవిత కి ఇప్పుడు ఇద్దరు  పిల్లలు.చింటూ మున్నీ. చింటూ గాడు ఐదు లో ఉంటే, మున్నీ  ఏమో మూడు లో ఉంది. మొన్న కవిత ఫోన్లో చెప్పింది.
నన్ను చూస్తూనే కవిత మొఖం విప్పారింది
మా బావేమో, “శ్రీధరూ, మమ్మల్ని మర్చి పోయావనుకొంటున్నాం.పర్లేదు. గుర్తున్నాం” అన్నాడు.
చింటూ గాడూమున్నీ ఆ వాడ కట్టు లోని పిల్లల తో కోలాహలం గా ఆడుకొంటున్నారు, ఏడు పెంకులాట.
కవిత మామయ్యొచ్చాడని పిలవగానే వచ్చారు.
మున్నీ వచ్చి, “మరీ… నాకేం తెచ్చావ్?” అంది.
పిల్లలిద్దరికీ నేను తెచ్చిన కామిక్ పుస్తకాలు ఇచ్చాను.
“సరళ రాలేదేం?”, కవిత అడిగింది.
“తనకి ఒంట్లో బాగో లేదు”, అన్నాను.ఇంకా ఎన్ని సార్లు చెప్పవలసి వస్తుందో ఈ అబడ్దం.
మా అక్క పిల్లలిద్దరూ,మద్రాసు లోని పిల్లల కంటే ఉత్సాహం గా కనపడ్డారు. సిటీ పిల్లలలో లేని వైటాలిటీ ఏదో వాళ్ళలో ఉంది.లేదా ఉన్నట్లు నాకు అనిపించింది.
“ఈ సారి సెలవలకి మా ఇంటికి రండి” అని చెప్పి బయలుదేరాను.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s