ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-27

రోజులు చాలా వేగం గా దొర్లిపోతున్నాయి. ఫస్టియర్ ఫాస్ట్ గా అయిపోయింది. సెకండ్ ఇయర్ లో కోర్ సబ్జక్ట్ ల కు అలవాటు పడే సరికి గడిచిపోయింది. థర్డ్ ఇయర్, “ఇంజనీరింగ్ తరవాత ఏ కాంపిటిషన్ ఎక్జాం రాయాలా!” అని ఆలోచిస్తుండగానే మంచులా కరిగి పోయింది. ఇంజనీరింగ్ తరవాత ఏంచేయాలా అనేది ఫైనలియర్ కి వచ్చిన తరవాత కూడా తెగ లేదు శ్రీధర్ కి. రమేష్ మాత్రం ‘గేట్’ ఎంటెక్ ఎంట్రన్స్ లో మంచి పర్సంటైల్ తెచ్చుకొన్నాడు.
***********
రాష్ట్రం లో ఎన్నికలు జరగటం తో ముఖ్య మంత్రి గా విజయభాస్కర రెడ్డి దిగి పోయి, ఎన్ టీ రామా రావు వచ్చాడు. లక్ష్మీ పార్వతి తో కలిసి రామా రావు రాష్ట్ర రాజకీయాలను నా నా కంపూ చేయటం మొదలు పెట్టాడు.
***********
శ్రీధర్ ఫైనల్ ఇయర్ కి వచ్చే సరికి అత్తెసరు పర్సెంటేజి తో బీటెక్ పాసవుతాననే విషయం అర్ధమైపోయింది. ఓ రోజు చెన్నై కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ కంపేనీ క్యాంపస్ ఇంటర్వ్యూ కి వచ్చింది. వాళ్ళు బీటెక్ పర్సెంటేజ్ కనుక చూస్తే తనకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని శ్రీధర్ కి తెలుసు. క్యాజువల్ గా ఏ భయంలేకుండా  అటెండ్ అవుదామనుకున్నాడు శ్రీధర్. కానీ ఇంటర్వ్యూ కి ముందు గుండె దడ ఎక్కువైంది. అరిచేతుల్లో చిరు చెమట లు పట్టసాగాయి.రెండు సార్లు రెస్ట్ రూం కి వెళ్ళవలసి వచ్చింది.
ఇంటర్వ్యూ లో మొదట శ్రీధర్ పెదాలు దాటటానికి మాటలు చాలా కష్ట పడవలసి వచ్చింది. శ్రీధర్ ప్రాబ్లం గమనించిన ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్ ఒకతను, శ్రీధర్ కి సాల్వ్ చెయ్యమని ఒక ప్రాబ్లం ఇచ్చి,తను బయటికి వెళ్ళాడు. కాసేపు ఏకగ్రత కుదర లా. మరి  కాసేపటికి శ్రీధర్ మనసు కుదుట పడింది. చివరికి ఫోకస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాడు శ్రీధర్.
శ్రీధర్ కి సాయంత్రం క్యాంటీన్ లో కాఫీ తాగుతూ ఉంటే రమేష్ వచ్చి కంగ్రాట్స్ చెప్పే వరకూ తెలియ లేదు,జాబ్ వచ్చినట్లు. ముందు శ్రీధర్ నమ్మ లేదు. కానీ నోటీస్ బోర్డ్ చూశాక నమ్మక తప్పింది కాదు.
శ్రీధర్ కి జాబ్ వచ్చేసరికి రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు అధికారంలో పాతుకు పోయి ఉన్నాడు. రామా రావు చని పోవటం కూడా అతనికి కలిసొచ్చింది.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

7 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-27

 1. ఈ శీర్షిక ఎప్పటికప్పుడు చదువుతున్నా, ఇది నా మొదటి వ్యాఖ్య. మీరు వివరించే పద్ద్హతి, మధ్యలో ఇరికించే సామాజిక సమస్యలు/సంఘటనలు బాగుందండి. కానీ ఇదివరకటి భాగాల్లో ఎవరో చెప్పినట్లు మీరు కాలం (టైం పీరియడ్) విషయంలో తడబడుతున్నట్లున్నారు.

  తొంభై ఐదులో క్యాంపస్ ఇంటర్వ్యూలా?

  మెచ్చుకోండి

  1. జేబి గారు,
   1994 లో కాకినాడ JNTU కి మూడో నాలుగో కంపెనీలు కాంపస్ కి వచ్చాయి. అందులో సిల్వర్-లైన్ అనే ఒక చెన్నై సాఫ్ట్వేర్ కంపెనీకూడా ఉన్నట్లు గుర్తు. కధాకాలాన్ని ఓ రెండు మూడేళ్ళు తరువాత పెట్టాను. అప్పటికి కాంపస్ కు ఇంకొన్ని కంపెనీలు రావటం నాకు తెలుసు.

   మెచ్చుకోండి

 2. అంటే శ్రీధర్ చదివినది జెఎంటీయూ కాకినాడ కదాని అడిగాను! అయినా అపుడు నేనింకా పిల్లాడినేగాబట్టి ఆశ్చర్యపోయానంతే.

  మీరు ఆర్‌ఈసీ/ఐఐటీనా?

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s