ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-29

శ్రీధర్ వాళ్ళ కంపెనీ లో ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఓ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని కోసం ఇంటర్వ్యూలు. శ్రీధర్ కూడా ఇంటర్వ్యూ బోర్డు లో ఒక మెంబర్. రక రకాల క్యాండిడేట్లు వస్తున్నారు. ఒకతను కాలేజీ నుంచీ అప్పుడే పాసయ్యి వచ్చినట్లున్నాడు. “సార్ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ప్లీజ్ సార్, దయచేసి ఇప్పించడి” అన్నాడు. ఆంధ్రా నుంచీ మెడ లో మోకు లాంటి ఒక బంగారపు గొలుసు వేసుకొని వచ్చిన ఓ సమరసింహా  రెడ్డి సెలెక్ట్ కాలేదు. అతను ఇంటర్వ్యూ చేసినవాడిని పిలిచి “నీకు ఇంటర్వ్యూ చెయ్యటం రాదు, నేర్చుకో”, అని చెపుతున్నాడు.
ఒక ఇంటర్వ్యూ చేసే అతను క్యాండిడేట్ ని అడిగాడు, “నువ్వు నీ ముందు కంపెనీ మారటానికి కారణాలేమిటి?” అని.
క్యాండిడేట్ అడిగాడు, “మీరు 2003 నుంచీ ఆవంతి కంప్యూటర్ సిస్టం లో పని చేస్తూ ఉండి ఉంటారా?” అని.
ఇంటర్వ్యూ చేసే అతను ఒకింత ఆశ్చర్యపోయి, “ఎందుకూ?” అన్నాడు.
“ఏమీ లేదు ఊరికి నే.  చెప్పండి”, అన్నాడు క్యాండిడేట్.
” 2002 నుంచీ” అన్నాడు ఇంటర్వ్యూ చేసే అతను.
“మరి మీరు అంతకు ముందు పనిచేసిన కంపేనీ నుంచీ ఎందుకు మారారు?” అన్నాడు క్యాండిడేట్. ఇంటర్వ్యూ చేసే అతని దగ్గర సమాధానం లేదు.
“ఓ క్యాండిడేట్కి ఆఫర్ ఇచ్చారు. అతను అక్కడే కూర్చొని సెల్ లో వేరే కంపెనీ వాళ్ళని కాల్ చేసి బేరమాడుతున్నాడు” !!  ఇది ఉద్యోగమా? వ్యాపారమా?
‘హెచ్ ఆర్’ మేడం అంటూంది, “ఆంధ్రా నుంచీ వచ్చే రెస్యూం లలో ఫేక్ ఎక్కువ” అని. దానికి శ్రీధర్ ప్రొటెస్ట్ చేశాడు, “ఫేక్ వాళ్ళు అన్ని రాష్ట్రాలలోనూ ఉంటారు” అని.
దానికామె అంది, ” నీకు ర్యాండం స్యాంప్లింగ్ థీరీ తెలుసా?” అని. మళ్ళీఇలా అంది,”ఒక బుట్టలో రక రకా ల రంగు పూసలు కలగలిసి పోయి ఉన్నాయి అనుకొందాం. దాంట్లోంచీ   నేను ఒక గుప్పెడు పూసలు తీస్తాను. అందులో నల్లవి ఎక్కువైతే, ఆ బుట్టలోకూడా నల్ల పూసలు ఎక్కువనుకొంటాను. అలానే నా ఎక్స్ పీరియన్స్ కూడా ఒక శాంపుల్ లాంటిది.  అందులో  ఎక్కువ గా నల్ల పూసలే ఉన్నాయి”, అంది.

ఇంటర్వ్యూ తరవాత శ్రీధర్ సిటీ బస్సు లో ఇంటికెళ్తుంటే ఎవరో తెలుగు బాబాయ్ సెల్ ఫోన్ లో అరుస్తున్నాడు,”ఆ..మావా రెస్యూం ప్రిపేర్  చేసేశాన్రా..ఒక ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉందనుకో..ఇంకో రెండేళ్ళు ఫేక్ పెట్టా…టెస్టింగ్ లో…ఆ..బ్యాక్ గ్రౌండ్ చెక్ వస్తే కొంచెం మానేజ్ చెయ్యాల్నువ్వు…సరే ఉంటా..”

అది విన్న తరవాత’ హెచ్ ఆర్’ ఆమె చెప్పింది నిజమేనేమో అనిపించింది శ్రీధర్ కి.ఏదేమైనా, మన తెలుగు వాళ్ళంతా ఆత్మ విమర్శ చేసుకోవలసిన విషయం ఇది.

శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి మొదలైంది.శ్రీధర్ ప్రాజెక్ట్ లీడ్.   దానితో, క్యాబ్ లో కొంచెం ముందే బయలుదేరుతున్నాడు శ్రీధర్. ఈ మధ్య వెంకట్ క్యాబ్ లో రావటం లేదు. బైక్ కొనుక్కొని దాంట్లో వస్తున్నాడు. ఇప్పుడు వెంకట్ కూడా శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ లో చేరాడు. వెంకట్ నిజం గా టాప్ గ్రేడర్. అతనికి పని ఇస్తే దానిని గురించి శ్రీధర్ మరిచిపోవచ్చు. వెంకట్ కి ఆన్ సైట్ వెళ్ళా లని బాగా కోరిక ఉందని శ్రీధర్ కి తెలుసు. శ్రీధర్ కూడా పంపించే ఆలోచన లోనే ఉన్నాడు. ఇవాళొ రేపో  క్లైంట్ కి చెప్పి,తరవాత వెంకట్ కి చెప్పాలనుకొంటున్నాడు శ్రీధర్.

శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ లో చాల భాషల వాళ్ళే ఉన్నారు. మనం తెలుగు వాళ్ళ గురించి చెప్పుకుందాం. వెంకట్ గురించి మీకు తెలుసు. ఇంకా సుబ్రమణ్యం, ఫణి, ముకుందు, రామా రావ్.
సుబ్రమణ్యం చాలా కష్టపడతాడు. రాత్రి పదీ పన్నెడు దాకా ఆఫీస్ లోనే ఉంటాడు. అంతకు ముందు ప్రాజెక్ట్ లీడ్ కూడా ‘అతను హార్డ్-వర్కర్’ అని చెప్పాడు. కానీ శ్రీధర్ ఒకటి గమనించాడు. సుబ్రమణ్యం కి ఐటీ కి సంబంధించిన కొన్ని సాధారణ విషయాలు కూడా తెలియదు. ఫోల్డర్ ని శ్రీధర్ లాగిన్ కి షేర్ చెయ్యమంటే అర్ధం కాలేదు అతనికి. అతనికిచ్చిన పని కూడా చాలా నెమ్మది గా అవుతుంది.
ఓ రోజు ‘హెచ్ ఆర్’ ఆమె పిలిచి చెప్పింది, “సుబ్రమణ్యం బ్యాక్ గ్రౌండ్ చెక్ నెగటివ్ గా వచ్చింది..ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టాడు. సో వెంటనే అతన్ని పీకేయాలి”, అని.
“ప్రాజెక్ట్ లో అతనిది చాలా ఇంపార్టంట్ రోల్ వెంటనే తీసేయాలంటే కష్టం”, అన్నాడు శ్రీధర్, సాటి తెలుగు వాడిని వెంటనే పీకటానికి శ్రీధర్ మనసు ఒప్పుకోలా. కానీ సీట్లోకి వచ్చి ఆలోచించుకొంటే అనిపించింది శ్రీధర్ కి, “ప్రాజెక్ట్ మొదట్లో ఉంది. తరవత ఐతే రిస్కు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పీకేయటమే కరెక్టు. లేక పోతే నేను ఇబ్బంది పడతాను”, అనుకొన్నాడు.
సుబ్రమణ్యం వెళ్ళే ముందు శ్రీధర్ ని కలుసుకొన్నాడు, “బయటికెళ్ళిన తరవాత ఏం చేస్తావ్?” అన్నాడు శ్రీధర్.
“వేరే కంపనీ నుంచీ ఆఫర్ ఉంది”, అన్నాడు సుబ్బు. మరి ఈ కొత్త ఆఫర్ ఫేక్ వలన వచ్చిందో, లేకుండా వచ్చిందో.
ఇక పోతే ఫణి ఎప్పుడూ నీరసం గా ఉంటాడు. ఓ రోజు అతని తో మాట్లాడుతుంటే తెలిసింది శ్రీధర్ కి. అతను అంతకు ముందు జావా లొ చేశాడని. శ్రీధర్ ప్రాజెక్ట్ ఏమో ఎంబెడెడ్. ఫణి కి ఎంబెడెడ్లో చెయ్యటం ఇష్టం లెదు. “ఏంటొ నా ఇష్టం తో పని లేకుండా నన్ను ఓ బాల్ లా తంతున్నరు ఒక ప్రాజెక్ట్ లోంచీ వేరే దాన్లో కి”, అంటాడు అతను.
సరే, ముకుందు సంగతి కొద్దాం. అతనిది ఒంగోలు దగ్గర ఓ పల్లెటూరు. ఇంగ్లీషు వీకు.కానీ టెక్నికల్ గా సౌండు. అతన్ని అర్ధం చేసుకోవడమే కష్టం వేరే భాషల వాళ్ళకి
రామా రావు ది హైదరాబాదు. కంపె నీ లో ఉండటమే కంపెనీ కి సేవ చెయ్యటం అనుకొంటాడు అతను. శ్రీధర్ కానీ, వాళ్ళ మానేజర్ కానీ ఇచ్చిన ఏ పని కీ అతను “నొ” చెప్పడు. కానీ, అతనికి ఇస్తే ఏ పనీ ముందుకు కదలదని తెలుసు శ్రీధర్ కి. ఇటువంటి వాళ్ళు ఉండే కంపెనీ ల గురించి మనం జాలి పడాలి.

శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళ గానే రిసెప్షనిస్ట్ నుంచీ ఫోన్ వచ్చింది.
ఆమె అడుగుతోంది, “మీ దగ్గర వెంకట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నంబర్ ఉందా?”
“లేదు ఏమయ్యింది?”
“అతని బండి కి హోసూర్ రోడ్డు లో యాక్సిడెంట్ అయ్యింది. నారాయణా లో చేర్పించారు.”
” సీరియస్ గా ఉందా?” అన్నాడు.
“అవును”.
శ్రీధర్ హాస్పిటల్ కి వెళ్ళేసరికి అంతా అయ్యిపోయింది. చావు చాలా విచిత్రమైనది.
‘హెచ్ ఆర్’ అమ్మాయి కి ఫోన్ చెస్తే వెంకట్ వాళ్ళ పేరెంట్స్ పేర్లు చెప్పింది. వెంకట్ జేబు లోని సెల్ లో వాళ్ళ నాన్న ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేశాడు శ్రీధర్. మోగుతోంది ఫోన్. ఏమి చెప్పాలి? “ఆన్ సైట్” “ఆన్ సైట్” అనే వాడు..తిరిగి రాని తీరాలకి ‘ఆన్ సైట్’ వెళ్ళిపోయాడనా?

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

4 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-29

 1. ______________________________

  ఆంధ్రా నుంచీ మెడ లో మోకు లాంటి ఒక బంగారపు గొలుసు వేసుకొని వచ్చిన ఓ సమరసిమ్హా రెడ్డి సెలెక్ట్ కాలేదు. అతను ఇంటర్వ్యూ చేసినవాడిని పిలిచి “నీకు ఇంటర్వ్యూ చెయ్యటం రాదు, నేర్చుకో”, అని చెపుతున్నాడు.
  ______________________________

  For me this seems very unrealistic.

  మెచ్చుకోండి

  1. I was a witness to one such situation. I think I have dramatised the sentence here. Once a situation becomes part of one’s experience, from then on it feels realistic.
   While conducting mass interviews the sample of the candidates is very big. Usually one encounters these extreme cases in that situation

   మెచ్చుకోండి

 2. వీరుభొట్ల గారు, అరుదేమో కానీ అన్ రియలిస్టిక్ మాత్రం కాదు. ఈఅనుభవం నాకు ఎదురైంది. మా కంపెనీ లో రూల్స్ ప్రకారం ఒకసారి అటెండ్ అయి రిజెక్ట్ అయితే మళ్ళీ 6 నెలల వరకు అతను దరఖాస్తు చేయకూడదు. ఓ సారి నే రిజెక్ట్ చేసిన క్యాండిడేట్ రెండు వారాల వ్యవధిలోనే అప్లై చేయడం కాక అతని ఖర్మ కొద్దీ నా దగ్గరకే వచ్చాడు. మళ్ళీ ఒకటి రెండు ప్రశ్నలు అడిగి సరిగా జవాబివ్వలేకపోతే పంపేస్తుంటే… “అసలు నీకేం కావాలి?” “నువ్వు సరైన ప్రశ్నలు అడగడం లేదు..” అంటూ ఎదురు దాడికి దిగాడు. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి. ఫేక్ తీసేసిన అసలైన రెజ్యూమే కావాలి అని చెప్తే సైలెంట్ గా వెళ్లిపోయాడు.

  మెచ్చుకోండి

 3. @ ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ & వేణు శ్రీకాంత్:
  Thanks for your replies. I am relatively newbie to IT with just 3 years of experience. I have attended interviews only as a fresher. I never thought that people will be have like this.

  నాకు ఐటీ పరిశ్రమలో ౩ సంవత్సరాల్ అనుభవం మాత్రమె ఉంది మాస్టారు. ఇప్పటి వరకు ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యలేదు. మీ వివరణకు నెనర్లు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s