ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

సరళ తో నా పెళ్ళి కి రెండు పక్కలా పెద్ద వాళ్ళను ఒప్పించడానికి ఒక పెద్ద తపస్సే చేయవలసి వచ్చింది. మద్రాస్ లో జరిగిన మా పెళ్ళీకి మా ఇద్దరి ఫ్రెండ్స్ కొందరు, నా వైపు నుండీ కొద్ది మందీ, సరళ వైపు నుండీ చాలా మందీ వచ్చారు. మా పెళ్ళైన రోజే నా ప్రాజెక్ట్ మేట్ మనీష్ పెళ్ళీ కూడా అయింది,బీహార్ లో. పెళ్ళయిన తరువాత హనీమూన్ కి ఊటీ వెళ్ళి వచ్చాం. పెళ్ళి కోసం పెట్టిన లీవ్ చాలా త్వరగా అయిపోయింది.

వడపళని లో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకొని ఫామిలీ  మొదలుపెట్టాం. అపార్ట్ మెంట్ రెంట్  నేను కట్టాలనీ మిగిలిన ఇంటి ఖర్చులు సరళ భరించాలనీ డిసైడ్  చేసుకున్నాం.

ఆఫీస్ కి లీవ్ నుంచీ తిరిగి వెళ్ళిన నాలుగు రోజులకి మా మేనేజర్ పిలిచాడు.

“యూ ఎస్ ఆన్ సైట్ ఆపర్ట్యునిటీ ఉంది. నీ ప్రొఫైల్ బెస్ట్ ఫిట్ అవుతుంది. డూ యూ హావ్ ఎనీ ప్రాబ్లం ఇన్ టేకింగ్ అప్ ద అస్సైన్మెంట్?” అన్నాడాయన. నాచిన్నప్పుడు అమెరికా వెళతానని కల లో కూడా అనుకో లేదు.ఇప్పుడు అవకాశం వచ్చింది. కానీ పెళ్ళైన వెంటనే.

మా మేనేజర్ని నా తో పాటు నా వైఫ్ ని కూడా తీసుకొని వెళ్ళ వచ్చునేమో అడిగాను.

దానికాయన, “నీకు బీ ఒన్ వీసా అప్ప్లై చేయాలి. ఆ వీసా తో వైఫ్ ని తీసుకొని వెళ్ళడం కుదరదు” అన్నాడు.  “నీతో పాటు మనీష్ కూడా యూ ఎస్ వస్తున్నాడు. మనీష్ ది హెచ్ ఒన్. కాబట్టీ అతను వైఫ్ ని కూడా తీసుకొని వెళ్తున్నాడు” అని కూడా అన్నాడు.

సరళ తో ఫోన్ లో ఈ విషయం చెప్పి, “నాకు నువ్వు లేకుండా వెళ్ళాలని లేదు” అన్నాను.   దానికామె,”కెరీర్ ముఖ్యం.ఏమీ ఆలోచించకుండా ఒప్పుకో. ఇదే నేనయితే యెస్ చెప్పేదానిని”, అంది.

ఆ రోజే మా మేనేజర్ కి యెస్ చెప్పి తరవాతి రోజు వీసా కి అప్ప్లై చెశాను వీసా రావటానికి ఇరవై రోజులు పట్టవచ్చు. మూడు నెలలు ప్రాజెక్ట్ యూ ఎస్ లో, వెళ్ళవలసినది లాస్ ఎంజెలెస్.  బీ ఒన్ వీసా మీద పని చేయకూడదు కాబట్టి, యూ ఎస్ లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో బిజినెస్ కోసం వెళ్తున్నానని అబద్దం చెప్పాలి అని బ్రీఫ్ చేశారు మా కంపనీ హెచ్ ఆర్ మొబిలిటీ వాళ్ళు.

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s