ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-5

మా తొమ్మిదో  నంబర్ బస్సు లో ఎఫ్.ఎం రేడియో మంచి హుషారైన పాటల్ని పాడుతోంది. కానీ, బస్సు లో ఎవ్వరూ హుషారు గా లేరు. కొంతమంది  ముందు సీటు పై మోచేతులానించి, చేతుల పై తలను ఆనించి నిద్ర పోయెందుకు ట్రై చేస్తున్నారు. మరి కొందరు ఈవెనింగ్ పేపర్ తిరగేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ యధావిధి గా రెక్ లెస్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అందరి ముఖాల్లోనూ అలసట స్పష్టం గా కనపదుతోంది. కొంత మంది క్యాబ్ వెనక నాలుగు సీట్లు ఆక్రమించి కార్డ్స్ ఆడుతున్నారు. నేనూ వెంకట్ ముందు సీట్లో సెటిల్ అయ్యాం.
“మీ మానేజర్ యూఎస్ పంపిస్తానంటున్నాడా?” వెంకట్ ని కదిలించాను.
“ఆ పంపిస్తానంటుండు..కానీ మధ్య మధ్య లో “పెర్ఫార్మెన్సు ఇక్కడ ఇంప్రూవ్ చెయ్యాల అప్పుడే పంపిస్తా” అంటుండు. యూఎస్ పోయి ఒక సంవత్సరం పని చేసి మా వూరెల్లి హాపీ గా సెటిల్ అవుతా…”,అని ఒక్క క్షణం గాలి లోకి చూసి, మల్లీ నా వైపు చూసి తన మాటల్లో తన కే నమ్మకం లేనట్లు నవ్వసాగాదు వెంకట్. ఆ నవ్వు నా మనసు లో ఆలోచనల తేనె తుట్టె ని కదిలించింది.
నమ్మకం…అదొక్కటే లేదిక్కడ..ఇక్కడ లేనిదీ ఊళ్ళో ఉండేదీ ….మా మేనేజర్ మాట
మీద నిలబడతాడనే నమ్మకం లేదు. ఎంప్లాయీ పని చేస్తాడనే నమ్మకం లేదు..కంపెనీ వాడు చెప్పే ఏ మాట లోనూ నమ్మకం లేదు..
అన్నీ టెంపరరీ అరేంజిమెంట్స్ అయ్యినప్పుడు పక్క వాడు మనలను నమ్మక పోయినా పరవా లేదు. రేపు నువ్వెక్కడుంటావో..నీపక్క వాడెక్కడుంటాడో. కొత్తవాళ్ళతో మొహమాటమేమిటి?
వ్యాన్ బొమ్మనహళ్ళి వచ్చేసరికి పొట్టలో ఎలుకలు పరిగెత్తసాగాయి నాకు. ఆకలికి నీరసం వచ్చి, నీరసానికి చెమటలు పట్టాయి.కిందికి దిగి ఏమైనా కొనుక్కొని తిందామంటే,  డ్రైవర్ వ్యాన్ మధ్యలో ఆపడు. జేబు లో డబ్బులుండి కూడా కొనుక్కొని ఆకలి తీర్చుకోలేని పరిస్థితి. నిద్రపోదామంటే నిద్రరాదు.

హోసూరు రోడ్డు పక్కనే బిల్ బోర్డు లు….రియల్ ఎస్టేట్ వాళ్ళవీ…బ్యాంకు ల వాళ్ళవీ…కార్ల కంపెనీలవీ…వీళ్ళందరికీ కస్టమర్స్ సాఫ్త్వేర్ జనాలే. అమెరికా నుంచీ,యూరోప్ నుంచీ, జపాన్ నుంచీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జేబుల్లో వచ్చి పడే డబ్బు ని బయటికి తీయడానికి ఈ కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. సక్సెస్ అవుతున్నయి కూదా…కానీ దీని వలన ఇళ్ళ స్థలాల రేట్లూ..లోన్ల వడ్డీ రేట్లూ పెరుగుతున్నై. రేట్లు పెరగటం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్య తరగతి ఉద్యోగులు గా మారుతున్నారు.మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ గా మారొతోంది. ఇదంతా ఒక క్లోస్డ్ ఎకానమీ. మనీ సర్కులేషన్ కొన్ని సర్కిల్స్ లో నే జరుగుతుంది.సాఫ్ట్వేర్ …రియల్ ఎస్టేట్….ఆటోమొబైల్స్…ఎయిర్లైన్స్…వీళ్ళందరి మధ్యే మనీ సర్కులేషన్ జరిగేది. ఈ సర్కులేషన్  జరిగే క్రమం లో పట్టణాల్లో ఉండే, పట్టణాలకు వలస వచ్చే కొందరు నిరుద్యోగులకి కొన్ని చిన్న చిన్న జాబ్స్ రావచ్చు. కానీ దీని వలన మిగతా సొసైటీ కి ఉపయోగం ఉంటుందా అన్నది సందేహాస్పదమే…!
సిల్క్ బోర్డ్ దగ్గర నౌకరీ జాబ్ సైట్  బిల్ బోర్ద్ లో, ఓ ఎంప్లాయీ కొత్త జాబ్ రాగానే పాత బాస్ ని అవమానిస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ కంపనీలు రాజకీయ పా ర్టీల్లా కప్పల తక్కెడ లాంటివి. ఎంప్లాయీస్ ఒక కంపెనీ నుండీ వేరొక కంపెనీ కి కప్పల్లా దూకుతూ ఉంటారు.కిందటి నెల మా డివిజన్ లో అవినాష్ అనే వాడు రెజైన్ చేశాడు. వాడు రెజైన్ చేసినాక వరుస గా అదే నెలలో ఐదుగురు రెజైన్ చేశారు. ఇది చూస్తూంటే సాఫ్త్వేర్ జనాలు కప్పలే కాదు గొర్రెలు కూడా అనిపించక మానదు.
క్యాబ్ ఒక్కొక్క స్టాప్ లోనూ ఆగగానే, ఎవరి స్టాప్ లో వారు దిగిపోతున్నారు.దిగిపోయే ముందు బస్సులో వాళ్ళ కి బై చెబుతున్నారు. బయట రోడ్డు మీద పొల్యూషన్ తో ఊపిరాడటంలేదు.
సంతోష్ రెడ్డి హుషారు గా క్యాబ్ డ్రైవర్ తో తెలుగులో కబుర్లు చెప్తున్నడు. సంతోష్  ది చిత్తూరు జిల్లా లో ఓ పల్లెటూరు. డ్రైవరేమో తనకు తెలుగు రాదనీ, సంతోష్ మాట్లాడేది ఒక్క ముక్కా తనకు అర్ధం కావదం లేదనీ సంతోష్ తో కన్నడం లో చెప్తున్నాడు. డ్రైవర్ శివమొగ్గ నుంచీ వచ్చిన కన్నడిగుడు. అతనికి తెలుగు బొత్తిగా రాదు. కానీ సంతోష్ మాత్రం “బెంగలూరు లో ఉండే వాళ్ళందరికీ తెలుగు వచ్చు” అనే అపోహ లో ఉన్నాడు.
“ఏమప్పా శ్రీధరూ…దిగాలు గా కూర్చొనినావేమి?” సంతోష్ అంటున్నాడు నాతో.సంతోష్ తో మాట్లాడితే బెంగలూరు లో రాయలసీమ పల్లె కనపడినట్లే.
“నువ్వు డ్రైవర్  కి తెలుగు నేర్పుతున్నావు కదా, వింటున్నా”, అని అన్నను. సంతోష్  కి తెలుగూ ఇంగ్లీషూ తప్ప వేరే ఏ భాషా రాదు. చిన్నప్పటి నుంచీ గాలి వాటం గా తిరిగాడు. ఫ్యాక్షన్ లలో తిరిగాడు.చాలా మంది రాయలసీమ వాళ్ళ లాగా సంతోష్ కి స్థానిక రాజకీయాలన్నీ కొట్టిన పిండి. ” ఏ రాజకీయ నాయకుడు ఎంత కరప్షన్ చేశాడో, ఎవరికి ఎంతమంది కీప్ లు ఉన్నారో..ఏ హీరో తెర వెనక భాగోతం ఏమిటో ” అంతా తన కళ్ళ తో చూసినట్లు చెప్పగలడు సంతోష్. ఇప్పటి కీ వారం వారం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి ఫ్రెంద్స్ ని కలుసుకొని వస్తాదు.
చిన్నప్పుదు చిల్లర తిరుగుళ్ళు తిరిగిన సంతోష్ కి, డిగ్రీ లో కి వచ్చిన తరువాత బుద్ధి కుదిరి ఎం సీ ఎ చేశాడు.ఆపైన బెంగలూరు లో జాబ్ దొరికింది.
“ఈ వీకెండ్ ఊరు వెళ్తున్నావా?”, అడిగాను సంతోష్ ని.
“లేదప్పా, ఈ వారం పనిమనిషి రాలేదు. ఆయమ్మకి ఫీవర్. ఈ వీకెండ్ బట్టలు నేనే గుంజాల”
సంతోష్ తెచ్చిన తెలుగు పేపర్ లో రాజశెఖరరెడ్డి కి లెనిన్ వేషమేసిన బొమ్మ చూపించాను సంతోష్ కి.
“చూశావా, వై ఎస్ కి లెనిన్ వేషమేశాడు పేపర్ వాడు?” అన్నన్నేను.
“లెనిన్ ఎవురు? వాడో రాజు అనుకొంటా కదా?”,సంతోష్అడుగుతున్నాడు.
నాకు నవ్వా లో ఏడవాలో తెలియక చిరు నవ్వు నవ్వి ఊరుకొన్నాను. మా మాటల్లోనే వ్యాన్ మల్లేశ్వరం దాటి,మా ఇంటి దగ్గర్లో ఆగింది. వెంకట్ కీ సంతోష్ కీ బై చెప్పి మా ఇంటి వైపు నడవ సాగాను.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-5

 1. మీరు వరుసగా రెండు కథలను కలిపి రాస్తున్నట్టు గా వుంది . పోయిన భాగం లో నాగులు , ఇప్పుడు మళ్లీ బెంగుళూరు …
  రాయండి , పూర్తి ఐన తర్వాత ఎమన్నా తెలుస్తుందేమో …

  మంచి నవల చదివినట్టు వుంది. దయచేసి కాస్త టై పాటులు(type mistakes) రాకుండా చూడండి , అప్పుడప్పుడు పంటి కింద రాయి లా వున్నై …

  మెచ్చుకోండి

  1. “టై పాటులు(type mistakes) రాకుండా చూడండి , అప్పుడప్పుడు పంటి కింద రాయి లా వున్నై …” చెప్పినందుకు థ్యాంక్సండీ! ఇక జాగ్రత్తపడతాను.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s