ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -6

శ్రీధర్ ఆ రోజు సెలవు కావడం తో ఆడుకోవడానికి “ధడేల్” గాడి ఇంటికి వెళ్ళాడు.ధడేల్ గాడు శ్రీధర్  కంటే నాల్గేళ్ళు పెద్ద వాడు. వాడి అసలు పేరు చంద్రమౌళి. వాడికి ధడేల్ అనే పేరు రావడానికి వెనుక పెద్ద కథే ఉంది.
వెంకటాపురం లో రవి ప్రసాద్ అని లెక్కల  మాస్టరు ఒకాయన ఉండేవాడు. ఆయన ఆ ఊళ్ళోని జిల్లాపరిషత్ పాఠశాల లో పని చేస్తూ ఖాళీ సమయాల లో ట్యూషన్లు చెప్పుకొనే వాడు. అందుకే ఊళ్ళో ని అందరూ ఆయన్ని ప్రైవేటు మాస్టారని కూడా అనేవారు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలూ ఒక భార్య! మాస్టారి భార్య కు గయ్యాళి అని పేరు. ఆమె పేరు సుకుమారి.
ఆ ఊళ్ళోనే యూ పీ స్కూల్లో జయమ్మ అని తెలుగుటీచర్ ఉండేది.ఆమెకు చిన్నతనం లో నే భర్త పోయాడు. తరవాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకో లేదు. తరువాత ఆమె కి పిల్లలు కలగ లేదు.
రవి ప్రసాద్ ఇల్లు ఆమె ఇంటికి దగ్గరే. అప్పుడప్పుడూ రవి ప్రసాద్ భార్యా పిల్లలూ ఆమె ఇంటి కి వచ్చే వారు. ఆమె కు కూడా పిల్లలంటే ఇష్టమవటం చేత రవి ప్రసాద్ పిల్లలను ఆమె బాగానే దగ్గర కు తీసేది.దీని తో రవి ప్రసాద్ భార్య, సుకుమారికీ ఆమె కూ ఉన్న అనుబంధం గట్టిపడింది.సుకుమారి కి జయమ్మ ఇంటి కి పోనిది ఉబుసు పోదు.
ఎప్పుడైనా ప్రైవేట్ మాస్టారు బడి నుండీ ఇంటికి వచ్చి, ఇంటికి తాళం వేసి ఉంటే సుకుమారి జయమ్మ ఇంట్లో ఉన్నట్టే లెక్క. సుకుమారి ని పిలుచుకు రావటానికి మాస్టారు కూడా జయమ్మ ఇంటికి వెళ్ళే వాడు.
జయమ్మ మాస్టారికీ భార్యకీ “టీ” పెట్టి ఇచ్చేది. కాసేపు జయమ్మా మాస్టారూ టీచర్ల జీతాలూ యూనియన్లూ అలవెన్సులూ గురించి మాట్లాడుకొన్న తరువాత, టీ ముగించి మాస్టారి కుటుంబం ఇంటి ముఖం పట్టేది. ఏ ఆదివారమో  జయమ్మ కూడా మాస్టారి ఇంటికి వచ్చి సుకుమారి తో కబుర్లు చెప్పేది.
ధడేల్ గాడికి వయసు కి మించిన ఊహలు ఎక్కువ. ఓ రోజు వాడు జయమ్మ ఇంటి తలుపులు తీసుకొని మస్టారు ఒక్కడే బయటకు రావడం గనించాడు. దాంతో వాడు జయమ్మ ఇంటి తలుపుల మీద ఓ కన్నేసి ఉంచాడు.  ఆ తరువాత వరుస గా నాల్రోజులు మాస్టారు ఒంటరిగా జయమ్మ ఇంట్లో కి వెళ్ళడం కూడా వాడి కంట పడింది. ధడేల్ గాడి పొట్ట ఈ విషయం కక్క లేక ఉబ్బి పోయింది. వాడు ప్రైవేట్ పిల్లల దగ్గరికి వచ్చి “మీకో వింత చూపిస్తా”నని చెప్పి,పిల్లలని వెంటబెట్టుకొని జయమ్మ ఇంటికి దారి తీశాడు.
పిల్లల్నందర్నీ  పెరటి గోడ పక్కన నుంచోబెట్టి మూసి ఉన్న జయమ్మ ఇంటి తలుపుని గొళ్ళెం తో తట్టాడు వాడు. లోపల్నుంచీ సమాధానం రాలేదు. దాని తో వాడు కాలెత్తి తలుపు మీద “ధడేల్ ధడేల్” మని రెండు సార్లు తన్ని పరుగెత్తి గోడ చాటుకొచ్చి మిగతా పిల్లల తో పాటు  దాక్కొన్నాడు.
మరోరెండు నిమిషాలకి జయమ్మ ఇంటి తలుపులు ఓర గా తెరుచుకొన్నయి. తలుపుల సందు లో నుంచీ మాస్టారు అనుమానం గా,చెమట గా,ఆందోళన గా బయటకు చూస్తున్నాడు.  మాస్టారికి పైన చొక్కా లేదు.కింద తుండు గుడ్డ చుట్టుకొని ఉన్నాడు. బయట ఎవరూ కనపడక పోవడం తో మాస్టారు మళ్ళీ తలుపులు మూసి గడియ వేశాడు.
ఈసారి ధడేల్ గాడు రెట్టించిన ఉత్సాహం తో వెళ్ళి తలుపులను కాలితో బలం గా తన్ని మిగతా పిల్లల తో కలిసి వెనక్కి చూడకుండా పరారయ్యాడు.
అదండీ విషయం. అప్పటి నుంచీ వాడికి ధడేల్ గాడనే పేరు స్థిర పడి పోయింది.ఇది జరిగిన రెండ్రోజులకి మాస్టారి తో చనువు గా ఉండే మున్సబు కొడుకు వాడిని పిలిచి,”ఒరేయ్, అబ్బాయ్  నువ్వు వయసుకి మించిన పనులు చేస్తున్నావ్! జాగ్రత్త!” అని చెప్పాడు. మరుసటి రోజు పొద్దున్నే వాడు పక్క మీది నుంచీ లేవక ముందే వాడి ఒంటి మీద దెబ్బలు పడ్డాయి. దాని తో వాడికి మెలకువ వచ్చింది. ఎదురు గా చూస్తే వాడి నాన్న ఉన్నాడు బరికె పట్టుకొని. మునసబు కొడుకు వాళ్ళ నాన్న కి ఏమి చెప్పాడో తెలియదు కానీ ధడేల్గాడి వళ్ళు మాత్రం వాతలు తేరిపోయింది, వాళ్ళ నాన్న  కొట్టిన కొట్టుడు కి.
ధడేల్ గాడి సాహస కృత్యం అ నోటా ఈ నోటా పడి మాస్టారి భార్య చెవిన  పడటానికి ఓ రెండు నెలలు పట్టింది. అ పైన మాస్టారు ఆ ఊరి నుంచీ ట్రాన్స్ ఫర్   చేయించుకొని మరో వూరు వెళ్ళటానికి ఇంకో ఆరు నెలలు పట్టింది.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -6

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s