ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – 7

వ్యాను దిగిన తరవాత చూసుకుంటే ఐ డీ కార్డు ఇంకా మెడ లో నే ఉంది. దాన్ని తీసి జేబులో పెట్టాను. ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్త్. ఈ రోజు కి ఆరున్నర సంవత్సరాలు కావస్తోంది, ఈ కంపెనీ ల ఐ డీ కార్డులు మెడ లో వేసుకొని తిరగటం మొదలు పెట్టి, కుక్క మెడ లో గొలుసు లా.
ఇంటి తాళం తీసి గీజర్ ఆన్ చేసి, స్టవ్ మీద కాఫీ కి నీళ్ళు పెట్టాను.కాసేపు పొద్దున వచ్చిన పేపర్ చదివి గీజర్ ఆఫ్ చేశాను. స్టౌ మీద కుక్కర్ పెట్టి కాఫీ కలిపి తాగటం మొదలు పెట్టాను. కాఫీ తాగుతూ ఉంటే ఆరున్నర సంవత్సరాల కిందట జాబ్ లో జాయిన్ అయినప్పటి ఆలోచనలు చుట్టుముట్టాయి. అప్పుడు కూడా మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో ఇలాగే పిల్టర్ కాపీ తాగి బయలు దేరాను మొదటి జాబ్ కి.
**************
ఆఫర్ లెటరూ లగేజీ పట్టుకొని చెన్నై స్టేషన్ లో దిగాను. కూలీ వాడు తమిళం కలిసిన తెలుగు లో నూరు రూపాయలు అడిగాడు, లగేజీ బయటకు తీసుకొనిపోవడానికి.దాంతో లగేజీ లాక్కుంటూ బయలు దేరాను. ఒక షాప్ దగ్గర ఆగి,  కాఫీ తాగుతూ స్టేషన్ లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళను గమనించ సాగాను.
ఆంధ్ర లో అమ్మాయిల యావరేజి కలరూ యావరేజి అందమూ పట్టణాలకు పోయేకొద్దీ పెరుగుతుంది. బందరు కంటే విజయవాడ అమ్మాయిలు బాగుంటారు. విజయవాడ అమ్మాయిల కంటే హైదరాబాదు అమ్మాయిలు బాగుంటారు. నీడ పట్టున ఉండటం వలన కావచ్చు, బ్యూటీ క్రీము ల వలన కావచ్చు, టౌనుల్లో ఉద్యోగాలు చేసే అబ్బాయిలు పెల్లెటూళ్ళళో ఉండే అందమైన అమ్మాయిలందరినీ పెళ్ళి చేసుకొని పట్టణాల్లో కాపురాలు పెట్టడం వలన కావచ్చు.ఈ నా అబ్సర్వేషన్ ప్రకారం చెన్నై లో అమ్మాయిలు హైదరాబాద్ అమ్మాయిల కంటే బాగుంటారు అనుకున్నాను. కానీ అలా అనుకోవటం కరెక్ట్ కాదు అని తెలిసింది, స్టేషన్ లో చుట్టుపక్కల అమ్మయిలను చూస్తుంటే.
“ఎక్స్ క్యూజ్ మీ. కెన్ ఐ  చెక్ ద  వెయిట్ ఆఫ్ యువర్ లగేజ్?” ఎవడో నల్లటి రైల్వే అఫీషియల్ ఆపాడు నన్ను. లగేజి చెక్ చేస్తే లిమిట్ కంటే పది కిలోలు ఎక్కువ గా ఉంది. “నువ్వు నాకు నచ్చావ్” సినిమా లో లా ఆ ఆఫీసర్ రెండొందలు ఫైన్ రాస్తానని భయపెట్టి, తరవాత యాభై రూపాయలు పట్టి నన్ను వదిలాడు.
లగేజి క్లోక్ రూం లో పెట్టి స్టేషన్ బయటికి రాగానే ఓ అడ్డబొట్టు ఆటో వాడు ఎక్కడి కి పోవాలని అడుగుతున్నాడు నన్ను తమిళం లో. తెలుగు లో చెప్పాను నేను.  దానికి వాడు “పోలాం సర్” అన్నాడు. తెలుగు వాళ్ళకి తమిళం కిటికీ కర్టెన్ లా అనిపిస్తుంది. కర్టెన్ అవతల ఏముందో కనపడీ కనపడకుండా ఉంటుంది. అలానే తమిలం కూడాతెలుగు వాళ్ళకి అర్ధమయీ అర్ధమవకుండా ఉంటుంది.
“ఎంతవుతుంది” అడిగాన్నేను.
” ఫోర్ హండ్రడ్ సార్”, వాడు ఇంగ్లీష్ లో చెప్పాడు. నేను మీటర్ వేయమన్నాను. వాడు నన్ను పిచ్చోడిని చూసినట్లు చూశాడు.ఇక్కడ మీటర్ కాన్సెప్ట్ లేనట్లుంది. రైల్వే స్టేషన్ నుండీ కాస్త దూరం నడిచి,  దారి లో పోయే అటో వాడ్ని ఒకణ్ణి  ఆపి వాడిని వందరూపాయలకు ఒప్పించాను,టెక్నాలజీ పార్కు కు తీసుకొని పోవటానికి.
“సాధనా కంప్యూటర్స్ లో అక్కడి హెచ్ ఆర్ వాళ్ళని కలిశాను.వాళ్ళు నా ఆఫర్ లెటర్ తీసుకొని,సర్టిఫికెట్లు చెక్ చేసుకొని, అపాయింట్ మెంట్ లెటరూ, ఎంప్లాయీ నంబరూ ఇచ్చారు. ఐ డీ కార్డు రావటానికి ఓ రెండ్రోజులు పడుతుంది. ఈ లోపు గేటు దగ్గరసైన్ చేసి లోపలికి వెళ్ళాలి.
కూర్చోవటానికి ఓ ట్రైనింగ్ రూం చూపించారు హెచ్ ఆర్ వాళ్ళు. అక్కడ నా లా కాలేజీ ల క్యాంపస్ లో జాయిన్ అయిన వాళ్ళు నలుగురబ్బాయిలూ ఇద్దరమ్మాయిలూ ఉన్నారు. ఇంకా కాలేజీ లో ఉండే లేజీ తనం పోయినట్లు లేదు వాళ్ళకి, నాలానే. వాళ్ళు చెప్పారు ఇంగ్లీషు లో ఎల్లుండి నుంచీ ట్రైనింగ్ అని.
కంపెనీ గెస్ట్ హౌస్ లో రూం ఇచ్చారు,వారం రోజులకి. ఈ లోగా సొంత రూం వెతుక్కొని అక్కడికి మారాలి. క్యాంటీన్ లో సర్వర్ సాంబార్ ముందు పోసి కూరలు తరవాత వేయటం తో నాకు నేను ఇంకో సారి చెప్పుకున్నాను,”ఇది మద్రాసు రా!” అని.
ఒకప్పటి మద్రాసు తెలుగు సినిమా ల కూ,సాహిత్యానికీ కేంద్ర బిందువు గా ఉండేది.మద్రాస్ బాక్ డ్రాప్ తో చాలా నే సినిమా లూ నవలలూ వచ్చాయి,అప్పట్లో. అప్పుడు ఎలా ఉండేదో గానీ,ఇప్పుడు మాత్రం తెలుగు వాతావరనం అస్సలు లేదు మద్రాస్ లో. ఇప్పుడక్కడంతా తమిళమయం. అందుకేనేమో మద్రాస్ తన పేరు ని చెన్నై గా మార్చుకొంది..కాలేజీ ల నుంచీ ఉద్యోగాల కోసం వచ్చే మన ” మామ లూ , బాబాయ్ లూ” మాట్లాడే తెలుగు మాత్రం అప్పుడప్పుడూ వినపడుతుంది రోడ్డు మీద.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

4 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – 7

  1. థ్యాంక్స్ అండీ . నాకూ చాలా సంతోషం గా ఉంది. బ్లాగ్ లింకు వీలయినంత ఎక్కువ మందికి ఫార్ వార్డ్ చెయ్యండి.

   మెచ్చుకోండి

 1. ఆంధ్ర లో అమ్మాయిల యావరేజి కలరూ యావరేజి అందమూ పట్టణాలకు పోయేకొద్దీ పెరుగుతుంది. బందరు కంటే విజయవాడ అమ్మాయిలు బాగుంటారు. విజయవాడ అమ్మాయిల కంటే హైదరాబాదు అమ్మాయిలు బాగుంటారు…………….మీ వుద్దెష్యం తమిళనాడు అమ్మయిలు బాగా వుంటరనా…..ఒకవెల అదె కరెఖ్ట్ అయిథె మీరె మొదటి వరి అవుథారు. తమిళనడు అమ్మయిలు బాగ వుంటరు అనె వారు

  మెచ్చుకోండి

  1. కట్ అండ్ పేస్ట్ మిస్టేక్ అండీ. సరి చేశాను . బ్లాగు చూడండి. పాయింట్ అవుట్ చేసినందుకు థ్యాంక్స్ అండీ.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s