ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-8

ధడేల్ గాడూ చిన్నూ గాడూ కలిసి ఆడుకొనేందుకు మరో ఇద్దరు ఊళ్ళో పిల్లలను వెంటబెట్టుకొని రేవు ఒడ్డున లంకల్లో ఉండే తోటలకు బయలు దేరారు. మామిడి తోటల్లో వాళ్ళకి కోతుల గుంపు ఒకటి కనిపించింది. వాటి పై రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. చివరికి ఈ పిల్ల కోతుల గుంపుని తట్టుకో లేక ఆ అసలు కోతుల గుంపు పారిపోయింది. ధడేల్ గాడూ మిగిలిన ఇద్దరు పిల్లలూ మామిడి చెట్లెక్కి కొతి కొమ్మచ్చి ఆడటం ఆరంభించారు. పిల్లలు దూకుతుంటే ఒక్కోసారి పెళుసు గా ఉండే మామిడి కొమ్మలు విరుగుతున్నాయి. కొమ్మలతో పాటు వీళ్ళ కాళ్ళు కూడా బెణుకుతున్నాయి. తోట లో ఒక చిన్న గుడిసె ఉంది. చిన్నూ గుడిసె చూరు లో ఓ కథల పుస్తకం దాచి పెట్టుకొన్నాడు. చందమామ లో ప్రతి నెలా సీరియల్ గా వచ్చే రాజుల సీరీల్స్ ని కత్తిరించి ఒకటి గా కుట్టిన పుస్తకం అది. శ్రీధర్ ఏడో క్లాస్ కి ఫస్ట్ గా వచ్చినందుకు వాడి పిన్నమ్మ వాడికి ప్రజెంట్ చేసింది ఆ పుస్తకాన్ని. చిన్నూ పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టాడు. నెమ్మది గా వాడికి ఆ తోట కథ లో ఉండే అరణ్యం లా అనిపించసాగింది. కథ లో అరణ్యం లో తిరిగే మాంత్రికులు ఏకాక్షీ చతుర్నేత్రుడూ ఆ తోట లో నే   తిరుగాడుతున్నట్లు అనిపించసాగింది వాడికి.

కాసేపటికి పిల్లలు ముగ్గురూ ఆటలు కట్టిపెట్టి శ్రీధర్ ని పిలిచారు. మధ్యాహ్నమయి పోయింది. వాళ్ళకి ఆకలవుతోంది. తోట కంచె తో పాటు నేరేడు చెట్లూ, పెద్ద ఉసిరి చెట్లూ, వెలగ చెట్లూ అక్కడక్కడా ఉన్నాయి. పిల్లలు రాళ్ళతో నేరేడు కాయలు రాల గొట్టారు. ఒక ఎండు చెట్టు కొమ్మ తో వగరు గా ఉండే వెలగ కాయలు రాల్చారు. చిన్నూ మాత్రం రేగు కాయలు కోశాడు జాగ్రత్త గా, ముళ్ళు గుచ్చుకోకుండా. వీటికంటే తాజా కాయలు ఎక్కడ దొరుకుతాయి గనుక!   పిల్లలు రాలగొట్టిన కాయలన్నింటినీ నాలుగు భాగాలు గా చేసి, సమానం గా పంచుకొని తిన్నారు. చివరి గా ఉసిరి కాయలు రాల కొట్టి తిన్నారు. మోటారు  దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగారు. నీళ్ళు తీయ గా అనిపించాయి.
నీళ్ళు తాగిన తరవాత పిల్లలు మోటారు బోదె లో స్నానానికి సిద్దమయ్యారు. ఇంతలో కృష్ణా రావు గారి కొత్త పాలేరు, సిద్దడు వచ్చి, “బాబూ, బోదె లో కి దిగితే మీ నాన్న గారు కోప్పడతారు”, అని వాడే శ్రీధర్ ని కోప్పడ్డాడు. ఈ కొత్త పాలేరు నల్ల గా ఉండటం వలన పిల్లలు వాడికి “నల్ల చింతపండు” అని పేరు పెట్టారు. పిల్లలు నల్ల చింతపండు గాణ్ణి “చెత్త చింతపండు గాడు” అని తిట్టుకొన్నారు . “ఇదే నాగులు అయితే ఆడుకోనిచ్చే వాడు”, అంటున్నాడు శ్రీధర్ పిల్లలతో.
పిల్లల కి నీళ్ళలో ఆడాలనే కోరిక తీరకపోవటం తో రేవు వైపుకి బయలుదేరారు, కరకట్ట మీద నుడుచుకొంటూ. సూర్యుడు పడమట  అస్తమిచబోతున్నాడు. ధడేల్ గాడు ఆకాశం కేసి చెయ్యి చూపించి చిన్నూ గాడి తో, “అరేయ్, సూర్యుడి దగ్గరికి వెళ్దాం రా!” అన్నాడు.
“సూర్యుడికి ఎంత దూరం ఉంటుంది  రా”, అన్నాడు చిన్నూ.
“అక్కడే! కరకట్ట చివర అనుకొంటాన్రా!”, అన్నాడు ధడేల్ గాడు.
“సూర్యుణ్ణి ఎంత దూరం వెళ్ళినా చేరుకోలేమనుకొంటా రా”, అన్నాడు వాళ్ళలో  మూడో వాడు.
“సరే, చూద్దాం రా”,  అని ధడేల్  గాడు పరి గెత్తతం మొదలెట్టాడు.
వాడితో పాటు మిగతా పిల్లలు కూడా పరిగెడుతున్నారు.
ఇంతలో ఎదురు గా వచ్చాడు గాంధీ మాస్టరు.బుర్రమీసాలూ, కళ్ళజోడూ, పంచెకట్టూ, నిండైన విగ్రహమూ వెరసి పాత సినిమాలలో ఎస్వీ రంగారావు ని గుర్తుకు తెస్తాడు గాంధీ మాస్టారు.   ఆయన్ని చూసి మిగిలిన ఇద్దరు పిల్లలూ ఓ తాడి చెట్టు చాటు కి పోయి నక్కారు. ధడేల్ గాడు గాంధీ మాస్టర్ ని లెఖ్ఖచేయదలుచుకోలేదు. వాడితో పాటు చిన్నూ  గాడు కూడా “నమస్తే సార్”, అనాడు. గాంధీ మాస్టర్  అలియాస్ రామారావు ఎప్పుడూ గాంధీ గారి సిద్దాంతాల  గురించి ఉపన్యాసాలు ఇస్తాడు.  అందుకే ఆయనకా పేరు. అయితే బూతులు మాత్రం ఎక్కువ మాట్లాడతాడు.కోపమొచ్చిందా పిల్లల వీపులు విమానం మోతే!
“ఈ కరకట్ట మీద ఎక్కడికి రా బయలు దేరారు, సాడదాని కొడకల్లారా?”, అన్నాడు గాంధీ మస్టరు.
“సూర్యుడి దగ్గరికి సార్”, అన్నాడు చిన్నూ గాడు.
” సూర్యుడి దగ్గరికేంటి రా. ఓహో ఈ బడుధ్ధాయి ఉన్నాడు గా”, అని ధడేల్ గాదికేసి చూశాడు. వాడి పేరు ప్రఖ్యాతులు అప్పతి కే మాస్టర్ చెవిన పడ్డాయి.”కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడ గొట్టిందట. అయినా ఎవరన్నా ఏమన్నా చెబితే నమ్మేయటమేనా. నిజమేదో తెలుసుకొనే పన్లే, నీ లాంటి వాడు కూడా” అని శ్రీధర్ కి చెప్పి, గాంధీ మాస్టరు సాగిపోయాడు. ఆయనకి శ్రీధర్ తెలివైన వాడని నమ్మకం.
సాయంత్రం  కావస్తోంది. అయినా పిల్లలకేమీ ఆకలీ అలుపూ తెలియటం లేదు. వాళ్ళు తిన్న కాయల మహత్యమో, వాళ్ళ పసిమనసు ల మహత్యమో!. నది కంటే ముందు వాళ్ళని నది హోరు తాకింది. ఆ నది రొద లో పిల్లలు గొంతు పెంచి బిగ్గరగా అరుపుల తో మాట్లాడు కొంటున్నారు. కృష్ణా నది ఇసుక ఎక్కువ గా, నీళ్ళు  తక్కువ గా నూ కనపడుతోంది. ఇదే నది వరద వస్తే పరవళ్ళూ తొక్కుతూ, కొట్టుకు వచ్చే చెట్ల తో నూ, పశువుల కళేబరాల తో నూ,సుడులు తిరిగే బురద రంగు నీటి తో నూ కరకట్ట ను తాకుతూ భీకరం గా ఉంటుంది.
అందరూ నది నీళ్ళ  లో మునుగుతూ ఆట మొదలు పెట్టారు. “ఒరేయ్, ఎవరూ లోతు కు వెళ్ళకండి రా, మా తాత ఇక్కడే పడి కొట్టుకుపోయాడట. మా నాన్న చెప్పాడు”, శ్రీధర్ బిగ్గరగా చెప్తున్నాడు. పిల్లలంతా నీళ్ళలో మునిగి దాక్కునే ఆట ఆడుతున్నారు. ఆ క్రమం లో వాళ్ళకి తెలియ కుండానే నెమ్మది గా నది లోపలికి జరగ సాగారు.
శ్రీధర్ కాలి కింది బుసక కి హఠాత్తు గా డొల్ల పడి కిందికి దిగింది.. దాంతో వాడి తల నీళ్ళ కిందికి మునిగిపోయింది. కాసేపటి కి తల మళ్ళీ పైకి తేలింది. వెంటనే వాడు గాభరా గా కేకలు వేశాడు. మళ్ళీ నీళ్ళ అడుగుకి మునిగి పోయాడు. ధడేల్ గాడికి ఈత బాగానే వచ్చు. వాడు ఈదు కొంటూ చిన్నూ వెనకాల కి వచ్చి, వాడిని ఒడ్డు వైపుకు బలం గా నెట్టాడు.. దాంతో చిన్నూ తల నీటి పైకి వచ్చింది. వాడి కంగారు తగ్గింది. నీత్లో నడుచుకొంటూ ఒడ్డుకు చేరుకొన్నాడు. వాడి తో పాటు అందరూ ఒడ్డు కి చేరారు. “ఈ విషయం వాళ్ళ ఇళ్ళలో చెప్పబోమని” శ్రీధర్ మిగిలిన వాళ్ళ దగ్గర ప్రమాణాలు చేయించుకొన్నాడు. పిల్లలంతా ఇంటి ముఖం పట్టారు.
“అందర్నీ లోతుకెళ్ళొద్దని చెప్పి నువ్వెట్లా వెళ్ళావు రా? అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితి లో పడ్డట్టుంది”, ధడేల్ గాడు శ్రీధర్ ని ఆట పట్టించసాగాడు.
“నేనేమీ లోపలికెళ్ళలేదు రా, కాలికింద ఇసుక కుంగింది”, శ్రీధర్ సమర్ధించుకున్నాడు.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

2 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-8

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s