ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ట్రైనింగ్ మూడు నెలలూ చాలా ఫాస్ట్ గా గడిచాయి. ట్రైనింగ్ కాలేజ్ లైఫ్ కి ఓ ఎక్స్ టెన్షన్ లా అనిపించింది. అందరూ కుర్రకారే!
క్రాస్ కల్చరల్ ట్రైనింగ్ లో అమెరికన్ కల్చర్ కి ఎలా అడాప్ట్ అవ్వాలో చెప్పారు. బిజినెస్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ లొ ఫోన్ ఎటిక్వెట్  గురించీ,ఈ మెయిల్స్ రాయడం గురించీ చెప్పారు. ట్రైనింగ్ పూర్తయ్యేసరికి కొత్త వాళ్ళందరం బాగా కలిసిపోయాం.
కంపెనీ కి దగ్గర లో నే పది హేను వందల అద్దె కి ఒక రూం తీసుకున్నాను. నా మొదటి ప్రాజెక్ట్ మొదలయ్యింది. అమెరికా లో కాసినో ల కోసం సాఫ్ట్ వేర్ డెవలప్ చెయ్యాలి.వర్క్ బాగానే ఉంది కానీ పర్పస్సే నాకు నచ్చ లేదు. ఎందుకంటే అమెరికన్ కాసినో ఇండస్ట్రీ అనే గుడ్డిగుర్రానికి మేము పళ్ళు తోమాలి. కాక పొతే పళ్ళు తోమినందుకు నాలుగు రాళ్ళు వస్తాయి.
మా  టీం మొత్తం ఎనిమిది మందిమి. ఆరుగురు తమిళియన్స్  ఒక హిందీ అతనూ నేనూ. ఏదైనా టీం మీటింగ్ పెడితే తమిళులంతా డిస్కషన్ తమిళం లో చేసేవారు. హిందీ వాడూ  నేనూ ఏమీ అర్ధం కాక ఒకరి మొకం ఒకరు చూసుకొనే వాళ్ళం. తమిళులకు భాషాభిమానం కొంచం ఎక్కువే. అనేక రాజకీయ చారిత్రక కారణాల  వలన తమిళులు హిందీ వ్యతిరేకులు కూడా. తమిళ్నాడు స్టేట్ స్కూల్స్ సిలబస్ లో హిందీ చదవవలసిన అవసరం లేదు. దీని తో చాలా మంది ఎడ్యుకేటెడ్ కూడా హిందీ అర్ధం చేసుకోలేరు.
అయితే ఈ హిందీ వ్యతిరేకత వలన తమిళ్ కల్చర్ డైల్యూట్  కాకుండా ఉందని నాకు అనిపించింది. తమిళ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు  ఉపయోగించే ఇంగ్లీష్ పదాలు తెలుగు వాళ్ళ తో పోలిస్తే చాలా తక్కువ. తమిళ కమర్షియల్ సినిమాలూ, మ్యూజిక్కూ ఇండియా లో  మోస్ట్ క్రియేటివ్. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో డబ్బూ ఆర్భాటం చెంచాగిరీ ఎక్కువగా ఉన్నట్లు  అనిపిస్తుంది మీడియా ని చూస్తే. తెలుగు సినిమా లు చాలా వరకు తమిళ మాతృకలకు రీమేక్ అయివుంటాయి.
ముప్పై రోజుల్లో తమిళం పుస్తకం కొని తమిళం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను.

**************
సాఫ్ట్ వేర్  మంచి బూం లో ఉంది. మా కంపెనీ తరపున వారానికో పార్టీ అన్నా జరుగుతోంది. పార్టీల్లో  తాగేవాడికి తాగినంత,తినేవాడికి తినినంత…చాలా మంది కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొంటున్నారు. ప్రాజెక్ట్ లు వస్తాయనే ఆశ తో అదనం గా కూడా జనాలను తీసుకొంటున్నారు. అప్పట్లో మా మధ్య ఓ ఈ మెయిల్ సర్క్యులేట్ అవుతూ ఉండేది.ఈ జోక్ మీకు తెలిసే ఉంటుంది.
“సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకడు ట్రైన్ లో ఒక కూలి వాడిని కలుస్తాడు. కూలివాడు సాఫ్ట్ వేర్ మనిషిని లెక్క చేయకుండా అతని ఎదురు గా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. దీంతో వళ్ళు మండిన సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కూలి వాడిని అడుగుతాడు,”రేయ్ కూలీ, నా జీతమెంతో తెలుసా? నెలకి ముప్పై వేలు. మరి నీ జీతం ఎంత?”
“నాకు నెలకు మూడు వేలొస్తే పండగ సార్”.
“నా మొబైల్ ఖరీదు పదిహేను వేలు. నీకు సెల్ ఫోన్ ఉందా?”
“లేదు బాబూ”
“లాప్ టాప్ అంటే ఏమిటో తెలుసా?”
“తెలవదండీ”
ఈలొగా ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది. కూలి వాడు తువ్వాలు తీసి దులిపి తలకు చుట్టుకొన్నాడు. తన తట్టా పారా పట్టుకొని,”నాకు పనుందయ్యా! తమరికి ఆఫీసు లో ఏమాత్రం పనుంటాదేటి?” అని ట్రైన్ దిగిపోయాడు.
****************

మా ఆఫీస్ లో సరళ అని ఓ అమ్మాయి ఉంది.మామూలు గా ఫ్రెండ్స్ తో తమిళం లో మాట్లాడుతుంది. ఈ రోజు, ఇంటినుంచీ అనుకుంటా, ఫోన్ వస్తే తెలుగు లో మాట్లాడుతోంది..తమిళ యాస లో.అడిగితే చెప్పింది,” మా కుడుంబం ఎల్లా తెలుగు వాళ్ళేనండీ. తమిళ్ నాట్ల చాల టైం వెనకాల సెట్టిల్ అయ్యాం”.
ఓ రోజు మా టీం మేట్ మనీషూ నేనూ మద్రాస్ ని కసి తీరా తిట్టుకొంటున్నాం. మద్రాసు ఎంత డర్టీ గా ఉంటుందో,తమిళియన్స్ ఎంత పారోకియల్ గా ఉంటారో అంటూ.
“ఇక్కడ హోటళ్ళ వాళ్ళూ ఎంగిలి ప్లేట్లు కడిగి ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద పోస్తారు”, హిందీ లో అంటున్నాడు మనీష్. సరళ పక్కనుండీ మా మాటలు విన్నట్లుంది. మా దగ్గరకు స్పీడ్ గా నడుచుకొంటూ వచ్చి, ” అలా అయితే మీరు మీ ఊళ్ళలో నే ఉండలేక పోయారా? ఇక్కడికెందుకొచ్చారు?”అని వెళ్ళి పోయింది. సరళ స్వతహా గా తమిళ అమ్మాయి కాక పోయినా ఆమెకు కోపం ఎందుకొచ్చిందబ్బా!!?
****************
సరళ  కు కంపైల్ ఎర్రర్ వస్తోంది. నన్ను పిలిచి చూడమంది.నేను మోనిటర్ వంక చూస్తూ లైన్ నంబర్ వేలితో చూపిస్తూ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని ఆమె మౌస్ మీద చెయ్యి వేశాను. కానీ అప్పటికే మౌస్  మీద ఆమె చెయ్యి ఉంది. నా చెయ్యి ఆమె చెయ్యి మీద పడింది. వెంటనే చెయ్యి వెనక్కి లాక్కుని “సారీ” అన్నాను.
“ఇట్స్ ఓకే”, అంది సరళ, తలతిప్పి చూడకుండా..
అంటే  నేను చెయ్యి వేసినా పరవా లేదనా? ఛ..  అలా ఏమీ కాదు. టౌను పిల్ల  ఈమాత్రానికే సిగ్గు పడదు కదా. వాళ్ళకి ఇవన్నీ మామూలే. నా పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ వలన  నాకు అలా అనిపిస్తోంది. అయినా దీనికి నేను లైన్ వెయ్యడం ఏమిటి? నల్ల గా,బక్క గా, ఫ్లాట్ గా..యాక్.

నేను ఈ ఆలోచనలలో ఉండగానే మా టీం లీడ్ వచ్చి, నాకు బెస్ట్ టీం మెంబర్ అవార్డ్ వచ్చిందని చెప్పాడు. సరళ వచ్చి నా హాండ్ షేక్ చేసి,”కంగ్రాట్స్..పార్టీ ఎప్పుడు?” అంది. ఒక అమ్మాయి నన్ను టచ్ చెయ్యటం అదే  మొదలు.
నేను,”పార్టీ ముందు నువ్వే ఇవ్వాలి.నీ కంపైల్ ఎర్రర్ పోయింది కదా?” అన్నాను.
దానికి ఆమె, నా నెత్తి పై చిన్న గా ఒకటి మొట్టి,” మొస కుట్టి…లిటిల్ రాబిట్..తప్పించుకుంటున్నావ్!” అంది.
ఇదేంటబ్బా మనతో క్లోజ్ గా మూవ్ అవుతోంది? అందరి తో ఇలానే మూవ్ అవుతుందేమో?లేక పోతే ఈ సిటీ అమ్మాయిలకి ఇది మామూలేనేమో…నీతోనే క్లోజ్ గా మూవ్ అవ్వాలని నీకే మనసు లో ఉందేమో. “ఇంకెవ్వరితోనూ క్లోజ్ గా మూవ్ అవ్వదు .నాతో నే అవుతుంది”అనుకొంటున్నావ్. ఇది విష్ ఫుల్ థింకింగ్….

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

6 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

 1. ప్రపంచం లోని అన్ని భాషలూ ఆంగ్లం దెబ్బకి “అలో లక్ష్మణా!” అంటున్నాయి. మొన్న జపాను పోతే జపాను వాడొకడు కూడా చెప్పాడు,” జపాను సిటీలల్లో ఇంగ్లీషు ముక్కలు లేకుండాజపాను భాష మట్లాడటం గగనమైపోతోందంట.

  మెచ్చుకోండి

 2. _________________________
  ఈ హిందీ వ్యతిరేకత వలన తమిళ్ కల్చర్ డైల్యూట్ కాకుండా ఉందని నాకు అనిపించింది. తమిళ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఉపయోగించే ఇంగ్లీష్ పదాలు తెలుగు వాళ్ళ తో పోలిస్తే చాలా తక్కువ.
  _________________________
  నిజమే మాస్టారు !!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s