ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

గుళ్ళో ఆ సాయంత్రం పురాణ  కాలక్షేపం ఉంది. కృష్ణా రావు గారి అమ్మ సీతమ్మ గారు శ్రీధర్ కి స్నానం చేయించి, పౌడర్ రాసి, తనూ స్నానం చేసి వాణ్ణి తీసుకొని శివాలయానికి బయలు దేరింది. గుళ్ళో రికార్డులు వేయడం మొదలు పెట్టారు. “శివం శంకరం శంభు నీశానమీనే..” ఆ సాయంత్రపు చల్ల గాలి లో భక్తి పాటలు హృదయానందకరం గా వినపడుతున్నాయి.
పురాణం చెఫ్ఫే స్వాముల వారు కొంచం లావు గా పొట్టి గా వున్నారు. తెల్లటి గడ్డం తో కావి బట్టల తో ప్రశాంతం గా ఉన్నాడాయన. పురాణం లో ఆ రోజు ఘట్టం “శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం”. స్వాముల వారు ఉత్తరాది వెళ్ళినపుడు “రామ చరిత మానస్ చదవటం జరిగింది”.అప్పుడే స్వాముల వారికి తులసీ దాసు సృష్టించిన భక్తి రసాన్ని తెలుగు వారికి రుచి చూపించాలనే తలంపు కలిగింది.
శ్రోతలందరూ గుడి లో ని సిమెంట్ గచ్చు మీద కూర్చొని ఉన్నారు.పక్కనున్న మామిడి తోపుల మీది నుంచీ చల్ల గాలి వీస్తోంది. గుళ్ళోని కర్పూరపు వాసన హాయి గా అనిపిస్తోంది. చల్లటి సిమెంట్ గచ్చు మీద బాసింపట్టు వేసుకొని కూర్చున్న శ్రోతల కాలి పిక్కల మరకలు పడుతున్నాయి.
స్వాములవారు “రాముని పాదుకలను భరతుదు అడగటం” గురించి చెబుతున్నారు. ఆయన అవధీ భాష లోని పద్యాలు కమనీయం గా పాడి వాటి అర్ధాన్ని పారవశ్యం తో, తెలుగు లో తేనెల సోనలు గా జాలువారుస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే శ్రీధర్ కి “త్రేతా యుగం లొకి వెళ్ళి, తాను కూడా ఆ పాదుకా పట్టాభిషేక సన్నివేశానికి ఒక సాక్షి గా నిలుచున్న”ట్లనిపించింది. మామిడి తొటలోంచీ మామిడి పూల వాసన తో వీచే మలయ మారుతం ప్రశాంతతనిస్తోంది.
అక్కడ ఉన్న శ్రోతలందరూ స్వాముల వారి వ్యాఖ్యానాన్ని వింటూ తనలాగే అనుభూతి ప్రపంచం లో విహరిస్తున్నారను కొంటున్నాడు శ్రీధర్. శీతా కాలం లో పొద్దున్నే అమ్మ స్నానం చేయిస్తూ నెత్తి మీద పోసిన గోరువెచ్చటి నీళ్ళ లా ఉంది స్వాముల వారి ప్రవచనం. శ్రీధర్ నెమ్మది గా గచ్చుమీద కి జారి నాయనమ్మ వడి లో తల పెట్టుకున్నడు. కొంచెం సేపట్లో నిద్రా దేవత వాడిని తన వడి లో కి తీసుకుంది.
వాడు మళ్ళీ కళ్ళు తెరిచే సరికి వాడికి వాళ్ళ మండువా ఇంటి పైకప్పు కనిపించింది.

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్  వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13

ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14

ఇంకా ఉంది…

ప్రకటనలు

5 thoughts on “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s