ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-21

కుక్కర్ సూయ్ మని మోగటం తో మళ్ళీ ఈ లోకంలో పడ్డాను నేను. వంటింట్లోకెళ్ళి, స్టవ్ ఆఫ్ చేసి వచ్చి టీవీ ముందు కూర్చొన్నాను. టీవీ లో పవన్ కల్యాణ్ బాక్సింగ్ రింగ్ లో పవర్ పంచ్ లు ఇస్తున్నాడు.

మద్రాసు నుండీ బెంగళూరు రావటం నా ప్రమేయం లేకుండా నే జరిగి పోయింది.
**************
మద్రాసు లో మా ఇంటి దగ్గర భార్యా భర్తలిద్దరు తెలుగు పిండివంటలు అమ్ముకొనే వాళ్ళు. ఆ వచ్చిన డబ్బు తో ఇద్దరు ముత్యాలలాంటి ఆడపిల్లలని చదివించుకొనే వాళ్ళు. రేట్లు తక్కువ గా ఉంటాయని, మేము వారం వారం వాళ్ళ దగ్గర ఏవో పిండి వంటలు కొంటూ ఉండే వాళ్ళం. అయితే ఒక వారం స్వీట్స్ కొనటానికి వెళ్తే కొట్టు మూసేసి ఉంది. పక్క షాప్ వాడిని అడిగితే వాళ్ళకు నష్టాలొచ్చాయనీ, వాళ్ళు షాప్ ఎత్తేసుకొని ఎక్కడి కో వెళ్ళిపోయారని చెప్పాడు. ఏమయ్యిందో వాళ్ళకి. ఏ నష్టాలొచ్చాయో! ఏ కష్టాలు పడతారో, ఆ ఆడ పిల్లలిద్దరితో! ఏదైనా జీవితపు అనిశ్చితి యొక్క కముకు దెబ్బ కి ఒక షాపు మూతపడింది.ఒక గూడు కదిలింది! దానికి కొంతవరకూ మేము కూడా కారణమే, రేట్లు తక్కువ గా వస్తాయని అక్కడే కొనే వాళ్ళం. వాళ్ళ కొచ్చిన నష్టం లో మా వలన కూడా కొంత వచ్చిఉంటుంది.

***********
మీకు మా కజిన్ రఘు గుర్తున్నాడా?  వాడే… చిన్నప్పుడు నాతో పాటు మా ఊళ్ళో చెట్టులూ పుట్టల వెంట తిరిగాడు చూడండి…వాడు. చెప్పడం మరిచిపోయాను…వాడు “ఎం సీ ఏ” చేసి ఆ పైన “వై టూ కే” బూం లో అమెరికా చెక్కేసి, అక్కడే సెటిల్ అయిపోయాడు. వాడు మద్రాసు లో ఉండగా ఓ రోజు రాత్రి అమెరికా నుంచీ ఫోన్ చేశాడు..
కొంతమంది సంతోషం గా ఉండటాన్ని కూడా ఒక షో కేస్ చేసుకోవలసిన విషయం గా భావిస్తారు. లోపల జీవితం ఎలా ఉన్నదీ వేరే విషయం.
రఘు ని “ఇండియా వచ్చేస్తావా? అమెరికా లో నే ఉంటావా?” అని అడిగాను నేను.
దానికి వాడు, ” నో వే..ఇండియా లోఎంత రిచ్ ఫెలో అయినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొల్యూషన్ లోనూ దుమ్ములోనూ జీవితం గడపాలి. పొరపాటున కూడా ఇండియా రాను బాబోయ్!” అన్నాడు.
ఇండియా లో కొంతమంది పిల్లల పెంపకమే అమెరికా వెళ్ళటానికన్నట్లు ఉంటోంది.  అటువంటి వాళ్ళకు అమెరికా, “చేప పిల్ల కి నీటి కొలను” లా ఉంటుంది. మళ్ళీ ఇండియా వస్తే వాళ్ళు వడ్డున పడ్డ చేప పిల్ల లా గిల గిల లాడి పోతారు.
మా వాడు, “నువ్వు కూడా అమెరికా రా రాదూ” అని ఓ ప్రశ్న వేశాడు. దానికి నేను,” డబ్బులు సంపాదించటానికైతే అమెరికా రావలసిందే.కానీ నాకు ప్రస్తుతానికి డబ్బులు సరిపోతున్నాయి. అమెరికా లో మనకి ఎదురయ్యే సోషల్,ఎమోషనల్ డిప్రైవేషన్ నాకు పడదు. నేను రాను”, అన్నాను. “అమ్మా నాన్న ల తో మాట్లాడే కాలాన్ని వారానికొక కాలింగ్ కార్డ్ తో కొనుక్కోవటం నాకు ఇష్టం ఉండదు”, అని కూడా అన్నాను .

దానికి వాడు, “డిస్టంట్ గ్రేప్స్ ఆర్ సోర్”, అని నవ్వసాగాడు.
ఈ మా సంభాషణ గురించి తరువాత ఆలోచిస్తే నాకిలా అనిపించింది. “జనాలు జీవిత ప్రవాహం లో కొట్టుకొని పోయి అనేక ప్రదేశాలలో తేలతారు. ఎక్కడ తేలుతారు అనేది వారి చేతుల్లో ఉండేది చాలా తక్కువ. ఏదో ఒక ప్రదేశం లో తేలిన తరువాత, తాము ఉండే ప్రదేశమే గొప్పది అనుకొంటారు. అలా అనుకోక పొతే జీవితం ఆనందం గా ఉండదు మరి. మనం పక్క వాళ్ళ కంటే ఏదో ఒక విషయం లో ఎక్కువ అనుకొంటేనే సంతోషం. ఏదో ఒక విలక్షణత ని మనలో మనం చూడకుండా ఉండలేం. పక్క వాళ్ళ కంటే మనం ఎప్పుడూ తక్కువే అను కొనే న్యూనతా భావం నాణానికి రెండోపక్క లాంటిది.”
మరుసటి రోజు బెంగళూరు లోని ఓ కంపనీ నుంచీ ఓ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బెంగళూరు లో వేరే పని కూడా ఉండటం తో, ఇంటర్వ్యూ  కూడా అటెండ్ అయ్యి వచ్చాను.  మా కంపనీ లో నా పొజిషన్ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. సరళ కి మాత్రం టీం లీడ్ ఇచ్చారు.
బెంగళూరు లోని అవంటెక్ నుంచీ ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడున్న జీతం కంటే 50% ఎక్కువ ఇచ్చి,ప్రాజెక్ట్ లీడ్ గా ఆఫర్ ఇస్తున్నారు.
సరళెమో “నా కెరీర్ ఇక్కడే బాగుంది. నేను బెంగళూరు రాను అని చెప్పింది. ఐతే నా కెరీర్ కూడా ముఖ్యమే కాబట్టీ నేను బెంగళూరు వెళ్తే సరళకేమీ అభ్యంతరం లేదట. సో, బెంగళూరు నేను ఒక్కడినే వెళ్ళాలని నిర్ణయించబడినది.
బెంగళూరు  వెళ్ళటానికి ప్రెపేర్ అవ్వసాగాను. నేను కూడా మా కజిన్ రఘు గాడి డైరెక్షన్ లోనే వెళ్తున్ననేమో అనిపించింది.ఇక పై సరళ తో మాట్లాడే టైం ని ఫోన్ లో కొనుక్కోవాలి.
సరళ నా కోసం ఒక కొత్త సెల్ ఫోన్, ఒక పుల్ మేన్, ఒక సూటూ కొని తెచ్చింది.
“ఇదంతా అనవసరమైన ఖర్చు”, అన్నాన్నేను సరళ తో.
“వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఈ మాత్రం కొనుక్కోక పోతే ఎలా?” అందామె.
“ఇక్కడే సరళ కూ నాకూ తేడా వచ్చేది. సరళ కి అవసరాలు అనిపించేవి నాకు అనవసరమైన ఖర్చులు అనిపిస్తాయి.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s