సెక్స్ యొక్క వ్యాపారీకరణ లో కుటుంబ వ్యవస్థ పాత్ర

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక నవలలో హీరో ఒక క్యాపిటలిస్టు. అతను మొదట “మీసాలూ గడ్డాలూ పర్మనంట్ గా తీసేసే ఒక లోషన్ ని మార్కెట్ లోకి వదిలి ఉచితం గా అమ్ముతాడు. అదే సమయం లో ఓ వందమంది కుర్రాళ్ళ తో ఆ లోషన్ వాడకుండా ఎగ్రీమెంట్ రాయించుకొంటాడు.
ఉచితం కాబట్టీ ఊళ్ళో కుర్రాళ్ళందరూ ఆ లోషన్ వాడి గడ్డాలూ మీసాలూ ఊడగొట్టుకొంటారు. కొత్త కాబట్టీ వాళ్ళకి అది ఒక ఫాషన్ గా అనిపిస్తుంది. ఊళ్ళో కుర్రాళ్ళందరూ మొహం మీద వెంట్రుకలు కోల్పోయిన తరువాత కొన్ని సంవత్సరాలకి, తాను ఎగ్రీమెంట్ రాయించుకొన్న మీసాలూ గడ్డాలూ ఉన్న కుర్రవాళ్ళని ఊళ్ళో తిప్పుతాడు హీరో.
మిగిలిన కుర్రాళ్ళకి కూడా ఈ ఎగ్రిమెంట్ కుర్రాళ్ళ లా గడ్డాలూ మీసాలూ కావాలనిపిస్తుంది. అప్పుడు హీరో ఊళ్ళో కుర్రాళ్ళ మీదకి వెంట్రుకలు మొలిపించే లోషన్ ఒకటి వదులుతాడు. వాళ్ళ దాన్ని హాట్ కేకుల్లాగా కొనుక్కొంటారు.
ఇక్కడ హీరో వ్యాపార రహస్యమేమంటే, “కొరత ఉన్న వస్తువుకి డిమాండ్ ఉంటుంది”. కాబట్టీ మంచి వ్యాపారి కొరతని కృత్రిమంగా నైనా సృష్టించి సొమ్ము చేసుకొంటాడు.
కుటుంబ వ్యవస్థ లేని పాత మంచి రోజులలో, గాలీ నీరు లానే సెక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడుపడితే అప్పుడు దొరికేది.సెక్స్ చేసేటప్పుడు తప్పితే జనాలు దానిని గురించి పట్టించుకొనవలసిన అవసరం ఉండేది కాదు.

కుటుంబ వ్యవస్థ రావటం తో సెక్స్ కి ఈ వ్యవస్థ బయట కొరత ఏర్పడింది. వ్యవస్థ లో కొంత కాలం ఉండి బోర్ కొట్టిన వాళ్ళకీ, వ్యవస్థ తో అసంతృప్తులకీ ఒక సేఫ్టీ వాల్వ్ లా దేవదాసీ సిస్టమూ, భోగం వాళ్ళూ బయలు దేరారు. మనిషికి కావల్సిన, కొరత ఉన్న, ఏ వస్తువుకైనా ఒక రేటు ఉంటుంది. అలానే వీరికీ ఒక రేటు ఉంది. ఈ విధం గా చాలా తక్కువ స్థాయి లో వ్యాపారమైన సెక్స్, పాశ్చాత్యుల రాక తో, వారి విలువల తో మరీ రోడ్ సైడ్ బిజినెస్ గా మారింది.
కుటుంబ వ్యవస్థా, కుల వ్యవస్థా కలిపి 90% ప్రేమలు విఫలమయ్యేటట్లు చేశాయి. మన సమాజం లో అధిక భాగం ఒకానొక సమయం లో unrequitted love తో బాధ పడిన వారేననటం లో అతిశయోక్తి లేదు.  సెక్స్ అందకుండా పోవటం వలన దానికి ఒక ఊరించే స్వభావం వచ్చి, యువత తన సమయాన్ని దాని గురించి ఆలోచించటంలోనే వృధా చేసుకొంటోంది. కొంత మంది యువకులు చేసే యాసిడ్ దాడులలో ఈ “సెక్స్ కొరత” పాత్ర కాదనలేనిది.
అమెరికా, జపాన్ లాంటి దేశాలలో కొన్ని బార్స్ లో అమ్మాయి కబుర్లు చెబితే ఒక రేటు, మందుపోస్తే ఒక రేటు, ముట్టుకోనిస్తే ఒక రేటు ఉంటాయి. ఫోన్ లో మాట్లాడితే వేరొక రేటు. మొత్తానికి, “గాలిపీల్చటం లా, నిద్రపోవటం లా ఎంతో సహజమైన సెక్స్”, ని ఒక మ్యూజియం లో వస్తువు లా చేసి దానికి రుసుము వసూలు చేస్తున్నారన్న మాట. ఇక వ్యాపార ప్రకటనల లో సెక్స్ ఉపయోగించే సంగతి అందరికీ తెలిసిందే.
సినిమాలూ, నెట్టూ, టీవీ ల లో సెక్స్ అమ్మకం సంగతి చెప్పనక్కరలేదు.సినిమాలలో నటీమణులు పిక్క చూపించటానికో రేటు, జబ్బ చూపించటానికింకో రేటు, సంపదలు చూపించటానికిక్నో రేటు. శరీరసౌష్టవం ఉన్న కొంత మంది తారలు, తాము అంతా చూపించటానికి ఇంత రేటు అని అంటారు, పశువుల మార్కెట్లో పొదుగుని బట్టి గేదే ని కొన్నట్లు. వర్తమానం లోనే కాక వారి అంగాలకి భవిష్యత్తులో కూడా రేటు కట్టే ఇన్స్యూరెన్సులు పశువుల మార్కెట్ కి కూడా అందనంత నీచం గా ఉంటాయి.

సెక్స్ బొమ్మలూ, ఉపకరణాలూ మొదలైన వాటి మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లలో ఉంటుంది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, పడమట్లో కొందరు కుర్రాళ్ళూ పెళ్ళి కంటే ఈ చూసే సెక్సే బాగుందని పెళ్ళి చేసుకోరంట!
జీవకోటి కి దేవుడి వరమైన, ఎంతో సహజమైన, సెక్స్, మనిషి పెట్టుకొన్న వ్యవస్థల వలన ఇప్పుడు మనిషిని ఒక ఆట బొమ్మను చేసి ఆడిస్తోందన్న మాట!  ఒకప్పుడు మనిషి ఆలోచనలలో చాలా తక్కువ చోటు ఉన్న సెక్స్ కి ఇప్పుడు మనిషి ప్రతి పది నిముషాలకీ (?) దానిని గురించి ఆలోచించకుండా ఉండ లేనంత ప్రాముఖ్యత(?) వచ్చింది.

జంతువులు సెక్స్ గురించీ, సెక్స్ సామర్ధ్యం గురించీ టెన్షన్ పడతాయంటేనె మనకి నవ్వు వస్తుంది. కానీ మనిషి తన సామర్ధ్యం గురించి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు . ప్రధానం గా దీనిని సొమ్ము చేసుకొనేటందుకు సెక్సాలజిస్టులు బయలుదేరారు. సెక్స్ సామర్ధ్యం గురించి జనాలలో “బెంచ్ మార్క్స్” సృష్టించి వారిలో “నేను ఆనందించటం లేదేమో 😦 !” అనే అనుమానాలను రేకెత్తించి, మళ్ళీ పోగొట్టటం మొదలెట్టారు :-). అనుమానం రేకెత్తించేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు..పోగొట్టేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు.జబ్బుల పేరుతో డబ్బులు గుంజవచ్చు.

పాత తరాల లో ఒక వయసు అయిన తరువాత వారు graceful గా తమ వయసును అంగీకరించి ఆధ్యాత్మిక విషయాలపై మనసు మరల్చే వారు. ముసలివారు అవటం చాలా సహజ మైన విషయం కదా! కానీ వ్యాపారం దాన్ని కూడా సొమ్ముచేసుకొంటుంది. ఇప్పుడు, వయాగరాల వంటి మాత్రలు మనుషులు తమ పై బడ్డ వయసును అంగీకరిచకుండా చేస్తున్నాయి. ఎంత కాలమైనా పడుచువాడిగా ఉండి, తమ మగతనానికి కూడా, “తలకి హయిర్ డై వేసినట్లు”, పూతలు పూస్తున్నారు!మహిళల సౌందర్య సాధనాల పిచ్చి కూడా ఈ పరిధిలోకే వస్తుంది.

మానవ సంబంధాల లో కూడా సెక్స్ పరోక్షం గా కమర్షియలైజ్ అయింది. ఒకతని గర్ల్ ఫ్రెండ్ ఆమెకి ఖరీదైన గిఫ్ట్ లు  ఇస్తే కానీ సంతోషం గా ఉండదు. ఆమె సంతోషపడితే గానీ ఆమెపక్కకి చేరి మురిపెం తీర్చొకోవటానికి కుదరదు.

మొత్తానికి కుటుంబ వ్యవస్థా, వ్యాపారమూ కలిసి, ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలూ అబ్బాయిలూ ఉన్న మన సమాజాన్ని,నడి సముద్రం లోని నావికుని లా, “water water everywhere, but no drop to drink” అని అనిపించేటట్లు చేశారు!
అయితే ఈ సెక్స్ యొక్క వ్యాపారీకరణ కు పరిష్కారమేమిటి అంటారా? చాలా సింపుల్…మనం అర్జంట్ గా ఆది మానవులు గా మారిపోవటమే! 🙂  😦

ప్రకటనలు

47 thoughts on “సెక్స్ యొక్క వ్యాపారీకరణ లో కుటుంబ వ్యవస్థ పాత్ర”

 1. కుటుంబవ్యవస్థ కేవలం సెక్సు కోసం కాదు. అందుచేత అది సెక్సు మీద శీతకన్నేసి ఇతర విషయాల మీద సావధానం పెట్టడం సహజం. సెక్సు ఒక age-specific problem. It’s an issue mostly confronted by those between 15 and 40. ఒక నలభై లేదా నలభై అయిదేళ్ళు దాటినాక దానిమీద ఆసక్తి బాగా తగ్గిపోతది. అందుచేత ఆ ఒక్కదాని గురించి వ్యవస్థల్ని కూలదోసుకోలేం. Because there are other civilizational issues as well.

  సమాజంలో మనుషులందఱికీ ఒకే విధమైన sexual code అవసరం లేదనేంతవర్కు సమాజాన్ని తీసుకు రాగలిగితే చాలు. అందరికీ ఒకటే కోడ్ అయిపోవడంతో మీరు ప్రస్తావించిన సమస్యలు తలెత్తుతున్నై. We can, instead, have multiple codes co-existing side by side simultaneously.

  పురాణకాలంలో సమాజంలో multiple codes ఉండేవని తెలుస్తోంది. సమాజంలో పతివ్రతలూ ఉండేవారు. ఆ నియమం లేని ఆడవాళ్ళూ ఉండేవారు. కానీ అందరికీ సమానగౌరవమే ఉండేది. ఎవరికీ stigma ఉండేది కాదు. ఉదాహరణకి – ఉదంకుడనే ఋషిపుత్త్రుడు గురుపత్ని ఆజ్ఞమీద పౌష్యుడనే రాజుగారి భార్య యొక్క కుండలాల్ని తేవడానికి వెళతాడు. దారిలో ఏదో తినరానిది తిని అపరిశుద్ధుడవుతాడు. పౌష్యుడి దగ్గరికి వెళ్ళి, తానొచ్చిన పని గురించి చెబితే ఆయన “నా భార్య లోపలుంది/ ఆమెని అడిగి తీసుకో”మంటాడు. సరేనని ఉదంకుడు లోపలికెళ్ళి చూస్తే ఆమె కనిపించదు. తిరిగొచ్చి అదే విషయం పౌష్యుడితో చెబితే “లేదు, నా భార్య లోపలే ఉంది. ఆమె మహాపతివ్రత కావడం చేత అపరిశుద్ధులకు కనిపించదు. నువ్వేదో అపరిశుద్ధప్పని చేసుంటావు. అదేమిటీ ?” అని అడుగుతాడు. అప్పుడు ఉదంకుడు తన తప్పు ఒప్పుకుని పరిశుద్ధుడై తిరిగొచ్చాక ఆమె కనిపిస్తుంది.

  ఆమె ఇచ్చిన కుండలాలు తీసుకుని ఉదంకుడు మళ్ళీ గురువుగారి ఆశ్రమం చేరుకునేసరికి గురువుగారు ఇంట్లో ఉండడు. గురుపత్ని ఋతుస్నాతయై ఉంటుంది. అమె ఉదంకుడితో “మీ గురువుగారు సమయానికి లేరు కనుక ఋతువిఫలం కాకుండా నాతో సంగమిస్తావా ?” అని అడుగుతుంది. “గురువుగారి ఆజ్ఞ లేదు కనుక సంగమించలే”నని ఉదంకుడు సమాధానమిస్తాడు. ఆ తరువాత కొన్నిరోజులకి గురువుగారు తిరిగొచ్చి భార్యకూ, శిష్యుడికీ మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుని శిష్యుడి గురుభక్తికీ, ఇంద్రియనిగ్రహానికీ అభినందిస్తాడు. కానీ భార్యని ఏమీ అనడు. పౌష్యుడి భార్య పంపిన కుండలాలు ధరించి ఆ గురుపత్ని యథాప్రకారం భర్తతో ఇష్టిలో పాల్గొంటుంది.

  మెచ్చుకోండి

 2. without air,water or food we will die but no one died due to lack of sex. i have noticed most telugu bloggers(men and women) write a lot of posts about sex and love(proxy for sex?). I feel andhra people are obsessed with sex unlike telangana people,it is just my observation i could be wrong and i am sorry if anyone is hurt.

  మెచ్చుకోండి

 3. *ఒక మగవానికి ఇద్దరు అమ్మాయిలతో పడుకునే అవకాశం ఉంటే ఒక ఆడదానికి ఇద్దరు అబ్బాయిలతో పడుకునే అవకాశం *

  నువ్వు ఇంకా బ్లాగుల్లో చేరి అడ్వఒకేట్ చేసే దశలోనే ఉన్నట్లున్నావు. బయట చాలా మంది నీ సలహ కన్నా ముందే దానిని అమలు చేస్తున్నారు. అది తెలుసుకో! ఈ మధ్యనే పని చేసే చోట సడన్ గా హాండ్ బాగు చేయిజారి కిందపడింది, ఒకప్పుడైతే ఎవో దువ్వేనా,తలకు కట్టుకొనెవి బయట పడేవి. కాని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఐ పిల్ టాబ్లేట్స్ బయట పడ్డాయి. అంతా నోరుతెరచుకొని చూస్త్తుండగా, పడిన కాంట్రాసెప్టివ్ టాబ్లేట్స్ ను కూలుగా హాండ్బాగ్ లో పెట్టుకొని నిష్క్రమించారు. ఇప్పటి తరం అలా ఉన్నాది.

  మెచ్చుకోండి

 4. కాంట్రాసెప్టివ్స్ ఎందుకు? నిజంగా తప్పు కాకపోతే కాంట్రాసెప్టివ్స్ లేకుండానే ఆ పని చెయ్యొచ్చు. దాని గురించి కొడవటిగంటి కుటుంబరావు గారి వ్యాసం చదవండి: http://radicalfeminism.stalin-mao.in/74477695

  మెచ్చుకోండి

 5. ఎవరో ఈ కామెంట్ పెట్టాడు చూశావా?
  మన వ్యవస్థ ఆడ వారి నైజాన్ని బట్టి వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలిపించింది.పాత తరం లో అన్నా, నాన్నా భర్తల రక్షన, వారి అండా దండా. కొత్త వ్యవస్థ లో, మాటర్నిటీ లీవ్, ఆఫీసుల్లో రాత్రి ఏడెనిమిది గంటలు దాటి పని చేయకూడదనటం, ఆఫీస్ క్యాబ్స్ వారిని మరీ రాత్రైతే ఇంటి దగ్గర దింపాలనటం..ఇలానటివి. ఆడపిల్ల బయటికి వెళ్తే నాన్నలు ఆడపిల్ల కదా అని వాళ్ళకి అన్ని ఏర్పాట్లూ (హాస్టలూ, వసతీ, చుట్టాల సపోర్టూ) చేస్తారు. అదే మగ పిల్లాడైతే, మగాడు కదా వాడే చూసుకొంటాడు లే! అంటారు!
  కాబట్టీ సమానత్వం ఇన్ స్పిరిత్ మాత్రమే. ఇన్ ప్రచ్తిచె కాదు.
  అలానే మగవారి అవసరాలను దృష్టి లో పెట్టుకొని పాత సమాజం వారు అప్పుడప్పుడూ చేసే ఎక్ష్త్ర-మరితల్ అద్వెంతురెస్ ని చూసీ చూడనట్లు పోయేది. కొత్త సోది వచ్చి సమానత్వం పేరు తో బండ రూల్స్ అమలు చేస్తున్నాయి.కొత్త “సెక్స్ సంబంధాలలో సమానత్వం”, అనేది ఆడవారి పవర్ ని ప్రతి బింబిస్తోంది కానీ, మగ వారి నైజాన్ని అణగదొక్కుతోంది.

  మెచ్చుకోండి

 6. సామాజిక కట్టుబాట్లకంటే ముందు biological nature ఒకటి ఉంది. దాని ప్రకారం ఆడవాళ్ళ అవసరాలు మగ వాళ్ళ కంటే కొంచెం విరుధ్ధం గా ఉంటాయి. దీనితో విబేధిస్తే, ఇక సెలవు మరి.

  మెచ్చుకోండి

 7. సమానత్వం గురించి …
  ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి fail అవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు (ఈ వావి వరుసలు ప్రకృతి పరం గా ఎలా ఏర్పడ్డాయో ఈ వ్యాసం లో ముందు చర్చించాం) కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
  ఏదైనా ఒక electronic system ని తీసుకొంటే master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది. ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది. కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది. సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

  మెచ్చుకోండి

 8. చూడు ప్రవీణ్ కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలు చదివి ఎంత మంది తెలుగు వారి జీవితాలు మారాయో నాకు తెలియదు. ఆయన పుస్తకాలు ఇప్పటివరకు ఎవి చదవలేదు. ఇంట్లో చదువు అనే నవల ఉంది ఎప్పుడైనా వీలు చూసుకొని చదువుతాను. తెలుగులో రంగనాయకమ్మా, ఓల్గా, తూర్పు పడమర బ్లాగు రెంటాల కల్పన మొద|| వారి ఒక వైపు వాదనలు చదివి బుర్రపాడు చేసుకొకు. ఇంకొకటి గుర్తుంచుకో పుస్తకాలు ఎంత తక్కువగా చదివితే, ఆరోగ్యం అంత బాగా ఉంట్టుంది. సాహిత్యం చదివి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి, జ్ణానం పెరిగింది అని అనుకొంటారు గాని, వాస్తవానికి ఆ జ్ణానం మన రోజువారి జీవితంలో ఒక్కరూపాయ అదనం గా జీతం సంపాదించటానికి ఉపయోగపడదు, సరికదా పుస్తకాలు కొనటానికి నీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చ్చు అయిపోతాయి. ఎక్కువ విషయాలు తెలుసుకొని నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకొని, టాలేంట్ లేని వాడిగా భావిస్తావు. వాస్తవానికి ఈ రచయితలలో చాలమందికి, సమాజంలోని వాస్తవాన్ని ఎదుర్కొన లేక మాకు అన్యాయాం జరిగింది, సమాజం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కొందరు, ఇంకొదరు భవిషత్ తరాల వారికొరకు కలలు కనాలి కదా అని రచనలు చేసుకొంట్టూ ఉహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. వారి అసంత్రుప్తి కి అక్షర రూపం ఇస్త్తూ ,
  దానిని సాహిత్య రూపంలో మార్చి, విమర్శకుల చేత సమీక్షలు రాయించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, వారి పుస్తకాలకి మార్కేట్ క్రియేట్ చేసుకొని, పాటకుల చేత చదివించి వారి జీవితాలలో అసంత్రుప్తిని రాజేస్తారు. నాకు జీవితాన్ని తనకు ఉన్నంతలో త్రూప్తిగా గడుపుతూ పోతన రాసిన భాగవతం,తనజీవితాన్ని ట్రాన్స్పరేంట్గా జీవించి దానిని అలాగే పుస్తకాలలో ఎక్కించిన చలం లాంటి వారి పుస్తకాలను మాత్రం కొంచెం సీరియస్ గా తీసుకొని చదువుతాను. అంతే!

  అయినా సరే నీకు చదివే పిచ్చే ఉందనుకో ,చదవడం కూడ ఒక వ్యసనం కదా! దానిని అమాంతం ఆపలేరు. కృష్ణప్రియా డైరి, మధుమానసం,నేస్తం, మనసుపలికే, మధురవాణి మొద|| బ్లాగులు చదువుకో సరదాగా ఉంటాయి. కామేంట్లు రాయకుండా వారి బ్లాగులను చదువు. కనీసం ఒక వారం రోజులు వీరి బ్లాగులు చదువు. ఎప్పుడు రంగనాయకమ్మ రచనలేనా? ఇలా చెప్తున్నందుకు నన్ను ఎమీ అనుకోవద్దు.

  మెచ్చుకోండి

 9. కొ.కు is a respectable writer. కానీ మీరు చెప్పిన వాటికి ఆయన కూడా అతీతులు కారు. you are dot on the point . I agree with your views on chalam. recently I read his autobiography. May be.. ranganayakamma also falls in the same category. Some of these writers like chalam realize at a later stage the limitations in their thoughts as middle aged persons. Ranganayakamma may not.

  మెచ్చుకోండి

 10. వివరించమని అడగొద్దు. నాకా ఓపిక లేదు. మీరే నా మాటల్ని చరిత్రతో సరిపోల్చి చూసుకుని విశ్లేషించుకోండి.

  వావి-వరుసలు లేకపోవడం (వావిడికం) మాతృస్వామ్యానికి గల ప్రధాన లక్షణం. ఇది పితృస్వామ్యంలో ఒక freak event కాగా, మాతృస్వామ్యంలో ఇదొక general rule మఱియు సంస్కృతి. ఈ కారణం చేత ఆ వ్యవస్థ కాలక్రమంలో అంతరించిపోయింది.

  ఆడదానికి గల హక్కులు మగవాడు/ మగసమాజం ప్రసాదించి, అమలుజఱిపేవే వే తప్ప వాటంతట వాటికి ఏ విధమైన అస్తిత్వమూ లేదు. Rules ని రూపొందించి అమలు జఱిపేశక్తి స్త్రీజాతికి లేదు. తమ అవసరాల్ని బట్టి మగవాళ్ళే కొన్నిహక్కుల్ని ఆడవాళ్ళకి ప్రసాదిస్తూంటారు.

  మెచ్చుకోండి

 11. “ఆడదానికి గల హక్కులు మగవాడు/ మగసమాజం ప్రసాదించి, అమలుజఱిపేవే వే తప్ప వాటంతట వాటికి ఏ విధమైన అస్తిత్వమూ లేదు. Rules ని రూపొందించి అమలు జఱిపేశక్తి స్త్రీజాతికి లేదు. తమ అవసరాల్ని బట్టి మగవాళ్ళే కొన్నిహక్కుల్ని ఆడవాళ్ళకి ప్రసాదిస్తూంటారు.”

  This has been the case so far in history. But, not convinced if this wil be the case in future. Because domination may come from intellect, technology etc henceforth which both men and women have equal aptitude for.

  మెచ్చుకోండి

 12. స్వేచ్ఛ అనేది ఒకరు ప్రసాదిస్తే తీసుకునేది కాదు అని నా స్నేహితురాలు చెప్పిన విషయం గుర్తొస్తోంది. ఆడవాళ్ళ హక్కులు మగవాళ్ళ నియంత్రణలో ఎందుకు ఉండాలి?

  మెచ్చుకోండి

 13. దత్తా, నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే పితృస్వామ్యంలో హిపోక్రిసీ ప్రధాన లక్షణం అనుకోవాలి. పితృస్వామ్య సమాజంలో మేనమామ-మేనకోడలు పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటారు కానీ మేనత్త-మేనల్లుడు పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోరు. అది హిపోక్రిసీయే కదా.

  మెచ్చుకోండి

 14. * Rules ని రూపొందించి అమలు జఱిపేశక్తి స్త్రీజాతికి లేదు. *
  ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లుంటే పడి చావదు. వీరి జనాభా భారతదేశ కంపేనిలో 50% ఐనపుడు అర్థమౌతుంది అందరికి. ఎదో ఒకరో ఇద్దరో ఉన్నత కుటుంబాలనుంచి, మంచి కుటుంబ విలువలు గల కుటుంబాలనుంచి వచ్చిన వారు ఇప్పుడు కొన్ని కంపేనీలలో పైస్థానాలో కన్సిస్టేన్సి గా పనిచేస్తున్నారు. వారికి భర్త సహాయం ఎంతో ఉంట్టుంది. మొగుడు పేళ్లాలు త్వమేవహం లాగా(నువ్వే నేను ) ఉంటారు కనుక ఆపైస్థానలలో ఉన్న ఆడవరు ఇన్ని సంవత్సరాలు అలా కొనసాగ గలుగుతున్నారు. ఇప్పటి రోజుల్లో కంపెనీలో కింద స్థాయిలో పని చేసే అమ్మాయిలకి ఉన్న అహంకారం, అవగాహానా రాహిత్యం ,అందం మీద శ్రద్దా,త్వర త్వరగా పైకి పోవాలనే ఆశ చూస్తే వారు కనీసం నాలుగు సంవత్సరాలైనా పని చేయగలుగుతారా అని అనిపిస్తుంది. మీరే గమనించండి ఎంతమంది స్రీలు 30+ తరువాత కంపెనిలో పని చేస్తున్నారు. చాలా మంది పిల్లla కోసమని రిజైన్ చేసేస్తూంటారు.
  కంపేనిలో 50% వారు నిండటం అయ్యేపని కాదు . వారిలో అధిక శాతం 10-15సం|| పని చేయలేరు. ఎవరో కొద్ది మంది తప్ప. టిచర్, బాంక్ గుమస్తా ఉద్యోగాలు వేరే విషయం. ఇటువంటి వారిని నమ్మి ప్రజలు వ్యవస్థలను వారికి అప్పచేపుతారా?

  మెచ్చుకోండి

 15. నేను విబేదిత్తన్నా అద్దెచ్చా…అబ్బాయిలకు కూడా చానా అవలక్షణాలున్నాయి.. అలానే ర్యాంకులూ అవీ అమ్మాయిలకు కూడా వస్తున్నాయి..కాకపోతే అమ్మాయిలు నాలెడ్జీ ని అప్ప్లై చేయటం లో వెనుకబడి ఉంటారని ఒక అపవాదు ఉంది..అంటే మార్కులు బానే వస్తాయి కానీ అప్లై చేసే దగ్గర బోల్తాపడతారన్న మాట..కొందరు.

  మెచ్చుకోండి

 16. కెనడాలో స్త్రీలకి ఒక సంవత్సరం మేటర్నిటీ సెలవు ఇస్తారు, ఇండియాలో అలా ఇవ్వరు కదా. నా స్నేహితురాలే రెండు సార్లు మేటర్నిటీ సెలవు పెట్టి ఇండియాకి వచ్చి కెనడాకి తిరిగివెళ్ళిపోయింది. ఇండియాలోని కంపెనీలు చెయ్యించే బండ చాకిరీ స్త్రీలకి నిజంగా భారమే కదా. అటువంటప్పుడు వాళ్ళు ఉద్యోగాలు మానెయ్యడంలో విచిత్రమేముంది?

  మెచ్చుకోండి

 17. *అబ్బాయిలకు కూడా చానా అవలక్షణాలున్నాయి.. అలానే ర్యాంకులూ అవీ అమ్మాయిలకు కూడా వస్తున్నాయి.*
  కావచ్చు. లాంగ్ టరం లో పెళ్ళి చేసుకున్న మొగవాడికి ఉద్యోగం చేయటం తప్పనిసరి పరిస్థితి. వాడు మొదట్లొ అబ్బాయిలు అతివేషాలు వేసినా తప్పులు దిద్దుకొకపోతే మెల్లగా ఇంటికి వేళ్లవలసిందే. ఎందుకంటే ఎవరు ఇంకొకరి తప్పుని క్షమిచేంత పెద్ద మనసుతో నేటి జనరేషన్ పిల్లలు లేరు. వారికి అది అర్థంకాదు. అందువలన వారికి వారే దెబ్బలుతిని జీవితసత్యం గ్రహిస్తారు. అతి విశ్వాసంతో, మరీ స్మార్ట్ గా పని చేయటమనేది ఎక్కువరోజులు జరిగే పని కాదని.
  అమ్మాయిల పర్ఫార్మెన్స్ కుటుంబ సభ్యుల సహకారం మీద ఎంతగానో ఆధారపడి ఉంట్టుంది. అదే మగ వారు కుటుంబ కష్ట్టాలను లేక్కిస్తూ కూచొంటే ఉద్యోగం చేయలేరు. సత్య సినేమాలో విలగా వేసిన మనోజ్ బాజ్ పాయ్ గారు నటుడిగా వేషాలు వెత్తుకొంట్టు ఉంటే డిల్లీల్ లో భార్య చెప్పాపేట్టకుండా, ఇంకొకరిని పెళ్ళి చేసుకొని విదేశాలకు చెక్కేసింది. ఇతను అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా నటుడిగా ప్రయత్నించి చివరికి సత్యా సినేమా చేసి కేరిర్ ఎర్పరచుకొన్నాడు. అది నటుడిగా అతను పడిన కష్ట్టం, అదే మధ్యతరగతి మగ వారికి జాబ్ లేకపోతే పేళ్లి లేదు. పెళ్ళి సంగతి పక్కన పెట్టినా మనిషి గా కనీస విలువను ఎవరు ఇవ్వరు. కనుక మనదేశం లో చదువుకొనే మధ్యతరగతి ఆడవారు జాబ్,కేరిర్ కోసం మగ వారు పడేటంత కష్ట్టాలను, అవమానాలను పడతారా? ఎమో నాకు తెలియదు.

  మెచ్చుకోండి

 18. yes the predicaments of both differ hugely. What I say is girls also can form rules gain power, even though they are a pampered lot.
  భర్త చేత డంప్ చేయబడి , నానా కష్టాలూ పడి పైకొచ్చిన ఓ స్టోరీ ని నేను కూడా చూశాను. బట్ మీరు చెప్పినట్లు These are exceptions among women. Similar cases are a rule among men

  మెచ్చుకోండి

 19. ఇవేమీ కొత్త సిద్ధాంతాలు కావు. 1980ల టైమ్‌లో కొడవటిగంటి గారు ప్రవచించిన సిద్ధాంతాలే. అయినా పాము పాలు తాగదని తెలిసి నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసే స్థాయిలో ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఈ సిద్ధాంతాలని అంగీకరించే జ్ఞానంలో ఉంటారనుకోను.

  మెచ్చుకోండి

 20. *తమ అవసరాల్ని బట్టి మగవాళ్ళే కొన్నిహక్కుల్ని ఆడవాళ్ళకి ప్రసాదిస్తూంటారు. *

  స్వాతంత్ర పోరాటం కాలంలో, పోరాటం లో పాల్గొన్న మగవారి అవగాహాన పరిధి పెరిగి, ముఖ్యంగా హిందూ బ్రాహ్మణ, వైశ్య,కాయస్థ నాయకులు మన రమణ మహర్షి, వివేకానందుని లాంటి వారి ప్రవచనాలతో ప్రభావితమైన వారు చాలామంది ఉన్నారు. సుబాస్ చంద్రబోస్,గాంధి మొద||. ఆ పోరాటం చేసిన మగవాళ్ళే, ఆడవాళ్ళకి కొన్నిహక్కుల్ని ఉండాలి అని, బలంగా భావించి ఇచ్చారు. స్వాతంత్ర ఉద్యమం మన హిందూ సామజంలో ఒక విధమైన కల్చరల్ ఉద్యమంగా కూడా పాత్రను పోషించింది. మిగతా మతాలావారితో పోలిచి చూస్తే హిందూ సమాజం ఈ వంద సం|| కాలంలో మారినంతగా, అవి మారలేదు అని తెలుస్తుంది. అంతే కాని మగవారు తమ అవసరాల కనుగుణంగా హాక్కులను వారికి ఇవ్వలేదు. అదేమి స్వార్థ లాభం కోసం వేసిన రాజకీయ ఎత్తుగడ కాదు.
  కాని కొంతమంది స్రీవాద రచయితలు ( ఇక నుంచి వారిని “నీలాంబరి” అని సంభోదిస్తాను , నరసిమ్హ సినేమాలో రమ్యకృష్ణ పాత్ర పేరు) వారి కోణంలో మగ వాడు తుమ్మిన,దగ్గిన, తేపినా వారిని యక్స్ ప్లాయిట్ చేయటానికే అని భావిస్తారు, కనుక తమ అవసరాల్ని బట్టి మగవాళ్ళే కొన్నిహక్కుల్ని ఆడవాళ్ళకి ప్రసాదిస్తూంటారు అని రాస్తూంటారు.
  *This has been the case so far in history.domination may come from intellect, technology etc.*

  మీరు రాసినదానితో ఏకీభవించను.

  మెచ్చుకోండి

 21. హక్కులనేవి ఒకరు ఇస్తే తీసుకునేవి కావు నాయనా. అవి అందరికీ సమానంగా ఉండాలి. మరదలు కుంటిది కావడం వల్ల ఆమెకి పెళ్ళి కాకపోతే ఆమె బావ భార్య ఉండగా ఆమెని పెళ్ళి చేసుకునే హక్కు ఉన్నప్పుడు మరిది కుంటివాడు కావడం వల్ల అతనికి పెళ్ళి కాకపోతే అతని వదినకి భర్త ఉండగా అతన్ని పెళ్ళి చేసుకునే హక్కు ఉండాలి. మాలతీ చందూర్‌ని విమర్శిస్తూ వ్రాసిన ఒక వ్యాసంలో రంగనాయకమ్మ గారు ఈ విషయం వ్రాసారు. మగవాడు బరి తెగింపు పనులు చేస్తే వాడికేం, వాడు మగవాడు అనుకుంటారు కానీ ఆడది ఆ పనులు చేస్తే పతిత (పతనైమ స్త్రీ) అంటారు. ఇది crude hypocrisy కాదా?

  మెచ్చుకోండి

 22. *మగవాడు బరి తెగింపు పనులు చేస్తే వాడికేం, వాడు మగవాడు అనుకుంటారు కానీ ఆడది ఆ పనులు చేస్తే పతిత (పతనైమ స్త్రీ) అంటారు.*

  కానీ నేను ఆడది ఆ పనులు చేస్తే పతివ్రత ( అభివృద్దిచెందిన స్రీ ) అని అనుకొంటాను. నాకు పతిత, పతివ్రత ఇద్దరు ఒకటే. వాళ్లు మనుషులే.

  మెచ్చుకోండి

 23. శ్రీరాం గారూ,
  1.ఒకప్పుడు మగవాడు పెద్ద మనసు తో ఇచ్చిన హక్కులను తిరిగి తీసుకొనటం సంభవం కాదనుకొంటా!
  2. ఆడ వారు కూడా పవర్ఫుల్ కావటానికి ఈ తరం లో శారీరక శ్రమ తో పనిలేని పెరిగిన మేధొప్రమైన వ్యవస్థలూ, విద్యా ముఖ్య కారణం. ఆడవారు కూడా పట్టుదలా, తెలివీ కలవారు ఉన్నారు.
  3. మగవారు కష్టపడి తప్పనిసరిగా పని చేయవలసిన పరిస్థితి ఉందని మీరు అన్నారు. ఒకప్పుడు దళితులు కూడా కష్టపడి పని చేసేవారు. కానీ వారు అధికారస్థాయిలోకి రాలేదు. ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన రక్స్జణల వలన వారు కూడా ముందుకు పోతున్నారు. వారి అభివృధ్ధిని మళ్ళీ వెనుకకు మళ్ళీంచటం కుదరని పని (వారివి ఇవ్వబడిన రక్షణలే అయినా).కాబట్టీ మగవారు కష్టపడి పని చేసి వ్యవస్థలని ముందుకు నెట్టినా దాని వలన ఆడవారికి వచ్చే అధికారం లో తగ్గుబాటు ఉండకపోవచ్చు.
  4.ఇక ముందు స్త్రీలు పిల్లలను కనటం తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళు తగ్గుతాయి. ఏ test tube బేబీ నో కంటారు. surrogate mother కాన్సెప్ట్ ఉండనే ఉంది. ఇన వారిని మగవారికంటే తక్కువ చేసేది ఏది? నెమ్మది గా వారూ సమాజం చేసే pampering నుంచీ బయట పడతారు. పాశ్చాత్య సమాజాల్లో ఆల్రెడీ కొంతవరకూ బయట పడ్డారు. వచ్చే అమెరికా ఎన్నికల లో ఒబామా కంటే హిల్లరీ మెరుగైన దెమోక్రాట్ అభ్యర్ధి అంటే నాకు నిజమే అనిపిస్తుంది!

  మీరు మగవారిదే పై చేయి గా ఉంటుంది అనటానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

  మెచ్చుకోండి

 24. అబ్బా ఇంక ఆపండ్రా బాబు.
  వీడేవేవో పుస్తకాలు చదివి బ్లాగుల్లో వొదుల్తుంటాడు. వీణ్ణి విమర్శిస్తున్నారో ఆడుకుంటున్నారో లేక వీడితో సైద్ధాంతికంగా తెలవలేక పిచ్చికూతలు కూస్తారో తెలీని ప్రొఫైల్‌ లేని సగం అఙ్ఞాతలు. తెలియకుండా వీడేదో కూస్తే దాన్నిపట్టుకుని సంవత్సరాల తఱబడి వదినా మరిదీ అని ఏడిపించే అర్భకులు, పైగా మా అమ్మని పట్టుకుని నొటిపట్టన బూతులన్నీ తిట్టేశాడొహో అని బోర్డుకట్టుకుని వూళ్ళో జనాలకి అడ్వరటైజు చేసుకుని అందరితో చదివించే మూర్ఖులు.
  మీరంతా కలసి తెలుగు బ్లాగులని నరకంతో సమానంచేస్తున్నారు.

  మెచ్చుకోండి

 25. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి స్రీలను ఒకే గాట కట్టేస్తున్నారు. నేను గమనించిన దాని ప్రకారం, ఉత్తరాది లో పనిచేసె అమ్మాయిలు మంచి స్థితి, స్థాయిలో ఉన్నా భర్తతో నేను నీలాగా సంపాదిస్తూనాను అనే విధంగా పోటిగా,తలలేగరేయరు. పని చేయటం అనేది చిన్న,పెద్ద,ఆడ మగ ఆనందంగా ఒక అవసరం లాగ చేస్తారు. వీరికి నీలాంబరి మూకచేసే వాదాలు ,కుల పిచ్చి తక్కువ వ్యాపార చేయాలన్న కోరిక ఎక్కువ. అదే ఇక మన తెలుగు వారికొచ్చేసరికి నాలుగు రూకలు సంపాదిస్తే పట్టలేక పోతున్నారు. తెలుగు అమ్మాయిలను,వాళ్ల అమ్మలను అసలికి పట్టలేము, మామగారైతే ఒక దృతరాష్టృడు.
  ———————————————————————————-
  *ఒకప్పుడు మగవాడు పెద్ద మనసు తో ఇచ్చిన హక్కులను తిరిగి తీసుకొనటం సంభవం కాదనుకొంటా!*
  వారికి ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోవలసిన అవసరమేలేదు. ఎవరైనా తమకు ఉన్నహక్కులను కామన్సెన్స్ తో ఉపయోగించుకోవాలి. డిమాండ్ సప్లైతో ఉపయోగించుకొంటే అసలికే ఎసరు వస్తుంది. డిమాండ్ సప్లై కనుగుణంగా భూములు,బంగారం మొద|| వాటి విలువ పెరగవచ్చేమోగాని, మనుషులు ప్రవర్తన మారితే ఉన్న విలువను కోల్పోతారు. ఇప్పుడు సరిగ్గా ఆడవారి విషయంలో అదే జరగబోతున్నాది. అది మొదలైంది కూడాను. ఇప్పుడు సమాచార యుగం కాబట్టి విషయాలు అందరికి ఎక్కువగా తెలిసి పోతున్నాది. ఎవరి జాగ్రత్తలో వారు ఉంట్టున్నారు. ఇప్పుడు నా చుట్టుపక్కల సమాజంలో ఎవరైనా అమ్మాయి సహాయం కోరినా, మునుపటిలాగా ముందుకు వచ్చి సహాయం చేద్దామనుకునే వారు లేరు. ఒక్క తెలుగుసినేమాలో హీరో తప్ప. మనుషులు ఎవరైనా, హక్కుల వలన అభివృద్ది చెందరు, ఇతరులతో కలసి మెలసి ఇచ్చి పుచ్చుకోవటం వలన లాభం పొందుతారు. కాని ప్రస్తుతకాలం లో ఆడవారు,చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకొని, హక్కులను దుర్వినియోగం చేయటం ఎక్కువైంది. మనం మాటాడుకొనే హక్కులు ఎప్పటి నుంచో ఉనా ఈ మధ్య కాలంలో మరీ దుర్వినియోగం అవుతునాయి. కనుక మగ పిల్ల వారి తల్లిదండృలు ఎన్నో జాగ్రత్తలు తీస్కొంటారు.

  * ఆడ వారు కూడా పవర్ఫుల్ కావటానికి ఈ తరం లో శారీరక శ్రమ తో పనిలేని పెరిగిన మేధొప్రమైన వ్యవస్థలూ, విద్యా ముఖ్య కారణం. ఆడవారు కూడా పట్టుదలా, తెలివీ కలవారు ఉన్నారు.*
  మా అమ్మమ్మ,నాయనమ్మ కన్నా ఇప్పటివరకు తెలివి, చాకచక్యం,సమయ స్పూర్తి ఉన్న పెద్ద అడ్మినిస్ట్రటర్ ని చూడలేదు. వారికి తెలివి పట్టుదల లేదని అనటంలేదు. ఈ మేధొప్రమైన వ్యవస్థలూ, విద్యా రానున్న కొన్నిసంవత్సరాలలో గ్లామర్ కోల్పోతాయి. మనదేశ మధ్యతరగతి ప్రగతంతా అమేరికా టేక్నాలజి కంపేనిలు, ఫైనాన్స్షియల్ సేక్టర్, వైధ్య రంగం లో వాటి పై ఆధరపడి ఉన్నాదని అందరికి తెలుసు.
  సాఫ్ట్ వేరె తీశుకొండి ఎక్కడమొదలై ఎటువైపుకి వేళుతున్నాది, ఎలా మారిపోతున్నాది, ఎంత తక్కువ రేట్ కి అందరికి అందుబాటులోకి వస్తున్నాది, వీటన్నిటిని చూస్తూంటే సాఫ్ట్ వేర్ పైకి అభివృద్ది జరుగుతున్నట్టు కనిపిస్తున్నా, ఆరంగంలో ఉండేవారికి మునుపటంత గ్లామర్ లేదని తెలుసు. పని,టెన్షన్ ఎక్కువ,డబ్బులు రావటం తక్కువ గా అనిపిస్తున్నాది( బయట రేట్లు కూడా ఆవిధగా పెరిగి పోయాయి). సాఫ్ట్ వేర్, నేట్ కార్పోరేట్ వైద్యం మీద ఇప్పటికే ఇంసురెన్స్ సంస్థలనుంచి పేషంట్లవరకు గుర్రుగా ఉన్నారు. ఇక డాక్టర్ చదవటానికి ఎవరు మునుపటిలాగా ముందుకు రావటం లేదు. మా బందువులలో ఎందు డాక్టర్ చదివిచ్చామా అని తిట్టుకొంట్టు ఉంటారు. చదువు అయ్యేటప్పటికి 30సం+ || ఆ తరువాత సిటిలో ఉంటే ఎదైనా పెద్ద హాస్పిటలో చేరాలి, స్వంతంగా పెడితే ఈ రోజులలో ప్రజలు మునుపటిలాగా డాక్టర్ దగ్గరికి పోవటం లేదు. కార్పోరేట్ ఆసుపత్రిలో చేరితే, చిన్న డాక్టర్ ఐతే నెల జీతాలు ఇస్తారు. దెబ్బకి అన్ని ఫ్రీ అయిపోయాయి ఉదా|| సినేమాలు, పాటలు,పుస్తకాలు, వీడీయో గేంస్ మీకు అభిరుచి ఉన్న ప్రతిది నేట్లో ఉచితంగా లేక తక్కువ ధరకు దొరుకుతుంటే భారతీయులకి ఎటువంటి కొత్త ఉద్యోగాలు సృష్టించగలం? ఐ.ఐ.టి.ఆక్స్ ఫర్డ్, హార్వర్డ్ లేక్చర్స్ తో ఇంటర్ పిజిక్స్ మీద ఉపన్యాసం ఇప్పించి యుట్యుబ్ లో పేడితే మన కాలేజి లేక్చర్స్ కి పనేముంది? టిచింగ్ ప్రొఫేషన్ ని వీడీయో చేసి పేడితే అది మూల పడుతుంది.
  సాంకేతికత విప్లవం తేలేదు.

  http://eenadu.net/Pannelsinner.aspx?qry=htm/panel6

  కార్పోరేట్ వైద్యం మీద ఇప్పటికే ఇంసురెన్స్ సంస్థల నుంచి పేషంట్లవరకు గుర్రుగా ఉన్నారు.ఓళ్ళు బాగలేక పోతే డాక్టర్దగ్గరి వేళ్లటానికి వంద సార్లు ఆలోచించి,అందరిని అడిగి వివరాలు తెలుసుకొని వేళ్లుతున్నారు. అది వారి ప్రస్తుత ఇమేజ్. ఇక డాక్టర్ చదవటానికి ఎవరు మునుపటిలాగా ముందుకు రావటం లేదు. మా బందువులలో ఎందు డాక్టర్ చదివిచ్చామా అని తిట్టుకొంట్టు ఉంటారు. చదువు అయ్యేటప్పటికి 30సం+ || ఆ తరువాత సిటిలో ఉంటే ఎదైనా పెద్ద హాస్పిటలో చేరాలి, స్వంతంగా పెడితే ఈ రోజులలో ప్రజలు మునుపటిలాగా డాక్టర్ దగ్గరికి పోవటం లేదు. కార్పోరేట్ ఆసుపత్రిలో చేరితే, చిన్న డాక్టర్ ఐతే నెల జీతాలు ఇస్తారు.
  వాళ్ళు కష్ట్టపడి చదివినందు కు ఇచ్చే జీతం పెద్ద ఆకర్షణీయం గా ఉండదు.

  మెచ్చుకోండి

 26. *ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన రక్స్జణల వలన వారు కూడా ముందుకు పోతున్నారు.*

  మీరు పొరపడుతున్నారు, ఇంతక్రితం నేను చెప్పినట్టుగా ఆడవారైనా,మగ వారైనా మొదట ముందుకు వేళ్లేది కుటుంబ సభ్యుల సహకారం తో,సమాజంలోని ఇతర వర్గాల సహకారంతో! ఆతరువాతే రాజ్యంగ రక్షణ అనేది. పాకిస్థాన్ లో కూడా రాజ్యంగ పరంగ స్రీలు చదువుకోవటానికి అవకాశాలు ఉండివుండవచ్చు. కాని ఎంతమంది చదువుకొని,ఉద్యోగాలు చేస్తున్నారు? ఒక పాక్ మంత్రి ఇండియాకి వచ్చినపుడు స్వాతంత్ర సమయ కాలంలో కన్నకలలు ఇక్కడ నిజమయ్యాయి అని, వారిదేశం విఫలమైందని అన్యాపదేశంగా చెప్పాడు. భారతదేశాన్ని తీసుకొని వేళ్లి అమేరికాతో,యురప్ తో పోల్చకండి. మేధోపరంగా మన దేశం లో ఆడవారు వారితో తీసిపోకపోవచ్చు.
  continued…

  మెచ్చుకోండి

 27. ABCD అలా తీసి పారేస్తే ఎలా? ఇలాంటి తింగరిసన్నాసుల కామెంట్లు చూసుకుని 1200 హిట్లు వచ్చాయని చెప్పుకుని మురిసిపోయే బ్లాగర్ల కళ్ళలోని మెరుపు, సాధించామన్న సంతృప్తి ఓ సారి గుర్తించరూ? నేనైతే ఆర్టికల్ చూడలేదు. ఏదో కుర్రాడు అని లేని ABCD పెద్దరికం ప్రదర్శించుకునే ముసలివాళ్ళూ కారు ఆ స్పందించిన బ్లాగర్లు, తమ కన్నా అన్ని విధాలా మెరుగైన వాళ్ళే.

  మెచ్చుకోండి

 28. హక్కులంటే ఒకరు ఇస్తే తీసుకునేవా లేదా సహజంగా ఏర్పడేవా అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. స్త్రీ-పురుష సమానత్వం అనేది ప్రాథమిక హక్కే కానీ ఒకరు ఇస్తే తీసుకునేది కాదనే నమ్ముతాను.

  మెచ్చుకోండి

 29. ఇది నా గురించి ఐతే,భుజాలు తడుముకొంటున్నా!
  నా కళ్ళలోనీ మెరుపూ, మురిసిపోవటం గట్రా ఎలా చూశారండె..నెట్లోంచీ..?
  నేను ఆ టాపిక్ ని బట్టి వచ్చాయి అని చెప్పుకొన్నా..అలానే కులాన్ని గురించి రాసిన కథ కి కూడా వచ్చాయి.

  మెచ్చుకోండి

 30. * మగవారు కష్టపడి తప్పనిసరిగా పని చేయవలసిన పరిస్థితి ఉందని మీరు అన్నారు…. ముందుకు నెట్టినా దాని వలన ఆడవారికి వచ్చే అధికారం లో తగ్గుబాటు ఉండకపోవచ్చు*
  ఒక సామేత ఉంది పెళ్లి అయిన తరువాత మగవాడికి స్వాతంత్రం కోల్పోతాడు,ఆడవారికి స్వాతంత్రం వస్తుందని. మగవారికంట్టూ ఎమీ ఖర్చులు ఉంటాయండి? మార్కేట్ కెళ్ళి ఒకసారి చూస్తే 75% వస్తువులన్ని ఆడవారు ఉపయోగించుకొనటానికి తయారు చేసినవే. మన వ్యాపారమొత్తం ఆడవారు వర్సెస్ మగవారు గా చూస్తే ఆడవారికి ఉన్న ప్రాడక్ట్లు (డైమండ్స్, నగలు,చీరలు,దుస్తులు మొద|| )మగవారికి లేదు. నిజం చెప్పాలి అంటే ఆడవారి ఉత్పత్తుల కొరకు ఖర్చ్చు పెట్టక పోతే వ్యాపారం దివాలా తీస్తాయి. మగవారికంట్టు ప్రత్యేకమైన ప్రాడక్ట్లు ఉన్నా (ఎలెక్టిక్ షేవింగ్ సెట్ మొదా||)వాటి మార్కేట్ విలువ అతి స్వల్పం. ఒక్కసారి కొనుకుంట్టే సంవత్సరాలు వస్తాయి. ఇందుమూలం గా తెలియజేసిది ఎమిటంటె మగవారు సంపాదించేదానిలో అధికశాతం ఆడావరి కొరకు ఖర్చ్చు పెడుతున్నారు. చాలా మంది మగవారు పెళ్ళైన తరువాత తల్లిదండృలను బాగా చూసుకోరమే పేరు ఉండనేఉంది. “A son is a son till he takes a wife, a daughter’s a daughter the rest of her life.” దీని అర్థం ఆడవారు పెళ్లైన తరువాత కూడ తన తల్లిదండృలకు కూతురిగా పెళ్ళికి మునుపు వలే ఉంట్టుంది, మగవారు పెళ్లివరకే కొడుకుగా ఉంటాడు. ఆతరువాత కొడుకుగా ఎవరి కారణం గా ఉండలేక పోతున్నాడు? సమాధనం మీకు తెలుసు అది భార్య వలన అని. సో, మొగవాడు పెళ్ళి అయిన తరువాత తన సంపాదనలో అధిక శాతం కుటుంబానికి అంటే భార్యకు అంటె ఆడవారికి పెట్టడానికి శ్రమిస్తున్నాడని అర్థం.
  ఆర్ధిక పరంగా పెళ్ళి అనేది మొగవారికి మోయలేని బరువుగా తయారవుతున్నాది. పోని ఎలాగో అలాగా దానిని మోస్తూంటే, వీరు చట్టాలను అడ్డు పెట్టుకొని మగవారితో ఆడుకోవటం ఎక్కువైంది.
  కనుక పెళ్లిని గురించి మగవారు పునరాలోచించుకోవాలి. మగవారు పెళ్ళిని పక్కకు పెడితే ఆర్ధికంగా బలవంతుడౌతాడు. అతను సంపాదించుకొనే జీతం,తల్లి దండృలు ఇచ్చే ఆస్థి అన్ని, అతనికి మంచి లగ్జరి జీవితాన్ని కొని తెచ్చి ఇవ్వగలవు. అది కూడా సంసారమనే బాధ్యత లేకుండా. అతను చేయవలసినది ఒకట్టే, తన లగ్జరి జీవితాన్ని చట్టప్రకారం జీవించటమే. మార్కేట్ ఎకనామిలో డబ్బులు ఉంటే, కొనుగోలు శక్తి ఉంటే జీవితాన్ని ఎంతో ఆనందించవచ్చని వేరే చెప్పక్కరలేదు కదా!
  ——————————————-
  ఆడవారైనా మగ వారనా అధికారాన్ని ఇంట్లో, ఉద్యోగం లో మాత్రమే చేలాయించగలరు. అనవసరంగా, అదేపని గా ఇతరులపైన చేలాయించం గదా! ఇక్కడ అధికారం అంటె, మనం అన్నివిధాలా ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచటం అని అర్థం చేసుకొండి.
  1. ఆడవారి అధికారం సమాజ పరంగా చేలాయిస్తే అందులో మగవారు నష్ట్ట పోయేది ఎమీ లేదు. ఒక ఆడకలేక్టర్,పోలిస్ ఆఫిసర్ కష్ట్టపడి మంచి గా పనిచేసి, తన పూర్తి అధికారం చెలాయిస్తే అందువలన సమాజని కి లాభమేకదా! ఉదా|| కిరణ్ బేడి ని తీసుకోండి ఆమే వలన మగవారికి వచ్చిన నష్ట్టం ఎమీ లేదు.

  2.మన సమాజం మగవారి డామినేషన్ అయింది మంచి పౌరుల వలన కాదు. వీధి రౌడిల నుంచి, అంతర్జాతీయ తీవ్ర వాదుల వరకు మగవారిదే ఆధిపత్యం. ముల్లును ముల్లుతోనే తీయాలి కాబట్టి, అటువంటి కిరాయి,కర్కోటక మూకలను ఎదుర్కొనేటందుకు మగవారే పోలిసుల నుంచి మిలటారి వరకు అధికంగా ఉన్నారు. ఈ మధ్య కొంత శాతం ఆడవారికి, ఈ రంగాలలో ప్రవేశం కలిపించినా వారి శాతం తక్కువ. వారిమీద పూర్తిగా బాధ్యత పెట్టి పోలిస్, మిలటరి,ఆర్మి,నేవి వీటన్నిటిని 90% వారికి 10% మగవారిని ఏదేశమైన అవకాశం కలిపించగలదా!అలా కలిపించి ఆదేశాలు యుద్దాలలో విజయం సాధించ గలవా? ఇక్కడే చూడండి మగవారు వారికి ఇచ్చిన నైతిక మద్దతు. ఆడవారిని యుద్దంలో కి ,రౌడిలను ఎదుర్కొనటానికి పంపకుండా వీరే వారితో పోరాడుతూ, గొప్ప త్యాగం కుటుంబం కొరకు (ఆడవారి) చేస్తున్నారు.

  3. ఇక వారికి మిగిలిన అధికారం, కుటుంబంలో సభ్యుల పైన మాత్రమే ప్రదర్సించ గలరు. నిజం చెప్పాలి అంటే మొగుడు పిల్లలు ఉంటే చేలాయిస్తారు.లేకపోతే అది లేదు. తల్లిదండృల మీద అధికారం ప్రదర్శించటానికి ఎమీ ఉండదు. ఒక వయసొచ్చిన తరువాత వారిగోల వారిది మనగోల మనదిగా అనిపిస్తుంట్టుంది.ఇక భర్తా,పిల్లలు ఉంటె అది వేరే విషయం. ఈ రోజుల్లో ఒకరు లేక ఇద్దరు పిల్లలు, వారు పోయి చిన్నపటినుంచి టివి చూస్తూ పెరుగుతారు. తల్లి గారు పిల్లలకు మిక్కి మౌస్,టాం అండ్ జెర్రి చూపిస్తూ అన్నం పెడుతుంది. ఆ టివి చూసే అలవాటు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వారికి అలావాటవుతుంది. పిల్లలపై అధికారం చేలాయించేది మొదట టివి, తరువాత ఇంటర్ నేట్, ఆతరువాతే ఎవరైనా. ఇక వారికి మిగిలింది భర్త మాత్రమే! అందువలనే మగ వారు ఇంటా బయట, చాలా బాధలకు లోనవుతున్నారు. రానున్న రోజులలో పెళ్లి చేసుకోకపోతే కనీసం పలకరించటానికి కూడా ఎవరు ఉండరు. బోర్ కొడితే బాంక్ కాల్ సెంటర్ కి పోన్ చేసి 1 – ఇంగ్లిష్ , 2-హింది అంటూ బటన్ లు నొక్కు కుంట్టూ, వారితో భాతాకని కొట్టుకోవల్సిందే. అప్పుడు వారికి ఎంత అధికారం (ఆస్థి) ఉన్నా,దానిని ఎలా అనుభవిస్తారో మనం తెలుసుకొని చేసేది ఏముంది?

  మెచ్చుకోండి

 31. *ఇక ముందు స్త్రీలు పిల్లలను కనటం తగ్గిపోతుంది. పెళ్ళిళ్ళు తగ్గుతాయి. ఏ test tube బేబీ నో కంటారు. surrogate mother కాన్సెప్ట్ ఉండనే ఉంది. ఇన వారిని మగవారికంటే తక్కువ చేసేది ఏది?*
  వీలున్నపుడు ఈ క్రింది దాని గురించి వివరంగా రాస్తాను.

  Modern psychologists consider the child as the magical nucleus of all: Erik Erikson puts it tersely:
  Defenseless as babies are, they have mothers at their command, families to protect the mother, societies to support the structure of families, and traditions to give a cultural continuity to systems of training and tending.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s