టెర్రరిస్టులు

=                                                     టెర్రరిస్టులు

“మొత్తానికి అయిపోయింది..డైవోర్స్ కి ఒప్పుకొన్నాడు. “డీవీ” కేసు పెడతానన్న తరవాత దారిలోకి వచ్చాడు గురుడు.. ఎలిమొనీ అదీ కూడా బాగానే వచ్చేటట్లు చూడవచ్చు” అంది స్వేచ్చ,  కాలా పానీ పబ్ లోకి అడుగుపెడ్తూ.

“మరి మహేష్ తో  నిశ్చితార్ధమెప్పుడు?” అంది అమె స్నేహితురాలు కావ్య.

“చూడాలి వచ్చే మార్చి లో కావచ్చు”, అంటూ, “ఆ బైతు గాడు చూడు నన్ను ఎలా తినేసేలా చూస్తున్నాడో?”, అని పబ్ బయట ఆమెనే చూస్తున్న ఒక అల్పజీవిని చూపిస్తూ పెదవి విరిచింది. స్వేచ్చ అసలే అంద గత్తె. ఆపై స్లీవ్లెస్ టాప్ పై మినీ వేసుకొంది. టాప్ నుంచీ క్లీవేజ్ కనపడుతూ, వచ్చేపోయే మగ పురుగుల మతి పోగొడుతోంది.

“ఆ బైతు గాడేమో గానీ వాడి పక్కన ఉన్న ఇద్దరూ పరవాలేదు”, కావ్య అంది .

ఆ ఇద్దరూ కూడా తన వైపే చూస్తూ ఉండటం గమనించి, స్వేచ్చ వాళ్ళ అటెన్షన్ ని ఒకింత గర్వం గా ఎంజాయ్ చేస్తూనే, మనసులోంచీ వచ్చే ఆనందాన్ని నొక్కి పట్టింది. కిందిపెదాన్ని పై పెదిమ తో అదిమి పెట్టింది.

పబ్ లో డ్రింక్స్ వాసన, సిగరేట్ పొగ వాసన, మాటవినిపించని సంగీతపు కలా పోసన, మొత్తానికి అది ఆధునికత అనబడే క్షుద్రదేవతోపాసన!

పబ్ లో మగవాళ్ళందరి దృష్టీ స్వేచ్చ వైపే! ఆమె వాళ్ళ చూపులని ఎన్ జాయ్ చేస్తూనే,

“ఎలాచూస్తున్నారో చొంగలు కారుస్తూ..!ఏదేమైనా నావి కిల్లర్ లుక్స్..”, అనుకొంది.

ఇద్దరు  పత్రికా రిపోర్టర్లు మూడో పేజీ కోసం పబ్ లో ని అమ్మాయిల పర్మిషన్ తీసుకొని వారి అందాన్ని కెమేరాలలో బంధిస్తున్నాడు.  అమ్మాయిలు పోజ్ ఇస్తున్నారు.

******************

శ్రీనివాసులు కి సింగరాయకొండ తో పోలిస్తే హైదరాబాద్ స్వర్గం లా అనిపిస్తోంది.  అతనిది సింగరాయ కొండ దగ్గరి ఒక ఊరు. ఇంకా కేబుల్ టీవీ వ్యాపించనంత మారుమూల ఊరు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గానూ, అప్సరసల్లానూ అని పిస్తున్నారు. వాళ్ళ డ్రెస్ చాలా బోల్డ్ గా అనిపిస్తుంది అతని కి. జబ్బలూ పిక్కలూ కనపడేలా డ్రెస్ చేసుకొనే ఆడవాళ్ళ ని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు శ్రీనివాసులు. ఇంతకు ముందు అలాంటి ఆడ వాళ్ళని సినిమాలలో మాత్రమే చూశాడు. వాళ్ళ ఊళ్ళో ఓ వృత్తి లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకొంటారు. వాళ్ళ ఊరి దగ్గరలోని ఒక కాలేజీ లో “ఎం సీ యే” అయిన తరువాత ఉద్యోగాన్వేషణ లో భాగ్యనగరి చేరుకొన్నాడతను. ఇంత పెద్ద నగరానికి రావటం అదే మొదటి సారి అతనికి.  ఒక రూం మేట్ రమణ. అతను “ఎం సీ యే”, లో శ్రీనివాసులు కి క్లాస్-మేటే, వాళ్ళది విజయవాడ. ఇంకొక రూం-మేట్ రవి జాబ్ చేస్తున్నాడు. అతని అసలు ఊరు బెంగుళూరు.

రమణ,”బాబాయ్, ఇక్కడ పబ్బులు చాలా ఉంటాయి. నాకు పబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఏదైనా పబ్ కి వెళ్దామా?”, అన్నాడు.

“ఆ.. పబ్ లో ఏం ఉంటుంది? ఇక్కడ మనం రూం లో తాగే బీర కాయలనే, ఓ నాలుగు రెట్లు పైసలు వదలగొట్టుకొని అక్కడ తాగుతాం, అంతే!”, అన్నాడు పబ్ ల విషయం  తెలిసిన రవి.

“ఈ ఒక్క సారి కి మాత్రమే వెళ్దాం. పబ్ లు ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా!”, అన్నాడు శ్రీనివాసులు. అతనికి పబ్ ల లో కనపడబోయే కురచదుస్తుల ఆడవాళ్ళు కళ్ళముందు కనపడసాగారు.

రమణ, “కానీ శీనూ, నువ్వు మాత్రం తాగొద్దురా! ఒరే,   ఫేర్వెల్ పార్టీ అప్పుడు సగం బీర్ బాటిల్ తాగి నానా యాగీ చేశాడు వీడు. మామూలు గా ఇలా మెత్త గా నోట్లో నాలుక లేనట్లు కనపడతాడా! తాగితే మాత్రం మనిషి కాదు”, అన్నాడు.

” అరే! నేను చాలా మిస్ అయ్యానన్న మాట! అలా అయితే ఇవాళ శీను తాగాల్సిందే!”, అన్నాడు రవి.

********************

పబ్ కి అటాచ్ అయి ఉన్న డిస్కో లో డాన్స్ లు మొదలయ్యాయి. స్వేచ్చ కావ్య తో కలిసి కాలు కదుపుతోంది. రెండు చేతులూ పైకెత్తి కనురెప్పలు కిందికి దించి తననే చూసుకొంటూ తన నడుము ఊపుతూ మూవ్ మెంట్స్ ఇస్తోందామె.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా! నా చూపులలో చిక్కుకున్న..!” కొత్త రిమిక్స్ ఫాస్ట్ బీట్ లో సాగుతోంది.

కూర్చొన్నవాళ్ళంతా రెప్పవేయటం మర్చిపోయినట్లు చూస్తున్నారు.  శ్రీనివాసులూ మిత్రులూ ఒకటేబుల్ దగ్గరకు చేరారు.

అమె ని చూసి రమణ తనలో ,”ఆహా ఏమి ఆ జబ్బల నునుపు, వాటిని ఒక్క సారి నిమిరితే ఎంత బాగుంటుందో!” అనుకొంటున్నాడు.

రవి చూపులు ఆమె క్లీవేజ్ లో చిక్కుకొని ఏవో ఊహా లోకాల్లో తేలియాడుతున్నాయి.

శీను నోరు సగం తెరిచి చూస్తున్నాడు. అతనికి అక్కడి చెవులు చిల్లులు పడే మ్యూజిక్ ఏ మాత్రం వినపడటం లేదు.

ముందు గా రవి తేరుకొని, ” పబ్ కి వచ్చింది తాగటానికి రా బయ్. నోరెళ్ళబెట్టటానికి కాదు. ఇవాళ శీను తాగి ఏం చేస్తాడో చూడాలి”, అని, వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు.

సైడ్ డిష్ తింటూ ముగ్గురూతాగుతున్నారు. మ్యూజిక్ లో బీట్ పెరుగుతోంది. డాన్స్ వేగం పెరుగుతోంది. స్వేచ్చ నడుము ఊపు జోరందుకుంది.

“వీడు తాగితే యాగీ చేస్తాడన్నావ్. ఏమీ చెయ్యటం లేదు?”, అన్నాడు రవి, రమణ తో.

శీను అదేమీ పట్టించుకోకుండా, “నేను ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొంటాను,ఆ డాన్సూ,  అ నవ్వూ ఆ బిగబట్టిన పెదాలూ, అంతా నా కోసమే!  “, అన్నాడు సీరియస్ గా.

రమణ మొహం లో గాభరా.

రవి, “బౌన్సర్లు బయట పడేస్తారు. గమ్మునుండు. అవును, నువ్వు తాగితే యాగీ ఏదో చేస్తావంట కదా!”, అన్నాడు.

శీను లేచి డాన్స్ ఫ్లోర్ మీదికి వెళ్ళి, స్వేచ్చ ని సమీపించాడు. ఆమె ముఖం లోని ప్రశ్నార్ధకాన్ని పట్టించుకోకుండా పెదాలు కలిపాడు. వళ్ళంతా తేళ్ళూ జెర్రులూ పాకినట్లై, ఆమె పెద్ద గా అరిచింది.  పబ్ అంతా కలకలం రేగింది. తేరుకొన్న పేజ్ 3 ఫొటోగ్రాఫర్లు కెమేరాలు క్లిక్ మనిపించటం మొదలు పట్టారు. బౌన్సర్లు వచ్చారు. రమణా రవీ, వాళ్ళ తొ వాదిస్తున్నారు. వాళ్ళు చచ్చిన ఎలుకను విసిరేసినట్లు శీను ని పబ్ బయటికి విసిరేశారు.

**************

శీను పొద్దున్నే బధ్ధకం గా లేచి రూం లోని టీవీ ఆన్ చేశాడు. రాత్రి తాగిన హాంగోవర్ ఇంకా దిగలా.
టీవీ లో వార్తా స్రవంతి.
“నగరం లోని పబ్ లో రేప్ ప్రయత్నం. పరారీ లో దుండగుడు”
శీను స్వేచ్చని ముద్దు పెట్టుకొంటున్న ఫొటో లని మార్చి మార్చి చూపిస్తున్నారు.
చానల్ మార్చాడు.
అక్కడ చర్చ జరుగుతోంది. మహిళాసంఘం అధ్యక్షురాలు “మన సమాజం లో స్త్రీ లకు రక్షణ కరువైందని” వాపోతోంది.
ఒక స్త్రీ వాది, “మగ బుధ్ధి గురించి గట్టిగా నిరసిస్తోంది”.
మామూలు గా శాంతం గా ఉండే ఒక రచయిత్రి ఆవేశం గా, “దుండగుడిని కాల్చిపారేయాల్సిందే”, నంటోంది.
ప్రతిపక్ష నేత, “మహిళలను కాపాడటం లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు.
వేరే అధినాయకుడు తమ పార్టీ అధికారం లోకి వస్తే రేప్ చేసిన వాళ్ళకి మరణ శిక్ష పడేలా చట్టం తెస్తామని హామీ ఇస్తున్నాడు.
అధికార పక్ష ప్రతినిధి,ప్రభుత్వం నేరస్తులను త్వరగా పట్టుకోవటానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తోందో వివరిస్తున్నాడు.
ఇంకో చానల్ లో విలేకరులు పోలీస్ కమీషనర్ ని అడుగుతున్నారు, ” ఈ మధ్య దోపిడీ దొంగలు నగరం లో విచ్చలవిడి గా దొంగతనాలు చేసినా మీరు పట్టుకోలేక పోయారు. ఇప్పుడు రేపిస్టులను ఏమీ చేయలేకపోతున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ వైఫల్యం కాదా. పోలీసు యంత్రాంగం ఏమి చేస్తోంది?”

శీను కంగారు గా రూమేట్స్ ని లేపాడు. విషయం తెలిసిన మిగిలిన ఇద్దరూ వాడిని ఆడి పోసుకొన్నారు. “ఈ ఉపద్రవానికి కారణం నువ్వే. నీ వంకర బుధ్ధి వలన నే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది”, అన్నారు.
“పోలీసులు వస్తే నీతో పాటు మా ఇద్దరినీ కూడా బొక్క లో వేస్తారు, కాబట్టీ మేము మా ఊళ్ళ కు పోతున్నాం”, అన్నారు.

వెళ్తూ వెళ్తూ, “ఓ రెండ్రోజులు పోతే అంతా సద్దుమణుగుతుంది. అప్పుడు చేయాల్సిన దాని గురించి ఆలోచించవచ్చు. బెయిలో గియిలో ఏదో ఉంటుంది. అప్పటి దాకా నువ్వు రూం బయటికి రావద్దు.”, అన్నాడు రవి.

********************

టీవీ లో పబ్ సంఘటనకు వ్యతిరేకం గా వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలు చూపిస్తున్నారు.

అది చూస్తున్న “సీ ఎం” ఆందోళన గా ఉన్నారు. అసలే ఎన్నికల సంవత్సరం.

హోం మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి.కొన్ని పత్రికలు “హోం మంత్రి కీ రేపిస్ట్ కీ బంధుత్వముందనీ, అందువలననే, పోలీసులు నిందితుడి పట్టుకోవటం లో అలసత్వం చూపిస్తున్నారనీ”, తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.
ముఖ్యమంత్రి హోం మంత్రి ని పిలిపించుకొన్నాడు. సమావేశం నుంచీ బయటికి వచ్చిన తరువాత హోం మంత్రి “డీ జీ పీ” కి ఫోన్ చేశాడు. “ఎలా ఐనా పట్టుకోవాలి. వియ్ నీడ్ హిం డెడ్ ఆర్ అలివ్”, అన్నాడు.
అది జరిగిన మరుసటి రోజు సాయం కాలం చానళ్ళనీ గోల పెట్టాయి, ” పబ్ రేప్ సంఘటన లోనిందితుడి కాల్చివేత. నగరం లోని ఓ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. నిందితుడి ప్రతిఘటన. పోలీసుల కాల్పులు”.

***********
“ఇంటి వెనుకే ఓ చెరువుంది సర్! అతను గోడదాటి చెరువులోకి దూకి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి కే చాలా అన్-పాపులర్ అయి ఉన్నాం.చాన్స్ తీసుకోదలచలేదు”, హోం మంత్రి తో “డీ జీ పీ” అంటున్నాడు, ఫోన్ లో.

ప్రకటనలు

17 thoughts on “టెర్రరిస్టులు”

  1. అధ్యక్షా

    తమరు ఎండగడుతోన్నది స్వేచ్చా జీవుల్నా, తాగితే మనిషి కాని సీనుల్నా? లేక ఒక చిన్న తాగుబోతును కూడా సజీవం గా పట్టుకోలేని పోలీసు వ్యవస్థ నా !? 🙂

    బాగుంది !!

    మెచ్చుకోండి

      1. ఈ వాక్యంలో నిజమెంతో తెలియదు కానీ ఇలాంటి సంఘటనలకు ఇదే కారణం అంటూ ప్రచారం మాత్రం ఎక్కువ. ఆడవారికి మాత్రమె నీతులు బోధించే “పెద్దలు”, మగ మహారాజులం అంటూ విర్రవీగే శీను లాంటి వారు నిజానికి ఒకే నాణానికి రెండు వైపులు.

        శీను అహంకారానికి కారణం “అలాంటి” దుస్తులు వేసుకునే వారు తేలిగ్గా “పడిపోతారనే” అపనమ్మకం మాత్రమె, “అలాంటి” వనితలు కాదు.

        మెచ్చుకోండి

        1. ఈ అపనమ్మకానికి బాధ్యత అన్నిసార్లూ కురచదుస్తుల అమ్మాయిలది కాక పోయినా, కొన్నిసార్లు మాత్రం కారణం వారే! కురచ దుస్తులు ఎదుటి సెక్స్ కి చెందిన వారిలో కలిగించే ప్రభావం గురించి తెలిసి కూడా వేసుకొనే వారు మాత్రం బాధ్యత కొంతైనా తీసుకోవాలి.

          మెచ్చుకోండి

  2. Very bad. అమ్మాయిలు ఒంటికి అతుక్కుపోయే బట్టలేసుకొని రోడ్డుపైకి రావాలన్నా, కురచబట్టలేసుకొని పబ్బులకు వెళ్ళాలన్నా భయపడిపోతున్నారు. ఇంకా ఆటవికకాలంలోనే బ్రతుకుతున్నామా అనిపిస్తోంది జరుగుతున్నవి చూస్తుంటే.

    మెచ్చుకోండి

  3. సెక్స్ లేకుండానే పిల్లలు! భారత సంతతి శాస్త్రవేత్త సూచన
    ఇప్పటికే కొన్ని జీవుల్లో విజయవంతం సమీప భవిష్యత్తులోనే మనుషుల్లోనూ సాధ్యం
    లైక్ ఎ వర్జిన్ పుస్తకంలో ఆరతీప్రసాద్ వివరణ
    http://www.andhrajyothy.com/worldnewsshow.asp?qry=2012/aug/19/world/19world3&more=2012/aug/19/world/worldmain&date=8/19/2012

    Why sex could be history

    Why sex could be historyFrom artificial wombs to men and women being able to reproduce entirely alone, Aarathi Prasad says science is rewriting the rules of sex and human reproduction. What would that mean for our ideas of family and parenthood

    http://www.guardian.co.uk/lifeandstyle/2012/aug/17/sex-reproduction-aarathi-prasad

    మెచ్చుకోండి

  4. అమ్మాయికి నచ్చితేనే ?

    http://archives.eenadu.net/08-19-2012/news/newsitem.aspx?item=panel&no=3

    అమ్మాయిలే అధికంగా వస్తున్నారు.

    ఈ రోజుల్లో ఆర్ధిక భద్రత కారణంగా భర్తతో పడకపోతే విడాకులకు సైతం వెనుకాడటం లేదు. రెండో పెళ్లి కోసం వచ్చే వారిలో 70% అమ్మాయిలే వస్తూండటం అధికమైంది 🙂 🙂

    బి నాగ కుమారి చిరంజీవి మ్యారేజ్ బ్యురో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s