నా దేవుడున్నాడా పుస్తకం ప్రింట్ ఎడిషన్

నా దేవుడున్నాడా పుస్తకం ప్రింట్ ఎడిషన్ ఇక్కడ పొందుపరచాను..పుస్తకం లుక్స్ గురించీ, కంటెంట్ గురించీ, దయచేసి మీ మీ సజెషన్స్ తెలియజేయండి.

IsthereGod_headings_nostmt-signed

ప్రకటనలు

23 thoughts on “నా దేవుడున్నాడా పుస్తకం ప్రింట్ ఎడిషన్

  1. థ్యాంక్సండీ! మీకు ఈ వ్యాసం లో ఏ ఏ విషయాలు అద్భుతం గా అనిపించాయి?
   ఏ సందేహాలు తీరిపోయాయి? చెప్తే తెలుసుకొందామని ఆసక్తి..

   మెచ్చుకోండి

 1. చాలా బాగుంది.”దేవుడున్నాడో,లేడో తేల్చకుండా బంకలా సాగే పుస్తకం కాదిది” అన్నంతవరకు కరెష్టే:-)దేవుడున్నాదని తేల్చిపారేశారు గాబట్టి:-(
  కానండీ,”ఆస్తికులూ,నాస్తికులూ కూడా అంగీకరించే సత్యాన్ని ఆవిష్కరించిన పుస్తకం” అనేశారు,అదెట్లా కుదురుతుంది?

  మెచ్చుకోండి

 2. దేవుడున్నాడని నేను ఎక్కడా తేల్చిపారేయలేదు. మీరు పూర్తిగా చదివినట్లు లేరు. బహుశా మొదటి చాప్టర్ మాత్రమే చదివారేమో 🙂 ఆ చాప్టర్ ని కూడా అపార్ధం చేసుకొన్నట్లున్నారు.వాస్తవం గా ఈ పుస్తకం లోని వాదన అంతా సాంప్రదాయ దేవుడి ఉనికి ని వ్యతిరేకిస్తూ నడుస్తుంది.
  “ఈ సృష్టి మొత్తం ఓ నిర్వచించలేని మరియూ ఎప్పటికీ తెలుసుకోలేని మూలాలనుంచీ వస్తుంది”, అనే విషయాన్ని నాస్తికులూ ఆస్తికులూ కూడా అంగీకరిస్తున్నారు. ఆస్తికులు దేవుడిని అనిర్వచనీయమైన వాడి గా అభివర్ణిస్తున్నారు. కాక పోతే దేవుడిని మంచి వాడిగా ఊహించుకొంటున్నారు. కానీ మనిషి కి “దేవుడు” అనే ఆలోచన కంటే ముందే “మంచి” అనే ఆలోచన తెలుసని ఈ పుస్తకం లోనే నిరూపించాను.దేవుడి గురించిన ఆలోచన ఛేసే ముందే మనిషికి ఏది మంచో తెలుసు.
  దేవుడు ఈ సృష్టి నియమాలను మార్చలేడు కాబట్టీ ఆయన సర్వశక్తిమంతుడనే విషయం సందేహాస్పదం.
  మానవ జాతి పుట్టటానికంటే ముందే భూమ్మీద భూకంపాలూ, తుఫానుల వల్ల అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ఆ విలయాలను దేవుడె సృష్తిస్తే, దేవుడు మంచి వాడు కాదు అనిపిస్తుంది.
  మనిషి ఫ్రీవిల్ ద్వారా చేసే చెదు పనులకీ దేవుడు కొంత బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రీవిల్ దేవుడె ఇచ్చాడు కాబట్టీ!
  కాబట్టీ దేవుడు అనే ఆలోచనలోంచీ, మంచి తనం అనే గుణాన్ని తీసి పక్కన పెడితే, ఇక మిగిలేది అనిర్వచనీయత.
  ఇక నాస్తికులు కూడా కొత్త సైన్సు సిధ్ధాంతాల ప్రకారం ఈ విశ్వం సృష్టి, వాక్యూం ఫ్లక్యుయేషలూ, బిగ్బ్యాంగ్ వగైరా లు ఒక అనిర్వచనీయమైన స్థితి నుంచీనో (లేక మనుషులకు ప్రవేశం లేని ఏ పదో డైమన్షలోనో) జరిగాయని చెబుతున్నారు.

  కాబట్టీ ఆస్తికులూ నాస్తికులూ కూడా అంగీకరించే సత్యం ఒక్కటే! అదే ఈ సృష్టి కి కారణం అనిర్వచనీయం (అది దేవుడైనా, వేరే అయినా). అదే ఈ పుస్తకం తేల్చిన సత్యం.

  మెచ్చుకోండి

  1. సరదాగా ఆన్నాన్లెండి.కొన్ని భాగాలే చదివాను.తీరిగ్గా మొత్తం చదివాక సీరియస్ ఒపీనియన్ చెప్తా.మీ విశ్లేషనలు బాహున్నాయి.ఎంచుకున్న భాషాసౌకు బాగుంది!

   మెచ్చుకోండి

 3. సరదాగా ఆన్నాన్లెండి.కొన్ని భాగాలే చదివాను.తీరిగ్గా మొత్తం చదివాక సీరియస్ ఒపీనియన్ చెప్తా.మీ విశ్లేషనలు బాగున్నాయి.ఎంచుకున్న భాషాశైలి బాగుంది!

  మెచ్చుకోండి

 4. మిత్రులు బొంద్లపాటి వరికి,
  మీ పుస్తకం “దేవుడున్నాడా?” చదువుతున్నాను.చాలావరకు పూర్తయింది.ఫ్రీ విల్ గురించి మీరు కొంచెం కంఫ్యూజ్ అయినట్టు నాకనిపిస్తున్నది.ఫ్రీ విల్ అనేదానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి దీనిని పూర్తిగా స్వేచ్చ అంకూడదేమో అంటున్నారు.కానీ అది తప్పని అనిపిస్తున్నది.

  అక్కడ ఇచ్చిన ఉదాహరణల్ని కాకుండా నా సొంత ఉదాహరణతో వివరిస్తాను.సృష్టి నియమాలు,ఉనికికి సంబందించిన గంభీరమైన వివరాల జోలికి పోకుండా చెప్తున్నాను.మానవుడు తన ముందున్న కొన్ని ఆప్షన్స్ నుంచే అదో ఒక ఆప్షన్ ఎంచుకోవలసి వస్తుంది గాబట్టి అది పూర్తి ఫ్రీవిల్ అనలేము అంటున్నారు.కుక్కకి ఉన్న ఆకలి,భయం అనే రెండు ప్రచోదనలలో ఏదో ఒకటి ఎన్నుకునే స్వేచ్చ ఉంది కదా.అసలు ఫ్రీవిల్ అనే మాటను అలా అర్ధం చేసుకోకూడదేమో!”ఇతర్ల నుంచి ఒత్తిడి లేకుండా” అనేది ఫ్రీవిల్ వెనక ఉన్న్ అర్ధం అని తెలుసుకుంటే అస్పష్తత ఉండదనుకుంటాను.(అయితే,దీన్ని తాత్విక స్థాయికి తీసుకెళ్ళదలుచుకుంటే ఏది బాహ్యం,ఏది అంతరం అనేది వస్తుంది?!)

  ఉదాహరణకి “క” అనే వ్యక్తి “గ” అనే వ్యక్తిని కొట్టాడు.ఏ మాత్రం అనుమానం లేకుండా మీకు తెలిసిన విషయాల ప్రకారం మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.నేను ఇక్కడ మూడు ప్రాబబిలిటీలు చెప్తున్నాను.జై గొట్టిముక్కలలా ఆలోచిస్తే వెయ్యి వరకూ లాగచ్చు:-)
  1).అసలు వాళ్ళ మధ్యన తలదూఒర్చకుండా ఉండటం
  2)”గ” తరపున నిలబడి “క”తో పోట్లాదటం
  3)”క”ని కొట్టడానికి “గ”కి సాయం చెయ్యడం
  వీటిల్లో ఇతర్లు ఫలానాది సెలెక్టు చేసుకోమని చెప్పకుండా ఎంచుకుంటే అది ఫ్రీవిల్,అలా కాకుండా ఫలానావడు చెప్పాడని ఎంచుకుంటే అది ఫ్రీవిల్ కాదు.ఎవరూ చెప్పనప్పుడు కూడా న్యాయన్యాయాలు ఆలోచించకుండా వాళ్ళలో ఎవరయినా మీకు బంధువని ఎంచుకున్నా అది కూడా నిర్ణయం తీసుకోవడం వరకు మీ స్వేచ్చని మీరు ఉపయోగించుకున్నట్టే, కదా!

  ఆలోచించండి.

  మెచ్చుకోండి

  1. Thanks Hari gaaru.
   “1).అసలు వాళ్ళ మధ్యన తలదూఒర్చకుండా ఉండటం
   2)”గ” తరపున నిలబడి “క”తో పోట్లాదటం
   3)”క”ని కొట్టడానికి “గ”కి సాయం చెయ్యడం
   వీటిల్లో ఇతర్లు ఫలానాది సెలెక్టు చేసుకోమని చెప్పకుండా ఎంచుకుంటే అది ఫ్రీవిల్,అలా కాకుండా ఫలానావడు చెప్పాడని ఎంచుకుంటే అది ఫ్రీవిల్ కాదు.”

   ఫలానా వాడు చెప్పాడని ఎంచుకొంటే అది ఫ్రీ విల్ కాదు. ఒప్పుకొంటాను. ఇతరులు చెప్పకుండా, తన అనుభవాలు, తన పక్షపాతాలు, తను పెరిగిన కండిషనింగ్, తన ఇష్టాఇష్టాల ప్రకారం 1,2,3 ల లో దేనిని ఎంచుకున్నా అది కూడా పరిపూర్ణమైన ఫ్రీ-విల్ కాదు. ఎందుకంటే ఇక్కడ కూడ మనిషి తన మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసిన పరిస్థితులవలన ఆడించబడుతున్నాడు.
   ఉదాహరణకి నేను రెండో ఆప్షన్ ఎంచుకొన్నాను అనుకొందాం. “క”, “గ” ఇద్దరూ నాకు తెలియని కవల పిల్లలనుకొందాం. నాకు ఏ కారణమూ లేకుండా “క” ని సపొర్ట్ చేయాలనిపించింది. వెంటనే సపోర్ట్ చేశాను. పైకి ఏ కారణమూ లేకుండా అని అనిపించినా, అంతర్గతం గా, నా అచేతనలోనో, లేక నా పరిశీలన లోకి రానిదో ఓ కారణం ఉండబట్టే నేను “క” ని సపోర్ట్ చేస్తాను. బహుశా “గ” వేసుకొన్న చొక్కా లాంటి చొక్కా వేసుకొన్న వాడు నా చిన్నప్పుడు ఎవరో నన్ను కొట్టి ఉంటారు. ఆ సంఘటన గురించి నేను పూర్తిగా మర్చిపోయినా, అలాంటి చొక్క వేసుకొన్న వారికి వ్యతిరేకం గా నేను ప్రవర్తిస్తాను.
   నాకు ఆ సమయం లో నా ఫ్రీ-విల్ ని నిరూపించుకొందాం అన్న ఆలోచన రాకపోతే “క” ని సపొర్ట్ చెసే విషయం లో నాకు స్వేచ్చ లేదు. ఒక వేళ నాకు “గ” ని సపోర్ట్ చేసి నా ఫ్రీ-విల్ నిరూపించుకోవాలనే ఆలోచన వస్తే, “గ” ని సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ కూడా నా సంకల్పం, ఫ్రీ-విల్ ని సమర్ధించే నా కోరికకీ తద్వారా అలాంటి కోరికకి కారణమైన నా వ్యక్తిత్వానికీ బానిసే. నా వ్యక్తిత్వం నేను పెరిగిన పరిస్థితులకీ, నా జన్యువులకీ, ఈ రెంటిమధ్య ఉందే ఇంటరాక్షన్ కీ బానిస.

   మెచ్చుకోండి

   1. నిజమే,
    మీరు నాకొక సహాయం చెయ్యగలరా?నేను కూడా నా పోష్టుల్లో కొన్నిట్ని విడిగా తీసి
    కినిగె ద్వారా పుస్తకరూపం లోకి తీఎసుకురావాలని అనుకుంటున్నాను.దానికి ఏం
    చెయ్యాలి?వ్యాఖ్యాతలు కొందరు కొన్ని చోట్ల సూచించారు,ప్రజలో నా ఇంటర్వ్యూ
    వచ్చిన సమయంలో శ్యామలీయం ఈ ప్రశ్న కూడా అడిగారు.అప్పటినుంచే కొన్ని మంచి
    పోష్టుల్ని పుస్తకరూపంలోకి మారుద్దామని అనిపించంది.కానీ ఎట్లా అప్రోచ్
    అవ్వాలి,ఏం కండిషన్లు ఉంటాయో – ఏమీ తెలియక ఆగిపోయాను.మీ బుక్ కినిగె ద్వారానే
    వచ్చిందని చూశాక మిమ్మల్ని అడుగుదామనిపించింది.మీకు అభ్యంతరం లేకపోతే వివరాలు
    చెప్తారా?

    2016-03-09 13:51 GMT+05:30 “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్” :

    > bondalapati commented: “Thanks Hari gaaru. “1).అసలు వాళ్ళ మధ్యన
    > తలదూఒర్చకుండా ఉండటం 2)”గ” తరపున నిలబడి “క”తో పోట్లాదటం 3)”క”ని కొట్టడా”
    >

    మెచ్చుకోండి

 5. http://kinige.com/ksubmit.php — ఈ లింక్ ద్వారా మొదలుపెట్టండి. మీ పీడీ ఎఫ్ మీరే తయారు చేసుకోవాలి. కినిగె వారు దానిని మెరుగు పరచటానికి కొన్ని సలహాలు ఇస్తారు.

  మెచ్చుకోండి

   1. ఎదురు ఇచ్చేదేమీ లేదులెండి! సమయమూ, శ్రమా అయితే వదులుతాయి.మీ పుస్తకాన్ని ఎంత మంది కొంటారు అనే దాన్ని బట్టి ఎన్నికాసులూ, ఎంత పేరూ వస్తుందనేది ఉంటుంది.

    మెచ్చుకోండి

    1. ఒక సీక్వెన్సు ఓపెన్ చేశాను.పీడీయఫ్ మరియూ కవర్ ఇమేజి కూడా పంపించాను.తర్వాత రెస్పాన్సుకి సుమారు ఎంత టైం పట్టవచ్చును?”ఇదే నా మోద్టి ప్రేమలేఖ” అన్నంత టెన్షన్:-)

     మెచ్చుకోండి

     1. ఓ నాలుగేళ్ళ క్రితం ఐతే, రెండు మూడు రోజులు పట్టింది. నా చివరి పుస్తకానికి (రెండేళ్ళ క్రితం) ఓ వారం రోజులు పట్టింది. ఈ రెస్పాన్స్ టైం పెరుగుతూ పోతుందనుకొంటాను. మరి మీకెంత టైం పడుతుందో..

      మెచ్చుకోండి

 6. బొందలపాటి గారు,
  ఇలాంటి పుస్తకం ఒకటి తెలుగు లో ఉన్నందుకు గర్వం గా ఉంది. అనేక ప్రశ్నలూ వాటికి సమాధనాలూ చాలా fresh గా modern approach లో ఇచ్చారు. దేవుడు గురించి తెలుగు లో వచ్చే పుస్తకాలు అయితే భక్తి అన్నా, లేక పోతే ఆధ్యాత్మికం అయి ఉంటాయి , లేదా రంగనాయకమ్మ లాంటి వాళ్ళు రాసినవి అయి ఉంటాయి. మీ పుస్తకం scientific మార్గం లో ఉన్నది. ఈ స్టాండర్డ్ లో ఈ జోనర్ లో english లో కూడా ఒక పుస్తకం ఉండక పోవచ్చు. congrats!

  మెచ్చుకోండి

 7. మీ పుస్తకాన్ని నేను చదివాను. ఎందుకో పోతన భాగవతాన్ని చదివినట్లు మరల మరలా చదివాలని అనిపిస్తున్నాది ( మీరు పోతన పద్యాన్ని కూడా Quote చేసారు) ఒక రెండు మూడు సార్లు చదివాక నా అనుభూతిని మీతో పంచుకుంటాను.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s