Time machine song…”పదహారేళ్ళకు నీలో నాలో”,..నలభై యేళ్ళకు నా ఆలోచనలు..

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు నీలొ నాలొ ఆ ప్రాయం చెసె చిలిపి పనులకు కొటి దందాలు
వెన్నెలల్లే విరియ బూచి, వెల్లువల్లే ఉరకలేసే…
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు……
కోటి దండాలు, శతకోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ….
కోటి దండాలు, శతకోటి దండాలు

భ్రమలొ లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్నూ నన్నూ కన్న వాళ్ళకు, నిన్నూ నన్నూ కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు, శతకోటి దండాలు

———————————————————————————-

ఈ పాట, దర్శకుడు బాల చందిరన్, తన “మరో చరిత్ర”, చిత్రం కోసం, ఆత్రేయ తో రాయించుకొన్నది (తమిళ దర్శకుడయినా ..పాటలను చాలా శ్రధ్ధ గా రాయించుకొన్నాడు..ఇప్పటి తెలుగు దర్శకులతో పోలిస్తే.. ). నాయికా నాయకుల (స్వప్న, బాలు) పరిచయం ముదిరి, ప్రేమ గా మారి, సమస్యల లో పడటానికి ముందు వస్తుంది ఈ పాట. దర్శకుడి పరం గా చూస్తే, పాటని, కధను ముందుకు నడిపించటానికి వాడుకున్నారు. దర్శకుడి పరిమితులలో నాకు అంత ఆసక్తి లేదు.

బ్లాక్ అండ్ వైట్ సినిమా లో కెమేరామాన్ light gradient ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తే సినిమా విజువల్ గా అంత అప్పీలింగ్ గా ఉంటుంది.ఇది కొంచెం ఈజీ. అదే కలర్ సినిమా లో కెమేరామాన్ పని కొంచెం క్లిష్టమైనది. అతను అన్ని రంగుల అమరిక ను, hue, saturation చూడాలి. ఈ సినిమా కెమెరా మాన్ లైట్ ని బాగా హాండిల్ చేశాడు. దాని వలన మన అటెన్షన్ అనవసరమైన దృశ్యపరమైన విషయాల (చెట్ల ఆకుపచ్చ రంగూ, సముద్రపు నీలం రంగూ లాంటివి మన అటెన్షన్ ని సన్నివేశం లోని ఫీల్ నుంచీ డైవర్ట్ చేస్తాయి) మీదికి డైవర్ట్ అవ్వకుండా, సినిమా లోని భావోద్వేగాల మీద ఫోకస్ అవుతుంది. ఓ సన్నివేశం లోని దృశ్య పరమైన background, ఆ సన్నివేశం లోని ఫీల్ ని బలపరిచేది గా ఉంటుంది ఈ సినిమా లో.

రచయిత కోణం లో ఈ పాటని విశ్లేషించుతాను.
ఈ పాట పైకి పాడుకొనేదా (lip sync ఉండాలా వద్దా..?), మనసు లోపల ఆలోచనలు గా చూపించాలా (lip sync లేకుండా), అని ఆలోచిస్తే, నాకు ఆలోచనలు గానే చూపాలనిపించింది. కానీ పాట లో అక్కడక్కడా పైకి పాడినట్లు చూపించారు.
మధ్య తరగతి కి చెందిన కధానాయిక వస్త్రధారణ..కాసేపు చీరలు కడుతుంది..కాసేపు మిని స్కర్ట్లు వేస్తుంది. పదహారేళ్ళకు ఆరోజుల్లో పొడుగు లంగాలు కానీ, వోణీ లు గానీ వేసేవారు. మధ్యతరగతి విశాఖలో మిని స్కర్టులు ఆరోజుల్లో లేవు కాక లేవు. కాసుల కోసం పడిన రాజీలు ఇవి. అయితే తెలుగు సినిమాలకి ఇంత పరిశీలన అవసరమా? అవి తీసిన వాళ్ళ అంచనాల కు,ఉద్దేశాలను మించి వాటిని విశ్లేషించకూడదేమో!
కధానాయిక కు పదహారేళ్ళు, కాబట్టీ ఆమెకు ఈ పాట లో ని సాహిత్యం లో ఉన్న పరిపక్వత ఉండటం కష్టం. ఆత్రేయ ఆ పాత్ర maturity ని, కధ ప్రకారం ఆమె భావోద్వేగాలనీ దృష్టిలో పెట్టుకోలేదనిపిస్తుంది.కాబట్టీ ,ఇది ఆత్రేయ ఆ పాత్ర మనసులోకి వెళ్ళి, తన maturity తో పలికించిన పాట అనుకోవచ్చు.

———————————————————————————-

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
నేను> ఈ పాట విన్నపుడల్లా, ప్రస్తుతం ఉన్న వయసు నుంచీ (ముప్పైలు కానీయండి, నలభైలు కానీయండి, యాభైలు కానీయండి), time machine వేసుకొని, పదహారేళ్ళకు ఒక emotional trip కొట్టిన ఫీల్ వస్తుంది.

పాటలో,కౌమార ప్రాయం లోని అమ్మాయి అబ్బాయిలు చేసే, చిలిపి పనులను చూపించారు.వాళ్ళు ఆ పనులు చేశారు అనే కంటే, వారి ప్రాయమే వారి చేత ఆ పనులు చేయించింది అనటం సబబు.

ఆ ప్రాయం, మన లో చాలా చిలిపి పనులని లో లోపల అంతర్గతం గా చేస్తుంది…కొన్ని బయటికి చెప్పుకోగలిగినవి..మరికొన్ని చెప్పుకోలేనివి. ప్రాయం మనలో చేసే చిలిపి పనుల వలన, మనం, మన దోస్తులతో కూడా చిలిపి పనులు చేస్తాం. వాళ్ళు opposite sex అయితే ఇక చెప్పనవసరం లేదు.

దండాలు అంటే నమస్కారం అని అర్ధం. కానీ ఇక్కడ కృతజ్ఞత అన్నట్లు గావాడారు. “దండాలు” ని నాయిక ముస్లిం దర్బారు లో “సుక్రియా” లా అభినయిస్తుంది. కృతజ్ఞత ని వ్యక్త పరచటానికి తెలుగు లో ఇంకే పదమూ, అభినయమూ లేవా..?

———————————————————————————-

వెన్నెలల్లే విరియ బూచి, వెల్లువల్లే ఉరకలేసే…పదహారేళ్ళకు
నేను> ఆత్రేయ మాత్రమే రాయగలిగిన పదాలు. పదహారేళ్ళకు అప్పుడప్పుడే వికసిస్తున్న భావుకత్వం, దాని వలన వచ్చే హాయి, ఉద్వేగ స్థాయి , contrasting గా చెప్పాడు మనసు కవి ఇక్కడ.

మామూలు గా వెన్నెల కాసింది/కాచింది లేక కురిసింది అంటాము. ఆత్రేయ వెన్నెల ను పూయించాడు.అదీ విరియ పూచింది. వెన్నెల కాయటం కంటే పూయటం ఎంతో సబబు గా ఊహకు అందుతుంది.

పూలూ, వెన్నెలా రెండూ దృశ్య సంబంధమైన విషయాలు. రంగుకూ కాంతికీ సంబంధించినవి. కాబట్టీ రెండూ పూస్తాయి…ఒక్కోసారి..ప్రేమ లో ఉన్నవారికి విరియ పూసినట్లు అనిపిస్తాయి.

———————————————————————————-

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు

నేను> ఇసుక తిన్నెలు పరుపులు పరిచాయండీ…కాబట్టీ థాంక్స్ చెబుతోంది.

సుఖం గా ఆ పరుపుల మీద, పామ్మీద విష్ణు మూర్తి పోజ్ లో, వాలి పడుకొని (కూర్చొని), లోకం తో సంబంధం లేకుండా ఒక ఇతమిథ్థమైన విషయమంటూ లేని లేని తీపి కబుర్లు (sweet nothings) చెప్పుకోవచ్చు.

———————————————————————————-

పాటలు పాడిన చిరు గాలులకు

నేను> సాధారణం గా చిరు గాలులు పక్క ఊరి మైకు నుంచీ పాటలను మోసుకొస్తాయి.. కానీ నాయిక ప్రేమ లో ఉంది, కాబట్టీ… చిరుగాలులు పాటలు పాడేస్తున్నాయి.

———————————————————————————-

తెరచాటొసగిన చెలులు శిలలకు

నేను> ఫ్రెండ్స్ సాధారణం గా ప్రేమికులు కలుసుకోవటానికి సహాయం చేస్తారు కదా..అలానే కావలసిన మదుగు ఇచ్చిన బండ రాళ్ళు, స్నేహితూరాళ్ళు అయి పోయాయి.

———————————————————————————-

దీవెన జల్లులు చల్లిన అలలకూ

నేను> మామూలు గా అయితే పెద్ద పెద్ద అలలు భయ పెడతాయి..కానీ వలపుల తలపుల లో ఉన్న జంట ని, తుంపరల అక్షింతలు వేసి, దీవిస్తాయి. 🙂

———————————————————————————-

నాతో కలిసి నడచిన కాళ్ళకు

నేను> ఇక్కడ కాళ్ళు అమ్మాయి వా అబ్బాయివా అనేది ఒక సందేహం. పాట visual ప్రకారం, అబ్బాయివి. కానీ, చరణం లో మిగిలిన (కింద వచ్చేవి) పంక్తులన్నీ అమ్మాయి శరీర భాగాలకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. కాబట్టీ నేను, ఆ అమ్మాయి మనసు, ఆ అమ్మాయి కాళ్ళకు నెనర్లు (అప్పటికి అంతర్జాల మార్జాలం లేదు కాబట్టీ ఆత్రేయ నెనర్లు అనలేదు, లేక పోతే “దండాలు” కి బదులు “నెనర్లు” అని వాడేవాడేమో..!). చెబుతోంది అని ఊహిస్తున్నాను.

———————————————————————————-

నాలో నిన్నే నింపిన కళ్ళకు

నేను> అవును కళ్ళు(ఇంద్రియాలు) లోకం లో మనకు నచ్చిన వాటిని తో మన మనసు ని నింపుతాయి కదా..?! దీనిని వాడుక పదాల తో చెప్పటం ఆత్రేయ ప్రత్యేకత.

———————————————————————————-

నీకై చిక్కిన నా నడుమునకూ

నేను> హీరో కోసం డైటింగ్ కూడా చేసినట్లుంది.. 🙂 ఈ మాటకి హీరో కి మంచి కిక్ రావాలి, అతను ఎంత రొమాంటిక్ కాకపోయినా…

———————————————————————————-

భ్రమలో లేపిన తొలి జాములకు

నేను> తెల్లారి గట్ట testosterone రిలీజ్ అవుతుంది…అనేక చిలిపి కలలు..వాటివలన వచ్చే physiological రియాక్షన్లు, తరువాత వచ్చే మెలకువ నేను ఒపెన్ గా చెబితే బాగోదు. ఈ సైకిల్ సుమారు పదహారేళ్ళ కే మొదలవుతుంది…కానీ ఇది అమ్మాయికి వర్తిస్తుందా..? ఆత్రేయ తన పరిస్థితి ని అమ్మాయికి తప్పుగా ఆపాదించాడా…? లేక నా ఈ అవగాహనే తప్పా..?! తెల్లారి వచ్చే కలలు మగ ఆడా అనే తేడా లేకుండా అందరికీ ఎక్కువ గుర్తుంటాయి కాబట్టీ, అమ్మాయి కి కూడా వర్తిస్తుందా..!

———————————————————————————-

సమయం కుదిరిన సందె వేళలకు

నేను> సందె వేలు అందమైనవి, చల్లనైనవి, బీచ్ పక్కన ఉంటే మరీనూ.. ..అప్పటికి సమయం కుదురకపోయినా, ప్రేమికులు కుదిరేటట్లు చూసుకొంటారు.

———————————————————————————-

నిన్నూ నన్ను కన్న వాళ్ళకూ

నేను> కధ ప్రకారం చూస్తే, ఆ అమ్మాయి ఈ మాట అనకూడదు..కానీ రెండు సార్లు అంటుంది…దీని వెనుక ఉన్నది ఆత్రేయ సంస్కారం తప్ప వేరే కాదు.

———————————————————————————-

మనకై వేచే ముందు నాళ్ళకూ

నేను>పదహారేళ్ళ యువత కు రాబోయే జీవితం చాలా మిగిలి ఉంటుంది.  మామూలు గా కాలం కదులుతుంది అనుకొంటాం. కానీ కాలం ఒక డైమెన్షన్. అది కదలదు. కాలం మొత్తం విశ్వం లో అలా పడి ఉంది..సాపేక్షం గా ఉంది. ఆత్రేయ సాపేక్ష సిధ్ధాంతాన్ని దృష్టి లో పెట్టుకొని ఈ పంక్తులు రాశాడనుకోను. కానీ, ముందునాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. అంతా decide అయిపోయింది. మనమే ఓ సారి అక్కడికి వెళ్ళి వాటిని కలుసుకోవాలి.. కొంత కర్మ సిధ్ధాంత ప్రభావం…? మరి కొంత ఆశావాదం..

———————————————————————————-

పాట చిత్రరూపం ఇక్కడ :

All picture credits: Google

ప్రకటనలు

22 thoughts on “Time machine song…”పదహారేళ్ళకు నీలో నాలో”,..నలభై యేళ్ళకు నా ఆలోచనలు..

 1. చాన్నాళ్ళకు దర్శనం. బ్లాగింగ్ ని వాట్సాప్.. ఫేస్ బుక్ మింగేస్తున్నట్టున్నాయి. 🙂

  పాతికేళ్ళ తర్వాతి అనుభవంతో మీ విశ్లేషణ బాగుంది.

  అంతర్జాల‌ మార్జాలం లేకపోయినా ఆత్రేయ కంటె ముందే “నెనర్లు” పదం ఉందనుకుంటాను.

  మెచ్చుకోండి

  1. అంతర్జాల‌ మార్జాలం లేకపోయినా ఆత్రేయ కంటె ముందే “నెనర్లు” పదం ఉందనుకుంటాను.
   — అవునా.. నేను మన అంతర్జాలికులు సృష్టించారేమో అని పొరపడ్డాను లెండి..అవును FB, watsapp లు మింగేస్తున్నాయి. Thanks for stopping by and commenting!

   మెచ్చుకోండి

   1. కినిగెలో ఈ మధ్యనే “ప్రపంచం ఒక నిరంతర భోగయాత్ర” అని ఒక పుస్తకం పబ్లిష్ చేశాను.అది పబ్లిష్ అయిన కొది రోజులకే అంటే రెండు రోజుల కితమే “Your book is in weekly top ten books of Kinige. This means it is very prominently displayed on Kinige.com home page and also on every other book page of Kinige, for every visitor 24/7 for this whole of week” అనే మెసేజ్ వచ్చింది.అది యెలా జరుగుతుంది,అంటే హిట్ కవుంట్ ఉంటుందా?నమ్మవచ్చునా,లేక మర్యాదకి పంపిస్తారా అనేది నా అసలు అనుమానం,అంతకు మించి సీరియస్ గొడవ యేమీ లేదు.మీకు కినిగెతో అనుభవం ఎక్కువ కదా అని అడుగుతున్నాను – మరోలా అనుకోకండి!

    అసలు పుస్తకం లింక్ ఇది,మీరు కూడా చూదండి!

    P.S:ఇది తెలుగే కదా,కాదా?

    మెచ్చుకోండి

  2. కినిగెలో ఈ మధ్యనే “ప్రపంచం ఒక నిరంతార్ భోగయాత్ర” అని పబ్లిష్ చేశాను.అది పబ్లిష్ అయిన కొది రోజులకే అంటే రెండు రోజుల కితమే అనే మెసేజ్ వచ్చింది.అది యెలా జరుగుతుంది,అంటే సర్వర్ డాటాబేస్ ద్వారా హిట్ కవుంట్ ఉంటుందా?నమ్మవచ్చునా,లేక నదరికీ మర్యాదకి పంపిస్తారా అనేది నా అసలు అనుమాన్మ్,అంతకు మించి సీరియస్ గొడవ యేమీ లేదు.మీకు కినిగెతో అనుభవం ఎక్కువ్ అకదా అని అడుగుతున్నాను – మరోలా అనుకోకండి!

   అసలు పుస్తకం లింక్ ఇది,మీరు కూడా చూదండి!

   మెచ్చుకోండి

   1. 1. మీ పుస్తకం భీభత్సం గా అమ్ముడు పోతూ ఉంది ఉండవచ్చుఁ..
    2. కినిగె లో అమ్మకాలు సాధారణం గిన్నె తగ్గి పోయి, మీ పుస్తకం 4, 5 కాపీలమ్మినా టాప్ అయిపోయి ఉండవచ్చుఁ.
    3. నా అనుభవం లో కినిగె fake message ఇవ్వదు.

    మెచ్చుకోండి

   1. మరీ అంత నిర్మొహమాటంగా కౌంటరిస్తే ఎలాగండీ!పాతని పొగిడిన టెక్నిక్ బాగుంది ఒనిడా యాడ్ సైతాను గాణ్ణి చూపించి నైబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్ అని వూరించి మరీ కొనిపించినట్టు:-)

    మెచ్చుకోండి

    1. ఒనిడా యాడ్ సైతాను గాణ్ణి చూపించి నైబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్ అని వూరించి మరీ కొనిపించినట్టు:-)
     >>అర్ధం కాలేదండీ.. 😦 . నేను ఆత్రేయ పాటని చీల్చి చెండాడి, తద్వారా దానిని పైకెత్తుతున్నానంటారా..?

     మెచ్చుకోండి

     1. “మీ పోస్టు వలన ఆ పాట సాహిత్యాన్ని నిశితంగా చూడగలిగాను. ఎంత బాగా రాశారు… ఎంత రొమాంటిక్!” అని అనామకం గారు పొంగిపోవడం చూశాకనే ఈ కామెంటు వేశాను.ఒనిడా యాడ్ మనకి ఏం చెబుతుంది,”కొనవయ్యా,కొను – తొందరగా కొను.పక్కింటివాళ్ళని కుళ్లుకు చచ్చేలా చెయ్యి!” అని కాదా – అట్లాగె చీల్చి చెండాడుతున్నానని మీరు అనుకుంటున్నారు కానీ అది ఇంకా హైలైట్ అవుతున్నది అది కూడా మీకు అర్ధం కాలేదు:-)

      మెచ్చుకోండి

   2. మరీ అంత నిర్మొహమాటంగా కౌంటరిస్తే ఎలాగండీ!పాటని పొగిడిన టెక్నిక్ బాగుంది ఒనిడా యాడ్ సైతాను గాణ్ణి చూపించి నైబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్ అని వూరించి మరీ కొనిపించినట్టు:-)

    మెచ్చుకోండి

 2. మీ పోస్టు వలన ఆ పాట సాహిత్యాన్ని నిశితంగా చూడగలిగాను. ఎంత బాగా రాశారు… ఎంత రొమాంటిక్! హేట్సాప్ ఆత్రేయగారు! మీ ఇమేజినేషన్ కూడా బాగుంది.

  మెచ్చుకోండి

 3. beautiful analysis సర్….ఈ పాట నాకు ఎంతో ఇష్టం…. ఇంకా …. ఆ టైమ్ లో వచ్చిన “నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా” అన్న పాట కూడా…. దాన్ని మించిన రొమాంటిక్ గీతం తెలుగులో ఇంతవరకూ రాలేదని నా అభిప్రాయం

  మెచ్చుకోండి

  1. Thank you sir
   “నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా”,నాకు కూడా ఈ పాట ఇష్టం…కాక పోతే ఇప్పుడు, మా పిల్లలు ఆ బొమ్మా..ఈ బొమ్మా కొని పెట్ట లేదని అలిగితే..వాళ్ళని మాయ చేయటానికి.ఈ పాట పాడుతున్నాను..

   మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s