జపాను అతనూ, ట్రాఫిక్ జామూ, వేదాలూ, జాతక కథలూ…

https://m.facebook.com/story.php?story_fbid=375147139633098&id=268114290336384

ఓ సారి ఇండియా వచ్చిన నా జపనీస్ మితృడిని ఓ బుధ్ధిస్ట్ ప్లేస్ కి తీసుకొని వెళ్ళాను. వెళ్ళే దారి లో అతనికి మన సంస్కృతీ, పురాతన ఆధ్యాత్మిక వారసత్వం, ఇండియాలో ఉన్న బుధ్ధిస్ట్ మూలాలూ వగైరాల గురించి చెప్పాను.
బుధ్ధిస్ట్ అయిన అతను, నే చెప్పిన వన్నీ మౌనం గా అయినా జాగ్రత్త గా విన్నాడు.
ఆ ప్రదేశం చూసి మేము తిరిగి వచ్చేటపుడు, ఓక చోట ట్రాఫిక్  జాం అయింది. జనాలు ఆపోజిట్ డైరెక్షన్ లో వాహనాలు నడుపుతున్నారు. కొన్ని బైక్ లు ఫుట్ పాత్ మీది నుంచీ పోతున్నాయి. హారన్ ల శబ్ధం.
“Indians are very creative in making traffic jams, you know”, అని అతని వంక చూస్తూ ఇబ్బంది గా నవ్వాను.
అతను మాత్రం సీరియస్ గానే, “వేదాలకూ, జాతక కూ పుట్టినిల్లైన ఇండియా నుంచీ నేను ఇలాంటి స్థితి ని ఎక్స్-పెక్ట్ చేయలేదు”, అన్నాడు.
నా అహం ఏదో దెబ్బ తింది. “ట్రాఫిక్ జాం లు  చేయమని జనాలకు వేదాలూ, జాతక కథలూ చెప్ప లేదు . అవెప్పుడూ మంచే చెబుతాయి. జనాలు పాటించకపోతే వాటి తప్పా?”, అన్నాను.
“మరి ఇందాక నువ్వు ఇండియన్ల ఫామిలీ విలువల గురించీ, అహింస  గురించీ, పరమత సహనం గురించీ, వాటి పై ప్రాచీన ఆధ్యాత్మిక ప్రభావం గురించీ నాకు వివరించావు. అంటే ఇండియాలో ఉన్న పాజిటివ్ విలువలకు కూడా ప్రాచీన గ్రంధాలు బాధ్యులు కావన్న మాట. జనాలు ఆ విలువలు ఫాలో అవుతున్నారు కాబట్టీ అవి వున్నాయి. ప్రాచీన గ్రంథం చెప్పింది కాబట్టీ అవి ఉన్నాయనటం సరి కాదనుకొంటా?”, అన్నాడు.
సాధారణం గా జపాన్ వాళ్ళు చాలా గౌరవం గా, ఫార్మల్ గా మాట్లాడతారు. కానీ నాకు ఇతని తో ఉద్యోగం లో మూడేళ్ళ పరిచయం. ఇతను నా తో కొంచెం ఫ్రీ అయిపోయాడు.
నేను కొంచెం ఆలోచించి, “ఆచరణ అనేది వేరే విషయం. మత గ్రంధాలు మంచి చెబుతాయి. విన్నామా… మంచిది, వినలేదా.. నీ ఖర్మ. జనాలని ఆచరణ లోకి మళ్ళించాలంటే చట్టాలూ, రాజకీయ అధికారమూ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి  కఠినమైన శిక్షలు వేస్తే, వారే దారిలోకి వస్తారు. కొంత జనాలను కూడా ప్రాక్టికల్ స్థాయి లో ఎడ్యుకేట్ చేయటం అవసరం. కానీ జనాభా ఎక్కువ అవటం వలన మా దేశం లో ఇది కుదరటం లేదు”, అన్నాను.
“జపాన్ లో కూడా జన సాంద్రత ఎక్కువే. కానీ ఇలా ఉందదు అక్కడ…నీకు తెలుసు కదా..”, అన్నాడు.
“సమాజం లోని ని విద్యా, అభివృధ్ధీ వీటిని కూడా చూడాలి కదా”, అన్నాను.
ఏదేమైనా మన జనాల లో క్రమశిక్షణ లేకపోవటానికి మూల కారణం ఏమిటో తెలియలేదు.

https://m.facebook.com/story.php?story_fbid=10216316100441349&id=1419292403

 

ప్రకటనలు

7 thoughts on “జపాను అతనూ, ట్రాఫిక్ జామూ, వేదాలూ, జాతక కథలూ…”

 1. ఓ నిర్దిస్ట సమాజంలొ సమాజ అభివౄద్ది స్తాయిని బట్టీ అందులొని సంభందాలను బట్టీ అది ఆదారపడి వుంటుంది. భుస్వామ్య సమాజంలొని వ్యక్తులు చాలా అసమానతలతొకూడి వుంటుంది. అత్యధిక ప్రజలు నిరక్షరాక్షతకలిగి వుంటారు. ఆ సమాజంలొని వ్యక్తులు దాదాపు అర్ద హక్కులు కలిగి వుంటారు. భుస్వాములు నియంతలై వారిని హీనంగా చుడటం సర్వసాదారణం. ఆ సమాజంలొని చదువుకున్న వ్యక్తులు కుడా దానికి విరుద్దంగా వారి ప్రవర్తన వుండదు. దానికి అనుగునంగా బూతులు మాట్లాడం దగ్గరనుంచి సకల అవలక్షణాలూ అవలంబిస్తారు. ఆ పునాది (భుస్వామ్య సమాజం) అలావుండంగానే దాని పక్కనే అరువు తెచ్చుకున్న పెట్టుబడిదారీ సమాజం పయనించసాగింది. దాని పలితమే చదువుకుని పెద్ద ఉద్యొగస్తుకుడా తన కింద పనిచేసేవాళ్ళను అరే, ఏరా , అని సంబొదిస్తారు. రాజకీయ నాయకులు ఎంత పెద్ద నేరం చేసినా , లేదా ఎంత పెద్ద కుభకొణం చేసినా నిసిగ్గుగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని బయట పడగలడు. అటు భుస్వామ్యమూ, ఇటు పెట్టుబడిదారీ సంభందాలులు పెనవేచుని వుండటం వలన ఫలితమది. ఇక చెత్త చెదారం విషయంలొగానీ, లేక ట్రాఫిక్ విషయంలొగానీ, ఒక పొలీసు భుతులు లేకుండా వ్యవహరించడం గానీ,.అమలు పరచటానికి సమాజం ఇంకా ఆస్తాయికి ఎదగలేదు.

  ఇక అభివౄద్ది చెందిన పెట్టుబడీదారి సమాజంలొ ఆర్దికంగా సమానత్వత లేకపొయినా సాంస్క్రుతికంగా ఒక ఉన్నత స్తాయికి ఎదిగారు. భుస్వామ్య సమాజం పుర్తిగా నిర్మూలించబడి పెట్టుబడిదారీ సమాజం పొరొగమించింది. . తన తొటి మనిషిని సమానంగా గౌరవించగలడు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మొదలైనవి ఆ సమాజ ఉన్నత స్తాయిని తెలియ పరుస్తుంది. అక్కడి పొలీసులు పౌరులతొ వ్యవహరించే తీరు కుడా దాని అభివౄద్ది స్తాయిని తెలియ పరుస్తుంది. ప్రజలు తిరగ పడినప్పుడు అన్ని దేశాల నమూనా ఒకేవిధంగా వుంటుంది. ఎటొచ్చి రొజువారీ వ్యవహరించే తీరులొనే తేడా వుంటుంది.

  మెచ్చుకోండి

 2. “..అమలు పరచటానికి సమాజం ఇంకా ఆస్తాయికి ఎదగలేదు.”
  –నా ప్రశ్న “ఎందుకు ఎదగలేదు?”, అని.
  “ట్రాఫిక్ రూల్స్ పాటించడం మొదలైనవి ఆ సమాజ ఉన్నత స్తాయిని తెలియ పరుస్తుంది. ”
  –వాళ్ళు పాటించటం వలన (ఉన్నత మైన సామాజిక నీతి) అక్కడి ఉన్నత స్థాయి సాధ్యమైందా? లేక ఉన్నత స్థాయి కి చేరతం వలన పాటిస్తున్నారా?
  నాకు మొదటిదే కరక్ట్ అనిపిస్తుంది. మనకి సాంప్రదాయకం గా కుటుంబ నీతి ఉంది (personified by Rama), వ్యక్తి నీతి ఉంది (స్మృతులూ వగైరా), పౌర నీతి(civic values) అనేది ఉన్నట్లు కనపడదు. మనకి మంచి చెడుల మధ్య అనేక షేడ్స్ ఉన్నాయి. దీని వలన దేనినీ చెడు అని తెగేసి చెప్పటానికి కుదరదు. చెడు చేసి కూడా దానిని వేరే విధాలు గా పరిహారం చేసుకోవచ్చు. ముందు నుంచి సాంఘిక నీతి లో మనం వెనుకబడి ఉన్నామనిపిస్తుంది.
  –మనకి సాంప్రదాయకం గా అనేక కులాలు. కొన్ని కులాలకి ఎక్కువ స్థాయి. ఇంకొన్నిటికి తక్కువ స్థాయి. తక్కువ స్థాయి వారికి తక్కువ అధికారాలూ హక్కులూ. తక్కువ హక్కులున్నవారు, intuitive గా సమాజం పట్ల తక్కువ బాధ్యత ని ఫీలవుతారా?..తెలియదు.

  మెచ్చుకోండి

 3. “…ఇండియన్ల ఫామిలీ విలువల గురించీ..”
  మొన్నటిదాకా ఆడోల్లంతా తమ సర్వైవల్ కోసం ఫామిలీ సిస్టాన్ని అంటి పెట్టుకొని ఉన్నారు. అంతే కానీ పురాతన సంస్కృతీ, విలువలూ మట్టీ మశానమూ ఏమీ కాదు. ఇప్పుడు ఉద్యోగాలూ డబ్బూ వచ్చిపడినై. ఇంకో 30 ఏల్ల లో ఇండియా లో ఫామిలీ సిస్టం ఇక టపా కడుతుంది. ఇప్పుడే మగల్లంతా గవర్నమెంటోదు పెట్టే దుడ్డుకర్ర చట్టాలను చూసి పెళ్ళంటేనే జడుసుకొంటున్నారు.

  మెచ్చుకోండి

 4. >> ఏదేమైనా మన జనాల లో క్రమశిక్షణ లేకపోవటానికి మూల కారణం ఏమిటో తెలియలేదు.
  మన పట్ల, ఎదుటి వాడి పట్ల మరియు దేశం మీద మనకి గౌరవం లేదు బాస్. అదే కారణం.
  ఎట్ లీస్ట్… ప్రతీ మనిషికీ వాడి మీద వాడికి గౌరవం ఉంటే సక్రమంగా ఉంటాడు.

  మెచ్చుకోండి

 5. మీరెందుకు అంత ఇబ్బందిగా ఫీలయ్యారో నాకర్థం కావటం లేదు. రౌడి అల్లుడు సినేమాలో అల్లు రామలింగయ్య బొంబాయిలో ఇంతే, బొంబాయిలో ఇంతే అన్నట్లు. మాదేశం లో ఇంతే అని చెప్పేస్తే సరి పోయి ఉండేది 🙂 మీరిచ్చిన సంస్కృతి,ఆధ్యత్మిక ఉపన్యాసానికి, జపాన్ అతను వేసిన స్కుల్ బాయ్ లాజిక్ ప్రశ్న చదివితే, కన్యాశుల్కం లో ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. అందులో స్వతంత్ర పోరాటం మన నాయకులు ఎలాచేస్తున్నారు, ఎటువంటి గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్ని లక్ష్యల మంది హాజరయ్యారు అని ఉత్సాహంగా చెపుతూంటే, అతనిని రిక్షావాడు స్వతంత్రం వస్తే పోలిసోడి ఉద్యోగం పోతుందా అని అడుతాడు.అలా అడగటానికి కారణం పోలిసోడు రిక్షావాడి దగ్గర రోజు లంచం వసూలు చేస్తాడు గనుక.

  మీ జపాన్ మిత్రుడికి మన రోడ్లు, ట్రాఫిక్ చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీలయి, మనసులో విసుక్కోని ఉంటాడు.అది బయటకి అనలేక, మన గతచరిత్ర గురించి చెప్పిన మాటలువిని, మన దేశంలో రోడ్లు,ట్రాఫిక్ఇంత గందరగోళం గా ఉన్నా, కంఫర్టబుల్ గా లేకపొయినా,వీళ్లకి సుఖం లేకపోయినా ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎమిటి, వీరికేమైనా తిక్కా? స్వంత డబ్బా కొట్టుకొంట్టున్నారని అనుకోనుంటాడు. అలా మొహం మీద చెప్పకుండా Indians are very creative in making traffic jams, you know అని ఉంటాడు. కొన్నిసార్లు ఊహించని ఇటువంటి ప్రశ్నతో మన మనసు కొంచె చివ్వుకుమని అనిపిస్తుంది. ఐతే ఇటువంటి వాటిని లెక్క చేయనవసరంలేదు. ఇదే జపాన్ దేశంలొ ప్రాజెక్ట్ పని మీద ఒక నెల కోసం నా మితృడు వెళ్లాడు. అతనికి ఆ ఊరుకి వెళ్లిన తరువాత 103 డిగ్రిల జ్వరం వచ్చింది. అయినా వాళ్ళు సెలవు ఇవ్వకుండా, అతనిని విడువకుండా, సీటు వెనుకనే ఉంట్టూ, చావాబాది చెవులు మూసి పనిచేయించుకొన్నారు. కొత్తగా వచ్చిన ఇతరదేశస్థుడిని ఇలా ఆరోగ్యం బాగాలేక పోయినారుద్ది పని చేయించుకొంట్టున్నామనే భావననే దరిచేరనీయలేదు. ఇటువంటివి అనుభవం అమేరికాలో నాకు ఎదురైంది .అయితే అది రివర్స్. నేను ఎమీ మనదేశం గురించి చెప్పకపోయినా, ఒక అమేరికన్ కోలిగ్ మీదేశం లో స్లంస్ ఇలా ఉంటాయంటగదా, శుభ్రత అసలికి ఉండదంట గదా! ఎదో టి వి లో ప్రోగ్రాంలో చూశాను అని, మొహం అదోలా పెట్టి మాట్లాడాడు. హించని ఆ ప్రశ్నకు , ఎమి సమాధానం చెప్పాలో వెంటానే అర్థం కాలేదు 🙂

  విషయానికి వస్తే విదేశీయులకు మనదేశం చూసినపుడు ట్రాఫిక్, జనాలు రోడ్లలో పోయే విధానం గందరగోళం గా ఉన్నట్లు భావిస్తారు. అది వాళ్లకి ఒక పెద్ద సమస్య లాగా అనిపిస్తుంది. అదే భారతీయులకి అటువంటి పరిస్థితి, ఎంత మాత్రం గందరగోళం లాగా కనపడదు. మనం కంఫర్టబుల్ గానే ఫీలౌతాము. మనకు అది ఒక కంప్లైంట్ గా అనిపించదు. ఇదే కాదు జనం ఎంతో మంది గుమిగూడే కొన్ని ఉత్సవాలు, అయ్యప కొండకి జ్యోతి దర్శనానికి , పుష్కరాలకు వెళ్లి నపుడు మనం అక్కడికొచ్చే జనాన్ని చూసిగాని, గందరగోళం గా ఉంట్టుందని భావించే పరిస్థ్తితే ఉంటే, ప్రజలు ఎవ్వరు వెళ్లటానికి మొగ్గు చూపరు కదా! కాని ప్రతి సంవత్సరం వేళ్లే వారి సంఖ్య పెరుగుతూనే ఉంట్టున్నాది. అంతో ఇంతో కంఫర్టబుల్ గానే ఉన్నదనుకొంట్టున్నపుడు ప్రజలు వెళతారు,అలా వెళ్లుతున్నపుడు సిస్టం ఎలా మారుస్తారు? మార్చటానికి ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? ఇటువంటి వివరణలు వాళ్లకిచ్చినా అర్థం అవ్వవు.

  మెచ్చుకోండి

 6. @క్రమశిక్షణ లేకపోవటానికి మూల కారణం ఏమిటో తెలియలేదు..?
  800 samvasarala banisatvam,janaba,dopidi,prapanchikarana…aniti kante “nirlakshyam”
  vivekananda garu cheputaru manaku shrada lopinchindi…anduke jathi digajaripoyindi
  @పౌర నీతి(civic values) అనేది ఉన్నట్లు కనపడదు.
  civic values ekvai ee desham ela thagaladindi ani naa bavana..
  @మూల కారణం.
  “I have travelled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in the country, such high moral values, people of such caliber, that I do not think we would conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self esteem, their native culture and they will become what we want them, a truly dominated nation.”
  Lord MacAulay’s Speech to British Parliament 1835.

  $$>>>>adi vastavama?kada anadi kadu samasya.edi mumatiki vidya vyavasta lopame…
  manishi samajamlo ela jivinchalo ittu parents,school lo cheparu…attu samajamu nerpadu.
  ee rojuki Tv,cinema vishaniki pallelu vikrutam ga tayaruyayi..supreme court annatu “ee deshani aa devudu(vunada?) kapadali”

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s