వృధా..

ఒక్క సారి వెనుదిరిగి చూసుకొంటే…….

…..

బాల్యం వృధా..దౌర్జన్యపు దెబ్బలతో..

కౌమారం వృధా, పెద్దల గద్దింపుల తో..

వలపు వృధా, సాధ్యం కాని తలపులతో..

చదువు వృధా, సంబంధం లేని ఉద్యోగం తో..

ఊరు వృధా,కూటికోసం పోయిన వాళ్ళతో..

ప్రకృతి వృధా,కాలుష్యం వేసిన కాటు తో..

శరీరం వృధా,వాంఛ లు తీరని దురదృష్టం తో..

మనసు వృధా, భౌతికమవుతున్న నీ ఉనికి తో..

ఉనికి వృధా, నీ చావు తో ముగిసే, వృధ్ధాప్యం తో ..

ప్రేమ వృధా, మనసు లోనే కొట్టిన చక్కర్ల తో..

జీవనం వృధా, గమ్యం లేని జీవితం తో..

….కానీ..

ఈ కన్నీరు మాత్రం కాదు వృధా,మనసును తుడిచిన జాలి తో..