కరుణానిధి

94 ఏళ్ల కరుణానిధి పోయారు. రెండురోజులుగా అందరూ నివాళులు అర్పిస్తున్నారు. లక్షలకొద్దీ ప్రజలు ఆయన పార్థివ దేహాన్ని దర్శిస్తున్నారు.
వందలకొద్దీ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ విమానాల్లో చెన్నై వెళ్లి అంజలి ఘటిస్తున్నారు. మళ్లీ విమానాల్లో తిరిగి వస్తున్నారు. అలాచేయక పోతే ఏమవుతుంది? ఇదంతా అవసరమా? నాస్తికుడు అయిన ఆయనకు, వాళ్ళు ఘటించే చే అంజలికి అర్ధం ఏమిటి? దాంట్లో నిజం గా విచారముందా? పైకి నటిస్తున్నారా? 80 ఏళ్ళు ద్వేషపూరిత, అవినీతి మయమైన, అధికార కక్కుర్తితో నిండిన, కులాధిపత్యానికి కారణమయిన, సాదా సీదా సగటు రాజకీయాలు చేసి తుది శ్వాస అత్యంత సహజ పరిస్థితులలో విడిచిన మనిషి కోసం, అంత విచార పడాల్సిన అవసరముందా? మామూలు జనాల డబ్బుతో అనేక పదవులూ, సంపదలను అనుభవించి గతించిన మనిషికి, మామూలు జనాలు అంజలి ఘటించటం అవసరమా? లేకపోతే కొంపలు మునుగుతాయా?

ఇవే పరిస్థితులలో ఒక పరిణతి చెందిన సమాజం ఎలా ప్రవర్తిస్తుంది?
రేపు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, ఒబామా ..వీరిలో ఎవరైనా చనిపోతే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? అక్కడి ప్రజలు ఏ విధం గా తీసుకొంటారు? వాళ్ళు దేశాధ్యక్షులు..ఈయన ప్రాంతీయ ముఠా నాయకుడు.

ప్రకటనలు