రష్యా..క్యూబా..అమెరికా..ఇండియా..

రష్యా..క్యూబా..అమెరికా..ఇండియా..

——————————————–

ఒకప్పటి రష్యా లో..

కమ్యూనిటీ స్టోర్ కి వెళ్ళు. ఆఫీస్ లో జీతం గా ఇచ్చిన కూపన్, స్టోర్ లో ఇవ్వు. వాచ్ కొనుక్కో. ఇప్పుడు అది నీ సొత్తు. ఇంట్లో దానికి రంగులేయి, పగలకొట్టు, నీ కూతురుకి ఇవ్వు..నీళ్లలో ముంచు.. నీ ఇష్టం. దానిని వీధిలో పెట్టిఅమ్మొద్దు. ఇది వ్యక్తిగత ఆస్తి.

నీకు ప్రభత్వం ఇల్లు allot చేస్తుంది. జీవిత కాలం ఉంటుంది. రిపేర్ లు వస్తే గవర్నమెంట్ చూసుకొంటుంది. ఇంటి Owner ప్రభుత్వమే. ఆ ఇంటిని పెట్టి లోన్ తీసుకోలేవు, ఇతరులతో పంచుకోలేవు, దానిని అమ్ముకోలేవు.

క్యూబా లో…

చిన్న షాప్ లో డబ్బులిచ్చి వాచీ కొనుక్కో. కావాలంటే పగలకొట్టుకో, లేక పోతే ఎవరికైనా అమ్మేయ్. ఇల్లైనా అంతే. కావాలంటే ఇంటిని ఇద్దరు ముగ్గురితో పంచుకో. కానీ ఇళ్ల వ్యాపారం (real estate) చెయ్యకు. ఇళ్లను కానీ, వస్తువులను కానీ ప్రభుత్వమే manufacture చేస్తుంది. ఇల్లు ప్రయివేట్ ఆస్తి.

అమెరికాలో…

ప్రయివేట్ ఆస్తి వ్యక్తిగత ఆస్తి తో పాటు, ప్రయివేట్ వ్యాపారం, జనాల సొమ్ములు వారి అనుమతి తో తీసుకొని చేసే పబ్లిక్ వ్యాపారం, ప్రయివేట్ తయారీ (manufacture), పబ్లిక్ తయారీ..అన్నీ ఉంటాయి. అయితే అన్నీ regulation framework కి లోబడి పని చేయాలి.

ఇండియా లో…

ఛాలా చాలా flexible system మనది. చేతులు తడిపితే, ఏ regulation గురించీ పట్టించుకోవాల్సినవసరం లేని super free system మనది.

చేతులు తడపకపోతే..రష్యా కి అమ్మ మొగుడు లాంటి విష(స)మసమాజం మనది.

ప్రకటనలు