రాజకీయ-వ్యక్తిగత సంబంధాలు

ఈ పోస్ట్ నా ఈ పాత పోస్ట్ కి కొనసాగింపు: https://wp.me/pGX4s-16t

ఒక మనిషి వ్యక్తిత్వం లో భాగం గా అతని రాజకీయ విశ్వాసం ఉంటుంది.(సాధారణం గా రాజకీయ విశ్వాసాలు ఎలా ఏర్పడతాయి ఇక్కడ చర్చించాం: https://wp.me/pGX4s-16b ) కాబట్టీ రాజకీయ విశ్వాసం ప్రభావం అతని వ్యక్తిత్వం పైన, తద్వారా వ్యక్తి గత సంబంధాల పైనా పడుతుంది.

-ఒక వ్యక్తి ఎదుటి పార్టీ వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించినపుడు.(ఆ పార్టీ పుట్టిందే దోచుకోవటానికి)

-ఎదుటి పార్టీ సిద్ధాంతం పూర్తిగా తప్పని భావించినపుడు.

అలాంటపుడు ఎదుటి పార్టీ వ్యక్తులను గౌరవించడు.

-ఒక వ్యక్తి తన పార్టీ సిద్ధాంతం మాత్రమే సరైనది నమ్మినపుడు. పార్టీ అతని వ్యక్తిత్వం లో, వ్యక్తిగత జీవితం లో అధిక భాగాన్ని ఆక్రమించినపుడు.

-ఆ వ్యక్తి ఆవేశపరుడైనపుడు.

అలాంటపుడు, ఎదుటి పార్టీ వాళ్ళతో వ్యక్తిగతం గా సత్సంబంధాలు ఉండవు.

-ఒక వ్యక్తి , రాజకీయాలు ఉన్నదే దోపిడీ కోసం అని నమ్మినపుడు, తన దోపిడీ కి ఎదుటి పార్టీ వాడు అడ్డు తగులుతున్నాడనుకొన్నపుడు.

అలాంటపుడు ఎదుటి పార్టీ వ్యక్తులతో వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి.

-ఒక వ్యక్తి తన పార్టీ సిద్ధాంతం లా ఎదుటి పార్టీ సిద్ధాంతం కూడా సమాజ హితాన్ని కోరుకొనేదే కానీ, తన పార్టీ సిద్ధాంతం మెరుగైనదని నమ్మినపుడు, అతను ఎదుటి పార్టీ వ్యక్తులతో స్నేహం గా ఉండటానికి వెనుకాడడు. ఉదాహరణ అటల్ బీహారీ వాజపేయి.

పైవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలో…అదే సాయుధపోరాటాలు జరిగే వ్యవస్థలో, రాజకీయ ప్రత్తర్థులు, ఒకరికొకరు వ్యక్తిగతం నష్టం చేసుకొని మట్టుపెట్టుకొనే స్థాయికి వెళ్తుంది. ఫ్యాక్షన్ రాజకీయాలలోనూ అంతే. ఆ పరిస్థితులలో వ్యక్తిగత స్నేహం సాధ్యం కాదు.

రాజకీయాలంటే డబ్బూ పదవీ అనుకొనే గుంటనక్కలు, ఎప్పటికప్పుఫు వ్యక్తిగత స్నేహాలను cultivate చేసుకొంటూ,పార్టీ లనూ, సిద్ధాంతాలను, బనీన్లను మార్చినట్లు మారుస్తారు.ఇప్పట్లో వీరే ఎక్కువ. వీరిది హవా!

మొత్తానికి వ్యక్తిగత స్నేహాల పై రాజకీయాల ప్రభావం, ఆయా వ్యక్తుల పరిణతి , వాళ్ళు ప్రభావం పడనిస్తున్నారా లేదా? …అనే విషయాలపై ఆధారపడిఉంటుంది.

ఇక ఒకే రాజకీయ నమ్మకాన్ని కలిగిన వారి మధ్య, వ్యక్తిగత వైరం….

-వారి రాజకీయ నమ్మకం బలమైనది కాకపోతే, ఆ పార్టీ ని వదిలి పెట్టటం మంచిది. అప్పుడు ఆత్మ ద్రోహం చేసుకోని వారవుతారు.

-రాజకీయం గా తప్పితే వ్యక్తిగత ప్రసత్యర్థులతో, interact అవ్వకూడదు.

-పార్టీ లో , ప్రభత్వం లో ఒకే పదవిని ఆశించటం వలన వ్యక్తిగత వైరం పెరుగుతుంది. వ్యక్తిగత లబ్ది పక్కన పెట్టలేనపుడు, రాజకీయాలనుండీ తప్పుకోవాలి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s