“ప్రతి విషయానికీ ఒక కారణం ఉంటుంది”

“ప్రతి విషయానికీ ఒక కారణం ఉంటుంది”, అనే ఆలోచన అన్నివేళలా కరెక్ట్ కాకపోవచ్చు.ఆ ఆలోచన ఈ విశ్వము లో మన అస్తిత్వం,పరిస్థితుల వలన మన మైండ్ లో ఏర్పడిన ఒక construct మాత్రమే కావచ్చు. అడవుల్లో ఉండే ఆటవికుడు మంట రాజేసి వండుకొంటాడు. అతనిక దగ్గరికి ఎవరైనా నగర వాసి వెళ్లి, “మైక్రోవేవ్ ఒవేన్ ద్వారా వంట చేయొచ్చు”, అని చెబితే, ఆ ఆటవికుడు, microwave oven లో కూడా మంట ఉంటుంది అని భావిస్తాడు.మంటను హేతువాదమనుకొంటే..microwaves ను అర్ధం చేసుకోవటానికి మంట సరిపోదు. అలానే beyond bigbang ను అర్ధం చేసుకోవటానికి, హేతువాదాన్ని మించినదేదో కావాలి.అది నమ్మకం అయితే మాత్రం కాదు.

హేతువాదాన్ని ఒక అస్తిత్వ పరిధి దాటిన విషయాలకు అన్వయించలేం. ఎందుకంటే అది ప్రతి విషయానికి ఒక కారణముంటుందని చెప్పే ఒక భావన.దానిని అన్వయిస్తూ పోతే కార్యకారణ సంబంధాల గొలుసుకట్టు అనంతం గా సాగుతుంది. ఎందుకు అనంతం గా సాగుతుందీ అంటే, కారణం లేని విషయం ఉండకూడదు అనేది హేతువాదం యొక్క axiom కాబట్టీ.ఎప్పుడైతే గొలుసు అంతమైందో, అప్పుడు కారణం లేని విషయం ఉన్నట్లు లెక్క. అంతం లేని కార్యకారణ సంబంధాల గొలుసు ఒక ఊహ మాత్రమే, వాస్తవం కాదు. కానీ వాస్తవం , వాదం యొక్క axiom ప్రకారం ఉండదు. వాస్తవాన్ని బట్టి వాదన ఉండాలి. వాస్తవం లో కారణం లేని విషయానికి హేతువాదాన్ని అప్లై చేయరాదు.

Existance అనేది ఆదీ అంతమూ లేని ఒక వాస్తవం.ఊహ కాదు.Existance కానిది, దానిలో లేనిది, ఉనికి లో ఉండదు. Existance పరిమితమయినదైతే, non-existance వాస్తవమవుతుంది. పరిమితమైన existance అవాస్తవం. ఆదీ అంతమూ లేనిదానికి కారణం ఉండదు.Existance లోపల అనేకమయిన కార్య కారణ సంబంధాలుండవచ్చు. కానీ existance మొత్తనికీ టోకున కారణం ఉండదు. Existance అబబడే వాస్తవం మొత్తానికి టోకున కారణాన్ని (హేతువాదాన్ని) అప్లై చేయటమంటే, ఊరి కి పెళ్లి చేయటం లాంటిది. ఊళ్ళోని మనుషులు పెళ్లి చేసుకొంటారు. ఊరు పెళ్లి చేసుకోదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s