మనో సింహాసనం

ప్రతిమనిషి మైండ్ లో ఆదర్శ నాయకుడి కోసం ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ఎక్కడానికి కావలసిన అర్హతలు ఉన్న ఒక ఆదర్శ వ్యక్తి ఊహా చిత్రం ఉంటుంది (ఇండియా లో కులం మతం కూడా కాక అర్హతే). నిజజీవితం లో ఎవరైనా ఆ ఊహా చిత్రానికి కొంచెం దగ్గర గా వస్తే, ఆ వచ్చిన వాళ్ళకి ఊహాచిత్రం లోని లక్షణాలన్నింటినీ ఆపాదించేసి, మనో సింహాసనమీద కూర్చోబెడతాం.

రాజాకీయాల విషయం లో, మనం మన మనో సింహాసనం మీద కూర్చో బెట్టిన వ్యక్తే, నిజాజీవితం లోనూ సింహాసనం ఎక్కుతాడు.మన ఊహా చిత్రానికి, అతని వాస్తవ చిత్రానికి సంబంధం ఉండదు. అయినా చాలా మంది, ఒక సారి మనో సింహాసనం మీద కూర్చోబెట్టినాక, అతనివి తప్పుల్ని ఒప్పుకోలేరు. అతని తో identify అయిపోవడం వలన. ఈ మొత్తం ప్రక్రియలో నాయకుడి కొన్ని మంచి లక్షణాలున్నా , వాటి వలన అతనికి undue అడ్వాంటేజ్ ఉంటుంది.

ముందు తరాలకు ఒక కొత్తదేవుడి తయారీ మొదలైనట్లే..

ప్రకటనలు