సంతోషం, దుఃఖం ఒకే నాణానికి రెండు వైపుల లాంటివి?

ఒక సందర్భం లో జిడ్డు కృష్ణమూర్తి, “సంతోషం, దుఃఖం ఒకే నాణానికి రెండు వైపుల లాంటివి. మన మనసు ఒకే మానసిక స్పందనను సంతోషం గా గానీ దుఃఖం గా గానీ ఇంటర్ -ప్రెట్ చేస్తుంది”, అనే అర్థం వచ్చేట్లు గా మాట్లాడాడు. దీనికి ఈ మధ్య న్యూరో సైన్స్ తెచ్చిన పరిజ్ఞానాన్ని జోడిస్తే, నాకు ఈ విధం గా అనిపించింది:
పరిస్థితులను బట్టీ , మన వ్యక్తిత్వాన్ని బట్టీ, మనకు పరిస్థితులు ఎంత ప్రాముఖ్యమో, అవి మనకు లాభ దాయకమా లేక నష్టదాయకమా అనే విషయాలను బట్టీ మన మెదడులోని prefrontal cortex సంతోషం లేదా విషాదానికి సంబంధించిన మెదడు రసాయనం డోపమైన్ ను స్రవించమని ఆదేశిస్తుంది. సంతోషానికి విషాదానికీ డోపమైన్ స్థాయి పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేదే కొలమానం.సంతోషానికి మెదడు లోని ఒక ప్రాంతం లో డోపమైన్ పెరిగితే, విషాదానికీ వేరొక ప్రాంతం లో డోపమైన్ తగ్గుతుంది.
ఇక్కడ కార్య కారణం సంబంధాలను చూస్తే, మన మెదడు/మనసు సంఘటనలను ఇంటర్-ప్రెట్ చేస్తుంది. అవి అనుకూలమైతే సంతోషానికి తగ్గ డోపమైన్ రిలీజ్ పాటర్న్ ట్రిగ్గర్ అవుతుంది. అవి ప్రతికూలమైతే విషాదానికి తగ్గ డోపమైన్ రిలీజ్ పాటర్న్ ట్రిగ్గర్ అవుతుంది. అంతే గానీ, ఒకే స్పందన (డోపమైన్ అనుకొంటే) ను మన మెంటాలిటీ ని బట్టి సంతోషం గానో విషాదం గానో ఇంటర్-ప్రెట్ చేయం. ఇంట్రపరెట్ చేయటం జీవితపు/జీవనపు పరిస్థితులను గురించి అవుతుంది.

ప్రపంచ కప్ క్రికెట్ మాచ్ ఫైనల్స్ లో పాకిస్థాన్ తో తలపడిన ఇండియా ఒడిపోయిందనుకొందాం. మనం మన నైరాస్యతను, ఒక పాకిస్తానీ పొందిన ఆనందం గా ఇంట్రప్రేట్ చేసి, ఆ నైరాశ్యాన్ని ఆనందం గా మార్చుకోగలమా?
అయితే, పరిస్థితులతో సంబంధం లేకుండా, డోపమైన్ పాటర్న్స్ సంతోషం నుంచీ విషాదానికీ, విషాదం నుంచీ సంతోషానికి మారే అవకాశాన్ని కాదనలేం. చాలా కొద్దిమంది bipolar disorder రోగులలో, లేక ప్రత్యేక మెదడు నిర్మాణం కల వారి లో ఇది సంభవమే!