విశ్వఐక్యతా స్థితి hi

విశ్వఐక్యతా స్థితి ( Unio Mystica ) అనేది రెండు రకాలాట.
– ఒకటి బాహ్యప్రపంచం లోని చెట్లూ చేమలని, మధ్యలో ఆలోచన,’నేను’ ల జోక్యం లేకుండా అనుభూతించేది. ఇది జిడ్డు కృష్ణమూర్తి, మనకు చెట్టును ఎలా చూడాలో నేర్పింప ప్రయత్నించిన స్థితి లాంటిదనిపించింది. ఇది తక్కువ స్థాయి స్థితి ఆట.
– రెండోది అంతరంగం లో ఆలోచనలు, చిత్రాలు, బింబాలు లేకుండా ఉండే ఒక శూన్య స్థితి. చూసే దానిని చూసే స్థితి. ఇది ఉపనిషత్తు లలో చెప్పిన తురీయ స్థితి లాంటిదనిపించింది. ఇది ఎక్కువ స్థాయి స్థితి ఆట.

వీటిని అనుభవించినవారు అవి కేవలం వైయక్తిక అనుభూతులని ఒప్పుకోరుట. అవి మానసిక అనుభూతులు కూడా కాదు. అవి వైయక్తికమూ, వస్తుగతమూ కూడానట. వాటిని అధి-వైయక్తిక (వ్యక్తిగత అనుభూతుల ఆవల, వాటిని మించిన) అనుభూతులు అనుకోవచ్చునట.

ఇక్కడ అనేక permutations గుర్తుకొచ్చాయి.
1. భూమీ, నక్షత్రాలూ రాళ్ళ లానే, మనం కూడా ఈ విశ్వపు sub-atomic ధూళి నుంచే వచ్చాం. కాబట్టీ మన మనసును అంతర్గతం గా తొలుచుకొంటూ పోతే ఎప్పటికైనా వీటన్నిటికీ కారణమయిన పరిపూర్ణ సత్యాన్ని టచ్ చేస్తామేమో!🤔

2. జిడ్డు గారు చెప్పిన సత్యదర్శనం లో వర్తమానానికి సంబంధించిన చెట్లూ, ఆకులూ రంగులూ, ధ్వనులూ (దృగ్విషయాలు) ఉంటాయి. చేతన అనే టార్చ్ యొక్క వర్తులాకార కాంతి పుంజం లో ఇవన్నీ ఉంటాయి. ఈ దృగ్విషయాలను కూడా కాంతిపుంజం నుంచీ కాళీ చేస్తే, వట్టి కాంతి పుంజమే మిగులుతుంది. ఇది శస్త్ర చికిత్సకు మత్తు మందు పెట్టిన స్థితి కంటే భిన్నమయినది. మత్తు స్థితిలో కాంతి పుంజమే ఉండదు. తురీయ స్థితి కాళీ అయిన కాంతి పుంజం లాంటిదేమో? ఆ స్థితి లో మనం క్వాంటమ్ ఫీల్డ్స్ లా అయిపోతామేమో!🤔 అయితే, అలాంటి కాళీ అయిన కాంతిపుంజం నుంచీ వచ్చేది అనుభవం తప్పితే అవగాహన కాదు.

3. సత్యానుభవం వస్తుగతం కూడా అంటున్నారు కాబట్టీ, మిగిలిన వారికి ఆ వస్తు లక్షణం ఎందుకు కనపడదు? 🤔 అంటే, చేతన అనేది synchrony/resonance అంటున్నారు. కాబట్టీ, వస్తువుల్లో ఉన్న హార్మోనిక్స్ మామూలు చేతన స్థితి లో ఉన్న వాడితో resonate కావేమో! ఆ స్థల కాలాలు చేతన నుండీ డ్రాప్ అయిన స్థితి లొనే సింక్ అవుతాయేమో!🤔

4. ఇంకో ఐడియా!🤗 స్ట్రింగ్ తీరీ చెప్పిన పదో పరకో డైమన్షన్లు కొండల్లోనూ, చెట్లలోనూ, మన మెదడు లోనూ, చేతనలోనూ కూడా ఉంటాయి. జిడ్డు గారు చెప్పిన స్థితి లోనో, తురీయ స్థితి లోనో మన చేతనకి ఆ డైమన్షన్లు తెలిసిపోయి, విశ్వఐక్యతా భావన కలుగుతుందేమో!🤔

5. మామూలు కళ్ళకి కన పడని, దాగి ఉన్న వస్తు లక్షణాలేవో ఆ ప్రత్యేక స్థితి లో మాత్రమే దివ్య చక్షువులకి కనపడతాయేమో🤔 (మామూలు గా కనపడని బాక్టీరియా మైక్రోస్కోప్ లో కనపడినట్లు)? ఏదేమైనా ఆ స్థితి అనుభవించడం వేరు, దాని గురించిన అవగాహన వేరు. 😋😎

One thought on “విశ్వఐక్యతా స్థితి hi”

 1. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.
  పై వ్యాసం బాగా వ్రాసారు.
  భూమీ, నక్షత్రాలూ రాళ్ళ లానే, మనం కూడా ఈ విశ్వపు sub-atomic ధూళి నుంచే వచ్చాం :- ఈ వాక్యం భౌతిక పదార్ధానికి సంభందించినది.
  మన మనసును అంతర్గతం గా తొలుచుకొంటూ పోతే ఎప్పటికైనా వీటన్నిటికీ కారణమయిన పరిపూర్ణ సత్యాన్ని టచ్ చేస్తామేమో:- ఈ వాక్యం ఆధ్యాత్మికతకు సంభందించినది. మన మనసును అంతర్ముఖంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ పోతే, మనం సమాధిస్థితికి చేరుకుంటాం. అంటే, ఆ స్థితిలో విషయమూ, సమయమూ ఏవీ వుండవు. ఏవీ వుండవు అని ఎలా చెప్పగలము? అని ప్రశ్నిస్తే, సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినతరువాతనే ఆ విషయం మన మనస్సుకు తెలుస్తుంది. అయితే, ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. ఆ సమాధి స్థితిలో ఎవరు తెలుసుకుంటూ వున్నారు? అని. ఆ తెలుసుకుంటూ వున్నదే ‘పరమాత్మ’ లేక ‘నేను’. దీనినే ‘ఎరుక’ అనికూడా అంటారు. నేను పరమాత్మను లేక ఎరుకను అని తెలుసుకోవటమే నన్ను నేను తెలుసుకోవటం. నేను ఎరుకను అని తెలుసుకున్నప్పుడు ఈ శరీరము, మనస్సు, బాహ్యములోని వస్తువులు, విషయాలు నేను-కాను అని తెలుసుకుంటాము. ‘నేను’ – ఈ శరీరము, మనస్సు, వస్తువులు కాను కానీ ఆ శరీరము, మనస్సు, వస్తువులు నాకంటే భిన్నముగా లేవు అని తెలుసుకుంటే ‘ విశ్వ ఐక్యతా స్థితి ‘ ని పొందినట్లే. ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, తెలియబడేదీ, తెలుసుకొనేదీ అనే వాటిని గురించి తెలుసుకోవటం. తెలియబడేది – తెలుసుకోనేది కాదు; తెలుసుకొనేది – తెలియబడేది కాదు. తెలుసుకొనేదానిని తెలుసుకోవటానికి మరొక సాధనం అంటూ వుండదు. అందుకనే, మనం సమాధి స్థితికి చేరుకున్నప్పుడు ‘నేను’ సమాధి స్థితికి చేరుకున్నాను అని ప్రత్యేకంగా తెలియబడదు. సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడే మనస్సుకు తెలియబడుతుంది. అంటే, మనస్సు తెలియబడేది; తెలియచేసేది –
  ‘నేను’ లేదా ‘పరమాత్మ’.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s