Upanishat excerpt

ఒక సగటు హిందూ సామాజికుడి గా అప్పుడప్పుడూ వినగా గుర్తున్న తాత్విక మంత్రాల, ఉపనిషత్ మూలాలను వెతికి ఈ పోస్ట్ లో ఇస్తున్నాను. తెలిసిన వారు తప్పొప్పులను చెప్పగలరు.

ఐతరేయ ఉపనిషత్

*కోహమితి?
!నేను ఎవరు?

చాందోగ్యోపనిషత్

*ఏకమేవాద్వితీయం బ్రహ్మ.
!ఓకేఒకటి, రెండవది అంటూ లేనిది బ్రహ్మం

*తత్వమసి
!ఆ సారమే నీవు.

!ఓంకారం మొదటి గా చాందోగ్యోపనిషత్ లొనే !ప్రస్తావించబడినది.

*ఓం భూర్భువస్వః
*తత్స వితుర్వరేణ్యం
*భర్గో దేవస్య ధీమహి
*ధియోయోనఃప్రచోదయాత్
!మనం ఆ దివ్య తేజస్సు వెలుగు లో ఆలోచించి, అతని ప్రేరేపణ తో అర్ధం చేసుకొందాం.

*సర్వం ఖల్విదం బ్రహ్మ
!అంతా బ్రహ్మం మాత్రమే

కేనోపనిషత్

*అన్యదేవ తద్వితాదథో అవిదితాదధి
*ఇతి సుశ్రుమ పూర్వేషాం యే నస్తద్ వ్యాచక్షిరే

!అది తెలిసినదాని కంటే భిన్నమైనది. తెలియని దాని ఆవల ఉన్నది, అని మా పూర్వీకులు చెప్పగా వినిఉన్నాము.

కఠ ఉపనిషత్

*ఉత్తిష్ఠ, జాగ్రత
*ప్రాప్య వరాన్నిబోధత
*క్షురస్య ధరా నిశితా దురత్యయ
*దుర్గ పథస్తత్కవయో వదంతి

!పైకి లే, మేలుకో!
!ఈ వరాలు పొంది, అర్ధం చేసుకో
!కత్తి అంచులా, నిన్ను చేరుకొనే మార్గం కష్టమైనది.

తైత్తరీయ ఉపనిషత్

*మాతృదేవో భవ, పితృదేవో భవ
*ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ

!తల్లీ తండ్రీ గురువూ అతిధులే దైవాలు.

ఇషా ఉపనిషత్

*పురుషః సోహమస్మి
నేనే అతను, అతని లో ఉన్న పురుషుడిని.


*నేతి, నేతి

!ఇది కాదు, ఇది కాదు అంటూ వెళ్తే చివరికి కి మిగిలేది పరమ సత్యం.

*అహం బ్రహ్మాస్మి
!నేనే బ్రహ్మం

*తమసోమా జ్యోతిర్గమయ!
*అసతోమా సద్గమయా
*తమసోమా జ్యోతిర్గమయా
*మృత్యోర్మా అమృతంగమయా
!అసత్తునుండి సత్తుకు, తమస్సునుండి వెలుగుకు, మృతువునుండి అమృతత్వానికి తీసుకెళ్లు!

మాండూక్యోపనిషత్

*జాగృత
*స్వప్న
*సుషుప్తి
*తురీయ

!చేతనకు నాలుగు స్థితులు ఉంటాయి:
!మెళకువ
!నిద్ర
!గాఢ నిద్ర
!తురీయం అనబడే అవస్థలు.

ముండకోపనిషత్

*సత్యేన లభ్యస్తపసా హెష ఆత్మా సమ్యజ్ఞానేన *బ్రహ్మచర్యేణ నిత్యం
!నిజాయితీ,తపస్సు, వివేకం, బ్రహ్మచర్యముల నిరంతర సాధన ద్వారా ఆత్మ జ్ఞానం పొందవచ్చును.

ప్రశ్నోపనిషత్

*ఆత్మాన యేష ప్రాణయా జాయతే
!జీవితం ఆత్మనుంచే పుడుతోంది.

తైత్తరీయ అరణ్యకమ్ – పురుష సూక్తం

*ఓం సహనావవతు
*సహనౌభునక్తు
*సహవీర్యం కరవావహై
*తేజస్వి నావధీతమస్తు
*మా విద్విషావహై
*ఓం శాంతిః శాంతిః శాంతిః

!మన ఉభయులను భగవానుడు రక్షించు గాక. మనల !నిద్ధరిని పోషించు గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక. మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక

*తస్మాద్విరాడజాయత విరాజో ఆది పురుషః
*సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మధో పురః

!పురుషునినుండీ విరాట్ అను బ్రహ్మాండం పుట్టెను. ఈ అండము నుండీ మరల పురుషుడు జీవరూపుడై పుట్టెను. వానికి దేశము కాలము అను విభాగములేర్పడెను. కనుక అతడు వెనుక, ముందు, పైన, క్రింద అను స్థితులను అనుభవము లోనికి తెచ్చుకొనెను.

తైత్తరీయ అరణ్యకమ్ — మంత్ర పుష్పం

చివరి పంక్తులు:
*సంవస్తరో వ అపమాయతనం
*ఆయతనవాన్ భవతి
*యస్సవత్స రస్యాయతనం వేదా
*ఆయతనవాన్ భవతి
*అపోవై సంవసర ఆయతనం
*ఆయతనవాన్ భవతి
*య ఏవం వేదా
*యోప్సు నవం ప్రతిష్ఠితం వేదా
*ప్రత్యేవతిష్ఠతి

!తనగురించి తెలిసిన వాడు తనలో లో స్థిరపడతాడు. తెప్ప ఉందని తెలిసినవాడు, తెప్పలో స్థిరపడతాడు.

నాసదీయ సూక్తం – ఋగ్వేదం

*కో ఆద్దా వేదం క డ హ ప్ర వోచక్త్రుత అజాంతా కృతం ఇయం విసృష్టిహి
*ఆర్వాగ్దేవా అస్య విసర్జనేనాయా కో వేదం యటం ఆబభూవం||
*ఇయం విస్తృష్టిర్యతం ఆబభూవ యది వా దధే యది వా న యో అస్యఅధ్యక్షహ
*పరమే వ్యోమస్యో అండహ వేదం యది వా న వేదం ||

!అప్పట్లో ‘ఉనికి లేకపోవటం’ అనేది కూడా లేదు, ఉనికి కూడా లేదు.
!అప్పుడు గాలి లేదు, దాని ఆవల ప్రదేశం కూడా లేదు.
!ఈ మొత్తాన్నీ ఏది కప్పి ఉంచింది? ఈ మొత్తం ఎక్కడ ఉంది? ఎవరి పరిరక్షణ లో ఉంది? ఆ అగాధ లోతుల్లో ఒక మూలద్రవం ఉందా? ఇది ఎప్పుడు ఉనికిలోకి వచ్చినదో ఆ సర్వాధిపతియైన దేవుడికైనా తెలుసా?
SRP 21/11/2020

One thought on “Upanishat excerpt”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s