అంతర్గత సౌందర్యం

అంతర్గత సౌందర్యం అలోచనలకు మాత్రమే పరిమితమైనదా.. లేక ఆచరణ లో కూడా ఉంటుందా..?

మనుషులు ఎక్కువగా గ్రామాలలో ఉండే పాత రోజులలో, వారి అనుభవం ఆ ఊరికి పరిమిత మై ఉండేది. అప్పట్లో టీవీ, FB,Watsapp లాంటివి ఉండేవి కావు. లోకం లోని నేరాలకు, మోసాలకు మనుషుల exposure తక్కువ గా ఉండేది. మాధ్యమా లలోని ఘోరాలను ఎక్కువ గా చూసే వారి సున్నితత్వం తగ్గుతుంది. అలవాటుపడిన మనసు మొద్దుబారుతుంది. మొద్దుబారిన మనసుకు సౌందర్యం ఉండదు.

నగరం లోని ఒత్తిడి జీవితాలలో చిక్కుకున్న వారికి, ఇతర విషయాల గురించి ఆలోచించే సున్నితత్వం తగ్గుతుంది. జీవితం self centred గా మారుతుంది. వారి లో కూడా ఈ సౌందర్యం తగ్గుతుంది.

సున్నితత్వం ఉన్నా, ఆచారణ లో పెట్టని వారికి అంతర్గత సౌందర్యం ఉన్నట్లా..? ఒకప్పుడు ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే జాలిపడి సాయం చేసే వారు. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే , ప్రపంచం నలుమూలల నుంచీ, కష్టాల వార్తలు ఎన్నెన్నో.. వారి అందరికీ సాయం చేయటం అయ్యే పనేనా ?

ఫీల్ అయి కూడా సాయం చేయని వారికి ఈ అంతర్గత సౌందర్యం లేనట్లా?

మనం చేయగలిగే సాయానికి పరిమితులు ఉంటాయి. మన మనుగడకు హాని చేసే సాయాన్ని కొంసాగించలేం.

దైవ భావన మానసిక సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే దేవుడి తో అల్లుకొని అనేక అందమైన ఊహలు ఉంటాయి. సిరివెన్నెల సినిమా లోని “ఆదిభిక్షువు వాడినేది కోరేది..”, పాటను దేవుఫు లేదనుకొంటే పూర్తిగా ఆస్వాదించలేం.

భౌతిక వాదం వలన, అంతర్గత సౌందర్యం తగ్గుతుంది. చంద్రుడిని రాళ్లు, రప్ప ల తో నిండిన ఒక గ్రహం గా చూసే వాడు, కవుల వెన్నెల వర్ణన లను సరిగా ఆస్వాదించలేడు.

పసి పిల్లల లోని అంతర్గత సౌందర్యం గురించి తెలిసినదే. వయసు తో పాటు మనిషి ఆలోచనలు మనుగడ వైపుకి మళ్లుతాయి.లివింగ్ స్కిల్స్ పేరు తో అనేక టక్కరి తనాల ను నేరుస్తాడు. చిన్నప్పటి లోపలి అందం ఆవిరైపోతుంది.

ప్రకటనలు