మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా?

మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా? ఈ ప్రశ్న లోకి వెళ్ళే ముందు మనం హిపోక్రసీ ని నిర్వచించాలి. “హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం”. “హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం”.
హిపోక్రసీ ని నిర్వచించుతున్నాము కాబట్టీ ఈ నిర్వచనానికి ఉండే పరిమితు గురించి కూడా ఆలోచించుదాం. ఒక మనిషి చెల్లినీ చెలి నీ ఒకే దృష్టి తో చూడ లేడు కదా ఇది హిపోక్రసీ అవుతుందా?  కానే కాదు. పైగా అలా చూడటం పర్వర్షన్ అవుతుంది. కాబట్టీ మానవ సంబంధాలకు ఈ హిపోక్రసీ వర్తించదు. అలానే ఒక వ్యక్తి జీవ హింస తగదు అని చెప్పాడు. కానీ రోజూ అతని శరీరం లో కొన్ని లక్షల కొద్దీ సూక్ష్మ జీవులు చంపబడుతున్నాయి. దీని వలన అతను హిపోక్రాట్ అవుతాడా? హిపోక్రాట్ అనిపించుకోకుండా ఉండటానికి అతను ఆత్మ హత్య చేసుకోవాలా? కాదు, హిపోక్రసీ అనేది వ్యక్తి లో ఉండే మానవ సామాజిక విలువలకు సంబంధించిన విషయం.అలానేచెట్లు నిజాయితీ గా పూలు పూస్తాయి, మేఘం నిజాయితీ గా వర్షిస్తుంది లేక కోయిల నిజాయితీగా పాడుతుంది అనే విషయాలు సరైనవే అవ్వవచ్చును గానీ మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళనవసరం లేదు.

మనిషి వ్యక్తిత్వం అనేది అతని జీవితం లోని పరస్పర విరుధ్ధమైన పరిస్థితుల వలన ప్రభావితం ఔతుంది. కాబట్టీ, మనం మనిషి పరస్పర విరుధ్ధమైన ఆలోచనల ప్రతిరూపం అనే విషయం అంగీకరించాలి. కాబట్టీ మనిషి జీవితంలోని/వ్యక్తిత్వం లోని ఒక అంశం తో పోల్చిచూసినప్పుడు, అతని లో తద్విరుధ్ధమైన ఆలోచనలు, అంశాలు ఉండటం ఒక హిపోక్రసీ లా కనపడుతుంది. కానీ దీనికి అతీతులు చాలా తక్కువ గా ఉంటారు. మనిషి లోఉండే ఏ అంశానికి ఆ అంశం నిజాయితీ గా కనపడుతుంది. కానీ పక్క అంశం తో పాటు కలిపి చూసినప్పుడు ఆ రెండింటి మధ్యా వైరుధ్యా లుంటే అది హిపోక్రసీ.మొత్తం గా ఒక మనిషి జీవితం/వ్యక్తిత్వం సంపూర్ణం గా నిజాయితీ ఐనది అనటం లో అర్ధం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం లో పరస్పర విరుధ్ధ అంశాలు ఎంత తక్కువ గా ఉంటే ఆ వ్యక్తి అంత నిజాయితీ పరుడి గా కనపడతాడు.

శ్రీ శ్రీ ఆవేశం లో నిజాయితీ కనపడుతుంది…అంటే తనకొచ్చిన ఆవేశాన్ని సూటిగానే కవిత్వం రూపం లో వెళ్ళగ్రక్కాడాయన. అలానే ఒక ఆదర్శ లోకాన్ని చూసి, దాని గురించిన తన ఇష్టాన్నీ కవిత్వ రూపం లో చెప్పాడు. ఈ ఇష్టం లోనూ నిజాయితీ ఉంది. “ఆ ఆదర్శ లోకానికి మన వాస్తవ లోకం నుంచీ దారేమిటొ ఆయనకు తెలుసా?” అనేది వేరే ప్రశ్న.
త్రాగుడు దృక్కోణం లో చూసినప్పుడు, శ్రీ శ్రీ తాగుడు లోకూడా నిజాయితీ ఉంది.నిజాయితీ గానే తాగాడాయన. అలానే స్త్రీ లోలత్వం లో కూడా నిజాయితీ ఉంది. స్త్రీ వాంఛ వచ్చినప్పుడు తీర్చుకొన్నాడు. కానీ ఆ కవిత్వాన్ని ఆయన ప్రవర్తన పోల్చినప్పుడు ఆయన జీవితం హిపోక్రసీ అవుతుంది.
కానీ,  ఆయన కవిత్వం లో ఉన్న ఆదర్శాల దృక్కోణం నుంచీ( కవిత్వాన్ని reference point గా  చేసుకొని)  తాగుడుని చూసినప్పుడు  శ్రీ శ్రీ అనే వ్యక్తి హిపోక్రాట్ అవుతాడు.
అదే ఆయన కవిత్వం వలన ఉత్తేజం పొంది సాయుధ పోరాటం లోకి దిగిన వాళ్ళు (శ్రీ శ్రీ గారి ఊగరా ఊగరా కవిత, అలా చనిపోయిన ఒక వ్యక్తి గురించి) ఈ విషయం లో శ్రీ శ్రీ కంటే చాలా తక్కువ హిపోక్రాట్స్ అయిన వ్యక్తులు.  ఆవేశం తెచ్చిపెట్టుకొని కాలిక్యులేటెడ్ గా ఉపన్యాసాలిచ్చే రాజకీయ నాయకులు   శ్రీ శ్రీ కంటే చాలా చాలా పెద్ద హిపోక్రాట్స్.

ఏ ఆదర్శమూ చెప్పకుండా మేము దోపిడీ చేస్తున్నాము అని, అలానే చెప్పినట్లు గా దోపిడీ చేసే వ్యాపారులు తక్కువ హిపోక్రాట్స్ అవ్వవచ్చేమో కానీ, వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం. కాబట్టీ వీరి విషయం లో “హిపోక్రాట్స్ కాకపోవటాన్ని” అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. మనమంతా ఏదో ఒక విషయం లో హిపోక్రాట్స్ మే. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటేతెలుస్తుంది. శ్రీ శ్రీ  హిపోక్రాట్ అవ్వకుండా ఉండటం ఆయనకు మరింత వన్నె తెచ్చేదేమో కానీ, ఆయన హిపొక్రాట్ అవ్వటం వలన ఆయన కవిత్వం లోని నిజాయితీకి ఏమీ మచ్చ లేదు. ఇక ఆయన వ్యక్తిత్వం దగ్గరికి వస్తే, మచ్చ పడనే పడింది.

****************************

చివరి గా……, ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు మనలో అంతస్సంఘర్షణ జరుగుతుంది. మనలోని మంచి వాడు ఆ పని వద్దంటాడు. చెడ్డ వాడు చెయ్యమంటాడు.కానీ బయటి వారి దృష్టి లో నువ్వు ఒక్క మనిషివి. కాబట్టీ నువ్వు అప్పుడు చేసిన చెడ్డపని అంతకు చేసిన మంచి మాట కంటే విరుధ్ధమైనదైతే, బయటి వ్యక్తులు నిన్ను హిపోక్రాట్ అంటారు. కానీ నీకుముందు నుంచీ తెలుసు నీ లోనే మంచి మనిషీ చెడ్డ మనిషీ ఉన్నారని. వాళ్ళు ఇద్దరూ సమయాన్ని బట్టి బయట పడుతున్నారనీ. కాబట్టీ  మన దృష్టి లో మనమే హిపోక్రాట్స్ అవ్వటం చాలా తక్కువ గా జరుగుతుంది. మనం రెండు నాల్కల తో మాట్లాడినా ఆ విషయం మన అంతరాత్మకు తెలుసు. మన ఆలోచనలన్నీ మన అందుబాటులోనే ఉంటాయి కదా.   కాబట్టీ వైరుధ్యం ఉండదు.  ఆలోచనలూ, చేతలూ, ప్రవర్తనా అన్నీ స్వార్థం (Reference point) కోసమే అని తెలిసినప్పుడు వైరుధ్యం పోతుంది కదా..ఇతరులకు అలా కాదు.
మనకు తెలియకుండా మనం హిపోక్రాట్స్ అవ్వవచ్చు గానీ, మనకు తెలిసీ మనం హిపోక్రాట్స్ అవ్వటం(మన దృష్టి లో-Self image) కష్టం.  తాను సమాజందృష్టి లో హిపోక్రాట్నని తెలిసీ తన ఆలోచనలనీ,చేతలనీ, ప్రవర్తన నీ అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకం గా వాడుకొనేవాడిని హిపోక్రాట్ అనాలా వద్దా? అన్నా అనక పోయినా అటువంటివాడి(గిరీశం టైపు?) వలన సమాజానికి నష్టంకాబట్టీ వాడికి సమాజం విలువ ఇవ్వనవసరం లేదు.

***************

నాకు తెలిన ఒక తత్వ వేత్త ప్రకారం మనిషి పనులూ,ఆలోచనలన్నీ తన భౌతిక,మానసిక, ఆధ్యత్మిక, భావోద్వేగ పరమైన స్వార్థం లేక సర్వైవల్ కోసం. కాబట్టీ మనిషి స్వార్థం దృష్టి తో చూస్తే మనిషి పనులలో, ఆలోచనలలో వైరుధ్యమే లేదు. అన్నీ స్వార్థం కోసమే. అంటే స్వార్థం దృష్టితో చూస్తే హిపోక్రసీ లేదా? మనిషి చేసే పనులన్నీ సర్వైవల్ కోసం అనేది కూడా నమ్మబుధ్ధి కాని ఒక అంశం. మనిషి స్వార్థానికి సంబంధం లేని అనేక ర్యాండం పనులు కూడా చేస్తాడెమోనిపిస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

26 thoughts on “మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా?”

  1. చాలా బాగా రాసారు.
    అసంబధ్ధం అనుకోకపోతె, జాజిమల్లిగారి బ్లాగులో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి తన అభిమాన నటుడు మధ్య ఇరుక్కుపోతాడు..ఒక సమస్యలో వారి దారులు వేరని తెలిసినప్పుడు.
    మీరు ఇంతకుముందు చెప్పిన ఒక విషయం, చంటి పిల్లలు , జంతువులు పక్షులు ప్రకృతికి దగ్గరగా వుంటారు అని అన్నది నాకు ఆ టపా చదివాక నాకు అర్ధం అయ్యింది.
    ఎందుకో నాకు తెలియదు మీ భావాలు చాలా రోజుల నుండి నాకు ఎరుక అని అనిపిస్తుంది.వాటిని మళ్లీ మీ దగ్గర వింటున్నానని అనిపిస్తుంది.

    మెచ్చుకోండి

  2. ఆ బ్లాగు నేను కూడా చదివాను..ఆ చిన్న పిల్ల వాడి ప్రవర్తన గురించి రాసింది నాకు గూడా నచ్చింది.
    ప్రతి మనిషి భావాలు మిగిలిన మనుషుల భావాల వెయిటెడ్ సం కదా. X మీ భావమైతే, X1,X2,X3,X4 మిగిలిన వారి భావాలైతే, X1= w1X1 + w2X2+ w3X3+…..
    రచయితలు తమలోఉండే X1, X2, X3 లను బయటకు తీసి పాత్రలను సృష్టిస్తారు.
    ఇంకొక విషయం…బ్లాగుల్లో చాలా వరకూ సామాజిక విషయాలు చర్చిస్తాము. సామాజికం గా ఒకే పరిస్థితుల్లోంచీ వచ్చిన వాళ్ళ భావాలు కూడా ఒకరికొకరికి ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. రెండు మూడు విషయాలలో వారి అభిప్రాయాలను విని మిగిలిన విషయాలలో వాటిని ఎక్స్ట్రాపొలేట్ చేసుకొనవచ్చును…
    పైగా ఒకే విధమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళ బ్లాగ్ ల నే మనం ఫాలో అవుతాం. మనని నొప్పించే అభిప్రాయాలున్న బ్లాగులని ఫాలో అవ్వం కదా!
    మన మెంటాలిటీ లాగానే మనతో ఏకీభవిచేవాళ్ళ మెంటాలిటీ కూడా మనకి ప్రెడిక్టబుల్ గా ఉంటుంది.

    మెచ్చుకోండి

  3. చాలా బాగా చెప్పారు. ‘హిపోక్రసీ ‘ విషయంలో నాకు కూడా ఇటువంటి అభిప్రాయాలు-ఆలొచనలు ఉన్నయి. ఖానీ ఒక్క వాక్యంతో ఎకీభవించలేకపొతున్నా – “తాను సమాజందృష్టి లో హిపోక్రాట్నని తెలిసీ తన ఆలోచనలనీ,చేతలనీ, ప్రవర్తన నీ అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకం గా వాడుకొనేవాడిని హిపోక్రాట్ అనాలా వద్దా? అన్నా అనక పోయినా అటువంటివాడి(గిరీశం టైపు?) వలన సమాజానికి నష్టంకాబట్టీ వాడికి సమాజం విలువ ఇవ్వనవసరం లేదు” -అలా ప్రవర్తించేవారందరూ ‘అవకాశవాదులు ‘ కారు.

    మెచ్చుకోండి

  4. శ్రీశ్రీ విగ్రహ విధ్వంసం తనకు తానే చేసుకున్న వాడు. సమాజం తనను ఒక మహాకవిగా పైకెత్తిపెట్టిన నాడు ‘అనంతం’ ద్వారా తన మహావృక్షాన్ని కొమ్మలు రెమ్మలు నుండి కూకటి వేళ్ళదాకా పెకలించే ప్రయత్నం చేసాడు. ఏదీ దాచుకోలేని తనమే ఈనాడు సమాజంలో ఆయన స్థానన్ని నిలబెట్టింది. యిది అందరికీ సాధ్యంకాదు. తను రాసిన రాతలను కూడా సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా నరుక్కుంటూ వచ్చాడు. సామాన్య ప్రజలెవరికీ అర్థంగానీ మహాప్రస్థానం లోని పదబంధాలనుండి ఖడ్గసృష్టి నుండి మరోప్రస్థానం దాకా ఆయన జన సామాన్య పరిభాషలో కవిత్వం చెప్పే స్థాయికి చేరడం తనలోని పాండిత్యాన్ని విధ్వంసం చేయడమే. నిన్నటి జట్కావాలా యిందుకు నిదర్శనం. కానీ చాలామంది ప్రగతివాదులుగా ఫోజులిచ్చే మేధావులు ఆయన మహాప్రస్థానంతో ఆగిపోయినట్లుగా ప్రచారం చేస్తూ, మరోప్రస్థానాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఆయన యిందులో శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎత్తిపట్టడమే.

    హిపోక్రసీ గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆలోచింపదగ్గవిగా వున్నాయి. ఏ మనిషీ పుట్టుకతో సచ్చీలుడు కాలేడు. తను పెరిగిన వాతావరణం, అవసరాలు మనిషిని వివిధ రూపాలలోకి పరకాయ ప్రవేశం గావిస్తాయి. కానీ తనకంటూ వున్న నిజరూపం దాచుకోలేక తప్పక బయటపడ్తుంటాడు వివిధ సందర్భాలలో. ఈ డైమెన్షన్స్ ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం హిపోక్రసీగా చెప్పవచ్చుననుకుంటా. ఏటికి ఎదురీది నిలిచే నిబ్బరం అందరికీ సాధ్యమా? మంచి చర్చకు తోవ చూపినందుకు కృతజ్ఞతలు.

    మెచ్చుకోండి

  5. ఈ మధ్యన మీరు, కృష్ణ గారు పుస్తక విశ్లేషణలు బాగానే చేస్తున్నారు. నాకు మాత్రం పుస్తకం చదవడం అనే అలవాటు తప్పి 4,5 సంవత్సరాలు దాటిపోయింది. అనుకోని సమస్యలతో పుస్తకాల నుంచి దూరం అయ్యాను. అడపాదడపా స్వాతి లాంటివి చదువుతాను. ఈమధ్య కాలంలో కష్టపడి చదివిన పుస్తకం “ఒక యోగి ఆత్మకథ” అంతే.

    మెచ్చుకోండి

  6. నేను ఏమీ పుస్తక విశ్లేషణ చేయలేదండీ! కృష్ణ గారు చేశారు, రంగ నాయకమ్మ బలిపీఠాన్ని…ఒక యోగి ఆత్మ కథ చదువుదామనుకొన్నాను కానీ అవకాశం రాలేదు. మీకు వీలైతే అ పుస్తకాన్ని పరిచయం చేస్తారా?

    మెచ్చుకోండి

  7. నేను కూడా పెద్దగ ఏమి చదవలేక పోయాను ఈ మధ్యన శ్రీవాసుకి గారు!ప్చ్…ప్చ్.మంచి పుస్తకాలు వుంటె సజెస్ట్ చేయండి ప్లీజు.

    మెచ్చుకోండి

  8. శ్రీ బొందలపాటివారికి,నమస్కారములు.

    శ్రీశ్రీ రచనలు గురించి నాకు అసలు తెలియదుకానీ, మీ విశ్లేషాత్మక వ్యాసం చాలా బాగుంది.
    భవదీయుడు,
    మాధవరావు.

    మెచ్చుకోండి

  9. Thanks Madhavarao gaaru.
    మన వ్యక్తిత్వం అనేది మనం నమ్మిన సిధ్ధంతం ప్రకారం ఏర్పడదు అని చెప్పటానికి ప్రయత్నించాను. మనం నమ్మిన సిధ్ధాంతం మన అంతరత్మ లో భాగమైన తరువాత,మన వ్యక్తిత్వాన్ని సిధ్ధాంతానికి అనుగుణం గా చేసుకొనటానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇందులో ఎవ్వరూ పూర్తి గా సఫలీకృతులు కాలేరు.

    మెచ్చుకోండి

  10. 15 minutes of my life that I will never get back !
    చెఱకుఁగఱ్ఱతోఁ తాటిచెట్టు కొలచినట్టుంది ఈ వ్యాసం।
    జిడ్డు కృష్ణ మూర్తి మాట విని మీరు శ్రీశ్రీ మీద పెట్టిన దృష్టి మీమీద మీరే పెట్టుకుంటే అదే ధ్యానం అయ్యిండేది, పూటలో ఏదో పనికొచ్చే పనీ అయ్యేది।

    మెచ్చుకోండి

  11. There is a reason why great people are great people. If we take out the personal life of Sri Sri, he did what he liked the most in life. Helping people and inspiring them to resolve social problems

    we have to be objective and take out the emotional part of ones personal life

    By the way I like Sri Sri a lot. It would be interesting to think how he would have used Facebook, Twitter, Yammer …. to get the message out

    Cheers

    మెచ్చుకోండి

  12. నాకు తెలిన ఒక తత్వ వేత్త ప్రకారం మనిషి పనులూ,ఆలోచనలన్నీ తన భౌతిక,మానసిక, ఆధ్యత్మిక, భావోద్వేగ పరమైన స్వార్థం లేక సర్వైవల్ కోసం. కాబట్టీ మనిషి స్వార్థం దృష్టి తో చూస్తే మనిషి పనులలో, ఆలోచనలలో వైరుధ్యమే లేదు. అన్నీ స్వార్థం కోసమే. అంటే స్వార్థం దృష్టితో చూస్తే హిపోక్రసీ లేదా? మనిషి చేసే పనులన్నీ సర్వైవల్ కోసం అనేది కూడా నమ్మబుధ్ధి కాని ఒక అంశం. మనిషి స్వార్థానికి సంబంధం లేని అనేక ర్యాండం పనులు కూడా చేస్తాడెమోనిపిస్తుంది.

    idi annadi evaru ?ayana peru,rachanalanu teliyajeyagalara ?

    మెచ్చుకోండి

  13. ఒక ఆలోచన పరుడి లో ఘర్షణ .. వివేచనకు లోనైన ఘర్షణ తాత్వికత లో పడిన ఘర్షణ ఏ సామాజిక అంశంలో జొరబడిన వ్యక్తికరణలు అయినా ఇంచు మించు ఒక్క లాగే వుంటాయి అరె ..! ఈ ఆలోచన నాదేకదా ! నాకు తెలిసినదే కదా అనిపిస్తుంది . అది సహజం .నిజాన్ని నిగ్గదేసే ఒక కవిలో , ఒక రచయితలో , ద్వంద
    ప్రవృత్తిని బలహినతలోని ఒక కోణాన్ని విశ్లేషణ పేరుతో సమర్దించడం వల్ల మేలైన మోరల్ని వదులు కున్న వాళ్ళం అవుతాము .నిజమె మనలో ఇద్దరుంటారు . మనలో మనమే ఘర్షణ
    పడకుండా రెండో వాడిన ఓడించకుండా వెళుతూ వుంటే కదిలేది కదిలించేది మన కలంలో పరవళ్ళు తొక్కి ప్రయోజనమేమిటి ..?

    మెచ్చుకోండి

  14. సఫిలీ కృతము కావటానికి నిరంతరం అంతర్ భహిర్ లోతుల్లో జరిపే యుద్దమే కదా సాహిత్యం .సాహితి కారుల్లోని
    ద్వంద్వ ప్రవరుత్తుల్ని ఇంకా లోతుగా చర్చించండి. అక్షరం అర్థమయ్యేముందు కవి ఇది సత్యమేనా … నేను నా ఆచరణ సత్యం వైపు ఉందా అని వంద సార్లు ఆలోచించాలి . ధన్యవాదములతో

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి