ఇజం -నిజం

ఇజం -నిజం

—————-

వాస్తవమనే బాలుడి తో, “దారపు లంకె”, తెగిన గాలి పటమే ఇజం. దారం తెగిన గాలి పటం ఒక దిశ లేకుండా పక్కవాళ్ళ పెరట్లో చెట్టుకు చిక్కుకొనే అవకాశం ఉన్నట్లు, ఇజాలన్నీ ఒక్కోసారి తమ పరిధి లో లేని అంశాల కు అన్వయించటానికి ప్రయత్నిస్తుంటాయి

– వాస్తవ అంశాలు,సమస్యల నుంచీ మన మది లో ఆలోచనలు పుడతాయి.

– ఆ ఆలోచనలు constructs గా మారతాయి.

-ఈ constructs కి వాస్తవం తో సంబంధమున్నంతవరకూ, అవి మంచి ఉపకరణాలుగా , సమస్యా పరిష్కారానికి ఉపయోగ పడతాయి.

-constructs కి వాస్తవం తో సంబంధం తగ్గటం మొదలైన దగ్గరినుంచీ, వాటిని వాస్తవ పరిధి బయటి సమస్యలకు అప్లై చేయటం మొదలు పెడతాం (దీనికి మనుషుల ఎమోషనల్, మానసిక అవసరాలు ముఖ్య కారణం).

-అంటే ఇజం పుట్టుక మొదలయిందన్న మాట.

ఉదాహరణకు రేషనలిజం ను తీసుకొందాం..

– మూఢనమ్మకాలు వంటి వాస్తవ సమస్య ఉన్నాయి.

-వాటికి ని reasoning and knowledge ద్వారా ఎదుర్కోవచ్చనేది ఆలోచన.

-దాని నుంచీ రేషనల్ థింకింగ్ అనే construct ఏర్పడుతుంది.

-రేషనల్ థింకింగ్ అనే mental construct ని, మానవాసంబంధాలు,మంచి చెడులు, లాంటి, దాని పరిధి బయట నున్న విషయాలకు ఎప్పుడైతే అప్ప్లై చేయటం మొదలు పెట్టామో, దానికి వాస్తవం తో సంబంధం తగ్గటం మొదలు పెట్టింది.

-రేషనలిజం అనే ఆదర్శం పుట్టుక మొదలైంది.

ఇజాలు తమ పరిధి లోని వాస్తవ అంశాల విషయం లో తమ relavance ని పోగొట్టుకోకుండా ఉండాలంటే, తమ constructs ని వాస్తవం తో sync అయేట్లు, నిరంతరం పని చేయాలి. ఉదాహరణకు ప్రతి దానికీ ఒక కారణాన్ని వెతికే రేషనలిజం, ఆ పద్ధతి, సృష్టి కి కారణం వెతికే విషయం లో పని చేయదని తెలుసుకొంటే, అది upgraded rationalism అవుతుంది. లేకపోతే కొన్నాళ్ళకి, మూఢవిశ్వాసాలన్నీ పోయినాక, irrelavant dogma గా మిగిలిపోతుంది.

పై ఉదాహరణ ఏ ఇజానికైనా అప్లై అవుతుంది.communism,dalitism,scientism,feminism,gandhism,…ఏ ఇజానికైనా..