నరేంద్ర మోడీ ని సపోర్ట్ చేయాలని…

నరేంద్ర మోడీ ని సపోర్ట్ చేయాలని నా బ్లాగు లో ఓ సంవత్సరం కిందట ఓ టపా రాసుకొన్నాను. “నే సపోర్ట్ చేయమన్నందుకే దేశం మొత్తం స్పందించి..ఆయనను ఎన్నుకొని ప్రధాన మంత్రిని చేసింది”,………….అని నేననటం లేదు.సపోర్ట్ చేయటానికి నే చెప్పిన కారణాలన్నిటి వలనా సపోర్ట్ చేసింది అని మాత్రం చెప్పగలను. అదే టపా లో మోడీ ని ఏ కారణాల వలన సపోర్ట్ చేయనవసరం లేదో కూడా చెప్పాను..ఆ యన “PM” అయినాక ఆ కారణాలన్నీ ఒక్కొక్కటీ నిజమవుతూ వస్తున్నాయి.
ఏమిటీ?.. “అన్నీ నా బ్లాగులోనే ఉన్నాయిష అంటున్నావు?” అనంటున్నారా?
అక్కడికే వస్తున్నా..మోడీ ప్రధాని అయిన తరువాత జరుగుతాయని నే భయపడిన వాటి లో చివరిది “విద్య కాషాయీకరణ”. అది ముందు గా జరుగుతోంది..సాంప్రదాయ శక్తులు..ముఖ్యం గా నార్త్ లో “అన్నీ మన వేదాల లోనే ఉన్నాయిష” నుంచీ, “అన్నీ వేదాల్లో మాత్రమే ఉన్నాయెహే!”, అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ళ కి, “లేవన్న వాడి నాలుక్కోస్తా!” అనే పరిస్థితి వస్తుందేమో తెలియదు.
మోడీ గారు, హిట్లర్ వంటి మూర్ఖుడు కాదు. ఆయన ప్రసంగం విన్నవారికెవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఆయనకు జనాలు ఇచ్చిన mandate ముఖ్యం గా ఆర్ధికపరమైనది.కాంగ్రెస్ తో జనాలు విసిగిపోవటం ఇంకో కారణం. కాబట్టీ “యుధ్ధాలూ, అల్లర్లూ”, వంటి నా మిగిలిన భయాలు నిజమవ్వకుండా ఉండాలని కోరుకొంటున్నాను. మోడీ గారికి ఆ విజ్ఞత ఉందని నా ప్రస్తుత అభిప్రాయం.ఆ అభిప్రాయం తప్పు కాకూడదని కోరుకొంటున్నా