వినాయక చవితి..అప్పుడూ ..ఇప్పుడూ..

నా చిన్నపుడు వినాయక చవితి అంటే కొంత ఆసక్తీ, కొంత భయమూ.. పొద్దున్నే స్నానమైన తరువాత, పత్రి కోసం పిల్లలందరమూ పెరట్లమీదా, దొడ్ల మీదా పడే వారం. మారేడాకు శివాలయం వెనుక దొరుకుతుంది. శివుడికి ప్రీతి పాత్రమైనది కాబట్టీ ఆయన కొడుకు కి కూడా ఇష్టం, జమ్మి ఆకులు బడి గ్రౌండ్ వెనుక పొదల దగ్గర ఉన్న జమ్మి చెట్టు కొమ్మలను విరగదీస్తే వస్తాయి, వెలగ పళ్ళ కోసం ఆ పక్కనే ఉన్న వెలగ చెట్టు ఎక్కాలి. కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టీ ఒక గడ కర్ర తో కొట్ట వలెను.లేక రాళ్ళు రువ్వవలెను. మాలో శీను గాడికి ఆత్ర మెక్కువ. వాడు ఓ పది కాయల పడగొట్టి కానీ ఊరుకొనే వాడు కాదు. కామేశం గాడు వాడిని మందలించే వాడు, “ఒరేయ్, ఈ పళ్ళన్నీ శాస్త్రానికి ఒకటో రెండో అయితే చాలు రా, పండగ ఉద్దేశం ముఖ్యం గా “ఈ పళ్ళూ ఈ ఆకులూ ఉంటాయని తెలవటానికని” మన తెలుగు మాస్టారు చెప్పలా?” అనేవాడు.
ఇలా పత్రి మొత్తం ఓ పైసా కూడా ఖర్చు పెట్టకుండానే సేకరించేవారం. పైసలు ఖర్చు పెట్టేది మాత్రం వినాయకుడి బొమ్మకీ, ఆయన గొడుగుకీ. అప్పట్లో పర్యావరణ స్పృహ ఇప్పటి లా లేదు, కాబట్టీ బజార్లో రంగు గణేశులే దొరికే వారు. వినాయకుడి పాదాల దగ్గర ఎలుక లేకుంటే, ఆ బొమ్మ కొనకూడదు! వినాయకుడికి పైన చతురస్రాకారం లో ఉండే ఒక చక్క ఫ్రేం వేలాడదీసే వాళ్ళం (దీనిని ఏమంటారో మరిచి పోయాను. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి). దానికి,  కరకట్ట కింది మొక్క జొన్న తోటలలోంచీ తెచ్చిన కండులను కట్టే వాళ్ళం. ఇంకా ఆకులను గుచ్చే వాళ్ళం.
వినాయకుడి కోసం ఇంట్లో శాశ్వతం గా ఒక పీట ఉండేది.
వంటింట్లో కుడుములూ ఉండ్రాళ్ళూ తయారవుతూ ఉండేవి. కానీ వాటిని తినటానికి లేదు. పూజ అయేదాకా ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదని పెద్దవారి ఆజ్ఞ.  “ఊరికినే వంట గది చుట్టూ తిరగకపోతే, పుస్తకాలకి కాస్త పసుపు రాసి, “ఓం” రాసుకోవచ్చు గా!”, అని ఓ కేక. “అవును, పుస్తకాలు పూజ దగ్గర పెడితే ఆ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి. పూజ దగ్గర పుస్తకాలు పెట్టాలంటే వాటికి పసుపు రాయాలి. “ఓం” అని తెలుగు లో రాయాలి, అప్పటికి సంస్కృతం “ఓం” ఎలా రాయాలో తెలియదు మరి!
పూజ మొదలవుతుంది. కడుపులో వినాయకుడి వాహనాలు పరుగెడుతున్నా, శ్రధ్ధగా మంత్రాలు వినేవాడిని. వినాయక వ్రత కల్పం కధ పుస్తకం ఓ “యాంటిక్”. అది పది సంవత్సరాల నుండీ వస్తున్న ఓ వారసత్వ సంపద.  ముందు స్తోత్రం. తరువాత పూజ..
బిళ్వ పత్రం..ఆ మారేడాకు ఇలా ఇయ్..
సరే..ఆ శమీ పత్రం ..జమ్మి ఆకు..
కదళీ ఫలం..అరటి పండు ఏదీ..?
దర్భ..గడ్డిపోచ..ఇంకా..బదరీ పత్రం..రేగు ఆకు..
ఇలా పూజ చేసే పెద్దలకి అందిస్తూ ఉండే వాళ్ళం. దానితో ఏ పత్రం అంటే ఏమిటో, సంస్కృతం అప్పటికి చదవక పోయినా, కొంత అర్ధమయేది. మరుసటి సంవత్సరానికి కొంత గుర్తుండేది. మధ్య మధ్య లో ఇంట్లో పిల్లలకి ఏదో ఒక అల్లరి పని కి తిట్లు పడేవి. తరువాత పెద్ద వాళ్ళ సమర్ధన, “ఈ రోజు తిట్టించుకొంటే మంచిదే లేవే!”, అని.

“ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ తద్ది కీ..”
అంటూ తెలుగు లో పద్యాలు కూడా ఉండేవి..మధ్యాహ్నం ఏ రెండింటికో వ్రతం పూర్తి అయ్యేది. కడుపు నక నక లాడుతూ ఉంటే ఉండ్రాళ్ళూ, కుడుములూ లాగించి, గారెల పైన పడే వాళ్ళం.
ఓ సంవత్సరం వ్రత కల్పం పుస్తకం పోయింది. కొత్త వ్రత కల్పం పుస్తకం మార్కెట్ లో కొంటే, చాలా చిన్నదైపోయింది. అంతా షార్ట్-కట్..అంతేనా?, కథ మారిపోయింది. అంతకు ముందు ఉండే మూల కథ  మారకపోయినా, కొన్ని చిన్న మార్పులు వచ్చాయి.

సాయంత్రం వినాయక చవితి పందిళ్ళ లో ఘంటసాల భక్తి పాటలు పెట్టే వారు. హరి కథా కాలక్షేపం జరిగేది. హరి కధ చెప్పే ఆయన(భారతం చెప్పే భాగవతార్) పద్యాలు చదువుతూ మధ్య మధ్య లో అనేక (సంబంధం ఉండీ ఉండని) పిట్ట కథలలోకి దిగుతూ అలరించే వాడు. అసలు కథ భారతమైనా, అసలు కథ కంటే ఆ పిట్ట కథలే బాగుండేవి. ఉదాహరణ కి శల్యుడు మేకపోతు గాంభీర్యం చూపించాడు అని, మేకపోతు గాంభీర్యమంటే ఏమిటొ వివరించటానికి పులీ, మేకా, గుహా..కథ వినిపించే వారు. మధ్య మధ్య న పద్యాలు పాడుతూ, చేతి లో చిడతలు(?) వాయిస్తూ చిన్న పాటి చిందులు కూడ వేసే వారు.   ఇప్పుడు హరి కధ చెప్పే వారు రాష్ట్రం లో ఎంత మంది మిగిలి ఉన్నారో!

********************

కాలం తో పాటు వినాయక వ్రతం లోనూ, నా లోనూ కూడా మార్పులు వచ్చాయి.
నేను సాంప్రదాయక దేవుడిని నమ్మటం మానేశాను. పట్టణాలకు చేరాను. ఇప్పుడు బజారుకెళ్ళటం ఇంత పత్రి కొనుక్కొని రావటం. ఆ పత్రి లో ఏముందో కూడా ఒక్కోసారి తెలియదు.(మన సంచి లో తక్కువా, రోడ్డు పై కాళ్ళకింద నలుగుతూ ఎక్కువా ఉంటోంది పత్రి ఈ మధ్యన ). ఐదు నిమిషాలలో చదివి పారేయగల వినాయక వ్రత కల్పాలు వచ్చాయి.
వ్రతానికి కూర్చొంటే ( 😦 పాపం నేను), ఇంగ్లీషు మీడియం లో చదివిన పట్నపు శ్రీమతి చదివే స్తోత్రం కర్ణ కఠోరం గా వినపడి, ఆగలేక నేనే సరిగా చదివి దాని అర్ధాన్ని వివరించటం. పిల్లలకి వినాయక కథ ని “టాం అండ్ జెర్రీ” తరహా లో వినిపించటం. కావలసిన ఫల పత్రాల లో ఒకటీ పత్రి లో కనిపించదు (ఏక వింశతి పత్రాణి). అన్నీ కలిపి వినాయకుడి ముందు పెట్టి, శ్లోకం చదవటం.  ..ఇదీ పరిస్థితి.నాస్తికులు కూడా త్యాగరాయ కృతిని విని ఆనందించినట్లు, నేను కూడ వినాయక పూజను చేసి సంతోషించటం నేర్చుకొన్నాను.

పిల్లలు ఆకలి కి తట్టుకోలేరు కాబట్టీ వాళ్ళకి పొదున్నే బొజ్జ నింపేయటం మంచిది. ఇక వాళ్ళ బొజ్జ నిండా ప్రశ్నలే!
“డాడీ! గణేశా ని అంత చిన్న జెర్రీ ఎలా మోయగలుగుతుంది?”, లాంటి ప్రశ్న లకి సమధానం ఇవ్వటం.

ఇక ముందు ముందు ఎలా మారబోతోందో ఈ వ్రతం..ఇంటర్నెట్ సైట్లు పెట్టుకొని అయిందనిపించటం, మాల్స్ లో పత్రి విక్రయించటం, పత్రి వేసే యంత్రాలూ, మంత్రాలు చదివే యంత్రాలూ వగైరా వస్తాయేమో!కెల్లాగ్స్ కుడుముల పాక్ నీ, ఎంటీ ఆర్ ఉండ్రాళ్ళ రీఫిల్ నీ వాడవలసి వస్తుందేమో!
…ఆ పూజకి వేళయినట్లుంది, “వ్రతానికి రండీ..” అని వినిపిస్తోంది దేవుడి గది లోనుంచీ.
ఇక ఉంటానండీ. నండ్రి. ధన్యవాదగళు!

నా దేవుడున్నాడా పుస్తకం ప్రింట్ ఎడిషన్

నా దేవుడున్నాడా పుస్తకం ప్రింట్ ఎడిషన్ ఇక్కడ పొందుపరచాను..పుస్తకం లుక్స్ గురించీ, కంటెంట్ గురించీ, దయచేసి మీ మీ సజెషన్స్ తెలియజేయండిIsthereGod_headings_nostmt-signed

సమాన హక్కులా, సమాన అవకాశాలా,సమాన బాధ్యతా,సమాన గౌరవమా లేక సమాన అధికారమా…?

ప్రజాస్వామ్యం లో అనేక సమూహాలు (కులాలు, స్త్రీలు,పురుషులు, మతాలు, ప్రాంతాలు) సమానత్వాన్ని డిమాండ్ చేస్తుంటాయి. ఉద్యమాలు చేస్తాయి.

ప్రజాస్వామ్యం,కాపిటలిజం:
ప్రజాస్వామ్యమంటేనే నంబర్ గేం.ఎందుకూ పనికి రాని మూర్ఖుడు వేసే వోటు కీ, సామాజిక నిపుణుడు వేసే వోటుకీ ఒకటే విలువ.(సామాజిక నిపుణుడు సమాజం లోని అందరి  మంచి గురించీ సానుభూతిగా ఆలోచిస్తాడని గారంటీ లేదు. అలాంటప్పుడు అతని ఓటుకు ఎక్కువ విలువ ఉండాల్సిన అవసరం లేదు). కాబట్టీ, ఈ గందరగోళం లో సంఖ్యాబలం లేని అనేక సమూహాలు నిర్లక్ష్యానికి గురవుతాయి. అన్యాయానికి గురవుతాయి. “పదుగురాడు మాట పాటియై ధరజెల్లు”, అన్నట్లు మంద బలం ఎక్కువ గా ఉన్న సమూహాలు వాటి అన్యాయమైన డిమాండ్లని సాధించుకొంటాయి.ఎవరి స్వార్ధం వారుచూసుకోవటం, పక్క సమూహం బాధ ను పట్టించుకోక పోవటం మానవ స్వభావం అనుకొంటా. అయితే అవి సాధించుకొన్నవి చాలా సార్లు privileges మాత్రమే. తమ సంఖ్యా బలాన్ని advantage గా తీసుకొని అన్యాయమైన డిమాండ్లను ముందుకు తెచ్చి, ఇతర నోరులేని (సంఖ్య లేని) వర్గాలకి అన్యాయం చేసేలా, కొన్ని చట్టాలని తెస్తాయి.ప్రజాస్వామ్యం లో డబ్బున్నోడు ప్రచారం చేసుకొని జనాలకి బ్రెయిన్ వాష్ చేసి,విద్వేషాలు రగిల్చి (remember Trump and Brexit?) ఓట్లు వేయించుకొని అధికారాన్ని కొల్ల గొడతాడు. (అది కుదరక పోతే, డబ్బూ పదవీ ఎర చూపి ప్రజా ప్రతినిధులనబడే సామాగ్రిని కొంటాడు). లోపల్లోపల పచ్చి శాడిస్ట్ అయినవాడు కూడా పైకి జెంటిల్మేన్ లా ఫోజు కొట్టి, ప్రచారం చేసుకొని అందలాలు ఎక్కుతాడు.(నిజాయితీ,సానుభూతి, ప్రేమ అనేవి ఈ వ్యవస్థ లో ఎక్కడైనా కనపడతాయా, ఒక్క స్వలాభం లోతప్ప? )సంఖ్యాబలమున్న గుంపులు, ఐడెంటిటీ ఆధారం గా చిన్న చిన్న నాయకులను demi Gods గా తయారు చేస్తాయి. వారికి లేని దైవత్వాన్నీ, గొప్పదనాన్నీ ఆపాదిస్తాయి. ఈ demi Gods ని ఎవరైనా విమర్శించారా వారికి మూడినట్లే!  ఇక దీనికి కాపిటలిజం(కంజ్యూమరిజం) కూడా తోడయితే అగ్గికి ఆజ్యం పోసినట్లే. అమ్ముడుపోతే షిట్ నైనా మార్కెట్లో పెడతారు. యాడ్స్ (అబధ్ధాల తో)తో ఊదర కొట్టి హానిచేసే వస్తువులను కూడా జనాల చేత కొనిపించి డబ్బులు చేసుకొంటారు. ఉదా: మన తెలుగు సినిమాలు. జనాలు ఎక్కువ మంది కొనని ఎంత గొప్ప వస్తువైనా, స్కిల్ అయినా మూలపడి క్షీణించిపోతుంది. ఈ గభ్భు మొదట గొర్రె జనాల(ఓటు ని నోటు కో మందుకో అమ్ముకొనే వెధవలు)తో మొదలయి చివరికి ఉన్నత విద్యా స్థానాలను కూడా కబళిస్తుంది.

కాబట్టీ, అమెరికోడు చెబుతున్నట్లు ప్రజాస్వామ్యం అనుకొన్నంత గొప్పదేమీ కాదు. న్యాయ వ్యవస్థలూ, రాజ్యాంగాలూ పాత అన్యాయాలని సరిదిద్దే పేరు తో, కొత్త కొత్త అన్యాయలని పుట్టిస్తూ, సమర్ధిస్తూ పోతాయి. ఎవరైనా ఈ వ్యవస్థలని నిందిస్తే వాడికి కంటెంప్ట్ కింద శిక్షలు వేస్తూ ఉంటాయి. సమాజం దృక్పధం ఎంత ఇరుకైతే, ఈ వ్యవస్థ ల పనితీరు అంత అధ్వాన్నం గా ఉంటుంది. మన ఇండియా లాంటి షట్-అప్ సమాజాల లో కొన్నాళ్ళకి నోరు తెరవాలంటే నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ని ఈ చట్టాలూ, బండ గుంపుస్వామ్యాలూ, కోర్టులూ, రాజ్యాంగాలూ కల్పిస్తాయి (ఒక్కోసారి, అవినీతీ, దోపిడీ, రాజకీయాలు, ఖర్చులూ, కోర్ట్లూ, తెలివి తక్కువ శాసనాలూ, ఫైన్లూ, డబ్బుపెట్టి వ్యవస్థని కొనటాలూ చూసి,  ఈ నాగరిక జనారణ్యం లో కంటే, నిజమైన అడవి లోనే ఎక్కువ స్వేచ్చ ఉందేమో అనిపిస్తుంది. అడవి లోనే, “పడిన కష్టానికి ఫలితం దక్కుతుందేమో!” అనిపిస్తుంది.). డబ్బున్నోడూ, గభ్భు-జనాలూ(సంఖ్యా బలం ఉన్న జనాలు, వారి ప్రతినిధులైన రాజకీయ నాయకులు) మాత్రం ఏమైనా మాట్లాడవచ్చు.వారు మాట్లాడేదే political correctness. అదే… నోరూ వాయా లేని జనాల నోటికి ప్లాస్టర్. ఎవరీ నోరూ వాయా లేని జనాలు? డబ్బులేని  బక్క జీవులూ, అగ్రకుల పేదలూ, ఐకమత్యం లేని మధ్యతరగతి కుటుంబరావులూ, వోటు బాంకుగా తయారవని అన్ని వర్గాలు.

సమానత్వం?:

ఇక సమానత్వం విషయానికి వద్దాం. వారికి కావలసినది సమాన హక్కులా, సమాన అవకాశాలా, సమాన బాధ్యతా,సమాన గౌరవమా లేక సమాన అధికారమా…?

Privileges:

వారికి కావలసినవి ఇవేమీ కావు..సమానత్వం ముసుగు లో..తిని కూర్చొని త్రేంచే privileges కావాలి.

కొన్ని శతాబ్దాల క్రితం స్త్రీ ని ఇంట్లోనుండీ కదలనిచ్చేవారు కాదు. స్త్రీని ఓ సంపద గా చూసే వారు. అప్పటి సమాజం శారీరక శ్రమ మీద ఆధార పడేది. నిరంతరం జాతుల మధ్య యుధ్ధాలు జరిగేవి. ప్రజాస్వామ్యం అనేది అప్పటికి లేదు.విద్యా, సాంకేతికత వృధ్ధి చెందలేదు. స్త్రీలు వాళ్ళ శరీర ధర్మం దృష్ట్యా(menstrual cycle and repeated pregnancies) బలహీనులు.స్త్రీ కి ఇంటి బయట రక్షణ ఉండేది కాదు. ఇంట్లో కూడా పురుషుడు ఉంటేనే రక్షణ .అలాంటి సమాజం లో స్త్రీ కి స్వేచ్చ ఇచ్చినా, వారు తీసుకోక మన మొహాన కొడతారు. ఎందుకంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా స్వేచ్చ అనేది స్త్రీ మనుగడని ప్రమాదం లో పడవేస్తుంది. కొన్ని వేల మంది సైనికులు వెంట ఉండే రుద్రమ, ఝాన్సీ వంటి స్త్రీలు ఎక్కడో అధికారం చెలాయించి ఉండవచ్చు.

కాలం మారింది, స్త్రీ విద్యా, బుధ్ధిని ఉపయోగించే ఉద్యోగాలూ, ప్రజాస్వామ్యం, ఓట్లూ, సంఘ సంస్కరణలూ,control over pregnancies due to contraceptives, వినిమయ వాదం వచ్చాయి.సమాజానికి స్త్రీల contribution పెరిగి తద్వారా వారికి పవర్, పవర్ ద్వారా గౌరవమూ గణనీయం గా పెరిగాయి. ఈ సంధి కాలం లో మగాళ్ళు తమ పాత అలవాటు వదలక, ఆధిపత్యం కోసం గింజుకున్నారు. ఈ కాలం లో మగాళ్ళకి privileges ఉండేవి. అంటే సమాజ పరమైన contribution లో ఏవిధమైన పైచేయి లేకుండా కూడా, హక్కులు ఎంజాయ్ చేశారు.

సమాన హక్కులు:

ఇక ప్రస్తుతానికి వస్తే..సమాన హక్కులు డిమాండ్ చేసే వారి నుండీ, ప్రభుత్వాలు సమాన బాధ్యతలు డిమాండ్ చేయాలి. కానీ చేయవు..హక్కుల ఉద్యమాలు చేసేవారు, జాట్ల ఉద్యమంలో లా, ఎంత విధ్వంసం చేస్తే ప్రభుత్వాలు అంత త్వరగా స్పందిస్తాయి.

సమాన గౌరవం:

ప్రతి మనిషీ కీ ఉండే ప్రతిభా, వ్యక్తిత్వమూ అతని పుట్టుక వలన గానీ పెరిగిన పరిస్థితుల వలన గానీ వస్తాయి. స్థూలం గా చూస్తే ఒక మనిషి  జయాపజయాల క్రెడిట్ అతని జీన్స్ కీ అతను పుట్టి పెరిగిన పరిస్థితులకీ ఇవ్వాల్సి వస్తుంది.( ఇదే  తర్కం జంతువులకీ, చెట్లకీ రాళ్ళ కీ వర్తిస్తుంది. కానీ గౌరవం మనం మనుషులకే ఇస్తాం కాకులకీ, మొక్కలకీ కాదు). ఈ వాదన ప్రకారం ఏ మనిషికీ గౌరవం ఇవ్వాల్సిన పని లేదు.లేక అందరు మనుషులకీ ఒక మినిమం లెవల్ లో గౌరవం ఇవ్వాలి. అతను /ఆమె జూదరి కావచ్చు, టెర్రరిస్టు కావచ్చు. ఎవరైనా ఒక మినిమన్ రెస్పెక్ట్ కి అర్హులు.   అందుకే రోడ్ మీద పోయే తెలియని వారైనా, తెలిసిన నేరస్తుడినైనా మనం “మీరు” అని పిలవటం పధ్ధతి. లేక పోతే అందరినీ నువ్వు అని పిలువవచ్చు. కానీ అప్పుడు పెద్ద మనుషులకు కోపం వస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వటానికి ఇంకోకారణం, “నువ్వు గౌరవం ఇవ్వక పోతే నీకు గౌరవం రాదు”.   ఇక మినిమం లెవల్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ గౌరవం పొందాలనుకొన్నపుడు, అది నీ ప్రతిభా, మంచితనమూ, లేక అధికారం ద్వారా వస్తుంది.

ఇక సమాన గౌరవం. గౌరవం అనేది రెండు రకాలు గా వస్తుంది. ఒకటి- అధికారం నుండీ, రెండవ రకం గౌరవం..సమానుల మధ్య ఉండే గౌరవం..ఆయా వ్యక్తుల సమూహాల ప్రతిభ నుండీ.
కొందరు వ్యక్తులకు, తక్కువ గౌరవం ఇస్తున్నారంటే, సమాజానికి వారి contribution తక్కువయినా అయి ఉండాలి, వారు contribute చేస్తున్న రంగానికి డిమాండ్ తక్కువయినా అయి ఉండాలి. లేక వారు అధికార నిచ్చెన లో మరీ తక్కువ మెట్టులో అయినా అయి ఉండాలి.

అధికార నిచ్చెన లోని మెట్లనే అథారిటీ (authority in Job profile) అంటారు. ఒక మనిషి తన ప్రతిభ ద్వారా సాధించే ప్రభావాన్ని బట్టి, సంస్థలలో వారికి అథారిటీ ఇస్తారు. దానిని బట్టే వారి జీతాలు ఉంటాయి. వారి కింది ఉద్యోగులను వారు పీకడం/ఉంచటం చేయగలరు. కానీ కింది ఉద్యోగులు వారి వెంట్రుక ను కూడా పీకలేరు. పవర్ అంటే ఈ అసమానత్వమే!సంస్థ లాభాలకు వారి contribution ని బట్టీ,అర్హత (qualification) ని బట్టీ,  వారు చేసే పనికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ని బట్టీ కూడా వారికి జీతం ఉంటుంది.

పవర్ అనేక రకాలు గా వస్తుంది. ఇతరులకి సహాయం చేయటం, ఇతరులతో ఇచ్చిపుచ్చుకోవటం, ఇతరులని అణచి వేయటం (యుధ్ధాల ద్వారా లేక భౌతిక అణచివేత, మానసిక అణచి వేత)-> వీటన్నిటి ద్వారా పవర్ వస్తుంది.. ఏదేమైనా, పవర్ (అధికారం) ఉన్నచోట సమానత్వం ఉండదు. అధికారం అనేది కమ్యూనిస్టు సమాజాల లో కూడా తప్పదు.అక్కడ కూడా పై అధికారి కింది అధికారిని అప్ప్రైజ్ చేస్తాడు. కానీ కింది వాడు పై వాడిని అప్ప్రైజ్ చేయడు. అంటే కింది వాడి జుట్టు పై వాడి చేతిలో ఉంటుంది, కానీ పై వాడి జుట్టు కింది వాడి చేతిలో ఉండదు. అంటే, ఎంత కామ్రేడ్ అని పిలుచినా, పై వాడికి కింది వాడి మీద అధికారం ఉంటుంది.  వెయ్యి మంది ఒక్కసారి కలిసి చేస్తేనే అయ్యే ఓ పనికి, ఆ పని చేయమని ఆదేశాలు ఇచ్చే అధికారి కూడా కావాలి. ఆదేశాలు వెళ్ళే దిశ లోనే అధికారం కూడా ప్రయోగింపబడుతుంది ).

ప్రజాస్వామ్యమనేది అధికారాన్ని అంతం చేయదు. అలా అంతం చేయటం ఏ వ్యవస్థ లోనూ సాధ్యం కాదు కూడా.ప్రజాస్వామ్యం అధికార స్థానానికి వ్యక్తులను పంపించే ఓ ప్రక్రియ మాత్రమే. అధికారం తో పాటు వ్యక్తికి అన్ని అవలక్షణాలూ వస్తాయి. అధికారం లో ఉన్నవాడు ఎప్పుడూ రాజే..సమానుడు కాదు. అనేక హామీ లిచ్చి అధికారం లోకి వచ్చిన వాడు, తరువాత అధికారాన్ని తన స్వార్ధం కోసం ఉపయోగిస్తాడు. ప్రజల ఇచ్చ ను అతను ప్రతిఫలిస్తాడు కాబట్టీ, అతని కి ఏ మాత్రం ప్రతిభ లేని అంగమయిన బ్యూరోక్రసీ కూడా అతని ఆజ్ఞ పాటించాల్సి వస్తుంది.

ఎప్పుడన్నా ఒక్క సారి (కిరణ్ కుమార్ రెడ్డి సీయం గా ఉన్నపుడు తెలంగాణ ఉద్యోగుల్లా ) వ్యవస్థ లోని అందరూ ఒక అయిడియా తో ప్రభావితం అయి, సీఎం, లేక పీఎం మాట వినక పోతే, అతని అధికారం మొత్తం కుప్ప కూలుతుంది. అందుకే “దాని సమయం వచ్చిన అయిడియా” ను ఎవరూ ఆపలేరంటారు. అంటే అయిడియా అనేది దాన్ని అందరూ అంగీకరించినపుడు అంత పవర్ఫుల్ అన్నమాట. ఇక వ్యవస్థ అనేది, గత సమాజ పరిణామం వలనా, పోరాటాల వలనా ఏర్పడుతుంది. ఆ వ్యవస్థ లో పని చేసే ఉద్యోగులకు జీవనోపాధి కలిపిస్తుంది. ఉద్యోగులూ,జనాలూ తమ జీవికకు భంగం రానంత వరకూ, రొటీన్ గా పెద్ద ఆలోచన లేకుండా,ఒక అలవాటుగా, అనుకరణ గా, రివాజు గా వ్యవస్థ స్ట్రక్చర్ ను ఫాలో అయిపోతారు. ఏదైనా ఒక అయిడియా (ఇండియా లో ముఖ్యం: అస్థిత్వపు భావజాలం) వారిని కదిల్చినపుడు మాత్రమే వారు కాడి కింద పడవేస్తారు.

సమాన బాధ్యతలు:

సమాజానికి తమ తమ contribution బట్టే ఆయా సమూహాల హక్కులుంటాయి.(ఒక్కో సమాజం లో ఒక్కో సమూహం ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుంది. అంటు వ్యాధులున్న సమాజం లో వైద్యుల ప్రభావం ఎక్కువ, మూఢ నమ్మకాలున్న సమాజం లో మంత్రగాళ్ళ ప్రభావం ఎక్కువ. ఇలా సమాజపు అవసరాలను బట్టి గుంపు ప్రభావమూ, పవరూ ఉంటాయి). హక్కులను బట్టే బాధ్యతలు ఉంటాయి. కానీ ఇప్పటి గుంపులు బాధ్యతలు లేని హక్కులను కోరుకొంటున్నాయి. తమ బాధ్యతల గురించి మాట్లడే సమూహా న్ని ఇంతవరకూ ఇండియా లో నేను చూడలేదు.ఇప్పుడు నగరాలలో అమ్మాయిలూ అబ్బాయిలూ పెళ్ళి కి ముందు కలిసి తిరగటం ఎక్కువయిపోయింది. (కాకతాళీయం గా యూ ట్యూబ్ లో కొన్ని ఫోన్ సంభాషణ లు విన్న తరువాత పరిస్థితి ఇంత ముదిరి పోయిందా అనిపించింది). అబ్బాయి అమ్మాయిని వదిలి పెడితే, అమ్మాయిలు నిర్భయ కేసు పెడుతున్నారు (తప్పుడు కేసు). అదే అమ్మాయి అబ్బాయిని వదిలి పెడితే పట్టించుకొనే నాధుడే లేదు. మరి ఈ చట్టాన్ని తెచ్చిన civil society ఆడ వారి హక్కుల కోసం పోరాడింది. నిజమే. బాగుంది. హక్కు తో పాటు బాధ్యత కూడా ఉంటుంది. మరి చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూసే బాధ్యత వారిది కదా?  బాధ్యత లేని హక్కులనే privileges అంటారు. వీటి వలన దీర్ఘకాలం లో కొత్త ఆధిపత్య వర్గాలు ఏర్పడతాయి.

వ్యవస్థా, అరాచకత్వం:

గుంపు contribution ను బట్టే వారికి సమాజం లో గౌరవం వస్తుంది. లేక పోతే యుధ్ధం చేసి, ఇతర గుంపులను అణగద్రొక్కి, అధికారం సంపాదించి తద్వారా గౌరవాన్ని ఇతరులనుండీ బలవంతం గా రాబట్టాలి.ఆడవారు సమాజం లోని అన్ని రంగాల లో (సైన్యం మొదలు పెట్టి, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ట్రక్ డ్రైవింగ్,స్పోర్ట్స్..)  మగవాళ్ళ తో పోటీ పడి సమానం గా రాణించినపుడు, automatic గా సమాన గౌరవం పొందుతారు.ఆడ వారికి ఇప్పుడున్న de jure power , అప్పుడు de facto power  గా మారుతుంది.  అలా కాదంటే, అప్పటిదాకా వెయిట్ చేయలేమంటే, మగవాళ్ళ తో యుధ్ధం చేయవలసిందే! :-). యుధ్ధం లో రక్షణనిచ్చే వ్యవస్థలేమీ ఉండవు. అరాచకత్వం ఉంటుంది. మగాళ్ళు పెట్టిన వ్యవస్థ ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు లేకుండా, వ్యవస్థనే ఓడించటం అంత తేలిక కాదు.స్త్రీలు ఓడిపోతే మళ్ళీ మధ్య యుగాల నాటి పరిస్థితి వస్తుంది. గెలిస్తే స్త్రీస్వామ్యం వస్తుంది….  లేక…. చట్టసభల లో రిజర్వేషన్ల ద్వారా అధికారం సాధించవచ్చు. కానీ రిజర్వేషన్ల కోసం అడుగుతున్నారంటేనే, బాధ్యత లేని privileges కోసం వెంపర్లాడుతున్నట్లు.

Functional equality:

ఆడవాళ్ళు పిల్లలను కనగలరు..పెంచగలరు. మగ వాళ్ళూ ఆ పని చేయలేరు. కానీ మగ వాళ్ళూ అనేక రిస్కీ పనులు చేయగలరు. బండ పనులు చేయగలరు. వ్యవహారాలు నడపగలరు. మగ వారు చేసే పనులను తాము చేయటానికి ప్రయత్నించటం functional equality కోసం ప్రయత్నించటం. కానీ స్త్రీ పురుషుల స్వభావం లో, శారీరకం గా ఉన్న తేడా వలన ఇది సాధ్యం కాదు. సమానత్వం కోసం ఒక స్త్రీ యుధ్ధం లో సైనికుడి గా పోరాడాలని ప్రయత్నించవచ్చు. ఆ సైనికురాలు మన దేశం లో ఉన్నంతవరకూ పరవాలేదు. కానీ ఏ పాకిస్తాన్ కో యుధ్ధానికి వెళ్ళి అక్కడి సైనికులకు చిక్కితే, మానభంగం లాంటివి జరుగవచ్చు. అలా జరుగకుండా ఆపే శక్తి మన సమాజానికి ఉండదు.దుర్ఘటన జరిగిన తరువాత దోషులను శిక్షించలేం. వారు ఇతర దేశం లోని సైనికులవ్వటం వలన.కాబట్టీ కొన్ని రంగాలలో ఆడా మగా మధ్య functional equality సాధ్యం కాదు.

సమాన అవకాశాలు:

రిజర్వేషన్లు కులాల మధ్యే కాకుండా, కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతోంది. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ కి ఇద్దరు కవల పిల్లలు. ఒక అమ్మాయి… ఒక అబ్బాయి. ఇద్దరూ పట్టణ మధ్యతరగతి పిల్లలు. ఎవరిమీదా చదువుకోకుండా కుటుంబ పరమైన  వివక్ష లేదు. కానీ మెడికల్ ఎంట్రన్స్ లో అమ్మాయి కంటే మూడు రెట్లు మంచి రాంకు వచ్చిన అబ్బయికి సీట్ రాలేదు. అమ్మాయికి వచ్చింది.అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్ళాడు.  అబ్బాయిని పట్టించుకొనే వారెవరు?ఎలాంటి కోటానైన, ఆయా వర్గాల్లోని క్రీమీ లేయర్ వాళ్ళు ఆరగించి, ఆయా వర్గాల్లోని దిగువ తరగతి వారిని ఇతర కులాలపైకీ, వర్గాల పైకీ రెచ్చగొడుతున్నారు.

మానవ స్వభావం..తనకి వచ్చిన ఏ సదుపాయాన్నీ వదులుకోదు..ఇతరులకి దాని వలన ఎంత నష్టమైనా..తన సమూహాన్ని సమర్ధిస్తూనే ఉంటుంది.నాకు ఇవాళ ప్రభుత్వం ఏదో ఒక దిక్కుమాలిన కోటా ఇచ్చినా,నాకు ఆ అర్హత లేకపోయినా,  నేను కూడా కోటాని స్వచ్చందం గా వదులుకోను…మన స్వభావమే అంత!

రిజర్వేషన్లు…ఒక క్రికెట్ పోటీ పెట్టి దానిలో ఓ కులం బాట్స్ మన్ 5 మీటర్లు కొడితే సిక్స్, ఇంకో కులం వాడు 10 మీటర్లు కొడితే సిక్స్, వేరే కులం వాడు బౌండరీ దాటిస్తేనే సిక్స్ అంటే ఎలా ఉంటుంది? ఆ మాత్రం దానికి మాచ్ ఎందుకు? సమాన అవకాశాలు ఇవ్వాలంటే, అందరికీ మంచి బళ్ళు పెట్టండి. వాటిలో వెనుకబడిన వర్గాలకు స్పెషల్ కోచింగ్లు పెట్టండి, వారికి ఫీజులు మినహాయించండి. కానీ, బరి లోకి దిగిన తరువాత మాత్రం అందరినీ సమానం గా చూడండి. ఉద్యోగాలలో, ప్రమోషన్లలో రిజర్వేషన్ అనేది స్పష్టం గా ఒక privilege. ఆర్ధిక స్తోమత లేని వారికి రిజర్వేషన్ ఇవ్వాలంటం కూడా సరి కాదు.ఆర్ధికం గా వెనుకబడిన వారికి ప్రభుత్వం సహాయం చేయగలిగితే చేయాలి..చేయలేకపోతె తమ పరిమితిని ఒప్పుకొని మెదలకుండా ఉండాలి. కలిసి ఒకే క్లాసు లో చదువుకొన్న పసిమనసుల లో ఈర్ష్యా ద్వేషాలను నింపి, కుల ద్వేషాన్నినింపే  ఒక సాధనం ఈ రిజర్వేషన్లు. స్వతంత్రం వచ్చినపుడు, అగ్రకులాలలో విధ్యాధికులకి, నిమ్న వర్ణాల పై సానుభూతి ఉండేది. కానీ ఇప్పటి రాజకీయమైపోయిన రిజర్వేషన్ల వలన, ఆ సానుభూతి ఆవిరైపోయింది.ప్రజాస్వామ్యం రాకముందు ఒక సాంస్కృతిక, సాంఘిక గుర్తింపు గా ఉన్న కులాలు, ప్రజాస్వామ్యమూ, ఎన్నికలూ వచ్చిన తరువాత రాజకీయమైపోయి, కుల స్పర్ధలూ, కుల పోటీలూ పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యం యొక్క దిక్కుమాలిన ప్రభావాల్లో ఈ కులాల కుమ్ములాటలు ఒకటి.
సమాన అవకాశాలు కల్పించటమంటే, పరిస్థితులని సరిదిద్దటం. కానీ దీనికి కూడా ఒక పరిమితి ఉంది. ఒకే వర్గం లోని తక్కువ మార్కులు వచ్చిన మందమతులకి, బౌధ్ధికం గా వెనుక పడ్డారని , స్పెషల్ కోచింగ్లు పెట్టగలరా. అక్కడ ప్రభుత్వం కల్పించుకోకుండా, ప్రకృతి కలిపించిన అసమానతలను యాక్సెప్ట్ చేస్తోంది. చరిత్రా, సమాజం కల్పించిన అసమానతలను కొంతవరకూ సరిదిద్దవచ్చు. ప్రకృతి కల్పించిన అసమానతలను యాక్సెప్ట్ చేసినట్లుగానే, చరిత్రా, కాలమూ, సమాజమూ కల్పించిన అసమానతలను కూడా కొన్నిటిని వ్యవస్థ ఆమోదించక తప్పదు.

వివక్షా పూరిత వ్యవస్థ :
పాత వివక్షలను సరిదిద్దే క్రమం లో కొత్త వివక్షలను తెచ్చి పెట్టటం వ్యవస్థ కు తగదు. ఓ పల్లెటూళ్ళో ఉండే అగ్ర వర్ణ నిరుపేద కి వందలోపు రాంకు వచ్చినా మెడికల్ సీటు దొరకని పరిస్థితి మన వ్యవస్థ (రాజ్యాంగం, న్యాయ, శాసన వ్యవస్థ లు) సృష్టించిన వివక్ష కాదా?
కోటాలు పోవాలని మనం ఎంత కోరుకొన్నా అవి ఇప్పట్లో పోవు. మనకి కి ఉన్న గుంపుస్వామ్యం లో, మిగిలినది……. రిజర్వేషన్లు లేని వారందరూ ఏకమై వాటిని డిమాండ్ చేయటం. కానీ ఈ అగ్ర కులాలలో ఒక కులమంటే మరొకరికి పడదు. వీటిలోని పేద, మధ్య తరగతి వారు తమ కులం లోని డబ్బున్నవారినీ, సెలబ్రిటీలనూ మోసి మోసి , తమ తాతలు తాగిన నేతుల వాసనలు గుర్తు చేసుకొని, తరువాత మళ్ళీ వారిలో వారు కొట్టుకొని అలిసి పోతారు. గొప్ప పొజిషన్లలో ఉన్న వీరి లీడర్లు వీరి సపోర్ట్ ని(స్వకులప్రేమ  ని) granted గా తీసుకొని వీరిని ముంచుతారు.

డబ్బు, అధికారం:

అధికారమూ డబ్బూ అనేవి necessary evils. ఒక సంక్లిష్టమైన సమాజం నిర్ణయాలు తీసుకోవటానికీ, ఒక దిశ లో కదలటానికీ వ్యవస్థీకృత అధికారం చాలా ముఖ్యం. వ్యవస్థ లో అందరికీ సమాన అధికారం ఉన్నపుడు, అందరూ తలో దిశ లో వ్యవస్థ ని లాగుతారు. ఎవరి మాటా ఎవరూ వినరు. సమాజం ఎటువైపుకీ కదలక చెరువు లోని నీటిలా తయారై పాకుడు పడుతుంది. ప్రజాస్వామ్యం ఈ సమాన జనాల resultant wish  ప్రకారం ఒక దిశ లో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది.  ఇక డబ్బు అనేది పరిమితంగా రోజువారీ లావా దేవీ లకు ఉపయోగించినపుడు దుష్ప్రభావాలను చూపించదు. కానీ డబ్బు ని డబ్బు పుట్టించటం కోసం ఉపయోగించినపుడు అనర్ధాలు మొదలవుతాయని మార్క్స్ మహాశయుడు మొత్తుకొన్నాడు. డబ్బూ పవరూ exchangeable (పాపులారిటీ కూడా), ఒక దానిని ఇంకోదానిగా convert చేసుకోవచ్చు.conversion rate ఏమిటనేది స్థల కాలను బట్టి ఉంటుంది.  డబ్బూ, పవరూ సామాజిక పరికరాలు (social instruments). ఏ పరికరాన్నైనా (ఉదా: తుపాకీ) మంచికీ వాడవచ్చు చెడుకీ వాడవచ్చు. డబ్బు నీ, పవర్ నీ పరిమితం గా సమాజం మేలు కోసం (ఈ మేలు అంటే ఏమిటి అంటే..అదో బ్రహ్మ పదార్ధం) వాడితే మంచి ఫలితాలు వస్తాయి, లేక పోతే చెడు ఫలితాలు వస్తాయి.

సాధికారికత:రిజర్వేషన్

సాధికారికత (empowerment)   అంటే వాస్తవ అధికారం(de facto power) లేని వారికి, దానిని చట్టం ద్వారా ఇచ్చి (de jure power), వారిని కాల క్రమం లో de facto power కల వారి గా మార్చటం. అంబేద్కరుడు మొదటి రిపబ్లిక్ దినోత్సవం రోజున, భారతీయ సమాజం లోని ఈ రాజకీయ సమానత కూ, సామాజిక సమానతకూ కూ ఉన్న వైరుధ్యం గురించి చాలా వా పోయాడు. నేను ఆయన మాటలను నా మాటలలో చెప్పాలంటే, ఆయన ఆ రోజుల్లో de jure power కీ de facto power కీ ఉన్న gap ని గూర్చి ఎలుగెత్తి చెప్పాడు. ఇంతకీ ఈ రెండు power లూ ఏమిటంటారా? ఇంత బధ్ధకం అయితే ఎలా. గూగులమ్మ కైనా కాస్త పని చెప్పండి.

రిజర్వేషన్ ఉన్న వారి కోటా లోంచీ లేని వారు తీసుకోకూడదు. కానీ రిజర్వేషన్లు లేని వారి కోటా లోంచీ ఉన్నవారు తీసుకోవచ్చు. అంటే దీర్ఘ కాలం లో de jure powers అయిన రిజర్వేషన్ ఉన్న వర్గాలు, de facto powers గా మారతాయి. నెమ్మది గా (కొన్ని దశాబ్ధాల తరువాత ప్రస్తుతం de facto powers అయిన రిజర్వేషన్ లేని వర్గాలు దిగజారి రిజర్వేషలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు వీరికి రిజర్వేషలు ఇవ్వాలి. రిజర్వేషన్ల వలన ఇలా ఆధిపత్య వర్గాలు, సీ-సా తరహాలో alternate గా మారుతూ ఉంటాయి, తప్పితే సమానత్వం ఎప్పటికీ రాదు.

జనాభా నిష్పత్తి లో సీట్లను పంచవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రతిపాదనను, జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సీట్లు పొందుతున వర్గాలు తోసిపుచ్చుతాయి. ఎందుకంతే దీనివలన వారు సీట్లను కోల్పోవలసి వస్తుంది. అంతే కాక కొన్ని వర్గాలలో కొన్ని రంగాల పై పట్టు ఉండి ప్రతిభ కల వారు యావరేజ్ కంటే ఎక్కువ మంది ఉంటే, మొత్తం సమాజానికిఈ పధ్ధతి వలన నష్టం కలుగుతుంది. ఉదాహరణకు మార్వాడీ లకి వ్యాపార సంబంధమైన చదువు లో (కామర్స్) లో  వారిగి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొనే సత్తా ఉండవచ్చు. ఎప్పుడైతే జనాభా దామాషా లో సీట్లు పంచామో అప్పుడు మార్వాడీలే కాక మొత్తం సమాజం ప్రతిభావంతులైన వారిని కోల్పోతుంది (సీట్లు రాకపోవటం వలన).

అసమానత్వం మంచిది:
ఒక్కోసారి సమానత్వాన్ని పాటించక పోవటం మంచిదౌతుంది. ఉదాహరణకి గర్భిణి స్త్రీ ల కి ఉద్యోగాలలో 3 నెలల, “మాటర్నిటీ లీవ్ విత్ పే”, ఉంటుంది. పురుషులకి ఉందదు. ఇక్కడ సమానత్వం పేరుతో ఆడవారికి లీవ్ ఎగ్గొట్టటం కానీ, లేక మగవారికి మూడు నెలల లీవ్ ఇవ్వటం కానీ సరి కాదు. ఎందుకంటే ఆడవారికి ఉండే ప్రత్యేక శారీరక కారణాల వలన.

 

 

phenomenal consciousness..తెలుగు లో నా తంటాలు

ఈ సృష్టి అనే పజిల్ లో ఒక ముఖ్యమైన ముక్క,”చేతన (consciousness)”. ఎందుకంటే consciousness లేక పోతే మనవరకూ సృష్టే అనుభవం లోకి రాదు.  మనిషికి ఉండే చేతన స్థితులలో నిద్ర, కలలు, కోమా, brain death, ధ్యానం (meditation), hypnotic state వంటి చాలా స్థితులు ఉన్నాయి. కానీ ఈ టపా కి సంబంధించినంతవరకూ, చేతన(consciousness) స్థితి అంటే “మనం క్యారం బోర్డ్ ఆడుతున్నపుడు, స్ట్రైకర్ గురి చూసేటపుడు ఉండే స్థితి”. అలానే, “జీవితం లోని ఓ సమస్య గురించి ఆలోచిస్తున్నపుడు మనం ఉండే స్థితి”. ఇక అచేతన (unconscious) అంటే…….. మనం ఓ పాట వింటూ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నపుడు, పాట గురించి పెద్ద గా పట్టించుకోం. అంటే , పాట అర్ధానికి మనం పెద్ద గా attention ఇవ్వం. ఇటువంటి స్థితి ని ఈ టపా లో “అచేతన (unconscious)” అందాం.

a) consciousness లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి “access consciousness” లేక “functional consciousness”. ఈ consciousness లో information processing అనేది ముఖ్యం. దీనిని మనం కంప్యూటర్ లో సిమ్యులేట్ చేయవచ్చు.
b)”phenomenal consciousness”, అనేది మన feelings తో ముడిపడిన స్థితి. ఒక ఆకుపచ్చ మైదానం లో “పచ్చదనం” అనే ఫీలింగ్, లేక మొదటి సారి లవ్ లో పడిన ఓ ప్రేమికుడి అనుభూతి, …ఇవన్నీ phenomenal conscious లోని అంశాలు. ఈ ఫీలింగ్స్ వైయక్తికమైనవి. వీటిని ఇప్పటి వరకూ ఇంతవరకూ ఎవరూ నిర్వచించలేదు. ఈ phenomenal conscious నే “అసలైన చేతన” అనవచ్చు. మనం బయటి ప్రపంచలో చూసే రంగులూ, వాసనలూ , ధ్వనులూ, స్పర్శ ఇవన్నీ ఈ phenomenal consciousness తయారు చేసేవే. బయటి ప్రపంచం లో కాంతి లోని వివిధ తరంగ దైర్ఘ్యాలను గుర్తించి వాటిని రంగులుగా మార్చేది ఈ చేతనే. గాలిలోని వైబ్రేషన్లని శబ్ధం గామార్చేది ఈ చేతనే. మనం చూసే ప్రపంచం లో కొంత భౌతికమైన మూలాల నుంచీ (బయటి నుంచీ) వచ్చినప్పటికీ, చాలావరకూ అది మన మనసు కల్పించిన భ్రమే! అయితే ఈ మెదడు లోపలి సినిమా, మన మెదడు లోని న్యూరాన్ల firing patterns నుంచీ, ఎలా ఆవిర్భవించింది అనే విషయం లో ఒక explanatory gap ఉందని chalmer అనే తాత్వికుడు అన్నాడు. ఈ గ్యాప్ ని కార్య కారణ సంబంధాల రూపం లో వ్యక్త పరచలేం. చేతన అనేది పదార్ధం (matter) యొక్క లక్షణం (property) అయిన information యొక్క ఓ aspect గా chalmer భావించి, ఆ రకమైన ఓ సిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు. chalmer సృష్టి లోని అన్ని వస్తువులకీ చేతన ఉంటుందనే అనుమానం వ్యక్త పరి చాడు.

ఏదేమైనా phenomenal consciousness ని ఇంతవరకూ సరిగా నిర్వచించలేకపోయారు. ఇక దానిని కంప్యూటర్లలో రోబోట్ల లో సిమ్యులేట్ చేయటం ఇప్పట్లో అయ్యేపని కాదు…. కనీసం ఓ యాభై సంవత్సరాలు ఆగాలి.
a) functional consciousness ని simulate చేయటానికి అనేక సిధ్ధాంతాలు అందుబాటు లో ఉన్నాయి. వాటిలో కొన్ని..
1. Global Workspace theory ఈ సిధ్ధాంతం చేతన ని రంగ స్థలం తో పోల్చి, దాని ద్వారా వివరిస్తుంది. ఈ తీరీ ప్రకారం మన decision అనే టార్చ్,  మన attention అనే spot light ని డయాస్ మీది ఏ యాక్టర్ మీద పడేలా చేస్తుందో , ఆ యాక్టర్ మన చేతన లోకి వస్తాడు/వస్తుంది. ఈ తీరీ ప్రకారం చేతన మెదడు లోని ఏ ఒక్క భాగం లోనో ఉండదు. ఇది మెదడు అంతటా, thalamo-cortical వ్యవస్థ ద్వారా విస్తరించి ఉంటుంది. reticular formation ద్వారా activate అవుతుంది.
2. Information integration theory- సెల్ ఫోన్ లో తీసిన ఒక ఫొటొ (మీ ఫ్రెండ్ నవ్వుతున్నప్పటి ఫొటో) ని పరిగణిద్దాం. ఆ ఫొటొ, సెల్ ఫోన్ స్క్రీన్ కి చాలా పిక్సెల్స్ మాత్రమే. అదే ఫొటొ, సెల్ ఫోన్ లోని ప్రాసెసర్ కి కొన్ని బైట్స్ మాత్రమే. కానీ మన చేతన కు అది “నవ్వుతున్న ఒక ఫ్రెండ్” ఫొటొ. మన చేతన ఆ బిట్స్ లోని ఇంఫర్మేషన్ ని అంతటినీ అనుసంధానం(integrate) చేసి దాని ని మన ఫ్రెండ్ నవ్వుతున్న ఫొటో లా మనకి తెలిసేటట్లు చేస్తుంది.
3. Dennets Multiple version theory- దీని ప్రకారం చేతన అనేది అనేక వర్షన్లున్న ఓ సాఫ్ట్వేర్ కోడ్ లో చివరి వర్షన్ లాంటిది. చివరి వర్షన్ మార్కెట్లోకి ఎలా వస్తుందో, అలానే సంఘటనల చివరి వర్షన్ కాన్షన్నెస్ లోకి వస్తుంది.
బ్రిటన్ లో జరిపిన కొన్నిప్రయోగాల్లో, మనిషి అచేతన (అనేక సమూహాలు మెడిటేషన్ చేసే ప్రదేశాలలో), భౌతిక ప్రపంచం లోని ర్యాండం ఈవెంట్స్ ని ప్రభావితం చేయగలదని తేలింది. కానీ చేతనావస్థ లో ఆలోచనల కు ఈ శక్తి లేదు. కాబట్టీ బయటి ప్రపంచమూ మన చేతనా కూడా ఓ ఉమ్మడి తెలియని (common-unknown) మూలాలనుంచీ ఉద్భవించాయని కొన్ని తీరీలు అనుమానిస్తున్నాయి. quantum theories of conscious అనేవి, చేతన అనేది మనిషి మెదడు లో ఉండే micro tubules లో ని quantum actions వలన ఉద్భవించిందని ప్రతిపాదిస్తున్నాయి. అయితే, ఈ తీరీ ల లో ఏవీ ప్రూవ్ కాలేదు. కొన్నిటిని  తప్పు అని నిరూపించారు కూడా. string theory,quantum holism, intrinsic order లాంటి సిధ్ధాంతాలు సృష్టి జననాన్నీ, చేతననూ వివరించి, chalmer చెప్పిన, “explanatory gap” ను పూరించటానికి ఉపయోగ పడతాయని భావిస్తున్నారు.

కొన్ని తీరీ ల ప్రకారం ఈ సృష్టే ఓ చేతన. (విష్ణువు నిద్రపోతున్నపుడు ఆయనకు వచ్చిన కలే ఈ సృష్టి..?) కానీ ఇలాంటి తీరీ ల కి ఓ బేసిస్ ఉందని కూడా ప్రూవ్ కాలేదు.

functional/access consciousness గురించి ఇంకా బోలెడు తీరీ లు ఉన్నాయి.ఈ తీరీ ల గురించి నెట్లో (you tube, Wiki) చాలా సమాచారం ఉంటుంది.

టెర్రరిస్టులు

=                                                     టెర్రరిస్టులు

“మొత్తానికి అయిపోయింది..డైవోర్స్ కి ఒప్పుకొన్నాడు. “డీవీ” కేసు పెడతానన్న తరవాత దారిలోకి వచ్చాడు గురుడు.. ఎలిమొనీ అదీ కూడా బాగానే వచ్చేటట్లు చూడవచ్చు” అంది స్వేచ్చ,  కాలా పానీ పబ్ లోకి అడుగుపెడ్తూ.

“మరి మహేష్ తో  నిశ్చితార్ధమెప్పుడు?” అంది అమె స్నేహితురాలు కావ్య.

“చూడాలి వచ్చే మార్చి లో కావచ్చు”, అంటూ, “ఆ బైతు గాడు చూడు నన్ను ఎలా తినేసేలా చూస్తున్నాడో?”, అని పబ్ బయట ఆమెనే చూస్తున్న ఒక అల్పజీవిని చూపిస్తూ పెదవి విరిచింది. స్వేచ్చ అసలే అంద గత్తె. ఆపై స్లీవ్లెస్ టాప్ పై మినీ వేసుకొంది. టాప్ నుంచీ క్లీవేజ్ కనపడుతూ, వచ్చేపోయే మగ పురుగుల మతి పోగొడుతోంది.

“ఆ బైతు గాడేమో గానీ వాడి పక్కన ఉన్న ఇద్దరూ పరవాలేదు”, కావ్య అంది .

ఆ ఇద్దరూ కూడా తన వైపే చూస్తూ ఉండటం గమనించి, స్వేచ్చ వాళ్ళ అటెన్షన్ ని ఒకింత గర్వం గా ఎంజాయ్ చేస్తూనే, మనసులోంచీ వచ్చే ఆనందాన్ని నొక్కి పట్టింది. కిందిపెదాన్ని పై పెదిమ తో అదిమి పెట్టింది.

పబ్ లో డ్రింక్స్ వాసన, సిగరేట్ పొగ వాసన, మాటవినిపించని సంగీతపు కలా పోసన, మొత్తానికి అది ఆధునికత అనబడే క్షుద్రదేవతోపాసన!

పబ్ లో మగవాళ్ళందరి దృష్టీ స్వేచ్చ వైపే! ఆమె వాళ్ళ చూపులని ఎన్ జాయ్ చేస్తూనే,

“ఎలాచూస్తున్నారో చొంగలు కారుస్తూ..!ఏదేమైనా నావి కిల్లర్ లుక్స్..”, అనుకొంది.

ఇద్దరు  పత్రికా రిపోర్టర్లు మూడో పేజీ కోసం పబ్ లో ని అమ్మాయిల పర్మిషన్ తీసుకొని వారి అందాన్ని కెమేరాలలో బంధిస్తున్నాడు.  అమ్మాయిలు పోజ్ ఇస్తున్నారు.

******************

శ్రీనివాసులు కి సింగరాయకొండ తో పోలిస్తే హైదరాబాద్ స్వర్గం లా అనిపిస్తోంది.  అతనిది సింగరాయ కొండ దగ్గరి ఒక ఊరు. ఇంకా కేబుల్ టీవీ వ్యాపించనంత మారుమూల ఊరు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గానూ, అప్సరసల్లానూ అని పిస్తున్నారు. వాళ్ళ డ్రెస్ చాలా బోల్డ్ గా అనిపిస్తుంది అతని కి. జబ్బలూ పిక్కలూ కనపడేలా డ్రెస్ చేసుకొనే ఆడవాళ్ళ ని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాడు శ్రీనివాసులు. ఇంతకు ముందు అలాంటి ఆడ వాళ్ళని సినిమాలలో మాత్రమే చూశాడు. వాళ్ళ ఊళ్ళో ఓ వృత్తి లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకొంటారు. వాళ్ళ ఊరి దగ్గరలోని ఒక కాలేజీ లో “ఎం సీ యే” అయిన తరువాత ఉద్యోగాన్వేషణ లో భాగ్యనగరి చేరుకొన్నాడతను. ఇంత పెద్ద నగరానికి రావటం అదే మొదటి సారి అతనికి.  ఒక రూం మేట్ రమణ. అతను “ఎం సీ యే”, లో శ్రీనివాసులు కి క్లాస్-మేటే, వాళ్ళది విజయవాడ. ఇంకొక రూం-మేట్ రవి జాబ్ చేస్తున్నాడు. అతని అసలు ఊరు బెంగుళూరు.

రమణ,”బాబాయ్, ఇక్కడ పబ్బులు చాలా ఉంటాయి. నాకు పబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఏదైనా పబ్ కి వెళ్దామా?”, అన్నాడు.

“ఆ.. పబ్ లో ఏం ఉంటుంది? ఇక్కడ మనం రూం లో తాగే బీర కాయలనే, ఓ నాలుగు రెట్లు పైసలు వదలగొట్టుకొని అక్కడ తాగుతాం, అంతే!”, అన్నాడు పబ్ ల విషయం  తెలిసిన రవి.

“ఈ ఒక్క సారి కి మాత్రమే వెళ్దాం. పబ్ లు ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా!”, అన్నాడు శ్రీనివాసులు. అతనికి పబ్ ల లో కనపడబోయే కురచదుస్తుల ఆడవాళ్ళు కళ్ళముందు కనపడసాగారు.

రమణ, “కానీ శీనూ, నువ్వు మాత్రం తాగొద్దురా! ఒరే,   ఫేర్వెల్ పార్టీ అప్పుడు సగం బీర్ బాటిల్ తాగి నానా యాగీ చేశాడు వీడు. మామూలు గా ఇలా మెత్త గా నోట్లో నాలుక లేనట్లు కనపడతాడా! తాగితే మాత్రం మనిషి కాదు”, అన్నాడు.

” అరే! నేను చాలా మిస్ అయ్యానన్న మాట! అలా అయితే ఇవాళ శీను తాగాల్సిందే!”, అన్నాడు రవి.

********************

పబ్ కి అటాచ్ అయి ఉన్న డిస్కో లో డాన్స్ లు మొదలయ్యాయి. స్వేచ్చ కావ్య తో కలిసి కాలు కదుపుతోంది. రెండు చేతులూ పైకెత్తి కనురెప్పలు కిందికి దించి తననే చూసుకొంటూ తన నడుము ఊపుతూ మూవ్ మెంట్స్ ఇస్తోందామె.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా! నా చూపులలో చిక్కుకున్న..!” కొత్త రిమిక్స్ ఫాస్ట్ బీట్ లో సాగుతోంది.

కూర్చొన్నవాళ్ళంతా రెప్పవేయటం మర్చిపోయినట్లు చూస్తున్నారు.  శ్రీనివాసులూ మిత్రులూ ఒకటేబుల్ దగ్గరకు చేరారు.

అమె ని చూసి రమణ తనలో ,”ఆహా ఏమి ఆ జబ్బల నునుపు, వాటిని ఒక్క సారి నిమిరితే ఎంత బాగుంటుందో!” అనుకొంటున్నాడు.

రవి చూపులు ఆమె క్లీవేజ్ లో చిక్కుకొని ఏవో ఊహా లోకాల్లో తేలియాడుతున్నాయి.

శీను నోరు సగం తెరిచి చూస్తున్నాడు. అతనికి అక్కడి చెవులు చిల్లులు పడే మ్యూజిక్ ఏ మాత్రం వినపడటం లేదు.

ముందు గా రవి తేరుకొని, ” పబ్ కి వచ్చింది తాగటానికి రా బయ్. నోరెళ్ళబెట్టటానికి కాదు. ఇవాళ శీను తాగి ఏం చేస్తాడో చూడాలి”, అని, వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు.

సైడ్ డిష్ తింటూ ముగ్గురూతాగుతున్నారు. మ్యూజిక్ లో బీట్ పెరుగుతోంది. డాన్స్ వేగం పెరుగుతోంది. స్వేచ్చ నడుము ఊపు జోరందుకుంది.

“వీడు తాగితే యాగీ చేస్తాడన్నావ్. ఏమీ చెయ్యటం లేదు?”, అన్నాడు రవి, రమణ తో.

శీను అదేమీ పట్టించుకోకుండా, “నేను ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొంటాను,ఆ డాన్సూ,  అ నవ్వూ ఆ బిగబట్టిన పెదాలూ, అంతా నా కోసమే!  “, అన్నాడు సీరియస్ గా.

రమణ మొహం లో గాభరా.

రవి, “బౌన్సర్లు బయట పడేస్తారు. గమ్మునుండు. అవును, నువ్వు తాగితే యాగీ ఏదో చేస్తావంట కదా!”, అన్నాడు.

శీను లేచి డాన్స్ ఫ్లోర్ మీదికి వెళ్ళి, స్వేచ్చ ని సమీపించాడు. ఆమె ముఖం లోని ప్రశ్నార్ధకాన్ని పట్టించుకోకుండా పెదాలు కలిపాడు. వళ్ళంతా తేళ్ళూ జెర్రులూ పాకినట్లై, ఆమె పెద్ద గా అరిచింది.  పబ్ అంతా కలకలం రేగింది. తేరుకొన్న పేజ్ 3 ఫొటోగ్రాఫర్లు కెమేరాలు క్లిక్ మనిపించటం మొదలు పట్టారు. బౌన్సర్లు వచ్చారు. రమణా రవీ, వాళ్ళ తొ వాదిస్తున్నారు. వాళ్ళు చచ్చిన ఎలుకను విసిరేసినట్లు శీను ని పబ్ బయటికి విసిరేశారు.

**************

శీను పొద్దున్నే బధ్ధకం గా లేచి రూం లోని టీవీ ఆన్ చేశాడు. రాత్రి తాగిన హాంగోవర్ ఇంకా దిగలా.
టీవీ లో వార్తా స్రవంతి.
“నగరం లోని పబ్ లో రేప్ ప్రయత్నం. పరారీ లో దుండగుడు”
శీను స్వేచ్చని ముద్దు పెట్టుకొంటున్న ఫొటో లని మార్చి మార్చి చూపిస్తున్నారు.
చానల్ మార్చాడు.
అక్కడ చర్చ జరుగుతోంది. మహిళాసంఘం అధ్యక్షురాలు “మన సమాజం లో స్త్రీ లకు రక్షణ కరువైందని” వాపోతోంది.
ఒక స్త్రీ వాది, “మగ బుధ్ధి గురించి గట్టిగా నిరసిస్తోంది”.
మామూలు గా శాంతం గా ఉండే ఒక రచయిత్రి ఆవేశం గా, “దుండగుడిని కాల్చిపారేయాల్సిందే”, నంటోంది.
ప్రతిపక్ష నేత, “మహిళలను కాపాడటం లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు.
వేరే అధినాయకుడు తమ పార్టీ అధికారం లోకి వస్తే రేప్ చేసిన వాళ్ళకి మరణ శిక్ష పడేలా చట్టం తెస్తామని హామీ ఇస్తున్నాడు.
అధికార పక్ష ప్రతినిధి,ప్రభుత్వం నేరస్తులను త్వరగా పట్టుకోవటానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తోందో వివరిస్తున్నాడు.
ఇంకో చానల్ లో విలేకరులు పోలీస్ కమీషనర్ ని అడుగుతున్నారు, ” ఈ మధ్య దోపిడీ దొంగలు నగరం లో విచ్చలవిడి గా దొంగతనాలు చేసినా మీరు పట్టుకోలేక పోయారు. ఇప్పుడు రేపిస్టులను ఏమీ చేయలేకపోతున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ వైఫల్యం కాదా. పోలీసు యంత్రాంగం ఏమి చేస్తోంది?”

శీను కంగారు గా రూమేట్స్ ని లేపాడు. విషయం తెలిసిన మిగిలిన ఇద్దరూ వాడిని ఆడి పోసుకొన్నారు. “ఈ ఉపద్రవానికి కారణం నువ్వే. నీ వంకర బుధ్ధి వలన నే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది”, అన్నారు.
“పోలీసులు వస్తే నీతో పాటు మా ఇద్దరినీ కూడా బొక్క లో వేస్తారు, కాబట్టీ మేము మా ఊళ్ళ కు పోతున్నాం”, అన్నారు.

వెళ్తూ వెళ్తూ, “ఓ రెండ్రోజులు పోతే అంతా సద్దుమణుగుతుంది. అప్పుడు చేయాల్సిన దాని గురించి ఆలోచించవచ్చు. బెయిలో గియిలో ఏదో ఉంటుంది. అప్పటి దాకా నువ్వు రూం బయటికి రావద్దు.”, అన్నాడు రవి.

********************

టీవీ లో పబ్ సంఘటనకు వ్యతిరేకం గా వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ప్రదర్శనలు చూపిస్తున్నారు.

అది చూస్తున్న “సీ ఎం” ఆందోళన గా ఉన్నారు. అసలే ఎన్నికల సంవత్సరం.

హోం మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి.కొన్ని పత్రికలు “హోం మంత్రి కీ రేపిస్ట్ కీ బంధుత్వముందనీ, అందువలననే, పోలీసులు నిందితుడి పట్టుకోవటం లో అలసత్వం చూపిస్తున్నారనీ”, తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.
ముఖ్యమంత్రి హోం మంత్రి ని పిలిపించుకొన్నాడు. సమావేశం నుంచీ బయటికి వచ్చిన తరువాత హోం మంత్రి “డీ జీ పీ” కి ఫోన్ చేశాడు. “ఎలా ఐనా పట్టుకోవాలి. వియ్ నీడ్ హిం డెడ్ ఆర్ అలివ్”, అన్నాడు.
అది జరిగిన మరుసటి రోజు సాయం కాలం చానళ్ళనీ గోల పెట్టాయి, ” పబ్ రేప్ సంఘటన లోనిందితుడి కాల్చివేత. నగరం లోని ఓ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు. నిందితుడి ప్రతిఘటన. పోలీసుల కాల్పులు”.

***********
“ఇంటి వెనుకే ఓ చెరువుంది సర్! అతను గోడదాటి చెరువులోకి దూకి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటి కే చాలా అన్-పాపులర్ అయి ఉన్నాం.చాన్స్ తీసుకోదలచలేదు”, హోం మంత్రి తో “డీ జీ పీ” అంటున్నాడు, ఫోన్ లో.

కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ అను “శృతి ఆకలి కథ”

శృతి ‘లిప్-స్టిక్’ వేసుకొని పెదాలు దగ్గర పెట్టి అద్దం లో చూసుకొంది. రక్తం కారుతున్నట్లు ఎర్రగా ఉన్నాయి పెదాలు. “పెదాలు ఎంత ఎర్ర గా ఉంటే అంత మంచిదట”, తన సూపర్వైజర్  చెప్పింది.  తన యూనిఫాం చీర కుచ్చిళ్ళు దోపి చూసుకొంది. బొడ్డు కింది కి రాక పోతే సూపర్వైజర్  రమ ఊరుకోదు.
శృతి ఒక “ఈవెంట్ మానేజ్మెంట్” కంపెనీ లో పని చేస్తోంది. ఆ రోజు సాయంత్రం ఒక మంత్రి గారి బావమరిది కూతురు పెళ్ళి రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ ని శృతి వాళ్ళ కంపెనీ ఆర్గనైజ్ చేస్తోంది.
శృతి సూర్యాపేట నుంచీ ఐదు గంటలకి వచ్చింది. అక్కడ వాళ్ళ నాన్న రంగయ్య కి ఏమీ బాగోలేదు. రంగయ్య దర్జీ పని చేసి, తల్లి లేని లోటు తెలియకుండా, ఎలానో శృతి ని బీయే వరకూ చదివించాడు. ఈ మధ్య డాక్టర్లు అతనికి మూత్ర పిండాల వ్యాధి అని చెప్పారు.
తమ్ముడు నగేష్ పదో తరగతి లో ఉన్నాడు. వాడు చదువు లో మంచి మెరిక. శృతికి వాడంటే ప్రాణం.వాడిని ఎలాగైనా గొప్ప చదువు చదివించి ఏ అమెరికా నో పంపించాలని శృతి ఆశ. గవర్నమెంట్ కాలేజీ లో తెలుగు మీడియం లో బీయే చేసిన శృతి కి ఏమి ఉద్యోగం దొరుకుతుంది? అందుకే ఆ ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ లో అతిధులకి సత్కారాలు చేసే ఆ చిన్న ఉద్యోగం లో చేరి పోయింది.అదైనా తను కాస్త తెల్ల గా ఉంటుంది కాబట్టీ ఇచ్చారు. వారానికొక సారి సూర్యా పేట వెళ్ళి తన తండ్రినీ తమ్ముడినీ చూసి వస్తూ ఉంటుంది.ఈ రోజు ప్రయాణం లో భోజనం చేయటం కుదరలేదు..శృతి కడుపు లో ఎలుకలు పరుగెడుతున్నాయి.రూం కి వచ్చే సరికే సాయంత్రం ఐదైపోయింది..ఇప్పుడు త్వరగా ఫంక్షన్ కి వెళ్ళాలి..

వ్యాన్ హారన్ విని ఈ లోకం లోకి వచ్చింది శృతి. డ్రైవర్ అరుస్తున్నాడు, “టైమైపోతోంది..జల్దీ..జల్దీ”
వ్యాన్ లో ఆమె తో పాటు పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అతిధులకి సత్కారాలు చేసే వారే. అందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళలో షబ్నం కూడా ఉంది. అది “నార్త్ ఈస్ట్” వాడి కీ బెంగాలీ ఆమె కీ పుట్టిన అందగత్తె. దానికి పక్క వేషాలు చాలా ఉన్నాయి.

*******************

వ్యాన్ వాళ్ళని తీసుకెళ్ళి కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ దగ్గర దిగ బెట్టింది.ఫంక్షన్ హాల్ చాలా విశాలం గా, ఇరుకు సిటీ లొ బృందావనం లా ఉంది. దాని అలంకరణ కి మూడు  క్వింటాళ్ళ పువ్వులన్నా ఖర్చుపెట్టి ఉంటారు.

అతిధులు ఒక్కరొక్కరే రాసాగారు. దాదాపు అందరూ ఖరీదైన కార్లలో వస్తున్నారు. మొకమంతా నవ్వు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు “బాగున్నారా?”, “హౌ ఆర్ యూ?” అంటూ కరచాలనాలు చేసుకొంటూ పలుకరిస్తున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళూ “నమస్తే” అని చేతులు జోడిస్తున్నారు.మగ వాళ్ళు బంద్ గలా సూట్లూ,  షేర్వాణీలూ,లాల్చీ పైజమాల్లో డాబు గా దిగుతున్నారు.అందం గా ఉన్న స్త్రీల డబ్బు ,వారి మేకప్ లో కనిపిస్తుంటే, అందం లేని స్త్రీల డబ్బు, వారి నగలలో కనిపిస్తోంది. కొందరు కల వారి పిల్లలు చాలా సింపుల్ గా, జీన్స్ టీ షర్ట్ లో ఉన్నారు. వారికి మేకప్ అంటే ఇష్టం ఉన్నట్లు లేదు. కానీ వారి చేతులకి డైమండ్ రింగ్స్ ఒకటో రెండో సింపుల్ గా మెరుస్తున్నాయి.
ఫంక్షన్ హాల్ లో క్లోజ్-సర్క్యూట్ టీవీ, జెయింట్ “ఎల్ సీ డీ”  స్క్రీన్ ల మీద, వచ్చే అతిధులని వారి వారి హోదా ని బట్టి దగ్గర గా నో, దూరం గా నో , ఎక్కువ సేపో, తక్కువ సేపో, చూపిస్తోంది.వధూ వరుల తల్లి తండ్రులు వచ్చిన వాళ్ళతో వారి వారి హోదా ని బట్టి ఎక్కువ నవ్వుతూ నో,తక్కువ నవ్వుతూ నో పలుకరిస్తున్నారు.
టీవీ లో అంతకు ముందు రోజు వధువూ వరుడూ డ్యాన్స్ చేసిన ఒక సినిమా పాటని చూపిస్తున్నారు. వేదిక దగ్గర ఒక సినిమా క్రేన్ వచ్చే వాళ్ళని షూట్ చేస్తోంది. స్టేజీ పక్కన ఆంధ్రుల అభిమాన గాయకుడొకాయన తన గానామృతం తో అతిధులను అలరిస్తున్నాడు.
ఎం పీలు, ఎంఎల్యే లూ, సినిమా నటులూ, పారిశ్రామిక వేత్తలూ,మహిళా సంఘం సభ్యులూ,ప్రతి పక్షం వారూ, అధికార పక్షం వారూ, తెలంగాణా వాదులూ, సమైక్య వాదులూ… రోజు వారి టీవీ వార్తలలో కనపడే పెద్దలంతా  వస్తున్నారు..వెళ్తున్నారు.
శృతి సర్వర్స్ ని పిలిచి వచ్చేవారికి ముందు మంచి నీళ్ళ బాటిల్ ఇప్పిస్తోంది… తరువాత వారికి ఒక సీట్ చూపిస్తోంది.చిరు నవ్వుతో వారికి ఏమి కావాలో కనుక్కొంటూంది….కడుపులో ఆకలి మాత్రం నవ్వుతున్న పెదాలను వంకర తిప్పుతోంది.
హాల్ నిండా రక రకాల వంటకాలు ఉన్నాయి, ఒక వైపు నార్త్ ఇండియన్ వంటలు, ఒక వైపు సౌత్ ఇండియన్ వంటలు…ఒక చోట టిఫిన్ మాత్రమే చేసే వారికి  టిఫిన్లు..ఇంకొక చోట ఛాట్స్, పళ్ళు, అయిస్ క్రీంలు, ఇంకొక స్టాల్ లో ఇరానీ వంటలు,వేరొక స్టాల్ లో ఆఫ్ఘన్ పదార్ధాలు,చవులూరించే చైనీస్ నూడుల్సూ, సలాడ్లు, స్వీట్లు..అక్కడ ఉన్న తినుబండారాలతో ఒక ఊరిని ఒక సంవత్సరం పాటు పోషించవచ్చు. పక్కనే నాన్ వెజ్ సెక్షన్.అక్కడ చికెన్, మటన్, కోస్తా రొయ్యలూ, గోదావరి చేపలూ, పీతలూ సకల తినదగిన ప్రాణులూ.
పక్కనే మందు బాబుల కోసం ఒక సెక్షన్, అక్కడ్ ఖరీదైన కాక్ టైల్సూ,  నిషా ఎక్కని మాక్ టైల్సూ..
వచ్చిన వాళ్ళు వడ్డించే వాళ్ళతో “అంత వద్దు.అంత వద్దు తక్కువ..చాలు”, అంటున్నారు. పక్క వాళ్ళతో “తిండి తగ్గిపోయింది నాకు బీపీ…నాకు సుగర్..”, అని చెప్తున్నారు. కొంత మంది అన్నిపదార్ధాలలో ఏది తినాలో తెలియక, అన్నీ పెట్టుకొని, అన్నీ పక్క నున్న చెత్త బుట్టలో పడ వేస్తున్నారు.పిల్లలు అయిస్ క్రీం పెట్టుకొని సగం కింద పోగొడుతున్నారు. మందు బాబులు ముందే ఔటైపోయి కుర్చీలకి చేరగిల బడుతున్నారు.
కానీ..శృతి కడుపులో ఎలుకల జోరెక్కువైంది. ఎవడో ఒక టీ షర్ట్ యువకుడు శృతి దగ్గరికి వచ్చి ఏదో ఇరానీ ఐటం గురించి మొదట తెలుగు లో అడిగి, ఆపై ఇంగ్లీషు లో దడ దడా ఏమిటో మాట్లాడుతున్నాడు. వాడి స్పీడు అందుకోవటం శృతికి గగనం అయిపోయింది. శృతి తోటి మర్యాద గత్తెలు,ఫంక్షన్ కి వచ్చిన తెలుగు జనాల కి హిందీ లో మర్యాద చేస్తున్నారు.”అబ్బా..!కడుపులో ఎలుకలు..” ఇంతలో, ఒక మధుబాబు కొంచెం తూలుకొంటూ శృతి దగ్గరికి వచ్చి, “ఆప్ కా ఫోన్ నంబర్ క్యా హై?”అని అడుగుతున్నాడు. శృతి మనసు లో “ఈ జాబ్ చేసే వాళ్ళంటే ప్రతి వెధవకీ అలుసే !” అనుకొని, షబ్నం ని చూపించి,”ఆప్ కో షాయద్ వో మదద్ కర్ సక్తీ హై”అంది. వాడు ఓ వంకర నవ్వు నవ్వి షబ్నం తో ఏదో మాట్లాడాడు. చేతిలో పెన్నుతో ఏదో రాసుకొంటూ పోయాడు.
శృతి ఆకలి బాధ తీరలేదు..కడుపు లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి.  ఆమె కి “బీ యే” లో ఇంగ్లీష్ లెక్చరర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, “వాటర్ వాటర్ ఎవిరీవేర్, బట్ నో డ్రాప్ టు డ్రింక్”. ఓ అతిథి సర్వర్ మీద అరుస్తున్నాడు, “నేను చెప్పింది చెయ్యి…నాకు సలహాలు ఇవ్వ వద్దు”.
చిన్న పిల్లాడొకడు ఐస్ క్రీం కింద పడేసుకొంటూ తింటున్నాడు. వాళ్ళమ్మ, పట్టు చీర కట్టుకొన్న మధ్య వయసామె, వచ్చి, “కొంచెం ఆ ఐస్ క్రీం తినిపిస్తా అమ్మా?, అంది.
శృతి వాడికి ఐస్ క్రీం తినిపించసాగింది. ఆమె కి నోట్లో నీళ్ళూరుతున్నాయి..పక్క డస్బిన్ లో ఊసి వచ్చింది.
*********
నెమ్మది గా జనాలు తగ్గారు. రాత్రి పదకొండున్నర కి రిసెప్షన్ అయిపోయింది. కార్లు వెళ్ళిపోయాయి. వాటి తో పాటు పట్టు చీరలు వెళ్ళి పోయాయి. శృతికి ఆకలి అప్పటికే చచ్చిపోయింది. తల నొప్పి గా ఉంది. ఆమె కి కళ్ళు తిరుగుతున్నాయి. ..రక రకాల వంటకాలు..ఏది తినాలి..! తనకిష్టమైన గుత్తి వంకాయ కూర పెట్టుకొంది..ముద్ద కలుపుకొని ఆబగా రెండు ముద్దలు తింది..ఎక్కిళ్ళు వచ్చాయి..నీళ్ళు..నీళ్ళేవి..?..
“నీళ్ళ బాటిళ్ళు అయిపోయాయి” ఎవరో చెప్పారు. ఇంకొ రెండు ముద్దలు లోపలికి తోసింది.. అంగిట్లో తిరిగింది..వాంతి అయేటట్లుంది..కింద పడితే సూపర్వైజర్ ఊరుకోదు..పరుగెత్తింది వాష్ బేసిన్ దగ్గరికి..మధ్య లో నే ఆపలేక పోయింది.
సూపర్వైజర్ వచ్చి తిడుతోంది..ఆ మాటలన్నీ ఎక్కడో నూతిలోంచీ వినపడుతున్నత్లు ఉన్నాయి,”కస్టమర్ ప్లేస్ ని ఖరాబు చేయకూడదు..!నీ బోనస్ తగ్గించాల్సి వస్తుంది..!”

ఫంక్షన్ హాల్ వెనుక వదిలేసిన పదార్ధాలు గుట్ట గా ఒక కొండలా పేరుకొని పోయాయి. ఉదయానికి అవి కంపుకొడ్తాయి. వాటిని శుభ్రం చేయటం మునిసిపల్ ఉద్యోగుల విధి.

“ఆల్-ఇన్-వన్ రచయిత” అనబడు లిఖిత్ ప్రయత్నాల పోరాటాల కథ

లిఖిత్ ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. తన తండ్రి తనకిచ్చిన పాత డొక్కు బజాజ్ చేతక్ ని అధిరోహించి, దాన్ని కొంచెం అదిలించి,“గాల్లో తేలుతున్నట్లుందే..” ట్యూన్ ని ఈల వేద్దామనుకొన్నాడు. కానీ, ఎదురు గా నడుచుకొంటూ శంకర్ గాడు రావటం తో ఆగిపోయాడు. శంకర్, వీడి బుధ్ధి కొంచెం వంకర!
“ఏరా లిఖిత్, నీ కథ ఏదో ఆ “సాహిత్యం” పత్రిక లో అచ్చయ్యిందంట కదా?  పార్టీ ఇచ్చేయ్!”
“కథ అచ్చైతే అయ్యింది కానీ, పత్రిక వాడు కాసులేమీ పంప లేదు రా. ఓ రెండు నెలలు ఆగు, నా నవల ఒకటి ‘రాగం’ పత్రిక లో రాబోతోంది. అప్పుడు వచ్చిన డబ్బుల తో నీకు పార్టీ ఇచ్చేస్తా!”
“ఏమి నవల రా అది?”
“గొప్ప గొప్ప భావాలనూ, ఆదర్శాలనూ విరజిమ్మే పాపులర్ నవల రా. పేద వాడి ఆకలి గురించీ, మధ్య తరగతి మంద హాసం గురించీ,తెలుగు వారి హిపోక్రసీ గురించీ, జనరంజకం గా రాస్తున్నా. ఎప్పటికైనా వీరేంద్రనాథ్ అంత పాపులరూ, శ్రీ శ్రీ అంత ఆదర్శవంతమూ ఐన రచనలను రాసేస్తా చూడు..ఒక్కసారి పాపులారిటీ వచ్చిన తరువాత డబ్బులే డబ్బులు!అప్పుడు ఒక వోక్స్ వాగన్ కారు కొనాలి . బుజ్జి ముండ అదంటే నాకెంతో ఇష్టం!”
“బాబూ..తెలుగు లో నే రాస్తున్నావా ? ఐతే ఇది రచనలకు కాలం కాదు.అందులోనూ ఆదర్శ రచనలు రాసి డబ్బు సంపాదిస్తాననటం, “తివిరి ఇసుమున తైలం తీయటం” లాంటిది.
“ఆ ఏదో నేనంటే నీకు కుళ్ళు లేవోయ్! సౌదీ లో ఇసుక నుంచీ చమురు తీయటం లేదా..నేనూ అలానే తెలుగు పాఠక లోకం నుంచీ కాసుల నిధిని సంపాదిస్తాను.!”
“సరే, నీ నిధిని అప్పుడప్పుడూ నాకు కూడా కాస్త విదిలిస్తూ ఉండు” అని శంకర్ మెల్లగా జారుకొన్నాడు అక్కడి నుంచీ.
****************
లిఖిత్ సొంత అడ్రెస్ కవర్ తో పాటు తన నవలని పోస్ట్ చేసి వచ్చి పక్కనే ఉన్న పార్క్ లో కూర్చొన్నాడు.
“హమ్మయ్య! తన సాహితీ విజయ యాత్ర కి తొలి అంకం ఇది..ఓ గొప్ప రచయిత అయ్యే లక్షణాలు చిన్నప్పటి నుంచీ ఉన్నాయి తన లో. అందుకే తన తండ్రి ఇంజినీరింగ్ చదవమంటే తను బియ్యే లో చేరాడు. తన తండ్రి ఒట్టి అజ్ఞాని.”ఈ కథలూ కాకర కాయలూ కూడు పెడతాయా!?” అంటాడు. ఎప్పుడూ కూటి గురించిన యావే! ఆయన బాగానే సంపాదించాడా! నగరం లో ఓ రెండు ఇళ్ళూ మూడు సైట్లూ ఉన్నాయా!..అయినా,”కోటి విద్యలూ కూటి కోసమే రా!”అంటాడాయన”.
“తను ఒక్క సారి ప్రసిధ్ధ రచయిత అయ్యాడంటే, అభిమానుల్నించీ ఒకటే ఉత్తరాలు…ఆడ ఫాన్స్ లో ఒక ఇద్దర్నో, ముగ్గుర్నో ఎంచుకొని వారి తో ఇంచక్కా రొమాన్స్ చేయవచ్చు”.
పార్కులో బెంచీ పైన పక్కనే ఒకాయన కూర్చొని ఏదో రాసుకొంటున్నాడు.
“ఏమండీ కథ రాస్తునట్లున్నారు, మీరు రచయితా?”ఆరా తీశాడు లిఖిత్.
“నేను రచయితనే కానీ, ప్రస్తుతం నా ఇంటి వెచ్చాల పద్దులు రాస్తున్నాను”
సాటి రచయితని చూడగానే లిఖిత్ మనసు ఎగిరి గంతేసింది.
“నేను కాబొయే పాపులర్ రచయిత లిఖిత్ ని సార్!”
“నువ్వు విహారి పేరు వినే ఉంటావ్ కదా! అది నా కలం పేరు. మా ఆవిడ, “అనవసరం గా స్టాంప్ ల కీ, కవర్లకీ డబ్బు తగలెడుతున్నారు. అవి కొనక పోతే పౌడర్ డబ్బాలన్నా కొనవచ్చు” అని పోరటం తో నా రచనా వ్యాసంగం మాని వేసి స్కూల్లో పని చేస్తున్నాను.”
“స్టాంపులు దండగని రచనలు మానేయటమేంటి సార్? ఈ సమాజమనే స్టాంప్ మీద మన ముద్ర ను బలం గా గుద్దాలి.కొంచెం నా కథలు చదివి, మీ అభిప్రాయం చెప్తారా?”
విహారి “కొత్త బిచ్చగాడు పొద్దెరగడు”, అనుకొని, తేలుకుట్టిన వాడిలా మొహం పెట్టి, “ప్రస్తుతానికి సమయం లేదు. తరువాత ఎప్పుడైనా..”,అన్నాడు.
“సరే, అన్నట్లు, మీకు తెలిసిన ఎడిటర్ ఎవరన్నా ఉంటే పరిచయం చేయండి సార్.”
**********
లిఖిత్ నవలను రాగం పత్రిక ప్రచురించ లేదు సరి కదా, రాత ప్రతి ని తిరిగి పంపను కూడా లేదు. అయినా అతను పట్టు వదలని విక్రమారుడి లా పత్రికలకు కథలు పంపుతూనే ఉన్నాడు. కానీ అవన్నీ బ్లాక్ హోల్ లో పడిన కాంతిలా అజా పజా లేకుండా పోయాయి. రచనలు పంపేటప్పుడు స్టాంపులంటించిన సొంత అడ్రెస్ కవర్ పంపటం మానుకొన్నాడు లిఖిత్. అదొక  దండగ!
ఓ రోజు విహారి పార్కులో మళ్ళీ కనపడితే,ఆయన్ను లిఖిత్ బలవంత పెట్టి, ఒక ఎడిటర్ ని పరిచయం చేయమని తీసుకెళ్ళాడు. విహారి వెనుక సీట్లో కూర్చుంటే లిఖిత్ తన స్కూటర్ ని తిన్నగా నడప సాగాడు. రోడ్డు రణరంగం లా ఉంది. వాహనాలను గజి బిజి గా, ఒకరికొకరు అడ్డు పడుతూ డ్రైవ్ చేస్తున్నారు. విహారి, “రోడ్డు మీద ప్రవర్తనే మన సమాజం లో ప్రతిఫలిస్తుంది… స్వార్థం పెరిగిపోతోంది..డబ్బు యావ పెరిగిపోతోంది. ఈ వ్యాపార తత్వం వలనన కూడా నేను రాయటం మానుకొన్నాను” అన్నాడు.
లిఖిత్ గడుసు గా నవ్వుతూ, “మీరు చాలా నిస్వార్ధ మైన వారి లా ఉన్నారు. నాకు మీ ‘ఏ టీ ఎం’ కార్డూ, పిన్ నంబరూ ఇచ్చేయండి సార్” అన్నాడు.
విహారి పెద్దగా నవ్వేసి, లిఖిత్ భుజం మీద తట్టి, “నువ్వు భలే తమాషా మనిషివోయ్!”, అని, మనసులో, “వీడో తింగరి వెధవ లా ఉన్నాడే!” అనుకొన్నాడు.

ఎడిటర్ ‘ఏకాం’బరం గారి ముందు బల్ల కింద దొంతరలు గా వచ్చిన కవర్లు ఉన్నాయి.ఏకాంబరం అనేది ఆయన అసలు పేరు కాదు. పూర్వం ఒక దిన పత్రిక లో ప్రభుత్వాన్ని ఏకుతూ వ్యాసాలు రాసి ప్రసిధ్ధుడయ్యాడాయన. ఆవిధం గా వచ్చింది ఆయనకు ‘ఏకాం’బరం అనే పేరు. తరువాత ప్రభుత్వం ఆ దిన పత్రిక యాజమాన్యం మీద ‘ఇన్ కం ట్యాక్స్’ శాఖ ద్వారా వత్తిడి తెచ్చి ఏకాంబరాన్ని పీకించేసింది. ఇక అప్పటి నుంచీ బుధ్ధి తెచ్చుకొని పెద్ద వారికి అనుకూలం గా నడుచుకొంటూ కాలం నెట్టుకొస్తున్నాడు ఏకాంబరం.
ఏకాంబరం లిఖిత్ ని కూర్చోమనైనా అనకుండా కిందా మీదా చూసి, “మీరు దేని గురించి రాస్తారు?”, అన్నాడు.
“ఆదర్శాలూ, పేదరికం,ప్రేమా, విలువలూ, సంస్కృతీ.. ..”

ఏకాంబరంఒక్కసారి కుష్టు వ్యాధిగ్రస్తుడిని చూసినట్లు ఉలిక్కిపడి, లిఖిత్ ని మధ్య లోనే ఆపేసి, “బాబ్బాబూ, నా ఉద్యోగం ఊడగొట్టకు. మనకు కావలసినవి పత్రిక సర్క్యులేషన్ పెంచే కథలు. అసలే ఈ టీవీ ఛానళ్ళూ, ఇంటర్నెట్టూ వలన సర్క్యులేషన్ పడిపోతూంటే, నీ ఆదర్శాల ఆకలి కథలు వేసుకొంటే, ఈ పత్రిక మూత పడుతుంది. నా ఉద్యోగం ఊడుతుంది.”, అన్నాడు.
“అంటే మీకు మసాలా కథలు కావాలన్న మాట. మీరు కథలని ఎలా సెలక్ట్ చేసుకొంటారండీ?”
“కథ లో పట్టూ, కథనం లో బిగీ ఉండాలి. చదివించే గుణం ఉండాలి.ఈ ఆధునిక కాలం లో, బిజీ జీవితాలలో పాఠకులకి కథలు చదివే తీరిక ఎక్కడుంటుంది? కాబట్టీ కథలు టీవీ యాడ్స్ లా చిన్న గా, పాఠకుడి దృష్టిని కట్టిపడేసేలా ఉండాలి. సింగిల్ కాలం కథలూ, ఒక పేజి కథలూ..ఇలా రాయాలి..చాట భారతాలు రాయకూడదు. .. పాపులర్ కావాలంటే పాప్ కార్న్ సాహిత్యం రాయాలి మరి“, అని ఏకాంబరం తన ముందున్న కవర్ల దొంతరను ఒక్క సారి కదిలించాడు. దాని నుంచీ ఒక పోస్ట్ కార్డ్ బయట కొచ్చి కింద పడింది. “ఈ రాత గాడెవడో తెలివైనవాడు . క్లుప్తం గా ఓ పోస్ట్ కార్డ్ మీద కథ రాసి పారేశాడు. “ఈ వారం కథ” శీర్షిక లో ఈ సారి కి ఇతని కథ ప్రచురిద్దాం”, అని “పోస్టల్ స్టాంప్ ల పై కథలు రాసే రోజులు కూడా వస్తాయి,” అని ముక్తాయించాడాయన.
ఏకాంబరం మాటలు విని అముదం తాగిన మొఖం పెట్టాడు లిఖిత్.
లిఖిత్ ని చూసి ఏకాంబరం,”అలా అని నువ్వేమీ అధైర్య పడ వద్దు బాబూ,మేము అప్పుడప్పుడూ కథల పోటీలు పెడతాం..కానీ ఒక కండిషన్..ఆ పోటీ లకి సరిగ్గా నాలుగు పేజీల పది లైన్ల మూడు మాటలు ఉండే కథలను మత్రమే అనుమతిస్తాం.మాకు పత్రిక లో ఉండే నిడివీ, ప్రకటనల దృష్ట్యా ఇలాంటి కండిషన్లు తప్పని సరి. నువ్వు ఆ పోటీ లో నీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నీ కథ కి బహుమతి వచ్చినా, నువ్వు రాసినది యధా తధం గా మేము ప్రచురించక పోవచ్చు.సుబ్బి సుబ్బమ్మ అయినట్లు, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తాం.” అన్నాడు. ఏకాంబరం కాసేపాగి, తనలో ఏదో ఆలోచించుకొని, కుర్చీ కి చేరగిలబడి, “ఐనా, సాయంత్రం ఏడు గంటల కి నీ కథల ప్రతులు చూపించు. అప్పుడు నేను సికిందరాబాద్ క్లబ్బులో ఉంటాను. అక్కడికి పట్టుకొని రా, చూద్దాం”,అన్నాడు.
బయటికొచ్చినాక విహారి లిఖిత్ తో, “సాయంత్రం క్లబ్బు లో ఆయనకు ఓ రెండు డ్రింకులు స్పాన్సర్ చెయ్యి..అలా చేయకే నేను దెబ్బ తిన్నాను”, అన్నాడు.
లిఖిత్, “అలా అయితే నేను క్లబ్బుకే వెళ్ళను సార్. ఆంధ్రుల అభిమాన రచయితను అవ్వాలంటే గమ్యమే కాదు, మార్గం కూడా స్వచ్చం గా ఉండాలి”, అన్నాడు.
విహారి, “నీ ఇష్టం. ఏదో కుర్ర వాడివని నాకు తోచిన సలహా చెప్పాను”, అన్నాడు.
**********
లిఖిత్ ఇంటి ముందు సైకిల్ దిగిన శంకర్ లోపలికి వచ్చాడు. “ఏమండీ “ఆంధ్రుల ఆల్-ఇన్ వన్” రచయిత గారూ, నాకు ఇవ్వాల్సిన పార్టీ మాటేమిటి?ఈ పాటికి బాగానే సంపాదించి ఉంటావే!”, అన్నాడు  లిఖిత్ గది లోకొచ్చిన శంకర్ వ్యంగ్యం గా.
“ఏం సంపాదించటం లే! కాయితాలు వృధా! కథలు పంపే కవర్ల డబ్బులు కూడా వృధా! అందుకే ఆ డబ్బులైనా పొదుపు చేద్దామని ఇప్పుడు ఇంటర్నెట్ బ్లాగ్ ల లో కథలు రాస్తున్నా.కానీ, నెట్ లో కూడా చదివే వాళ్ళ కంటే రాసే వాళ్ళు ఎక్కువైపోయారు”, అన్నాడు లిఖిత్.
“ఇలా కాదు రా బాబూ, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నాకు తెలిసిన పబ్లిషర్ ఒకడున్నాడు. నీ రచనల మీద నీకు నమ్మకముంటే, అతని ని కలుద్దాం”
లిఖిత్ తన పాత నవల ప్రతి ఒకటి పట్టుకొని, శంకర్ తో పాటు పబ్లిషర్ పరాంకుశాన్ని కలవటానికి బయలుదేరాడు.
పరాంకుశం ఓ నాలుగు పేజీలు తిరగేసి,”వేద్దాం సార్, ఈ నవల వేద్దాం.ఓ ఐదు వందల కాపీలు వదులుదాం… పదిహేను వేలు ఓకే నా?” అన్నాడు.
లిఖిత్ గుండె ఒక్క సారి ఎగిరి గంతేసిది. కళ్ళ ముందు పదిహేను వేల పారితోషికం కనపడింది. “ఎన్నాళ్ళో వేచిన ఉదయం..”, అని పెద్ద గా పాడబోయాడు.
పరాంకుశం లిఖిత్ ని “రేపు ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వ గలుగుతారా?శంకర్ గారికి ఓ మూడు వందలు కమీషన్ పోతుంది లెండి”అన్నాడు.
“అంటే..ఛీ..వెధవ బతుకు..నా పుస్తకాన్ని నేనే డబ్బు పెట్టి అచ్చు వేసుకోవాలన్న మాట!”
దానికి పరాంకుశం, “లేక పోతే నాకెందుకు సార్ దూల? ఈ రోజుల్లో పుస్తకాలను ఊరికే ఇచ్చినా ఎవరూ కొనటం లేదు. అలాంటిది, ఊరూ పేరూ లేని మీ లాంటి రచయితల పుస్తకాలు ఎవరు కొంటారు? త్వరలో పుస్తకాలు రాయటం అనేది, శిల్పాలు చెక్కటం వంటి ఒక ప్రాచీన కళ అయిపోతుంది. కాబట్టీ, మీ పుస్తకాలను నా డబ్బులతో పబ్లిష్ చేస్తే, చివరికి నా చేతికి వస్తుంది ఒక చిప్ప!” అన్నాడు.
“ఎంత అవమానం..?  ఈ “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత”కేనా ఈ పరాభవం? నా కెపాసిటీ తెలియక భ్రమ పడుతున్నాడు ఈ పబ్లిషరాధముడు.”
శంకర్ భరోసా గా, “ఏమీ పర్లేదు లే, మీ నాన్న కొనిచ్చిన స్కూటర్ ఉందిగా! అది అమ్మేయ్!”, అన్నాడు.
**************
పాత స్కూటర్ అమ్మి అచ్చు వేయించిన నవల పది కాపీ లు కూడా అమ్ముడు పోక పోవటం తో,మిగిలిన కాపీలని లిఖిత్ సైకిల్ మీద పెట్టుకొని దానిని తన ఫ్రెండ్స్ కి దానం చేయవలసి వచ్చింది. లిఖిత్ ఫ్రెండ్స్ ఆ నవలని పాత న్యూస్ పేపర్ తో పాటు తూకం ప్రకారం అమ్మి సిగరెట్ ఖర్చులకు వాడుకొన్నారు.
తన పబ్లిషింగ్ ప్లాన్ బెడిసి కొట్టటం తో,లిఖిత్ కి ఏమీ తోచక మళ్ళీ శంకర్ ని ఆశ్రయించాడు. “వాడికైతే అయిడియాలు బాగా తడుతాయి”.
శంకర్ తన ఇంటి ముందు స్కూటర్ స్టాండ్ వేసి, సీట్ పై కూర్చొని, సాలోచన గా శూన్యం లోకి చూచి తల పంకించి, “నువ్వే ఒక పత్రిక పెట్ట రాదూ? దాని నిండా నీ రచనలే వేసుకొని, నువ్వు పాపులర్ అయిపోవచ్చు. ఒక్క సారి పాపులర్ అయిన తరువాత, కుక్కని కొట్టినా డబ్బు రాలుతుంది”
“నాకు కుక్క ని కొడితే రాలే డబ్బు వద్దు. జనాలు నా పుస్తకాల పేజీలు తిప్పితే రాలే డబ్బు కావాలి. నీ అయిడియా బాగానే ఉంది.కానీ ఒక చిన్న లోపం! పత్రిక లో పడే మన రచన పాపులర్ కావాలంటే ముందు పత్రిక పాపులర్ కావాలి. మరి పత్రిక ని పాపులర్ చేయటం ఎలా?”
“అహా.. ఇన్నాళ్ళకి నీ బుర్ర పాదరసం లా పని చేస్తొంది..ఇక ఖచ్చితం గా విజయం నీదే! పత్రిక ను పాపులర్ చేయటానికి పత్రిక పెట్టే ముందుగానే వీర పబ్లిసిటీ ఇస్తే సరి.”
“వీర పబ్లిసిటీ ఎలా ఇస్తారేం..?”
“ఆ ఏముందీ ముందు మన ఫ్రెండ్స్ లో నోటి మాట గా చెబ్దాం..తరువాత..టీవీ లో, ఇంటర్నెట్ లో,  హోర్డింగ్సూ గట్రా..”
“అబ్బో ఇదంతా తడిసి మోపెడవుతుంది..ఏమైనా “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత” అవ్వాలంటే ఇలాంటి చిన్న ఖర్చులూ కష్టాలూ తప్పేటట్లు లేవు. ఇదంతా నా భవిష్యత్ కి ఒక ఇన్వెస్ట్-మెంట్ లాంటిది. పైగా ఈ పత్రికల వాళ్ళూ తానా అంటే తందానా అనటం తప్పుతుంది…ఒక కథను హాయిగా మనకిష్టమైనన్ని పేజీలు రాసుకోవచ్చు. మనం రాసిన కథను మార్చే వాడే ఉండడు.”
“సరిగ్గా నా నోట్లో మాట చెప్పావు..కాక పోతే ఓ పది లక్షలు కావాలి. మీ నాన్న ని ఆ ఊరి బయటి సైటు తనది కాదనుకొనమను ”
“అబ్బో.. ఆ పాత డొక్కు స్కూటర్ అమ్మినందుకే మా నాన్న నా మీద గుర్రు గా ఉన్నాడు రా. అయినా,ఒక్క సారి మా నాన్న తో మాట్లాడతా!”    “సరే రా, మీ నాన్న తో మాట్లాడి, రేపు నాతో చెప్పు.ఈ మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ లోబిజీ గా ఉంటున్నాను.వస్తా మరి“
*********
లిఖిత్ వాళ్ళ నాన్న అహోబల రావు కి వాడి మాటలు విని అరికాలి మంట నోట్లో కొచ్చింది.
“స్కూటర్ ని అమ్మింది కాక, సైట్ అమ్ముతానంటావా? తోలు తీస్తా వెధవా..అయినా కోటి విద్యలూ కూటి కోసమేనోయ్..కథలూ కాకరకాయలూ….”
“..కూడు పెట్టవు..ఇంకా ఆపు నాన్నా, ఈ డయలాగ్ వినీ వినీ బోర్ కొట్టింది”
“కూడు అంటే అన్నం మెతుకులు మాత్రమే కాదు రా బడుధ్ధాయ్..! కూడు అంటే డబ్బూ..దర్పమూ..మీ ఫ్రెండ్ శంకర్ ని చూసి బుధ్ధి తెచ్చుకోరా..మొన్నటి దాకా స్లిప్పర్ లు వేసుకొని, కాళ్ళీడ్చుకొంటూ తిరిగేవాడు..ఇప్పుడు స్కూటర్ కూడా కొనేశాడు.నువ్వూ ఉన్నావ్ ఎందుకు? బంగారమంటి బజాజ్ స్కూటర్ ని అమ్మేశావ్! ఇక పుస్తకాలూ, రచనలూ అన్నావంటే కాళ్ళు విరిచి గాస్ పొయ్యి లో పెడతా. నా స్నేహితుడొకడికి కోఠీ లో బిజినెస్ ఉంది. వాడు దాంట్లో ఓ సూపర్వైజర్ ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకొన్నాడు.బుధ్ధి గా వెళ్ళి రేపటి నుంచీ ఉద్యోగం చేసుకో. లేక పోతే ఇంట్లో నుంచీ బయటికి నడువ్”, అని హెచ్చరించాడు అహోబల రావు.
“నాన్నా..తరువాత ‘వాసు’ సినిమా లో వెంకటేష్ తండ్రి లా నీ తప్పు నువ్వు తెలుసుకొంటావు..ఎప్పటికైనా ఆంధ్రుల ఆరాధ్య రచయిత ను కాక పోను”, అనుకొన్నాడు లిఖిత్.
*************
“ఒరేయ్ శంకర్, పత్రిక పెట్టటం మనవల్ల కాదు రా! సైట్ అమ్మమంటే, మా నాన్న నాకు బాగా మడ్డి కూడు పెట్టాడు”.
“ఏమీ దిగాలు పడకు రా. ఆ..ఒక అయిడియా..నువ్వే ఓ వెయ్యి పోస్టర్లు అచ్చు వేయించి నగరం అంతా అంటించెయ్ రా! “
“ఎక్కడ అచ్చేయిద్దాం..?”
“ఇంకెక్కడా..! నా ఫ్రెండ్ నరేష్ గాడికి ఒక ప్రెస్ ఉంది లే..మనకైతే తక్కువకే వేస్తాడు. మహా ఐతే ఆరేడు వందలు అవుతాయి..నే మాట్లాడతాలే!ఓ వంద అడ్వాన్స్ కొట్టు ముందు”
“ఒరే.., నువ్వు కమీషన్ నొక్కేయటం లేదు కదా?”
“చ..భలే వాడివి..ఆ పరాంకుశం గాడు ఏదో అన్నాడని..నువ్వు నమ్మేయటమేనా?”
*************
రోడ్ పక్కన, లిఖిత్ తన రాబోయే పత్రిక “అక్షరం” గురించి పోస్టర్ అంటించుకొంటున్నాడు.పక్కనే ఫస్ట్ షో జనాలు ఇళ్ళకు పోతున్నారు. ఇంత లో వెనుక గా ఎవరో కార్ హారన్ మోగించిన చప్పుడు వినపడించి. లిఖిత్ తల తిప్పి చూశాడు. కార్ లో శంకర్ ఉన్నాడు. “పోస్టర్ ల కు  బాగానే మైదా పెడుతున్నావే..రాయి రాయి..”కష్టే ఫలి”,పాపులర్ రచయితవవ్వాలంటే ఇవన్నీ తప్పవు మరి. అన్నట్లు ఈ నెల పదిన నా పెళ్ళి..నువ్వు తప్పకుండా రావాలి”, అని శుభలేఖ లిఖిత్ చేతి కందించి రయ్యిన తన కారు లో బిజీ గా వెళ్ళిపోయారు శంకర్ గారు.
వెనుక గా అతని సైకిల్ స్టాండ్ పై పోస్టర్లు దొంతర గా ఉన్నాయి. ఎన్నిచోట్ల అంటించినా అవి తరగటం లేదు.
“ఈ పత్రిక మాటేమిటో కానీ, ఇవి అంటించలేక తల ప్రాణం తోకకి వస్తోంది”, అనుకొన్నాడు.
“బాబూ ఒక్క సారి ఇలా వస్తా..చిన్న పని.. మా డైరక్టర్ గారు రమ్మంటున్నారు”,ఓ అరవై యేళ్ళ ముసలాయన పిలిచాడు.
“ఏమైన రాసి పెట్టాలా?”
“ఆ అదే అనుకొంటా..”
ముసలాయన సినిమా హాలు ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
“మా పోస్టర్లు అతికించే కుర్రాడు మానేశాడు..పోస్టర్లకు మైదా రాసే పని ఉంది.కిటికీ లోంచీ చూశా.బాగానే రాస్తున్నావ్.రేపట్నుంచీ వచ్చి పని లో  చేరిపో”
లిఖిత్ కి కళ్ళు తిరగ సాగినయ్. వడి వడి గా వచ్చి, పోస్టర్ల దొంతర లాగి పారేసి, సైకిల్ ఎక్కి ఇంటికి పోనిచ్చాడు.
“నాన్నా..రేపు ఆ సూపర్-వైజర్ జాబ్ లో చేరిపోతున్నాను. మీ ఫ్రెండ్ కి చెప్పేయ్”, అన్నాడు లిఖిత్ అహోబల రావు తో.
ఆ విధం గా ఆంధ్ర దేశం ఒక కాబోయే “ఆల్-ఇన్-వన్ రచయిత” ని కోల్పోయింది

అదృశ్యమైన అంకినీడు..ఒక చిన్న కథ..

భుజం మీదినుంచీ పైపంచె తీసి, బల్లమీది లేని దుమ్ము  దులిపి, పంచె పైకి లాగి కూర్చున్నాడు అంకినీడు.
“అమ్మాయ్..! అంకినీడొచ్చాడు రొండు మినపట్లు పెట్టు”, అంది ఆదెమ్మ కోడలితో.
“ఆ..ఊళ్ళో వాళ్ళందరికీ తేర గా పెట్టటానికి ఉందిక్కడ!”, కోడలు గొణుక్కొంది లోలోపల.
ఐదు మిముషాలయ్యింది..పదినిముషాలయ్యింది..పావు గంటయ్యింది..ఆ రెండు మినపట్లూ రాలేదు.
ఆదెమ్మ మళ్ళీ కేకేసింది, “సరితా, మినపట్లు”.
“ఆ మినపట్లంట తగలెయ్యవే!”, అని భార్యను కసిరాడు పక్కనే మంగలి తో గడ్డం చేయించుకొంటున్న చెరువు కాడి చిన్ని గారి వెంకయ్య .
అంకినీడు విసురు గా లేచి పై పంచె దులిపి భుజం మీద వేసుకొని నెమ్మదిగా బయటికి నడవ సాగాడు. ముందు విసురుగానే నడుద్దామనుకొన్నాడు. కానీ కాళ్ళు పట్టివ్వటం లేదు ఈ మధ్య.
ఆదెమ్మ, “అంకినీడూ ఆగయ్యా..!, ఒరే.. ఎంకన్నా..చెప్పేది సరిగా చెప్పొచ్చు గా..మాట పడటం మా కంఠంనీడారి లో అసలు లేదు.” అంది.
“ఆ..లేదు..లేదు..మీ కంఠంనేనారి ముఠా గురించి ఎవరికి తెలవదు..? అయినా ఇన్నేళ్లయినా పుట్టింటాళ్ళ మీద బెమత పోలేదమ్మా నీకు!”
మొత్తానికి అంకినీడు బల్ల మీద కూర్చొని మినపట్లు తిని కాఫీ తాగేదాకా ఊరుకోలేదు ఆదెమ్మ.
******************
అంకినీడు నెమ్మది గా వీధిలోకి వచ్చే సరికి పొద్దెక్కిపొయింది. చెప్పుల్లేని కాళ్ళు ఎండకి కాలుతున్నాయి.వెళ్ళి ఊరి అరుగుల దగ్గర కూర్చొన్నాడు.
“నాలుగు నెల్లు గా మెడ నరాలు ఒకటే పీకటం. కణతలు అదురుతున్నాయి. డాక్టర్ దగ్గరికి పోదామంటే చేతిలో చిల్లి గవ్వకూడా లేదాయే..”
మచ్చల పిల్లి  ఒకటి నీడ లో మాగన్ను గా నిద్ర పోతోంది.పక్కనే ఓ దొడ్లో కాకి కుడితి తొట్టి అంచు మీద కూర్చొని ఎండకి నీళ్ళు కతుకుతోంది.
పది రోజుల గడ్డం తెల్ల గా మాసి ఉంది. మంగలి నాగరత్నం పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అంకినీడు మాసిన గడ్డాన్ని వేళ్ళతో నిమురుకొని,”ఇదుగో నాగరత్నం..కాత్తి గెడ్డం గీత్తా..? చేయించుకొని పది రోజులయ్యింది..”, అన్నాడు.
“మా వాడు సెంటర్లో షాప్ పెట్టాడు అక్కడ గీయించుకో”, సైకిల్ మీద గబ గబా వెళ్ళిపోయాడు నాగరత్నం.

అంకినీడు ఒకప్పుడు బాగానే బతికాడు. నాన్న అంజయ్య. ఆయన ఆదెమ్మ పెదనాన్న కొడుకు.  అంకినీడు చిన్నప్పుడే చనిపోయాడాయన. అమ్మ శేషమ్మ, ఆదెమ్మ కంటే పదిహేనేళ్ళు పెద్దది. అంకినీడు పట్నం పిల్లని పెళ్ళి చేసుకొన్నాడు. కానీ శేషమ్మకు కోడలు తీరు ఏమాత్రం నచ్చలా. “పని తక్కువ షోకులెక్కువ”, అనుకొంది శేషమ్మ.
కోడలికి శేషమ్మ తనని రాచి రంపాన పెడుతున్నట్లనిపించింది.ఊళ్ళోవాళ్ళందరూ, “శేషమ్మ కోడల్ని చెర కట్టనీయదు”, అనుకొన్నారు.

పిల్లాడినెత్తుకొని పుట్టింటి నుంచీ వచ్చిన వెంటనే కోడలికి పనులు పురమాయించటం మొదలు పెట్టింది శేషమ్మ. అంకినీడు కూడా అమ్మని సమర్ధించాడు. దానితో తన తండ్రికి రహస్యం గా ఉత్తరం రాసి, రమ్మంది కోడలు. పిల్లాడిని తీసుకొని, తండ్రితో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రి తో వెళ్ళిన ఆమె తరువాత మళ్ళీ రానేలేదు. అంకినీడూ ఆమె దగ్గరికి పోలేదు.కంఠంనేని వారి అభిమానం అడ్డొచ్చింది అంకినీడు కి. ఊళ్ళో వాళ్ళెవరో అనుకొంటుంటే విన్నాడు, తన భార్య కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేసిందని, ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడనీ.
శేషమ్మ ఉన్నంతకాలం అంకినీడుకి ఇంత ఉడకేసిపెట్టింది. శేషమ్మ పోయేనాటికి పెరిగిన ధరలకి ఉన్న ఎకరం చెక్కా తుడిచిపెట్టుకొని పోయింది. కూలికెళ్దామంటే అప్పటికే వేళ్ళు పట్టివ్వటం మానేశాయి. కాళ్ళు కదలటం లేదు. ఇక అప్పటి నుంచీ ఊళ్ళో అయిన వాళ్ళ దగ్గర తింటూ ఎలాగో రోజులు గడిపేస్తున్నాడు.

బుచ్చియ్య గారి దామోదర రావు చేతి వాచీ చూసుకొంటూ అరుగుల దగ్గరికి వచ్చాడు. అంకినీడు కి ఈ మధ్య చూపు ఆనటం లేదు. కళ్ళు పువ్వులేసినై. కళ్ళపై నుదుటికడ్డం గా చేయ్యి పెట్టి , కళ్ళు చికిలించి పళ్ళు బయటపెట్టి చూశాడు దామోదర రావు వచ్చిన వైపు కి.  దామోదర రావు అంకినీడు ని చూసి ఒక నవ్వు నవ్వి, “ఏం.. పలారం అయ్యిందా..?” అన్నాడు, చేతి వేళ్ళు ఒకటి చేసి నోటి దగ్గర ఊపుతూ.
దామోదర రావు పిల్లలందరూ అమెరికా లో ఉన్నారు. ఇక్కడ ఓ యాభై యెకరాలు ఉంది. అయినా, హైదరాబాదు నుంచీ రావటానికి, కొబ్బరి బొండాల తిరుగు లారీ లో ఫ్రీ గా వస్తాడని చెప్పుకొంటారు ఊళ్ళో జనాలు.
అయిందంటూ తలూపాడు అంకినీడు. “ఎందాకా…?”, దామోదర రావు ని అడిగాడు.
“ఇక్కడకే కొట్టుకి ..మజ్జానం మా ఇంటికి రా రాదూ?”, అన్నాడు దామోదర రావు.
అంకినీడు ని అన్నానికి రమ్మని, ముందు ఆ పనీ ఈ పనీ చేయించుకొని, తరవాత రాత్రి మిగిలిన కూడూ ఇంత పచ్చడీ వేయించటం దామోదర రావుకి అలవాటు. మొదట్లో  చెప్పింది చేసేవాడు, కానీ,ఇప్పుడు తన కాళ్ళూ చేతులూ తన మాట వినటం లేదు.
పిల్లి నెమ్మది గా లేచి జారుకో సాగింది. అంకినీడు దానికేసి చూపించి, “దాన్ని అడుగు ..వస్తందేమో..!”, అన్నాడు దామోదర రావు తో.
“నీకు ఇంకా గీర్వాణం వదలలా..మీ కంఠంనేని వారి ముఠా లోనే ఉందీ టెక్కు”, అని కొట్టు వైపుకి ఏదో కొనటానికి వెళ్ళాడు.
“పొద్దున్నే ఆదెమ్మ మహా తల్లి ఆదుకుంది..ఇక ఈ మజ్జానం ఎట్టా గడుత్తుందో!” అనుకొంటూ పై పంచె భుజం మీద వేసుకొన్నాడు. ఆ పై పంచె కి చిరుగులు పడిఉన్నాయి. ఐనా అంకినీడు దానిని వదలడు. “రైతన్నతరవాత పైపంచె లేకండా ఎలా?”.
నెమ్మది గా కాళ్ళీడ్చుకొంటూ, కాలువ వైపుకి బయలు దేరాడు. ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. “కాత్త ఆ కాలవ కాడైనా చల్ల గా ఉంటంది” అనుకొన్నాడు.
**********
పైన ఎండగా ఉన్నా కాలువ గట్టు మీద చెట్టు కింద చల్ల గానే ఉంది. నీరు స్థిమితం గా పారుతోంది. కాలువకడ్డం గా తాటి మాను ఒకటి వేసి ఉంది. కాలువ గట్టు పచ్చిక తో పిచ్చి మొక్కల తో పచ్చగా ఉంది.
“తన చిన్నప్పటి నుంచీ ఈ కాలవ మాత్రం మారలా..అప్పుట్నుంచీ ఇప్పుది దాకా ఎంత నీరు పారి ఉంటంది దీంట్లో..అయినా ఈ కాలవ మాత్రం మారలా! చిన్నప్పుడు తను అక్కడే తోటి వాళ్ళ తో కలిసి ఈతలు కొట్టాడు. తన తోటి వాళ్ళు అందరూ చాలా వరకూ పై చదువులకెళ్ళారు. తానొక్కడే తన తల్లి శేషమ్మ గారం వలన చెడి పోయాడు. ఏదైనా తన కి ఆయుష్షు ఎక్కువ. తన స్నేహితులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాళ్ళు కూడ చాలా మంది కాలం చేశారు..తను మాత్రం మిగిలున్నాడు..ఇలా…”

“ఆ మజ్జ, డాబా రాఘవయ్య గారి అబ్బాయి పెళ్ళి కి పెద్ద కారేత్తే  ఎల్లాడు తను బెజవాడ. అక్కడంతా దిక్కులేనాళ్ళు రోడ్డు పక్కన పడుకోవటమే..తను ఊళ్ళో నే ఉండటం వలన తనకా గతి పట్టలేదు..ఏదో పూరిల్లైనా రేత్రి పడుకోవటానికో ఇల్లుంది తనకు… సరే, పెళ్ళి కెళ్ళాడా.. ఆ పెళ్ళి లో కనపడింది తన పెళ్ళాం. పక్కనే ఉన్నాడు తన కొడుకు. అంతా తన పోలికే! తన బార్యా, తనని చూసి కూడా చూడనట్టే మొగం చాటేసింది. కొడుకుకి చెప్పినట్టు కూడ లేదు…తన్ని విడిచి పెట్టి పోయినపుడు పిల్లాడికి ఉహ కూడా తెలియదు..ఇంకా పిల్లాడు తనని ఎట్టా గుర్తు పడతాడు? తనకి మాత్రం అనిపించింది..ఆడి దగ్గిరికి ఎల్లి “ఒరే! నేను మీ నాన్నని రా!”, అని గుండెలకి అదుంకోవాలని.”

నెమ్మది గా వెళ్ళి తాటి మాను ఎక్కాడు.కంటి కి మాను సరిగా ఆనటం లేదు. పాదం ముందు పాదం పెడుతూ కాలువ మధ్యకి చేరుకొన్నాడు. మాను మీద గొంతుకు కూర్చొని నీళ్ళలోకి చూశాడు. నీళ్ళలో చచ్చిన పావురమొకటి కొట్టుకు పోతున్నట్లుంది.  ఛాతి లో సన్న గా నొప్పి మొదలయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చట్ మని నీళ్ళు శబ్దం చేశాయి. ఆ సాయంత్రానికి ఊరి చివర లాకుల దగ్గర కనపడింది ఊళ్ళో వాళ్ళకి అంకినీడు శవం.

సెక్స్ యొక్క వ్యాపారీకరణ లో కుటుంబ వ్యవస్థ పాత్ర

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక నవలలో హీరో ఒక క్యాపిటలిస్టు. అతను మొదట “మీసాలూ గడ్డాలూ పర్మనంట్ గా తీసేసే ఒక లోషన్ ని మార్కెట్ లోకి వదిలి ఉచితం గా అమ్ముతాడు. అదే సమయం లో ఓ వందమంది కుర్రాళ్ళ తో ఆ లోషన్ వాడకుండా ఎగ్రీమెంట్ రాయించుకొంటాడు.
ఉచితం కాబట్టీ ఊళ్ళో కుర్రాళ్ళందరూ ఆ లోషన్ వాడి గడ్డాలూ మీసాలూ ఊడగొట్టుకొంటారు. కొత్త కాబట్టీ వాళ్ళకి అది ఒక ఫాషన్ గా అనిపిస్తుంది. ఊళ్ళో కుర్రాళ్ళందరూ మొహం మీద వెంట్రుకలు కోల్పోయిన తరువాత కొన్ని సంవత్సరాలకి, తాను ఎగ్రీమెంట్ రాయించుకొన్న మీసాలూ గడ్డాలూ ఉన్న కుర్రవాళ్ళని ఊళ్ళో తిప్పుతాడు హీరో.
మిగిలిన కుర్రాళ్ళకి కూడా ఈ ఎగ్రిమెంట్ కుర్రాళ్ళ లా గడ్డాలూ మీసాలూ కావాలనిపిస్తుంది. అప్పుడు హీరో ఊళ్ళో కుర్రాళ్ళ మీదకి వెంట్రుకలు మొలిపించే లోషన్ ఒకటి వదులుతాడు. వాళ్ళ దాన్ని హాట్ కేకుల్లాగా కొనుక్కొంటారు.
ఇక్కడ హీరో వ్యాపార రహస్యమేమంటే, “కొరత ఉన్న వస్తువుకి డిమాండ్ ఉంటుంది”. కాబట్టీ మంచి వ్యాపారి కొరతని కృత్రిమంగా నైనా సృష్టించి సొమ్ము చేసుకొంటాడు.
కుటుంబ వ్యవస్థ లేని పాత మంచి రోజులలో, గాలీ నీరు లానే సెక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడుపడితే అప్పుడు దొరికేది.సెక్స్ చేసేటప్పుడు తప్పితే జనాలు దానిని గురించి పట్టించుకొనవలసిన అవసరం ఉండేది కాదు.

కుటుంబ వ్యవస్థ రావటం తో సెక్స్ కి ఈ వ్యవస్థ బయట కొరత ఏర్పడింది. వ్యవస్థ లో కొంత కాలం ఉండి బోర్ కొట్టిన వాళ్ళకీ, వ్యవస్థ తో అసంతృప్తులకీ ఒక సేఫ్టీ వాల్వ్ లా దేవదాసీ సిస్టమూ, భోగం వాళ్ళూ బయలు దేరారు. మనిషికి కావల్సిన, కొరత ఉన్న, ఏ వస్తువుకైనా ఒక రేటు ఉంటుంది. అలానే వీరికీ ఒక రేటు ఉంది. ఈ విధం గా చాలా తక్కువ స్థాయి లో వ్యాపారమైన సెక్స్, పాశ్చాత్యుల రాక తో, వారి విలువల తో మరీ రోడ్ సైడ్ బిజినెస్ గా మారింది.
కుటుంబ వ్యవస్థా, కుల వ్యవస్థా కలిపి 90% ప్రేమలు విఫలమయ్యేటట్లు చేశాయి. మన సమాజం లో అధిక భాగం ఒకానొక సమయం లో unrequitted love తో బాధ పడిన వారేననటం లో అతిశయోక్తి లేదు.  సెక్స్ అందకుండా పోవటం వలన దానికి ఒక ఊరించే స్వభావం వచ్చి, యువత తన సమయాన్ని దాని గురించి ఆలోచించటంలోనే వృధా చేసుకొంటోంది. కొంత మంది యువకులు చేసే యాసిడ్ దాడులలో ఈ “సెక్స్ కొరత” పాత్ర కాదనలేనిది.
అమెరికా, జపాన్ లాంటి దేశాలలో కొన్ని బార్స్ లో అమ్మాయి కబుర్లు చెబితే ఒక రేటు, మందుపోస్తే ఒక రేటు, ముట్టుకోనిస్తే ఒక రేటు ఉంటాయి. ఫోన్ లో మాట్లాడితే వేరొక రేటు. మొత్తానికి, “గాలిపీల్చటం లా, నిద్రపోవటం లా ఎంతో సహజమైన సెక్స్”, ని ఒక మ్యూజియం లో వస్తువు లా చేసి దానికి రుసుము వసూలు చేస్తున్నారన్న మాట. ఇక వ్యాపార ప్రకటనల లో సెక్స్ ఉపయోగించే సంగతి అందరికీ తెలిసిందే.
సినిమాలూ, నెట్టూ, టీవీ ల లో సెక్స్ అమ్మకం సంగతి చెప్పనక్కరలేదు.సినిమాలలో నటీమణులు పిక్క చూపించటానికో రేటు, జబ్బ చూపించటానికింకో రేటు, సంపదలు చూపించటానికిక్నో రేటు. శరీరసౌష్టవం ఉన్న కొంత మంది తారలు, తాము అంతా చూపించటానికి ఇంత రేటు అని అంటారు, పశువుల మార్కెట్లో పొదుగుని బట్టి గేదే ని కొన్నట్లు. వర్తమానం లోనే కాక వారి అంగాలకి భవిష్యత్తులో కూడా రేటు కట్టే ఇన్స్యూరెన్సులు పశువుల మార్కెట్ కి కూడా అందనంత నీచం గా ఉంటాయి.

సెక్స్ బొమ్మలూ, ఉపకరణాలూ మొదలైన వాటి మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లలో ఉంటుంది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, పడమట్లో కొందరు కుర్రాళ్ళూ పెళ్ళి కంటే ఈ చూసే సెక్సే బాగుందని పెళ్ళి చేసుకోరంట!
జీవకోటి కి దేవుడి వరమైన, ఎంతో సహజమైన, సెక్స్, మనిషి పెట్టుకొన్న వ్యవస్థల వలన ఇప్పుడు మనిషిని ఒక ఆట బొమ్మను చేసి ఆడిస్తోందన్న మాట!  ఒకప్పుడు మనిషి ఆలోచనలలో చాలా తక్కువ చోటు ఉన్న సెక్స్ కి ఇప్పుడు మనిషి ప్రతి పది నిముషాలకీ (?) దానిని గురించి ఆలోచించకుండా ఉండ లేనంత ప్రాముఖ్యత(?) వచ్చింది.

జంతువులు సెక్స్ గురించీ, సెక్స్ సామర్ధ్యం గురించీ టెన్షన్ పడతాయంటేనె మనకి నవ్వు వస్తుంది. కానీ మనిషి తన సామర్ధ్యం గురించి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు . ప్రధానం గా దీనిని సొమ్ము చేసుకొనేటందుకు సెక్సాలజిస్టులు బయలుదేరారు. సెక్స్ సామర్ధ్యం గురించి జనాలలో “బెంచ్ మార్క్స్” సృష్టించి వారిలో “నేను ఆనందించటం లేదేమో 😦 !” అనే అనుమానాలను రేకెత్తించి, మళ్ళీ పోగొట్టటం మొదలెట్టారు :-). అనుమానం రేకెత్తించేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు..పోగొట్టేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు.జబ్బుల పేరుతో డబ్బులు గుంజవచ్చు.

పాత తరాల లో ఒక వయసు అయిన తరువాత వారు graceful గా తమ వయసును అంగీకరించి ఆధ్యాత్మిక విషయాలపై మనసు మరల్చే వారు. ముసలివారు అవటం చాలా సహజ మైన విషయం కదా! కానీ వ్యాపారం దాన్ని కూడా సొమ్ముచేసుకొంటుంది. ఇప్పుడు, వయాగరాల వంటి మాత్రలు మనుషులు తమ పై బడ్డ వయసును అంగీకరిచకుండా చేస్తున్నాయి. ఎంత కాలమైనా పడుచువాడిగా ఉండి, తమ మగతనానికి కూడా, “తలకి హయిర్ డై వేసినట్లు”, పూతలు పూస్తున్నారు!మహిళల సౌందర్య సాధనాల పిచ్చి కూడా ఈ పరిధిలోకే వస్తుంది.

మానవ సంబంధాల లో కూడా సెక్స్ పరోక్షం గా కమర్షియలైజ్ అయింది. ఒకతని గర్ల్ ఫ్రెండ్ ఆమెకి ఖరీదైన గిఫ్ట్ లు  ఇస్తే కానీ సంతోషం గా ఉండదు. ఆమె సంతోషపడితే గానీ ఆమెపక్కకి చేరి మురిపెం తీర్చొకోవటానికి కుదరదు.

మొత్తానికి కుటుంబ వ్యవస్థా, వ్యాపారమూ కలిసి, ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలూ అబ్బాయిలూ ఉన్న మన సమాజాన్ని,నడి సముద్రం లోని నావికుని లా, “water water everywhere, but no drop to drink” అని అనిపించేటట్లు చేశారు!
అయితే ఈ సెక్స్ యొక్క వ్యాపారీకరణ కు పరిష్కారమేమిటి అంటారా? చాలా సింపుల్…మనం అర్జంట్ గా ఆది మానవులు గా మారిపోవటమే! 🙂  😦

ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?

కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే దాని మూలాల లోకి పోవాలి. కాబట్టీ కొంచెం ఓపిక పట్టండి..
మనిషి ప్రాచీన కాలం లో జంతువులాగానే జీవించే వాడు. మందలు మందలు గా ఉండే జంతువుల లా నే మనుషులు కూడా గుంపులు గుంపులు గా జీవించే వారు.మనిషి కోతి జాతినుంచీ పరిణామం చెందాడనేది జీవ పరిణామ సిధ్ధాంతం ప్రకారం తెలిసిన విషయం. జంతువు ల లో స్త్రీ పురుష సంబంధాలు many to many గా ఉండేవి. ఒక ఆడ జంతువు అనేక మగ జంతువు ల తో మైధునం జరిపేది. అలానే ఒక మగ జంతువు అనేక ఆడ జంతువుల తో! వాటికి వావి వరుసలు ఉండేవి కాదు. క్షీరదాలన్నీ తమకు పుట్టిన జంతువులతో మైధునం జరుపుతాయి. అలానే ఒకే జంతువు కి పుట్టిన ఆడ మగా జంతువుల మధ్య కూడా మైధునం జరిగేది. మైధునం విషయం లో ఆడ మగా మధ్య ఒక తేడా ఉండేది. ఆడ జంతువు కొన్ని కాలాల లో మాత్రమే పరిమితమైన మగ జంతువుల తో మైధునం జరిపేది. దానికి అండం విడుదల ఆ కాలం లో మాత్రమే జరిగేది. కాబట్టీ, అది తన అండాన్ని, మగ జంతువులలో తనకోసం పోటీ పడి గెలిచిన జంతువు కి సమర్పించుకోవలసి వచ్చేది. అంటే మగ జంతువులలో powerful జంతువు మాత్రమే మైధునానికి అర్హత పొందేది. ఈ ప్రవర్తన క్రమం గా జన్యువులలో నిక్షిప్తమై rule of attraction గా తయారయింది. మనుషులలో కూడా ఆడవారు హోదా డబ్బూ ఉన్న వారిని ఇష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం!
మనిషి homosepian గా మారే దశ లో రెండు ముఖ్యమైన జన్యు మార్పులు జరిగాయి. ఒకటి మనిషిలో selfish gene ఏర్పడటం. దీని వలన మనిషికి “ఆలోచనలూ, జ్ఞాపకమూ, అంతరాత్మ ” ల తో కూడిన ఒక centre ఏర్పడింది. ఈ centre నే నేను లేక అహం అన్నారు. రెండవ జన్యు మార్పు “మనిషి లో ఇతర మనుషుల తో భావోద్వేగ సంబంధాలను పటిష్టపరిచే భావోద్వేగ సున్నితత్వం” ఏర్పడటం.

ఈ రెండు మార్పుల వలనా మానవ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక జంతువు తనకు పుట్టిన పిల్ల జంతువు ని maternal instinct తో సాకుతుంది. కానీ ఆ పిల్ల జంతువు పెద్దదైన తరువాత, దాని తల్లికీ , దానికీ ఏ విధమైన మాతృత్వ సంబంధమూ ఉండదు. ఆ రెండూ మైధునం కూడా చేస్తాయి.  జంతువు ల లో మాతృత్వం అనేది ఎక్కువ గా instinct గానూ, తక్కువ గా భావోద్వేగపరం గానూ ఉంటుంది. పై పెచ్చు వాటి లో జ్ఞాపకమూ, ఆలోచన, చేతనా, అంతరత్మా లేక నేను అనేవి ఉండవు. కాబట్టీ పిల్ల జంతువు పెద్దది అయినపుడు దానిలో దాని తల్లి జంతువు కి వేరొక, “వయసు లో ఉన్న జంతువే” కనపడుతుంది కానీ, తన మాతృత్వపు భావోద్వేగపరమైన బిడ్డ కనిపించదు.(అయితే కొన్ని ఆడ జంతువులు సమూహం లో పుట్టిన మగ జనంతువులను దూరం గా తరిమేస్తాయట. ఈ విధం గా ఇన్సెస్ట్ అనేది జరగదు. ఆయా జంతు జాతులలో ఇన్సెస్ట్ జరగకపోవటం వలన జన్యుపరం గా దృఢమైన వారసత్వం సంక్రమిస్తుంది (ఇన్సెస్ట్ వలన ఎందుకు వీక్ అవుతాయనే ప్రశ్నకు జెనెటిక్స్ క్లియర్ గా సమాధానం చెబుతుంది..suppressed allelle..dominant allelle etc) . వాటి సర్వైవల్ బాగుంటుంది. ఆవిధం గా వావి వరుసల అంకురార్పన evolutionary behavior ద్వారా జరిగింది. )
కానీ మనిషి లో బిడ్డను పెంచిన చిన్నప్పటి తీవ్రమైన మాతృత్వపు భావోద్వేగాలు జ్ఞాపకం లో భాగమౌతాయి. తద్వారా మనిషి యొక్క “నేను” లోనూ, మనిషి వ్యక్తిత్వం లోనూ భాగమౌతాయి. మనిషి ఈ భావోద్వేగాలనుండీ బయటపడి తన బిడ్డను, వేరొక వయసొచ్చిన మనిషి గా చూడలేదు. దీని వలన మనిషి తన వారసులనూ, బిడ్డలనూ పెద్దయిన తరువాత కూడా బిడ్డలు గా పెంచటం నేర్చుకొన్నాడు.
గుంపులు గా కలిసి ఉన్న మనుషులలో ఈ విధం గా వారసులను పెంచటం మొదలవ్వటమే కాక వారిని తమ ఉనికికీ, తమ జాతికీ extensions గా గుర్తించటం మొదలయింది. ఇదే సమయం లో స్త్రీల రుతు చక్రం దాని seasonality ని కోల్పోయి periodic గా మారింది. దీని వలన స్త్రీలకి జంతువు ల లో కంటే మగవారి తో సంబంధాల విషయం లో degree of freedom పెరిగింది.

బిడ్డల విషయం లో జంతువుల నుంచీ మనిషి వరకూ జరిగిన పరిణామమే, ఒకేతల్లి బిడ్డల విషయం లోనూ జరిగింది. ఈ విధం గా పెద్ద వారికీ బిడ్డలకీ, ఒకే తల్లి బిడ్డలకీ మధ్య దాంపత్య సంబంధాలు నిషిధ్ధమయ్యాయి. “జన్యుపరం గా ఒకే రక్తం లో సంబంధాలు నాసి రకమైన పిల్లలను కలిగించటం వలనకూడా ఈ దాంపత్య సంబంధాలను వివిధ సంస్కృతులు నిషేధించాయి”, అనే వాదన ఒకటి ఉంది.  కానీ సంస్కృతులు “జన్యు పరం గా నష్ట దాయక మైన మేనరికం”, మొదలైన సంబంధాలను ఆమోదించాయి. కాబట్టీ ప్రాచీన సంస్కృతికి, “ఈ నష్టాలను దృష్టి లోఉంచుకొని, ఆయా సంబంధాలను నిషేధించే విజ్ఞానం ఉంది” అనిపించదు.
మొదట ఒక్కో ఆడదీ అనేక మగవారికి బిడ్డలను కనేది. మగవారు తమ బిడ్డలు ఎవరో కూడా పట్టించుకొనే స్థితి ఉండేది కాదు. అమ్మ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ బిడ్డలను సాకేవాడు. ఎందుకంటే ఒక ఆడ దానికి అనేక మగవాళ్ళు బిడ్డలను కనే వారు. అదే మగవాళ్ళు మిగిలిన ఆడవారికి కూడా బిడ్డలను కనే వారు. అందుకే anthropology ప్రకారం “మేన మామ” అనేది నాన్న అనే దానికన్నా పురాతన మైన సంబంధం.
మనుషుల అంతశ్చేతన ఏర్పడి “తన” అన్న భావన కలగటం మొదలుపెట్టిన తరువాత, మనిషి “తన” పిల్లలను కూడా గుర్తించటం మొదలు పెట్టాడు. అయితే ఒక్కోసారి తన పిల్లలను కూడా  గుర్తు పట్టటం కష్టం కావచ్చు. పిల్లల పోలికలన్నీ తల్లివే అయి ఉండవచ్చు. దీని వలన వేరే మగ వాడి పిల్లలను కూడా తన పిల్లలే అనే భ్రమ లో ఉండవచ్చు. పైగా తన పిల్లలను మిగిలిన పిల్లలతో కలిపి ఆదది పెంచటం వలన వారి మనుగడ కి నష్టం ఉండవచ్చు. వీటన్నిటి దృష్ట్యా మగవాడు ఆడ దానితో కలిసి కుటుంబం అనే ఒక వ్యవస్థ ని ప్రారంభించాడు.

ఆడ వారు ప్రకృతి స్వభావ రీత్యా తమ అండాన్ని ఒక short listed mate తోనే పంచుకోవాలి. కాబట్టీ ఆడవారు ఒకే సమయం లో అనేక సంబంధాలు కలిగి ఉండే వారు కాదు. కానీ మగవాడికి ఉన్న అపరిమితమైన వీర్య కణాల దృష్ట్యా అతను కుటుంబం లోనే ఉంటూ అనేక ఆడ వారి తో సంబంధాలు కలిగి ఉండేవాడు.
సమాజం లోని అధికార సంబంధాలకు (power equations) అతీతం గా ఇది జరిగేది. కాలమాన పరిస్థితులని బట్టి మానవ సమాజాల్లో ‘మాతృస్వామ్యం’ లేదా ‘పితృ స్వామ్యం’ ఉంటూ ఉండేది. సాధారణం గా యుధ్ధాలు లేని స్థిరమైన సమాజాలలో మగవాడి అవసరం అంతగా ఉండేది కాదు. అలాంటి సమాజాలలో,  పిల్లలను కనటానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా మాతృస్వామ్యం అమలు లో ఉండేది. యుధ్ధాలు ఉండే అస్థిర సమాజం లో మగ వారి దేహ దార్ఢ్యానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా, ఆడు వారికి ఉండే రుతు చక్రం, గర్భదారణలనే పరిమితుల దృష్ట్యా పితృస్వామ్యం అమలులో ఉండేది.
వ్యవస్థ మాతృస్వామ్యమైనా, పితృస్వామ్యమైనా మగవారు ఒకే సమయం లో అనేక ఆడ వాళ్ళ తో సంబంధాలు కలిగిఉండే వారు.ఆడవారు ఒకే సమయం లో ఒకే సంబంధం కలిగి ఉండే వారు. ఇది ఆడ మగా ప్రకృతులలోని వైరుధ్యం వలన జరిగేది. ఒకప్పటి కేరళ వంటి మాతృస్వామ్య సమాజం లో కూడా మగ వారు బహు భార్యత్వం కలిగి ఉండేవారు.

పాతకాలం లో ఆడవారిలో మైధున ప్రక్రియ కీ గర్భధారణకీ విడదీయ రాని సంబంధం ఉండేది. ఇక ఆధునిక కాలానికి వస్తే contraceptives వలన మైధునానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెగిపోయింది. దీని వలన ఆడ వారు sensual pleasure ని కొత్త కోణం నుంచీ కొత్త attitude తో చూసే అవకాశం మొదలయింది. పాత కాలం నుంచీ ఆడవారి లో సెక్స్ కీ భావోద్వేగ అవసరాలకూ ఉన్న లంకె క్రమం గా తెగిపోతోంది. ఆధునిక ఉద్యోగాలలో ఆడవారు కూడా మగవారికి ధీటుగా మనగలగటం వలన, ఆడ వారికి ఉండే  dependency లాంటి లక్షణాలు తగ్గి, తద్వారా కూడా సెక్స్ కీ భావోద్వేగానికీ ఉన్న లింక్ నెమ్మదిగా బలహీన పడుతోంది. మనం పాశ్చాత్య దేశాలలో ఈ trend ని బాగా చూడ వచ్చు. మన దేశం లో కూడా ఈ trend అనతి కాలం లోనే వస్తుంది.అయితే  మగా ఆడా నైజాలలో ఉన్న జన్యుపరమైన తేడాలు మాత్రం మార లేదు. ఉదాహరణ కి మగవారి సెక్సువాలిటీ ఎక్కువ గా దృశ్య సంబంధమైనది. ఆడ వారి సెక్సువాలిటీ దృశ్యసంబంధమైనది గా ఇంకా మారలేదు. అలా మారాలంటే, ఆడవారి లో యాదృచ్చిక జన్యు మార్పులు జరగాలి.

సెక్స్ డ్రైవ్ లో ఆడ వారికీ మగ వారికీ తేడాలు ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం టెస్టోస్తిరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ లూ, తద్వారా బ్రెయిన్ కెమికల్స్ లో వచ్చే మార్పులూ. ఈ రెండు కారణాలే ఆడ వారిలో ఎక్కువ భావోద్వేగానికి కారణమౌతాయి.

ఇక మన చట్టాల విషయానికి వస్తే, భారత దేశం లో, సమతూకం ఉన్న, అన్ని  nuances  నీ పరిగణన లోకి తీసుకొని చేసే, చట్టాలు చాలా తక్కువ. దుర్వినియోగ పరచటానికి అవకాశం ఉన్న చట్టాలు ఎక్కువ.  మన బండ చట్టాల వలన స్త్రీలకి రిజర్వేషన్ లతో పాటు, నిరంకుశమైన చట్టాల అండ దొరుకుతోంది. గృహ హింస లాంటి చట్టాల వలన భార్య తో సఖ్యత లేని మగాడు బిక్కు బిక్కు మంటూ బతక వలసిన పరిస్థితి
రాబోయే రోజులలో స్త్రీ లు కేంద్రం గా ఒక ఆధిపత్య వర్గం ఏర్పడబోతోంది. ఇక ఆఫీసులలో sexual harrasment rules గురించి చెప్పనవసరం లేదు.
మన న్యాయ వ్యవస్థ ఆడది వివాహేతర సంబంధం కలిగి ఉంటే, దాని బాధ్యత ను మగవాడి సమర్ధత మీదకి తోస్తుంది. అదే మగ వాడు వివాహేతర సంబంధం కలిగి ఉంటే విడాకులివ్వ వచ్చునంటుంది!
ఒకప్పుడూ ధైర్యమూ, సాహసమూ ఆభరణాలు గా కల మగవాడు, ఇప్పుడు ఇంటికీ, నౌకరీకీ పరిమితమవ్వాల్సి వస్తోంది. అనేక సంబంధాలు కలిగి ఉండటం అనేది మగాడి ప్రకృతి సిధ్ధమైన లక్షణం. కుటుంబ వ్యవస్థ ఆ లక్షణాన్ని అణగదొక్కి మగ వాడిని కుడేలయ్యేటట్లు చేసింది. నేటి కుటుంబ వ్యవస్థ లోని ఏక పత్నీత్వం లాంటి రూల్స్ పూర్తిగా ఆడవారి స్వభావానికి అనుకూలమైనవే! అదేమంటే “ఆడ వారూ వేరే మగ వాళ్ళ తొ తిరిగితే?” అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ ప్రశ్న రావటానికి మూల కారణం ఆడా మగా సమానత్వం అన్న ఊహ. ఆడ వారి నైజమూ మగవారి నైజమూ ఒకటి కావు. కాబట్టీ ప్రవర్తన లో ఇద్దరి మధ్య సమానత్వాన్ని ఆశించకూడదు. ప్లేటొ చెప్పినట్లు,” సహజం గా సమానత్వం లేని చోట దానిని రుద్దటమే అన్నిటికన్న పెద్దదైన అసమానత్వం”. అయితే, దీని అర్ధం “సమాజం ఆడా మగా ఇద్దరికీ సమానమైన గౌరవం ఇవ్వకూడదని కాదు”.సెక్స్ పట్ల మారుతున్న స్త్రీల attitude కి అనుగునం గా వారు కూడా భావోద్వేగ ఝంజాటం లేని అనేక సంబంధాలను (no strings attached relations) కోరుకోవచ్చు. అడ్డు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదు.

ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి fail అవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు (ఈ వావి వరుసలు ప్రకృతి పరం గా ఎలా ఏర్పడ్డాయో ఈ వ్యాసం లో ముందు చర్చించాం) కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని తీసుకొంటే master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

ఒక పెళ్ళాం, ఒకరో ఇద్దరో పిల్లలూ. సంసారం లోని ఆనందం తగ్గినతరువాత కూడా మగవారు అందులోనే కునారిల్ల వలసి రావటం వలన కుటుంబాలు నిరాసక్తం గా నిస్సారం గా తయారయ్యాయి. ఈ కుటుంబ వ్యవస్థ మగ వారి సహజ స్వభావాని కి విరుధ్ధమైన అనేక డిమాంద్స్ ని చేస్తోందీనాడు. ఇంటిపనీ, బయటి పనీ అన్నీ మగవాడే చూసుకోవలసిన పరిస్థితి! అన్ని పనులూ చేసినా ఇంట్లో గౌరవం లేని దుస్థితి. “నేనూ ఉద్యోగాలు చేసి సాధించగలను”, అనే ఆడవాళ్ళ ego కి మగవాళ్ళు బలికావలసి వస్తోంది. ఆడవాళ్ళ మధ్య ఉద్యోగాల విషయం లో ఉండే peer pressure కి మగ వాళ్ళు మూల్యం చెల్లించాలి! పిల్లలను తాత, బామ్మల దగ్గర వదిలేయటం, creche ల లో పారేయటం వంటి మాతృత్వ స్వభావ విరుధ్ధమైన అనేక పనులను ఈ రోజు ఆడవారు చేస్తున్నారు! పైగా కుటుంబ జీవితానికీ, ఉద్యోగానికీ తెగ న్యాయం చేస్తూ రెండింటినీ తెగ balance చేస్తున్నామంటూ ఫోజులు!
కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మగవాడే సర్దుకుపోవలసి వస్తోంది.
పాశ్చాత్య దేశాలలో లా అనేక విడాకులూ అనేక పెళ్ళిల్లూ (ఏక కాలం లో కాదు) చేసుకొనటం వలన సమస్య పెద్దవాళ్ళ స్థాయి లో తగ్గవచ్చేమో కానీ, పిల్లలు అన్యాయమైపోతారు. ఒకే కుటుంబం లో ఉంటూనే భార్యా భర్తా ఎవరి సంబంధాలు వారు వెతుక్కోవటం ఉంది. కానీ దీనిలోనూ అనేక భావోద్వేగ పరమైన సమస్యలూ, అసూయా ద్వేషాలూ ఉన్నాయని పడమటి దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. కుటుంబమే లేక పోతే పిల్లల మనుగడా, తద్వారా మానవ జాతి మనుగడా ప్రశ్నార్ధకం.అలా అని,( మనిషికి పెరిగిన నాగరికతా, ఆలోచనల దృష్ట్యా,) కుటుంబాలు లేని ఆది మానవుల స్థితికి వెనక్కి వెళ్ళటమూ అసంభవమే!
పెళ్ళి చేసుకోని వ్యక్తుల జీవితాలలోని ఒంటరి తనం తెలిసిందే!

ఏదేమైనా రాబోయే తరాలలో ని మగ వారికి నేనిచ్చే సలహా పెళ్ళి చేసుకోవద్దనే. దానికంటే చాలా స్వేచ్చకలిగి ఉండి, అడపా దడపా ఉండే ఒంటరి తనాన్ని మేనేజ్ చేయటం చాల ఈజీ! వారసులు లేరనే బెంగ మాటంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి పోతోంది! పెట్టుబడి దారీ వ్యవస్థ మరణ శయ్య మీద ఉన్నా, ఆ వ్యవస్థ కి ప్రత్యామ్నాయం కనుచూపు మేర లో కనపడటం లేదు.అంటే ఈ వ్యవస్థ ఖర్చులను ఇలానే పెంచుతూ పోతుంది. ప్రపంచం లో పర్యావరణం దెబ్బ తింటోంది. అంటే, కొన్నేళ్ళ తరువాత గ్రీన్ టాక్సుల వడ్డన మొదలౌతుంది. మన ఇండియాలాంటి దేశాలలో ఉన్న బండ చట్టాల వలన ఆడ మహారాజులూ, ఆడ ఆధిపత్య వర్గాలూ ఏర్పడతాయి.  రా బోయే తరాల మధ్యతరగతి వారు పిల్లలని కని, తద్వారా వారిని సరిగా పోషించలేని దిగువ తరగతులలోకి దిగజారే అవకాశాలు స్పష్టం గా కనపడుతున్నాయి.  అలాంటి దుస్థితి కి పిల్లలని గురి చేసే కంటే,  పెళ్ళి చేసుకొనక పోవటమే మంచిది.ఇలాంటి పరిస్థితి పడమటి దేశాలలోఆల్రెడీ ఉంది. నాకు తెలిసిన ఒక తెల్లామె ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఉన్న కమిట్మెంట్ ఫోబియా గురించి తెగ వాపోతుంది! కమిట్ కాక పోతే మగాడు అనేక అందాలను ఆస్వాదించే తన సహజ గుణాన్ని వదులుకోవలసిన అవసరం ఉండదు.ఇక ముసలి వాళ్ళమైనాక ఎలా అంటారా? come on! మన తరమే పెద్ద వాళ్ళను నానా ఇబ్బందులూ పెడుతోంది. ఇక మన పిల్లల తరం మనని చూస్తుందా?(అందుట్లోనూ మనతో creche ల లో పెట్టించుకొని మన నిరాదరణ కు గురైన తరం). సోలో గా ఉంటే కాసిన్ని డబ్బులు మిగుల్చుకొని, వయసైనాక ఆ డబ్బులతో హాయిగా ఏ వృధ్ధాశ్రమం లోనో చేర వచ్చు. అందుకే,”సోలో బతుకే సో బెటరూ!”

నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ

అప్పట్లో న్యాయస్థానం రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షలు విధించింది. గుంటూరు  శేషేంద్ర శర్మ గారు,”భగవద్గీతను ఉటంకిస్తూ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏమీ జరుగదు. రాజీవ్ హంతకులు కూడా భగవంతుని ప్రమేయం తోనే హత్య చేసి ఉంటారు. కాబట్టీ ఆ హత్య లో వారు దోషులు కారు. వారిని శిక్షించ కూడదు.”, అని వాదిస్తూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆయనను చాలా మంది విమర్శించారు.
అప్పట్లో నాకు ఆయన వాదన నిజమే కదా! అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే దానికి కౌంటర్ గా ఇలా వాదించవచ్చు అనిపిస్తుంది. “న్యాయస్థానాలు కూడా భగవంతుడు సృష్టించిన జీవ కోటి నుంచీ పుట్టిన మానవ సమాజం లోనివే. భగవంతుని ఇఛ్ఛానుసారమే ఆ వ్యవస్థ కూడా నేరస్థులను అదుపులో పెట్టటానికి శిక్షలను అమలు చేస్తాయి. కాబట్టీ, ఆశిక్షలు కూడా భగవంతునికి వ్యతిరేకం కాదు.”

భగవంతుని విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం.
న్యాయాన్ని మానవ సమాజం తన దీర్ఘకాలిక మనుగద కోసం, సమాజం లో ఒక క్రమ పధ్ధతీ శాంతీ ఉండటం కోసం ఏర్పాటు చేసుకొంది.  అయితే ఈ న్యాయస్థానాలు నైతికమైన విషయాలలో  తీర్పులు ఇస్తాయి. ఒక సమాజం లో అనేక నీతులు ఉంటాయి.  నీతి ఒక్కోసారి వ్యక్తిగతం గా ఉంటుంది. మనిషి మనిషి కీ మారుతుంటుంది. మరి న్యాయస్థానాలు అమలు పరిచే నీతి ఎవరి నీతి?  అది అధిక సంఖ్యాకుల నీతి. ఒక్కోసారి అది బలవంతుల నీతి. ఒక సమాజం “ఒక్కరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం” నేరం అంటుంది.అదే సమాజం లో పెరిగిన వ్యక్తికి ఈ నియమం తెలుసు కాబట్టీ, అతను ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి దగ్గరగా వచ్చినపుడు, గిల్టీ గా ఫీలవుతాడు.అంటే ఇక్కడ, అతని అంతరాత్మ యొక్క నీతీ, సమాజం నీతీ, న్యాయపరమైన నీతీ ఒక్కటే.తరువాత అతనిని న్యాయస్థానం శిక్షించినా, అది సబబే అని అతనికి అనిపిస్తుంది.

ఇస్లామిక్ దేశాలలో ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం నేరం కాదు. అక్కడ పెరిగిన వ్యక్తి  ముగ్గురిని పెళ్ళి చేసుకొని కూడా గిల్టీ గా ఫీలవడు. అతనిని  అమెరికా చట్టం ప్రకారం శిక్షిస్తే, ఆ చట్టం చేసింది సరి అయినది అని అతను ఫీలవకపోవచ్చు. అలానే, ఆదిమ, పురాణ పురుషులను ఇప్పటి సమాజ, న్యాయ విలువల తో తూచటం సరి కాదు. శ్రీకృష్ణుడు తన అనేక భార్యల గురించి గిల్టీ గా ఫీలవాలనుకోవటం సరి కాదు కదా!
“మనం మన విలువల తోనే అంచనా వేస్తాం! ఇంకెవరి విలువల తోనో మనం ఎలా అంచనా వేస్తాం?”, అని ఎవరైనా అడగవచ్చు.
మన కాలానికీ ఆ కాలానికీ ఉమ్మడిగా కొన్ని సార్వజనీనమైన మానవ విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం వారిని అర్ధం చేసుకోవాలి.తన బాణం వేటుకి ఒంటరైన పక్షిని చూసి బోయవాడైన వాల్మీకి శోకించటం ఇలాంటి సార్వజనీనమైన మానవ విలువే!

 సమాజం లోని కట్టుబాట్లూ విలువలూ తగ్గుతూ ఉంటే జనాలు న్యాయస్థానాల దగ్గరికి పరుగులు తీయటం ఎక్కువౌతుంది. ఇంకా సమాజ విలువలు కొద్దో గొప్పో ఉన్న మన గ్రామాలలో జనాలు కోర్టులకి వెళ్ళటం తక్కువ గా కనపడుతుంది. అలానే మానవీయ విలువలు తగ్గిన సమాజం లో  కట్టుబాట్లు దురాచారాల రూపం లో బిగుసుకొనిపోతాయి. అప్పుడే మానవీయ విలువలు ఉన్న సంఘ సంస్కర్తలు సమాజ నీతిని ఎదిరించైనా ఒక మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. ఈ సంస్కర్తలు చేసే పనులు మొదట సమాజం దృష్టి లో న్యాయ వ్యవస్థ దృష్టిలో నేరాలౌతాయి (రాజా రామ మోహన రాయల వంటి వారు మొదట సమాజం ఆక్షేపణ కు గురైనవారే). కానీ వీరి విలువలు సమాజ, న్యాయ విలువల కన్నా ఉన్నతమైనవి. వారికి తమ మానవ విలువల లో ఉన్న నమ్మకం కూడా అచంచలమైనది.క్రమం గా సమాజమూ, న్యాయమూ తమ తప్పు తెలుసుకొని సంస్కర్తల విలువలను అంగీకరిస్తాయి. తరువాత వీరి విలువలే సమాజ, న్యాయ విలువలు గా మారుతాయి. కాలం చలన శీలమైనది. కాలచక్ర గమనం తో పాటు ఈ సంస్కర్తలు తెచ్చిన విలువలు కూడా బూజుపట్టి ప్రగతి నిరోధకాలై, మళ్ళీ కొత్త విలువలకు వేదిక తయారు చేస్తాయి. ఈ చక్ర భ్రమణం అనంతం.

ఒక్కోసారి మన వ్యక్తి గత విలువలు సమాజ విలువలకి విరుధ్ధం గా ఉండవచ్చు. అప్పుడు మనం సమాజ విలువలను అంగీకరించం. ఆ విలువలను ప్రశ్నిస్తాం. అలా అని మన వ్యక్తిగత విలువలు సమాజ విలువల కంటే ఉన్నతమైనవని చెప్పలేం.  ఈ సందర్భం లో సమాజ విలువలకి వ్యతిరేకం గా ఆలోచించటానికి  మనం గిల్టీ గా ఫీల్ కాము.  చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది. 
మన వ్యక్తి గత విలువలు న్యాయస్థానాల విలువల తో విబేధించినా, మన విలువలు న్యాయస్థానాల విలువల కనా ఉన్నతమైనవి అయినా కూడా చివరికి మనం న్యాయస్థానాల విలువలనే అంగీకరించాలి. లేకపోతే న్యాయస్థానం మనలని శిక్షిస్తుంది. న్యాయస్థానాలు నిరంకుశమైనవి మరి. మనకి “లా” ఏమి చెబుతోందో తెలియక పోయినా, దానిని ఉల్లంఘించినట్లైతే అది మనని శిక్షిస్తుంది. చూడండి న్యాయస్థానాల అన్యాయం!ఈ మాట పై కి అంటే, మళ్ళీ మనని  contempt of court కింద శిక్షిస్తాయి :-(. ఎంచక్కా మన పెజాస్వామ్యం లో రాజకీయ నాయకులనైతే నోరారా తిట్టుకోవచ్చు. అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా కొట్టుకోవచ్చు 🙂 . (మనం వోట్ వేయం. వేసేవాళ్ళు డబ్బు తీసుకొని వేస్తారు. చివరికి తిట్టటానికి మాత్రం రా.నా. లను తిట్టుకోవచ్చు..ఎంచక్కా..)

  కానీ, ప్రతి వాడూ తన సొంత విలువలను ప్రతిపాదిస్తే ఇక న్యాయస్థానాల మాట వినేవాడెవడు? అందుకే న్యాయస్థానాలు నిరంకుశం గా ఉండక తప్పదనుకొంటా! అలానే, న్యాయస్థానాలు “లా” తెలియని వారిని క్షమించేటట్లైతే, నేరస్తులు “లా” తెలిసినా, అది ఏం చెబుతోందో తనకు తెలియదని శిక్ష తప్పించుకొంటారు కదా! అప్పుడు న్యాయవాదులతో పనే ఉండదు.”లా” తెలుసుకోని వారికి శిక్ష నుంచీ exemption ఇస్తే, అందరూ “లా” ని తెలుసుకోకుండా ఉండేందుకు పోటీ పడతారనుకొంటా! 😦

న్యాయ స్థానాల తీర్పులను ఫిర్యాదీలు విమర్శించటం మొదలు పెడితే వాటి తీర్పులను ఎవరూ నమ్మరు. తరువాత వాటి దగ్గరికి న్యాయం కోసం ఎవరూ వెళ్ళరు. న్యాయస్థానాన్ని విమర్శించటం అంటే, న్యాయస్థానం చెప్పే తీర్పుని అంగీకరించకపోవటం. అటువంటి వారు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం తో మొదట న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న ప్రశ్న వస్తుంది. తనకు అనుకూలం గా తీర్పు వస్తేనే తీర్పును అంగీకరిస్తాననటం సరి కాదు. తీర్పు తమకు అనుకూలం గా వచ్చినపుడు కూడా ఆ తీర్పును విమర్శించేవారు ఉండరు కదా? కాబట్టీ న్యాయస్థానాన్ని విమర్శించటానికి ముఖ్య కారణం తీర్పు వలన తమకు వచ్చిన నష్టం అయి ఉంటుంది. న్యాయస్థానం యొక్క పక్షపాతం అయ్యే అవకాశం తక్కువ. న్యాయస్థానాలు అన్నివేళల్లోనూ నిష్పాక్షికం గా వ్యవహరించవనుకోండి. వాటికి ఉండే biases, ప్రలోభాలు వాటికి ఉంటాయి.  అది వేరే విషయం.అప్పుడు పై న్యాయస్థానాలకు అప్పీలు చేసుకొంటూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవచ్చు. కానీ సుప్రీం కోర్ట్ మీద ఎవరికి అప్పీలు చేయాలి?  
క్రిమినల్ కేసుల్లో కేసు ఓడిపోయిన వ్యక్తి యొక్క న్యాయవాది అబధ్ధాలు చెప్పినట్లు కదా!(ఇదే లాజిక్ ప్రకారం  ఎగువ కోర్ట్ లో వేరే గా తీర్పు వస్తే దిగువ కోర్ట్ జడ్జ్ గారు అబధ్ధం ఆడినట్లా? ) మరి ఆ న్యాయవాదిని ఎందుకు న్యాయస్థానం శిక్షించదు? అబధ్ధాలు చెప్పటం అతని “వృత్తి” కాబట్టీ నా? లేక అతను చెప్పిన అబధ్ధాల వల్లే సత్యం వెలుగులోకి వచ్చిందనా? ఒక న్యాయవాదిని జైల్లో  పెడితే, తరువాత ఎవరూ కేసులు వాదించరనా?  

ఇప్పుడు ఊరి నిండా న్యాయవాదులు ఉన్నా వారికి ఫీజు చెల్లించలేని మామూలు జనానికి వారి వలన ఏమి లాభం. కాబట్టీ పరిస్థితి ఇప్పుడు కూడా న్యాయవాదులు లేనట్లు గానే ఉండి. న్యాయ వ్యవస్థ ఖరీదైనదవ్వటం వలన మెజారిటీ జనాలకు అది అందుబాటులో లేదు. అంటే జనసామాన్యానికి అది ఉన్నా లేనట్లే. అది వారి కోసం రూల్స్ పెట్టటం మినహా, వారికి అవసరమైనపుడు అందుబాటు లో ఉండదు.  దాని వలన వారికి మేలు జరుగదు.  డబ్బు ఖర్చు పెట్టగల వారికి మన నత్త నడక న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సమయమూ, ఓపికా ఉండవు.

న్యాయస్థానాలు పిచ్చి వారూ, మానసిక వ్యాధి గ్రస్తులూ చేసిన నేరాలకు వారిని ఎందుకు శిక్షించవు? వారి నేరాల వలన కూడా ఇతరులు ఇబ్బంది పడతారు కదా? న్యాయ స్థానాలు ముందు “నేరం చేసే ఉద్దేశాన్ని(మోటివ్) చూస్తాయి. ఆ ఉద్దేశం ఉన్న వారిని శిక్షించటం ద్వారా ఇక ముందు వారి నేరం చేయాలనే కోరిక ను తగ్గిస్తాయి. అప్పుడప్పుడూ మనిషి నేర ఇఛ్ఛ కు కారణాలూ పరిస్థితులను పరిగణన లోకి తీసుకొంటాయి . కానీ ఈ కారణాలూ పరిస్థితులూన్యాయస్థానాల పరిధిలోనివి కాదు.న్యాయ స్థానాలు ఆ పరిస్థితులను మార్చలేవు. వాటిని గురించిన కొన్ని పరిశీలనలను తమ తీర్పులో పొందుపరచటం మినహా ఏమీ చేయలేవు.  మొత్తానికి మనిషి నేర ఇఛ్ఛకి పరిస్థితులు కారణం అయినా, లేక దేవుడు ప్రసాదించిన స్వేఛ్ఛా సంకల్పం( ఫ్రీ విల్) కారణం అయినా, లేక పరోక్షం గా దేవుడే కారణం అయినా న్యాయస్థానాలు  నేరం చేసే ఉద్దేశం నిరూపించబడినపుడు అసలే శిక్ష వేయకుండా ఉండవు. ఇది మామూలు వ్యక్తుల విషయం.
ఇక పిచ్చివాళ్ళ, మానసిక వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే,..వారి ఉద్దేశాలకీ, వారి వ్యక్తిత్వానికీ మధ్య సంబంధం అసాధారణం గా, అస్పష్టం గా ఉంటుంది.  ఉదాహరణకి obsessive compulsive disorder ఉన్నవాళ్ళు సరిగ్గా తమ కోరిక కి విరుధ్ధం గా ప్రవర్తిస్తారు. వారికి అలా ప్రవర్తించే విషయం లో స్వేఛ్ఛ ఏమాత్రం ఉండదు. They are compelled to behave in that way. . అలానే schizophrenia ఉన్న వారు violent గా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకుండా నిగ్రహించుకొనే సంకల్పం వారి మెదడులోకానీ, శరీరం లో కానీ ఉండదు. కాబట్టీ వారి ప్రవర్తనకు నేరం వారి రోగానిది. కుంటి వారి వైకల్యం పైకి కనపడుతుంది. కానీ వీరి వైకల్యం పైకి కనపడదు.కోర్ట్లు , అలాంటి వారిని శిక్షించటం ద్వారా, వారు తరువాత నేరాలను చేయటాన్ని తగ్గించటం కుదరదు.వ్యాధి ఉన్నంత వరకూ వారు నేరాలు చేయటానికే అవకాశం ఉంటుంది.  అందుకే వారిని ఏ శరణాలయాలలోనో చేర్చమని న్యాయస్థానాలు సలహా ఇస్తాయి.

అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు

రాత్రి తెలుగు బ్లాగ్-సాగరం లో పడి ఈదుతూ ఉంటే మంచు పల్లకీ గారు అవినీతి గురించి రాసిన టపా కనపడింది. ఆ టపా లో ఆయన “మనమందరం మన పరిధులలో అవినీతిపరులమేనంటూ, ప్రక్షాళణ మన నుంచీ మొదలు కావాలని చెప్పారు.”
దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలో ఈ ఆలోచనలు కూడా వచ్చాయి…
అవినీతీ, పర్యావరణం మొదలైనవి మానవాళి మొత్తం ముందున్న సమస్యలు. వీటికి ఒక పౌరుడి గా మనవంతు బాధ్యత తప్పనిసరి గా ఉంటుంది. అయితే సమాజం లోని అందరికీ సమాన బాధ్యత ఉంటుందా?
ఒక వ్యవస్థ లో మనిషి అధికారమూ హోదా పెరిగితే అదే స్థాయి లో బాధ్యతలు పెరగాలి. మన రాజకీయ నాయకులకు మనకంటే ఎక్కువ హోదా, అధికారం ఉంటాయి. కాబట్టీ వారికి అదే స్థాయి లో ఈ సమస్యల పట్ల మనకంటే బాధ్యతకూడా ఎక్కువ గా ఉండాలి. కానీ, వారి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారా? చాలా వరకూ నిర్వర్తించకపోవటమే కాక, ఒక్కోసారి అసలు సమస్యనే వారు మొదలుపెడుతున్నారు.
మన ఆఫీస్ లో మనకు మన హోదాలో అనేక బాధ్యతలు ఉంటాయి. వాటిని నిర్వర్తించకపోతే మనకు అప్రైజల్ టైం లో మూడుతుందని తెలుసు. కాబట్టీ, మనం మన బాధ్యతలను నిర్వర్తించటానికే మొగ్గు చూపుతాం…మరి రాజకీయ నాయకుల అప్రైజల్ ఎవరు చేస్తారు? మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలే ప్రభువులు. రాజకీయ నాయకుల అప్రైజల్ చేయటమే కాకుండా వారిని అపాయింట్ చేసేది కూడా ప్రజలే! కాబట్టీ మన వ్యవస్థ లో ప్రజలకు నాయకులను ఎన్నుకొనే హక్కుతో పాటు వారు వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించేటట్లు చూసే బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే వారిని తరువాతి ఎన్నికలలో శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే! అలానే అవినీతి చేయని నాయకుడిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలదే!(ప్రజాస్వామ్యం లో ప్రజలకి బాధ్యతలు చాలా ఎక్కువ మరి! అధికారం ఉనంచోట ఎక్కదైనా బాధ్యతలూ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా! )
కానీ ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. ప్రజలందరి సమిష్టి బాధ్యత.
మనం మన వ్యక్తి గత పరిధి లో అవినీతి పనులు తగ్గించుకొనే నిర్ణయం తో పాటు, మన సమిష్టి బాధ్యత అయిన వోటు హక్కుని వ్యక్తిగత పరిధిలో విజ్ఞత తో ఉపయోగించుకొనే నిర్ణయం కూడా తీసుకోవాలి. వోటు వేయటం ఒక అధికారమూ బాధ్యతా కూడాను. వోటు హక్కుని సరిగా వినియోగించుకోవటానికి సరిపడా రాజకీయ జ్ఞానం సంపాదించటం, వీలయితే మన పరిధిలో నలుగురిని దీనిని గురించి చైతన్య పరచటం కూడా మన బాధ్యతే! ఉన్న నాయకులతో మనకు తృప్తిలేక పోతే, మన వ్యక్తిగత జీవితాలు ఆవిరికానంతవరకూ, రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం కూడా ప్రయత్నించాలి. అందరూ అరవింద్ కేజ్రీవాల్ లు కాక పోయినా కిరణ్ బేడీ స్థాయి లోనైనా కొంత మన వంతు బాధ్యత నిర్వర్తించాలి.

ఈ ఆలోచనల తరువాత నేను ఇంతకు ముందు రాజకీయ నాయకులను సమర్ధిస్తూ రాసిన టపా లోని నా అభిప్రాయాలను కొంతవరకూ సవరించుకోవలసిన అవసరం కనపడింది.

ఈ నాటి ఆర్ధిక వ్యవస్థ లో కుల వ్యవస్థ వలన లాభం

కుల వ్యవస్థ ఆచరణ లోని లోపాలూ నష్టాలగురించి  అభ్యుదయ వాదులను కానీ, దళిత వాదులను కానీ అడిగితే వారు దానిలోని వివక్ష గురించీ, మానవత్వ లేమి గురించీ చెబుతారు. వారు చెప్పేవి చాలావరకూ సమంజసమైనవే కూడా! కానీ, ఈ నాటి మన ఆర్ధిక వ్యవస్థను చూస్తుంటే నాకు కుల వ్యవస్థ లో ఒక మంచి లక్షణం కూడా కనిపించింది.
ఈ రోజుల్లో సమయాన్ని బట్టి  మొదట ఏదో ఒక ఉద్యోగానికి మంచి గిరాకీ ఉంటుంది. ఉదాహరణ కు “ఐ టీ”,లేక పోతే “ఐ టీ లో SAP”. ఎందుకంటే ఆ ఉద్యోగం లో డబ్బులు బాగా వస్తాయి. ఇక దానితో సమాజం లోని అన్ని వర్గాలవారూ, అన్ని చదువుల వారూ పోలో మని ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడతారు. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం, ఆ ఉద్యోగాలకోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవటం తో సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయిన వస్తువు ధర (ఉద్యోగి జీతం) తగ్గిపోతుంది.లేక పోతే ధర కొన్నేళ్ళ పాటు నిలకడ గా ఉంటుంది. ద్రవ్యోల్బణం ని లెక్క లోకి తీసుకొంటే ఇది వారి జీతం తగ్గటం తో సమానం.  ఆ విధం గా ఆయా ఉద్యోగాలలోని జీతాలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగాలు పరిమిత సంఖ్య లో ఉంటాయి. కానీ అభ్యర్ధులు అపరిమితం గా ఉంటారు. అంటే కొందరు అభ్యర్ధులకు ఎప్పటికీ ఉద్యోగాలు రావు.  కానీ ఇతర రంగాలను వదిలి పెట్టి  ఈ రంగానికి వచ్చిన ఆ అభ్యర్ధులు దీపం చుట్టూ పురుగుల్లా ఈ ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యక్తిత్వ వికాసం అంటూ కోచింగ్ సెంటర్ లు పుట్టుకు వస్తాయి అందరూ వాటిలో చేరి గొప్ప వ్యక్తిత్వం సాధిస్తే, ఎవరికీ మిగిలిన వారి మీద ఆధిక్యత ఉండదు. మళ్ళీ అందరూ సమానమే! కానీ ఉద్యోగాల సంఖ్య పరిమితం. ఈ విధం గా నిరుద్యోగం పెరిగిపోతుంది. మిగిలిన రంగాలు విద్యా, వైద్యం వంటివి, నిర్లక్ష్యానికి గురవుతాయి. మళ్ళీ కొంత కాలానికి ఆ రంగాలలో జనాల కొరత కారణం గా మంచి రోజులు వస్తాయి. ఈ మొత్తం సైకిల్ మళ్ళీ ఆయా రంగాలలో రిపీట్ అవుతుంది.ఈ మధ్య నిర్మాణ రంగం లో సివిల్ ఇంజనీర్లకి గిరాకీ పెరిగినట్లు.

వ్యవసాయం వంటి రంగాల నుంచీ ఐటీ వంటి ఉద్యోగాలకు వచ్చిన వారు ఉంటారు. కొన్నేళ్ళకి వ్యవసాయం చేసే వారు ఎవరూ లేక మళ్ళీ ఆ రంగం గిట్టుబాటు కావటం మొదలౌతుంది. కానీ, అప్పటికి కార్పొరేట్లు భూములన్నీ కొనేసి ఆ లాభాన్ని తన్నుకొని పోతాయి.
డబ్బుకోసం పెట్టే ఈ పరుగులో మొత్తానికి నష్టపోయేది మధ్యతరగతి కుటుంబ రావులే!
కుల వ్యవస్థ ఉన్నపుడు, సమాజం లోని వివిధ కులాల వారు వంశపారంపర్యం గా తమ కుల వృత్తినే చేయ వలసి వచ్చేది. డిమాండ్ ని బట్టీ, డబ్బుని బట్టీ వేరే రంగానికి పరుగులు తీసే అవకాశం ఉండేది కాదు. కాబట్టీ సమాజానికి అవసరమైన అన్ని రంగాల్లోనూ నైపుణ్యాల కొరత, (లేక అధికమైన సప్లై) ఉండేది కాదు. డిమాండ్ కీ సప్లై కీ మధ్య సమతూకం ఉండేది.
అలానే, ఒకప్పుడు అమలు లో ఉన్న వస్తుమార్పిడి విధానం లో కూడా, డబ్బులా వస్తువులను అపరిమితం గా కూడబెట్టటానికి అవకాశం ఉండేది కాదు. కొంతవరకూ భూమిని కూడబెట్టే వారు. కానీ భూమిని ఎంతవరకూ కూడబెట్టగలరు?ఎంతవరకూ నిలువ బెట్టవచ్చు? డబ్బు ని అంతులేకుండా కూడబెట్టవచ్చు.దాయవచ్చు. నిలువబెట్టవచ్చు. డబ్బు మొదలయిన నాటి నుంచీ అసమానతలు విపరీతం గా పెరిగిపోయాయి.

ఈ ఆధునికకాలం లో కొత్త కులాలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సమాజానికి అవసరమైన అన్ని వృత్తులూ..ఉదాహరణ కి ఇంజినీర్ల కులం, వైద్యుల కులం, పోలీసుల కులం, న్యాయవాదుల కులం ఇలా..
ఏ కులమూ ఇతర కులాల కంటే ఎక్కువ కాదు. అలానే అందరి జీతాలూ, ఆర్ధిక వ్యవస్థ లోని డిమాండ్ మీద ఆధార పడకుండా, సమానమైన స్కేళ్ళలో ఉంటే బాగుంటుంది. ఒక కులం లోకి ప్రవేశించాలంటే, ఆ వృత్తి పై ఉన్న ఆసక్తే (వృత్తిలోని డబ్బు పైన కాదు) అర్హత కావాలి. ఎలా ఉందంటారు నా కుల తత్వం..?

కొన్ని కులాల ప్రాధమిక విలువలు..

నేను “ఒక అమెరికా వాడి రైలు బండి ప్రయాణం” కథ రాసిన తరువాత నాలో update అయిన అవగాహన ఇది.
మానవ సమూహాలన్నిటికీ ఉన్నట్లే, కులాలకు కూడా ప్రాధమిక విలువలు(primary values) ఉంటాయి. ఐరోపా ఖండం లో యూదులను “చాలా ప్రతిభ కల వారి గానూ”,” జిత్తుల మారి వారి” గానూ చూసేవారు. ఇది ఒక మూస గుద్దుడు వ్యవహారం (stereo type) కావచ్చు. కానీ ఈ మూస లో కూడా కొంత సత్యం ఉంటుంది. నిప్పులేనిదే పొగ రాదని అంటారు కదా!
మానవ సమూహాలనంటికీ ఉన్నట్లు గానే, కులాలకీ ప్రాధమిక విలువలు ఉంటాయి. ఒక కులానికి సంబంధించిన ప్రాధమిక విలువ  ఆ కులం లోని ప్రసిధ్ధులూ, పెద్దల ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు ఆ కులం వారి వృత్తి మీద కూడా ఆధాపడి ఉంటాయి. ఆయా కులాలకు మిగిలిన విలువలు ఉండవని కాదు. వారి మిగిలిన విలువలనన్నిటినీ కూడా చివరికి ఈ ప్రాధమిక విలువలలోకి convert చేయవలసిందే! వారికి మిగిలిన విలువలని వారి ప్రాధమిక విలువలోకి మార్చి చెప్తేనే వారు దానిని మెరుగ్గా appreciate చేయగలరు.ఒక కులం లోని అందరు వ్యక్తులకీ ఈ ప్రాధమిక విలువలు వర్తించక పోవచ్చు.

ఈ ప్రాధమిక విలువలు ఆయా కులాలలో కూడా స్థలాన్ని బట్టీ , కాలాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అలానే ఒకే కులం లోని దిగువ తరగతి వారి విలువలూ , ఎగువ తరగతి వారి విలువలూ ఒకే విధం గా ఉండవు.

మనం మధ్య తరగతిని మాత్రమే పరిశీలిద్దాం. మీరు పెళ్ళి కుమారుడి తరపున ఒక పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారనుకోండి. మీ కులం ఏ కులం వ్యక్తి తో మాట్లాడేటపుడు ఆ కులం గా ఊహించుకోండి.

ఒక బ్రాహ్మణ కులం కి చెందిన వ్యక్తి తో మీరు “పలానా వాళ్ళ అబ్బాయి కి పది లక్షల సంపాదన ఉందట ” అన్నారనుకోండి, అప్పుడు అతను, “అలానా! ఆ అబ్బాయి ఏమి చదివాడు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు” అని అడిగే అవకాశం ఉంది.    దీని వలన మనకు ఈ కులం ప్రాధమిక విలువ “విద్య, ఉద్యోగం” అని అర్ధమౌతుంది.
ఒక కమ్మ కులం కి చెందిన వ్యక్తి తో, “పలాన కుర్రాడికి పలానా పెద్ద qualification ఉందట”, అంటే,  “మంచిది, ఎంత సంపాదిస్తాడంటాడు?” అనే ప్రశ్న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ డబ్బు అని చెప్పనక్కరలేదు కదా!

అలానే ఒక రెడ్డి గారి ముందు, కుర్రవాడి డబ్బు ప్రస్తావన తెస్తే, “అతని హోదా (rank) గురించి” అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ సమాజం లోని rank.

గోదావరి జిల్లాల నాయుడు గారు కట్నం గురించిమాట్లాడేటపుడు, “ఎన్ని ఎకరాల కొబ్బరి తోట లేక వరి పొలం?”, అని మాట్లాడే అవకాశం ఉంది. ప్రాధమిక విలువ “భూమి”.

ఒక S.C వర్గానికి చెందిన వ్యక్తి పెళ్ళి కుమారుడి చుట్టాల లో ఎవరు పెద్ద ప్రభుత్వ అధికారులో తెలుసుకొని సంతోషించే చాన్స్ ఉంది. ప్రాధమిక విలువ,”వ్యవస్థీకృత అధికారం”

వైశ్యులు, “కుర్రవాడు నేర్పుగా జాగ్రత్త గా ఉండి, పొదుపు స్వభావం కలవాడా?” అనే విషయం చూడవచ్చు. కుర్ర వాడు ఉద్యోగి అయితే, అతనికి ఎంత మిగులుతుంది అని చూడవచ్చు. “నికర లాభం”, ప్రాధమిక విలువ.

ఈ ప్రాధమిక విలువలు అన్ని కాలాలలోనూ ఒకే విధం గా ఉండవు. ఒకప్పుడు “పెద్ద ప్రభుత్వోద్యోగులై ఉండటం” అనేది, బ్రాహ్మణ వర్గం లో ఒక విలువ. నేడు ఆ విలువ SC వర్గానికి బదిలీ అవుతున్నట్లున్నది.

ఈ ప్రాధమిక విలువల లో ఏ కులం విలువా ఇతర కులాల విలువల కంటే గొప్పదీ కాదు, తక్కువా కాదు. కాక పోతే ఒక వర్గానికి చెందిన విలువ ఇంకొక వర్గానికి నచ్చదు. ఏ వర్గానికి చెందిన విలువ ఆ వర్గానికి సరైనది గా కనిపించవచ్చు. ఇతర వర్గాలపై మన అయిష్టాన్ని వ్యక్తం చేయటానికి ఆ వర్గం విలువలను తప్పుపడతాం.మన కులం గురించి ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, మన కులపు ప్రాధమిక విలువ చెడ్డది గా కనపడటం కూడా జరుగుతుందనుకోండి!ఈ ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, వెరే కులాలలో మనం నిరసించిన విలువని, మన వర్గం మాత్రం సాధించాలని వాదించటం కూడా కద్దు.

ఇంతకు ముందు ఓ టపా లో చెప్పినట్లు, పైన చెప్పినవి “కేవలం నా అభిప్రాయాలే“, మీ అభిప్రాయాలు భిన్నం గా ఉండవచ్చు.

చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?

ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..

మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి  ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి.  అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి.  కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది.  వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్.  అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.

ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).

మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు  దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్.   వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!

భావోద్వేగాలు ఎన్నిరకాలు?

భావోద్వేగాల గురించి నెట్ లో వెతుకుతూ ఉంటే, నాకు కనపడిన ఒక interesting document(English) కింద నుంచీ దించుకోండి. .
నేను శోధించిన ప్రశ్న: “భావోద్వేగాలు మన జ్ఞాపకాల(memory)లో స్టోర్ అవుతాయా?”
సమాధానం: కావు. భావోద్వేగాలు వర్తమానం లోని సంఘటనలకి మన మనస్సూ శరీరం చేసే ప్రతిక్రియ మాత్రమే. అయితే భావోద్వేగాలకు సంబంధించిన సమాచారం (information) మాత్రం మన జ్ఞాపకాలలో నిక్షిప్తం(store) అవుతుంది.  అంటే అది ఏ రకమైన భావోద్వేగం..కోపమా, భయమా, సిగ్గా మొదలైన గుర్తులు (symbols) మాత్రం మన మెమరీ లో ఉంటాయి. భావోద్వేగాలు కూడా మన జ్ఞాపకం లో భాగమైతే అప్పుడు జరిగిన సంఘటనల గురించి మన మానసిక అనుభవం(జ్ఞాపకం తెచ్చుకోవటం) “వీడియో ప్లే బ్యాక్” లా ఉంటుంది. అంటే ఆటే సమాచారం మిస్ కాదు. మళ్ళీ మనకు పాత అనుభవం మానసికం గా యధాతధం గా అవుతుంది.

theoriginofemotions

Creativity -Randomness Vs Deterministic

Creativity -Randomness Vs Deterministic

Seemingly random events can have deterministic causes.

Let’s take the example of a football game. The time, at which ball hits the goal, looks random. It is almost impossible to predict how many times the ball hits the gaol on one side. Yet, we know that it will be a result of the game played by both sides of the players. So if we know the relative efficiencies and game plans of both sides the probability of guessing how many goals may hit the goal post increases. The probability of guessing goal increases as is the information about its cause increases. If we know in what direction the ball moves at each moment of the game in advance, we can predict about the goals that both sides will do. The number of goals may look random, but they can be calculated based on certain information.

Similarly an invention can be a result of seemingly random thoughts (similar to Brownian motion) striking correctly in the mind of the inventor. Alternately, it can also be a result of the external circumstances the inventor undergoes.

The trigger for creativity can be a chance event with in our understanding, like the trigger for goal that was scored.

The trigger can be from outside our understanding like the “flash out of a blue in a scientist’s mind”, which does not seem to originate from the thoughts in his mind.

ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?

తెలుగు అంతర్జాలం లో తెలంగాణా, స్త్రీ వాదం , కులం వంటి అనేక విషయాల మీద వాదోప వాదాలూ, చర్చలూ జరుగుతుంటాయి. ఈ చర్చలలో తరచూ అభిప్రాయాలే వాస్తవాలు గా చెలామణి అవుతున్నట్లని పిస్తుంది. ఎదుటి వారి అబిప్రాయాలను గౌరవించేవారి సంఖ్య చాలా తక్కువ.
స్టాటిస్టిక్స్ లో sampling theory అని ఒక సిధ్ధాంతం ఉంది. దానిని ఇక్కడ వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి.
ఒక పెద్ద బుట్టలో నాలుగు రంగుల గోళీలు , ఒక్కో రంగు గోళీలూ 1000 సంఖ్యలో ఉన్నాయనుకొందాం.బుట్టలోని ఈ అన్ని రంగుల గోళీలనూ కలగాపులగం గా కలిపేశామనుకొందాం. ఈ బుట్ట మన సమాజం వాస్తవం గా ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది.గోళీల రంగులు సమాజం యొక్క లక్షణాలైన సమానతా, అధికారం, అభివృధ్ధీ మొదలైన లక్షణాలను ప్రతిబింబిస్తాయనుకొందాం.
మనం ఈ బుట్టలోంచీ ఒక గుప్పెడు గోళీలు తీస్తే ఆ గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉండవచ్చు. దీనిని మనం ఒక biased sample అంటాం.బుట్టలో అన్ని రంగుల గోళీలూ సమాన సంఖ్యలో ఉన్నప్పటికినీ మనం తీసిన గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉన్నాయి. మన గుప్పెడు గోళీలూ మన వ్యక్తి గత అనుభవాన్ని సూచిస్తాయి.అయితే ఈ అనుభవం లో కూడా patterns ఉంటాయి.నల్ల గోళీల బరువు మిగిలిన రంగు గోలీల బరువు కన్నా ఎక్కువ అనుకొందాం.  బుట్ట కిందికి నల్ల గోళీలు ఎక్కువ చేరుతాయి. తరువాత అక్కడ (బుట్ట అడుగు) నుంచీ తీసిన sample లో నల్ల గోళీలే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ కి, ఒక గ్రామీణ దళితుడి అనుభవం లో ‘కుల వివక్ష’ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మన పక్క వ్యక్తిని ఇంకో గుప్పెడు గోళీలు తీయమంటే అతని గుప్పెటకి తెలుపు రంగు గోళీలు ఎక్కువ రావచ్చు. అలానే ఒక పెద్ద గిన్నె తో గోళీలను తీసినట్లైతే ఆ గిన్నెలోని వివిధ రంగుల గోళీల సంఖ్య మధ్య అంతరం తగ్గుతుంది. అంటే sample పెద్దదయిన కొద్దీ అది వాస్తవ పరిస్థితికి దగ్గరవుతుందన్నమాట.  అంటే ఒక విషయం లో మన వ్యక్తిగత అనుభవం పెరిగే కొద్దీ, ఆ విషయం పై మనం వాస్తవానికి చేరువవుతున్నామన్నమాట.అయితే, ఒక attitude తొ మొదలుపెట్టి దానికి విరుధ్ధమైన విషయాలను తమ మది లోకి రాకుండా తిరస్కరిచే వారు, అ విరుధ్ధమైన విషయాలలో ముందుకు సాగరు. ఆ విషయాలలో వారికి అనుభవం ఉన్నా , ఆ విషయాలలో వారు ఎదగరు.

గుప్పెట తో గోళీల sample తీసెటపుడు, మనం తెలివిని ఉపయోగించనవసరం లేదు. కానీ అభిప్రాయాలను ఏర్పరచుకోవటానికి మన అనుభవాలను తెలివితో విశ్లేషించి more objective అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.

ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు.. ఒక విషయం పై ఎవరి అనుభవం ఎంతో మనకు తెలియదు. కొంతమంది wishful tinking తొ మాట్లాడుతారు.ఆదర్శాల , సిధ్ధాంతాల రంగు కళ్ళజోడులు పెట్టుకొని మాట్లాడుతారు.అనామకం గా దుర్బుధ్ధి తో దుర్భాషలాడతారు,వారి భౌతిక మనుగడ కి ముప్పు లేదు కా బట్టీ! వారి వారి వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు బట్టి మాట్లాడుతారు.ఇంకొందరు వారికున్న ఇతరేతర లాభ నష్టాలను(vested interests) బట్టి, చర్చలలో వాదాలు లేవ నెత్తుతారు. ఒక మనిషికున్న ఇటువంటి బలహీనతలన్నిటినీ పక్కన పెడితే, మన అభిప్రాయం అనేది మన అనుభవం అనే biased sample నుండీ పుడుతుంది. అలానే ఎదుటి వారి అభిప్రాయాలు కూడా biased అయి ఉంటాయి. ఈ అభిప్రాయాలు వాస్తవాన్ని ఎంతవరకూ ప్రతిబింబిస్తాయి అనేదానికి ఒక కొలబద్ద లేదు.

కాబట్టీ, ఒక విషయం లో మన అభిప్రాయం ఎంత కరక్టో, ఎదుటి వారి అభిప్రాయం కూడా అంతే కరక్ట్.
శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కొంత వాస్తవానికి దగ్గరగా రాగలవు. శాస్త్రం కూడా తన పరిశోధనల ఫలితాలలో కొంత bias ను అంగీకరిస్తుంది. అది వేరే విషయం.
అందుకే మనకు మన అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనిపించినా, అది కేవలం మన “అభిప్రాయం” మాత్రమే అని గుర్తెరిగి, ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించటం మంచిది.
ఈ పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే 🙂 . మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండేం..?

సమాజ సేవా? కుటుంబ సేవా? స్వార్ధమా? సమానత్వమా?

మన లో చాలా మందికి సమాజానికి మంచి చేయాలన్న  మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ మనకు అనేక పరిమితులు ఉంటాయి. ఒక పారిశ్రామిక వేత్త,  “ముందు నన్ను ఓ 500 కోట్లు సంపాదించనియ్, తరువాత ఇక సమాజ సేవ లో కి దూకేస్తాను,” అంటాడు.
ఇంకొక రాజకీయుడు “పలానా పదవి వస్తే, తరువాత నా శేష జీవితాన్ని సమాజ సేవ లో ప్రశాంతం గా గడుపుతాను” అంటాడు,
ఇంకో మధ్య తరగతి జీవి, “నాకు ఓ భద్రమైన ఉద్యోగం కుదిరితే, నా ఫ్రీ టైం అంతా సమాజ సేవ కే ” అనవచ్చు.
పైన చెప్పిన అన్ని కేసుల్లోనూ సేవ చేయాలనే కోరికకీ వ్యక్తిగత లక్ష్యాలకీ ఉన్న స్పర్ధ ని గమనించ వచ్చు.
కాబట్టీ సమాజ సేవ కోసం వ్యక్తి గత లక్ష్యాలను కొన్నిటిని వదులుకోవాలా? అలా వదులుకొంటే ఎంతవరకూ వదులు కో వచ్చు? ఎంత వరకూ వ్యక్తి గత లక్ష్యాలను వదులుకోవచ్చు అనేది చాలా వరకూ subjective decision. కానీ సమాజ సేవ అనేది negative terrain లోకి వెళ్ళే కొన్ని బోర్డర్ కేసులు ఉంటాయి. అంటే ఒక పరిధికి మించి లోక సేవ చేయటం మంచిది కాదు. అది వ్యక్తి గతమైన బలహీనతో, లేక మానసిక రోగమో అవుతుంది.
ఒక వ్యక్తి బాల కార్మిక సమస్య కి వ్యతిరేకం గా పోరాడుతున్నాడనుకొందాం. అతను ఆ పని లో నిద్రాహారాలు మాని, అనేక వత్తిడులకి లోనయి తే, నిస్సందేహం గా అతని సమాజ సేవ ఒక ప్రమాద కరమైన (బలహీనత/అడిక్షన్/అబ్సెషన్/మానసిక రోగం) స్థాయికి చేరుకున్నదనటానికి ఒక సంకేతం గా భావించవలసి వస్తుంది.  అతని సేవా కార్యక్రమం వలన ముందు అతని ఆరోగ్యం దెబ్బతింటుంది.అతని కుటుంబ జీవితానికి సమయం తగ్గి కుటుంబం లో కలతలు వచ్చే అవకాశం కూడా లేక పోలేదు. తద్వారా అతని సేవా కార్యక్రమం కూడా ఆగిపోతుంది కదా! అదే , అతను తన గురించీ, తన కుటుంబం గురించీ తగు శ్రధ్ధపెడితే తన సేవా కార్యక్రమాన్ని దీర్ఘకాలం నాణ్యమైన పనితీరు తో నడిపించవచ్చు.
విమానాలలో ప్రయాణించే టప్పుడు, ఆక్సిజన్ మాస్క్ వేసు కోవటానికి సూచనలు ఇస్తారు. “ఏదైనా ప్రమాదం జరిగి మాస్క్ వాడవలసి వస్తే, మీ పక్కన ఉండే పిల్లలకు కాక, ముందు మీరు మాస్క్ వేసుకోవాలి”, అని చెప్తారు. మీరే మాస్క్ వేసుకొనక పోతే, పిల్లలను రక్షించలేరు కదా! కాబట్టీ, అదండీ మన వ్యక్తి గత జీవితానికీ సమాజ సేవా జీవితానికీ మనం పాటించవలసిన సమతూకం! ఇక సమానత్వం సంగతి అంటారా..ఇక్కడ సమానత్వం వలన నష్టం వస్తుంది, గమనించారా! మనమూ మన పక్క కూర్చొన్న చిన్న పిల్లా సమానమని భావించి ఇద్దరికీ ఒకే సమయం లో మాస్కులు తొడిగితే, చివరికి ఎవరికీ మాస్కులు తొడగలేక అసలుకే మోసం వస్తుంది.
“ఆ బోడి చెప్పొచ్చావులే, ఈ కాలం లో సమాజ సేవ చేయాలని ఎవరికి ఉంటుంది అంటారా?”, కరక్టే నండీ..నా బ్లాగు ద్వారా ఏదో ఒకటి వాగటం నా బలహీనత అనుకొంటా..! ఇక ఉంటా..బై!

మేధావులూ వారి ఆదర్శ సమాజ సిధ్ధాంతాల పనికిరానితనం

సమాజం లోని మధ్య తరగతి మేధావులు కొంతమంది సమాజ తత్వం తో విసిగి, దానిని ఎదిరించలేక, కొత్త ఆదర్శ వాద సిధ్ధాంతాలను (సమ సమాజం వంటివి) లేవనెత్తుతారు. కానీ ఈ ఆదర్శాలనూ విలువలనూ వారే పాటించలేరు.(ఉదాహరణ కు వారు ఏ మార్క్సిస్టు లో అయి ఉంటారు. కానీ పచ్చి పెట్టుబడిదారు విదిల్చే పదికో పరక కో తమ సిధ్ధాంత రచనలు అమ్ముకొంటారు. కాపిటల్ కే వ్యతిరేకమైన వీరు తమ రచనలకు నాలుగు రాళ్ళు రావటంలేదని మూలుగుతారు)  చలం లాంటి వారు ఎక్కడో ఒకరు దీనికి అతీతులు. ఆయన తను ప్రతిపాదించిన విలువల ప్రకారం జీవించటానికి ప్రయత్నించారు. భౌతిక కారణాలకీ, సహజ స్వభావానికీ విరుధ్ధమైన ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది.
ఈ మేధావుల స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరి ఆదర్శాలకి విలువనిచ్చినట్లు కనిపించదు (వీరి కుటుంబ సభ్యులు, పిల్లలు ఏ అమెరికా లోనో ఉండి అప్పుడప్పుడూ బ్లాగుల్లో బావురు మంటుంటారు. సదరు ఎర్ర మేధావిని కదిలిస్తే, అలా శతృ దేశంలో ఉండటం వారి వ్యక్తి గతం అంటాడు. లేక పోతే తాను అమెరికా ప్రజలకి వ్యతిరేకం కాదనీ, అక్కడి పెట్టుబడిదారి వ్యవస్థ కి వ్యతిరేకమనీ, తన పిల్లలు చదువుకోసం మాత్రమే అమెరికా వెళ్ళారనీ ఏవో సాకులు చెప్పి తప్పించుకోచూస్తాడు..అక్కడికి చదువుకొన్న తరువాత ఆ పిల్లలు అక్కడి పెట్టుబడిదారి సంస్థలలో ఉద్యోగాలు చేయనట్లు, అక్కడి విశ్వవిద్యాలయాలలో అక్కడి పెట్టుబడిదారి కంపెనీల జోక్యం లేనట్లు..).అంటే ఈ మేధావులు తమ చుట్టూ ఉండే వారిని కూడా ప్రభావితం చేయలేక పోయారన్న మాట. దీనిని గురించి వారిని ప్రశ్నిస్తే, “సిధ్ధాంతం ప్రతిపాదించిన వాడి వ్యక్తిగత జీవితం అప్రస్తుతం, అతని ఆలోచనలూ సిధ్ధాంతం మాత్రమే ముఖ్యం”, అంటారు.  ఈ వాదన చూడటానికి బాగానే ఉన్నట్లు కనపడినా, దీనిలో ఒక లోపం ఉంది.

ఏవరైనా ఒక గడియారం తయారు చేశారనుకొందాం. అతను ఆ గడియారాన్ని అమ్ముదామనుకొంటున్నాడు. “ఈ గడియారం నా చేతికి పెట్టుకొంటే పని చేయదు, కానీ నీ చేతికి పని చేయ వచ్చు”, అని అమ్మే వ్యక్తి చెబితే , కొనే వ్యక్తి కొంటాడా? తనకే పని చేయని గడియారాన్ని ఇతరులు ఎందుకు కొనాలి?

చాలా సందర్భాలలో గడియారం వారి చేతికి పనిచేసినా కొన్న వారి చేతిలో పని చేయక పోవచ్చు.

కానీ ఈ మేధావులు ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని సమాజం మీదికి విసిరేసిన సిధ్ధాంతాలను పట్టుకొని వాటి సాధనకోసం నా నా ఇబ్బందులూ పడి తమ జీవితాలని నాశనం చేసుకొన్న వారు, ఉన్నారు, ఉంటారు. అటువంటి సిధ్ధాంతాల గురించి “తస్మాత్ జాగ్రత్త..!”.

సమానత్వం : తాత్విక దృష్టి కోణం

Disclaimer: ఈ టపా సమాజం లో ఉండే అనేక రకాల వివక్షలను సమర్దించటానికి కాదు.

“అహం బ్రహ్మాస్మి, తత్వమసి” అని మన పెద్దలు చెప్పారు. (ఈ సూక్తి మన వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, శంకరుడు చెప్పాడా, లేక పురాణాలలో ఉందా అనేది నాకు తెలియదు. తెలిసిన వారు కొంచెం చెప్తారా?).
మనలో చాలా మంది మొదటి దైన “అహం బ్రహ్మాస్మి” అనే దానిని అమలు లో పెడతారు (In an egotistic way 🙂  ). మిగిలిన భాగం అమలు లో పెట్టటం చాలా కష్టం.
మనలో విద్యా వంతులైన వారు ఎదుటి మనిషి మన వంటి వాడే అనే విషయాన్ని బుధ్ధిపరం గా అర్ధం చేసుకోగలరు. కానీ practical గా అమలు చేయం.భావోద్వేగ పరం గా ఇతరుల భావోద్వేగాలు మన భావోద్వేగాలకి ఎప్పటికీ సమానం కావు. భావోద్వేగం అనేదే మన అస్థిత్వం నుంచీ పుడుతుంది. మన ఆలోచనలన్నీ మన లాభ నష్టాల చుట్టూనే తిరుగుతాయి. మన శారీరక భౌతిక అవసరాలు మనవి. ఎదిటి వాడి ఆకలి మనకు వేయదు కదా! ఎదుటి వాడి రోగం మనం ఫీలవ్వం. ఎదుటి వాడి ముసలితనం వాడిదే! మానసికం గా “నేను” అనే వస్తువే గతకాలపు జ్ఞాపకాల, ఆలోచనల , అనుభవాల సమాహారం.ఈ నేను కి ఎదురైన పరిస్థితులు దానిని మారుస్తూ ఉంటాయి.ఇతరులకి ఎదురైన పరిస్థితులు , నాకు ఎదురైన పరిస్థితులకు పూర్తి గా భిన్నమైనవి కావచ్చు. అలాంటి నేను ఎదుటి మనిషి తో ఆలోచనా పరం గా, భావోద్వేగ పరం గా, వ్యవహార పరం గా సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది?తమ తమ అభిప్రాయాలకీ, భావోద్వేగాలకీ, ఆలోచనలకీ ప్రాముఖ్యతని ఇచ్చుకోని వ్యక్తులను మనమెక్కడైనా చూస్తామా? మన శరీరం కార్చే అనేక శరీర ద్రవాలూ మలినాలు అంటే మనకి అసహ్యం ఉండదు. అదే ఇతరుల ద్రవాలంటే మనకు జుగుప్స ఉంటుంది.
మన అస్థిత్వమే మన మనుగడ (survival) నుంచీ ఆవిర్భవించింది. కాబట్టీ, సర్వ మానవ సమానత్వం అనేది మన నుంచీ మొదలవ్వాలి. కానీ, ఒక్క మేధో పరం గా కాకుండా, ఏ ఇతర ప్లేన్ లో ( emotional, survival, practical, physical,psycological and thoughts) చూసినా మనం మనకు ఇచ్చుకున్న ప్రాముఖ్యతను ప్రపంచం లో వేరే ఎవరికీ ఇవ్వం.
ఇతరుల ఆలోచనలకీ , వారి అనుభవాలకీ మనకు access లేదు. వారి మానసిక ప్రపంచానికి వారికే access ఉంది. అందరి మనుషులకీ ఉమ్మడి గా ఉండే కొన్ని అనుభూతుల ద్వారానే మనం వారితో communicate చేయగలం. మనతో మసలే మన స్నేహితులూ, బంధువుల ఆలోచనలకి మనకు కొంతవరకూ access ఉంటుంది. కాబట్టీ మనం వారికిచ్చే weightage/priority లోకం లో ఇతరులకి ఇచ్చే విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటప్పుడు ఇతరులంటే మనకు కొంత మానవీయమైన సహానుభూతి ఉండవచ్చు, కానీ మానసిక మైన సమానత్వం మాత్రం రాదు. అది ఒక ఆచరణ లో పెట్టలేని ఆదర్శం మాత్రమే అనిపిస్తుంది.   We all are similar, but we are not identical  .

సర్వ మానవ సమానత్వమే ఇలా ఉంటే, ఇక సర్వ జీవ సమానత్వం సంగతి ఆలోచించాల్సిందే!

మనమంతా ఒకే శక్తితో, ఒకే ఎలక్ట్రాన్లూ, అణువులూ వగైరాలతో చేయబడి, ఒకే శూన్య మూలాల నుంచీ, భౌతిక-అధిభౌతిక కారణాలవలన వచ్చినప్పటికీ, వాస్తవం గా ఈ అసమానత్వం తప్పేటట్లు లేదు.

మన శరీరమూ,  మనసూ, రోబో ల తరహా లోమాస్ ప్రొడ్యూస్ అయితే తప్ప,  మనమందరం సమానం కామేమో! మాస్ ప్రొడ్యూస్ అయిన రోబో ల లో కూడా వాటి సామర్ధ్యాలలో తేడాలు ఉంటాయి!

సమానత్వం (స్త్రీ పురుష) : కొన్ని నా ర్యాండం థాట్స్

సమానత్వం గురించి (ముఖ్యం గా స్త్రీ పురుష సమానత్వం) కొన్ని నా ర్యాండం థాట్స్:

ఇండియా లో స్త్రీలు పాత విలువల వ్యవస్థ నుంచీ కొత్త విలువల వ్యవస్థ కి అయ్యే transition సమయం లో ఉన్నారు. మగ వారి కోణం నుంచీ విషాదమేమిటంటే, స్త్రీలకు కొత్త వ్యవస్థ లోని హక్కులూ సమానత్వమూ కావాలి, పాత వ్యవస్థలోని care రక్షణా కావాలి. కాబట్టీ మగవారు తమ హక్కులను వదులుకోవాలి. కానీ పాత వ్యవస్థ ప్రకారం వచ్చే బాధ్యతలను (కుటుంబ రక్షణ, ఆడ వారి care) మోయాలి. మన స్త్రీలు మగవారే తమ ట్రాన్స్ఫర్ లంటి వ్యవహారాలను, రికమండేషన్లను తేవటం వంటి వ్యవహారాలను చూడాలనుకొంటారు. అదే సమయం లో మగవాడితో సమానత్వం విషయం లో ఏ మాత్రమూ వెనుకకు తగ్గరు. తమ జీతం తమదే! మగవాడి జీతం కుటుంబం అంతటిదీ! ఒక పాత సామెత గుర్తుకొస్తుంది..”దున్నేటప్పుడు దూడలలోనూ, మేసేటప్పుడు దున్నలలోనూ కట్టెయటం”. చాలా మంది మగవారు ఈ బేధాలను కనిపెట్టకుండా గానుగెద్దులలా అన్నిటినీ కోల్పోతూ పని చేస్తున్నారు!
వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది. ఏడెనిమిది నెలల గర్భం తో ఉన్న వారు కూడా తమ కారు తమే నడుపుతూ ఆఫీసు కు వస్తారు. మన ఆడ వారిని అలా చేయమంటే మగవారి పై ఎన్ని అభాండాలు వేస్తారో ఊహించండి.

మన వ్యవస్థ లో అనాది గా అసమానత్వానికి కొన్ని కారణాలు…..
1.బలవంతుడెప్పుడూ బలహీన వర్గాన్ని ఆక్రమించి వాళ్ళకు బండ పనులూ, అశుభ్రమైన పనులూ, ప్రమాదకరమైన పనులూ ఇస్తాడు. ఆ పనులు చేసే వారు లేకపోతే సమాజానికి చాలా నష్టం. కానీ అణిచిపెట్టబడ్డ వారికి, అణచివేత వల్లా, పొట్టకూటి కోసం ఆ పనులు చేయక తప్పదు, ఈ రోజుల్లో మధ్య తరగతి తమ కంపెనీలను తిట్టుకొంటూ కూడా పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నట్లు.
2. సమాజం మరియూ వ్యక్తుల అవసరాలను బట్టి కొన్ని పనులకి ఎక్కువ విలువ ఉంటుంది. మూఢనమ్మకాలున్న సమాజం లో కుహనా మత పెద్దలకి విలువ ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులున్న పాత సమాజం లో వైద్యుడికి ఉన్న విలువ మంగలికి ఉండదు.

సమానత్వాన్ని ఒక ఆదర్శం  గా తీసుకొంటే, అనేక రకాల సమానతలున్నాయి.

అమెరికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం formality మాత్రమే! “సీ ఈ ఓ” జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో factory లలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభై truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality (చేసే పని లో సమానత్వం)అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు.కానీ నిర్ణయాలు తీసుకొనటం అనేది అమలు పరచటం కంటే మేధోపరం గా ఎక్కువ స్థాయి పని. మొదట్లో ఈ రెండు పనులనూ కృత్రిమం గా ఒకే స్తాయిలో పెట్టినా, కొన్నాళ్ళకి నిర్ణయాలు తీసుకొనేవారి ఆధిపత్యాన్ని ఆపటం కష్టం అవుతుంది.
సోషలిస్ట్ వ్యవస్థ ఏవరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటట్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా “ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టీ,ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు”.
సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే! అలానే ఎక్కువ కష్టపడే వారినీ తక్కువ కష్టపడె వారినీ సామ్యవాద వ్యవస్థ అయినా సమానం గా చూడలేదుకదా! సోమరిపోతుతనానికి కారణాలు అన్ని వ్యవస్థలలోనూ ఉంటాయి.

స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు functional equality ని ఆశిస్తారు. సమానత్వమంటే functional equality అనుకొంటారు. కానీ  functional equality తో వ్యవస్థ పని చేయదు. కొన్నాళ్ళకి అది కుప్ప కూలుతుంది.
ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి failఅవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు  కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system  లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components  స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency  ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, ప్రస్థుత కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

సమాజం లో విప్లవాలు రాత్రికి రాత్రి రావు. సమాజ స్థూల పరిస్థితుల (శాస్తవిజ్ఞానాభివృధ్ధీ, సాంకేతికతా, విద్యా మొదలైనవి) లోని పరిణామం వలన ఒకానొక దశలో ఇవి వెల్లువెత్తుతాయి.
పూర్తిగా అణిచివేయబడిన వర్గానికి మొదట్లో తాము అణిచివేయబడ్డామనే స్పృహ కూడా ఉండదు. వారి లో కొందరు అణచివేత పరిస్థితులలోంచీ దూరం గా వేళ్ళటం వలనో, లేదా వారి ఆలోచనలు మిగిలిన వారికంటే ముందుకు వెళ్ళటం వలననో అణచివేతని ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ముందు గా అణచివేసే వర్గం లోని కొందరు మానవత్వం కలవారు అణిచివేయబడిన వర్గాన్ని సమభావం(మానవ ప్రేమ) తో జాగృతం చేయటం వలన కూడా అణిచివేయబడిన వర్గం లోని చైతన్యానికి కారణమౌతుంది.
ఐతే ఈ విప్లవాల వలన సమానత ఏర్పడుతుంది అనుకోలేం. అసమానతలు తారు మారవుతాయి.అధికార బదిలీ జరుగుతుంది. అంతకు ముందు పాలకులు గా ఉన్న వారు పాలితులవుతారు, పాలితులు పాలకులౌతారు. సమాజం లోని కొత్త  స్థూల పరిస్థితుల ఆధారం గా సరి కొత్త అసమ సమాజం బయలుదేరుతుంది.

అధికారాలను కోల్పోవటం అలా కోల్పోయే వారికి ఒక బాధాకరమైన ప్రక్రియ.ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు((చిన్నపిల్లలు) ఉన్నారనుకొందాం. వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్స్ కొని ఫ్రిజ్ లొ పెట్టారనుకొందాం. పెద్ద వాడు ముందు వెళ్ళి ఆ నాలుగు చాక్లెట్లూ తీసేసుకొంటే, చిన్న వాడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా రెండు చాక్లెట్స్ ఇవ్వటం పెద్ద వాడికి బాధాకరం గానే ఉంటుంది. అప్పుడు పెద్దవాడికి వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్లూ కబ్జా చేయటం ఎందుకు చెడ్డ విషయమో, చిన్న వాడికి రెండు చాక్లెట్స్ ఇవ్వటం ఎందుకు మంచి విషయమో చెప్పాలి. చిన్న వాడికి చాక్లెట్స్ ఇచ్చినపుడు పెద్ద వాడిని మెచ్చుకోవాలి.చిన్న వాడి చేత థాంక్స్ చెప్పించాలి.కానీ, మన సమాజం లో అమ్మ లా పెద్దవాడి మంచి ప్రవర్తన ని మెచ్చుకొనే వారూ లేరు…చిన్నవాడి చేత థాంక్స్ చెప్పించేవారూ లేరు. చిన్న వాడు, అన్న దగ్గర ఉన్న నాలుగు చాక్లెట్సూ నాకు కావాలి అని పట్టుపట్టవచ్చు. అప్పుడు చిన్నవాడికి కూడా వాళ్ళ అమ్మ పెద్ద వాడికి చెప్పినట్లే చెప్పాలి. ఇక్కడ అమ్మ పాత్రని ఒకప్పుడు మన సమాజం లో పెద్ద వారు పోషించేవారు. వారు పూర్తిగా నిష్పక్షపాతం గా లేకపోయినా, వారి presence ఒక stabilizing influence ని కలిగి ఉండేది. పెద్ద వారిని పట్టించు కోని ఈ కాలం లో వారి మధ్యవర్తిత్వాన్ని ఆమోదించేదెవరు?
మనం రాబోయే నాలుగువందల సంవత్సరాలలో మానవ జాతి సరైన దిశలో ఉండే నిర్ణయాలు తీసుకోవాలంటే,ఒక నాలుగైదు తరాలవారిని ఒక చోట కూర్చోబెట్టి పరిష్కరిస్తే గానీ ఆ సమస్యలు విడిపోవు. కానీ నాలుగైదు తరాల పాటు బ్రతికి ఉండే వ్యక్తి ఏవరు?కాబట్టీ సమాజం long term లో ఒక అదుపు లేకుండా, మనుషులు ఒక జీవిత కాలం లో చేసే short term పనులతో గజి బిజి గా సాగుతూనే ఉంటుంది. ఒక తరానికి నేర్పబడిన పాఠాలు, మరొక తరానికి మళ్ళీ నేర్పాల్సి వస్తుంది. తప్పులు పునరావృతమౌతాయి. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఈ long term continuity ని కొంత కాలం నిలబెట్టగలిగినా, ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది.

సమానత్వమే అత్యున్నత విలువా? కానే కాదు. కుటుంబం యొక్కా, తద్వారా సమాజం యొక్క greater good కి సమానత్వాన్ని త్యాగం చేయవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా కుటుంబం కోసం తక్కువ స్థాయిని ఆమోదించటం లో తప్పేమీ లేదు.తద్వారా ముందు కొంత తక్కువతనాన్ని అనుభవించినా, కుటుంబం యొక్క ఆరోగ్యం, తద్వారా వచ్చే ఆనందం ద్వారా దానిని పూడ్చుకోవచ్చు. పురుషులు దీనికి ఈ మధ్యే అలవాటుపడుతున్నారు. స్త్రీలు కొత్తగా దొరికిన కొబ్బరి చిప్పైన సమానత్వాన్ని అంత తొందరగా వదిలే సూచనలు కనపడటం లేదు.

స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

ఒక మనిషి ఆలోచనలనూ, ప్రవర్తననూ ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థ లోని భౌతికమైన కారణాలు ప్రభావితం చేస్తాయి. ఈ భౌతికమైన కారణాలు మారినప్పుడు ఆ మనిషి ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది.అదే విధం గా ఆలోచనల వలన వ్యవస్థ మారటం కూడా జరుగుతుంది. కానీ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉన్నప్పుడే ఈ మార్పు జరుగుతుంది.

స్త్రీల మీది వివక్షకు కారణాలు మధ్య యుగాలలోని పరిస్థితులలో ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, సమాజం నిరంతర యుధ్ధాలలో మునిగి తేలుతుండటం, స్త్రీ కి శారీరకం గా సంతానాన్ని కనటం, రుతు క్రమం  మొదలైనవి స్త్రీ మీది పురుషుల ఆధిపత్యానికి మూల కారణాలు.
(తెలుగు భాష మూలాలు మధ్య యుగాలలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో స్త్రీ ని ఒక రక్షించుకొన వలసిన సంపద గా భావించే వారు. ఒక జంతువు నో, వస్తువునో, బండినో అన్నట్లు గానే స్త్రీ ని “వచ్చింది” అంటారు. అదే స్త్రీ ఏ రాజు గారి భార్యో అయితే సేవకుడు “వచ్చారు” అని పుం లింగం లొ పిలిచినట్లు గా పిలిచే వారు. ఇంగ్లీష్ లో ఈ మధ్య స్త్రీ వాదులు ఆక్ట్రెస్ అనే పదాన్ని వాడటం లేదు. వారు ఆడ వారిని ఆక్ట్రెస్  అని పిలవటం లింగ వివక్ష కు నిదర్శమ్నం అని అంటున్నారు.స్త్రీ ని కూడా ఆక్టర్ అని పిలవాలని అంటున్నారు. ఇక తెలుగు లో ఆడ వారిని కూడా “వచ్చాడు” అని పిలవమనే కాలం ఎంతో దూరం లో లేదనుకొంటా.)
ఇక అసలు విషయానికి వస్తే, భారతీయ సమాజం సమాజం లో  రాజారామమోహన రాయలు, ఆంధ్ర సమాజం లో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారి సంస్కరణల వలన స్త్రీ విధ్య తో స్త్రీ జనోధ్ధరణ మొదలైంది. తరువాత వచ్చిన స్వతంత్రం వలన ప్రజాస్వామ్యమూ, వోటు హక్కూ స్త్రీలకు వచ్చాయి.  మగాడు చేసే పని లో శారీరకమైన శ్రమ తగ్గిపోయింది. తెలివితో చేసే పని ఎక్కువయ్యింది. స్త్రీలు కూడా ఆ పని చేయటం లో ఏ విధం గానూ తక్కువ వారు కాదు.వీటన్నిటి పర్యవసానం గా స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం ఒనగూడింది.(స్త్రీలు ఉద్యోగాలు చేస్తే లేబర్ సప్లై ఎక్కువై, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టీ కాపిటలిస్టు లు కూడా స్త్రీ సమానత్వాన్ని ప్రోత్సహించారు. స్త్రీ ఇంట్లో చేసే వంట ని కమర్షియలైజ్ చేసి, మెక్డోనాల్డ్స్ వంటి వాటి తో లాభలు పండించే అవకాశం వలన కూడా కాపిటలిస్ట్ ల కి ఉపయోగమే ! )  ఆర్దిక స్వాతంత్ర్యం లేకుండా స్త్రీ వాదాన్ని ఆచరణ లో పెట్టటం స్త్రీలకు కష్టమైన పని. గర్భనిరోధక సాధనాల వలన పిల్లలను కనటం మీద స్త్రీ కి అదుపు ఏర్పడింది. దీని వలన స్త్రీ కి తన ఉద్యోగం, జీవితం పై నియంత్రణ పెరిగింది.ఈ అన్ని కారణాల వలన స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజం లో వచ్చిన ఒక పరిణామం.కానీ పాత అలవాట్లు అంత త్వరగా వదలవు కొంత మంది మగ వాళ్ళు ఇంకా మారిన పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవటం వలన,పాత అలవాట్లను ఒదులుకోలేక పోవటం వలన పురుషాధిక్య భావజాలాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది మగ వాళ్ళూ స్త్రీ పురుష సమానత్వాన్ని స్వాగతించారు. మగ వారు సమానత్వాన్ని స్వాగతించకపోతే సమానత్వం అనేది ప్రస్థుత సమాజపు ఒక విలువ గా స్థిర పడేది కాదు.
పై చెప్పిన కారణాలన్నింటి వలనా మగ వారి తో  సమానం గా విద్యావంతులైన ఆడవారు కొంత మంది మగ వాళ్ళ లో గూడు కట్టుకొన్న ఆధిపత్య భావన కు వ్యతిరేకం గా స్త్రీ వాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదే స్త్రీ వాదాన్ని ఏ మధ్య యుగాలలో నో ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ ద్రౌపది వంటి ఏ స్త్రీ వాదో కొన్ని ప్రశ్నలు అడిగినా అది అప్పటి సమాజాన్ని ఎంత మార్చగలిగిందో మనకందరికీ తెలుసు. స్త్రీ వాదం లేక పోయినా ఈ సమాజం లోని ప్రజాస్వామ్య శక్తుల దృష్ట్యా, మారిన పని స్వభావం దృష్ట్యా స్త్రీ పురుష సమానత్వం వైపుకి మన సమాజం అడుగులు వేస్తోంది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
స్త్రీ వాదం వివక్ష చూపించే పురుషుల పై పోరాటం జరిపి సమానత్వ సాధనను వేగ వంతం చేస్తుందనేదాంట్లో కూడా ఏ మాత్రం సందేహం లేదు.
కానీ స్త్రీ వాదులు రెండు గుంటలలో పడే ప్రమాదం ఎక్కువ గా కనిపిస్తోంది. ఒకటి పురుషుల నందరినీ స్త్రీ వ్యతిరేకులు గా అర్ధం చేసుకొని ఆ విధమైన ప్రచారం సాగించటం. రెండవది ఆధిపత్యం కోసం ప్రయత్నించటం. వీటి వలన స్త్రీ పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్య పోరు మొదలై అసలుకే మోసం వచ్చి, మళ్ళీ సమాజాలు మధ్య యుగాలలోకి జారి పోయే ప్రమాదం ఉంది. స్త్రీ వాదం చాలా వరకూ పట్టణాల లోని ఉన్నత తరగతి స్త్రీ ల నుంచీ వస్తోంది. వీరు పురుషాధిపత్యం ఎక్కువ గా ఉన్న గ్రామాలలోకి తమ ఉద్యమాన్ని తీసుకొని అక్కడి ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. కాని మన గ్రామాలలో స్త్రీ ల కు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని కారణం గా వారి జీవితాలలో నయా స్త్రీ వాదం ఎంతవరకూ మేలు చేస్తుందో సందేహాస్పదం.
ఇక దళిత వాదం విషయానికి వస్తే,  పోడు వ్యవసాయ వ్యవస్థలో ఎక్కువ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేసిన వాళ్ళూ భూస్వాములయ్యారు. వారికి ఎక్కువ కులం ఇచ్చి కుల వ్యవస్థ ఆదరించింది. అదేవిధం మొదటి నుంచీ ఇక్కడి వారైన దళితులు కూలీలు గా మిగిలి పోవలసి వచ్చింది. అప్పటి కుల వ్యవస్థ ను అప్పటి భాహ్మణులు రాజులూ సమర్ధించారు. కానీ ఈ వ్యవస్థ లో కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వలనా, ప్రజాస్వామ్యం వలనా అసమానతలు తగ్గాయి. కానీ ఇక్కడ చేయవలసింది చాలా ఉంది, ముఖ్యం గా గ్రామా ల లో భూమి లేని దళిత వ్యవసాయ కూలీ ల విషయం లో.
ఇక దళితవాదం ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవలసిందే. కానీ ఆ భావం లేని అగ్రకులస్థుడి  దగ్గరికి వెళ్ళి వాడికులాన్నితిట్టడం తగదు. దీని వలన ఉద్యమమే కొంతమంది సమర్ధకులనూ, సానుభూతిపరులనూ కోల్పోతుంది. ఇది ఉద్యమానికే నష్టం.ఉద్యమకారులు పోరాటాల గురించిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఈ విధమైన నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకొంటే మంచిది.
ఇక స్త్రీ వాదులు కానీ దళిత వాదులు కానీ తమ పోరాటం ఆధిపత్య భావజాలం మీద కానీ వ్యక్తుల మీద కాదు అంటారు. కానీ ఆధిపత్య భావజాలం వ్యక్తుల బుర్రలలో ఉంటుంది. కాబట్టీ చివరికి వ్యక్తులను లక్ష్యం చేసుకోవటం ఒకానొక దశ లో తప్పదు.ఇలాంటి దశ లో పైన ఉండే సిధ్ధాంత కర్తలకు ఉన్న క్లారిటీ రోడ్డు పైనా, ఊళ్ళలోనూ పోరాటాలూండే సామాన్యులకు ఇది అర్ధమయ్యే అవకాశం తక్కువ. దీనివలన క్షేత్ర స్థాయి లో ఉద్యమ లక్ష్యాలకు విరుధ్ధమైన హింస చోటుచేసుకోవచ్చు.
అదే విధం గా ఆధిపత్య పోరాటాల వలన ఒనకూడే ప్రయోజనం సున్నా. వీటి వలన ఎదుటి వారు అంతా ఏకమయ్యి మళ్ళీ తిరోగమనానికి దారి తీయవచ్చు.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన చిక్కులూ, మనిషి బుర్ర పరిమితులూ…

అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన ఇబ్బందులూ, మనిషి బుర్ర పరిమితులూ…

మీరు ‘X’ అనబడే వర్గానికి చెందిన వారనుకొందాం. మీరు Y అనే వర్గం వారిలో చాలా మంది వలన మీకు నష్టం జరిగింది అనుకొంటున్నారు. మీరు ఇలా అనుకోవటం అనేది మీ ప్రత్యక్షానుభవం వలన కావచ్చు, లేక పుస్తకాలు చదవటం వలన కావచ్చు,లేక పెద్ద వాళ్ళు మీకు చెప్పటం వలన కావచ్చు లేక మీడియా వలన కావచ్చు. అయితే అదే సమయం లో Y వర్గం కి చెందిన వాళ్ళ లో కొందరి పట్ల మీకు మంచి అభిప్రాయం కూడా ఉంది.ఎందుకంటే వాళ్ళు మీకు మంచి చేశారు. Y వర్గం లోని ఆ కొంత మందికి, మీరు “Y వర్గం వాళ్ళకు ఉంటాయి” అనుకొన్న చెడు లక్షణాలు లేవు.

కానీ మన మనిషి బుర్ర ఒక విషయం గురించిన అన్ని వివరాలనూ( డీటెయిల్స్) వాటి కి చెందిన సంక్లిష్టత (కాంప్లెక్సిటీ) లనూ  తనలో ఇముడ్చుకోలేదు. ఆ విషయానికి సంబంధించిన సారాన్ని (అబ్స్ట్రాక్ట్) మాత్రమే ఒక  చిత్రం(ఇమేజ్) గా లేక ఒక మాట గా తన లోపల ప్రాతినిధ్యం(రిప్రజంటేషన్) కల్పిస్తూ దాచుకొంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం కి సంబంధించిన కోడ్ మొత్తం మన బుర్ర లో దాచుకోం..కానీ దాని డిజైన్ కి సంబంధించిన స్థూలమైన మోడల్స్ మాత్రం మన బుర్రలోఉంటాయి కదా.ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు,”Y వర్గం లో పుల్లయ్య మంచి వాడు..ఎల్లయ్య మంచివాడు కాదు…సీతమ్మ మంచిది…. “,అని చెప్పరు.   అలానే”Y వర్గం మంచిదీ కాదు..చెడ్డదీ కాదు..అందులోనే మంచివాళ్ళూ..చెడ్డ వాళ్ళూ..మంచీ చేడూ కాని వాళ్ళూ అందరూ ఉన్నారు”, అనికూడా చెప్పరు.

కాబట్టీ, ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు మీకు Y వర్గం వలన మొత్తం(రిసల్టెంట్) గా కలిగిన భావం మాత్రమే మీరు చెప్తారు. అంటే  Y వర్గం వలన మీకు కలిగిన నష్టం లో నుంచీ,అదే వర్గం లోని తక్కువ మంది వలన మీకు కలిగిన లాభాన్ని తీసి వేస్తే మిగిలేది కొంచెం తక్కువగా నైనా నష్టమే. కాబట్టీ మీరు Y వర్గం అంటె చెడు భావాన్నే వ్యక్త పరుస్తారు. భావాలను వ్యక్త పరిచేటప్పుడు మనిషికి పెద్ద వెసులుబాటు లేదు. మీరు ఒక వర్గాన్ని ఇష్టబడతారు లేదా ద్వేషిస్తారు. వీటినే ద్వంద్వాలంటారు. ఈ రెండిటికీ మధ్య ప్రతిస్పందన మనిషికి ఈ విషయాలలో చేత కాదు. కాబట్టీ మీరు టొకున గంప గుత్త గా Y వర్గమంటే మీ అయిష్టాన్నీ ద్వేషాన్నీ వ్యక్తపరుస్తారు..అది రచనల ద్వారా కావచ్చు..చేతల ద్వారా కావచ్చు..మాటల ద్వారా కావచ్చు.
ఒక్క సారి మీ అయిష్టాన్ని విన్న తరువాత,అంతకు ముందు Y వర్గం లో మీకు మంచి చేసిన వాళ్ళూ, లేక మీరంటే ఇష్టమున్న వాళ్ళూ కూడా గాయపడతారు. వారు కూడా మీరు అంటే అయిష్టం పెంచుకొంటారు. మీ లాంటి వారు ఇంకొందరు  Y వర్గాన్ని తిడితే, వీళ్ళ అయిష్టం మీ వర్గమైన X అంతటికీ విస్తరిస్తుంది. ముందు నుంచీ Y వర్గం లో మీకు అయిష్టమైన వాళ్ళూ ఎటు తిరిగీ ఆత్మ విమర్శ చేసుకొనే రకం కాదు. వాళ్ళూ ఎటుతిరిగీ మీ వర్గానికి వ్యతిరేకమే. ఇప్పుడు Y వర్గం నూరు శాతం మీకూ మీ వర్గానికీ వ్యతిరేకమయ్యింది.  ఇలా పరస్పర ద్వేషం ఒక విష వలయం లా వర్ధిల్లుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇక్కడ ముఖ్యమైన లోపం మనిషి బుర్రకి ఉన్న పరిమితులే అనిపిస్తుంది నాకు…
X వర్గాన్ని స్త్రీ, దళిత, ప్రాంతీయ వాదుల తో ప్రతిక్షేపించండి (సబ్స్టిట్యూట్).
Y వర్గాన్ని X వర్గం యొక్క ప్రత్యర్థి వర్గం తో ప్రతి క్షేపించండి.
అలా చేస్తే మన సమాజం లో ద్వేషం రోజు రోజు కీ ఎలా  పెరుగుతోందో మీకు అర్ధమౌతుంది అని ఆశిస్తున్నాను.
ఒక్క సారి ఎదుటి వర్గాన్ని ద్వేషించటం మొదలు పెట్టిన తరువాత, వారు చెప్పే మంచి మాటలను కూడా మీరు అనుమానం తోనే చూస్తారు.ఒక సారి అనుమానం మొదలైన తరువాత,ఎదుటి వారి మాటలు ఎంత అర్ధవంతమైనవి ఐనా అవి వీరి చెవిన పడవు. ఒక వేళ పడినా అవి మెదడుని చేరవు.
కానీ X వర్గానికి చెందిన వాళ్ళు X వర్గాన్ని ద్వేషించటం చాలా చాలా తక్కువ. అలానే Y వర్గం కూడా. ఒక రకం గా వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం. మళ్ళీ ఒకే వర్గం లోని వాళ్ళు వారి వారి స్వార్థ ప్రజోజనాలకు భంగం వచ్చినప్పుడు ఒకరినొకరు ద్వేషించుకొంటారు. శాంతి కోసం మనిషి ఎప్పుడూ ఎదుటి వాడినీ లేక ఎదుటి వర్గాన్ని మారమంటాడు. కానీ సమస్య తనలో కూడా ఉందని గుర్తించడు.
కాబట్టీ, మనిషి ఎదుటి వర్గం లోని వాడిని “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వమనటం తో పాటు తాను కూడా “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వటం వలన్ ఈ సమస్యలన్నీ పోతాయి. ఇలా డీ-సెల్ఫ్ అవ్వటానికి వ్యక్తి గతం గా మనిషి తన మానసిక శక్తిని ధారపోయాలి. దానివలన మనిషి కి వ్యక్తిగతం గా ఒరిగేదేమీ ఉండదు. ఒకపల్లెటూరి కుల తత్వ వాది కష్టపడి కుల తత్వాన్ని అధిగమించి ఒక పాశ్చాత్యుడి లా ఆలోచిస్తే, సమాజానికి మంచిదేనేమో కానీ, వాడికి ఒరిగిందేమిటి?

***************************************

మీరు మెయిన్ రోడ్డు లో కారు తోలుకొంటూ పోతూ ఉంటారు. అప్పుడే పక్క రోడ్డు లో నుంచీ ఒకతను స్పీడ్ గా మెయిన్ రోడ్ మీదకు వస్తాడు. అతనిని మీరు, ” పక్క రోడ్ మీది నుంచీ వస్తున్నాడు కదా..నెమ్మది గా రావాలనే ఇంగితంలేదా వీడికి?” అని విసుక్కొంటారు.
కొంచెం ముందుకు పోయాక మీరు ఒక పక్క రోడ్ లోకి వేళ్తారు. కాసేపటికి పక్క రోడ్ లో నుంచీ మెయిన్ రోడ్ మీదికి వేళ్తుంటే,మెయిన్ రోడ్ మీద ఒక ఫర్లాంగ్ దూరం లో ఒక కారు మీ వైపుకి వస్తోంది. ఆ కారు ఇంకా చాలా దూరం లో ఉంది గదా అనుకొని మీరు మెయిన్ రోడ్ ఎక్కేస్తారు.  మెయిన్ రోడ్ మీది కారు వాడు మిమ్మల్ని చూస్తూ కోపం గా హారన్ కొడతాడు… మీరు వాడిని లెక్క చేయరు.
కానీ మీరు చేయ వలసిన పని మెయిన్ రోడ్ లో ఉన్నా , పక్క రోడ్ లో ఉన్నా రెండు సందర్భాలలోని పరిస్థితి ని కూడా అర్ధం చేసుకొని ప్రతిస్పందించటం. కానీ అస్థిత్వ వాద కవిత్వం చెప్పే వారు ఈ పని చేయరు. వారి కవిత్వమూ ఆవేశమూ పాటలూ అన్నీ తాము ఎదుటి వారి పరిస్థితి లో ఉంటే ఏమి చేస్తామో అన్న స్పృహ తో ఉండవు. ఇంతకు ముందు ఎదుటి వారి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయా కవిత్వాలు చెప్పిన వారు గొప్ప గా ఏమీ ప్రవర్తించి ఉండరు. ఎదుటి కార్ వాడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా, వాడు చేసిన తప్పులే చేస్తూ వాడిని ఆవేశం గా తిట్టటమూ,తమని సమర్ధించుకోవటమూ ఈ అస్థిత్వ వాద కవులకే చెందింది.  ఆత్మ స్థుతీ..పర నిందా..  తాము మాత్రం పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇచ్చే రక్షణ తో విమర్శలకు అతీతులమనుకొంటూ కాలం గడిపేస్తారు.ఒకడిని తిట్టటం చాలా సులువు..వాడి పరిస్థితి లో మనము ఉంటే బాధ్యత తీసుకొని పని చేయటం చాల కష్టం.. .

********************************

కొందరు ఏదో ఒక వాదాన్ని భుజాన వేసుకొంటారు. భుజాన వేసుకొన్నాక ఆ వాదం వాళ్ళది అవుతుంది. దానితో ఒక వ్యక్తి గత సంబంధం ఏర్పడుతుంది. ఇష్టం ఏర్పడుతుంది. తరువాత ఆ వాదం లో ఉన్న లోపాలు తెలిసి వస్తాయి. కానీ అప్పటికే ఆ వాదం తనది ఐపోయింది. ఆ బంధాన్ని తెంపుకోవటం కష్టమౌతుంది. ఆ వాదం సహాయం తో లోకం లో పేరు ప్రతిష్టలు వచ్చేశాయి. ఇప్పుడు దానిని దింపుకోవటం కష్టమౌతుంది.
మరి కొంతమంది వాదం మొదలెట్టిన కొత్తలో నిజాయితీ గా మొదలెడతారు. కానీ వాదం తెచ్చిన పేరు ప్రతిష్టల వలన, అధికారం డబ్బుల వలన వారికి మొదట్లో ఉన్న పరిస్థితి ఉండదు. వారికి ఆ వాదం ఇంకెంత మాత్రం అవసరం లేదు కానీ జనాలను మభ్య పెట్టతం కోసం, స్వార్థం కోసం ఇంక ఆ వాదాన్ని వదల లేరు. వాదాల ముసుగు లో వ్యక్తి గత దాహాలను తీర్చుకొనే వారు ఇంకొందరు. “మీరు లేక పోయినా వాదాల కొచ్చిన ఇబ్బంది ఏమె లేదు కదా, మీరు తప్పుకోండి”, అని వీరిని అడగండి, వీరి బండారం బయట పడుతుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

విశ్వపరిణామం లో నియమాలు, శాస్త్రవేత్తల దేవుడు

“ఐన్ స్టీన్” మహాశయుడు “హైజెన్ బర్గ్” యొక్క అనిశ్చితి సిధ్ధాంతం గురించి, “దేవుడు పాచికలు వేయడు”, అని అన్నట్లు చెబుతారు. ఇక్కడ “ఐన్ స్టీన్” మాట్లాడేది ఆస్తికుల దేవుడి గురించి కాదనీ, విశ్వం లోని నియమాలనే ఐన్ స్టీన్ దేవుడి గా పరిగణిస్తున్నాడనీ తరువాత ఆయన వ్యాఖ్య కు భాష్యం చెప్పడమైనది.
విశ్వ నియమాల సంగతి కొస్తే..
విశ్వం యొక్క రహస్యాల గురించి ఆలోచించే వారు అడిగే రెండు ప్రశ్నలు
1.”ఫలానా విషయం ఎలా జరుగుతుంది?”
2.”ఫలానా విషయం ఎందుకు జరుగుతుంది?”
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రక్రియ లో శాస్త్రవేత్తలు ప్రకృతి ని పరిశీలించి పరిశోధిస్తారు. ఈ పరిశోధనలో విశ్వం పని తీరుని తెలిపే అనేక సూత్రాలూ, నియమాలూ పుడతాయి. ఇవన్నీ విశ్వం యొక్క స్వభావాన్ని విశదీకరించేవే.
“ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్న కి సైన్స్ ఎలాగొలా తంటాలుపడి సమాధానం చెప్తుంది. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం.(ఇక్కడ ఎందుకు అంటే “ప్రయోజనం లేక పర్ పస్ ఏమిటి?” అని కాదు. ప్రయోజనాలు మనుషులకూ జీవులకూ ఉంటాయి. ఏ వ్యక్తిత్వమూ లేని విశ్వానికి ఒక పర్పస్ ఉండదు).
ఎందుకు విశ్వం ఇలానే ఉంది? ఎందుకు వేరే సవా లక్ష విధాలుగా లేదు? గురుత్వాకర్షణ ఎందుకు ఉంది? ఎలెక్ట్రాన్లూ ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ అలానే ఎందుకు ఉన్నాయి..? ఉదాహరణ కు న్యూట్రాన్లు ప్రోటాన్లచుట్టూ ఎందుకు తిరగవు..? మొదలైన ప్రశ్నలు ఈ “ఎందుకు?” ప్రశ్నలు. వీటన్నిటికి విశ్వం “ఎలా” మొదలైంది అన్న ప్రశ్న లో సమాధానం ఉండవచ్చు. ప్రాధమిక స్థాయిలో “ఎందుకు?” అనే ప్రశ్నకు, ఉన్నత స్థాయి లో “ఎలా?” అనే ప్రశ్న సమాధానం ఇస్తుంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ, శాస్త్రవేత్తలు ప్రాధమిక స్థాయిలో ఒక నియమాన్ని కనిపెడతారు. తరువాత ఈ నియమం ఎందుకు అలానే పని చేస్తుంది అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం గా ఉన్నత స్థాయి లో ఎక్కువ సార్వజనీన మైన ఇంకొక నియమం వెలుగులోకి వస్తుంది. ఈ నియమాల స్థాయి పెరుగుతూ పోయి ఏ బిగ్ బాంగ్ అనబడే ఎయిర్ పోకెట్ కో కొట్టుకొని ఆగిపోతాయి.

ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెబితే బాగా అర్ధమవ్వ వచ్చు..
“మనిషి కి ఆలోచనా శక్తి ఎందుకు ఉంది?” అనేది ఒక ప్రాధమిక ప్రశ్న.
“జీవపరిణామం లో భాగం గా ఏర్పడింది”- జవాబు.
“జీవపరిణామం ఎందుకు జరిగింది?”
“అనేక కారణాలు..క్లుప్తం గా..యాదృచ్చిక జన్యమార్పుల వలన జరిగింది”
“జన్యు మార్పులు ఎందుకు జరుగుతాయి?”
“అనేక విధాలు..సూర్య రశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు జన్యు పదార్ధాన్ని ప్రభావితం చేయటంవలన జన్యు మార్పులు జరుగుతాయి”
“సూర్య రశ్మి వలన జన్యువులు ఎందుకు మారుతాయి?”
“స్థిరత్వం కోసం. స్థిరత్వం అనేది ఈ విశ్వ నియమం కదా!”
“స్థిరత్వమే ఎందుకు ఈ విశ్వ నియమం అయింది. అస్థిరత్వం ఎందుకు ఈ విశ్వ నియమం కాలేదు?”
“నీ తలకాయ! అడ్డగోలు గా మాట్లడకు. నీ చొప్పదంటు ప్రశ్నలూ..నువ్వూ..!”.

పైన ప్రశ్నలన్నీ “ఎందుకు” ప్రశ్నలే. ఈ ఉదాహరణ లో, దిగువ స్థాయి లో ఎందుకు ప్రశ్నలకి పై స్థాయి లో “ఎలా పనిచేస్తుందో చెప్పటం” ద్వార జవాబు ఇవ్వటం గమనించ వచ్చు. “సృష్టి అలానే ఎందుకు ఉంది?, ఇంకా అనేక విధాలుగా ఎందుకు లేదు?” అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం రావటం లేదు. “సృష్టికి సంబంధించిన పై స్థాయి నియమం సృష్టి ఇతరమైన అనేక విధాలు గా ప్రవర్తించటాన్ని నిరోధిస్తోంది”, అనే ఒక విషయం మాత్రం పరోక్షం గా అర్ధమౌతోంది. కాబట్టీ ఈ “ఎందుకు?” కి అసలైన సమాధానం కోసం మనం “మనిషి తెలివి” నుంచీ బిగ్ బ్యాంగ్ వరకూ పోవలసి వచ్చింది. కానీ “ఈ ప్రపంచం ఈ నియమాల ద్వారానే ఎందుకు నడుస్తోంది?”, అన్న ప్రశ్న కు సమాధానం దొరక్లేదు. కొంచెం పై స్థాయి లో చూస్తే, ఈ నియమాలన్నీ విశ్వాన్ని కొంచెం మెరుగు గా వర్ణించే వివరణలే! ఈ విశ్వం ఎందుకు ఉంది అనే ప్రశ్నకు సమాధానాలు కావు. “ఈ నియమాల ప్రకారమే విశ్వం ఎందుకు పని చేయాలి?”, అనే ప్రశ్నకు సమాధానాలు అసలే కావు.చివరికి ఏ నియమాలూ పని చేయని సింగులారిటీ(బిగ్ బ్యాంగ్ ఆది స్థితి) కి చేరుకోవలసి  వస్తుంది!

చివరిగా, “విశ్వం ఏమీలేని స్థితి నుంచీ పుట్టింది” అని ఈ మధ్య కాలం లోని కొందరు శాస్త్రవేత్తల వాదన. ఎందుకంటే “సం థింగ్” అనేది “న థింగ్ కంటే” స్థిరమైనది అట. ఏమీ లేని “న థింగ్” లో స్థిరత్వం అనే నియమం మాత్రం ఎందుకు ఉంటుంది? ఒక వేళ అటువంటి నియమం ఉంటే, అది ఎందుకు ఉంది  ( ఎవరో ఆ నియమాన్ని శాసనం చేసినట్లు)? ఏమీ లేని స్థితి లో, “స్థిరత్వం నుంచీ ఇంకా అస్థిరత్వం వైపుకి పోవచ్చు కదా?” ఏమీ లేని స్థితి స్థిరమైనది ఎందుకు కాదో, ఏదో ఉన్న స్థితి ఎందుకు స్థిరమైనదో ఈ శాస్త్రవేత్తలు చెప్పరు. “తాడు దొరికింది గేదేను కొనమన్నట్లు”, స్థిరత్వ సిధ్ధాంతం ఉంది కాబట్టీ దానిని సృష్టి జననానికి అన్వయించినట్లుంది.

నాకు వచ్చిన ఈ సందేహాలలో కొన్నైనా తప్పు అయే అవకాశం ఉంది. తప్పు అయితే అదేమిటో వివరిస్తారు కదా?

మానవ జాతి పయనం ఎటు వైపుకి?

ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.

ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి  ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.

ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’  లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే,ఇప్పటి వరకూ మరే జీవీ చేయనట్లు, తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.

మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి.   మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను  గుర్తు చేసుకోవటం మంచిది.

అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.

ఒక బాబా గారు గాల్లోంచీ అరటి పండు తీసి చేతి లో పెడతాడు. వేరొక బాబా ఇతరుల బుర్ర లోని ఆలోచనలను చెబుతాడు. దీనిని మనం నమ్మాలా? కనికట్టు అని కొట్టి పారేయాలా? నమ్మకూడదా? లేక బాబా గారిని మన యూనివర్సిటీ లాబ్ లో అదే అద్భుతం చేయమని సవాలు చేయాలా?   ఇలాంటి మహిమల్ని నమ్మితే, అది శాస్త్రీయ దృష్టి అవుతుందా?
నా చిన్నతనం లో మా అత్తగారి ఊరి లో ఉండేవాడిని. ఓక రోజు “లవకుశ” సినిమా చూస్తున్నట్లుగా ఓ కల వచ్చింది. వాస్తవం లో అంతకు ముందు ఆ సినిమా ను నేను చూసి ఉండలేదు. ఆ మరుసటి రోజు మా నాన్న మా ఊరినుంచీ వచ్చి, నన్ను మా ఊరు తీసికెళ్ళి, అక్కడ ఆడుతున్న లవకుశ సినిమా చూపించారు. సినిమాలంటేనే గిట్టని మా నాన్న నాకు జీవితం లో చూపించిన ఒకే ఒక్క సినిమా అది! తరువాత ఈ అనుభవం గురించి ఆలోచించుకొని, “ఆ..కాకతాళీయం అయి ఉంటుంది లే!”, అని కొట్టి పారేశాను. ఈ సంఘటన లో భవిష్యత్తు గురించి చెప్పే విద్య నాకు తెలియదని చెప్పక్కర్లేదు.

పెద్దయ్యాక కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు కొన్ని చదివాను. వాటిలో ఆయన మానవాతీత శక్తులు ఉండవచ్చుననీ, మనం ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పధం తో, ఓపెన్ మైండ్ తో చూడాలనీ రాశారు. ఆయన తనకు జరిగిన ఒకటిరెండు అసాధారణ అనుభవాలను కూడా పంచుకొన్నారు.(ఆయన కు కలిగిన అనుభవాల లో Out of body experience ఒకటి ఉంది . తరువాతి కాలం లో సైంటిస్ట్ లు దీనికి శాస్త్రీయం గా వివరణ ఇవ్వగలిగారు.)

ఆయన లాంటి హేతువాదీ, మార్కిస్టూ వెలిబుచ్చిన అభిప్రాయాలతో, నేను అలౌకిక అనుభవాల గురించి సందేహం లో పడ్డాను. ఆయన “యూరీ గెల్లర్” అనుభవాల గురించీ, మరణానంతర జీవితం గురించిన కొన్ని అమెరికన్ వార్తా వ్యాఖ్యల గురించి కూడా రాశారు. అయితే అమెరికన్ పత్రికల వ్యాపారీకరణ తెలిందే కాబట్టీ నేను ఆ కథనాల కి పెద్ద విలువ ఇవ్వలేదు. పత్రిక అమ్ముకోవటం కోసం రాసిన కట్టుకథలు గానే వాటిని చూశాను. కుటుంబరావు గారి ప్రకారం…

“ఈ విశ్వం స్థల కాలాల నాలుగు కొలత (డైమన్షన్) లతో పాటు, బుధ్ధి కొలతలో కూడా పరిణామం చెందింది. అంటే బయట విశ్వం లొ ఎక్కడో ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఈ బుధ్ధి లేక ఇంటెలిజెన్స్ విశ్వం తో పాటు పరిణామం చెందుతూ వస్తోంది. మొదట్లో జీవపరిణామం లో,ఆదిమ దశ లో ఉన్న మానవుడికి ఈ బుధ్ధి నేరు గా సహాయం చేసేది. ఆ సహాయం అతీంద్రియ శక్తుల రూపం లో ఉండేది. కాబట్టీ ఆ రోజుల్లో అతీత శక్తులు చాల సాధారణం గా ఉండేవి. తరువాత మనిషి మేధ పెరిగే కొద్దీ, వాటి అవసరం మనిషికి తీరిపోయింది. మనిషి కి ఈ అతీత శక్తుల మీద అదుపు లేనట్లు కనిపిస్తుంది. అవి కావాలనుకొంటే ఓ మనిషిలో ప్రత్యక్షమౌతాయి..లేకపోతే లేదు.”

కుటుంబ రావు గారి బుధ్ధి కొలత ప్రతిపాదన ఆ రోజులలో విమర్శలను ఎదుర్కొంది. ఆయన హేతు వాద మరియూ మార్క్సిస్ట్ అర్హతల పైన కొందరు సందేహాలు వెలిబుచ్చారు. అయితే ఆయనది కేవలం ప్రతిపాదన మాత్రమే. అది శాస్త్రీయ సిధ్ధాంతం గా అంగీకరించబడాలంటే దానిని ప్రపంచం లో మనం పరిశీలించదగిన ఒక విషయం లో నిరూపించాలి. ఆయన అలా చేయలేక పోయారు. తన ప్రతిపాదనని ఆయన అమెరికా లో ఉండే తన స్నేహితులైన కొందరు భౌతిక శాస్త్రవేత్తలతో కూడా పంచుకొని, దాని నిరూపణ కి ఏదైనా ఒక ప్రాతిపదిక దొరుకుతుందేమో అడిగారు. ఆయన ప్రతిపాదన ఇప్పటి క్రియేషనిస్ట్ సిధ్ధాంతానికి దగ్గర గా ఉన్నట్లు నాకు తరువాత అనిపించింది.

అప్పుడప్పుడూ మన కు తారస పడే, మాధ్యమాలలో కనిపించే, మహిమలు నాకు ఒక ద్వైధీ భావాన్ని కలిగించ సాగాయి. వాటిని మూఢనమ్మకాలని కొట్టి పారేయాలా? లేక వాటి గురించి శాస్త్రీయం గా పరిశోధించి తెలుసుకోవాలా? లేక పోతే నిప్పులేకుండా పొగ రాదని వాటిని నమ్మాలా?
మనం వింటూ ఉండే అతీత శక్తులలో కొన్ని: “ఎదుటి వారి ఆలోచనలను తెలుసు కోవటం, వస్తువులను చూపులతో వంచటం, శరీరం ఇనుప వస్తువులను ఆకర్షించటం, గాలిలో తేలటం, భవిష్యత్తు గురించి చెప్పటం, మరణానంతర జీవితం అనుభవం లోకి రావటం, చనిపోయిన వారిని బతికించటం, శూన్యం లోంచీ వస్తువులను సృష్టించటం, ఇవి కొన్ని మాత్రమే!”
అయితే వీటిలో కొన్నిటిని చేయటానికి భౌతిక ప్రాతిపదిక ఉండవచ్చు. సైన్స్ ఇంకా వీటి మెకానిజం ని కనిపెట్టి ఉండక పోవచ్చు. ఉదాహరణ కి ఎదుటి వారి ఆలోచనలు తెలుసుకోవటం గురించి…
మన ఆలోచనలకు విద్యుతయస్కాంత గుణం ఉంటుంది. మామూలు మనిషిలో ఆలోచన లు గజి బిజి గా ఉంటాయి. కొందరు యోగులు ధ్యానం ద్వారా తమ ఆలోచనలను క్రమబధ్ధీకరించి, వాటి ఇంటెన్సిటీని పెంచుకోగలరు. అలానే వారిమనసు ప్రశాంతం గా ఉన్నపుడు ఎదుటి వారి ఆలోచనల సున్నితమైన తరంగాలని గ్రహించగలరు. అది ఒక పధ్ధతి. కానీ ఇది నిరూపించబడలేదు.భవిష్యత్తు లో సైన్స్ దీనిని నిరూపిస్తుందేమో!

అలానే శరీరం తో  ఇనుప వస్తువులను ఆకర్షించటం అనేది నాకు తెలిసిన ఒక వ్యక్తి చేస్తాడు. శాస్త్రజ్ఞులు దీనిని ఇంకా అర్ధం చేసుకోవలసి ఉంది.

ఈ మధ్య “మన భౌతిక ప్రపంచం అవతల మన సైన్స్ ఎప్పటికీ చేరలేని అధిభౌతిక ప్రపంచం ఉంటుంది”, అని నేను విశ్వసించటం ప్రారంభించాను. దీనికి రెండు కారణాలు.

1. ఈ విశ్వం అనేది కారణ రహితమైన ఒక స్థితి నుంచీ పుట్టిందని శాస్త్రజ్ఞుల మధ్య ఉన్న ఒక అభిప్రాయం. విశ్వానికి ఐదో కొలతో , ఆరో కొలతో ఉన్నట్లైతే దానిని మన సైన్స్ ఎప్పటికీ నిరూపించలేదు. అలాంటి ఐదో కొలత గురించి సైన్స్ కేవలం ఊహాగానం మాత్రమే చేయగలదు. అలానే విశ్వ సృష్టి స్థల కాలాల ఆవల జరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్థల కాలాలు లేకుండా జరిగిన విశ్వసృష్టిని శాస్త్రీయ నిరూపణ ల పరిధి లోకి లాక్కు రావటాన్ని ఊహించటం కష్టం.
2. ఇక రెండవ కారణం, క్వాంటం తీరీ లాంటివి, కారణ రహితమైన “వాక్యూం ఫ్లచుయేషన్” వంటి వాటిని అంగీకరిస్తున్నాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్ లాంటి కణాలు ఏ కారణం లేకుండానే శూన్యం లోంచీ పుట్టి, మళ్ళీ శూన్యం లోనే కలిసిపోతాయి, బాబా గారు శూన్యం లోంచీ విభూతి తీసినట్లు. ఇలాంటి విషయాలను “ఐదో డైమన్షన్” లేకుండా వివరించటం సాధ్యం కాదు. కానీ ఐదో డైమన్షన్ లోకి మనిషి కి ప్రవేశం లేదు. కాబట్టీ వీటిని నిరూపించటం మనిషికి సాధ్యపడక పోవచ్చు.కాబట్టీ మనిషి ఎప్పటికీ అనుభవించలేని అధి భౌతిక జగత్తు ఒకటి ఉంటుంది. ((ఐతే ఈ అధి భౌతిక జగత్తు గురించి ఎవరేమి చెప్పినా నమ్మేయాలా? ఈ అధి భౌతిక ప్రపంచం లోనే దేవుడు ఉండి సృష్టిని శాసిస్తున్నాడంటే నమ్మేయాలా? అధి భౌతిక ప్రపంచ నియమాలు భౌతిక ప్రపంచ నియమాల లా ఉంటే , “అలా నమ్మ కూడదు”. కానీ సైన్స్ దీనిని నిరూపించలేదు. ఎందుకంటే మనిషికి అక్కడ ప్రవేశం లేదు.స్థల కాలాలే లేని చోట దేవుడు ఒక మోటివేషన్ తో ఉంటాడా?ఆయన ఎలక్ట్రాన్లూ, పాజిట్రాన్లూ వంటి చిన్న కణాలను సృష్టించే విషయం లో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకొంటాడు. మిగిలి విశ్వమంతా మనకు తెలిసిన రూల్స్ ప్రకారమే ఎందుకు నడుస్తుంది?))

అలానే, ఎలక్ట్రాన్లు ఒక చోట మాయమై, కొంచెం దూరంలో ప్రత్యక్షమౌతాయి. దీనినే క్వాంటం జంప్ అంటారు. క్వాంటం తీరీ చదివితే ఈ విశ్వమంత ఒక మాయ అనిపిస్తుంది. మౌలిక కణాలన్నీ(పదార్ధం అంతా) ,  శక్తి తో చేయబడి ఉన్నాయి. ప్రస్థుతం ఒక కణం ఉందా లేదా అనేది ఆ కణం యొక్క భూత భవిష్యత్ స్థితుల పై ఆధారపడి ఉంటుంది.
సరేనండీ, నేను అధిభౌతిక ప్రపంచం గురించి నమ్మటం మొదలు పెట్టాను. అయితే ఏమిటంట? నిజజీవితం లో చూపబడే మహిమలన్నీ మోసాలే అవ్వనక్కరలేదు. వాటిలో కొన్నిటికి మూలాలు ఈ అధిభౌతిక ప్రపంచం లో ఉండవచ్చు. ఉదాహరణకి శూన్యంలోంచీ వస్తువులను తీయటం, శూన్యం లోంచీ ఎలక్ట్రాన్లు పుట్టవచ్చు అని సైన్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కదా!
ఇక ఈ మధ్య నేను పరమహంస యోగానంద గారు రాసిన, “ఒక యోగి ఆత్మ కథ” అనే పుస్తకం చదివాను. ఆ పుస్తకం నిండా నేను పైన చెప్పిన అనేక మహిమలు ఉన్నాయి. అందులో యోగానంద గారు ఆ మహిమలకు సైన్స్ పరమైన సమర్ధన కూడ ఇచ్చారు. వాటిని వివరించటం లో ఆయన స్వరం చాలా నమ్మదగినదిగా ఉంది. దానితో నేను, “ఏమో ఈ మహిమలు కూడా నిజమేనేమో”, అనే స్థితి కి చేరాను.”ఆ మహిమలకు భౌతికం గా ఇంకా కని పెట్టబడని కారణం ఉండవచ్చునేమో. లేకపోతే, ఈ మహిమల మూలాలు అధిభౌతిక జగత్తులో ఉండ వచ్చునేమో?! “గొప్ప యోగులు అధిభౌతిక జగత్ లోని నియమాల ద్వారా మహిమలను చూపించగలరేమో!

కొన్ని రోజుల తరువాత ఇంటర్నెట్ లో యోగానంద గారి గురించి ఒక కెనడియన్ రాసిన ఒక పుస్తకం లోని విషయాలు చదివాను. ఆయన యోగానంద గారి గురించి పూర్తి నెగటివ్ ధోరణి లో రాశారు. మొత్తానికి యోగానంద గారు చెప్పినవి చాల వరకూ తప్పులూ లేక అబధ్ధాలు అన్నట్లు గా రాశాడు. అది చదివిన తరువాత నాకు కొన్ని వ్యతిరేక ఆలోచనలు రావటం మొదలయ్యాయి. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా?

ఈ ఆలోచనల తరువాత, నాకనిపించిందేమంటే..
–ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటనికి సిధ్ధం గానే ఉంటుంది. తమ శక్తుల మీద తమకు అదుపు లేని వారు, ఆ శక్తులు తమకు ఉన్నపుడే చూపించవచ్చు. నాకు తెలిసిన ఒక మనిషికి అయస్కాంత శక్తి ఉంది అని చెప్పాను కదా? ఆ మనిషిని శాస్త్రజ్ఞులు పరిశీలించి, అతని శక్తి కి కారణం తెలియలేదనీ. దాని పై ఇంకా పరిశోధనలు చేయాలనీ ఒప్పుకొన్నారు. కారణం లేకుండా జనించిన ఎలక్ట్రాన్లనే ఒప్పుకొన్న సైన్స్, పరిశోధనల తరువాత అతని అయస్కాంత శక్తికి కారణం తెలియకపోతే, ఆ విషయాన్ని కూడా ఒప్పుకొంటుంది. చివరికి చెప్పవలసిన విషయమేమిటంటే, మహిమల గురించి ప్రధమం గా నమ్మ క పోవటమే మంచిది. అలా నమ్మకపోవటం అనేది నిజానికి దగ్గర గా ఉంటుంది. ఏ కోటికో, ఒక మహిమ నిజమైనా, దానిని సరిగా నిరూపించబడిన తరువాతే నమ్మటం మంచిది.

ఎలక్ట్రాన్లు శూన్యం లోంచీ పుడతాయంటే నమ్ముతాను. శూన్యం లోంచీ అరటి పండు తీశాడంటే, ముందు నమ్మను. ఒక వేళ అదే పనిని ప్రయోగశాల లో చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను.

పాపం మగాళ్ళు! ఎలా ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారు!

ఒకప్పుడు:
———
వాళ్ళు మగ మహారాజులు. వీరులూ ధీరులూ. యుధ్ధాలు చేసే వారు. తెగించే వారు. సాహసాలు చేసే వారు.తరుణులను గెలిచే వారు.పొగరు గా, పౌరుషం గా, ఆప్యాయం గా, స్నేహం గా,దుడుకు గా, పెద్ద మన్సుతో ఉండే వారు.
నచ్చిన వనితలను వలచి వలపించుకొనే వారు.
కుటుంబాలు ఏర్పడటం మొదలయ్యాక, ఇంట్లో వీరి మాటకి తిరుగే లేదు.

నిన్న:
——
నెచ్చెలి గురించి ఎక్కువగా ఊహలలో కాలక్షేపం చేసే వాడు. ఇష్టమైన అమ్మాయిని కాక, పెద్దలు చూసిన “కన్య” ని వివాహమాడిన వాడు. ఊరిలో సగం ఆడ వాళ్ళయినా, వారితో మాట్లాడటానికి కూడా స్వేచ్చ, అవకాశం లేక తన మగ స్నేహితులతో కాలక్షేపం చేసే వాడు. పస లేని గుమాస్తా ఉద్యొగాలు చేసే వాడు.గానుగెద్దు జీవితం!
అధికారం తో పాటు బాధ్యతలు పైన పడిన వాడు. కుటుంబానికి యజమాని ..కానీ కుటుంబ భారం మోసే వాడు..భర్త.ఇంట్లో నచ్చిన వంటలు చేయించుకొని నచ్చకపోయినా తినేవాడు.ఆడవారినీ పిల్లలనూ రక్షించే వాడు..అతనికి రక్షణ ఉందా లేదా అనేది వేరే విషయం. ఇంట్లో పిల్లి అయినా వీధిలో పులి.

నేడు:
—–
ఒక అమ్మాయి దయ కోసం పది మంది మగ వాళ్ళు అలమటించే స్థితి. బిక్కు బిక్కు మంటూ ప్రేమించాలి.ఏమైనా తేడా వస్తే నాన్-బెయిలబుల్ కేసు కింద కట కటాలలోకి పోవాలి. లేకపోతే ప్రభుత్వమే పైకి పంపిస్తుంది.
వళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో బాబూ, నీకు 33 శాతం రిజర్వేషన్లు లేవు!
ఆఫీసు లో తేడా వచ్చిందా సెక్సువల్ హరాస్మెంట్ కేస్ కి సిధ్ధం కావాలి కాబట్టీ, ఆడ పిల్లలతో జాగ్రత్త గా ఉండాలి.
పెళ్ళయినాక, గృహ హింస కేసు ఉంది నాయనా, పెళ్ళాం కొడితే మూసుకొని కూర్చో!ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకు ముల్లు మీద పడిన అరిటాకు కే నష్టం. బాసు గారు నీ కొలీగ్ ని “మేడం కొంచెం ఈ పని చేస్తారా?” అంటారు, నిన్ను మాత్రం, “ఈ పని ఇంకో అరగంట లో చెయ్”, అంటారు.
మహిళా మణులు,బాసు చెప్పిన పని ఇష్టం లేక పోయినా చేస్తారు. మరి అది డబ్బు తో సంబంధమున్న విషయం కదా! నువ్వు వారి మంచికోరి చెప్పినదైనా, చెయ్యరు. చేస్తే స్త్రీ స్వేచ్చ కి భంగం. ఆత్మ గౌరవానికి వ్యతిరేకం.
నీ భార్యకి వంట తెలవదు కదా నువ్వే కాస్త వంట నేర్చుకో నాయనా. లేక పోతే హోటల్ బిల్లు పేలుతుంది. పెళ్ళాం వస్తాదు తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ముందు నడుస్తుంటే, నువ్వు అణకువగా పిల్లల్ని ఎత్తుకొని వెనుక నిలబడు.లేకపోతే నీకు సంస్కారం లేనట్లే! కారు డ్రైవర్ పని చేయి, పచారీ పని చేయి.
ఆడ వారి హక్కుల గురించీ మగ వారి బాధ్యతల గురించీ తోటి మగ వాళ్ళతో సహా బ్రెయిన్ వాష్ చేయబడిన వాడా!
బజారు లో కురచ బట్టల కుర్రదాన్ని చూసి, తన నోట్లో మాట తనే నొక్కేసుకోవటమే నాగరికత అనుకొనే వాడా.. !కుటుంబ చట్రం లో పడి కునారిల్లుతున్న వాడా!రోజు రోజు కీ సహజ స్వభావాన్ని వీడుతున్న వాడా!!రేపు లోకం ఎలాఉంటుందో అని భయపడే వాడా!చచ్చి పోయిన “మగాడా”!, నీ స్మృతికి ఇదే నా నమస్సుమాంజలి!

ఈ కథ ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?

ఈ కథ చదివి ఇది ఏ టైపో చెప్పంది.
ఏ టైపు? థ్రిల్లర్/సస్పన్స్/హారర్? లేక సింపుల్ గా “ఓ కథా”?
అలానే కథ బాగుందో లేదో కూడా చెప్పండి.
**********************

“సుయ్” మని కుక్కర్ విజిల్ వేసింది. సుమ స్టవ్ కట్టేసి వచ్చి బాబు దగ్గర కూర్చొంది. బాబు రెండు కాళ్ళూ పైకి మడిచి  చిట్టి చేతులు ఊపుతూ బోసి నోటితో కేరింతలు కొడుతున్నాడు.  సుమ రెండు చేతులూ మొహానికి అడ్డం పెట్టి, ఒక్క సారి గా చేతులు తీసి, “బావ్” అంది. బాబు గుక్క పెట్టి నవ్వ సాగాడు. వాడు నవ్వుతోంటే లోకమే తెలియదు సుమకి!

ఏదో సుమ చేతి మీద పాకినట్లనిపించింది. చేయి విదిలించి పక్కకి చూసింది..”అమ్మో పాము..!ఎక్కడి నుంచీ వచ్చింది..?”

పక్కనే, ఆఫీసు నుంచీ అప్పుడే వచ్చిన భర్త, రవి నిల్చొని, ఉన్నాడు నవ్వుతూ. పాము ని పరీక్ష గా చూసింది, “అది ఒట్టి రబ్బరు పామే.!.అచ్చు పాము లానే ఉంది..!హమ్మయ్యా..!తను హడిలి పోయింది..తనకు ముందు నుంచీ పాములంటే చచ్చే భయం.!.”

“మీకు కొనటానికి పాము బొమ్మే దొరికిందా?”, అంటూ భర్తని మందలించింది.

బాబు అప్పుడే దొర్లి పాము బొమ్మని చేతిలోకి తీసుకొని దానికి “ఉంగా” చెప్తున్నాడు ఉత్సాహం గా.

“వచ్చే వారం మూడురోజులు సెలవలొచ్చాయి మాకు. మనం ఊరేళ్తున్నాం”, అన్నాడు రవి.

*********

ఊరికి పెడగా మామిడి తోట లో ఉంటుంది సుమ వాళ్ళ అత్త గారి ఇల్లు. ఇంటి పక్కనే చెరువు. మిగిలిన ఇళ్ళు కొంచెం దూరం కావటం తో ఏదో తెలియని గుబులు గా ఉంది సుమ కి. ఆమె పంపు కొడుతుంటే, పక్కనే ఈత చెట్టు మీద చిక్కుకొని తెల్లగా మెరుస్తూ కనపడింది ఏదో. “ఇదేదో పాము చర్మంలానే ఉందే..తనకసలే పాములంటే అదురు..అందుకే తానీ పల్లెటూరు రానంది..”

రవిని పిలిచి చూపించింది.

“అది పాము కుబుసం..ఇవి ఇక్కడ మామూలే..!పాములు తమ చర్మాన్ని విడుస్తూ ఉంటాయి..నువ్వు సిటీ లో పుట్టి పెరిగావు కాబట్టీ నీకు వింత గా ఉంది”, అన్నాడు.

” వింత గా కాదు భయం గా ఉంది..అయినా, ఇంట్లో బాబుని పెట్టుకొని, అసలు మీరలా ఎలా మాట్లాడ గలుగుతారు?! ఇక్కడ కుబుసం ఉందంటే, ఇంటి దగ్గర్లోనే ఎక్కడో పాము ఉందన్న మాట.!.”, అంది కోపం గా.

“సరే..సరే.పాముల సుబ్బయ్య ని పిలిపించమని నాన్న కి చెప్తాలే”,అన్నాడు రవి.

పాముల సుబ్బయ్య పాములు పట్టటం లో దిట్ట. పట్టిన పాముల కోరలు తీసి వాటిని ఆడించి కడుపు పోసుకొంటాడ వాడు.

********

మరుసటి రోజు సాయంత్రం,రవి ఊళ్ళో తన చిన్న నాటి స్నేహితుడు ఒకతనిని కలుసుకోవటానికి వెళ్ళాడు.

బాబుని చెక్క ఉయ్యాలలో పడుకోబెట్టి అత్తగారికి సహాయం చెయ్యటానికి వంటింట్లోకి వెళ్ళింది సుమ. సుమ మామ గారు పొలం నుంచీ వచ్చే సమయం అయ్యింది..

పాలేరు వీరడు, వడ్ల బస్తా వరండా లో వేసి,, “బస్తా వేశానండీ అమ్మగారూ..!”, అన్నాడు.

సుమ పాలు తీసుకోవటానికి వెళ్తుంటే, ఉయ్యాలలో బాబు చిన్న గా నవ్వుతున్న శబ్దం వినిపించింది. బాబు వైపు చూసిన సుమ స్థాణువై నిలబడిపోయింది. ఉయ్యాల అంచు మీద పామొకటి నెమ్మది గా పాకుతోంది. బాబు దాని వైపు చూసి నవ్వుతున్నాడు.

కొంచెం తేరుకొని,”పాము..పాము.రండి త్వరగా ..!” అని కేకలు పెట్టింది సుమ.

బాబు పాము వైపుకి చేతులు ఆడించాడు. పాము అందకుండా ఉయ్యాల కిందికి వెళ్ళింది. వీరడు త్వరగా తన ములుగర్ర పట్టుకొని ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. సుమ అత్త గారు ఆప సోపాలు పడుతూ ఉయ్యాల గదికి చేరింది.

వీరడికి పాముని కొడదామంటే వాటం కుదరటం లేదు.అది ఉయ్యాల కింద నెమ్మది గా కదులుతోంది. సుమ ధైర్యం చేసి బాబు వైపుకి కదిలింది. పాము బాబు పక్కకి వచ్చి ‘చట్’ మని పడగ విప్పింది. సుమ అత్త గారు,”అమ్మో నాగుపామే..చూడండి సీతమ్మ వారి పాదాలు పడగపై”,..అంది.

సుమ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.

గది అంతా నిశ్శబ్దమైపోయింది. వీరడు పాము పై కర్ర విసుదామంటే, ఎక్కడ బాబు కి తగులుతుందో అని భయం గా ఉంది. ఒక వేళ కర్ర పాముకి తగలక పోతే పాము వెంటనే కాటేస్తుంది. నాగు పాము చాలా చురుకైనది.

ఆ సాయం కాలపు నీరెండ లో పాము పడగ నీడ బాబు లేత మొహం పై పడుతోంది. బాబు పాము పడగ చూసి నవ్వుకొంటూ చేయి ముందుకి సాచాడు. పాము బుస కొట్టింది. విసురు గా బాబు చేతి వైపుకి పడగ విసిరింది. బాబు మొదటి సారి గా ఏడుపు మొదలుపెట్టాడు. సుమకు ఎక్కడ లేని తెగువా వచ్చేసింది. ఒక్క ఉదుటున వెళ్ళి, పాము తోక పట్టుకొని బయటికి విసిరి, బాబు ని ఎత్తుకుంది.

సుమ అత్త గారు,”వీరడూ, డాక్టర్ ని పిలుచుకు రా..పో! తొందరగా! ఒక్క అంగ లో.. ఇక్కడున్నట్లు రావాలి!”, అని వీరడి ని పంపించింది”.

“యావండీ..ఏమిటి..బాబు ఏడుస్తున్నాడు?” అంటున్నారు బయట ఎవరో.

బయట చూస్తే, పాముల సుబ్బయ్య, నెత్తి మీద బుట్ట తో.

అత్త గారు బాబు చేయి మొదట్లో గుడ్డ తో కడుతూ,”సరిగ్గా సమయానికి వచ్చావు, పాము ఇక్కడే ఎక్కడో ఉంటుంది..పట్టుకో సుబ్బయ్యా..దాన్ని”, అంది.

“నేను దొడ్లో రెండు పాముల్నీ పొద్దునే పట్టి, విషమూ, కోరలూ తీసేశానమ్మా..!ఎట్టా తప్పించుకొందో..మద్దేనం ఒక పాము బుట్టలోంచీ తప్పించుకొంది.!.దాని వలన అపాయం ఏమీ లేదు..విషం తీసేశాగా..”, అంటూ పక్క పొదలలో వెతకటం ప్రారంభించాడు సుబ్బయ్య.

***********

మనమందరం ఇలా ఉంటే బాగుంటుంది..

ఎవరికి వారు పక్క వాడి కళ్ళతో వాడి బాధల్ని చూడ గలిగితే..

దళితుల అణిచివేత ను పైకులాలు అర్ధం చేసుకొంటే ..
పైకులాల-సామాన్యుని దళితులు ఆదరిస్తే..

తెలంగాణ వారి అస్థిత్వ వేదనను ఆంధ్రులు పడితే…
ఆంధ్ర వారి ఐక్యతా భావనను తెలంగాణ స్పృశించగలిగితే..

లేని వాడి లేమిని ఉన్నవాడు అనుభవిస్తే..
“బాగుపడినాక చేసేపని” లేని వాడి మదిలోకొస్తే..

సొంత వ్యాపారం లోని కష్టం కామ్రేడ్ కి తెలిస్తే..
తన జీతం లోని “శ్రమ” , “సీ ఈ ఓ” గారికి తెలిస్తే ..

ఆడవారి ఇష్టాన్ని మగవారు గౌరవిస్తే..
మగవారి అభిమానాన్ని ఆడవారు అర్ధం చేసుకొంటే..

సాయిబ్బు గడ్డం నామాలాయన కిష్టమైతే..
నామాల ముఖం సాయిబ్బుకింపైతే..

ఎవరికి వారు తమలోకి తొంగి చూసుకొంటే..
బాగుంటుంది…

తెలుగమ్మాయిల గురించి కొన్ని పరిశీలనలు..పక్షపాతాలూ..

బెంగుళూరు లొ మా ఆఫీసు లో ఒక తెలుగమ్మాయి కొత్తగా చేరితే, ఆమె తెలుగమ్మాయని నోరు తెరవక ముందే కనిపెట్టేస్తాం. మొదటి రోజు తెలుగమ్మాయి సాధారణం గా ఎవరినో ఒకరిని వెంటపెట్టుకొని (మగ వాళ్ళని) వస్తుంది.
తెలుగమ్మాయి పని, ఆమెది తప్ప మిగతా టీం అందరి పనీ. ఒక రోజు పనిని రెండు రోజుల తరువాత మళ్ళీ అసైన్ చేసినవాడికే ఇచ్చి, వాడిదే తప్పు అని చెప్పటం కూడా తెలుగమ్మాయిలకే చెల్లుతుంది.
ఇదంతా తెలుగమ్మాయిలు సాధారణం గా ప్రొటెక్టివ్ వాతావరణం లో పెరగటం, వాళ్ళని పెద్ద వాళ్ళు అతి గారం చెయ్యటం (ప్రభుత్వం కూడా వాళ్ళని గారం చేస్తుంది ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చి) వలన కావచ్చు.

తెలుగమ్మాయికి లోక జ్ఞానం తక్కువా,గారం మాటలు ఎక్కువా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒంటి మీద నగలు దిగవేసుకొనే వాళ్ళలో తెలుగమ్మాయిలు ముందు ఉంటారు. నార్త్ అమ్మాయిల మేక్ అప్ ఖర్చు గురించి చెప్పక్కర లేదు. అమ్మాయిలందరికీ అటెన్షన్ కావాలనుకొంటా.. కాస్త అందం గా ఉన్న అమ్మాయిలు మేకప్ వేసుకొని తమ హిట్ రేట్ ని పెంచుకొంటే, అంత అందం గా లేని వాళ్ళు నగలు దిగేసుకొని..ఇవిగో చూస్కో నా నగలు అంటారు.

ఇకపోతే ఏ సంవత్సరానికో ఒక సారి కట్టే పట్టు చీరలు కొనటం లో మన ఆడ వాళ్ళు ముందుంటారు. తరవాత ఏ నాలుగేళ్ళకో ఆ చీర ని సగం ధరకి ఎక్స్చేంజ్ ఆఫర్ లో అమ్మేస్తారు.
మన తెలుగు అమ్మాయిలలో ఇంకొక అర్ధం కాని విషయం, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటి వారు జాకెట్ ముక్కలు పెట్టటం. అమ్మాయిల ఇళ్ళలో ఆ జాకెట్ ముక్కలు కుప్పలు గా పెరుగుతాయి. అందరూ చుడీదార్ వేసుకొనే వారే..ఎప్పుడో పండగకో పబ్బానికో తప్ప. ఇంకా..జాకెట్ ముక్కల అవసరం ఏమిటి? వాటిని పెట్టటం అనేది ఒక కాలం చెల్లిన ఆచారం. ఒక ఆమె కి వేరొక ఆమె ఇచ్చిన జాకెట్ ముక్క, మరొకామె తన ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేస్తుంది. ఈ విధం గా ఎవరూ కుట్టించుకోకుండానే జాకెట్ ముక్కల సర్క్యులేషన్ మొదలౌతుంది.

ఆ… ఐనా మగాడికి నాకన్నీ ఎందుకులే ఇవన్నీ..

 

మల్లాది వెంకట కృష్ణ మూర్తి, “నా సాహితీ జీవనం లో జరిగిన కథ”-నా ఆలోచనలు

కౌముది.నెట్ లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తన సాహితీ జీవితం లోని సంఘటనలూ వ్యక్తుల గురించి “జరిగిన కథ”, అని రాస్తున్నారు. ఇది చాలా వరకూ నిజాయితీ గా రాసినట్లు గా అనిపిస్తుంది. మల్లాది గారు తన సాహిత్య యానం లో తెలిసిన వ్యక్తులూ వారి లోటు పాట్లనే కాక, తన లోటు పాట్లను కూడా ఆత్మ విమర్శ చేసుకొంటూ రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన దృక్కోణం లోని లోటు పాట్లది వేరే సంగతి. ఎవరి దృక్కోణం లో లోపాలు వారికి తెలియవు కదా!
ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సాహిత్యం అబ్సొలీట్ అయిపోవటం, మల్లాది గారు అంతగా ఈ రోజుల్లో రాయక పోవటం వలన, ఇప్పుడు ఆయన నిజాయితీగా రాసినా ఆయనకు ప్రాపంచికం గా వచ్చే నష్టం పెద్ద గా లేదు. పైగా ఆయన ప్రస్తావించే వ్యక్తులు చనిపోవటం లేదా అంతకు ముందు ఉన్న అధికార స్థానాల్లో ఉండక పోవటం కూడా ఆయన నిజాయితీ గా రాయటానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చు. ఈ ఆత్మ కథ వలన మనకు తెలుగు సాహితీ లోకం లోని నిన్నటి ప్రచురణ కర్తలు, సంపాదకులూ, రచయితలూ మొదలైన వారి వాస్తవ స్వరూపం కొంతవరకూ తెలుస్తుంది. అలానే వారి మధ్య ఉండే మానవ సంబంధాలలోని ఈర్ష్యలూ, ఇగోలూ, స్వార్ధాలూ కూడా అవగతమౌతాయి.
నేను ఎనభై ల చివరిలో మల్లాది గారి, యండమూరి మొదలైన వారి సాహిత్యాన్ని వదలకుండా చదివే వాడిని. అప్పటి కి టీనేజ్ లో ఉన్న నాకు వాళ్ళ నవలల లోని పాత్రలూ, స్వభావాలూ విపరీతం గా నచ్చేవి. ఒక్కోసారి ఆయా పాత్రలను అనుకరించటానికి ప్రయత్నించే వాడిని. ఒక పల్లెటూర్లో చిన్న రైతు కొడుకునైన నేను, ఈ కమర్షియల్ నవలలు చదవటం వలన చదువు లో వెనుకబడి తరువాత కష్టాలు పడవలసి వచ్చింది.

మల్లాది గారు తన ‘జరిగిన కథ ‘ లో  “తమ పత్రికల సర్క్యులేషన్ కోసం ఎడిటర్లు ఎలాంటి అబధ్ధపు రాతలు రాయిస్తారో, అలానే రచయితలు తమ పారితోషికం కోసం ఎలా బేరాలాడతారో, తమ నవలను ఎడిటర్ల ఇష్టానుసారం ఎలా సాగదీస్తారో” చెప్పినప్పుడు, “ఔరా! మనం బకరాలం అయ్యాం కదా, వాళ్ళ డబ్బుకోసం, కెరీర్ కోసం వాళ్ళు ఏవో జిమ్మిక్కులు చేస్తే, మనం అనవసరం గా మన చదువు పాడు చేసుకొని నష్టపోయాం కదా!”, అని అనిపించక మానదు. అలానే సాధారణ పాఠకుడి పై ఎడిటర్లకూ, రచయితలకూ ఉన్న తక్కువ అభిప్రాయం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. (ఆ మోసపోయే పాఠకుల నుంచే వారి మనుగడ కు అవసరమైన డబ్బు వస్తుందనేది గమనించవలసిన విషయం). వీరి రాతలూ, పత్రికలూ డబ్బుకోసమే. సాహిత్యం కేవలం ఒక బై-ప్రొడక్ట్.

ఈ పాఠకులు మోస పోవటం అనేది కమర్షియల్ రచయితల తోనే కాదు. అనేక మంది రచయితలు ఆదర్శాల గురించిన భావాలతో రచనలు చేస్తారు. కానీ ఈ ఆదర్శాలు మనకు వారి రాతల్లో కనపడినంత గా వారి జీవితాలలో కనపడవు. కానీ, వారి రచనల ద్వారా వారి ఆదర్శ భావాలు జనాలలోకి ముందుగా విరచిమ్మ బడతాయి. సగటు పాఠకుడికి తరువాత ఎప్పుడో వారి జీవితం గురించి తెలుస్తుంది. వారి జీవితాలలో వారు చెప్పిన ఆదర్శాలను ఆచరించ లేదని తెలుస్తుంది.డబ్బే పరమావధి కాదని చెప్పే వీరి రచనలు, డబ్బే పరమావధి గా నడిచే పత్రికలలో ప్రచురింపబడేవి. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. వారు చెప్పిన ఆదర్శాలు విని ఆవేశం తెచ్చుకొని ఏ నక్సలైటల్లోనోఈ చేరిన వారు, అప్పటికే జరిగిన నష్టాన్ని ఎలా తప్పించుకొంటారు? ఆ రచయితల సంతానం మాత్రం ఏ అమెరికాలోనో హాయిగా గడుపుతూ ఉంటారు. ఈ సంతానం దృష్టి లో వారి పెద్ద వాళ్ళు ప్రచారం చేసిన విలువలకి సానుభూతి అయినా కనిపించదు.

ఈ రోజులలో ఆర్ధిక సరళీకరణ, ఇంటర్నెట్, మీడియా ఛానెళ్ళ ప్రభావం వలన ఇలాంటి కాన్ రచయితలు, ఎడిటర్లకు కాలం చెల్లి పోయింది. యువత తమ కెరీర్ పై దృష్టి పెడుతోంది. యువతరం ఇలాంటి కాన్ రైటలూ, ఎడిటర్ల కాకమ్మ కథల బారిన పడే దురదృష్టాన్నుంచీ తప్పించుకొంది. ఇప్పటి యూత్ కావాలనుకొంటే ఇలాంటి మేధావులకే కొంత జ్ఞానోపదేశం చేయగల స్థాయి లో ఉండటం సంతోషం గా ఉంది.

మానవ జాతి పయనం ఎటు వైపుకి?

ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.

ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి  ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.

ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’  లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.

మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి.   మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను  గుర్తు చేసుకోవటం మంచిది.

జనాల మీదకి బూమరాంగ్ కా బోతున్న జనాలతీర్పు

ఈ మధ్య నితీష్ కుమార్ బిహార్ ఎన్నికల్లో గెలవటం గురించి మీడియా “ఇది అభివృధ్ధికి ప్రజలు వేసిన వోటు” అని ఊదరకొట్టింది. కానీ నాకు నమ్మబుధ్ధి కాలేదు.
మన రాష్ట్రం లోనే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే …
చంద్ర బాబు ఎన్నికల్లో గెలిచి రెండవ సారి అధికారం లోకి వచ్చాడు. అప్పుడు కూడా మీడియా ఇలానే అభివృధ్ధి కీ వోటు అని చెప్పింది.
తరువాత చంద్ర బాబు నా దృష్టి లో మంచివైన రెండు విషయాలలో సరిగా వ్యవహరించాడు.
1. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవటం…. విద్యుత్ సంస్కరణల విషయం లో కానీ, …అనేక కార్పొరేట్ సంస్థలను రాష్ట్రానికి తీసుకొని రావటం లో కానీ చంద్ర బాబు చేసినది సరైనదే అనుకొంటాను
2. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిష్పాక్షికత: కొంతవరకూ, పార్టీ కీ వంది మాగధులకూ ప్రభుత్వం లో ప్రాబల్యాన్ని తగ్గించటం.దీని వలన దిగువ స్థాయి లో అవినీతి ని తగ్గింది.

కానీ తరువాతి ఎన్నికలలో ఈ రెండు పధ్ధతులూ చంద్ర బాబుకి వ్యతిరేకం గా పని చేసి అతన్ని మట్టిగరిపించాయి. వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్తూ, ఇతర వరాలూ, సామాజిక, రాజకీయ సమీకరణ లూ అతన్ని ముఖ్యమంత్రిని చేశాయి.
వై ఎస్ ఆర్ చంద్ర బాబు కి పూర్తి భిన్నం గా వ్యవహరించి అస్మదీయులకు పట్టం గట్టారు. అనేక ప్రజాకర్షక పధకాలు ప్రవేశ పెట్టి రెండవ సారి కూడా అధికారం లోకి రాగలిగాడు.
ఈ సమయం లో చంద్ర బబు తన గుణపాఠాలను నేర్చుకొన్నట్లు కనపడుతోంది. ఆయన రైతుల పేరు తో దీక్షలు చేస్తున్నారు.ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు.  వీటన్నిటితోనూ జనాలలో ఆవేశ కావేశాలను రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మళ్ళీ అధికారం లోకి వస్తే ఇక దీర్ఘ కాలిక విధానాలకు ఇంతకు ముందు ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వక పోవచ్చు. అలానే అస్మదీయులను ప్రభుత్వ కార్యకలాపాల నుంచీ దూరం గా పెట్టేతప్పు? చేయక పోవచ్చు.
ప్రజాస్వామ్యం లో ఉన్న ఒక లొసుగు ఏమిటంటే “జనాలకు తగ్గ పాలకులు” వస్తారు. యధా ప్రజా తధా రాజా. అలానే జనాలు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలకు చివరికి జనాలే బలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు జనాల ను ఎలా మభ్య పెట్టి అధికారం లోకి రావాలా అని చూస్తాయి. అందుకే జనాల తీర్పు జనాలమీదికే బూమర్యాంగ్ అవుతుంది.

వ్యసనాలు..కొన్ని ఆలోచనలు..

Some additions…if you’ve already read ..never mind

నాకు తెలిసిన ఒక స్నేహితుడు అతని ఉద్యోగంలో చాలా పైకి ఎదిగాడు. ఓ రోజు, అతని తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు, అతను, “జీవితం లో ఇప్పటి కంటే డబ్బు లేనప్పుడే సంతోషం గా ఉండేదబ్బా..!” అన్నాడు.

కానీ, నాకనిపించిందేమిటంటే, అతను తన ఎదుగుదల (సక్సెస్) కి అలవాటుపడి పోయాడు. అతను ఉద్యోగం లేని రోజులలో కంటే ఇప్పుడు సంతోషం గా ఉన్నప్పటికీ, ఇప్పటి సంతోషానికి ‘అలవాటు’ పడిపోయాడు. అంతకు ముందు పడిన కష్టాలను తాత్కాలికం గా మరిచిపోయాడు. క్రితం లో ఉన్న జీవితమే బాగుంటే, అతను తన ఉద్యోగాన్ని విడిచి పెట్టాలి కదా? కానీ అలా చేయటంలేదంటే అంతకు ముందు జీవితంకంటే ఇప్పటి జీవితమే బాగుంది.కానీ పూర్వం అతనికి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు అతను చాలా సంతోషపడటం నాకు గుర్తు. అతను ఇప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించటంలేదంటే, మనిషి సంతోషాన్ని తన జీవితం లోని సుఖం యొక్క స్థాయి పెరిగినప్పుడు మాత్రమే అనుభవిస్తాడనుకొంటా! కొత్త గా వచ్చిన సుఖం స్థాయికి తరువాత క్రమేణా అలవాటు పడి, మనిషి చేతన లో నుంచీ సంతోషం మరుగుపడుతుంది అనిపిస్తుంది.
నా స్నేహితునికి మళ్ళీ సంతోషం రావాలంటే మళ్ళీ ఉద్యోగం లోఏదో ఒక పదోన్నతి రావాలి. సంతోషం కోసం మళ్ళీ జీవితంలో ఒక స్థాయి పైకి ఎదగాలి. ఈ విధమైన మెట్లు ఎక్కే ప్రక్రియ కి అంతంలేదు. అలానే, రాజకీయ నాయకులకు ఒక పదవి వచ్చిన తరువాత ఇంకొక పదవి పైకి దృష్టి మళ్ళుతుంది. దీనికీ అంతం లేదు.
మనిషి కోరిక కి అంతంలేక పోవటం అంటే ఇదేనేమో! ఈ విధమైన ప్రక్రియ అంతటినీ వ్యసనం అనవచ్చు. దీనికీ మాదక ద్రవ్యాలకి అలవాటు పడటానికీ సాంకేతికం గా పెద్ద తేడాలేదు.
తాగుడు కి అలవాటు పడితే శరీరం గుల్ల అవుతుంది. ఇదిఒక నష్టం.సమాజంలో గౌరవం పోతుంది. సక్సెస్ కీ, అధికారానికీ అలవాటు పడితే దాని వలన వ్యక్తికి నష్టం లేదు. పైగా చాలా ఇతర లాభాలు ఉన్నాయి. సమాజం లో పేరు రావటం, చుట్టూజనాలు చేరటం, భార్యా పిల్లల దగ్గరా చుట్టాలలో గౌరవం పెరగటం, వగైరా. మనిషి అధికార దాహం వలన సమాజానికి నష్టం అనేది వేరే విషయం.
కొందరికి సినిమాలు వ్యసనమైతే,మరి కొందరికి టీవీ సీరియళ్ళు వ్యసనం. ఈ వ్యసనాల వలన నేరు గా పెద్ద నష్టాలు లేవు. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. జీవితం లో ఉద్యోగం, కుటుంబం, ఆటలూ,స్నేహితులూ,సాంస్కృతిక కార్యక్రమాలూ మొదలైన వాటి మధ్య ఒక సమతూకం ఉండాలి. ఒక పని చేయటం వలన వలన వచ్చే ఆనందాన్ని ఇంకొక పని వలన వచ్చే ఆనందం భర్తీ చేయలేదు. ఉదాహరణ కి తినటంవలన వచ్చే ఆనందాన్ని, మైధునం వలన వచ్చే ఆనందం భర్తీ చెయ్యలేదు. అలానే స్నేహితుల తో సరదా గడపటం వలన వచ్చే ఆనందాన్ని, ఉద్యోగం లో వచ్చే ఆనందం రీప్లేస్ చెయ్యలేదు. కాబట్టీ మనిషి టీవీ చూడటంలాంటి ఒక నిరపాయకరమైన విషయానికి అడిక్ట్ అయ్యినప్పటికీ, అతను జీవితం లో మిగిలిన ఆనందాలను కోల్పోతున్నాడనే చెప్పాలి. ఒక్కోసారి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయటం వలన కష్టాలు కూడా రావచ్చు. టీవీ సీరియళ్ళకు అడిక్ట్ అయ్యిన గృహిణి భర్త సాన్నిహిత్యాన్నీ ఆప్యాయతనూ కోల్పోయే ప్రమాదముంది.
అలానే బూతు సినిమాలు చూడటానికి అలవాటు పడటం వలన సమాజం లో చులకన అవ్వటమే కాకుండా, ఉద్యోగం చదువూ ఇతర రంగాలలో వెనుకపడి జీవితం లో దెభ్భ తినే అవకాశం ఉంది..తను చేసే పని నైతికం గా తప్పు అనే న్యూనత ఎలానూ ఉంటుంది.
బూతు సినిమాలలాంటివి పరిమితం గా అదుపు (కంట్రోల్) లో ఉంటూ చూడ వచ్చా..? ‘కంట్రోల్’ అనేది జీవితం లో ఇతర రంగాల నుంచీ ఆనందం పొందుతున్న వారికి సాధ్యం. అలానే, ఒక మనిషి కి ఒక పని వలన ఎనలేని ఆనందం వస్తున్నప్పుడు,మిగిలివ పనుల వలన పెద్ద సంతోషం లేనప్పుడు, ఎక్కువ ఆనందం వచ్చే పనికి అతను అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రేమ లో విఫలమయ్యిన వాళ్ళు తాగుడుకి బానిస అయ్యినట్లు.
సినిమా నటుడు ప్రకాష్ రాజ్ చిన్నప్పుడు తన తండ్రి వలన పొందలేక పోయిన ప్రేమని తరువాత ప్రేక్షకుల ప్రశంశల ద్వారా పూడ్చుకొన్నట్లు చెప్పాడు. ఇలాంటి కొన్ని భావోద్వేగ విషయాల్లో ఒక రకమైన ఆనందాన్ని ఇంకొక రకమైన ఆనందం రీప్లేస్ చెయ్యగలదు. పిల్లలు పుట్టినతరువాత తల్లికి భర్త మీది నుంచీ దృష్టి పిల్లల మీదికి మళ్ళటం సహజమైనట్లు..
ఇక పోతే, “తినగ తినగ వేము తియ్యగుండు..” అన్నాడు వేమన..
కానీ “పాడిందే పాట రా పాసి పళ్ళ దాసరా” అనికూడా అంటారు.
ఒకే పనిని పదే పదే చెయ్యటం వలన దానికి అడిక్ట్ అవ్వుతారా?, లేక, దానితో విసుగు చెందుతారా? ఆ పని చేదుదైతే దానిలోని చేదు పోతుంది. కానీ తీయనిదైతే వెగటుపుడుతుంది కదా!
ఒక వ్యసనానికి అడిక్ట్ అయ్యిన వాళ్ళు, ముందు దాని వలన ఎక్కువ సంతోషం పొందుతారు.తరువాత సుఖం నెమ్మదిగా తగ్గుతుంది. కానీ అలవాటు వలన, ఆ  వ్యసనాన్ని వదిలిపెట్టినప్పుడు మానసిక వ్యధపెరుగుతుంది. వెంటనే మళ్ళీ మామూలు గా అవ్వటానికి వ్యసనాన్నే ఆశ్రయించాల్సి వస్తుంది.
మనకిష్టమైన పాట మొదటిసారి విన్నప్పుడు సంతోషం గా ఉంటుంది.మళ్ళీ వెంటనే వింటే సంతోషం తగ్గుతుంది. ఇలా నాలుగైదు సార్లు వెంటనే వింటే అది విసుగు పుడుతుంది. మనని ఎవరైనా కట్టేసి అదే పాటని వంద సార్లు వినిపిస్తే అదే పాట నరకమౌతుంది. ఇక్కడ మన మెదడు లో భావోద్వేగాలు కల్పించే న్యూరో ట్రాన్స్మిటర్లు మొదటి సారి బాగానే పని చేస్తాయి. తరువాత వాటి సరుకు నిండుకుంటుంది. మనకు ఎప్పుడైతే బోర్ కొట్టిందో అప్పుడు మన ఆనందం నెగటివ్ లోకి వెళ్ళిందన్నమాట. అప్పుడు పాటని కట్టివేస్తాం. మళ్ళీ తరువాత ఏ రెండు నెలలకో అదే పాటని విని ఆనందించగలం, మొట్టమొదటి సారి అంతకాక పోయినా…అలానే భావోద్వేగాల విషయం లో న్యూరోట్రాన్స్మిటర్లు చేసిన పనిని సెక్స్ విషయం లో హార్మోన్లుచేస్తాయి. కానీ, అడిక్షన్ విషయం లో అలా కాదు. మొదటి సారి తాగిన కిక్ తరువాత తగ్గుతుంది… కానీపాట విషయంలోఅయ్యినట్లు అది బాధించే బోర్ గా తయారవ్వదు. ఆ కిక్ ఒక తటస్థ (న్యూట్రల్) స్థాయి లో ఉండి, అది లేనిదే బతకలేని విధం గా తయారవుతాం.
మనం భోజనం రోజూ చేస్తాం అయితే భోజనానికి మనం అడిక్ట్ ఎందుకు అవ్వం? తిండి తినటం అనేది ఒక అంతం లేని చక్ర భ్రమణ ప్రక్రియ (సైక్లికల్ ప్రాసెస్). ఆకలీ …తిండి..ఆకలీ తిండీ..ఇది ఒక భౌతిక ప్రక్రియ..నాలుగు రోజులు అన్నంలేకుండా మాడబెట్టి,తరువాత అన్నం ముందు పెట్టి, నిన్ను కంట్రోల్ చేసుకో అంటే ఎవరికీ సాధ్యంకాని పని. అప్పుడు ఎవరికైనా తినాలనే యావ (కంపల్షన్) కలుగుతుంది. అలాంటి కంపల్షనే అడిక్ట్ అయ్యిన వారికీ ఉంటుంది. జంతువులలో తినటం ఒకభౌతిక ప్రక్రియ మాత్రమే..కానీ మనుషులలో దీనికి మానసిక కోణం కూడా ఉంది.
జీవితంలో మొట్టమొదటి అనుభవాలు సాటిలేని ఆనందాన్ని ఇస్తాయి. అలానే సాటిలేని దుఖాన్ని కూడా మిగులుస్తాయి.నాకు జీవితంలో మొట్ట మొదటి సారి కూల్ డ్రింక్ తాగిన అనుభవం ఇంకా గుర్తుంది. మొదటి మామిడి కాయ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. తరువాత తిన్నప్పుడు మొట్ట మొదటి సారి తిన్నంత మజా ఉండదు. మొదటి సారి తాగిన జ్ఞాపకం మెదడులోనమోదయ్యి, రెండవసారి తాగిన అనుభవానికి అడ్డుపడటం వలన, రెండవ సారి మన ఆనందంలో ఉండే వ్యత్యాసం (డిఫరెన్షియల్ వాల్యూ) తగ్గిపోతుంది.
ఒక మనిషి ఒక విషయానికి అలవాటు పడిన తరువాత, దానికి సంబధించిన కోరిక అతని చేతనావస్థ (కాన్-షస్-నెస్) నుంచీ కలగటం తగ్గుతుంది. మెదడులోని కణాలు మార్పుకి లోనవ్వుతాయి. దీని వలన, అది అతని అంతశ్చేతన (అన్-కాన్-షస్) లో భాగమౌతుంది. అప్పుడు అతనికి ఏదో తెలియని శక్తి తనని అడిక్షన్ వైపుకి లాక్కుపోతున్నట్లు అనిపిస్తుంది. సిగరెట్ తాగేవాళ్ళకి, సిగరెట్ గుర్తు రాని వాతావరణం లో కూడా సడన్ గా సిగరెట్ తాగాలనిపించటం ఇందుకు ఒక ఉదాహరణ.
చివరిగా, వ్యసనం అంటే స్థూలం గా ఏదైనా ఒక విషయానికి జీవితంలోని సమతౌల్యాన్ని దెబ్బతీసే విధం గా,మితిమీరి అలవాటుపడటం. ఒక్కో వ్యసనం వలన నష్టాలు ప్రత్యక్షం గా ఉంటే ఇంకో వ్యసనం వలన పరోక్షంగా ఉంటాయి.ఒక్కొ వ్యసనం వలన తక్కువ నష్టాలుంటే వేరొక దానివలన ఎక్కువ నష్టాలుంటాయి. జీవితం లో ఆనందించటానికి అనేక మార్గాలున్న వ్యక్తి వ్యసనాలబారిన పడే అవకాశం తక్కువ. వ్యసనాలబారిన పడికూడా జీవిత సమతౌల్యత దెబ్బతిన కుండా ఉండాలంటే ఆవ్యక్తి చాలా ‘ప్రతిభ’ కలవాడై ఉండాలి. కాబట్టీ జీవితం లో సమతౌల్యత ముఖ్యం. చిన్న మోతాదులో మందు అయ్యినది పెద్దమోతాదులో విషం అవ్వటం వ్యసనాలకి బాగా వర్తిస్తుంది.
మనిషి మెదడు కీ, శరీరానికీ ఉన్న పరిమితుల వలన శాశ్వతమైన ఆనందం  అనేది కుదరని విషయం. తృప్తి పడటం కూడా మనిషి జీవన చర్య లో ఒక భాగం కావాలి. కొంత మంది ఎప్పుడు చూసినా ఉల్లాసం గా కనిపిస్తారు. మానసికం గా, శారీరకం గా ఆరోగ్యకరమైన సమతౌల్యమైన జీవితాన్ని గడపటం ద్వారా మనిషి తన లో ఉన్న ఆనందపు స్థాయి ని పెంచుకోవచ్చు.

“పరిమిత మోతాదు లో అయితే మందు”, అనే సూత్రానికి మాదక ద్రవ్యాలూ, అంతర్జాల శృంగారం (డ్రగ్స్, సైబర్ సెక్స్) మినహాయింపులు. ఎందుకంటే, వీటి విషయం లో, చిన్న మోతాదులో పుచ్చుకున్నది కొంత కోరిక ని తీర్చినా, అదే సమయం లో మరింత కోరిక ని కలిగిస్తుంది. అప్పుడు మన సంకల్పం మన అదుపులో ఉండదు. కాబట్టీ డ్రగ్స్ వంటి వాటికి పూర్తిగా దూరం గా ఉండటం మంచిది. వీటి విషయం లో “అడుసు తొక్కనేల?, కాలు కడుగనేల?” అనే సామెత వర్తిస్తుంది.

కొంతమంది కవిత్వం పట్లో, క్రికెట్ పట్లో లేక తమ ప్రియురాలి పట్లో ఒక తపన తో (పాషనేట్ గా) ఉంటారు. మరి పాషన్ కూడా ఒక అడిక్షనేనా?
సాంకేతికం గా చూస్తే, ” ‘అంతరాత్మ అనుమతీ,సమాజం అనుమతీ ఉన్న అడిక్షన్ ‘ నే పాషన్ అంటారు”, అనిపిస్తుంది.

సమాజంలో మెజారిటీ వ్యక్తులకి సాధారణమైన ప్రతిభ ఉంటుంది. అసాధారణమైన ప్రతిభ ఏ కొద్దిమందికో ఉంటుంది. సాధారణమైన టాలెంటూ, తెలివీ కల వ్యక్తులు ఏదైనా ఒక రంగం లో పేరు సంపాదించాలంటే, వారు ఆ రంగం లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే, వారి సమయం లో హెచ్చు భాగాన్ని ఆ రంగానికి కేటాయించాలి. దీని వలన వారి జీవితం లోని మిగిలిన పార్శ్వాలు నిర్లక్ష్యం చేయబడతాయి.ఇది కూడా ఒక విధమైన వ్యసనమే! అసాధారణమైన ప్రతిభ కలవారు మాత్రం ఏ రంగం లోనూ అతి శ్రమ పెట్టకుండా సమ తూకం పాటించగలరు.

మనం ప్రస్తుతం అనేక విషయాలకు బానిసలమయ్యి ఉంటాం. ఇవి కూడా వ్యసనాలే. కానీ మనకు మనం ఒక వ్యసనం లో ఉన్నాం అనే విషయం తెలియదు. వ్యసనానికి అంతరాయం కలిగినపుడు కదా వ్యసనం లో ఉన్నాం అని తెలిసేది! ఉదాహరణకి మనం విద్యుత్ (కరెంటు) కి దానితో పని చేసే ఉపకరణాలకీ అలవాటు పడి ఉన్నాం. ఏదైనా కరెంటు లేని పల్లెటూరికి వెళ్ళినప్పుడు, కరెంటు లేని పరిస్థితి లోని ఇబ్బంది కారణం గా  మన ఈ వ్యసనం బయట పడుతుంది.
అలవాటు లన్నీ వ్యసనాలేనా? మనం ఏ అలవాటు మీద ఆధారపడి, అవిలేకుండా చాలా ఇబ్బంది పడతామో అవన్నీ వ్యసనాలే. వ్యసనం లో ఆధారపడటం (డిపెండెన్సీ ) ఉంటుంది.మంచి అలవాటు లో డిపెండెన్సీ  ఉండదు. వ్యసనం కుంటివాళ్ళు వాడే ఊత కర్రలాంటిదైతే, అలవాటు పొద్దున్నే నడక కి వెళ్ళేటపుడు ఏ కుక్క నో కొట్టడానికి మనం దగ్గరుంచుకొనే పొన్ను కర్ర (వాకింగ్ స్టిక్) లాంటిది.

మరి పిల్లలమీద ప్రేమా, భార్య మీద ప్రేమా,స్నేహితుడి మీది అభిమానం ఇవన్నీ వ్యసనాలా? ఎందుకంటే ఒక్కోసారి మనం  భార్య లేకుండా ఉండలేం. ఒక్కోసారి పిల్లలు లేకుండా “జీవితం ఎంత దుర్భరమో కదా!” అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన డిపెండెన్సీ నే కదా?
భావోద్వేగపరమైన మానవ సంబంధాలలో “మానసికం గా ఆధారపడటం” అనేది ఒక సకారాత్మక (పాజిటివ్) అంశం. కానీ ఈ అధారపడటం అనేదానికి సమాజంకొన్ని పరిమితులు విధించింది. ఇక్కడ వ్యసనాన్ని సమాజం దృష్టి నుంచీ చూడాల్సి వస్తుంది.అలానే, ఆధారపడటం వలన జీవితం లోని ఇతర పార్శ్వాలు కుంచించుకుపోకుండా ఉంటే అప్పుడు మనం ఆధారపడిన విషయం వ్యసనం అవ్వదు.
ఈ ప్రకారం చూస్తే, పిల్లల పై ధృతరాష్ట్రుడి కి ఉన్న ప్రేమ లాంటి ప్రేమ నిస్సందేహం గా వ్యసనమే. అలానే కైక పై దశరధుడికి ఉన్న ప్రేమ కూడా వ్యసనమే.

సమాజం సమర్ధించే వ్యసనాలు కూడా ఉన్నాయి. అతి ప్రేమ, అతి మంచితనం మొదలైన వాటిని సమాజం పాజిటివ్ గా చూస్తుంది. తన భర్త చనిపోయాడని ఆత్మ హత్య చేసుకోబోయిన స్త్రీ గురించి జనాలు “భర్తంటే ఎంత ప్రేమా” అని ఎంతో గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను. ఒక కమ్యూనిస్టు నాయకుడు తనకున్న ఆస్తినంతటినీ కూలీలకీ , పార్టీ కి రాసిచ్చి, చివరికి సొంత ఇల్లుకూడా లేక, పార్టీ ఆఫీసు లో నే పడుకొని నానా కష్టాలు పడటం గురించి కూడా ప్రజలు గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను.కొందరి వ్యసనాల వలన సమాజానికి ఎన లేని మేలు జరుగుతుంది. గాంధీ గారు, పటేల్ వంటి నాయకులు దేశ ప్రజలకోసం, దేశ భవిత కోసం తమ జీవితాలనే ధారబోశారు. కానీ వ్యక్తి గతం గా గాంధీ గారి కొడుకే ఆయన ఒక “గొప్ప నాయకుడే కానీ, గొప్ప నాన్న  కాదు”, అని చెప్పాడు. ఆయా నాయకులంతా తమ యావత్సమయాన్నీ ప్రజా జీవితానికే కేటాయించటం వలన, కుటుంబం తో గడిపే సమయం తక్కువైన వారే!

నా మిత్రునితో ఈ వ్యాసం గురించి చర్చిస్తుంటే ఇలా అన్నాడు: “వ్యసనాలని వదిలించుకోవాలని ప్రయత్నించడమూ ఒక వ్యసనమే!”.

నా మిత్రుని వాదాన్ని కొనసాగిస్తే ఈ “వ్యసనాన్ని వదిలించుకొవాలనే వ్యసనాన్ని” వదిలించుకోవాలనుకోవటమొక వ్యసనం…ఇలా అంతం లేకుండా, ఒక ఇన్-ఫినిట్ లూప్ లో చెప్పుకుపోవచ్చు. కానీ ఇదంతా వాదనాపరమైనదే (తీరిటికల్).  క్రియాత్మకం (ప్రాక్టికల్) గా వ్యసనం ఒకరి జీవితం లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి,దాని మీద డిపెండెన్సీ ఉండాలి, దాని వలన మిగిలిన జీవిత భాగాలు నిర్లక్ష్యం చేయబడాలి. ఈ లక్షణాలన్నీ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకొనే కోరిక కి ఉంటే ఆ కోరిక కూడా వ్యసనమే!

గుండె ఎలా పనిచేస్తుందో తెలిసిన వాడికి గుండె జబ్బు రాకుండా పోదు కదా..? అలానే నాకు ఈ వ్యాసాన్ని రా…రా…స్తూపోవటం ఒక వ్యసనమయ్యినట్లుంది. ఇక ఉంటా!

ఆనందాన్వేషణ

ఆనందాన్వేషణ

కొత్తగా కట్టిన వంతెన పక్క బస్సు దిగి, ఎడమ వైపుకి నడవ సాగాడు రామారావు. రేవు మీది నుంచీ తేమ గాలి సాగింది. సులాబీ దిగితే అన్నీపూల మొక్కల నర్సరీలే.  హైదరాబాదు మురికి వాయువులు అలవాటైన రామారావు కి, వాటి గాలి తగిలి ప్రాణంలేచివచ్చినట్లుగా ఉంది. ఆ గాలికి, మనసుకూ ఇంద్రియాలకూ శరీరానికీ ఒక స్వస్థత చేకూరుతుంది. అతని మనసు చుట్టూ ఉన్న వాతావరణానికి అంతకుముందులేని సున్నితత్వంతో స్పందించసాగింది.
నీటిపారుదల శాఖ బంగళాలనూ వాటి ముందున్న ఫిరంగిబొమ్మనీ దాటుకొని, పాడుబడిన ఎత్తిపోతల పధకాన్ని దాటుకొని, ముందుకు వెళ్తే వచ్చింది  చిన్నప్పటి బడి. అతను వెంటనే బడి లోనికి వెళ్ళకుండా కాసేపు చుట్టూ కలియ తిరిగాడు. బడి పక్కనే కరకట్ట. దాని అవతల కృష్ణమ్మ, తెల్లటి ఇసుక మధ్య మధ్య న సన్న సన్నటి నీటి పాయలతో చిక్కి శల్యమైపోయింది. పైన, అక్కడక్కడా ఉన్న మబ్బులకి రేవు లో కొంత ఇసుక చలవ గా సేదతీరుతోంటే, మరికొంత వేడి గా మెరుస్తోంది.స్కూలు మునుపటిలాలేదు..చాలా మార్పు వచ్చింది.. స్కూలు మెయిన్ బిల్డింగ్ పక్కన అదనం గా రెండు భవనాలు వచ్చాయి. పిల్లలు మాత్రం తక్కువ గా కనపడుతున్నారు. గ్రౌండ్ లో వాలీ బాల్ కోర్ట్ లో పిచ్చి మొక్కలు మొలిచాయి.
బళ్ళో కి వెళ్ళి హెడ్ మాస్టరుకు పరిచయం చేసుకొని వాకబు చేస్తే అభిరాం గాడు ఇంకా రాలేదని తేలింది. హెడ్మాస్టర్ అటెండర్ ని పిలిచి రామారావు బ్యాగ్ ని తీసుకెళ్ళి రూం లో పెట్టమన్నాడు.

హైదరాబాదు నుంచీ అతను త్వరగానే రాగలిగాడు.అభిరాం బెంగుళూరు నుంచీ చేరటానికి సమయం పడుతుందికదా..చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నా కాలప్రవాహంలో పడి, అభిరాం బెజవాడ లో ‘సీ యే’ చేస్తే, రామారావు వైజాగులో ఇంజినీరింగు చేశాడు. తరువాత ఉద్యోగాన్వేషణలో అభిరాం బెంగుళూరుకీ రామారావు హైదరాబాదుకీ చేరారు. ఐతే, అన్ని ప్రవాహాలూ సముద్రంలోకే అన్నట్లు ఇద్దరూ ‘ఐ టీ’ రంగం లోనే స్థిర పడ్డారు.

వారిద్దరికీ స్కూల్లోనే రెండు గదులు ఏర్పాటు చేశామని చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు.రామారావు స్కూల్లో రెండు కంప్యూటర్లకి డబ్బులిస్తే, అభిరాం  స్కూలులైబ్రరీ భవనానికి విరాళమిచ్చాడు. “ఆమేరకి హెడ్మాస్టర్ నా పై శ్రధ్ధ చూపిస్తున్నాడులే” అనుకొన్నాడు రామారావు.
ఆటెండర్ కి వయసు మీద పడింది. అతను బ్యాగు ని ఎత్త లేక అవస్థ పడుతుంటే “నే పట్టుకుంటానులే తాతా” అని రామారావు తీసుకొన్నాడు.

అటెండర్ ని ఎక్కడో చూసినట్లేఉంది..ఆ… ఇతని పేరు ఆశీర్వాదం కాదూ..అప్పుడే ఎంత ముసలాడయిపోయాడు? చిన్నప్పుడు బాస్కెట్ బాలు కోర్ట్ పర్యవేక్షణ చూసుకొనేవాడు. అప్పుడప్పుడూ తను కూడా తమ ఆటలోఓచెయ్యి వేసి, “ఇలా చులాగ్గా ఎగిరి..అలా వొదిలెయ్యాలి బాబూ” అని చూపించేవాడు”.

“ఏం అశీర్వాదం బాగున్నావా?”
“ఆ..ఏదో..బాగున్నాను బాబూ” అని “మీరు ఏ బాచీ బాబూ” అని అడిగాడు.
“నీకు అభిరాం గుర్తుండాలే..నేను వాడి బాచే… “ఇంతకీ స్కూలెలా ఉంది ఆశీర్వాదం?”, రామా రావు భోగట్టా చేశాడు..
“ఎనకటి కన్నా చానా తగ్గిపోలా..? ఊళ్ళో పిల్లలందరూ ప్రైవేటు కాన్వెంటులకి పోతున్నారు..మీరున్నప్పుడు సందడి వేరు.అప్పుడున్న మేస్టర్లెవరూ ఇప్పుడ్లేరు. చానా వరకూ రిటైర్ అయ్యిపోయారు..కొంతమంది ట్రాన్సిఫరయ్యిపోయారు.”.
“నిజమే స్కూల్ మారిపోయింది..ఆశీర్వాదం మారిపోయాడు నేను మారిపోయాను. కానీ స్కూలును చూస్తే గతం లోకి వెళ్ళి మళ్ళీ ఆ జీవితాన్ని గడిపిన అనుభూతి. ..కానీ ఇది అనుభూతే…మారిన స్కూలుని చూసినందువలన..మారిన నాలో పెల్లుబికిన జ్ఞాపకాల ప్రభావం…నేను స్కూలులో చదివినప్పటి వాస్తవం ఎప్పుడో కాల గర్భంలో కలిసి పోయింది. అది మళ్ళీ రావటం అసంభవం…” రామారావు ఆలోచనల లో పడిపోయాడు.
అశీర్వాదం గది తలుపు తెరిచి బాగ్   అందులో పెట్టి వెళ్ళిపోయాడు.మంచం మీద వెల్లకిలా పడుకొంటే పాత జ్ఞాపకాలు కమ్ముకొన్నాయి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

అభిరామూ రామారావూ ఇదే స్కూల్లో పదో తరగతి వరకూ చిదివారు. అభిరాం డాడీ   ‘పీడబ్ల్యూడీ’ లో ఇంజనీరు. వాళ్ళు సులాబీ పక్కన క్వార్టర్లో ఉండేవాళ్ళు . వాడి నాన్న జీపులో తిరిగేవాడు. ఆయన ఎప్పుడూ ధీమాగా, ప్రశాంతం గా ఉండే వాడు. ఆయనకి పై రాబడి ఎక్కువని రామారావు కి వాళ్ళ  రైతుల ఇళ్ళలో అనుకోవటం ఆ వయసులోనే  గుర్తు. అభిరాం అమ్మ చాలా నైసు గా ఉండి  చాలా తక్కువ గా మాట్లాడేది. ఆమె కి ఊళ్ళో ఏవరి తోనూ పరిచయాలు ఉన్న దాఖలాలు తక్కువ. ఆ గ్రామం లో ఉండే రైతు కుటుంబాల ఆడవాళ్ళ తో పరిచయాల కోసం ఆమె కి ఏమంత ఆసక్తి కూడా ఉండేది కాదనుకొంటాను.
రామారావు నాన్న ఓ చిన్న రైతు.  వాళ్ళ అమ్మ ఇంటి పనులు చూసుకొనేది.
స్వభావం లో అభీ  ఉత్తర ధృవమైతే రాము దక్షిణ ధృవం. అభీ కి ఆటలూ సరదాలూ ఎక్కువ. స్కూల్లో నలుగురిని వేసుకొని అల్లరి చెయ్యటం చెట్లెక్కటం మెండు. రాము మాత్రం నిశ్శబ్దం గా అతని పనేదో  చేసుకొనే వాడు. ఇంకా సమయముంటే లైబ్రరీకి వెళ్ళి పత్రికలూ కథలూ చదివేవాడు. అభీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వలన వాడికి రాము నోట్సులతో పని బడేది. అభీ అర్ధం కానిది చెప్పించుకోవడానికి ఒక్కోసారి “కలిసి చదువుకుందాం” అని వాళ్ళింటికి  రాము ని పిలిచేవాడు. రాము క్లాసు ఫస్ట్ అని తెలిసో ఏమో అభీ వాళ్ళ అమ్మ నాన్నా కూడా ఏమీ అభ్యంతర పెట్టేవారు కాదు.
అభీని క్లాస్ లీడర్ గా నియమించింది క్లాస్ టీచర్. అందరి దగ్గరా హోంవర్క్ పుస్తకాలు సేకరించి టీచర్ కి ఇవ్వటం. టీచర్ బయటికి వెళ్ళినప్పుడు క్లాస్ గలభా చెయ్యకుండా చూడటం వాడి  బాధ్యతలు. ఎవరైనా వాడితో పోట్లాట పెట్టుకుంటే అలాంటి వాడి మీద టీచర్ కి చాడీలు చెప్పటం అభీ గాడి హక్కు. టీచర్ ముందు మాత్రం అభీ గాడు చాలా వినయం గా ఉండే వాడు. ఆమె చెప్పిన పని తూ.చ. తప్పకుండా అమలు చేసే వాడు. దాంతో క్లాస్ లో పిల్లలందరూ అభీ గాడంటే కొంచెం అదుపులో ఉండే వారు.

అభీ గాడి నాన్న కి వెస్పా స్కూటర్ కూడా ఉండేది. ఏడో తరగతికి వచ్చేటప్పటికి అభీ గాడు ఆ స్కూటర్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. అప్పుడప్పుడూ రాము ని కూడా ఎక్కించుకొని ఇంటిదగ్గర దింపేవాడు.

ఓ రోజు అభీ రాము ని  సెకండ్ షో సినిమాకి లాక్కు పోయాడు. ఆ రోజు లెక్కల మాస్టరిచ్చిన హోంవర్క్ ఇంక అవ్వలా. రాము సినిమా చూస్తున్నా అతని మనసు హోం వర్క్ చెయ్యలేదన్న టెన్షన్ లో పడింది. సినిమా లో రాజేంద్రప్రసాదు జోకులకి పైకి అందరితో పాటు ఇకిలించాడేకానీ, లోపల గుండె పీచు పీచు మని పీకుతోనే ఉంది. ఆ రాత్రి ఒంటి గంటకి ఇంటికొచ్చిన తరువాత దీపపు వెలుగులో కూర్చొని లెక్కల మాస్టరు ఇంటికిచ్చిన లెక్కలు చేశాడు. అయితే, మరసటి రోజు అభీ గాడు మాత్రం ఏ మాత్రం తొణకకుండా, “నిన్న రాత్రి మా డాడీ మమ్మల్ని పెళ్ళికి తీసుకు పోయాడు సార్..హోంవర్క్ చెయ్యటం కుదర్లేదు..” అని చెప్పి తప్పించుకున్నాడు.

అభీ గాడు లెక్కలమాస్టర్ని తేలికగా ఏమార్చాడు కానీ,హెడ్ మాస్టర్ని మాత్రం ఏమార్చలేక పోయాడు. ఆయనకసలే చండ శాసనుడని పేరుండేది. మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా ఆకతాయి కుర్రాళ్ళని మాత్రం గట్టి దెబ్బలే కొట్టేవాడు.అందుకే ఆయనంటే స్కూలందరికీ హడల్.
స్కూల్లో అభీ గాడికి ఒక బాచీ ఉండేది. అభీ గాడు రామూ కి ఉన్న ఒకే సూర్య గ్రహమైతే, అభీ గాడి చుట్టూ ఉండేసవాలక్ష గ్రహాల్లో రామూ ఒక బోడి గ్రహం.

ఒక రోజు అభీ గాడి బాచీ వాళ్ళు పదో తరగతి బాచీ వాడినొకడిని కబడ్డీ లో కుమ్మేశారు. ఈ విషయాన్ని పదోతరగతి బాచీ వాళ్ళు హెడ్మాస్టర్ కి కంప్లయింట్ చేశారు. దాంతో హెడ్ మాస్టర్ కోపం తో ఊగిపోతూ క్లాస్ కి వచ్చి, “అభీ గాడంటే ఎవర్రా..?” అని అడిగాడు. అభీగాడు కనపడినవెంటనే ఆశీర్వాదాన్ని పిలిచి,”నా రూం లో ఈత బెత్తాలున్నాయి తీసుకొని రా..”,అన్నాడు.
తరువాత ఈత బెత్తాలన్నీ తుక్కయ్యేటట్లు అభీ గాణ్ణి కొట్టి, క్లాస్ లో మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ పారేశాడు, “ఇక ముందెవరన్నా పిచ్చి పిచ్చి గలాటాల్లోకి దిగారంటే మీకు గూడా ఇదే గతి” అని. క్లాస్ లోఆడ పిల్లకాయలైతే బిక్క చచ్చి పోయి ఓ రెండు రోజులు మాటలు ఆపేశారు. కానీ మరో రెండు రోజుల తరువాత వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టినాక తెలిసింది, ఆడ పిల్లలలో అభీ గాడికి సానుభూతి పెరిగి పోయింది. తరవాతి ఆదివారం అభీ గాడు  క్లాసుమేట్ దుర్గ ని తన స్కూటరెక్కించుకొని మంగినపూడి బీచికి తీసుకెళ్ళాడని రాము కి తెలిసింది. రాము వాడిని ఒంటరి గా ఉన్నప్పుడు ఈ మాట నిజమేనా అనడిగాడు. వాడు ముందు బుకాయించి తరువాత,”నీకు గాబట్టీ చెప్తున్నా, ఇంకెవరికీ చెప్పొద్దు”, అని..”నేను దాన్ని బీచి దగ్గర ఇంగ్లీషు ముద్దు కూడా పెట్టుకున్నాను”, అని చెప్పాడు.
తొమ్మిదో తరగతి లో ఉండగా ఓ సారి అభీ రామూ కలిసి స్కూటర్ మీద పోతున్నారు. హై స్కూల్ గేట్ దగ్గర పదో తరగతి వాళ్ళు స్కూటర్ని అటకాయించారు. అభీ స్కూటర్ దిగి స్టాండ్ వేసే లోపు వాళ్ళు మీద పడి వాడిని పిడి గుద్దులు గుద్ద సాగారు. రాము కి భయమేసి ఏమిచేయాలో తోచలేదు. కాసేపటికి గుండె చిక్కపట్టుకొని పెద్ద గా అరిచాడు. “అడి గో హెడ్ మాస్టర్..అడిగో హెడ్ మాస్టర్..పారిపొండి…పారిపొండి” దాంతో పదో తరగతి వాళ్ళంతా చెల్లా చెదురయ్యారు..రాము వాణ్ణి లేపికూర్చోబెట్టి,పక్క బడ్డీ కొట్టులో ఒక గోళీ సొడా తెచ్చి తాగించాడు.  ఇక అప్పటి నుంచీ అభీ కి రాము అంటే మంచి గురి ఏర్పడి పోయింది.
పదో తరగతి లో అభీ ‘ఎస్పీ ఎల్ ” గా పోటీ చేసినప్పుడు,వాడికి రాము కరపత్రాలన్నీ రాసి పెట్టాడు. ఎలక్షన్లలో అభి గాడు ఊరి ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఆ ఊరి వాళ్ళందరూ అభి గాడికి ప్రత్యర్ధి గా నుంచున్న సీను గాడికి ఓట్లు వెయ్యకూడదన్నాడు. ఎందుకంటే సీను గాడి ఊరు పక్కనున్న మువ్వలపాలెం. వాళ్ళ ఊళ్ళో స్కూల్ లేక, వాడు ఈ ఊరి హై స్కూల్లో చదువుకొంటున్నాడు.   కానీ ఎలక్షన్లలో అభీ గాడి ‘ఊరి ఫీలింగ్’ కిటుకు పని చెయ్యలా. సీను గాడే గెలిచాడు. అభీ గాడు ఓడిపోవటం తో రాము చాలా డీలా పడిపోయాడు. కానీ, అభీ మాత్రం మరుసటి రోజుకల్లా మామూలు మనిషైపోయి, “పదరా, చిరంజీవి సినిమా పసివాడి ప్రాణం ఆడుతోందంటా” అన్నాడు.

పదో తరగతికి వచ్చిన తరువాత రాము డిటెక్టివ్ నవలలూ సస్పెన్స్ నవలలూ మాని కొంచెం ఉత్తమసాహిత్యం చదవటం మొదలెట్టాడు. అభీ మాత్రం మసాల సినిమాలు మానలేదు. ఎప్పుడన్నా సస్పెన్స్ నవల ఉంటే చదివే వాడు. వాడికి సినిమా లో గానీ నవల లో కానీ మజా కావాలి.
టెంత్ క్లాస్ మధ్యలో అభీ నాన్న కి విజయవాడ ట్రాన్స్ ఫర్ అయ్యింది. వాళ్ళమ్మ మాత్రంక్వార్టర్ లోనే ఉండేది. రాము ప్రతి రోజూ సాయంత్రం అభీ ఇంటికెళ్ళే వాడు. అక్కడినుంచీ ఇద్దరూ ఏదో ఓ సినిమాకి చెక్కేసే వాళ్ళు. సాధారణం గా రాము కి నచ్చిన సినిమా అభీ కి నచ్చేది కాదు. సినిమా అయ్యిపోయినాక దాని గురించి వాదులాడుకొనే వాళ్ళు.”అబ్బే.. ఇదేం సినిమా..? మరీ నెమ్మదిగా ఉంది..సినిమా అంటే కిక్ ఇవ్వాలి”, అనేవాడు అభీ.  సాధారణం వాళ్ళ ఇద్దరి అభిరుచులూ దేంట్లోనూ కలిసేవి కాదు.
అభీ కి వాలీ బాల్ చాలా ఇష్టమైతే రాము కి చెస్ ఇష్టం. “చెస్ కూడా ఒక ఆటా…కదలకుండా ఇంట్లో ఫర్నీచర్లా ఆడేది ఏదీ ఒక ఆట కాదు” అనే వాడు అభీ.

రాము పది మాటలు మాటలు మాట్లాడితే అందుకు అభీ ఒకట్రెండు మాటలు సమాధానం ఇచ్చేవాడు. అభీ తన కుటుంబ విషయాలు ఎప్పుడూ చెప్పే వాడు కాదు. రామూ మాత్రం అభీ అడగక పోయినా తన ఇంటి దగ్గర విషయాలు ఏకరువు పెట్టే వాడు.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
స్కూల్లో రూం బయట కారు వచ్చిన శబ్దమై రాము వెళ్ళి తలుపు తెరిచాడు.  బ్లూ బ్లేజర్ వేసుకొని,కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని,నిల్చొన్నాడు అభీ. అతను మంచి అందగాడి గా తయారయ్యాడు. డ్రైవర్ కి , “కారు పక్కన పార్క్ చేసుకో, రాత్రి ‘టెన్ ఓ క్లాక్’ కి మళ్ళీ రిటర్న్ జర్నీ”, అని చెప్పి రూం వైపుకి అడుగులేశాడు.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

“చాలా రోజులైపోయింది మనిద్దరం కలిసి.. త్రీ ఇయర్స్ అవ్వలా?..బెంగుళూరు సెమినార్ లో లాస్ట్ టైం మీట్ అయ్యామనుకొంటా..” అన్నాడు అభి స్నానం చేసి వచ్చి కుర్చీ లో కూర్చొని మంచమ్మీద కాళ్ళు పెట్టుకొంటూ..
చిన్నప్పటి తో పోలిస్తే అభి భాష చాలా మారిపోయింది. అతను మాట్లాడే దాంట్లో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలు ఎక్కువైనాయి. ఇదే రాము అభి తో అంటే , “మనిషి అడాప్ట్ అయ్యిపోవాలి రా..వి నీడ్ టు బి లైక్ ఎ రోమన్ ఇన్ రోం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని వినలా..? ” అన్నాడు అభి.
“సర్వైవ్ అయ్యే పిచ్చి తో నన్ను నేను పోల్చుకోలేని విధం గా తయారవ్వటం నాకు ఇష్టం లేదు రా..అయినా.. డార్విన్ థీరీ “ప్రకృతి లోని పరిస్థితులకి ప్రాణుల లో ర్యాండం గా కలిగే జన్యు మార్పులు సరిపడక పొతే అవి అంతరిస్తాయి” అని చెప్తుంది. దానికీ, స్వ ప్రయోజనమే పరమార్ధం గా ఉండే కార్పొరేట్ ప్రపంచానికీ, చాలా తేడా ఉంది రా..డార్విన్ థీరీ ని ఇక్కడ అన్వయించలేం.”, అన్నాడు రాము.

“మనమందరం మారతాం..అంటే చిన్నప్పుడు ఏర్పడిన మన వ్యక్తిత్వం లోని కోర్ అలానే ఉంటుంది అనుకో..కానీ మనలో మిగిలినదంతా మారేదే…. నీ లాగా… ఏట్లో బండ రాయి లా ఉంటే ఎలా?”

రామారావు మాత్రం,”అసలు డార్విన్ థీరీ ప్రాణులలో ఏ ఏ లక్షణాలను ప్రకృతి లోని మార్పులు..” అని ఇంకేదో చెప్పబోయాడు.

అభీ మధ్యలోనే అందుకొని, “ఒరేయ్ రామూ, నువ్వేమీ మారలేదు రా. నీ ఆలోచనలు ఇంకా భూమ్మీదకి రాలేదు…అంతా కాన్సెప్ట్యువల్ థింకింగ్..నేనేదో అడాఫ్ట్ అవ్వాలి అని బుధ్ధి తక్కువై అన్నానే అనుకో..నువ్వు ఎక్కడికో జన్యు మార్పుల లోకి వెళ్తే ఎలా రా..? నువ్వు ప్రజెంట్ లోకి వచ్చెయ్. ఎవరికున్న పరిస్థితులలో వాళ్ళు బతకాలి రా” అని నవ్వసాగాడు.
“కాన్సెప్ట్యువల్ థింకింగ్ నుంచే సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయోయ్..దాన్ని తీసిపారేయకు”
వాళ్ళిద్దరూ మొదటి నుంచీ ఇంతే.ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి వాదులాడుకుంటూనే ఉంటారు.
“అహా…అయితేఈ గది లో కూర్చొని..నీ బుర్ర తో మాత్రమే ఆలోచించి సైన్సూ, మెడిసినూ, ఇంజినీరింగూ,  పెయింటింగూ, ఫుట్ బాలూ,హాకీ అన్నీ నేర్చేసుకో రా నువ్వు”, అని, “మనిషి బుర్రకున్న తెలివి చాలా లిమిటెడ్ రా.. ముందు ప్రపంచం లో పడి ఇన్-ఫర్మేషన్ పట్టుకుంటే గానీ, తరువాత ఆ పట్టుకున్న ఇన్-ఫర్మేషన్ మీద ఆపరేట్ చెయ్యటం కుదరదు మన బుర్రకి….సరే…ఈ వాదాలకేం గానీ..భారతీ,పాపా ఎలా ఉన్నారు”,అని రామూ భార్యా కూతుళ్ళ గురించి అడిగాడు అభీ.
అభీకింకా పెళ్ళి కాలా. పెళ్ళి కాకుండానే అతను ఓ కంపెనీలో డెలివరీ డిపార్ట్ మెంట్ కి హెడ్ అయ్యాడు. నేరు గా “సీ ఈ ఓ” కే రిపోర్ట్ చేయటం. రాము చిన్నప్పుడు అభీకన్నా చదువు లో చాలా ముందున్నప్పటికీ, ఉద్యోగ పరం గా అతని కంటే చాలా వెనకబడిపోయాడు. ఓ చిన్న కంపెనీ లో టీం లీడ్ గా చేస్తున్నాడు.

ఇద్దరూ ఒకరి ఉద్యోగం గురించి వేరొకరు అడిగి తెలుసుకొన్నారు. అభీ, “మోర్ దేన్ హాపీ..” అన్నాడు.
రామారావు కి  అతని ఉద్యోగం ఏమాత్రం నచ్చటంలా. ఉద్యోగం లో చేరిన మొదట్లో ఒక ప్రాజెక్ట్ నుంచీ వేరొక ప్రాజెక్ట్ కి విసిరేసే వాళ్ళు..ఐనా ఏమీ అనలేని తన నిస్సహాత్వానికి తన మీదే తనకు చాలా కోపంగా ఉండేది. ఫాలో అప్ పేరు మీద వాళ్ళ టీం లీడ్ గంటకో సారి నా సీట్ దగ్గరికి వచ్చి “హౌజ్ ఇట్ గోయింగ్?” అంటూ ఉంటే”, వాడిని ముక్కుమీద గుద్దాలనిపించేది. జీతం గురించి అడగొద్దు..బఠాణీ గింజల జీతం…
వాళ్ళ టీం లీడ్ తిట్టినప్పుడు తనది తప్పు ఉందని తెలిసినా, వాడి మీద కసి తో పని చేయాలనిపించేది కాదు. తన మనసుని కష్టపెట్టటానికి వాడెవడు? వాడు దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే…
తీరా రామూ టీం లీడ్ ని అయ్యాడా….బతుకంతా ఒకటే టెన్షన్ అయ్యిపోయింది..జీతం పెరిగింది..కానీ దానితో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. …ఇక ప్రమోషన్ వచ్చి మానేజర్ గా అయితే ఇంకెంత టెన్షన్ ఉంటుందో..?ఓ రోజు క్లయింట్ మీటింగ్ లో తనేదో తప్పు మాట్లాడితే మానేజర్ గాడు తరువాత తనను ఒంటరిగా వాడి గది లోకి పిలిచి, “యు రేర్లీ ఓపెన్ యువర్ మౌత్. బట్ వెనెవర్ యు ఓపెన్ ఇట్, యు పుట్ యువర్ ఫూట్ ఇంటు ఇట్” అన్నాడు. వాణ్ణి చాచి పెట్టి లెంప పగులకొడదామనిపించింది..కానీ అసలే రిసెషన్ రోజులు..ఉద్యోగం ఊడుతుందని ఊరుకొన్నాడు..ఇప్పుడు ఆలోచిస్తే టీం మెంబర్ గానే తను హాయి గా ఏ బరువూ బాధ్యతా లేకుండా ఉన్నాడేమో అనిపిస్తుంది..కాకపోతే డబ్బులు తక్కువ వస్తాయి.
అభీ కి  ఈ గొడవంతా చెప్పకపోయినా, కొంత చెప్పాడు రాము.

అభీ చిద్విలాసం గా నవ్వి,”నీకు ఈ ఫీల్డ్ సరిపడదనుకొంటారా..ఏ పంతులుద్యోగమో చేసుకోరాదూ?” అన్నాడు.
“అప్పుడు డబ్బులు సరిపోవేమో రా..?”
“మరి ఒకటి కావాలంటే వేరొకటి వదులుకోవాలి బాబూ..”నీకు డబ్బూ కావాలి..టెన్షన్ లేని బతుకూ కావాలి..మళ్ళీ ఎవడూ నీ మీద అధికారమూ చెలాయించకూడదు” అంటే ఎలా..? ఏ సినిమా స్టార్లలాంటి వాళ్ళో కొందరు అదృష్టవంతులు ఉంటారు.వాళ్ళకి అన్నీ అవే వస్తాయి…ఐనా వాళ్ళకి కూడా ఏదోఒక పర్సనల్ ట్రాజెడీ ఉండనే ఉంటుంది…అవునూ… యానివర్సరీ ఈవెనింగ్ సిక్స్ కి కదా..మనమిచ్చిన డొనేషన్ కి హెడ్మాస్టర్ మన చేతులమీదుగా పిల్లలకి ప్రజంటేషన్లు ఇప్పిస్తాడట. రెడీ గా ఉండు”, అన్నాడు  అభీ.
“ఫంక్షన్ అయ్యాక ఊళ్ళోకి వెళ్ళి రావాలి..మాదూరపు చుట్టాలు కొందరు ఇంకా ఊళ్ళోనే ఉంటున్నారు”  అన్నాడు రాము.
“సరేరా, నువ్వెళ్ళు. నేను నీ కోసం ఆగను. రాత్రి టెన్ కి బయలు దేరాలి”, అన్నాడు అభీ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

అభిరాం ఆఫీస్ నుంచీ రావటం ఎప్పటిలాగే బాగా లేటయ్యింది. అతని ఫ్లాట్ మేట్ సంజయ్ అప్పటికీ మెలుకువ గానే ఉన్నాడు. అభిరాం డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి సంజయ్ ఇంటర్నెట్ లో బూతు సినిమాలు చూసుకొంటున్నాడు. ఒక బొమ్మ మీద నొక్కితే వెయ్య బొమ్మలు వస్తాయి ఆ వెయ్యి బొమ్మాల్లో ఒక్కో బొమ్మా మళ్ళీ వెయ్యి బొమ్మల కిటికీలని తెరుస్తుంది..అలా అలా..వెయ్యి బొమ్మలలో కొన్నైనా నచ్చుతాయి…ఈ బొమ్మల తతంగానికి అంతే ఉండదు. అభీ స్నానం చేసి భోజనం చేసి వచ్చేసరికి తెల్లారి రెండైపోయింది. కానీ సంజై ఇంటర్నెట్ వదలట్లేదు.ఒక బొమ్మ రెచ్చగొడుతుంది..రెచ్చిపోయిన తరువాత మరోబొమ్మ కావాలని పిస్తుంది….”దీని మొహమ్మీది ఫీలింగ్ చూడు ..ఫీలింగ్ ..కీ ఎమోషన్ కీ సెక్సు కీ ఏదో సంబంధం ఉందబ్బా..అసలు సెక్సే ఓక ఎమోషన్..సెక్సు లోనే ఎమోషనల్ శాటిస్ఫాక్షన్ ఉంది…ఈ గుంట చూడు…షి లుక్స్ ..క్యూట్…ఈ సీన్ చూడు..ఆ డిం లైటింగూ అదీ..భలే సెన్సువస్ గా ఉంది కదా…” అంటున్నాడు అతను. అభీ అందుకొని…

“బాబూ సంజయ్..నీ లెక్చర్ వినలేక చస్తున్నాం నాయనా…..నువ్వు దీనికి ఎడిక్ట్ అయ్యిపోతున్నావు…కాదు..కాదు ఎడిక్ట్ అయ్యిపోయావు…రేపు పొద్దున్నే ఎప్పుడు లేస్తావూ ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తావు..?ఆఫీస్ లో పని అంతా ఖరాబు చేస్తావనుకొంటా..మళ్ళీ తరవాత అప్రైజల్ లో తక్కువ రేటింగ్ ఇచ్చాడంటావు…” అన్నాడు.

సంజయ్..”ఒక్కొక్కడికీ ఒక్కో ఎడిక్షన్ బాబూ..నీకు వర్క్ ఎడిక్షన్…ఇంకొకడికి క్రికెట్ ఎడిక్షన్..నాకు ఈ బొమ్మలు ఎడిక్షన్..నువ్వు చిన్నప్పుడు చిరంజీవి సినిమాలకు ఎడిక్ట్ అయ్యావని నువ్వే చెప్పావు కదా..?” అన్నాడు.

“ఆ ఎడిక్షన్ వేరు ఇది వేరు..దీంట్లో దిగజారుడుతనం ఉంది. పైగా ఇంటనెట్ సైట్ల వాళ్ళు నీ బలహీనత ఆధారం గా ఎక్స్-ప్లాయిట్ చేస్తున్నారు” అన్నాడు అభి.

“వాడెవడో నన్ను ఎక్స్-ప్లాయిట్ చెయ్యటం ఏమిటి? నాకు ఇష్టమై నేను చూస్తున్నా..నేను ఎంజాయ్ చేస్తున్నా..అయినా దీనికీ తిండి తినటానికీ పెద్ద తేడా ఏముంది? ఆకలైతే తిండి తింటాం..కోరిక కలిగితే బొమ్మలు చూస్తాం” సంజయ్ తిప్పికొట్టాడు.

“ఒరేయ్ అబ్బాయ్..ఆకలేస్తే హాయిగా తిండి తింటాము…అంతేగానీ…తిండిని ఫొటో తీసి దానిని చూసి మనలని మనం ఊరించుకొంటా తృప్తి పడంకదా..నువ్వు చేస్తున్న పని అలాంటిదే..తిండి తినటం అన్నది భౌతికావసరం..కానీ నువ్వు చేస్తున్నదాంట్లో మానసికమైన వ్యసనం చాలా ఉన్నది బాబూ..ఎవరో ఒక అమ్మాయిని చూసుకో..”

“అసలు తిండి దొరకక పోతే ఏమి చేస్తాము మామా..? తిండిని ఫొటోలు తీసి చూసి తృప్తి పడాల్సిందే..నీకైతే ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతూనే ఉంటారు బాబూ..నీ ‘గర్ల్ ఫ్రెండ్శ్ ని రూం కి తెచ్చినప్పుడు నన్ను ప్రకాష్ గాడి రూం కి తోలతావు… మరి నా సంగతి అలా కాదే ఈ ముఖానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పడతారు చెప్పు..?  కాబట్టీ… ఒక్కోసారి తిండి కంటే తినేపదార్ధాల ఫొటోలే బాగుంటాయి..తిండి చేదుగా..వెగటుగా ఉండవచ్చు.ఫొటోలతోఆ బాధ లేదు. ఇది మానసిక జాఢ్యం అంటున్నావు గానీ ఏది మానసిక జాఢ్యం కాదు…? ఇవాళ నెలకి లక్ష జీతం వచ్చేవాడు,ఆ లక్ష జీతం వస్తుండగానే, రెండు లక్షల ఉద్యోగం వస్తుందేమోనని చూస్తాడు. ఆ రెండు లక్షల జీతమిచ్చేఉద్యోగం రాగానే కొంత కాలానికి వాడికి అందులో ఉండే ఆనందం పోతుంది..మళ్ళీ మూడులక్షల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు..అలానే రాజకీయ నాయకుడు…ముందు ఎమెల్యే అవ్వాలనుకుంటాడు…ఎమెల్యే ఐన తరువాత, మంత్రి కాలేదనే బాధ పట్టుకొంటుంది..అంటే వాడు డబ్బుకీ, వీడు పవర్ కీ ఎడిక్ట్ ఐపోయారన్న మాటే కదా..? జీవితం లో ఒక మెట్టు పైకెక్కినప్పుడల్లా వచ్చే కిక్ కి ఎడిక్ట్ ఐపోతున్నారు జనం. జంతువులే నయం. ఆహారం తింటాయి తిన్న తరువాత అది అరిగిపోయి, మళ్ళీ ఆకలి పుడితే గానీ మళ్ళీ ఆహారం గురించి ఆలోచించవు. మనిషికి లక్ష ఉండగానే కోటి కావాలి,కోటి ఉండగానే పది కోట్లు కావాలి…మనిషికున్న ఈ దురాశ వలనే గ్లోబల్ వామింగ్ మొదలయ్యింది………. ”

అభి సంజయ్ కి దండం పెట్టి, “నిన్ను డిస్టర్బ్ చేయనులే నాయనా.. ఇంకొంచెంసేపాగితే బిగ్ బ్యాంగ్ కీ,  పోర్న్ ఎడిక్షన్ కీ ముడిపెట్టేటట్లున్నావు..ఇక చూసుకో…నాకెందుకు..?” అని బెడ్ రూం లోకెళ్ళి పడుకున్నాడు .

%%%%%%%%%%%%%%%%%%%%%%

యంగ్ ఎంటర్-ప్రెన్యూర్స్ మీట్ కి అభిరాం వాళ్ళ బాసుకి పాసులు వచ్చాయి. బాస్ అభి-రాం కి కూడా ఒక పాస్ ఇచ్చాడు. ఆ మీట్ లో నిషా మల్-హోత్రా అని ఓ ముప్పై ఏళ్ళ ఉత్తర భారత సుందరి తత్తర బిత్తర ఏ మాత్రం పడకుండా మాట్లాడింది. ఆమె మాటలూ, ఒళ్ళూ కూడా అభిరాం కి బాగా నచ్చేశాయి. బుర్రలోనూ బుర్రకిందా సరుకున్న వాళ్ళు కొంచెం అరుదు గా తారస పడతారు. అభిరాంకి ఇంతకు ముందు ఒక నలుగురు అమ్మాయిలతో ఐనా సుఖ పరిచయాలున్నాయి. కానీ ఏ అమ్మాయీ అతని గుండె స్పీడు ని ఇంతగా పెంచలా. అభి ఆమె వేదిక కిందికి దిగిన తరువాత వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొన్నాడు.
అభిరాం ఏం మాయ చేశాడో ఏమో తెలియదు గానీ తరువాత సరిగ్గా ఆరు నెలలకి నిషా, సంజయ్ లేని అభిరాం ఫ్లాట్లో మంచమ్మీద అతని చాతి మీది వెంట్రుకలు వేలితో మెలితిప్పుతూ వాళ్ళ బతుకు బిజినెస్ కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసింది. ఆ చర్చల మధ్య లో స్వర్గం అంచులకీ, మళ్ళీ అక్కడి నుంచీ డిస్కషన్ కి మంచం అంచులకీ తిరిగి వచ్చారు వాళ్ళిద్దరూ.
అభిరాం ఆమెకు “పెళ్ళీ చేసుకొందాం” అని ప్రపోజ్ చేశాడు.
నిషా,”తనకి అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదన్నది”, తనకి తన ఇండస్ట్రీ అంటే పాషన్ అంట…దానికే తన సమయం అంతా సరిపోతుందంట…ఆమె ఫ్రెండ్ ఒక ఆడ “సీ ఈ వో” ఉందంట. ఆమె తన పిల్లలను ఆయా కి అప్పచెప్పి, తను ఆఫీసు పనులలో బిజీ గా ఉంటుందట..పిల్లలకి ఆమె ఫ్రెండ్ కంటే ఆయా అంటేనే చనువు ఎక్కువంట.ఆమె భర్త ని అందరిముందూ ఎంతో గౌరవం గానూ, లోపల ఇంట్లోనేమో వాళ్ళ కుక్క టామీ గానూ చూస్తుందట. అతను ఊళ్ళో ఉన్న రెడ్ లైట్ యేరియా లో అప్పుడప్పుడూ సేదతీరుతాడట.  ఏ “సీ ఎన్ బీ సీ టీ వీ” వాళ్ళో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం,”తాను ఒక తల్లి గా,భార్య గా కోడలిగా, ‘సీ ఈ వో’ గా అనేక పాత్రలను తెగ బాలన్స్ చేసినట్లు ఫోజు కొడుతుందట.
తనకు మొదటి ఇష్టం తన కంపెనీ కాబట్టీ, తనకు తన ఆడ ఫ్రెండ్ లా అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదు కాబట్టీ, తను అభిరాం మేలు కోరేది కాబట్టీ, అభి రాం కి తనను పెళ్ళాడవద్దని సలహా ఇస్తుందట.
ఈ సంఘటన జరిగిన ఓ రెండు నెలలకి నిషా కి ఓ బిలియన్ డాలర్లకంపెనీ ఓనర్ కొడుకు తో డెస్టినేషన్ మారేజ్ మాలిబూ లో జరిగింది. దానితో అభిరాం కి పెళ్ళంటే కొంచెం తాత్కాలికం గా విరక్తి   కలిగింది. అయితే మాలిబూ లో నిషా పెళ్ళి కి వెళ్ళి నిషా తో ఆమె భర్తని పరిచయం చేయించుకోవటం మాత్రం మరిచిపోలేదు అభిరాం.
ఓ సంవత్సరానికి, తనున్న కంపెనీకి రాజీనామా చేసి, నిషా భర్త సపోర్ట్ తో తానే ఓ సోలార్ సెల్ లు తయారు చేసే కంపెనీ పెట్టాడు అభిరాం..

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

ప్లేన్ ఒసాకా ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఒసాకా  ఎయిర్ పోర్ట్ సముద్రం లోని దిబ్బ మీద కట్టారు. “జపాన్ వాడి టెక్నాలజీ బాగానే ఉందే…” అనుకొన్నాడు అభీ. తన కంపెనీ కి జపనీస్ పార్ట్ నర్ ని వెతకటం కోసం జపాన్ వచ్చాడు అభి. ఫ్లైట్ నుంచీ బయటకు రాగానే ఒకటే చెమటలు కారసాగాయి. అంతా తేమ గా ఉంది. ఎయిర్ పోర్ట్ బయట ఒక జపనీస్ అతను అభి పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిల్చొన్నాడు. అతను అభి కి గౌరవసూచకం ముందుకు వంగి జపనీస్ పధ్ధతి లో బౌ చేశాడు. అభి చెయ్యి అందించి షేక్ హ్యండ్ ఇచ్చాడు. అతని పేరు యమనకా. అతనికి ఇంగ్లీష్ కూడా వచ్చు. అతను అభీ సంతకం తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్ లో యెన్స్ తెచ్చి పెట్టాడు. బయట లిమోసిన్ కార్ ఉంది . యమనకా డ్రైవ్ చేయసాగాడు. ఎయిర్ పోర్ట్ నుంచీ ట్రెయినూ బస్సూ రెండూ ఉన్నాయి కానీ..ఈ కార్ అయితే అభీ కి కంఫర్టబుల్ గా ఉంటుందని తెచ్చాను అని చెప్పాడు యమనకా సాన్. దారిలో కనిపించిన అపార్ట్మెంట్లలో ఇండియాలో లానే బాల్కనీల లో బట్టలు ఆరేసి ఉన్నాయి.  కారు ‘షి ఒసాకా’ దాటి ‘నిషి నకజిమా’ చేరింది. ఎక్కడ చూసినా ఫు ట్పాత్ లపై వెండింగ్ మెషీన్ లు ఉన్నాయి. జపాన్ లో దొంగతనం, క్రైం అసలు ఉన్నట్లే లేవు. జపాన్ అమ్మాయిలు ఒంటి మీద ఏమాత్రం నూగు వెంట్రులు కూడా  లేకుండా లైఫ్ సైజ్ బొమ్మల్లా కనపడుతున్నారు.
హోటల్ లో రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు అభీ. రెస్ట్ రూం లోని కమ్మోడ్ లు కూడా ఆటోమాటిక్ వి ఉన్నాయి. యమనకా సాన్ “లంచ్ కి  ఇండియన్ రెస్టారెంట్ వెళ్దామా?” అన్నాడు. కానీ అభీ కి కొత్త కొత్త ఫుడ్స్ ట్రై చెయ్యటం ఇష్టం. జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాడు అభి. యమనకా సాన్ దగ్గరే ఉన్న ఒక జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. అది కొంచెం ఖరీదైన రెస్టారెంట్ లానే ఉంది. మన పల్లెలలో ఉండే నేల పీటల కంటే కొంచెం ఎత్తులో పీటలు ఉన్నాయి ఆ రెస్టారెంట్ లో. పీటల మీద కూర్చొని పీటలముందున్న గొయ్యి లోకాళ్ళు పెట్టుకోవాలి. చాలా మంది జపాన్ వాళ్ళ లా కాకుండా, యమనకా సాన్ మంచి మాటకారి. ఎప్పుడూ ఏదో ఒక సమాచారమిస్తూనే ఉంటాడు. మెనూ లో ఐటంస్ ఎడమ  నుంచీ కుడి కి కాక పై నుంచీ కిందికి రాసి ఉన్నాయి.  చాలా ఫిష్ ఐటంస్ ఉన్నాయి. మెనూ లోబీఫ్ కూడా ఉంది. “రెండో ప్రపంచ యుధ్ధానికి ముందు జపాన్ లో బీఫ్ తినేవారు కాదు. కానీ తరువాత ఇక్కడ అమెరికా సైన్యాలు పాగా వేశాయి. వాళ్ళ ప్రభావం తో ఇక్కడ కూడా బీఫ్ అలవాటయ్యింది” అని చెప్పాడు యమనకా సాన్.

“భారతీయ సంస్కృతిమీద కూడా అమెరికా ప్రభావం ఈ మధ్య బాగా పెరుగుతోంది. చాలా మంది ఇండియన్స్ ఇంగ్లీష్ మాటలు లేకుండా తమ తమ భాషలలో మాట్లాడలేరు” అన్నాడు అభీ.
” జపాన్ లోకూడా అంతే…ఇంగ్లీష్ మాట వాడకుండా జపనీస్ మాట్లాడటం క్రమేపీ తగ్గుతోంది.ఇన్ ఫాక్ట్…”జపాన్ “యూ ఎస్” లో యాభై ఒకటవ రాష్ట్రం అయిపోయింది”, అని ఒక జోక్ ప్రచారం లో ఉందిక్కడ.

యమనకా సాన్ అభీ కి సుషీ తినమని సజెస్ట్ చేశాడు. అది చేపా, వరి తో చేసిన ఒక వంటకం. దాని తరువాత పచ్చి చేపని ఆర్డర్ చేశాడు, తరువాత ఆక్టోపస్ సూపు.
యమనకా సాన్ ఒక జపనీస్ కర్రీ పేరు చెప్పి,”అభీ సాన్, దిస్ ఈజ్ ద స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్ అన్నాడు. అభీ ఆ కర్రీ తెప్పించుకొని తిన్నాడు. అది మన పచ్చడి కంటే చాలా తక్కువ కారం గా ఉంది. కానీ యమనకా సాన్ నోరు వెళ్ళ బెట్టి, వెంటనే తన అమెరికన్ భార్య కి ఫోన్ చేసి “జస్ నౌ ఐ హావ్ సీన్ స మాన్ హూ హాస్ ఈటెన్ స స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్” అని జపనీస్ ఆక్సెంట్ లో చెప్పాడు. అతనికి అభీ,”మా ఇండియాకి వస్తే నువ్వు దీనికి పదింతలు కారం తినే వాళ్ళని చూడ వచ్చు”, అని చెప్పాడు.  తర్వాత యమనకా రైస్ నుంచీ తీసిన జపనీస్ బీర్ ని ఆర్డర్ చేశాడు. లంచ్ అయిన తరువాత యమనకా బిల్లు లో తన వాటా మాత్రమే   చెల్లించాడు. జపాన్ లో ఎవరి బిల్లు వారే చెల్లించుతారు మరి.
యమనకా “తినటం తాగటం అయిపోయింది..ఇంకా ఒకటే మిగిలి ఉంది”, అని దగ్గరే ఉన్న ఒక నైట్ క్లబ్ కి అభీ ని తీసుకొని పోయాడు. అక్కడబొమ్మల లాంటి జపనీస్ అమ్మాయిలు అభీ కి విస్కీ పోసి పక్కనే కూర్చొని తాగించారు. యమనకా సాన్ దుబాసీ గా వారి తో కొంచెం మాట్లాడాడు. ఒకమ్మాయి తాను జాగ్రఫీ స్టూడెంట్ ని అని చెప్పింది. వెంటనే అభీ ఆమె ని “ఇండియా పేరు విన్నావా?” అని అడిగాడు.
“ఆఫ్రికా లో ఉంటుంది కదా..?”
ఓహ్ ..ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళీనా ఈ నైట్ క్లబ్బులో ఉండే అమ్మాయిలు ఇలానే ఉంటారు.
వాళ్ళు అభీ కి వాళ్ళ విసిటింగ్ కార్డులిచ్చి” వెళ్ళారు.
యమనకా సాన్,”వీళ్ళందరికీ మసాజ్ పార్లర్లు ఉంటాయి. ఇక్కడ మసాజ్ పార్లర్ ముసుగు లోప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. నీకు ఆసక్తి ఉంటే చెప్పు “,అన్నాడు.

ఆరోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు యమనకా సాన్ తో పాటు ఊరి బయట ఉన్న సోలార్ సెల్ ఫాక్టరీ కి బయలు దేరాడు అభీ. దారి లో వరి పొలాలున్నాయి. యమనకా సాన్ చెప్పిన దాని ప్రకారం వాటి ప్రొడక్టివిటీ ఇండియా పొలాలతో పోల్చితే రెండు రెట్లుంటుంది.
యమనకా సాన్ హఠాత్తు గా “ప్రజలు ఎడ్యుకేటెడ్ అవ్వటం వలన డబ్బులు ఎక్కువ సంపాదించ వచ్చు అంటారు కానీ అది కరెక్ట్ కాదు”,అన్నాడు.
“ఎందుకూ?”
“నేను చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఉండే వాడిని. అప్పుడు హార్వెస్టింగ్ మెషీన్లు ఉండేవి కావు. ఊళ్ళో ధనికులైన రైతుల దగ్గర మిగిలిన వాళ్ళందరూ పని చేసే వారు. కానీ నెమ్మది గా మెషీన్ లు రావటం తో ఊళ్ళోని కుర్రాళ్ళు చాలా మంది ఒకేషనల్ కోర్సు లోచేరి హార్వెస్టింగ్ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. ముందు నేర్చుకొన్న వారికి ఊళ్ళో పని దొరికింది. వారికి జీతాలు కూడా ఎక్కువే ఇచ్చేవారు. కానీ నెమ్మది గా ఊళ్ళో అందరూ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. దానితో లేబర్ సప్లై ఎక్కువై,  డిమాండ్ పడిపోయింది. ఊళ్ళో ఉన్న మొత్తం పొలాలు పరిమితం. కాబట్టీ నెమ్మది గా లేబర్ చార్జీలు మెషీన్లు రాక ముందు కాలానికి పడిపోయాయి.  జపాన్ తొంభైలలో రిసెషన్లోకి వెళ్ళటం వలన పరిస్థితి ఇంకా దిగజారింది. మెషీన్లు రాక ముందు ఊరి అందరికీ తక్కువ జీతాలొచ్చేవి. కానీ ఇప్పుడు ఊళ్ళో పది శాతం మందికి మాత్రమే తక్కువ జీతాలు వస్తున్నాయి. మిగిలిన వారికి పనే లేదు. ఎందుకంటే ఒక హార్వెస్టింగ్ మెషీన్ పదిమది చేసే పని చెయ్యగలదు. ఈ విధం గా మా వ్యవసాయం ఉత్పాదకత పెరిగింది”, అన్నాడు యమనకా సాన్.
“మరి పల్లెటూళ్ళో ఉండే నువ్వు ఈ సోలార్ కపెనీ లో పార్ట్ నర్ గా ఎలా కాగలిగావు” అని అడిగాడు అభి.
“మా నాన్న పల్లెటూళ్ళో ఉండే భూస్వామి. రిసెషన్ టైం లో నేను ఈ కంపెనీ షేర్లు చవక గా కొన్నాను”,అని చెప్పాడు యమనకా.
కారు కొండల గుండా ప్రయాణం సాగించింది..కొండల్లో ఎక్కడికక్కడ చెక్ డాంలు పకడ్బందీ గా కట్టి వాన నీరు వృధా కాకుండా చూస్తున్నారు. చివరికి అభీ ఫ్యాక్టరీ లో చూస్తే టెక్నాలజీ మన దేశం లో కంటే ఓ పదేళ్ళైనా ముందుంటుందనిపించింది. దానితో అగ్రీమెంట్ కుదుర్చుకోవటానికి సిధ్ధమైపోయాడు అభి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
“ఎం ఓయూ” సైన్ చేసిన రాత్రి అభి యమనకా సాన్ తో మసాజ్ అమ్మాయికి ఫోన్ చేయించాడు. ఆ అమ్మాయికి బాగోలేదని ఇంకో అమ్మాయిని పంపిస్తున్నానని చెప్పింది మొదటి అమ్మాయి.
వచ్చిన అమ్మాయి ఇంగ్లీషు కొంచెం బాగానే మాట్లాడుతోంది. ఆ అమ్మాయిని, “నువ్వు చేసే పనికి ఎప్పుడైనా గిల్టీ గా ఫీలయ్యావా?” అని అడిగాడు అభీ.
“గిల్టీ ఎందుకు? సమాజంలో నీ లాంటి వాళ్ళకు మేము సేఫ్టీ వాల్వ్ లాంటి వాళ్ళం..ఐనా ఈ రోజు తప్పైనది రేపు తప్పు కాకపోవచ్చు. అలానే ఇక్కడ తప్పైనది..కొన్ని దేశాలలో తప్పుకాదు…కొన్నాళ్ళకి సెక్స్ కూడా భోజనం చేయటమంత సాధారణం కావచ్చు..”,అంది.
“పరవా లేదే, వీళ్ళకి కూడా, కొంతమందికైనా. బుర్ర ఉంది”, అనుకొని, “నీ దృష్టి లో ఇది తప్పు కాక పోయినా దేవుడి దృష్టి లో ఇది పాపం కదా?” అన్నాడు.

“జపాన్ లోని మెజారిటీ ప్రజలలానే నేను కూడా నాస్తికురాలిని”
“నీది ఏ మతం..?”
“మా అమ్మది బుధ్ధిజం..మ నాన్న ది షింటోయిజం…కానీ నేను బుధ్ధిజాన్ని ఫాలో అవుతాను”
“షింటో ఇజం అంటే..?”
“రాజు ని దేవుని ప్రతినిధి గా భావించే ఒక మతం..నీకు జెన్ గురించి తెలుసా..?” అంది.
“ఎక్కడో విన్నాను కానీ సరిగా తెలియదు..”
“జెన్ అంటే అది ఒక ధ్యానం. ఇది మీ ఇండియా నుంచే వచ్చింది…సంస్కృత శబ్దం ధ్యాన్ నుంచీ వచ్చింది..నేను ఒక జెన్ గురువు దగ్గరకి వెళ్తూ ఉంటాను”
“నీకు అక్కడ ఏమి దొరుకుతుంది?”
“మనశ్శాంతి…”
“అరే … సరిగ్గా నా మనసు లో ఉన్న మాట చెప్పావ్..ఈ మధ్య నాకు మనశ్శాంతి కూడా కావాలనిపిస్తోంది..”
“ఐతే రేపు నాతో పాటు మా గురువు దగ్గరికి రా”

%%%%%%%%%%%%%%%%%%%%%%%%

రామారావు జాబ్ కష్టాలు ఎక్కువ అవ్వసాగాయి. టెన్షన్లు పెరగసాగాయి. యోగా నేర్చుకొంటే టెన్షన్ తగ్గుతుందని ఎవరో చెప్పారు. హైదరాబాదు లో రాజయోగి బాబా గారు  యోగా నేర్పుతారు. ‘టీ వీ’లోనూ కాసెట్లలోనూ చూసి నేర్చుకోవచ్చు గానీ,ఒక తెలిసిన గురువు ఉండటం మంచిదని బాబా గారి క్లాసులకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా గారు ఈ ప్రోగ్రాం తరువాత ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తారు. ఆయన ఈ రెండింటికీ వేరు వేరు గా చార్జ్ చేస్తారు. రాము యోగా క్లాస్ లో మాత్రమే జాయిన్ అయ్యాడు.
యోగా వలన టెన్షన్ తగ్గుతుంది. కానీ అది “అడుగున లీకైన పడవలో నుంచీ నీళ్ళు తోడటం లాంటిది. మళ్ళీ చిల్లు లో నుంచీ నీరు వస్తూనే ఉంటుంది. ఆందోళన చెందే వ్యక్తి యోగా ద్వారా తాత్కాలికం గా తన టెన్షన్ని తగ్గించు కోవచ్చు. కానీ మళ్ళీ ఆందోళన అతని వ్యక్తిత్వం లోని చిల్లు లోంచీ అతని మనసులోకి ప్రవేశిస్తూనే ఉంటుంది.ఒక రోజు రాము క్లాస్  ఐనాక బయటికి వస్తుంటే,కాషాయ వస్త్రాలలో అభిరాం లా ఉన్న వ్యక్తి కనిపించాడు. అభిరాం ని పోలిన వ్యక్తి ఎవరా అని పరిశీలన గా చూస్తే అభిరామే,వేరే ఎవరో కాదు.
తను బాబా గారి ప్రసంగానికి వెళ్తున్నాడట..అంతకుముందు చాలా రోజులనుంచీ బాబా గారిని ఫాలో అవుతున్నాడంట.
“జపాన్ వాళ్ళతో పార్ట్ నర్ షిప్ పెట్టుకున్నాక, నీ కంపెనీకి గవర్నమెంట్ ఆర్డర్లు బాగా వచ్చాయి కదా, మరి అప్పుడే దివాలా తీసిందా ఏమిటి సన్యాసం లో చేరావు?”,రాము పరాచికమాడాడు.
“అదేమీ కాదు..కంపెనీ ని అమ్మేశాను..బాగానే లాభం వచ్చింది.”
అభీ తో ఇదే బాధ… ఎంత లాభం వచ్చిందో చెప్పడు..అంతా గుంభన..అదే రాము ఐతే ఎంత లాభం వచ్చిందో చెప్పే దాకా నిద్రపోడు.
“అయ్యో, నీ కంపెనీ లో ఏదైనా జాబ్ ఇప్పించమని అడుగుదామనుకొన్నానే..మరి ఇంకో కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా?”
“ఈ కంపెనీ ల తో బోర్ కొట్టేసింది.జపాన్ నుంచీ బిజినెస్ పార్ట్ నర్ తో పాటు జెన్ ని కూడా వెంటపెట్టుకొని వచ్చాను. జెన్ గురించి తెలుసుకొన్నాక ఆధ్యాత్మికత అంటే ఇంటరెస్ట్ పెరిగింది.  ఆధ్యాత్మికత లో పడిపోయాను”
“అంటే నువ్వు సంపాదించిన డబ్బంతా జనాలకు దానం చేసే ఆలోచన ఉందా? అలా ఉంటే నాకో కోటి పడెయ్య రా బాబూ..”
“అది చాలా ఇమ్మెచ్యూర్ ఆలోచన. నా డబ్బంతా నీకు రాసిస్తే నీకు సాధించటానికి ఏమీ ఉండదు..అంటే డబ్బు రాక తో పాటే నీకు సుఖాన్ని సాధించే అవకాశం పోయిందన్నమాట “,అని నవ్వాడు అభి.
“నాకు ఇప్పుడు అర్ధమయ్యింది..నీకు డబ్బు లో కిక్ పోయింది…ఆధ్యాత్మికత లో కిక్ వెతుకుకొంటున్నావ్”
అభి ఓ చిరునవ్వు పడేసి,”అంతే అనుకో..” అన్నాడు.
“ఇంతకీ బాబా గారు ఏమి చెప్తాడేమిటి?”
“దేవుడూ…మోక్షమూ..పరమార్ధమూ..ఆధ్యాత్మిక అనుభవమూ.సమాధి స్థితీ..జీవిత పరమార్ధం..బ్లా బ్లా…”,ఇలాంటివి అని “ఏం? నువ్వు కూడా వస్తావా..నా దగ్గర ఒక్ కాంప్లిమెంటరె పాస్ ఉంది”, అని..రాము చేతి లో ఒక చీటీ పెట్టాడు.
“నాది ఓ అమాయకమైన ప్రశ్న, “చిన్నప్పుడు మన ఊళ్ళో పూనకం వచ్చి డొల్లిగింతలు పెట్టే వాళ్ళని చూశాను. వాళ్ళు ఒక ట్రాన్స్ లాంటి స్థితి లో ఉన్నట్లు అనిపించేది. వాళ్ళకు ఏదైనా నార్కోటిక్ ఇచ్చినా అలా ప్రవర్తిస్తారేమో అనిపించేది..అలానే సమాధి స్థితి కూడా ఏదైనా డ్రగ్ ఇస్తే రావచ్చేమో?”
“ఇంత వరకూ కనిపెట్టలేదు..ఇక ముందు రావచ్చేమో…మెదడుకు ఏదైనా ఆపరేషన్ చేసి కూడా ఆ స్థితి కలిగించ వచ్చేమో..””
“అంటే మన బుర్ర బయటి నుంచీ ఏ శక్తీ పని గట్టుకొని,మన అర్హత ని బట్టి ఆ స్థితి కలిగించటం లేదంటావా?”
“బయట ఏదో ఉందనే అనిపిస్తుంది…ఇలాంటి ప్రశ్నలకి బాబా గారు …నేతి..నేతి అని ఒక ఎక్జాంపుల్ చెప్తారు. మన ప్రయత్నం వలన ఆ స్థితి చేరలేమంటారు ఆయన. అంటే మన బయట నుంచీ ఎవరో నడిపిస్తున్నట్లే కదా..”,అన్నాడు అభి.
“ఆ… అలా అనేముంది..మనం రోజూ చేసే పనులలో నే చాలా మన ప్రయత్నం వలన సాధించలేం. నేను ఉన్నపాటున సచిన్ టెండుల్కర్ అయిపోవాలంటే అవ్వగలనా..ఇప్పటికిప్పుడు నిద్రపోవాలంటే వస్తుందా..అలానే కారు నేర్చుకోవటానికి ప్రయత్నం కావాలి…ఒక్కసారి నేర్చుకొన్న తరువాత..మన ప్రమేయం లేకుండానే రిఫ్లెక్స్ తో కరు నడిపేస్తాం..అలా అని ప్రయత్నం నిరుపయోగం అని కాదు.మనంచేరాలన్న స్థితి కి కావలసిన పరిస్థితులను కలిపించుకొన టానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితులను కలిపించుకొంటే మనకు కావలసిన స్థితి అదే వస్తుంది…ఇల్లు కట్టాలంటే మట్ట కొట్టాలి కదా? నేను మనసు తో అదే పని గా ప్రయత్నిస్తాను అంటే ఇల్లు ప్రత్యక్షం కాదు. అలానే ఇప్పటి కిప్పుడు నేను సంతోషం గా అవ్వలంటే కాలేను కదా.. నేను సంతోషం గా ఉండటానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకొంటే సంతోషం అదే వస్తుంది. సంతోషం మనం ఉండే పరిస్థితులకి మన రెస్పాన్స్ మాత్రమే.”
“నాకు ఏపని చేసినా సంతోషం కలగట్లేదు..అలాంటప్పుడు సంతోషమే ఒక లక్ష్యం అవుతుంది, ఇల్లు కట్టటమో..కల్లు తాగటమో కాదు”
“ఇంతకీ ఆ సమాధి స్థితి కి చేరటానికి ఏ పరిస్థితులను కల్పించాలి?” అడిగాడు రామారావు.
“అది ‘కండిషన్ లెస్ స్టేట్’..ఏ పరిస్థితుల వలనా ఆ స్థితి కి చేరలేం”
“ఇది మరీ చోద్యం, అంటే బాబా గారు కేవలం అదృష్టం వలన ఆ స్థితి కి చేరారా? మిగిలిన వారు ఆ స్థితి కి చేరతారో లేదో ఆయనకే తెలియదు..ఇంకా ఈ సమావేశాలు ఎందుకు..ఈ టికెట్లు ఎందుకు? అది సరే… ఈ ప్రపంచం ఎలా పుట్టిందీ…సమయం ఎలా పుట్టిందీ…ప్రపంచం పుట్టకముందు ఏమి ఉందీ..ఇలాంటి ప్రశ్నలకు ఆయన దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా..? నాకు ఇలాంటి విషయాలంటే మా చెడ్డ ఆసక్తి రా”
“ఆయన ఎప్పుడూ సమయం లేని అనుభూతుల గురించి మాట్లాడుతారు..అయినా నీకు ఇంటలెక్ట్యువల్ ఆన్సర్స్ కావాలి..ఆయన ఇచ్చేవి మిస్టికల్ ఆన్సర్స్..”
“ఇంతకీ జీవిత పరమార్ధం ఏమని చెప్పారే బాబా గారు?”
“అది మనిషిని బట్టి మారుతుంది..అందరికీ కామన్ గా ఉండే పరమార్ధం జీవితాన్ని జీవించటమే. బిగ్ పిక్చర్ చూస్తే అంతే మరి. ఎందుకంటే అందరమూ చావవలసిన వాళ్ళమే. చివరికి జీవితం నుంచీ ఏమీ ఆశించలేం. భగవానుడు చెప్పిన నిష్కామ కర్మ కూడా అందుకే” అన్నాడు అభి.
“ఏంటో రా నాయనా, నావన్నీ చిన్న చిన్న కోరికలు..అవి కూడా తీర్చడు భగవంతుడు”.
“నిజం చెప్పాలంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి రా..నీకు ప్రయత్నిచటానికి చాలా మిగిలి ఉంది..ఐనా సక్సెస్ అనేది సబ్జెక్టివ్..నా దృష్టి లో నువ్వే సక్సెస్ ఫుల్..చక్క గా భార్యా పిల్లలతో కాలం గడుపుతున్నావు..నాకు చూడు ఏమి చేసినా సంతోషం రాదు..కాబట్టీ ఒరేయ్ రామూ ‘బీ హాపీ'”, అని  బాబా గారి ప్రసంగం హాల్లోకి దూరాడు అభీ .
రాము బాబా గారి ప్రసంగం పాస్ ‘డస్ట్ బిన్’ లో వేసి, ఇంటి దారి పట్టాడు.

అయిపోయింది

మైనారిటీలకే నా మద్దతు…

మైనారిటీలకే నా మద్దతు…

రిజర్వేషన్లు లేని అగ్రకుల పేదలకూ,
రిజర్వేషన్లు అందని పల్లెటూరి దళితులకూ,
కోడళ్ళ నిరాదరణ కు గురైన ముసలి దంపతులకూ,
గృహహింస చట్టం కింద చిత్రహింస అనుభవిస్తున్న పురుషులకూ,

ఇంట్లో వంటా, ఆఫీస్ లో ఒత్తిడీ తప్పని ఉద్యోగిణులకూ,
నాగరికత దెబ్బకి ఆడంగులౌతున్న మగాళ్ళకూ,
ఇంట్లోకే ప్రవేశించిన వ్యవస్థ వివక్ష కు రోదిస్తున్న మగపిల్లలకూ,
సంఖ్యాబలం లేని సమస్త కులాలకూ ,

తెలంగాణలోని సమైక్య వాదులకూ,
సకల ఉద్యమాల పీడితులకూ,
రాజకీయ సవ్యత పేరుతో నలిగిపోతున్న వర్గాలకూ,
నమ్మకం కోల్పోని, నమ్మకముంచే మనుషులకూ,

ప్రజా స్వామ్యం చేసే మెజారిటీ సంఖ్యల దంధా కి కుములుతున్న జనాలకూ,
న్యాయం పేరుతో చలామణి అవుతున్న అన్యాయాన్ని  ఎదిరించే వాళ్ళకూ,
వ్యాపార విలువలకు వలువలూడ దీసే వాళ్ళకూ,
డబ్బు కి దాసోహం కాని వాళ్ళకూ,

స్వార్ధాన్ని  సామర్ధ్యం గా భ్రమించని వాళ్ళకూ,
కులం కంటే గుణం మంచిదని నమ్మే వాళ్ళకూ,
వేలం వెర్రుల ప్రవాహం లో పడి కొట్టుకుపోని వాళ్ళకూ,
ప్రకృతి ని నాశనం చేసే దిశ లో పోని వాళ్ళకూ,  

మైనారిటీలకే నా మద్దతు…

ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…

ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…
హర్యానా లో ఖాప్ పంచాయితీ లు ఒకే గోత్రం లో వివాహాలకి అడ్డు చెప్తున్నాయి. దీని గురించి సో కాల్డ్ స్త్రీ వాదులూ, “ఎన్ జీ ఓ లూ”, కోర్ట్ లూ చాలా గందర గోళం చేస్తున్నారు.
ఇదే విషయం మన రాష్ట్రం లో తీసుకొంటే, ఒకే కులంలో, ఒకే ఇంటి పేరు లేక గోత్రం కల స్త్రీ పురుషులు వరుసకు అన్నా చెల్లెళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ అవుతారు. మరి అలాంటి వారి మధ్య వివాహ సంబంధాన్ని మనం ఆమోదిస్తామా? ఇప్పుడు ఇలాంటి సంబంధాలను ఆమోదిస్తే తరువాత కుటుంబ వ్యవస్థ గతేమిటి. అప్పుడు ఇన్సెస్ట్ తో కూడిన సంబంధాలను కూడా ఆమోదించవలసి వస్తుంది కదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలేమిటి?

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు

రిచర్డ్ ఫేన్మేన్ ప్రపంచ ప్రసిధ్ధ భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1965 లో భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకొన్నారు.
ఆయన సైన్స్, మతం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి ఆంగ్లం లో. ఇది కొంచెం పెద్ద డాక్యుమెంట్. తీరిక చేసుకొని అప్పూడప్పుడూ చదవ వచ్చు.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ టపాకి ప్రేరణ

సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ
అవి యండమూరి, మల్లాదీ కమర్షియల్ రచయితలు గా కాలమేలుతున్న రోజులు. మా వూరి లైబ్రరీ నుంచీ నేను నవలలూ గట్రా తెచ్చి చదువుతూ ఉండే వాడిని. కొన్నాళ్ళకి కొడవటిగంటి కుటుంబ రావు కథలు చదవటం జరిగింది. ఒక సారి ఆయన కథలు చదివిన తరువాత మళ్ళీ కమర్షియల్ నవలలు ముట్టబుధ్ధికాలేదు. ఇక అప్పటి నుంచీ కొ.కు, రావి శాస్త్రి, బీనా దేవి ల కథలు చదవటం మొదలు పెట్టాను.
మా నాన్న గారు ఒక చిన్న రైతు. ఆయన పెద్ద వాళ్ళు ఆయన విధ్యాభ్యాసాన్ని సపోర్ట్ చెయ్యలేదు. ఆయన స్నేహితులలో చాలా మంది చదివి హాయిగా ఉద్యోగాలు చేసుకొంటుంటే, తాను ఎదుగూ బొదుగూ లేని వ్యవసాయం చేయ వలసి వచ్చిందనేది ఆరోజుల్లో ఆయన బాధ.
నేను కథలూ సాహిత్యమూ చదువుతున్నప్పుడల్లా ఆయన, చూసి,”ఈ కతలూ కాకర కాయలూ అన్నం పెట్టవు. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో” అని చెప్పే వారు.
నేను వెంటనే, “ఇదేమీ చెత్త సాహిత్యం కాదు.ఇది సమాజం లో వాస్తవ పరిస్థితి గురించి చెబుతుంది. చాలా ఆదర్శవంతమైన రచనలు”, అనే వాడిని.
దానికి ఆయన, “అనుభవం మీద చెబుతున్నాను తెలుసుకో. నాకు తెలిసిన వాళ్ళూ చాలా మందే ఈ ఆదర్శాలూ, ఆకులు పట్టుకోవటాలూ అని మట్టిగొట్టుకొని పోయారు. తరువాత ఎందుకు ఆదర్శాల జోలికి పోయామా అని నా దగ్గర బాధ పడిన వాళ్ళున్నారు. కానీ పైకి సమాజం లో మాత్రం చెప్పుకోరు. ఇక పోతే ఆదర్శాలు చెప్పే వాళ్ళ జీవితాలు ఆ ఆదర్శాల ప్రకారం ఉంటాయి అని చెప్పలేం, ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులూంటాయి అని అంటారు కదా! నా స్నేహితుడొకడు ఇప్పుడు ఒక ప్రసిధ్ధ సామాజిక స్పృహ చెప్పే రచయిత. కానీ వాడి అసలు బతుకేమిటో నాకు తెలుసు. కాబట్టీ ఒరే, నువ్వు బుధ్ధిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో..నాకు ఈ మట్టి పిసకటం కొంతన్నా తప్పుతుంది…చివరికి కోటి విద్యలూ కూటి కోసమే. ఆ పైన టైం ఉంటే అప్పుడు ఆదర్శాలూ గట్రా చెప్పే పుస్తకాలు రాసుకో”, అని నాకు ఒక క్లాస్ పీకారు.
నాకు అప్పట్లో మా నాన్న మాటలు ఛాదస్తం గా కనపడినా,ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోక పోతే ఈయన ఊరుకొనేలా లేడు అని ఎలాగొలా చదువు సాగరం ఈదేసి ఒక ఉద్యోగం లో ఇరికేశా. ఈ మధ్య లో నా తో చదువుకున్న వాళ్ళు లో కొంతమంది ఉద్యమాలలోకి వెళ్ళి వ్యక్తిగతం గా నష్టపోయి, దానిని నా దగ్గర వ్యక్త పరచిన వాళ్ళున్నారు.
ఇవన్నీ చూసుకొంటే ఇప్పుడు నేను కొంచెమన్నా ఆర్ధిక ఇబ్బందుల్లో లేకుండా ఉన్నానంటే అది మా నాన్న స్వానుభవం తో వచ్చిన ఇంగితం తో అప్పుడు నన్ను చదువు లోకి తొయ్యటమే కారణం అనిపిస్తుంది. మా నాన్న లానే నాకు కూడా ఇప్పుడు ఎవరైనా ఆదర్శాలు చెప్తే వాళ్ళకి, “బాబూ ముందు నీ సర్వైవల్ గురించి ఆలోచించుకో”, అని చెప్పాలని పిస్తుంది.
మా నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలే నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా?

మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా? ఈ ప్రశ్న లోకి వెళ్ళే ముందు మనం హిపోక్రసీ ని నిర్వచించాలి. “హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం”. “హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం”.
హిపోక్రసీ ని నిర్వచించుతున్నాము కాబట్టీ ఈ నిర్వచనానికి ఉండే పరిమితు గురించి కూడా ఆలోచించుదాం. ఒక మనిషి చెల్లినీ చెలి నీ ఒకే దృష్టి తో చూడ లేడు కదా ఇది హిపోక్రసీ అవుతుందా?  కానే కాదు. పైగా అలా చూడటం పర్వర్షన్ అవుతుంది. కాబట్టీ మానవ సంబంధాలకు ఈ హిపోక్రసీ వర్తించదు. అలానే ఒక వ్యక్తి జీవ హింస తగదు అని చెప్పాడు. కానీ రోజూ అతని శరీరం లో కొన్ని లక్షల కొద్దీ సూక్ష్మ జీవులు చంపబడుతున్నాయి. దీని వలన అతను హిపోక్రాట్ అవుతాడా? హిపోక్రాట్ అనిపించుకోకుండా ఉండటానికి అతను ఆత్మ హత్య చేసుకోవాలా? కాదు, హిపోక్రసీ అనేది వ్యక్తి లో ఉండే మానవ సామాజిక విలువలకు సంబంధించిన విషయం.అలానేచెట్లు నిజాయితీ గా పూలు పూస్తాయి, మేఘం నిజాయితీ గా వర్షిస్తుంది లేక కోయిల నిజాయితీగా పాడుతుంది అనే విషయాలు సరైనవే అవ్వవచ్చును గానీ మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళనవసరం లేదు.

మనిషి వ్యక్తిత్వం అనేది అతని జీవితం లోని పరస్పర విరుధ్ధమైన పరిస్థితుల వలన ప్రభావితం ఔతుంది. కాబట్టీ, మనం మనిషి పరస్పర విరుధ్ధమైన ఆలోచనల ప్రతిరూపం అనే విషయం అంగీకరించాలి. కాబట్టీ మనిషి జీవితంలోని/వ్యక్తిత్వం లోని ఒక అంశం తో పోల్చిచూసినప్పుడు, అతని లో తద్విరుధ్ధమైన ఆలోచనలు, అంశాలు ఉండటం ఒక హిపోక్రసీ లా కనపడుతుంది. కానీ దీనికి అతీతులు చాలా తక్కువ గా ఉంటారు. మనిషి లోఉండే ఏ అంశానికి ఆ అంశం నిజాయితీ గా కనపడుతుంది. కానీ పక్క అంశం తో పాటు కలిపి చూసినప్పుడు ఆ రెండింటి మధ్యా వైరుధ్యా లుంటే అది హిపోక్రసీ.మొత్తం గా ఒక మనిషి జీవితం/వ్యక్తిత్వం సంపూర్ణం గా నిజాయితీ ఐనది అనటం లో అర్ధం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం లో పరస్పర విరుధ్ధ అంశాలు ఎంత తక్కువ గా ఉంటే ఆ వ్యక్తి అంత నిజాయితీ పరుడి గా కనపడతాడు.

శ్రీ శ్రీ ఆవేశం లో నిజాయితీ కనపడుతుంది…అంటే తనకొచ్చిన ఆవేశాన్ని సూటిగానే కవిత్వం రూపం లో వెళ్ళగ్రక్కాడాయన. అలానే ఒక ఆదర్శ లోకాన్ని చూసి, దాని గురించిన తన ఇష్టాన్నీ కవిత్వ రూపం లో చెప్పాడు. ఈ ఇష్టం లోనూ నిజాయితీ ఉంది. “ఆ ఆదర్శ లోకానికి మన వాస్తవ లోకం నుంచీ దారేమిటొ ఆయనకు తెలుసా?” అనేది వేరే ప్రశ్న.
త్రాగుడు దృక్కోణం లో చూసినప్పుడు, శ్రీ శ్రీ తాగుడు లోకూడా నిజాయితీ ఉంది.నిజాయితీ గానే తాగాడాయన. అలానే స్త్రీ లోలత్వం లో కూడా నిజాయితీ ఉంది. స్త్రీ వాంఛ వచ్చినప్పుడు తీర్చుకొన్నాడు. కానీ ఆ కవిత్వాన్ని ఆయన ప్రవర్తన పోల్చినప్పుడు ఆయన జీవితం హిపోక్రసీ అవుతుంది.
కానీ,  ఆయన కవిత్వం లో ఉన్న ఆదర్శాల దృక్కోణం నుంచీ( కవిత్వాన్ని reference point గా  చేసుకొని)  తాగుడుని చూసినప్పుడు  శ్రీ శ్రీ అనే వ్యక్తి హిపోక్రాట్ అవుతాడు.
అదే ఆయన కవిత్వం వలన ఉత్తేజం పొంది సాయుధ పోరాటం లోకి దిగిన వాళ్ళు (శ్రీ శ్రీ గారి ఊగరా ఊగరా కవిత, అలా చనిపోయిన ఒక వ్యక్తి గురించి) ఈ విషయం లో శ్రీ శ్రీ కంటే చాలా తక్కువ హిపోక్రాట్స్ అయిన వ్యక్తులు.  ఆవేశం తెచ్చిపెట్టుకొని కాలిక్యులేటెడ్ గా ఉపన్యాసాలిచ్చే రాజకీయ నాయకులు   శ్రీ శ్రీ కంటే చాలా చాలా పెద్ద హిపోక్రాట్స్.

ఏ ఆదర్శమూ చెప్పకుండా మేము దోపిడీ చేస్తున్నాము అని, అలానే చెప్పినట్లు గా దోపిడీ చేసే వ్యాపారులు తక్కువ హిపోక్రాట్స్ అవ్వవచ్చేమో కానీ, వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం. కాబట్టీ వీరి విషయం లో “హిపోక్రాట్స్ కాకపోవటాన్ని” అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. మనమంతా ఏదో ఒక విషయం లో హిపోక్రాట్స్ మే. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటేతెలుస్తుంది. శ్రీ శ్రీ  హిపోక్రాట్ అవ్వకుండా ఉండటం ఆయనకు మరింత వన్నె తెచ్చేదేమో కానీ, ఆయన హిపొక్రాట్ అవ్వటం వలన ఆయన కవిత్వం లోని నిజాయితీకి ఏమీ మచ్చ లేదు. ఇక ఆయన వ్యక్తిత్వం దగ్గరికి వస్తే, మచ్చ పడనే పడింది.

****************************

చివరి గా……, ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు మనలో అంతస్సంఘర్షణ జరుగుతుంది. మనలోని మంచి వాడు ఆ పని వద్దంటాడు. చెడ్డ వాడు చెయ్యమంటాడు.కానీ బయటి వారి దృష్టి లో నువ్వు ఒక్క మనిషివి. కాబట్టీ నువ్వు అప్పుడు చేసిన చెడ్డపని అంతకు చేసిన మంచి మాట కంటే విరుధ్ధమైనదైతే, బయటి వ్యక్తులు నిన్ను హిపోక్రాట్ అంటారు. కానీ నీకుముందు నుంచీ తెలుసు నీ లోనే మంచి మనిషీ చెడ్డ మనిషీ ఉన్నారని. వాళ్ళు ఇద్దరూ సమయాన్ని బట్టి బయట పడుతున్నారనీ. కాబట్టీ  మన దృష్టి లో మనమే హిపోక్రాట్స్ అవ్వటం చాలా తక్కువ గా జరుగుతుంది. మనం రెండు నాల్కల తో మాట్లాడినా ఆ విషయం మన అంతరాత్మకు తెలుసు. మన ఆలోచనలన్నీ మన అందుబాటులోనే ఉంటాయి కదా.   కాబట్టీ వైరుధ్యం ఉండదు.  ఆలోచనలూ, చేతలూ, ప్రవర్తనా అన్నీ స్వార్థం (Reference point) కోసమే అని తెలిసినప్పుడు వైరుధ్యం పోతుంది కదా..ఇతరులకు అలా కాదు.
మనకు తెలియకుండా మనం హిపోక్రాట్స్ అవ్వవచ్చు గానీ, మనకు తెలిసీ మనం హిపోక్రాట్స్ అవ్వటం(మన దృష్టి లో-Self image) కష్టం.  తాను సమాజందృష్టి లో హిపోక్రాట్నని తెలిసీ తన ఆలోచనలనీ,చేతలనీ, ప్రవర్తన నీ అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకం గా వాడుకొనేవాడిని హిపోక్రాట్ అనాలా వద్దా? అన్నా అనక పోయినా అటువంటివాడి(గిరీశం టైపు?) వలన సమాజానికి నష్టంకాబట్టీ వాడికి సమాజం విలువ ఇవ్వనవసరం లేదు.

***************

నాకు తెలిన ఒక తత్వ వేత్త ప్రకారం మనిషి పనులూ,ఆలోచనలన్నీ తన భౌతిక,మానసిక, ఆధ్యత్మిక, భావోద్వేగ పరమైన స్వార్థం లేక సర్వైవల్ కోసం. కాబట్టీ మనిషి స్వార్థం దృష్టి తో చూస్తే మనిషి పనులలో, ఆలోచనలలో వైరుధ్యమే లేదు. అన్నీ స్వార్థం కోసమే. అంటే స్వార్థం దృష్టితో చూస్తే హిపోక్రసీ లేదా? మనిషి చేసే పనులన్నీ సర్వైవల్ కోసం అనేది కూడా నమ్మబుధ్ధి కాని ఒక అంశం. మనిషి స్వార్థానికి సంబంధం లేని అనేక ర్యాండం పనులు కూడా చేస్తాడెమోనిపిస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న

భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న:

శిష్యుడు: గురువు గారూ కృష్ణ భగవానుడు గీత లో “కర్మల ని ఆచరించు, కానీ ప్రతిఫలం ఆశించకు”,అన్నాడు. ఇదెలా సాధ్యం? నేను క్రికెట్ ఆడతాను. ఆ ఆడటంలోనాకు ఆనందముంది.  కాబట్టీ,రేపు ఏ క్రికెట్ లో ఏ అవార్డో వస్తే నేను ఇంకా సంతోష పడతాను. మనం ప్రయాణం చేసే మార్గం లో నైనా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. లేక పోతే గమ్యం లోనైనా ప్రతిఫలం ఆశిస్తాం కదా!ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏ పని ఐనా మొదలు పెట్టటానికి ప్రేరణ ఏముంటుంది. మనకు నిత్యం బాధ కలిగించే పనిని మనం మొదలు పెట్టం కదా. సంఘాన్ని బాగు చేయ్యటం కోసం ఎన్నో కష్టాలను ఓర్చుకొన్న మహా మహులు కూడా ఆ పని వలన ప్రతిఫలాన్ని ఆత్మ సంతృప్తి రూపం లో పొందుతారు కదా?  కాబట్టీ ప్రతిఫలాపేక్ష లేని కర్మ అనేది మన ఊహలలో మాత్రమే సాధ్యమనుకొంటా గురూ గారూ!”

గురువు: బాబూ! మన ఇంటిలో మొదలూ చివరా అంటూలేని వస్తువు ఏదైనా ఉందా?

శిష్యుడ్డు: లేదు గురూ గారూ! మొదలూ చివరా లేకుండా ఏ భౌతిక వస్తువైనా ఎలా ఉంటుంది?

గురువు: బాగా ఆలోచించు నాయనా..

శిష్యుడు: నా మనసు లోకి ఏమీ రావటంలేదండీ గురువు గారూ!

గురువు: సరే, ఆ పక్క గది లో నీ ఆట వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఒక సారి వెళ్ళి చూసి రా నాయనా, ఏమైనా దొరుకుతాయేమో.

శిష్యుడు: (తన లో…గురువు గారు ఏదో మాయ చేస్తున్నారు..) ఆ ఇదిగో నండీ ఇక్కడ “టెన్నీ కాయిట్” రింగు దొరికినది. దీని చుట్టు కొలత వెంబడి పోతే దీనికి ఆదీ లేదు అంతమూ లేదు. మనం ఏక్క డ ఆది అనుకొంటామో అదే ఆది అవుతుంది..అయినా దీనికీ నిష్కామ కర్మ కీ ఏమి సంబంధం గురువు గారూ…??

గురువు గారు: బాబూ, ఐదు నిమిషాల ముందు “ఆదీ అంతం లేని విషయం అసంభవం” అన్నావు…గది లోకి వెళ్ళి వెతికిన తరువాత ఇప్పుడు ఒక వస్తువు ని కనుగొన్నావు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాహ్య ప్రపంచం ఏమైనా మారిందా?…లేదు కదా…మార్పు నీ మనసు లోనే ఉంది. రింగ్ అప్పుడూ ఉంది..ఇప్పుడూ ఉంది. ఐతే ఇప్పుడు ఆ వస్తువుని చూడటం ద్వారా నీ మనసులో మొదలూ చివరా లేని వస్తువు సంభవించటం పై ఉన్న అపనమ్మకంపోయింది.  అదే విధం గా నిష్కామ కర్మ అనేది ఒక ఊహ మాత్రమే అని నీకు అనిపించటానికి కారణం అలాంటి కర్మ నీకు వ్యక్తి గతం గా అనుభవం లోకి రాక పోవటమే. నిత్యం నీవు ప్రతిఫలం ఆశిస్తూ చేసే పనులలోనే ఏదో ఒక పనిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయగలవు.అది ఏ పని అనేది నీకు వెంటనే తట్టకపోవచ్చును.అయితే ఆ పని  ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు వెతికి చూడాలి. ఒక సారి దానిని నీవు కనుగొన్న తరువాత అది సంభవమేనని నీకు తెలుస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం

తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం.
1. హైదరాబాదు ముఖ్య పట్టణం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. అదేసమయం లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రదేశం గా కూడా కొనసాగుతుంది. ఆంధ్రకు ముఖ్యపట్టణం నిర్మించేందుకు అవకాశం ఇస్తూ, తాత్కాలికం గా పది సంవత్సరాలవరకూ హైదరాబాద్ ఆంధ్ర కు కూడా ముఖ్య పట్టణం గా కొనసాగుతుంది.

2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తరువాత హైదరాబాద్ కు వలస వచ్చిన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంతీయులకు నగర పాలనా సంస్థ ల లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడతాయి.

3.నదీ జలాల గురించిన ఎవరి వాటా ఎంత అనేదాని గురించిన సమగ్రమైన ఒప్పందాలు కుదుర్చుకోబడతాయి. వీటిని ఉల్లంఘించిన పక్షం లో ఉండే  రుసుము లు ముందు గానే నిర్దేశించబడతాయి..

4. హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ లోని పౌర ప్రముఖులతో  కూడిన సద్భావనా సమితి ఏర్పాటు చేయబడుతుంది. దీని లక్ష్యం మామూలు సమయాలలో ఇరు ప్రాంతాల మధ్య సౌహార్ద పూరిత వాతావరణం ఉండేటట్లు చూడటం. ఇరు పక్షాలకూ ఒకరి పై ఇంకొకరికి ఉన్న అనుమానాలను తొలగించటం.ఒక ప్రాంతం వారి దృక్పధాన్ని ఇంకొక ప్రాంతం వారికి అర్ధం అయ్యేవిధం గా చెప్పటం. భవిష్యత్తు లోని వివాదాల (ఉదా: నదీ జలాలు) సమయం లో ఇరు ప్రాంతాల ప్రజలూ న్యాయ పరమైన నిర్ణయాలకు కట్టు బడి ఉండేటట్లు ఒప్పించటం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య స్నేహపూరిత వాతా వరణం కొనసాగేటట్లు చూడటం.  రాజకీయ నాయకులకు దీని లో ప్రవేశం ఉండదు.

4. పది సంవత్సరాల తరువాత ఆంధ్ర ప్రాంతం వారి రాజధాని అన్ని హంగులతో తయారౌతుంది. అప్పటి ప్రజాభిప్రాయం సమైక్య రాష్ట్రాన్ని కోరుతుందా లేక వేర్వేరు రాష్ట్రాల కొన సాగింపును కోరుతుందా అనే విషయాన్ని పౌర సద్భావనా సంస్థ ద్వారా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగటం.ఒక వేళ ప్రజలు సమైక్య రాష్ట్రన్ని కోరుకొంటే కొత్తగా ఏర్పరచిన రాజధాని, మహరాష్ట్ర కు నాగపూర్ లా, సమైక్య రాష్ట్రానికి రెండవ రాజధాని అవుతుంది.ఈ రాజధాని అయ్యే ఖర్చు, ఈ పరిష్కారాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఈ పది సంవత్సరాల తరువాతి సమీక్ష వలన, ఇరవైకి పైగా ఉన్న ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ల ను తెలంగాణ డిమాండ్ తో ప్రస్తుతానికి  వేరు చేసి చూప వచ్చు. ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఈ విధమైన సమీక్షకు సిధ్ధం గా ఉండక పోవచ్చు. దీని వలన దేశ సమగ్రత కు చిన్న రాష్ట్ర డిమాండ్ ల వలన ముప్పు ఏర్పడుతుందేమోనన్న భయాన్ని తగ్గించ వచ్చు.  .రెండు మూడు జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరేవాళ్ళు, మళ్ళీ కలిసిపోవటం అనే ఆలోచనకు అనుకూలం గా ఉండరు. ఈ విధం గా తెలంగాణ లేక ఆంధ్ర ను ఇంకా చిన్న రాష్ట్రాలు గా విభజించాలి అనేవారిని కూడా నిలువరించవచ్చు. 

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

Spiritual speculation- Natural,Artificial and Time

What is natural and what is unnatural? According to a theory, everything made by man is unnatural. Man being a product of nature, how can man-made objects be unnatural. But at the same time, if we think the deeds of man as natural, everything made by man including nuclear bomb, robots and rockets become natural.

Man does some natural actions like eating , sex etc. They are instinct driven. But some of his actions are driven by his higher self. His so-called free will takes action.Probably, the actions of man where deliberate thought process is involved,could be considered as artificial.
Is there something unknowable to man? Could the man know the cause of everything in the universe at all times and places.

Could he discover all the laws required to predict all the events in the universe always, past,present and future?

Suppose a closed container containing ten oxygen atoms and nothing else. By knowing the “velocity and direction of the atoms,the temperature of the chamber”, and by knowing the kinetic/thermodynamic laws that guide the atoms, one will be able to predict the position of the all the ten oxygen atoms at a given time.

In a similar fashion by knowing the causes,effects and all the laws governing the universe, will man be able to predict thefuture of the universe. In such a situation will man, by the cause and effect analysis, not be able to predict future,the thoughts in the minds of men in future? By knowing all causes in the universe,and then by doing a cause and effect analysis,at a higher plane he will know the future inventions to be made by future scientists at a lower level.This obviates the need for scientific inquiry by scientists at a lower level.

By knowing all the causes and effects in the universe man may be able to predict the future. But he will not be able to walk into future and be in future. He and his world is carried in a stream called time.

If we see at a microscopic subatomic level effect can never be separated from cause. Cause and effect are two sides of the same coin. Extending this logic to the universe and thinking the universe as a chain of causes and effects, all the chain of actions in the universe are not separate. They are one and the same.

Consider a film. If the role is played in the projector, the events in the movie are played in sequence.If the film role is reversed, the sequence of movie events will be reversed. If we take the film out from the projector and cut it into multiple parts and put them side by side in a room, then the sequence is lost. We could see all the events in the movie at one instance.There’s no sequences and no time,no earlier, no later of the movie.Everything is there at the moment spread all over.Do mystics experience a similar thing when they say they have gone beyond time?, or when they say time has collapsed.

There’s a problem with the analogy. The entire world is in the film role called time. There’s nothing ouside the film role. So we are part of the film role. Being part of the film role called time we’ll never be able to see the other parts of the film rome at a single moment.

Is time like a train that always goes in one direction? Are we like passengers in the sensory world called train coach? Is our consciousness like the only window in the coach though which we see the scenery out side.What ever we could see through the window is the present? Is there a similar train running in the opposite direction? If a man jumps from one train to the opposite train will he be able to reach the station that he has already seen in the previous train. In how many directions do these trains run? Is it possible to stand on the nearby hill and at once have a panoramic view of all these trains and the scenery they are showing?

There are a few differences of time with train analogy.

In the case of time there’s nothing in this world that’s outside time. So the entire world should be inside the train coach.There is no scenary out there. So, there is no station to be returned back to. The station and outside of the train simply does not exist.

Man and his intellect are unimaginably minuscule part of this universe.He is one of the trillions and zillions of possibilities in the universe. He has come from the universe. Is it possible for him to grasp and control the entire universe from with in the universe? Man is not standing on a pedestal apart from the universe. He is part of the universe and his mental and physical faculties are results of some very tiny set of reactions inside the universe. The question here is “Can the hair of its tail eat the lion?”. To put it in another way, “Can the tail wag the dog?”

The end

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

Spiritual Speculation- Spirituality and society

A number of buffalos gathered on the banks of the river. Some of them were drinking water. Some were grazing. A leopard jumped from a bush and all the buffalos dispersed in fear. The leopard targeted a buffalo and was chasing it. Another buffalo from the herd came and attacked the leopard. The leopard fell down. All the buffalos in the herd followed suit and started attacking leopard with their horns. The leopard gathered it’s wits and ran away quickly.

********

Man was initially part of the nature. Like animals he was mating with in blood relatives and parents and kids. As his memory and consciousness developed he remembered his maternal feelings while raising his kids. He could not overcome those maternal feelings later and that was the beginning of familial relations. Society was formed from the nature and it’s culture separated man from nature. Slowly the modernity has set in and now man is being separated from society into an individual. How is the mystical experience of a person useful to the collective good of a society? If the mystical experience could not make a man’s character flawless (What qualifies for a flaw is a different question) it is of not much use to the society. The mystical experience can not give food to a hungry man. If a person is flawless then it does not matter if the society is capitalistic or socialistic. But that is not the reality. So political leaders have to still struggle to bring up a social model, assuming man is not perfect. The social leaders like reformers should still try to create the education system that keeps on rectifying the flaws in a man. But if the fundamental selfish nature of a man is not changed (might be due to some random mutation), whatever the system be, it is susceptible to collapse. How should a man take the mystic experiences.? I think despite the existence of the experiences he should continue to perform his duties. That is what Bhagavad-Gita says.The pupose of life is to live it in the context handed over to us.

…to continue

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

Spiritual Speculation- Supernatural powers

The paddy fields are vast. They are dotted on the peripheries with Palmyra trees and Casuarina. It is a scorching summer. But the kids know no summer. It’s a vacation time for them.Ignoring the reproaches from their parents they have started into the fields. One of them knows climbing the Palmyra trees. They zero in on a Palmyra tree. They debate if the tender Palmyra will be worthy of eating since they looked a bit off-color. He climbs and cut the bunches of Palmyras. They fall all around. The children feast on the kernels of the tender Palmyras and then move on to the next tree.Now they almost know about the quality of the tender Palmyras on this tree.

********

Many people including spiritual men are said to posses supernatural powers. According to Ko.Ku a Telugu writer, the ancient men used to posses these powers. But as man’s thinking power developed, these supernatural powers became defunct. So these powers were all natural once upon a time. Because of the current context, they look supernatural. Some of these powers are harmless. The spiritual healing, magnetic attraction are some harmless powers. Some are potentially harmful if they fall into the hands of selfish people. If a person knows future, assume a stock speculator using his powers to manipulate the market. Similarly reading other’s thoughts could be dangerous. But these powers seem not in control of the persons who posses them. Now they show these powers and tomorrow the powers are gone. If the person who possesses these powers is selfish, they pose danger to the world. The fact that “so far no such danger has materialized” indicates that either these powers are not in control of the person in which they exist or they materialize only in selfless saintly people. One can only get what is there in this world. So, these powers need not be mystified and should not be connected to the heavenly things. Scientists should investigate and find out the reasons behind these powers with open mind. Mystical philosophers make sweeping statements about the nature of thought and self. The statements of many such people look ridiculous in the light of subsequent scientific findings. God is there in details. So scientists and academic philosophers should collaborate and conduct experiments that go into the nitty-gritty of the claims and statements of spiritual men. All thought in not junk. If we think about our understanding about the nature before scientific and physical discoveries, the picture becomes clear.Despite all it’s shortcomings of being just in the realm of ideas, research in physics has resulted in better understanding of the world around us.

…to continue

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ఆ ప్రాంతంవాళ్ళే..

ఆ ప్రాంతంవాళ్ళే..
సినిమాలు ఆ ప్రాంతం వాళ్ళవే..
పత్రికలూ వాళ్ళవే..
పరిశ్రమలూ అక్కడివాళ్ళవే..
సరైన భాష వాళ్ళదే..
రాజకీయాల్లో వాళ్ళదే ఆధిపత్యం..
ఉద్యొగాల్లో వాళ్ళే ముందు….
సాహిత్యంలో చాలా మంది ఉన్నారక్కడ..

మా ప్రాంతం వాళ్ళూ ముందుపడ్డారు..కానీ..
మాప్రాంతం వాళ్ళకంటే
ఇన్ని విషయాలలో ముందున్నందుకు..
వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలి..
అన్నీ సక్రమం గా చేస్తే అసలు ముందెందుకు ఉంటారు?
అక్రమాలు చేసే ఉంటారు.
కాబట్టీ వాళ్ళు చెంపలేసుకొని ఒప్పేసుకోవాలి
“ముందు పడటం మేము చెసిన పాపం,
మా తాతలూ, మా నాయకులూ చాలా అక్రమాలు చేసినట్లు ఉన్నారు,
మమ్మల్ని క్షమించండి” అని.

సంపాడించారంటే దోచుకొనే ఉంటారు..
కాబట్టీ వాళ్ళు దోచిందంతా ప్రభుత్వం మాకు దోచిపెట్టాలి..

మా ప్రాంతం వాళ్ళూ దోచిఉంటారు.
కానీ అది పట్టించుకోవలసిన అవసరం లేదు..
వాళ్ళు ఎక్కువ దోచినట్లున్నారు..
ఐనా మా వాడిని మేందోపిడీ చేశాడని ఎలా అంటాం..
అయినా…మమ్మల్ని మా వాళ్ళు మాత్రమే దోపిడీ చేయాలి..
వాళ్ళెవరు దొపిడీ చేయటానికి..?
“ఈ వాళ్ళూ మేమూ అనుకోవటానికి” కూడా వాళ్ళే కారణం..

కాబట్టీ ఈ దోపిడీదార్లని అంతం చెయ్యండి..దోపిడీని కాదు..
ఎందుకంటే మావాళ్ళు తరవాత దోపిడీ చెయ్యాలి కదా..?
ఆ ప్రాంతం వాళ్ళని బయటికి తరమండి..
ప్రాంతీయ స్పృహ మాకే ఉంటుంది…వాళ్ళకెందుకుంటుంది…

అందుకే వాళ్ళు మా ప్రాంతానికి వచ్చారు..
కానీ మేము వాళ్ళ ప్రాంతానికి వెళ్ళామా..?
ఇక్కడి చెడుకంతా వాళ్ళే కారణం ఆ ప్రాంతం వాళ్ళే..
వాళ్ళని నరకండి..ఆపై అంతా గొప్పగా ఉంటుంది.
ఇంతకీ వాళ్ళు ఎవరో అర్ధం కాలా…మధ్య తీరాంధ్రులు..వెధవలు.

తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావం

ఒక భాష మీద ఇంకొక భాష ప్రభావం సమాన హొదా లొ కలిగితే ఫరవాలేదు. అది ఆహ్వానించ తగ్గదే.  తెలుగుమీద కన్నడం ప్రభావం, అలానే కన్నడం మీద తెలుగు ప్రభావం అలాంటిదే.  ఇది ఇచ్చి పుచ్చుకునే పద్దతి. కానీ ఇంగ్లీష్ మాత్రం తెలుగుని ప్రభావితం చెస్తోంది. తెలుగు ఇంగ్లీషు ని ప్రభావితం చెయటం లేదు కదా? ఇంగ్లీషు కున్న ఈ హోదా రాజకీయ ఆర్ధిక అధికారానికి సంబంధిచినది. ప్రపంచీకరణ వల్ల అది  మరింత వేగవంతం అవుతొంది.
గత రెండు వేల ఏళ్ళ లో లేని సాంస్కృతిక ప్రపంచీకరణ  ఈనాడు మీడియా వలన జరుగుతొంది.  కాబట్టి ఈ రెండు వేల ఏల్ల లొ జరగని దుర్ఘటన (తెలుగు అంతరించి పోవటం)  ఇప్పుడు జరుగుతుందేమోనని నా భయం.  అది జరగక పొతే నేను చాలా సంతొషిస్తాను.
తెలుగు మీద ఇంగ్లీషు ప్రభావాన్ని మీరు సమర్ధిస్తారా?

తెలంగాణా అర్జెంట్ గా ఇవ్వాల్సిందే- ఆంధ్రోడు

తెలంగాణా ఉద్యమానికి కారణం వెనకబాటుతనం కాదని తెలంగాణా వాదులు ఒప్పుకొని ఇప్పుడు ఆత్మగౌరవం కోసం అంటున్నారు. కానీ ఇది ఆత్మ గౌరవం కోసం కూడా కాడు. దీనికి రూట్ కాజ్ ఆంధ్రులంటే కొందరు తెలంగాణా వారికి ఉన్న అసూయా ద్వేషాలలో ఉంటే, దానికి ఆజ్యం పోసింది రాజకీయ నాయకుల అధికార కాంక్ష.
ఒక ఆంధ్ర వాడిగా నాకనిపించేది ఏమిటంటే, “తెలంగాణా అర్జెంట్ గా ఇవ్వాల్సిందే. కానీ హైదరాబాద్ లేకుండా”
తెలంగాణా అత్మ గౌరవానికీ హైదరాబాద్ కీ ఏమిటి సంబంధం? తెలంగాణా సంస్కృతి వేరు,హైదరాబాద్ సంస్కృతి వేరు, హైదరాబాద్ లో ఉన్న నిజాం తెహ్జీబ్ వేరు. తెలంగాణా భాష వేరు, హైదరాబాద్ భాష వేరు. తెలంగాణా పల్లెలలో ఉండే రాములు కీ హైద్రాబాద్ లో ఉండే మియ మొహిఉద్దీన్ కీ సంబంధం ఎక్కడ? తెలంగాణా ప్రజలు ఆత్మ గౌరవం కోసం పొరాడే వారైతే..హైదరాబాద్ వారికీ ఇజ్జత్ ఉంటుంది. కాబట్టీ వెంటనే హైదరాబాద్ లో రిఫరెండం పెట్టి ప్రత్యేక హైదరాబాద్ ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం నుంచీ జనాలందరూ హైదరాబాద్ కి వలస వచ్చి అక్కడి స్వచ్చమైన నిజాం సంస్కృతి ని నాశనం చేశారు….ఇక పై ఇది చెల్లదు..ప్రత్యేక హైదరాబాద్ కావాలి.

ఏది సరైన తెలుగు?

ఏది సరైన తెలుగు?
సీ పీ బ్రౌన్ ప్రకారం తెలుగు ఒక ద్రావిడ భాష. ప్రాచీన తమిళం స్థానిక పదాల తో కలిసి రూపాంతరం చెంది తెలుగు గా ఏర్పడింది. ఆ తెలుగు లో, తమిళం లో లా, ఇరవై అరు అక్షరాలు మాత్రమే ఉండేవి. వత్తులు (ఖ, భ, ఛ వగైరా లు ఉండేవి కాదు). ఆ భాష లో సంస్కృత పదాలు లేవు. అది అచ్చ తెలుగు. సరైన తెలుగు. కానీ ఆ తెలుగు ను ఇప్పుడు మనం మాట్లాడ లేము సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడటం ఊహించుకోండి..చాలా కష్టం!!
తరువాతి దశ, అచ్చ తెలుగు సంస్కృతం తో మిళితమవ్వటం వలన నచ్చింది. ఇందు లో స్థూలం గా రెండు రకాలు. ఒకటి మధ్య కోస్తా బ్రాహ్మణులు మాట్లాడే తెలుగు (ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు మాట్లాడేతెలుగూ..గోదావరి బ్రాహ్మణుల తెలుగూ..ఎట్ సెట్రా  వీటిని సింప్లిసిటీ కోసం ప్రస్థుతానికి వదిలేద్దాం). ఇదీ గ్రాంధిక తెలుగు ఇంచుమించు ఒకే రకం గా ఉంటాయి. ఇందులో సంస్కృతాధారమైన వత్తులన్నీ పాటించబడతాయి. పాత సినిమా ల లో ని తెలుగూ ఇదే. ఇక రెండొది సామాన్య జనాల తెలుగు. దీని యాస ప్రాంతాన్ని బట్టీ కులాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. అయితే వీటన్నిట్లో ఉమ్మడి లక్షణం వత్తులు పలకకపోవటం. సంస్కృఅత పదాలు రూపాంతరం చెందటం తమిళ జనాభా “ఈ స్థితి లో ఉన్న తమిళాన్ని వారి భాష గా అంగీకరించింది”. అందుకే తమిళంలో వత్తులుండవ్. పరుషాలు తక్కువ. కానీ రూపాంతరం చెందిన సంస్కృఅత పదాలు చాలానే ఉంటాయి.
మధ్య కోస్తాంధ్రుల తెలుగు మీద ఇతర భాషల ప్రభావం తక్కువ (ఒక్క సంస్కృతం మినహా). భౌగోళికం గా వారు తెలుగు ప్రాంతాం నడి బొడ్డు లో ఉండటం వలన కావచ్చు. అందు వలన గ్రాంధిక తెలుగు కి అది మిగిలిన తెలుగు ల కంటే దగ్గరి గా ఉంటుంది. ఐతే ఇందులో బ్రహ్మణులు మాట్లాడే తెలుగే ప్రామాణికమైనది గా గుర్తించటమైనది. దీనికి కారణం వారే పుస్తకాలు ఎక్కువగా రాయటం వలన కావచ్చు.  తమిళం విషయం లో సంస్కృతం కలిసిన వత్తులూ పరుషాలూ లేని భాష ని ప్రామాణికం గా గుర్తించారు. దీని లో సంస్కృతం తక్కువా…తమిళం ఎక్కువా..అదే తెలుగు విషయం లో సంస్కృతం ఎక్కువా అచ్చ తెలుగు తక్కువ. తమిలం విషయం లో మదురై ప్రాంతం లో మాట్లాడేతమిళాన్ని ప్రామాణికం గా గుర్తించారు. అలానే కన్నడం లో మైసూరు కన్నడం ప్రామాణికం గా గుర్తించారు.
మరి తెలుగు విషయం లో ఎవరి ఆధిపత్యం లేకుండాలంటే అచ్చ తెలుగు ను ప్రామాణికం గా గుర్తించాలి. కానీ అచ్చతెలుగు లో ఇప్పుడు మనమెవరమూ మాట్లాడలేం. మధ్య కోస్తాంధ తెలుగు ప్రామాణికమైనది అనుకొంటేమిగతా వారికి కోపం వస్తూంది.
ఇక్కడ ఒక విషయం మధ్య కోస్తాంధ్ర తెలుగు ను ప్రామాణికం గా గుర్తించినంత మాత్రాన అది వారి ఆధిపత్యాన్ని మిగిలిన వారు అంగీకరిఉంచినట్లు కాదు. చారిత్రిక, భౌ గోళిక కారణాల వ కారణాల వలన మాత్రమే అలాజరిగింది. దీనిని మధ్య కోస్తాంధ్ర వాళ్ళూమిగిలిన వాళ్ళూ గుర్తెరగి ప్రవర్తించాలి. ఐతే ఇది చాలా కష్టం. ఒక మనిషిని నీ సంస్కృఅతి గొప్పది, నీ వంశం గొప్పది, నీ తాతలు వీరాగ్రేసరులు, నీ పుట్టుక మేలిమి అని..ఆపైన “నీ చరిత్రా..నీ పుట్టుకా..నీ ప్రతిభా ఇవేమీ నీ చేతిలోలేవు. అవి నీకు వారసత్వం గా అన్నా వచ్చాయి లేక పరిస్థితుల ప్రభావం వలన వచ్చాయి. కాబట్టీ నువ్వు నీ నేపధ్యం గురించి గర్వ పడరాదు. అలా గర్వ పడితే నీ తోటి వాళ్ళకి సహజం గానే నీ పైన అసూయా ద్వేషాలు కలుగు తాయి” అనటం కూడా సరియైనది కాదు. ఒక వేళ ఎవరైనా అలా అంటే, ఆ వ్యక్తి పైకి మాత్రం వినయం గా నటించి..లోలోన అందుకు విరుధ్ధం గా ప్రవర్తిస్తాడు.
కాభట్టీ ఒకరి భాష ప్రామాణికమంటే వేరొకరికి కోపం వస్తుంది. అన్ని భాషలనూ యాసలనూ ప్రామాణికం గా గుర్తించటం వీలు పడుతుందా అనేది ఆలోచించాలి.
ప్రామాణిక తెలుగు లో ఇంగ్లీషు పదాల స్థానం ఏమిటి అనేదు ఇంకొక ప్రశ్న..దాని గురించి తరువాత…

ఈ కథ లో ఒక లోపం ఉంది..ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!

ఈ కథ లో ఒక లోపం ఉంది అది ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!

బాగుపడిన మనుషులు…కథ……………………

కొత్తగా కట్టిన వంతెన పక్క బస్సు దిగి, ఎడమ వైపుకి నడవ సాగాడు రామారావు. రేవు మీది నుంచీ తేమ గాలి సాగింది. సులాబీ దిగితే అన్నీపూల మొక్కల నర్సరీలే.  హైదరాబాదు మురికి వాయువులు అలవాటైన రామారావు కి, మొక్కల గాలి తగిలి ప్రాణం లేచి వచ్చింది. ఆ గాలికి, మనసుకూ ఇంద్రియాలకూ శరీరానికీ ఒక స్వస్థత చేకూరుతుంది. అతని మనసు చుట్టూ ఉన్న వాతావరణానికి అంతకుముందులేని సున్నితత్వంతో స్పందించసాగింది.
నీటిపారుదల శాఖ బంగళాలనూ వాటి ముందున్న ఫిరంగిబొమ్మనీ దాటుకొని, పాడుబడిన ఎత్తిపోతల పధకాన్ని దాటుకొని, ముందుకు వెళ్తే వచ్చింది  చిన్నప్పటి బడి. అతను వెంటనే బడి లోనికి వెళ్ళకుండా కాసేపు చుట్టూ కలియ తిరిగాడు. బడి పక్కనే కరకట్ట. దాని అవతల కృష్ణమ్మ, తెల్లటి ఇసుక మధ్య మధ్య న సన్న సన్నటి నీటి పాయలతో, చిక్కి శల్యమైపోయింది. పైన, అక్కడక్కడా ఉన్న మబ్బులకి రేవు లో కొంత ఇసుక చలవ గా సేదతీరుతోంటే, మరికొంత వేడి గా మెరుస్తోంది.స్కూలు మునుపటిలాలేదు..చాలా మార్పు వచ్చింది.. స్కూలు మెయిన్ బిల్డింగ్ పక్కన అదనం గా రెండు భవనాలు వచ్చాయి. పిల్లలు మాత్రం తక్కువ గా కనపడుతున్నారు. గ్రౌండ్ లో