డర్టీ పిక్చర్, సిల్క్ స్మిత జీవితం,స్త్రీ వాదం, ..కొన్ని ప్రశ్నలూ సమాధానాలు

ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. అది మానవ జాతి అంత పాతది.కాకపోతే మన సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు.
నేను నా ఫ్రెండ్ ఒకతనిని తో సినిమాల లో సెక్స్ గురించి వాపోతుంటే, అతను “మనం చేసే టప్పుడు లేని తప్పు ఎవరో చూపిస్తుంటే ఏమిటి? ఇది హిపోక్రసీ నే కదా?”, అన్నాడు.
అతని వాదన నాకు మరీ సింప్లిస్టిక్ గా అనిపించి, “హిపోక్రసీ అనేది సామాజిక విలువల కి  మాత్రమే వర్తిస్తుంది. మనం నాలుగు గోడల మధ్యా చేసే  పనులకి కాదు”, అని చెప్పబోయాను కానీ నా వాదన కి నేనే కన్విన్స్ కాలేదు.
“నెట్లో బూతు సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షక సామాన్యానికి సినిమాల లో ని బూతు ని గురించి ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిది?”, అని కూడా అతను అన్నాడు.
నేను, “నిర్మాతలు ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకొంటున్నారు..”, అన్నాను.
“నెట్లో ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి..అయినా నువ్వు నీ అభిమాన హీరో చేసే డాన్సులూ, ఫైట్లూ చూసి ఆనందిస్తావు. ఎవరైనా అది నీ బలహీనత అంటే నువ్వు ఒప్పుకొంటావా? నీ అభిమాన దర్శకుడు తీసిన సినిమా ని నువ్వు ఆనందిస్తావు.అది నీ బలహీనత కాదు. అలానే నీ అభిమాన తార గుడ్డలిప్పి చూపిస్తే నువ్వు ఆనందిస్తావు. ఇది కూడా నీ బలహీనత కాదు”,అన్నాడు.

ఈ మధ్యే ఏదో హిందీ సినిమా లో ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిన నగ్న కళా విదుషీమణి ని ఒక బుధ్ధిలేని విలేఖరి, “మీ సినిమా లో అసభ్యత ఎక్కువయింది అంటున్నారు..?”, అని ప్రశ్నిస్తే ఆమె, “అసభ్యత అనేది చూసే వారి కళ్ళలోనే ఉంటుంది”, అని దబాయించింది.

కొంత మంది నటీమణులు పాత్రస్వభావాన్ని బట్టి ఎక్స్-పోజింగ్ చేస్తున్నామనీ, తాము నిజజీవితం లో పతివ్రతలమనీ చెబుతారు!నిజ జీవితం లో, “లో దుస్తులు” బయటికి కనపడితేనే సిగ్గుతో చితికిపోయే వారు, పాత్రాపరం గా ఎక్స్-పోజింగ్ ఎలా చేయగలరు?ఒక పాత్ర ఎక్స్-పోజింగ్ చేయాలంటే దానిని పోషించే అసలు మనిషి కూడా ఎక్స్-పోజింగ్ చేయాలి కదా!అలానే ఆ వ్యక్తి ఎక్స్-పోజింగ్ ని సినిమా సెట్లోని ఇతర పాత్రల వెనుక ఉండే అసలు మనుషులూ,, టెక్నీషియన్లూ చివరికి ప్రేక్షకుల వెనుక ఉండే అసలు మనుషులూ చూస్తారు కదా?  ఒక్క డబ్బు కోసం పాత్రా పరమైన వెధవపనులు చేస్తున్నారంటే, వారు నిజ జీవితం లో కూడా ఇతర ప్రలోభాలకు లొంగి అలాంటి పనులు చేయగలరన్న మాట! ఒక పాత్ర యొక్క దుష్ట స్వభావాన్ని  ఆవాహన చేసుకొని నటించటం వేరు. దానికోసం అసలు మనిషి దుష్టుడు గా మారనవసరం లేదు. నిజ జీవితం లో చెడు పనులు చేయనవసరం లేదు. రావు గోపాల రావు,సూర్యకాంతం వంటి వారు సినిమాలలో దుష్ట పాత్రలు వేసినప్పటికినీ నిజ జీవితం లో సాత్వికులుగానే ప్రసిధ్ధి చెందారు. 

మానసిక స్థాయి లో అంతర్గతం గా మనలో ప్రతి ఒక్కరి లోనూ అనేక మంచీ చెడూ పాత్రలు ఉంటాయి. నటుడు సందర్భాను సారం గా తన లోని ఈ పాత్రలను ముందుకు తీసుకొని వచ్చి అభినయిస్తాడు.
అంతర్గతంగా ఉన్న మంచి పాత్రను బాహ్యం గా నిజ జీవితం లో మనం పోషించలేక పోవచ్చు, మన వ్యక్తిగత మనుగడ వంటి విషయాలు అడ్డు రావటం వలన. అలానే ,అంతర్గతం గా ఉన్న చెడు పాత్రని నిజ జీవితం లో మనం పోషించలేము. అలా పోషిస్తే పక్క వాడు మనకి దేహశుధ్ధి చేసి పోలీస్ కేస్ పెడతాడు కాబట్టీ. నిజ జీవితం లో మన బాహ్య వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం లో మన ఆచరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఎక్స్-పోజింగ్ అనే భౌతిక మైన పని నిజం గానూ, పాత్రాపరం గానూ ఒకేసారి జరిగిపోతుంది. రెండిటినీ వేరు చేసి చూడలేము. కానీ వ్యక్తిత్వాన్ని అభినయించటం మానసికమైన పరిధిలోనిది. వేరే వ్యక్తిత్వాన్ని అభినయించి, మళ్ళీ కాసేపటికి తన నిజ జీవితం లో అసలు వ్యక్తి గా అవ్వవచ్చు.
మా  చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ  అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను.
దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది.

ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది. 
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని  నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ.  ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి. 
ఇక సిల్క్ స్మిత అమలాపురం దగ్గర ఒక పల్లె నుంచీ పొట్టచేత పట్టుకొని మద్రాస్ చేరి, సినిమాలలో శృంగార పాత్రలు వేసి గడుపుకొంది. పాపం, ఏ కష్టమొచ్చిందో ఏమో, ఆత్మహత్య చేసుకొంది. ఆమె శృంగార పాత్రలు తన అవసరాన్ని బట్టి వేసి ఉండవచ్చు. తన కడుపు కోసంకొన్ని అక్రమ సంబంధాలలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. కానీ ఆమె జీవితం లో కనిపించేది దయనీయత మాత్రమే. శృంగారం ఏ మాత్రం కాదు.

 అటువంటి సిల్క్ స్మిత జీవితం లోకి శృంగారాన్ని జొప్పించి డబ్బు చేసుకోవాలనుకొనే ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే. కాబట్టీ ధన జాఢ్యానికి లింగ వివక్ష లేదు. ఇది అన్ని తరగతులకీ సమానం గా వర్తిస్తుంది.
మధ్య తరగతినే తీసుకొందాం.టీ వీ ల లో అసభ్య దృశ్యాలు వచ్చినపుడు, “ఛీ.. ఛీ.. వీళ్ళకి అసలు విలువలే లేవు” అనుకోవటం చాలా సులువు. కానీ మన విలువలు వదిలి పెడితే మనకు డబ్బు వచ్చిపడుతున్నపుడు, మనం ఈ విలువల వలువలను వదిలి డబ్బు ఇచ్చిన కొత్త వలువలు వేసుకోవటానికి ఏమాత్రం సందేహించం.  ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విప్పి చూపించిన విద్యా బాలన్ గారు మధ్య తరగతి నుంచే వచ్చారు.  ఈమె స్టూడియో లో చేసిన ఎక్స్పోజింగ్ చూడలేక ఈమె నాన్న గారు స్టూడియో బయటికి వచ్చి కారులో కూర్చొన్నారంట. ఆహా…! ఏమి మధ్య తరగతి విలువలూ ఎంత హిపోక్రసీ..? హిపోక్రసీ లేనిది ఒకటే ..అది డబ్బు..కాసుకు లోకం దాసోహం.. !

మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు..కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం! పోనీలే.., సిల్క్ స్మిత జీవితం ఏదైనా, ఈ సినిమా వలన బాలాజీ పిక్చర్స్ లో పని చేసే వారికి కొంత కాలం కడుపైనా నిండుతుంది అని సరి పెట్టుకొందాం!

25 thoughts on “డర్టీ పిక్చర్, సిల్క్ స్మిత జీవితం,స్త్రీ వాదం, ..కొన్ని ప్రశ్నలూ సమాధానాలు”

  1. బొందలపాటి గారు వ్రాసారు
    >>>>>
    మా చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను.
    దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది.
    >>>>>
    సినిమాలలో అర్థ నగ్నంగా నటించేది పేద స్త్రీలు కాదు, డబ్బున్న స్త్రీలే.
    http://radicalfeminism.stalin-mao.net.in/73768341
    నాకు తెలిసి పేద స్త్రీలకి సినిమాలలో అవకాశాలు ఇచ్చిన సందర్భాలు లేవు.

    మెచ్చుకోండి

  2. సినిమాల వలన తమ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకుండా వృధ్ధిలోకొచ్చిన మధ్యతరగతి స్త్రీలు చాలా అరుదు. నాకు తెలిసినంత లో ఒక భానుమతి గారు కనిపిస్తున్నారు. సుహాసినీ, రేవతీ వంటి వారు కూడానేమో..తెలియదు.

    మెచ్చుకోండి

  3. నాకు తెలిసి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సినిమా హీరోయిన్ షావుకారు జానకి. ఆవిడ భర్త నిరుద్యోగి కావడం వల్ల సినిమాలలోకి వచ్చారు. తరువాత అదే ఆవిడ వృత్తి అయ్యింది. సుహాసిని చారు హాసన్ కూతురు కదా. ఆవిడ మధ్య తరగతి స్త్రీ కాదేమో.

    మెచ్చుకోండి

  4. *ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు *

    సినేమావాళ్లది తప్పు ఎలా అవుతుంది? ఆడవారికి తమ అందానికి తగిన గుర్తింపు కావాలను కొంటారు. అందానిని మెరుగు పరచి, ప్రదర్శించటానికి మొదటినుంచి వారికి ఇష్ట్టం. ఈ మధ్య కాలంలో యాడ్ ఏజేన్సి వారు ఆడవారి ఈ ఆసక్తిని సొమ్ము చేసుకొవటం మొదలు పెట్టారు. ఒక్కపుడు యాడ్స్ వర్తమాన సంస్కృతికన్నా అడ్వాన్సేడ్ గా ఉండేది. సుస్మితా,ఐశ్వర్యా రాయ్ మొద|| వారి వలన సినేమాలకి యాడ్స్ ల కి సంస్కృతికి మధ్య అంతరం తొలగిపొయింది. ఎప్పుడైతే మోడల్స్ హీరోయిన్ గా చేయటం మొదలుపెట్టారో దానిని సినేమా వారు ఉపయోగించుకొన్నారు. అందువలన సినేమా వారిది తప్పు లేదు. ఇక చాలామంది హీరొయిన్ ల అమ్మలకి డబ్బు పిచ్చి ఉంట్టుంది , మొగుడిని కొంపలో పెట్టి ప్రతి షూటింగ్ కి వీరు తయారౌతారు. ఈ హిరోయిన్లు చిన్న వయసులో సినేమాలోకి వస్తారు. ఆ వయసులో వారికి తల్లే లోకం కనుక ఆమేమాటని విని నటిస్తూఉంటారు. తండ్రి పాత్ర ప్రాముఖ్యత పక్కకు నెట్టి వేయబడుతుంది. మీరు చెప్పిన హీరోయిన్ నాయనకు కూతురు నటించటం ఇష్ట్టం లేదు. అయినా అతని మాట వినకుండా తల్లిగారు సినేమాలోకి అక్కకు తోడూగా తీసుకొచ్చారు. ఆడవారికి మనం అనుకున్నంత అభ్యంతరాలు పెద్దగా ఉండవని పిస్తుంది. ముఖ్యంగా వారికి అడాప్టబిలిటి ఎక్కువ, అవకాశాలను అందిపుచ్చుకొని అతి త్వరగా మారిపోతారు.

    * కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?*

    మరి ఈ మధ్య సిటిలోని మాల్స్ లో వచ్చేవారు, ఊరక నే ఎక్స్-పోజింగ్ చేస్తున్నరుకదా? దానిని ఏమంటారు?

    మెచ్చుకోండి

  5. “ముఖ్యంగా వారికి అడాప్టబిలిటి ఎక్కువ, అవకాశాలను అందిపుచ్చుకొని అతి త్వరగా మారిపోతారు.”
    True..not much exposure to the big picture. So, no ideological hangovers.

    “మరి ఈ మధ్య సిటిలోని మాల్స్ లో వచ్చేవారు, ఊరక నే ఎక్స్-పోజింగ్ చేస్తున్నరుకదా? దానిని ఏమంటారు?”

    అందం చూడవయా..ఆనందించవయా.. అంటాను. 🙂 🙂
    నేను నా బ్లాగ్ కి హిట్ రేట్ పెంచుకోవటం కోసం చూస్తున్నట్లే, వారు వారి ఫిగర్ కి హిట్ రేట్ పెంచుకోవటం కోసం చూస్తున్నారు. (కాకపోతే హిట్ అయిన వాళ్ళలో అందరినీ యాక్సెప్ట్ చేయరనుకోండి.).నా రాతల వలన నాకు నాలుగు రాళ్ళు వస్తే అప్పుడు హిట్ రేట్ గురించి పట్టించుకోను.ఎన్ని డబ్బులు వస్తున్నాయా..! అని వచ్చే డబ్బులు లెక్క పెట్టుకొంటాను. ఆడ వాళ్ళూ అంతే!

    మెచ్చుకోండి

  6. అసలు విషయానికొస్తే సిల్క్ స్మిత జీవితంపై సినిమా తియ్యడమే అనవసరమనుకుంటాను. చిత్తూరు జిల్లాకి చెందిన లంబాడీ కులానికి చెందిన స్త్రీలకి ఇష్టం లేకపోయినా పేదరికం వల్ల వాళ్ళ భర్తలు, తండ్రులే వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దింపుతారు. సిల్క్ స్మిత కూడా ఇష్టం లేకపోయినా పేదరికం వల్ల బూతు సినిమాలలో నటించింది, అంతే. చిత్తూరు లంబాడీ స్త్రీల జీవితాల మీదో, యాదగిరిగుట్ట దొమ్మరి స్త్రీల జీవితాల మీదో సినిమా తీస్తే అది కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వదు. సిల్క్ స్మిత మీద పత్రికల్లో వ్రాయబడిన మసాలా వార్తలు చాలా ఉన్నాయి కాబట్టి ఆమె మీద సినిమా తీస్తే కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందనుకుని తీస్తున్నారు, అంతే. బూతు పత్రికలలో వ్రాయబడే మసాలా వార్తలని నమ్మే అమాయక జనం ఉన్నంత వరకు వాళ్ళ బలహీనతలని సొమ్ము చేసుకునే ఎడిటర్లు ఉంటారు, ఆ మసాలా వార్తలు ఆధారంగా చేసుకుని సినిమాలు నిర్మించే ఏక్తా కపూర్ లాంటి సిగ్గులేనివాళ్ళూ ఉంటారు.

    మెచ్చుకోండి

  7. సీరియస్ రాతలు కనిపించే కొద్ది బ్లాగ్స్ లో మీది ఒకటి. మీ అభిప్రాయాలతో నేను ఎకిభవించవచ్చు, యేకిభ వించక పోవచ్చు … కానీ బాగా రాస్తున్నారు

    మెచ్చుకోండి

  8. “మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు..కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం!”

    Soft ware varu Heart ware ani pincharu !!
    Really Touching Sir !!

    ?!

    మెచ్చుకోండి

  9. చూసే కళ్ళలో ఉంటుంది అశ్లీలత.. ఒక నటి తప్పో, పాపమో చేసినట్టు ఎందుకు ఫీల్ అవాలి?.. తన భర్తకి తనకి మధ్య నిజాయితీ గల సంబంధం ఉందో లేదో మాత్రమే ఆ నటి యొక్క పాతివ్రత్యానికి గీటురాయి.. మీలా వ్రాసే వాళ్ళు ఇలా వెనకడుకు ఎందుకు వేస్తారు అని అనాలనిపించినా.. మీరు ఇంకా ఆ గోడల నుంచి బయటకు రాలేదని పిస్తోంది…

    మెచ్చుకోండి

  10. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి.
    సినిమా వాళ్ళు డబ్బు కోసం చూపిస్తారు. వాళ్ళు చూపించకుండా చూసే వాడి మదిలోకి అశ్లీలత ఎలా వస్తుంది. చూసే వాడు సినిమా హాల్లో కూర్చొని ప్రొజెక్టర్ ఆడకపోయినా తనకు తనే ఆ నటిని గురించి అశ్లీలం గా ఊహించుకోలేదు కదా?
    ఇక పాతివ్రత్యం గురించి..ఒక మామూలు కుటుంబ స్త్రీని తీసుకోండి. ఆమె తన ఇంటికి వచ్చిన వేరే మగాడికి అన్నీ విప్పి చూపించింది అనుకొందాం. దాని వలన ఆమె భర్త ఏమీ ఫీల్ కావటం లేదూ అంటే, వారి ఇద్దరి నైతిక విలువల స్థాయి ఒకటే అన్నమాట. వారిమానాన వారిని వదిలేద్దాం.
    ఇది మగాడికీ వర్తిస్తుంది.మగాడు వేరే అమ్మాయి తో సరసాలు ఆడుతున్నా, భార్య సహిస్తోందంటే, వారి జీవితం. వారి ఇద్దరి సంబంధం. మనకి అనవసరం. కాకపోతే సమాజం లో అనేక పురాణ మూర్తులు పాటించిన పతీ/పత్నీ వ్రత స్టాండర్డ్స్ ను వారు ఆచరించ లేక పోయారు అని మాత్రం గుర్తుంచుకోవాలి.
    ఇక సినిమా లో ఎక్స్పోజింగ్ చేసే వారు , స్త్రీలయినా మగవారయినా, (విద్యా బాలన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా)వ్యక్తులు గా కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లే. అది వాళ్ళ ప్రొఫెషన్ అంటారా? వేశ్యలది కూడా వాళ్ళ ప్రొఫెషనే. తారలు చేసేది అంతకంటే కొంచెం తేలిక పాటి వ్యభిచారమే! కాకపోతే వేశ్యలది లీగల్ కాదు అంతే తేడా! ఈ విషయాన్ని తారలు ఒప్పుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు. అలాకాకుండా మేము గొప్ప గౌరవప్రదమైన నటులము . మేము వేశ్యలకంటే గొప్పవాళ్ళము అన్నప్పుడు వాళ్ళని సహించకూడదు.
    కొత్త విలువలు (ముందడుగు?) convenient కాబట్టీ, వాటిగురించి విమర్శనాత్మకం గా ఆలోచించకుండానే, మీరు వాటిని తలకెత్తుకొంటున్నారేమో, కొంచెం ఆలోచించండి.

    మెచ్చుకోండి

  11. *కొత్త విలువలు (ముందడుగు?) convenient కాబట్టీ*

    విలువలలో కొత్తదనమేమి ఉంది?

    * కాకపోతే సమాజం లో అనేక పురాణ మూర్తులు పాటించిన పతీ/పత్నీ వ్రత స్టాండర్డ్స్ ను వారు ఆచరించ లేక పోయారు అని మాత్రం గుర్తుంచుకోవాలి.*

    అదేకాదు ఇటువంటి వారు సమాజం గౌరవించే వ్యక్తులకు సలహాలు ఇవ్వటం, పబ్లిసిటి కోసం విమర్శించడం మానుకోవాలి. అది చేయకుండా వారిని వారు సమాజం లో భాగమైనట్టు, సమాజ విలువలు పాటిస్తున్నట్టు గా భావించుకొవటం, వారి మాటలతో అందరిని భ్రమింప చేయటం వారికి ఏమాత్రం తగదు. వీరు చేసిన వ్యాఖ్యలను మీడీయా వారు ఉద్దేశాపూర్వకం గా ప్రాముఖ్యత నిచ్చి అసలి విషయం తప్పు దోవపట్టిచటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన అన్నా హాజారే ఉద్యమసందర్భంగా అన్నా గురించి షారుఖ్ ఖాన్ అభిప్రాయం అడాగటం, అతను ఇలా అన్నాడు, అలా అన్నాడు అని వీరు పేపర్లో రాయటం మొద|| వాటిని ఆపాలి. నిరాహారదీక్ష మొదలు పెట్టక మునుపు , అన్నా హజారే గారి గురించి దేశంలో చాలా మందికి తెలియదు, అటువంటీది ఆయాన నిరాహారదీక్ష అనటం వీరు వెంటనే షారుఖ్ ఖాన్ అభిప్రాయం అడగటం. వాడు కట్టే విరగకుండా పాము చావకుండాఅ సమాధాన చెప్పటం. అటువంటి వార్తలను విన్నపుడు, చదివి నపుడు చాలా హస్యాస్పదం గా అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ సంవత్సరం లో ఇండియాలో కన్నా ఎక్కువగా యురోప్, అమేరికాలలో ఉంటాడని పేపర్లో చదివాను.

    మెచ్చుకోండి

  12. మీరు కర్రా విరగ కుండా పాము చావకుండా అంటే గుర్తుకు వచ్చింది…మన తెలుగు సినిమా జనాలు ఎంత దద్దమ్మ లో, కోట్లకు కోట్లు సంపాదించి కూడా వాళ్ళు ఎంత పిరికిగా, బలహీనం గా ఉంటారో, వాళ్ళ ఆస్థుల/పైసల చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తారో తెలంగాణ విషయం లో రుజువయింది. సినిమా వాళ్ళలో అధిక భాగం సమైక్యం కావాలనుకొనే వారే. కానీ దానిని సమర్ధిస్తూ ఒక్క మాట కానీ, ఒక్క సినిమా కానీ తీయలేక పోయారు. ఏ అరవై ల నుంచో సినిమాలు ఒక సామాజిక కళ అవ్వటం మానేశాయి. మార్వాడీ వాడు చేసే వడ్డీ వ్యాపారం, సినిమా వ్యాపారం కంటే గొప్పది. అందుకే “ఏ edit వంటి వారో డయాస్ ఎక్కి, “కళాకారుడూ, కళా అంటూ మొదలుపెడితే, చెప్పుతీసుకొని కొట్టాలనిపిస్తుంది” . ఫక్తు వ్యాపారవేత్తలైన ఇలాంటి వారికీ, వీళ్ళ పిల్లలకీ కళ గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళని సుమ లాంటి బట్రాజు యాంకర్లు కన్వీనియంట్ మసాజ్ ప్రశ్నలు వేయటం (ఏమో తరవాత ఏమి అవకాశం ఇస్తారో అని), చానల్ వాడు చూపించటం (వీళ్ళ సినిమా యాడ్ ల కోసం) చాలా అసహ్యమైన పనులు. వాళ్ళ వాళ్ళ పరస్పర లాభాల కోసం నిస్సహాయుడైన ప్రేక్షకుడిని బలిచేయటం..
    వీరు చేసే వెకిలి డాన్సులకీ, లేకి వేషాలకి, వీరికి రాజ్యసభ టిక్కెట్లూ, పదవులూ అవార్డ్లూ.జనాలు సినిమాలను చూడటం తగ్గించి వీరిని సీరియస్ గా తీసుకోవటం మానేయాలి. అప్పుడు డబ్బులు తగ్గి, పాపులారిటీ తగ్గి, రాజకీయులు కూడా వీరిని పట్టించుకోవటం మానేస్తారు.

    మెచ్చుకోండి

  13. Bondalapati garu,

    ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది.
    ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ. ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి.
    The kind of women you mentioned are far from feminists. They are using “feminism” as an excuse for their raunch culture. In fact, these women can be called “gender males”. They are biologically female but from a gender perspective they are males. In our patriarchal society, they are as equally oppressive to the women as the biological males. They have the luxury of the time , money and resources to look as sexually appealing as they can to the men, which in turn encourages the stereotyping and “commoditizing” of women.

    ఇక సినిమా లో ఎక్స్పోజింగ్ చేసే వారు , స్త్రీలయినా మగవారయినా, (విద్యా బాలన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా)వ్యక్తులు గా కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లే. అది వాళ్ళ ప్రొఫెషన్ అంటారా? వేశ్యలది కూడా వాళ్ళ ప్రొఫెషనే. తారలు చేసేది అంతకంటే కొంచెం తేలిక పాటి వ్యభిచారమే! కాకపోతే వేశ్యలది లీగల్ కాదు అంతే తేడా! ఈ విషయాన్ని తారలు ఒప్పుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు. అలాకాకుండా మేము గొప్ప గౌరవప్రదమైన నటులము . మేము వేశ్యలకంటే గొప్పవాళ్ళము అన్నప్పుడు వాళ్ళని సహించకూడదు.
    Prostitutes are the victims of the male dominated society. The movie actors, like the ones you mentioned above, are not the victims. They are the ones who benefit from the patriarchal society in many ways. I sympathize with the prostitutes but not the “lipstick” feminists.

    మెచ్చుకోండి

  14. సినిమా అనేది రొమాంటిక్ ప్రపంచమే కానీ వాస్తవిక ప్రపంచం ఎన్నడూ కాదు. కోస్తా ఆంధ్రలో భోగం (కళావంతుల) కులానికి చెందిన స్త్రీలు, తెలంగాణా & రాయలసీమలలో దొమ్మరి, లంబాడీ కులాలకి చెందిన స్త్రీలు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల బలవంతాన వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు. వీళ్ళ కన్నీటి జీవితాల మీద సినిమా తీస్తే అది కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వదు. సిల్క్ స్మిత మీద బూతు పత్రికలలో మసాలా వార్తలు చాలా వచ్చాయి కాబట్టి సిల్క్ స్మిత మీద సినిమా తీస్తే అది కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందనుకున్నారు.

    అయితే డర్టీ పిక్చర్ మా పట్టణంలో ఎక్కువ రోజులు ఆడలేదు. అలాంటి సినిమాలకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి కుటుంబ సభ్యులని తీసుకెళ్ళకుండా వెళ్ళినవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం స్థానిక థియేటర్ యజమాని ఆ సినిమా వేసి ఉంటాడు. అయినా ఆడదాని శరీర అవయవాలని చూపించి డబ్బులు సంపాదించడం ఏ రకంగానూ గొప్ప కాదులే. ఇలాంటి వృత్తులలో ప్రొడక్టివిటీ అనేది ఉండదు అని మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు.

    వ్యభిచారం గురించి అలెక్సాండ్రా కొల్లొంటాయ్ వ్రాసిన వ్యాసం చదివాను. డబ్బుల కోసం తన శరీరాన్ని మగవాడికి అర్పించడం వ్యభిచారం అవుతుంది. అయితే సినిమా నటి ఎక్స్‌పోజింగ్ ద్వారా తన శరీరాన్ని ఇన్‌డైరెక్ట్‌గా లక్షల మందికి అర్పిస్తుంది. బావ-బావమరిది అయినా, తండ్రి-కొడుకు అయినా కలిసి సినిమాకి వెళ్తే వాళ్ళు ఒకే అమ్మాయి శరీర అవయవాలని కలిసి చూడాల్సి వస్తుంది. డబ్బుల కోసం ఒళ్ళు చూపించడమే తప్పు అనుకుంటే బంధువులతో కలిసి చూసేవాళ్ళకి చూపించడం ఇంకా తప్పు అనుకోవాలి కదా. ఈ లాజిక్ ప్రకారం చూస్తే సినిమా నటులు సాధారణ వ్యభిచారులు కాదు, ఇన్సెస్ట్యుయస్ ప్రాస్టిట్యూట్స్ అనుకోవాలి.

    మెచ్చుకోండి

  15. బొందలపాటి గారు, మీరు వ్యభిచారం చట్ట వ్యతిరేకం కానీ బూతు ప్రదర్శనలు ఇవ్వడం చట్టబద్ధం అనీ, అదే ఇక్కడ తేడా అనీ వ్రాసారు.

    అయితే పల్లెటూర్లలో రికార్డింగ్ డాన్స్‌లు చేసేవాళ్ళనీ, దేవాలయం దగ్గర భోగం మేళం డాన్స్‌లు చేసేవాళ్ళనీ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ సినిమా నటులని అరెస్ట్ చేసిన సందర్భాలు ఎందుకు లేవు? పల్లెటూర్లలో చేస్తే చట్ట వ్యతిరేకం, పట్టణాలలో థియేటర్లలో ప్రదర్శిస్తే చట్టబద్దం అనీ అనుకోవాలా?

    సినిమావాళ్ళకి కోట్లు వ్యాపారం అవుతుంది కాబట్టి సినిమావాళ్ళని అరెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టం అనుకున్నారా? రికార్డింగ్ డాన్స్‌లలోనూ, భోగం మేళాలలోనూ డాన్స్‌లు చేసేవాళ్ళు కేవలం పొట్టకూటి కోసం ఆ పని చేస్తారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే కోట్ల నష్టమేమీ రాదనుకుంటున్నారా మన పోలీసులు?

    ఎవరు ఎలా అనుకున్నా “మన దేశంలో చట్టం ముందు సమానత్వం (Equality before law) అనేది లేదు” అనేది నిజం.

    మెచ్చుకోండి

  16. ప్రవీణ్ మీది చాలా సబబైన పాయింట్. ఇన్నాళ్ళ మీ కామెంట్స్ చూసిన తరువాత, ఇప్పటికి మీరు ఒక మంచి చర్చనీయమైన పాయింట్ చెప్పారు. మన సమాజ స్వరూపాన్ని తెలియచెప్పే పాయింట్!

    మెచ్చుకోండి

  17. /*They are biologically female but from a gender perspective they are males.*/
    It seems you are personalizing the definition of “what is female” and “feminism”. I think the issue is “women will slowly loose the traditional feminine attitude to sexuality in the coming days”. The causes..1. The new found independence/power(there by lack of insecurity) and the consequent missing of emotional link to sex. 2. Contraceptives 3. Inherent desire for the sensual pleasure irrespective of sexes. So, finally the differences between male and female attitudes to sexuality will be minimized. It’s possible even in a feminist world.
    Still they continue to differ from men in the form of stimulation (visual for men, verbal for women) because of irreconcilable genetic differences.

    /*Prostitutes are the victims of the male dominated society.*/
    When families are created, then prostitution is also created as a by product.
    If male domination ends then also prostitutes will be present.Some needy females are always ready to sell their body.The problem is with economics (capitalism?), rather than with male domination. As the females gain ascendance (deviate from their traditional gender roles), male prostitutes will increase.
    /*I sympathize with the prostitutes but not the “lipstick” feminists.*/
    Me too

    మెచ్చుకోండి

  18. బూతు సంస్కృతి తప్పు కాదు అనుకుంటే భూస్వామి భార్య లేదా కూతురు కూడా భోగం మేళంలో డాన్స్ చెయ్యొచ్చు. కేవలం పూట గడవని పాలేరు కూతురికి మాత్రమే ఆ అవకాశం ఎందుకు ఉండాలి?

    ఇక్కడ కొంత మంది ఇలా ప్రశ్న అడుగుతారు “బ్యాంక్ మేనేజర్ తన కొడుకుని చప్రాసీ (ఆఫీస్ అటెండర్) ఉద్యోగానికి పంపడానికి ఒప్పుకోనప్పుడు భూస్వామి తన కూతురిని భోగం మేళంలో డాన్స్ చెయ్యించడానికి ఎలా ఒప్పుకుంటాడు?” అని. అలాంటి ప్రశ్నలు పనికిరావు. ఎందుకంటే చప్రాసీని ఎవరూ చెడిపోయినవానిగా చూడరు. భోగం మేళాలలో డాన్స్‌లు చేసేవాళ్ళని మాత్రం చెడిపోయినవాళ్ళుగా చూస్తారు. వృత్తిని బట్టి ఇచ్చే గౌరవం ఉన్నా, లేకపోయినా ఇలాగే జరుగుతుంది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  19. ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్త్రీవాదం గురించి కాదు కానీ దళితవాదం & ప్రాంతీయ అస్తిత్వవాదాల గురించి: http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html

    ఇది స్త్రీవాదులకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పురుషాధిక్యతకి సంబంధించిన icons అయిన మంగళసూత్రాలు లాంటివి ఉండకూడదని ఇంతకు ముందు ఒక పత్రికలో చర్చ జరిగింది. కాకపోతే ఈ విగ్రహాలు అనేవి large icons. అదే ఇక్కడ తేడా. ఆ చర్చ నేరుగా స్త్రీవాదానికి సంబంధించినది కాకపోయినా స్త్రీవాదులకి కూడా ఉపయోగపడుతుందని లింక్ ఇచ్చాను.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి