మన రాజకీయ నాయకులను సమర్ధిస్తూ..

In praise of politicians
In praise of politicians

రాజకీయ నాయకులు నిజ జీవితం లో జరిగే సంఘటనలకు ఆలోచించుకొనే వ్యవధి లేకుండా వెంటనే ప్రతిస్పందించాలి. రాజకీయ నాయకుడు కావటానికి రిస్క్ తీసుకొనే మనస్థత్వం తో పాటు, ఒత్తిడి కి లోనవ్వకుండా ఉండటం చాలా అవసరం. ప్రత్యర్ధులు చేసే ఆరోపణలు ఎదుర్కొనటానికి కొంత తోలు మందం కూడా అవసరం.ఏదైనా దుర్ఘటన జరిగినపుడు మిగిలిన జనాలంతా తమ కడుపు లో చల్ల కదల కుండా ఇంట్లో టీవీ ల ముందు కూర్చుంటే, రాజకీయ నాయకుడు సంఘటనా స్థలానికి వెళ్ళి జనాలకి ధైర్యం కలిగించాల్సి ఉంటుంది.

ఇంట్లో కూర్చొని ఒక కథ రాయటానికి కొంత తెలివి కావాలి. చదరంగం ఆడటానికి దీనికంటే కొంచెం ఎక్కువ తెలివే కావాలి. ఎందుకంటే చెస్ ఆడటానికి స్పాంటేనిటీ కావాలి. కథ రాసేటప్పటి లా తీరిక గా కూర్చొని ఆలోచించుకొని రాస్తానంటే కుదరదు. అంతే కాక ప్రత్యర్ధి ఎప్పుడూ మన ఎత్తులకు  పై ఎత్తులు వేస్తూనే ఉంటాడు. అతనిని ఓడించే విధం గా మనం ఆలోచించాలి. రాజకీయాలకు చెస్ ఆడే టప్పటి కన్నా చురుకైన తెలివి కావాలి. ఎందుకంటే ఇక్కడ సమాజం లోని అనేక పరిమితులకి లోబడి ఎత్తులు వేయాలి. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణం గా మాట్లాడాలి.

మనం ఆఫీసు క్యాంటీన్ లో కబుర్లు చెప్పుకొనేటప్పుడూ, స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడే టప్పుడూ, “దేశాన్ని రాజకీయ నాయకులు ఎంతగా దోచేస్తున్నారో!”, అని వాపోవచ్చు. కానీ మనలో చాలా మంది మన మన పరిధులలో రాజకీయ నాయకులమే! మనం గృహ రాజకీయాలు చేస్తాం. ఆఫీసు రాజకీయాలు చేస్తాం. ఆదర్శాల గురించి మాట్లాడే రచయితలూ, ప్రజలను బ్రతికించాల్సిన డాక్టర్లూ వారి వారి పరిధులలో రాజకీయాలు చేసే వారే. అన్ని వృత్తులలానే, మానవ స్వభావం నుంచే రాజకీయాలు పుట్టాయి.ప్రపంచం లో అన్ని వృత్తుల వారూ రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు తమ వృత్తే అయిన రాజకీయాలు చేయటం లో తప్పేముంది?
మనలో,ఆఫీసులలో మెడికల్ అలవెన్స్ కి దొంగ బిల్లులు పెట్టని వారు ఎంత మంది? ఇల్లు అమ్మే లావాదేవీ లలో నల్ల ధనం తీసుకోని వారు ఎంత మంది? సమాజం మొత్తం అవినీతి మయమైనపుడు, కొంత లాభదాయకమైన పదవులలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా చేతులు ముడుచుకొని కూర్చొంటారు? మనలో చాలా మంది ఆ పదవులలో ఉంటే, అంత కంటే అవినీతి పరులయ్యే వారు. రాజకీయుల అక్రమ సంపాదన గురించిన మన ఆగ్రహం లో అసూయ పాలు ఎంతో, మనం ఆత్మ విమర్శ చేసుకొంటే తెలుస్తుంది.మనం చేసే అవినీతి, మనకున్న పరిమితమైన పరిధి వలన ప్రాచుర్యం లోకి రాదు. రాజకీయ నాయకుల అవినీతి వారికున్న పేరు వలన నలుగురికీ తెలిసి, ప్రత్యర్ధుల ఆరోపణలతో మీడియా ద్వారా పబ్లిక్ షో గా మారుతుంది. రాజకీయ నాయకులంతా అవినీతిపరులని ప్రజలు భావించే ఈ కాలం లో, ఎవరైనా నాయకుడు నిజాయితీ గా ఉన్నా అతని పై బురద జల్లటం ఈజీ.  “అతను పలానా అవినీతి చేశాడు” అంటే వాస్తవం గా అతను చేయక పోయినా ప్రజలు నమ్మే స్థితి ఉందీవేళ దేశం లో.

మనకు అవకాశం లేకో,డబ్బులేకో, రిస్క్ తీసుకొనే ధైర్యం లేకో, సరైన పరిచయాలు లేకో, నాయకత్వ లక్షణాలూ తెలివీ లేకో, మనం రాజకీయ నాయకులం అవ్వలేదనేది వేరే విషయం.చిన్న చిన్న ఆఫీసు రాజకీయాలకు ఇవేమీ అవసరం లేదు కాబట్టీ, మనం అక్కడ రాజకీయాలు చేస్తాం. రాజకీయుల మీదికి రాళ్ళు విసరటానికి మనలో చాలా మందికి అర్హత ఉండదు. ఎందుకంటే, ఏ పాపం చేయని వాడే ఆ రాళ్ళు విసరాలి కాబట్టీ!

రాజకీయ నాయకులు వెధవలైనపుడు,రాజకీయం సులువైతే, రాజ కీయం లాభసాటి అయ్యినపుడు, మనమే ఎందుకు రాజకీయాలలోకి ప్రవేశించకూడదు? లేక పోతే, మన పిల్లలను  ఎందుకు రాజకీయాలలోకి ప్రోత్సహించకూడదు?  మనం ప్రోత్సహించం..ఎందుకంటే దానిలో ఉన్న రిస్క్ మనకు తెలుసు కాబట్టీ..రాజకీయాలలో విజయం సాధించాలంటే దానికి అవకాశం వెయ్యి లో ఒకటి కూడా ఉండదు కాబట్టీ. అక్కడ సక్సీడ్ అయ్యే లోగా మనకున్న కొంత డబ్బూ పోగొట్టుకొనే అవకాశం ఎక్కువ కాబట్టీ. కడుపులో చల్ల కదలకుండా కబుర్లు చెప్పుకొనే అవకాశం అక్కడ ఉండదు కాబట్టీ.

ఇక పోతే, రాజకీయ పార్టీల విధానాల గురించీ, వాటి సిధ్ధాంత లేమి గురించీ, వచ్చే ఎన్నికలను దాటి చూడలేని హ్రస్వదృష్టి గురించీ మనం చాలా విమర్శలను పత్రికా సంపాదకత్వాలలో చదువుతూ ఉంటాం.(అదే పత్రికా సంపాదకుడు తనకు ఎదురు తిరిగిన కింది ఉద్యోగిని రాజకీయాలు చేసి అణగదొక్కుతాడనేది గమనించవలసిన విషయం.) వాలు కుర్చీ లో కూర్చొని విమర్శలు చేయటం చాలా సులువు. రాజకీయాలు “సాధ్యమయ్యే విషయాల గురించిన ఒక కళ” అని ఒక నానుడి ఉంది. దీర్ఘ కాలికం గా సిధ్ధాంతం మన గలగాలంటే, ఆ సిధ్ధాంతాన్ని మోసే పార్టీ “ఇవాళ” బతికి బట్ట కట్టాలి. “ఇవాళ” పార్టీ బతకాలంటే, మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో, ఆ పార్టీ ఎన్నికలలో గెలవాలి. కమ్యూనిస్టులు ఒక సారి కాంగ్రెస్ తోనూ, ఇంకొక సారి తెలుగు దేశం తోనూ పొత్తు పెట్టుకొంటున్నారంటే, దానికి కారణం సిధ్ధాంతాన్ని ఒదిలేయటం కాదు. “దీర్ఘకాలికం గా వర్గ రహిత సమాజం సాధించటానికి, స్వల్పకాలికం గా కొన్ని రాజీలు చేసుకొంటున్నాం”, అనే ఆత్మ వంచన. ఇది ఆత్మ వంచన ఎందుకౌతుందంటే, “ఇప్పటి నుంచీ ఒక పదేళ్ళ తరువాత కూడా మన కమ్యూనిష్టులు ఇలాంటి స్వల్పకాలిక వ్యూహాలే అనుసరిస్తూ ఉంటారు”, కాబట్టీ.  వారి రాజీ కి అంతు లేదు. వారి దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు లో పెట్టే రోజు ఎప్పటికీ రాదు. సమైక్య వాద పార్టీ అయిన తెలుగు దేశం, ప్రత్యేక తెలంగాణా కి అనుకూలం గా మారటం కూడా ఇలాంటి కారణాల వలననే. ప్రత్యేక వాదానికి మద్దతునివ్వకుంటే “ఇవాళ” తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి మనుగడ లేదు. “ఇవాళ” బతికి బయట పడక పోతే ఆ పార్టీ కి “రేపు” ఎలా ఉంటుంది? రేపు లేని పార్టీకి, “ఒక దీర్ఘ కాలిక ఆదర్శం అయిన సమైక్య వాదం”, ఉండి కూడా ఉపయోగం లేదు.  రాజకీయ పార్టీలు “పార్టీ కి సిధ్ధాంతమే ముఖ్యం, సిధ్ధాంతం ఉండేది వోట్ల కోసం కాదు, వోట్లు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి” అనుకొంటే, మన వ్యవస్థ లో అలాంటి పార్టీ ల కథ మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుంది. గిరీశం చెప్పినట్లు, “అప్పుడప్పుడూ మాట మారుస్తూ ఉంటేనే”, రాజకీయ పార్టీలు తమ మనుగడ సాగిస్తాయి.

డబ్బు తీసుకొని ఓట్లు వేసే జనాలు ఉన్నప్పుడు, ఆ డబ్బును పంచే రాజకీయ పక్షాలను తప్పుపట్టటం, కుల మత ప్రాంతాలను చూసి రెచ్చిపోయి కొట్టుకొనే జనాలు ఉన్నప్పుడు, వాటిని ఉపయోగించుకొనే పార్టీలను తప్పుపట్టటం, తాగిన వాడిని కాక అమ్మిన వాడిని కొట్టినట్లు ఉంటుంది.

27 thoughts on “మన రాజకీయ నాయకులను సమర్ధిస్తూ..”

  1. సాధారణం గా రాజకీయ నాయకులు కుటుంబం తో గడిపే సమయాన్ని తగ్గించుకోవలసి వస్తుంది. నాకు తెలిసిన ఒక రా.నా. భార్య, “ఆయన ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. ఆయన ఇంట్లో ఉండే కొంచెం సమయంలో కూడా, ఇంట్లో ఎప్పుడు చూసిన మనుషులు ఉంటారు..మాకంటూ ఒక సమయం లేకుండా పోయింది..వీళ్ళందరికీ అతిథి సత్కారాలు చేయలేక చస్తున్నాను..ఆయన రాజకీయాల లోకి వెళ్ళక ముందే జీవితం బాగుండేది..ఆయనకు రాజకీయాలలోంచి తప్పుకొనమని ఎంత చెప్పినా వినరు..”అలా తప్పుకుంటే ప్రత్యర్ధుల దృష్టి లో చులకన ఔతాను”, అని ఆయన భయం”, అంటూ వాపోయింది.

    మన లో చాలా మంది కుటుంబ సమయాన్ని వెచ్చించలేని స్వార్ధం వలన కూడా రాజకీయాల లో చేరటం గురించి ఆలోచించం.

    మెచ్చుకోండి

  2. “రాజకీయ నాయకుల జీవితం పూలపానుపు. సింపుల్ గా డబ్బూ పదవీ అనుభవించటమే”, అనే సింప్లిస్టిక్ ఒపీనియన్ ఉన్న వారి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ రాసిన పోస్ట్ ఇది.

    మెచ్చుకోండి

  3. 1.A politician needs to have more integrity than an average citizen, because he enjoys more power than anybody else in the society. If a politician is as corrupt as a common man then he does not deserve that position.
    When anybody does not do his duty andbody including a theif has the right to criticize him when he does corruption. A politician also has the right to criticize the citizens about their wrongs. Integrity is more important a duty of a politician than a citizen. A politician is trusted with power for his integrity. Integrity is a desirable quality from a citizen. It’s not as important a credential as it is for a politician for the simple reason that politician enjoys more power. Hence his responsibility is also more.
    2. A cricketer can be criticized by a commentator for a wrong shot. But a cricketer can’t make fun of a commentator of not able to play the same shot, for the roles of both of them are different. However a cricketer can criticize the commentator for dull commentary. Similarly a politician can be critisized for the wrong policy decisions taken by him, by an ordinary citizen, for taking decisions is the role of a politician. It’s not the duty of the citizen. A politician can critisize a citizen for lack of civic sense etc.
    3. If the right to criticize/speak is annulled by once own wrong doings, then everybody will be silent, and bad will not even known. It’s important to critisize bad done by others, irrespective of ones own drawbacks. It may look hypocritical from a personal perspective. But, it makes sense from society’s perspective.

    మెచ్చుకోండి

  4. I almost agree with you, but for one point.
    In democracy, it’s people who hold the ultimate power, not politicians. If they want to dethrone a politician, they can do that. So people have more responsibility. Politician just represents(peoples representative) their power. So, while electing a politician people should carefully, responsibly elect the right person.
    If people criticize the politician, it means they are criticizing themselves. People can be less responsible in their personal lives as they have less power there. But in politics while electing leaders they have the maximum responsibility because they hold the ultimate power of whom to place/remove from power. So, voting is the most responsible and powerful act a person can perform.
    Actually the responsibility for the corruption done by their representatives (read politician) rests squarely on people themselves.Politicians are mere representatives.
    If we are telling a foreigner, “in our democracy, our politicians are very bad”, he starts thinking “our people are not worthy”. The moment we say this to a foreigner he starts suspecting the character of our people.

    మెచ్చుకోండి

  5. బొందలపాటిగారూ, మనం అందరం జీవితం లో కొద్దో గొప్పో రాజకీయాలు చేస్తాం కాదనట్లేదు. అంతమాత్రంచేత ఇప్పటి రాజకీయా నాయకులని బేషరతుగా సమర్థించలేము. మీరు అడిగిన ఒక ప్రశ్నకి నా సమాధానం. నా వరకు ఐతే నేను ఎపుడూ ఆఫీసులో దొంగ బిల్లులు పెట్టలేదు. అలాగే టాక్స్ కూడా దాదాపు సరిగానే కడతాను. “దాదాపు సరిగా” అని ఎందుకన్నానంటే నా టాక్స్ రిటర్న్స్ లో బాంకు వడ్డీని చేర్చకపోవటం వల్ల దానిపై పన్ను చెల్లించబడట్లేదని అనుమానం. సామాన్యులు చేసే చిన్న చిన్న అవినీతి ని నాయకుల అవినీతితో పోల్చి దొందూ దొందే అనడం సరనది కాదని నా అభిప్రాయం. సామాన్యుడు పెద్ద పెద్ద అవినీతి పనులు చెయ్యలేదు. ఎందుకంటే దొరికితే అతనికి పంబరేగుతుంది. కాని నాయకుడు అలా కాదు. ఎంత దోచినా దొరక్కుండా, దొరికితే తనకున్న విశేషాధికారాలతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రజాస్వామ్యం లో ప్రజలే రాజులు కరక్టే, కాని ఒక పని జరగాలంటే మీరో నేనో వెళ్ళి సంతకం చేయం కదా, ముఖ్యమంత్రో మరొకరో సంతకం చేస్తేనే అవుతుంది. అది వారికున్న విశేషాధికారం. ఒక మంత్రి తన బెనిఫిట్స్ లో ఏవైనా దొంగ బిల్లులు పెడితే (అది అవినీతే అయినా) మనం క్షమించగలమేమోగాని ఏకంగా గుడిలో లింగాన్నే మాయం చేస్తుంటే క్షమించగలమా? ఇంకొక్కమాట. రాజకీయాల్లో/ఉన్నతోద్యోగాల్లో ఎన్నో కష్టాలున్నప్పటికీ నిజాయితీగా పనిచేస్తే వారికే మంచిది. ఇవాల ఏ నాయకుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు? దోచిన సొమ్ము గుదిబండలాంటిది. అది వారికి సకల సౌకర్యాలు కొనివ్వగలదేమోగాని వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఎపుడూ ఏ ప్రత్యర్థి ఎలా దెబ్బ తీస్తాడో ఏ కుంభకోణం వెలికి తీస్తాడో అని భయపడుతూ దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాలి. IAS ఆఫీసర్లు ఇవాల జైల్లో చిప్పకూడు తింటూ తమ భవిష్యత్తు అవినీతి రాజకీయ నాయకుల పరస్పర ఒప్పందాలపై ఆధారపడి ఉండి దుర్భరమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. నరకం అంటే ఇంకెక్కడో లేదు మరి.

    మెచ్చుకోండి

  6. //డబ్బు తీసుకొని ఓట్లు వేసే జనాలు ఉన్నప్పుడు, ఆ డబ్బును పంచే రాజకీయ పక్షాలను తప్పుపట్టటం, ///

    దీన్ని పలాయన వాదం అనడం లో ఒక్క శాతం కూడా తప్పు లెదు. డబ్బులు ఇవ్వను, గెలిపించండి అని అడిగే సత్తా లేని వారు చేసే వాదం. నిజంగా కష్టార్జితాన్ని ఎవరూ జనానికి పంచరు. కాబట్టి ఇస్తే తీసికొనే వాళ్ళని నిందించడం చేతకాని తనం.

    ////కుల మత ప్రాంతాలను చూసి రెచ్చిపోయి కొట్టుకొనే జనాలు ఉన్నప్పుడు, వాటిని ఉపయోగించుకొనే పార్టీలను తప్పుపట్టటం, తాగిన వాడిని కాక అమ్మిన వాడిని కొట్టినట్లు ఉంటుంది.///

    జనాలను రెచ్చగొట్టే వాళ్ళనే అనాలి, జనాలను కాదు. కనీసం ఉదాహరణలు బ్లాగుల్లో అయినా చూసి తెలుసుకోవాలి.

    మెచ్చుకోండి

  7. శ్రీ గారు,
    ప్రజాస్వామ్యం లో లీడ్ చేయటం మిగిలిన వ్యవస్థ ల కంటే కష్టం. ఎందుకంటే జనాల సమర్ధత, తెలివి అనేవి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లా ఉంటాయి. అంటే జనాలలో మెజారిటీ కి యావరేజ్ తెలివితేటలూ సమర్ధతా ఉంటాయి. ప్రజాస్వామ్యం లో thought leader అయిన వాడు నిజమైన ప్రజా నాయకుడవ్వాలంటే, వోట్ల ద్వారా మెజారిటీ జనాల ఆమోదాన్ని పొందాలి. అదే రాజరికం లాంటి వ్యవస్థ లో ఏ రాజు ఆమోదమో పొందితే చాలు.
    యావరేజ్ గా ఉండే జనాలు అడ్వాన్స్ అయిన ఆలోచనలను అర్ధం చేసుకొని ఆమోదం తెలపటం కష్టం. వారు భావోద్వేగ విషయాలకూ, డబ్బుకూ లొంగిపోతారు.
    ఉత్తుత్తి లీడర్లు జనాల భావోద్వేగాలనూ, బలహీనతలనూ తమ బలం గా మార్చుకొని అధికారం సంపాదిస్తారు. నేను మాట్లాడెది ఇటువంటి లీడర్ల గురించి. జనాలు ఎంత త్వరగా educate అయితే, అంత త్వరగా మనం వారి వైపుకి వేలు చూపించటం మానోచ్చు.

    మెచ్చుకోండి

  8. “..దీన్ని పలాయన వాదం అనడం లో ఒక్క శాతం కూడా తప్పు లెదు.”
    ఎదుటి పార్టీ వాడు డబ్బు పంచిపెడతాడు. జనాలు దబ్బు తీసుకొని వాదిని గెలిపిస్తాదు. అప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చోవాలి.పాపపు సొమ్ముని తేరగా తీసుకొనే జనాలు కూడా నిజాయితీ నుంచీ పారిపోతున్నారు. పైగా బుకాయిస్తున్నారు, తమకు ఆ పాపం అంటదని. డబ్బు తిరస్కరిస్తే జనాలకు పాపం అంటదు. తీసుకొంటే ఎందుకు అంటదు.?
    “..జనాలను రెచ్చగొట్టే వాళ్ళనే అనాలి, జనాలను కాదు”
    ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవటం నాకు ఎర్ర గుడ్డ చూసి రెచ్చిపోయే ఆంబోతు ను జ్ఞప్తికి తెస్తోంది. జనాలు బుర్ర లేకుండా రెచ్చిపోయి, ఆనక తమ బాధ్యత నుంచీ ఎస్కేప్ అవటానికి ఎవరినో తప్పు పట్టటం సరికాదు.

    మెచ్చుకోండి

  9. “ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవటం ”
    నాయకుడనేవాడు కొన్ని సందర్భాలలో ప్రజలను మోటివ్ వేట్ చేయటానికి ప్రయత్నిస్తాడు. అందులో తప్పేమిలేదు. ప్రజలు నేటి టీ వి స్టూడియోలలో చర్చల మాదిరిగా విషయాన్ని శృతిమించి అనాలిసిస్ చేస్తే ఏ నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు. ఎమీ సాధించ లేరు. అది సేటస్ కో కు దారి తీసి, సమాజంలో మార్పులు రావటానికి వీలుపడదు. ఇటువంటి సంధర్బంలో నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉండాలి. విచిత్రం మేమంటే ప్రజలందరికి నాయకుడిలో ఎన్నో లోపాలు ఉన్నాయని తెలిసినా,అతని ట్రాక్ రికార్డ్ లో ఎన్నో లోపాలు ఉన్నా కులం,ప్రాంతం,వాదాల నినాదాల తో కారణంగా అతను రెచ్చగొడుతూంటే, వీళ్లు అతనిని అనుసరించటానికి సిద్దంగా ఉంటారు. గత కాలంలోని ప్రజల తో పోలొస్తే ఇప్పటి ప్రజలకు చదువు కున్నా, అప్పటివారి కన్నా ఎక్కువగా గుడ్డిగా నాయకుడిని ఫాలో అవుతూంటారు. చాలా మంది ప్రజలకి ఒక నాయకునికో, పార్టికో గుడ్డిగా ఫాలోయర్లు గా ఉండటమంటే మహా ఇష్టం. వారికి టైంపాస్ కూడాను. వాళ్ల నాయకుడు ఎమీ చేయబోతున్నాడు, పక్క పార్టి నాయకుడి ఎత్తుగడలఏమిటి అని తెలుసుకొంట్టు, ఒకరినొకరు ఎలా దెబ్బ తీసుకొన్నారు అని విని ఆనందిస్తారు.
    అది ప్రస్తుత పరిస్థితి.
    2జి స్కాం లో మోసాన్ని ఒంటి చేత్తో అడ్డుకొన్న సుబ్రమణ్య స్వామి లాంటి నిజమైన నాయకుల గురించి, ఎంతమంది సామాన్య ప్రజలకు తెలుసు? కొంతమంది చదువుకొన్న వారికి తెలిసినా ఆయన లాంటివారి గురించి మాట్లాడంగా తెలుగు బ్లాగుల్లో చూడలేదు. పని చేసేవాడిని, కార్యదక్షులని, నిజాయితి ఉన్న వారిని నాయకులుగా గుర్తించం. ఈ గుణాలు ఎమీ లేని వారి వెనక పోలోమని పడి, అతని సభలకు హాజరౌతు , ప్రజలను రెచ్చ గొడితే వీధి పోరాటాలు చేస్తూ, ఎవరికి తగ్గ రీతిలో వారి శక్తి కొలది ప్రజలను వంచించే నాయకునికి/పార్టికి సహాయం చేస్తుంటారు. ఎందుకో నాయకులకన్నా చదువుకొన్న ప్రజలే ఎక్కువ చెడిపోయారు అనిపిస్తుంది. చదువుకొన్న మధ్యతరగతి ప్రజలు వారి ఇల్లు బాగుంటే చాలు అనుకొంటారు. ఇది నడుస్తున్న చరిత్ర..

    మెచ్చుకోండి

  10. “ప్రజాస్వామ్యం ను లీడ్ చేయటం కష్టం ”

    పక్క దేశం పాకిస్తాన్ లో రాజరిక వ్యవస్థ కాకపోయినా మిలటరి అధికారంలో ఉండేది కదా! మరి మనదేశం తో పోలిస్తే, అక్కడ పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉండాలి కదా! కనీసం కొన్ని రంగాలలోనైనా!

    మెచ్చుకోండి

  11. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎలక్షన్ ని డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాడికే నామినేషన్ వెయ్యగలిగే అవకాశాన్ని ఇస్తున్న పార్టీ లను వదిలేసి , మీరు చేసే వాదన విచిత్రంగా ఉంది . అసలు వాడు నిల్చుందే మంచోడు కాబట్టి కాదు , డబ్బులు పారేస్తాడు కాబట్టి . అసలు పార్టీల జోక్యం ఎందుకు అని అడగాల్సిన చోట ఓటు వేసే వాళ్ళ పై విరుచుకు పడటం ఎందుకు.

    డబ్బు తీసికొని పలానా వాళ్ళని గెలిపించారు అనడానికి ఆధారాలేవీ? అసలా సమస్య రాకుండా ఇద్దరూ ఇచ్చేస్తున్నారు ఒకే ఇంట్లో. అక్కడ డబ్బు తీసికోని వారు పార్టీ అభిమానులు ముఖ్యంగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఉత్తములా ? కేవలం తటస్తులు గా ఉన్నవాళ్ళని బాధ్యులన చేసి చెయ్యి దులుపుకోవడం విజ్ఞత అవుతుందా ? ఒకప్పుడు డబ్బు పంచడం , తీసికోవడం చాలా చాటుగా జరిగేది . అలా తీసికొన్న వాళ్లని విలువ లేకుండా మాట్లాడే వారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు . అంతా ఓపెన్ గానే కనిపిస్తుంది.

    సరే సమస్య డబ్బు తీసికోవడం మాత్రమె , ఓటు ఎవరికి వేసారన్నది కాదు అనుకొంటే … అసలు పదవిని ఊరు బాగు చేసే ఉద్దేశ్యం తో పోటీ చేసే వాడు డబ్బులెందుకు పంచుతాడు ? తర్వాత సంపాదించుకోవాలి, కొంటాడు కాబట్టి పంచుతాడు. ఇప్పుడు డబ్బులు తీసికోకున్నా తర్వాత జనాన్ని పట్టించుకోడు. సమస్య వాళ్ళని దాటి ఇంకొకరిని పోటీ కూడా చెయ్యనివ్వరు.

    అసలు డబ్బు ఇవ్వడం , తీసికోవడం ఎక్కడ జరుగుతుంది? ఊర్లలోనే కాని , మనకి బెంగుళూరు లోనో , హైదరాబాదు లోనో పంచుతున్నారా? పంచితే ఇక్కడ తీసుకోరని పంచడం లేదా? అయితే ఊర్లలో ఎందుకు తీసికొంటున్నారు , సిటీ లో ఎందుకు తీసికోవడం లేదు? సిటీల్లో ఉన్న వాళ్ళు, మీతో సహా ఉత్తమ ఓటర్లు అయి ఉండాలి . కాని ఆ మాత్రం లాభం కూడా లేదు కాబట్టి సిటీల్లో అందరూ ఓటు కూడా వెయ్యరేమో .

    రోడ్డు మీద వందరూపాయలు కనిపిస్తే పాపం, పుణ్యాలు బేరీజు వేస్కోని దాటి పొయ్యే పరిస్థితి లో సామాన్యుడు లేడు. పారేసుకొనే వాళ్ళని జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము కాని . దొరికితే తప్పుకు తిరగండి అని చెప్పం.

    రెచ్చ గొడితే , రెచ్చిపోయే రోజులు పొయాయి. కాబట్టి ఆంబోతులని పెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదు. మన పంచాయితీలు కుల, మత గొడవలనుండి బయటికి వస్తున్నాయి. ఒకప్పుడు ఈ రిజర్వేషన్స్ అవి లేనప్పుడు ఒకే కులం అధికారం లో ఉండడం వల్ల వచ్చిన సమస్య అది , ఇంకెన్నాళ్ళు ఉంటుంది ?

    మెచ్చుకోండి

  12. 1. డబ్బు పుచ్చుకోవటం వలన గెలిచిన వాడికి దండుకోవటానికి మద్దతు ఇచ్చినట్లే. ఎవరూ డబ్బుతీసుకోక పోతే, గెలిచిన వాడు తరువాత దండుకోవటం లో కసి చూపించడు.
    2. డబ్బుతీసికొని ఓటెయ్యటం సరైన పని అని ప్రపంచం లో ఏ దేశంలోనూ ఒప్పుకోరు.
    3. నగరాల గురించి మీకు ఇంకా తెలిసినట్లు లేదు. ఐటీ జనాలు ఉన్న లొకాలిటీ ల లో గూడా ఓ కార్పోరేటర్ ఎన్నికలకి 1000, 2000 ఇచ్చి ఓటేయించుకొన్న సంఘటనలు నాకు తెకుసు.

    మెచ్చుకోండి

  13. “సుబ్రమణ్య స్వామి లాంటి నిజమైన నాయకుల గురించి, ఎంతమంది సామాన్య ప్రజలకు తెలుసు?”

    తెలిసినా మన జనాలు ఆయనకి ఓటెయ్యరులెండి. కేజ్రీవాల్ కి ఎంత మంది ఓటేస్తారో చూద్దాం గా..

    మెచ్చుకోండి

  14. నేను చెప్పిన సినారియో, మిగిలిన వన్నీ ఒకేలా ఉండి, ఒక్క రాజరికమా, ప్రజాస్వామ్యమా అన్న విషయం లో మాత్రమే తేడా ఉన్నపుడు వర్తిస్తుంది. మన పక్క దేశం విషయం లో మతమూ, తీవ్రవాదమూ వంటి అనేక (మన దేశం లో కంటే భిన్నమైన) ఫాక్టర్స్ ఉన్నాయి. రాజు గారికి మన మంచి మాట నచ్చక పోతే ఏం చేస్తాం. అలానే చెడ్డ రాజు/మిలిటరీ ఉన్నపుడు ఏమీ చేయలేం. గడాఫీ లాంటి వారు బానే పాలించారు.
    కొంత వరకూ మననీ చైనా నీ పోంచవచ్చు. చైనా నాయకత్వానికి ఓ మెరుగైన అయిడియా వస్తే దానిని అమలు పరచటానికి జనాలను కన్విన్స్ చేయ నవసరం లేదు. వెంటనే అమలు పరచగలరు.

    మెచ్చుకోండి

  15. 1. డబ్బు పుచ్చుకోవటం వలన గెలిచిన వాడికి దండుకోవటానికి మద్దతు ఇచ్చినట్లే. ఎవరూ డబ్బుతీసుకోక పోతే, గెలిచిన వాడు తరువాత దండుకోవటం లో కసి చూపించడు.

    ***ఎవరు కనిపెట్టారు ఈ సత్యం? ఏ మాత్రం ఖర్చు పెట్టాడని వై ఎస్ , కొడుకు తో కలిసి అంత బీభత్సంగా దండుకొన్నాడు ???ఏ మాత్రం ఖర్చు పెట్టాడని కె సి ఆర్ తెలంగాణా ని తేలనివ్వకుండా దండుకొంటున్నాడు. దండుకొనే కసి ఉన్నవాడికి కావలసింది అవకాశమే కాని ఎలక్షన్ కి ముందు చేసిన దాన ధర్మాల లిస్టు కాదు. ఖర్చు లేకుండా గెలిపిస్తే జనం మంచి మీద దృష్టి పెడతాడని నమ్మకం ఉంటె , జనం కూడా ఉదారంగా, ఆదరంగా మద్దతు ఇస్తారు. లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గెలవలేదా, పని చెయ్యలేదా ?

    2. డబ్బుతీసికొని ఓటెయ్యటం సరైన పని అని ప్రపంచం లో ఏ దేశంలోనూ ఒప్పుకోరు.

    ****హ్మ్ ప్రపంచంలో ఎవరూ చెప్పకుండానే జనం డబ్బు తీసికొని ఒటేస్తున్నారా ? ఇంకా నయం ఓటు కావాలని ఎవరూ అడగలేదన్నారు కాదు.

    మొన్న న్యూస్ లో వచ్చింది, ఏదో ఒక ఊరిలో డబ్బులు పంచలేదు ఏ పార్టీ, అని జనాలు ఓటెయ్యం అన్నారు. అంటే ఆ నిల్చున్న అబ్యర్ధులను జనం నమ్మలేదన్న మాట. నాయకులు అంత ఉత్తములు అయితే వెళ్లి పోలిస్ కేస్ పెట్టాలి, జనం డబ్బులు అడుగుతున్నారని.

    3. నగరాల గురించి మీకు ఇంకా తెలిసినట్లు లేదు. ఐటీ జనాలు ఉన్న లొకాలిటీ ల లో గూడా ఓ కార్పోరేటర్ ఎన్నికలకి 1000, 2000 ఇచ్చి ఓటేయించుకొన్న సంఘటనలు నాకు తెకుసు.

    ***అవునా, మంచి వార్త . అసలెందుకు ఓట్లకి కన్సల్టెన్సీ లు పెట్టేస్తే సరి సిటీలల్లో. అందరికీ ఇచ్చి చావలేక దెబ్బకి పారిపోతారు ఇలాంటి డబ్బు బలిసిన కాన్దేట్లు. అందరూ డబ్బులడిగితే చాలు, ఈ జబ్బు వదిలిపోతుంది.

    మెచ్చుకోండి

  16. “****హ్మ్ ప్రపంచంలో ఎవరూ చెప్పకుండానే జనం డబ్బు తీసికొని ఒటేస్తున్నారా ? ఇంకా నయం ఓటు కావాలని ఎవరూ అడగలేదన్నారు కాదు.”

    ఇది అర్ధం కాలేదు. నేననేది, ఇది generally not accepted in the world అని.

    మెచ్చుకోండి

  17. మీరు విశ్లేషించింది నిజమేనండి. ఎంత గొప్ప మేధావి అయినా నాయకత్వ లక్షణాలు లేకపోతే ప్రజలు పట్టించుకోరు. కానీ ఆ నాయకుడు గాంధీ లాంటి వాడా, హిట్లర్ లాంటి వాడా అన్నదే అసలు విషయం.

    మెచ్చుకోండి

Leave a reply to ఫణీన్ద్ర పురాణపణ్డ