ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-34

శ్రీధర్ కీ, సరళ కీ గూడా కావలసిన విశ్రాంతి దొరికింది. వాళ్ళు దగ్గర లో ఉన్న పార్కులు అన్నీ చుట్టి వచ్చారు. డాక్టరు సలహా తీసుకొని ఆ తరువాత బెంగళూరు చుట్టు పక్కల ఉండే ప్రదేశాలు చూశారు. ఓ నాలుగు రోజులు కూర్గు వెళ్ళివచ్చారు.
శ్రీధర్ లీవ్ అయ్యేరోజు సరళ తన పీరియడ్స్ మిస్ అయ్యాయని చెప్పింది. టెస్ట్ చేయించుకొంటే ఆమె ప్రెగ్నెంట్ అని కన్ ఫం అయ్యింది.
శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అతని మెయిల్ ఇన్ బాక్స్ అంతా నిండిపోయింది. ప్రాజెక్ట్ అయిపోవస్తూంది.  మనీషా ప్రాజెక్ట్ ని బాగానే మానేజ్ చేసినట్లుంది. కస్టమర్ లూసీ నుంచీ మనీషా కి పొగుడుతూ వచ్చిన కొన్ని మెయిల్స్ చూశాడు శ్రీధర్. ఆనంద్ కూడా మనీషా గురించి హాపీ గానే ఉన్నాడు. శ్రీధర్ కి స్పెసిఫికేషన్స్ గురించి మంచి అవగాహన ఉండటం తో ఆనంద్ శ్రీధర్ ని ఫంక్షనల్ టెస్టింగ్ చూడమన్నాడు. శ్రీధర్ కూడా రిలాక్స్ అయ్యాడు తనని ప్రాజెక్ట్ లో నుంచీ తీసివెయ్యనందుకు. అతనికి స్ట్రోక్ వచ్చే ముందు సరళ మాట్లాడినప్పుడు, ఆనంద్ శ్రీధర్ ని టెక్నికల్ లీడ్ చేద్దామనుకొన్నాడు. శ్రీధర్ అనవసరం గా గాభరా పడ్డాడు.
సరళ మూడో నెలలో మద్రాస్ వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళీంది. శ్రీధర్ ది మళ్ళీ ఒంటరి బతుకైంది.
శ్రీధర్ అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆనంద్ అతనికి ఐదింటికి గాను రెండు రేటింగ్ ఇచ్చాడు. శ్రీధర్ కి ఇదేమీ నచ్చలా. “నాకు స్ట్రోక్ రావటం నా తప్పు కాదు. లేక పోతే నేను బాగా పని చేసేవాడిని” అని వాదించాడు.
ఆనంద్ అన్నాడు,”శ్రీధర్ నేను ప్రాజెక్ట్ కి నీ వంతు చేసిన పనిని మాత్రమే చూస్తాను. నీ వంతు తగ్గటానికి నీ అనారోగ్యం కారణం కావచ్చు. కానీ అది నేను పట్టించుకోను”,అన్నాడు. ఇంకా,”ముందు గా ప్రాజెక్ట్ గురించి కస్టమర్ హాపీ గా లేడు. మనీషా వచ్చిన తరవాత పరిస్థితి మెరుగయ్యింది.” అన్నాడు.
“ఏది ఏమైనా, నువ్వు ఒక మంచి టెక్నికల్ రిసోర్స్ వి అని నేను అనుకొంటున్నాను. మనం తరవాతి ప్రాజెక్ట్ లలో కూడా కలిసి పనిచేద్దాం. ఆల్ ద బెస్ట్!” అన్నాడు ఆనంద్.
శ్రీధర్ కి ఆనంద్ మాటలు రుచించలా.
*************
ఆర్ధిక మాంద్యం మొదలైంది. అమెరికా లో పేరాశ తో హెడ్జ్ ఫండ్స్ మొదలెట్టాయి ఈ పతనాన్ని. బాగా చదువుకున్న మా రాజులు ఒక సృజనాత్మకమైన సంక్షోభాన్ని సృష్టించారు. లీ మాన్ బ్రదర్స్ ని మూసేశారు. ఐటీ కుదేలైంది.  లే ఆఫ్ లు మొదలయ్యాయి. చాలా కంపెనీలు వర్కింగ్ అవర్స్ ని తొమ్మిది గంటలకి పెంచాయి. మే డే రోజు అమెరికా  లో కార్మికులు ఎప్పుడో ఎనిమిది గంటల పని సమయం సాధించుకొన్నారు అని చిన్నప్పుడు చదివాడు శ్రీధర్. అది కరెక్ట్ కాదా అని అనుమానమొచ్చింది శ్రీధర్ కి. మానేజర్లు ఉద్యోగులకి వీకెండ్స్ లో పని చెయ్యండి అని మెయిల్స్ పంపిస్తున్నారు. కస్టరమర్స్, ప్రపోజల్ లొ అంగీకరించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ పని చేయించుకొంటున్నారు. పరిమితమైన డబ్బులకి అపరిమితమైన పని చేయటం అనేది ఫ్యూడల్ సమాజం లో ఉంటుందని శ్రీధర్ చదివాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ కస్టమర్లు నయా భూస్వాములులా అనిపిస్తున్నారు. దీని వలన ఉద్యోగులు రెండు మూడు రెట్లు పని చేయవలసి వస్తోంది. జీతాలేమో తగ్గించారు. ఏం చేద్దాం “టిరనీ ఆఫ్ క్యాపిటల్” అనుకొన్నాడు శ్రీధర్.
ఓ రోజు శ్రీధర్ ని రాత్రి లేట్ గా పని చెయ్యమన్నాడు ఆనంద్. శ్రీధర్, “నేను లేట్ గా ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బులు రావు కదా!” అన్నాడు ఆనంద్ తో.
” శ్రీధర్! కంపెనీ కీ ఉద్యోగి కీ ఉండేది పరస్పరం సమానమైన సంబంధం కాదు. నువ్వు కంపెనీ లో జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేసిన అగ్రీమెంట్ ని పూర్తిగా చదివావా? చదువు తెలుస్తుంది. డబ్బు ఎవరి నుంచీ అయితే ఫ్లో అవుతుందో వాడిది ఎప్పటికీ పై చేయే. మార్కెట్ బూం లో ఉన్నప్పుడు,ఏదో జనాలను ఆకర్షించటానికి కంపెనీ ల వాళ్ళూ ప్రయత్నిస్తారు. అది వేరే విషయం.  ఐటీ లో ఫ్రెషర్స్ ని వాళ్ళ జావా స్కిల్ కోసమో, సీ స్కిల్ కోసమో తీసుకొంటారు. కానీ లీడ్స్ నీ, మానేజర్లనీ వాళ్ళ కమిట్మెంట్ కోసం, ఇంటెగ్రిటీ కోసం  తీసుకొంటారు. ఈ కమిట్మెంటూ, ఇంటెగ్రిటీ  అనేవి మనకి కుటుంబ నేపధ్యం వలనా, సామాజిక నేపధ్యం వలనా వస్తాయి. ఒక రకం గా మనం మన కమిట్మెంట్ ని అమ్ముకొని ప్రతిఫలం  గా జీతం తీసుకొంటున్నాం. మన వ్యక్తిగతమైన  లక్ష్యాలకీ కంపెనీ లక్ష్యాలకీ ఏ విధమైన ఘర్షణ  లేనప్పుడు, మనకి కమిట్మెంట్ చాలా సులభం గా వస్తుంది. సో, మన కమిట్మెంట్ వలన కంపెనీ కి డబ్బులు వస్తాయి. కానీ విచిత్రం గా ఆ డబ్బు సమాజం జనాలకిచ్చే కమిట్మెంటూ, హానెస్టీ వంటి లక్షణాలని నాశనం చేస్తుంది.ఒక రకం గా డబ్బు తన గోతిని తనే తవ్వుకుంటుంది. అందుకే అనేక సంస్థ లు దివాళా తీస్తున్నయి. టాపిక్ నుంచీ డైవర్ట్ అయ్యినట్లున్నాం.. సో… ఈరోజు రాత్రి పన్నెండయ్యేది,రెండయ్యేది నువ్వు కస్టమర్ కి డెలివరీ చేసి వెళ్తున్నావ్.అంతే”, అని క్లాస్ పీకాడు అనంద్.
“ఛీ వెధవ బతుకు. వీడి క్లాస్ వినేకంటే, రెండింటి దాకా ఉండి ఆ డెలివరీ ఏదో చేసి వెళ్ళటం నయం”,అనుకొన్నాడు శ్రీధర్.

మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

5 thoughts on “ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-34”

  1. Dear Bondalapati

    It has been pleasure reading your story. Its very well written. Before publishing hope it would go for further revision/edition. Probably yours would be the first in line for s/w engineering “aatma katha” ! Not sure. But when I read this it reminds me of “House Surgeon” of kommuri venugopal rao which inspired many to become doctors! Hope your novella takes a turn around to enthuse many and it also becomes more informative on s/w engineering subject.

    cheers
    zilebi.
    http://www.varudhini.tk

    మెచ్చుకోండి

  2. మేష్టారు, మీ నవల చాలా బాగుంది. “చాలా సార్లు నేను జీవితంలో చూసిన ఘటనలు మీ నవలలో కనిపించాయి” Daily, I eagerly wait for your post. పైన చెప్పినట్టు “Stroke” వేరు హార్ట్ ఎటాక్ వేరు. I hope you will correct that in the revised draft. I thought of informing you earlier, but missed to do so.

    మెచ్చుకోండి

  3. థ్యాంక్స్ గణేష్ గారూ,
    సాహిత్యం అనేది జీవితాన్ని ప్రతిబింబించాలని నేను నమ్ముతాను. మనం ఫ్రెండ్స్ తో కలిసి కబుర్లు చెప్పుకున్నప్పుడు వచ్చే అనుభూతి ఈ నవల వలన వస్తే నేను సక్సెస్ అయినట్లే.

    మెచ్చుకోండి

  4. _________________________________________________
    మనం ఫ్రెండ్స్ తో కలిసి కబుర్లు చెప్పుకున్నప్పుడు వచ్చే అనుభూతి ఈ నవల వలన వస్తే నేను సక్సెస్ అయినట్లే.
    _________________________________________________
    What you said is correct and I have got the same feeling!!

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి